చిత్రం: మరణ శాసనం (1987) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: కృష్ణం రాజు, జయసుధ, మాధవి, శోభన దర్శకత్వం: యస్.యస్.రవిచంద్ర సమర్పణ: కృష్ణ ఘట్టమనేని నిర్మాత: హనుమంతరావు ఘట్టమనేని విడుదల తేది: 10.04.1987
Search Box
చిత్రం: జీవితం (1973) సంగీతం: రమేశ్ నాయుడు నటీనటులు: శోభన్ బాబు, కృష్ణరాజు, శారద, జయంతి, జ్యోతిలక్ష్మి దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు నిర్మాతలు: సూర్యచంద్రరావు, గిరిబాబు విడుదల తేది: 18.05.1973
Songs List:
మామిడి తోపుల్లోనా.. పాట సాహిత్యం
చిత్రం: జీవితం (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం:: సినారె గానం: ఎల్. ఆర్. ఈశ్వరి పల్లవి : మామిడి తోపుల్లోనా.. మాపటేల మాటేసి చిక్కుడు పాదూకాడా .. చీకటేల పట్టేసి మామిడితోపుల్లోనా.. మాపటేల మాటేసి చిక్కుడుపాదూకాడా.. చీకటేల పట్టేసి చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి.. చూపించి ? మాయ చేసి పోతివిరో నాగులూ... నా మాట మరచిపోతివిరే నాగులూ ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో చరణం: 1 నిన్నే కావాలని ఎన్నుకొంటిని.. నీ చుట్టూ నా మనసే అల్లుకొంటిని రేకెత్తే నా సొగలే నీకు ముడుపు కడితిని ఇన్నీచేసినదాన్ని ఏమెరుగని చిన్నదాన్ని ఇన్నీచేసినదాన్ని ఏమెరుగని చిన్నదాన్ని మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులూ ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో చరణం: 2 నట్టింట ఒంటరిగా కాచుకొంటిని.. నడిరాతిరి ఉసురుసురంటూ వేచియుంటిని ఆకు చప్పుడైనా నీ అడుగులే అనుకొంటిని నిన్నే నమ్మినదాన్ని... నీకే నచ్చినదాన్ని నిన్నే నమ్మినదాన్ని... నీకే నచ్చినదాన్ని.... కాదు మరి మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులూ ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో
ఇక్కడే కలుసుకొన్నాము.. పాట సాహిత్యం
చిత్రం: జీవితం (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: సినారె గానం: పి.సుశీల, రామకృష్ణ పల్లవి : ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము ఈ జన్మలోనో... ఏ జన్మలోనో.. ఎన్నెన్ని జన్మలలోనో ఇక్కడే కలుసుకొన్నాము... ఎప్పుడో కలుసుకున్నాము చరణం: 1 నీలనీల గగనాల మేఘ తల్పాల పైన.. పారిజాత సుమసౌరభాల కెరటాలలోన నీ చేయి నా పండువెన్నెల దిండుగా.. నీ రూపమే నా గుండెలో నిండగా కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి.. కౌగిలిలో చవి చూసి ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము చరణం: 2 నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఎమన్నావు? జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను అంతలో నిను చేరదీసి నేనేమన్నాను? ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం.. ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం ఇక్కడే కలుసుకొన్నాము... ఎప్పుడో క
అంతేనేమో అది ఒక వింతేనేమో.... పాట సాహిత్యం
చిత్రం: జీవితం (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: సినారె గానం: పి.సుశీల, రామకృష్ణ అమ్మో యీవేళ మనసే అదోలా కువకువమన్నది ఎందుకో ఎందుకో......... విను నేను తాకితే వను వీపు తాకితే అంతేనేమో అది గిలిగింతేనేమో ? అంతేనేమో అది ఒక వింతేనేమో.... ఎవరైనా పిలిచారా యీ ఏరు పరుగిడుతున్నది ఎందుకో దూరాన సాగరాన కలవాలని కలవరపడినది అందుకెనేమో పరుగులు అందుకేనేమో అంతేనేమో అది ఒక వింతేనేమో అందుకేనేమో పరుగులు అందుకేనేమో అంతేనేమో అది ఒక వింతేనేమో పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది ఎందుకో ఎందుకో పండులోనే రసముందని గండుచిలక గమనించింది. అందుకేనేమో రుచులను అందుకోనేమో అంతేనేమో అది ఒక వింతేనేమో ? అందుకేనేమో రుచులను అందుకోనేమో అంతేనేమో అది ఒక వింతేనేమో మన మేనులూ ఒకలాగే-పెనవేసుకుపోతున్నాయి ఎందుకో ? ఎందుకో ? ఇద్దరు ఒకరౌతారంటే ఇదేనేమో ఇదేనేమో అంతేనేమో అది మరి అంతేనేమో అంతేనేమో అది ఒక వింతేనేమో ....
చిన్నారి ఓ బాబు పాట సాహిత్యం
చిత్రం: జీవితం (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: సినారె గానం: పి.సుశీల చిన్నారి ఓబాబూ బలేబలేబాబూ వరాల బాబ అమ్మానాన్న దీవనలంది వర్ధిల్లాలి అలా అలా నవ్వు మీ అమ్మ మోము చూడ మిసిమినవ్వు విరిసేను మిసిమినవ్వు విరిసేను మీ నాన్న కళ్లు చూడ ముత్యాలై మెరిసేను ఆ నవ్వుల పువ్వుగా - ఆకన్నుల దివ్వెగా ఉదయించిన నిన్నుగని నా మనసే మురిసేను బాబూ నిన్నెత్తుకుంటే - పసిడికొండనౌతాను పాపా నిను హత్తుకుంటే పాలవెల్లినౌతాను పాలవెల్లినౌతాను … మీ ఇద్దరూ వుండగా, నా ముద్దుల పండగా ఏ తల్లీ పొందలేని ఆనందం పొందేను -ఉఁహూఁహూఁ అమ్మా నానా దీవనలంది వర్ధిల్లాలి అలా అలా నువ్వు
తొలిరేయి పాట సాహిత్యం
చిత్రం: జీవితం (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: సినారె గానం: పి.సుశీల తొలిరేయీ... ఇది తొలిరేయి ఇద్దరమూ చెరిసగమూ ముద్దూ ముచ్చట పంచుకొనే... తొలిరేయీ..ఇది తొలిరేయి పెళ్ళిపందిట నీవువేసిన మూడుముళ్ళూ చల్ల చల్లగా వుండాలి... అవి ఒక నూరేళ్ళూ మూగ గదిలో నేడు పలికే... ఈ రాగం.. ఆ.... ఆ... ఆ.... ఆ ముందు ముందు బ్రతుకును..పండించె అనురాగం నవదంపతులా ఆశా లతలా..పూచిన తొలిపూవు ఈ రేయీ తొలిరేయీ... ఇది తొలిరేయి కన్నులేమో వేరు వేరు... కలలు ఒకటేలే తనువులేమో వేరు వేరు... మనసులొకటేలే పూలపానుపులా... వేయిమల్లెల పిలుపులొకటేలే కలవరించే కోటికోర్కెలా... గమ్యమొకటేలే... గమ్య మొకటేలే ఆలుమగల అంతరంగాల...అందాలతొలకరి..ఈ రేయీ తొలిరేయీ... ఇది తొలిరేయి ఇద్దరమూ చెరిసగమూ ముద్దూ ముచ్చట పంచుకొనే... తొలిరేయీ..ఇది తొలిరేయి
Jeevitham (1973)
చిత్రం: కుటుంబ గౌరవం (1997) సంగీతం: మాధవపెద్ది సురేష్ సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ, సిరివెన్నెల, జలదంకి సుధాకర్ నటీనటులు: జయసుధ, రాధిక, కృష్ణం రాజు, హరీష్, మేఘన దర్శకత్వం: అజయ్ కుమార్ నిర్మాత: శ్రీనివాస రావు విడుదల తేది: 1997
Songs List:
నిను చూసాకా పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1997) సంగీతం: మాధవపెద్ది సురేష్ సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: యస్.పి.బాలు, చిత్ర నిను చూసాకా
బోలో తారా తారా పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1997) సంగీతం: మాధవపెద్ది సురేష్ సాహిత్యం: జలదంకి సుధాకర్ గానం: సునీత ఉపద్రష్ట , విజయలక్మి బోలో తారా తారా
పగలు రాతిరి కలిసి పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1997) సంగీతం: మాధవపెద్ది సురేష్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు పగలు రాతిరి కలిసి
లౌలీ లౌలీ కాలేజీ పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1997) సంగీతం: మాధవపెద్ది సురేష్ సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: సురేష్ పీటర్స్, సునీత ఉపద్రష్ట & కోరస్ లౌలీ లౌలీ కాలేజీ
నువ్వూ నేనూ సాక్షిగా పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1997) సంగీతం: మాధవపెద్ది సురేష్ సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: యస్.పి.బాలు, చిత్ర నువ్వూ నేనూ సాక్షిగా
Kutumba Gowravam (1997)
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె.వి.రాఘవులు నటీనటులు: కృష్ణంరాజు, శారద, జయసుధ దర్శకత్వం: వి.మధుసుదనరావు నిర్మాత: జి.సత్యనారాయణరాజు విడుదల తేది: 11.01.1980
Songs List:
శంభో హరహర పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు శంభో హరహర.... భోళాశంకర వినరా వినరా జంగం దేవర శివశివ శంకర....యివరం సెప్పర బస్తీ బాబులకు... అరెరెరెరే .... నీ భక్తుడంటే.... ఈ సత్తెమంటే ఎట్టాంటోడో తెలిసేందుకు..... రైతంటే బైతనుకుంటే... నీ బతుకు భజగోవిందే తెలివంటె నీదనుకుంటే.... నీ తెలివి తెల్లారినట్టే పనికి రాని మనిషి .... ఒక్కడైన లేడు ఆ మనిషి పనికి నువ్వు ఖరీదు కట్టలేవు డబ్బు కట్టే గోనిసంచి గొప్ప కాదురో.... ॥శివ శివ ॥ సత్తెమంటే సల్లగాలి.... సత్తెమంటే అగ్గినిప్పు మంచోళ్ళ ప్రాణం సతైం.... మనసున్న మనిషే సత్తెం ముతక కట్టినోడు .... మొద్దు ఎదవకాడు సద్ది తిన్నవోడు.... సచ్చు సవటకాడు నిద్దరోయె బెబ్బులి మేక కాదురో .... ॥శివ శివ ॥ పట్నంలో సదువులు సదివి.... పట్టాలు పొందిన బాబులు సూశారు కండబలము .... సూత్తారా బుద్ది బలము మాయ సేయలేదు ....మంత్రమేమి కాదు గుప్పెట్లో యిసక సెప్పుకోండి ఎంత....? ఎంత... ? ఎంత ....? ఎంత....? తెలీలా .... గుప్పెడంత యిసకంటే గుప్పెడేనులో.... ॥శివ శివ ॥
నిన్నా మొన్నటి చిన్నారివే పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు నిన్నా మొన్నటి చిన్నారివే చిన్నారి పలుకుల చెల్లెమ్మవే ఈ పెళ్ళి చూపుతో ఈ చీర కట్టుతో ఎంత ఎదిగినావే........ పెళ్ళీడు వచ్చింది అమ్మాయి పిల్లాడ్ని చూడరా నీ చెల్లికి అని పెద్దోళ్ళు పదిసార్లు అన్నారని ఉబలాటపడ్డాను చూద్దామని ఈ ముస్తాబులో ....ఆ నగుమోములో చూశాను చెల్లీ.... మన తల్లిని.... ఒకరికి ఒకరం.... ఇక ఎవరికి ఎవరం ఓర్వనిదైనా..... తప్పని దూరం ఏ ఆడపిల్లా.... కాదీడపిల్ల ఏనాటికైనా ....అది ఆడపిల్ల చేశానమ్మా..... నే చేయగలది ఈ ఇంటి పేరింక ఆ ఇంట నిలపాలి
మేకారే మేకా .... పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు , యస్.పి.శైలజ మేకారే మేకా .... హే.... మేకా తోకారే తోకా... హే.... తోకా మిల మిలలాడే కన్నులతో మిస మిసలాడే వన్నెలతో చుర చురలాడే చూపులతో కొర కొరలాడే కోర్కెలతో బిలబిల కిలకిల గలగల గలగల అమ్మాయిలూ చకచక టకటక లుకలుక లుకలుక అబ్బాయిలూ ఒకరిని ఒకరు ఒరుసుకొని ముందూ వెనకా వెనకా ముందూ ముందూ వెనకా వెనకా ముందు ముందుగ వెళుతుంటె .... పెట పెటలాడే పదహారేళ్ళు చిమ చిమలాడే యిరవై యేళ్ళు చెకుముకి రాళ్ళు ఈ కుర్రాళ్ళు బరిలో దూకే పందెం కోళ్ళు కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ పిట్టల్లాడు కుంవా కుంవా కుంవా కుంవా గువ్వల్లాగా ఒకరిని ఒకరు తరుముకొని పగలూ రేయీ రేయీ పగలూ పరుగులు తీసూ ఉరకలు వేసు పడుతూ లేసుంటే....
గీతా .... ఓ గీతా .... పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆరుద్ర గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్ గీతా .... ఓ గీతా .... డార్లింగ్.... మై డార్లింగ్ .... మనసార నీతో మాటాడుకోనీ రాజా....ఓ రాజా.... డార్లింగ్.... మై డార్లింగ్ .... మనసార నీతో మాటాడుకోనీ పర దేశంలో.... ఆవేశంలో ప్రేమించిన మనకనుమతి .... బహుమతి.... ఈ దేశంలో... సంతోషంతో మనవాడినచో అనుబంధం ఆనందం ... వెచ్చని వలపుల ముచ్చట తీరును అనురాగ బంధం ముడివేసుకోనీ చిరునవ్వులతో పులకింతలతో వికసించిన మధువనం యవ్వనం .. ఈ భంగిమలో నీ పొంగులతో మురిపించే బిగికౌగిలి జిలిబిలి.... ఊహలే రేగితే మోహమే ఆగుణా ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోనీ
నీవు నా పక్కనుంటే హాయి పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆరుద్ర గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్ నీవు నా పక్కనుంటే హాయి నీవు లేకుంటే చీకటి రేయి నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి నీవు నా పక్కనుంటే హాయి నీవు లేకుంటే చీకటి రేయి నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి కొండలలో కోనలలో ఏకాంత వేళ గుండెలలో రేగింది సరసాల లీల కొండలలో కోనలలో ఏకాంత వేళ గుండెలలో రేగింది సరసాల లీల అనురాగ శిఖరాన అందాల తోట ఆ చోట కోనేట సయ్యాటలాడాలి కొనగోట మీటిన మాణిక్యవీణ కొసరే మమతల తొలకరి వాన కొనగోట మీటిన మాణిక్యవీణ కొసరే మమతల తొలకరి వాన కన్ను సైగల కౌగిలింతల సన్న జాజితాని ఎన్నమారులు నిన్ను చూసినా దేవరంభ ఠీవి మువ్వల రవళి మోహన మురళీ మధురం మధురం మానసకేళీ
Sivamettina Sathyam (1980)
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, మాధవపెద్ది, జేసుదాస్, రామకృష్ణ నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, కృష్ణం రాజు, లత, జగ్గయ్య, జమున, మోహన్ బాబు దర్శకత్వం: వై.ఈశ్వర రెడ్డి నిర్మాత: యం.యస్.రెడ్డి (మల్లెమాల సుందర రామిరెడ్డి) విడుదల తేది: 02.03.1979
Songs List:
పచ్చిమిరపకాయ బజ్జీలూ పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.జానకి పచ్చిమిరపకాయ బజ్జీలూ,.. బల్ పసందైన బుల్లి బజ్జీలూ... కారంలో... ఆకారంలో... నా బజ్జీలకు లేనేలేవు సమ ఉజ్జీలు మతిమరుపును పోగొడతాయి అతి తెలివిని పుట్టిస్తాయి... ఆజీర్తిరోగం వున్నవాళ్ళకి... ఆకలి ఘాటు చూపిస్తాయి. . . ఈతకల్లు ఈరయ్యైనా... ఇప్పసారా అప్పన్నైనా... బ్రాందీ... విస్కీ... దొరలైనా... నా బజ్జీలంటే పడిచస్తారు
సూరీడు యెదమిటినాడు... పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: పి.సుశీల, యస్.పి.బాలు సూరీడు యెదమిటినాడు... నా సొగసంత రవళించె నేడు... వెలుగుల వల విసిరేసి.... తొలి వలపులు కాజేశాడు... సుమబాల కనుగీటగానే... ఈ సూరీడు యెద మీటినాడు... కను... సైగలు చెలి విసిరాకే... తను.. వెలుగుల వల విసిరాడు ఎండా వెన్నెల రెండూ కాని ఏదో తీయని గిలిగింత ఉండీ లేని బిడియంలోనే ఊహలకందని పులకింత ఆ... గిలిగింత... ఈ... పులకింత కలిపికూడితే.. జగమంత అందీ అందని అందాలెన్నో ముందుపోసినది ఈ ఉదయం అంతేలేని ఆనందంలో హరివిల్లైనది నా హృదయం .. ఆ... హరివిల్లు... కురిసే జల్లు... అనురాగానికి పుట్టిల్లు
తాకకుండా తనువు దోచిన పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: పి.సుశీల, యస్.పి.బాలు తాకకుండా తనువు దోచిన తాను వరసకు ఏమౌతాడు...? తాళి కడితే మొగుడౌతాడు తరిమికొడితే సగమౌతాడు... మాటువేసి మనసుదోచిన మగువ వరుసకు ఏమౌతుంది? తాళి కడితే ఆలౌతుంది తరిమికొడితే తేలౌతుంది... కళ్ళతోనే గాలం వేసి ఒళ్ళుమొత్తం గాయంచేసి ప్రేమగందం పెదవికి రాశాడు... తన పిచ్చినాలో రెచ్చగొట్టాడు... చిలిపి తలపుల తలుపులు తీసి సిగ్గులన్నీ ఆవలతోసి పంటినొక్కులు నాపై రువ్వింది. అహ పడకటింటికి కాలు దువ్వింది...
అమ్మ... ప్రేమకు మారుపేరు...పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, జేసుదాస్ అమ్మ... ప్రేమకు మారుపేరు... ఆమ్మ మనసు పూలతేరు... ఆ తేరునీడా సోకగానే నూరు జన్మల సేదదీరు... మండు వేసవిలో ముంగిట వెలసిన మంచుకొండ మా అమ్మ పవలూ రేయీ ఆరక వెలిగే పరంజ్యోతి మా అమ్మ... ఆలనకైనా... పాలనకైనా ఆదిదేవత మా అమ్మ... జన్మ జన్మలా పున్నెమువలన... నీ కమ్మని కడుపున పుట్టాను... మళ్ళీ జన్మలు ఎన్నున్నా... నా తల్లివి నీవే అంటాను... కలలోనైనా... మెలకువనైనా నీ దీవెనలే కోరుకుంటాను...
నా మాటా రామబాణం పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, రామకృష్ణ నా మాటా రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం అతి చౌకగ లోకజ్ఞానం అందించడమే నా ధ్యేయం నా మాటా మన్మధ బాణం నా పత్రిక ప్రేమ పురాణం ఉచితంగా సెక్స్ జ్ఞానం రుచి చూపడమే నా ధ్యేయం చక్కెర బొమ్మకు మీసాలొస్తే చక్కని కాలక్షేపం... రాతిరి పూటా రాణీ పేటా రసికుల పాలిటి స్వర్గం ... కాలే కడుపుకు మండే గంజి కమ్మని అమృతపానం.. మంచిని పెంచి మనోవికాసం కలిగించేవి బుక్స్... మంచం పట్టిన మనిషిని సైతం కదిలించేది సెక్స్... నీతి రీతీ లేని పత్రికలు జాతిని పతనం చేస్తాయి తాతలనాటి పుస్తకాలు తలగడకే పనికొస్తాయి... నా మాట మన్మధ బాణం నా పత్రిక ప్రేమపురాణం నా మాట రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం
వయసు మళ్ళిన అందగాడా పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, యస్.జానకి వయసు మళ్ళిన అందగాడా వచ్చాను సందకాడా... అర్ధరాతిరౌతుంది. ఆరాటం పెరుగుతూంది ఆగలేను అందుకోరా... సిగపూలూ వాడలేదు అప్పుడే... చెక్కిలైనా కందలేదు ఇంతలోనే... ఎంత సేపని ఎదురుచూసేది ? నా కోసమేనా ? ఎప్పుడింకా మోజుతీరేది? ఆరినీ ఏయ్ పిల్లా ఊ... ఇదుగో రా దగ్గరికి రా ఊ… హూ…… హ పట్టుకోలే ననుకున్నావా ? ఏయ్... ఏమిటి? చక్కిలి గిలా ? మరుమల్లెల పక్కేశాను బలే పనిచేశావ్ మంచి గందం తీసుంచాను ఆహా ఇంతకన్నా ఏమి చేసేది ? బోలెడున్నాయ్ అంత సూటిగ ఎలా చెప్పేది? నే చెప్తాగా.... వగలమారీ కుర్రది వయసుమళ్ళి నేనున్నాని చూడు చూడు నావంక సోకు తగ్గలేదింక రంగేళి రామ చిలకా నిన్ను వదల్లేను చచ్చేదాకా నిన్ను వదల్లేను చచ్చేదాకా...
Ramabanam (1979)
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: వేటూరి కొసరాజు, జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జానకి, విజయలక్ష్మి శర్మ నటీనటులు: కృష్ణం రాజు, జయంతి, పల్లవి, విజయ లలిత, రామకృష్ణ దర్శకత్వం: ప్రత్యగాత్మ నిర్మాత: ఏ.వి.సుబ్బారావు విడుదల తేది: 01.03.1979
Songs List:
ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఏమౌతుంది.... యిప్పు డేమౌతుంది ఇటా ఇట్టిట్టా యిది ఎందాకా పోతుంది అహ .... నాకు తెలీక అడుగుతాను పిల్లగాడి రిమరిమలు పులిహోర ఘమఘమలు.... పిల్లగాడి .... పిల్లదాని చెక్కిళ్ళు నా చెక్కర పొంగళ్ళూ.... పిల్లదాని.... ఆకేసి వడ్డిస్తా అవుపోసన పడతావా.... ఆ కేసి.... అవుపోసన ఆనక చూద్దాం ఆరగింపు మొదలెడతా ఆరగింపు మొదలెడతా.... అవుపోసన.... గోవిందా గోవిందా ఏందయ్యా ఆచార్లూ ఏం జరిగింది అబ్బా చెయ్యి కడిగేశాడండీ ఎట్టా యిప్పుడేమౌతుందయ్య రావే అరకు రాణీ నీకు చేస్తానే వలపు బోణీ రారా నా రాజ నిమ్మలపండు నిన్ను రమ్మంది నా తల్లో మల్లెచెండు రారా .... పట్టా రాసిస్తావా కమలమ్మా నీ కమతం పట్టా... అడగాలా రామయ్య నువ్వు అడగాలా నన్ను అడగాలా యీ కొండ్రంతా నీ సొంతం ఈ కొండ్రంతా నీకే సొంతం పోయిందయ్యో పోయింది ఏంటా గోల కమ్మలమ్మా పోయింది కమతమూ పోయిందీ అహ యిప్పుడే మౌతుంది మేడెత్తు ఎదిగావు కోడెగాడా నీకే ఓటిచ్చుకుంటాను అందగాడా వయ్యారి కమలమ్మా వలపుల్లో గెలిపిస్తే నిన్నేలు కుంటానే కుతితీరా ఎన్నికలలో ఎందరెన్ని కలలోకన్నా ఎన్నికలలో : ఏనాటికీ నువ్వే ప్రెసిడెంటువి నా ప్రెసిడెంటువి.
అత్తకూతురా చిట్టి మరదలా పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల హోయ్ హోయ్-హోయ్. అత్తకూతురా చిట్టిమరదలా కొత్త చీరలో నిన్ను చూస్తుంటే ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే హోయ్ మేనత్త కొడకా మీసాల బావా కోడె గిత్తలా కుమ్ముకొస్తుంటే గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే నీ చిలిపి కౌగిళ్ళే నా చలువ పందిళ్లు నీ గుండె లోగిళ్ళే నా నూరేళ్ళ సిరులూ నా వయసులోని బిగువు నీ అడుగులోని బరువు చూసి చూసి కళ్ళు రెండు సోలి పోతున్నాయ్ కళ్ళంటే కళ్ళా అవికలువ పువ్వుల్లా - కళ్ళంటే..... వొళ్ళంటే వొళ్ళా అది దొంతు మల్లెల్లా హాయ్.... హాయ్ - హాయ్ ఆ నడక చూస్తుంటే - నీ నడుము వూగుతుంటే ఆ నడక .... తిమ్మిరి తిమ్మిరి జింగిరి బింగిరి అవుతోందే పిల్లా హేయ్ అత్తకూతురా ! కల్ల బొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా అయ్య బాబోయ్ అల్లరి చేశావంటే పుట్టి నింటికె ఎల్లిపోతా ఎల్లిపో కల్లబొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా అల్లరి చేశావంటే పుట్టినింటికె ఎల్లిపోతా తాళికట్టి నెత్తిమీద తలంబ్రాలు పోస్తా తాళికట్టి.... పల్లకీలో నీ పక్కన వూరేగుతు వస్తా తిక్క రేగిందంటే ఏంటా పోర్సు బుగమేట్లో దూకేస్తా నిన్ను దాటి యేరుదాటి దాటి దాటి ఏం చేస్తావ్ నీకు సవితిని తెచ్చేస్తా ఎట్టా - ఎట్టా నిన్ను దాటి యేరు దాటి నీకు సవితిని తెచ్చేస్తా నిన్ను దాటి.... నీకు సవితిని తెచ్చేస్తా నీకు సవితిని తెచ్చేస్తా
ఇంటి ముందు ఈత చెట్టు పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: కొసరాజు గానం: విజయలక్ష్మి శర్మ , యస్.పి.బాలు ఇంటి ముందూ యీత సెట్టూ ఇంటి ఎనకా తాడి సెట్టూ ఇంటిముందూ .... యీత పెట్టూ యిల్లు కాదూ తాడి సెటూ తల్లి కాదూ తగులు కోనోడే మొగుడౌతాడా ఆచారీ — ఓ ఆచారీ ముద్దుల ఆచారీ - గుళ్ళో పూజారీ అట్టాగా అట్టయితే యిదికూడా ఇనుమరి ఆ....వూరి ముందర వుల్లితోట వూరిబైట మల్లితోట వుల్లి తల్లి అవుతుందా మల్లె మందు కొస్తుందా.... మూడు ముళ్ళస్తేనే మొగుడౌతాడా! చుక్కా ... చుక్కా .... చుక్కా చల్లని గంధపు చెక్కా....ముద్దుల ముద్దుల చుక్కా .... చుక్కా .... చుక్కా తీయని కొబ్బరిముక్కాముక్కముక్కముక్క హద్దు యిడిసిన ఆడదానికి పద్దులు రాసి పెట్టడానికి .... హద్దు మొగుడో మొద్దులో ఎవడో ఒకడుండాలి. నాలాంటి వాడెవడో అండగా నిలవాలి అయితే ఒక పని చేత్తా ఏంటీ పగటిపూట నా పక్కన బజారెంట వస్తావా ఆచారీ కొంపలంటుకు పోతాయమ్మో -- ఆచారీ పూజారీ వూరి ముందర వుల్లితోట వూరి... ఉల్లి తల్లి అవుతుందా మల్లె మందుకొస్తుందా మూడు ముళ్ళేస్తేనే మొగుడౌతాడా.. చుక్కా - చుక్కా- చుక్కా చల్లని గంధపు చెక్కా ముద్దుల ముద్దుల చుక్కా తీయని కొబ్బరి ముక్కా సల్ల సల్లగా పక్కన చేరి సరిగమలే - వాయించుకుంటే అయ్యబాబోయ్ సల్ల సల్లగా పక్కన చేరి, సరిగమలే - వాయించుతుంటే పరువు మర్యాదా పందిరెక్కి కూచుందా నడి బజారులో మాత్రం నామోషీ వచ్చిందా అమ్మమ్మమ్మమ్మో తప్పు అంత మాటనకే చుక్కా-చుక్కా-చుక్కా చల్లని గంధపు చెక్కా ముద్దుల ముద్దల అబ్బ చుక్క తీయని కొబ్బరి ముక్కా - - ఇంటిముందు ఇంటి ముందూ యీత సెట్టూ ఇంటి వెనకా- తాడి సెట్టూ ఈత సెట్లూ ఇల్లుకాదూ తాడి సెట్టూ తల్లి కాదూ తగులు కొన్నోడే మొగుడౌతాడా ఆచారీ - ఓ ఆచారీ ముద్దుల ఆచారీ - - గుళ్ళో పూజారీ -- ఊరు పేరూ ఉన్నవాణ్ణి ప్రెసిడెంటుకి కుడిభుజాన్ని హోయ్ : ఊరూ పేరూ.... కొండమీద కోతినైనా తెప్పించే గొప్పోణ్ణి గుడిలో దేముడికే నామం పెట్టేవోణ్ణి... కొండమీద ఆ యింకా చెప్పనా మన గొప్ప.... పేరు గొప్ప ఊరు దిబ్బ ఆపవయ్య సొంతడబ్బా - ఆశారీ... ఓ ఆశారీ .... ముద్దుల ఆచారీ .... ఆశారీ.... ఆశారీ - పూజారీ యింటి ముందూ ఈత సెట్టూ యింటి వెనకా తాడి సెటూ ఈత సెట్టూ ఇల్లు కాదూ తాడి సెట్టూ తల్లికాదు తగులుకున్నోడే మొగుడౌతాడా ఆచారీ ఓ ఆచారీ ముద్దుల ఆచారీ....గుళ్ళో పూజారీ
నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: కొసరాజు గానం: యస్.జానకి నిమ్మచెట్టుకు నిచ్చేనేసి నిమ్మపళ్ళు కొయ్యబోతే నిమ్మముళ్లు రోమ్మునాటెనురా. హాయ్ హాయ్ హాయ్ హాయ్ నిమ్మముళ్ళు రొమ్ము నాటెనురా ఓ రందగాడా సన్న రైక సగం చిరెగెనురా రెకెందుకు చిరిగిందని కొప్పెందుకు చెదిరిందని రై కెందుకూ........ అత్తముందూ అంద రడిగితే ఆ - అడిగితే ఏమైందట ఆ - చెప్పడాని కేముందిరా ఆ - చెప్పడానికేముందిరా ఓరందగాడా - సిగ్గు ముంచుకొస్తుందిరోయ్.. నిమ్మచెట్టుకు.. చెలమయ్యా చేనుకాడ నిన్ను తలచుకుంటూ కూచునుండే చెలమయ్యా చేను .... ఈల వేసి.... నన్ను పిలిచి చెంగుపట్టి లాగావనీ వూరు నోరు.... వూరు నోరూ చేసుకొందిరా వూరు నోరు చేసుకొందిరా ఓ రందగాడా తూరుపార పట్టిందిరా హాయ్ .... హాయ్..... నిమ్మచెట్టుకు... మావ కొడకా వస్తావని మంచమేసి కాసుకుంటే మావకొడకా.... ఇంటిపక్క ఎంకటేసు చెమ్మ చెక్కలాడి ఆడి ఆడి ఆడి అబ్బా ఎవరితోటి చెప్పుకుందురా ఎవరితోటి ఓ రండగాడ యీది పాలు చేశావురో నిమ్మచెట్టుకు
తొలిసారి మొగ్గేసింది పాట సాహిత్యం
చిత్రం: కమలమ్మ కమతం (1979) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు తొలిసారి మొగేసింది సిగ్గూ -పాడుసిగ్గు తొలిసారి.. ఆ సిగ్గే మొగై పిండై కాయై సండై అమ్మో కోకకొత్త బరువేసింది రైక కాస్త బిగు వేసింది కోకకొత్త .... ఆ సూపే సిటుకూ సిటుకూ గుండెలో దరువేసింది నాకు సిగ్గేసింది.... తొలిసారి మొగ్గేసింది ....... కొత్తగా చూసిందేముంది సరికొత్తగా చూడని దేముంది కొత్తగా చూపూ చూపూ కలిసింది. అది చుట్టరికం — కలిపేసింది. చూపూ చూపూ.... నీ చూపుల రాపిడిలో సిగ్గుకే సిగ్గేసింది.. సిగ్గే మొగ్గేసింది..... తొలిసారి మొగ్గేసింది సిగ్గుః పాడు సిగ్గుః .... దాచినా దోచని దేముంది నువ్వు దోచితే దొరకని దేముంది, దాచినా గువ్వకు గువ్వే దొరికింది తన గుండె గూడుగా మలచింది తొలిరాతిరి తెలారగానే నెలవంక కనిపించింది. నెల యింక తప్పిస్తుంది.. తొలిసారి మొగ్గేసింది ఎనక జన్మ ఒక పులకింత అది తలుచుకుంటే గిలి ఒళ్ళంత.... ఎనక జన్మ.... ముందు జన్మ తెలియని వింత అది వుందో లేదో తేలన చింత ముందుజన్మ.... ఈ జన్మల వూసులు వింటే ఎందుకో నవొచ్చింది తొలిసారి మొగ్గేసింది సిగ్గూ.... పాడు సిగూ....
Kamalamma Kamatham (1979)
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్. జానకి నటీనటులు: కృష్ణం రాజు, గీత, పల్లవి, జయమాలిని, జ్యోతిలక్ష్మి దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు నిర్మాత: కె. రామచంద్ర రావు విడుదల తేది: 10.08.1979 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విజయ (1979) 4. బొమ్మాబొరుసే జీవితం (1979) 5. చెయ్యెత్తి జై కొట్టు (1979) 6. జూదగాడు (1979) 7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 8. మంగళ గౌరి (1980) ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
యాలో యాలా ఉయ్యాలా పాట సాహిత్యం
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల యాలో యాలా ఉయ్యాలా గున్నమావిలో కన్నెకోయిలా కూసిందియ్యాలా ఎండకన్నులా పండువెన్నెలా కాసిందియ్యాలా ఈ పులకరింతలే పూలు పుయ్యాలా ఆ పలకరింతకే పైట జారాల .... వున్న ఈడులేని తోడు - ఈసులాడుకున్న ఈ వేళ మల్లెపువ్వు పిల్ల నవ్వు - మాటలాడుకున్న ఈ వేళ ఏ ఈడులో ఆ వేడుక జరగాలనే చలికోరిక కంటిపాపనే చందమామ వాటేసిందియ్యాలా కొంగుచాటున కొండగాలి కాటేసిందియ్యాల ఈ కలవరింతలే కలిసిరావాల ఆ కోగిలింతలో కలిసిపోవాల.... వానపువ్వు తేనెటీగ - ముద్దులిచ్చి పుచ్చుకున్న వేళ కన్నెసోకు కన్నుసోకి మొగ్గలిచ్చుకున్న ఈ వేళ ఈ గుండెలో గూడున్నది - ఏ గువ్వకో చోటున్నది కొత్తబరుపు నాకోకబిగువు కాజేసిందియ్యాలా పైటదరువు నా పరువుతీసి ఆరేసిందియ్యాలా ఈ జలదరింత నేనేడ దాయాలా ఈ తొలకరింత నేనెవరికియ్యాలా ....
కోడెవయసూ కుమ్మేస్తుంటే పాట సాహిత్యం
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వీటూరి గానం: పి.సుశీల , యస్.పి.బాలు కోడెవయసూ కుమ్మేస్తుంటే - కొంటె మనసూ దొలిచేస్తుంటే తిమ్మిరెక్కి నాఒళ్లు తుళ్లి తుళ్లి పడుతుంటే...ఏం చెయ్యాలి...అమ్మో ఎటు పోవాలి? ఆరు బైట జారు పైట రెపరెపమంటే నా గుండెలోన రేగింది సన్నని చలిమంట నీ చూపు నా వైపు ఎగాదిగా చూస్తే నా వెన్నులాగ సాగింది వెచ్చని పులకింత పట్ట బోతే పావురాయి - కొట్ట బోతే కొక్కిరాయి అందకుంటే సూదంటురాయి అందకుంటే ఆకురాయి కలిసివుంటె హాయి - కలపవేమె చేయి - ఒ రాలుగాయి గడుగ్గాయి అమ్మాయి ఏం చెయ్యాలి - ఎటుపోవాలి జత కలపాలి - కధ నడపాలి ॥కోడెవయసూ॥ బుగ్గమీద ముగ్గులేసి అలా అలా రాస్తే సింగారం చిలికింది సిగ్గుల సిరిమొగ్గ కూత కూసి లేతనడుము అటూయిటూ వూగితె వలపు వయసు గోదారికి వచ్చింది వరద ముట్టుకుంటే మునగకొమ్మ - పట్టుకుంటే వదలడమ్మ మచ్చికైతే పూలరెమ్మ - నచ్చకుంటే మంచుబొమ్మ పెళ్లయితే కీలుబొమ్మ - అందాక ముళ్ళకొమ్మ ఆ పైనే నీముచ్చుట తీరేనమ్మా ఏంచెయ్యాలి ఎటుపోవాలి - జతకలవాలి కధనడపాలి
మాఘమాసం మాపటేల పాట సాహిత్యం
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల మాఘమాసం మాపటేల - మనక ఎన్నెట్లో గోరింట పొదరింట కోరిన కౌగిట్లో ఎన్ని ముద్దుముచ్చట్లో - ఎన్నో వున్నై గుప్పెట్లో ఎట్టా సెప్పను యిప్పట్లో - సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం|| పులకింతలే బుసకొట్టగా - గిలిగింతలే నసపెట్టగా ఆ కళ్ళే గిల్లి గిల్లీ - నా ఒళ్ళే తుళ్ళి మళ్ళి నాగమల్లి తోటకాడ చంద్రవంక వాగులోన నిండా మునగకుండానే నీల్లాడబోకుంటే చలి చలి చలి అన్నానే, చెలి చెలి చెలి అన్నాడే ఆడేమన్నాడో నేనేం యిన్నానో ఎట్టా సెప్పను యిప్పట్లో సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం॥ పడుచందమే కడవెత్తగా - తడికొంగులే పడగెత్తగా నీళ్ళే తొణికి తొణికి - నా ఒళ్ళే ఒణికి ఒణికి నీలికొండ చాటుచూసి నీటిఎండ కాపుకాసి ఆరీ ఆరకుండానే చీర కట్టుకొస్తుంటే చుర చుర చుర చూశాడే - విర విర విర లాడానే కంటే చూశాడో - కాటే వేశాడో. ఎట్టా సెప్పను యిప్పట్లో సెబుతా పెళ్ళిపందిట్లో.... ॥మాఘమాసం॥
చీరులోయ్ చీరులు పాట సాహిత్యం
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979) సంగీతం: జే. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది గానం: పి.సుశీల , యస్.పి.బాలు, యస్. జానకి చీరులోయ్ చీరులు - చీరులోయ్ చీరులు చుక్కచుక్క జారుల్లో - నిషా హుషారుల్లో ఆనంద నిలయం - అందాల వలయం ఈ చుక్క సరసం - అందుకుంటె సార్గం.....॥చీరులోయ్ || పాలకుండ ఎన్నెలంటరో ఎన్నెట్లో నీలికొండ జారుబండరో బండమీద కొక్కిరాయిరో - నన్ను నిక్కినిక్కి చూస్తుందిరో అయితే యిదే మన తక్షణ కర్తవ్యం నీటూ గోటూ దుశ్శశనా సరసకురారా సుయోధనా దానంచేసే ఓ కర్ణా - పాచికలాడే ఓ శకునీ బొమ్మలాట నువ్వు ఆడకురా .. దుమ్ము దులపరా దొరమావా మరి పొజిసన్ మార్చహే మార్చుకున్నా చల్లార్చుకున్నా - దీపాలయాల కాదురో చీకట్లో చిందువేయరో అయితే ఒత్తినొక్కి దీపమార్పెయ్.... భారతకథలో రారాజైనా భామకు లోబడిపోలేదా మందు పొందూ మరిగినవాడే - ఇంద్రుడిగా నిలబడలేదా నేలకు నాలుగు దిశలంటా ఈ మనిషికి నాలుగు దశలంటా దశలూ దిశలూ మారితే ఈ చతుష్టయం గతి ఏమంటా రంభా ఊర్వశి నేను మీ రంగులు తేల్చేస్తాను కామిని యామిని నేను మీ కధలే మార్చుతాను
Cheyyethi Jai Kottu (1979)
చిత్రం: మమత (1973) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, అప్పలా చార్య గానం: పి. సుశీల, వి. రామక్రిష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, బి. వసంత , జి. ఆనంద్ నటీనటులు: కృష్ణ , జమున కృష్ణం రాజు, చంద్రమోహన్, విజయలలిత, హేమలత, రమాప్రభ, బేబీ శ్రీదేవి మాటలు: పినిశెట్టి, అప్పలా చార్య దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి కథ, నిర్మాత: కె. సి. శేఖర్ విడుదల తేది: 06.01.1973
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి 2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి 3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి 4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి 5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి 6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి 7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి 8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి 9. మమత (1973) - బేబీ శ్రీదేవి 10. మీనా (1973) - బేబీ శ్రీదేవి 11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి 12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి (1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)
Mamatha (1973)
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజ శ్రీ, దాశరథి గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు నటీనటులు: కృష్ణ, నాగేష్, కృష్ణం రాజు, జ్యోతి లక్ష్మి, కథ: విజయ బాపనీడు మాటలు: దాసరి నారాయణరావు దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్ నిర్మాతలు: యన్.విత్. సుబ్బరాజు, యమ్. కె. రాధ విడుదల తేది: 02.06.1972
Songs List:
ఇది లక్కీ లక్కీ ఆట పాట సాహిత్యం
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: ఎల్.ఆర్.ఈశ్వరి ఇది లక్కీ లక్కీ ఆట ఆహ మూడు ముక్కల ఆట ఒక చెయ్యి కలిపి చూడు ఒక చుక్క వేసి ఆడు యా! కమాన్ లెట్ అజ్ ప్లే యాః కమాన్ లెట్ అజ్ డ్రింక్ లాలాః ఓః లా ! హాయ్ కన్నె పిల్ల వుంది కన్ను గీటుతుంది ఊపులోన వుంది కైపు రేపుతుంది దమ్ముంటే సొమ్మంతా నీదందిరా సై అంటే నువ్వు రమ్మంటే నిన్ను కవ్వించి నవ్వించి ఊరించి తేలించురా ఆడి చూడు జూదం కట్టవోయి పందెం లక్కు వున్నదంటే ఒక్క దెబ్బలోనే నీ జాతకం మారిపోతుందిరా ఆడాలీ అంతు చూడాలి : మోజు తీరాలి తాగాలి ఊగాలి జల్సాలలో ఆహ :
చిన్నోడా నీలో నన్నే చూసుకో పాట సాహిత్యం
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజ శ్రీ గానం: యస్.పి. బాలు రా రా రు రూ చిన్నోడా నాలో నిన్నే చూసుకో ఆ ఒంటిగా కలుసుకో ఆః జంటగా చేసుకో భా బా బా: భీ: బీ: భీ భీ: ఆహ లాః లాః లా లా ఆ లా: జో జో యాః వేశాను కన్ను వేశాను గాల మేశాను నీ గుండెలో లా లా లా పోలేవు దాటిపోలేవు చిక్కుకున్నావు నా కళ్ళలో బా బా బా ఖుషీ చేసాను బా బా నిషా యిస్తాను బా బా ఖుషీ చేసాను - నిషా యిసాను నీ వెంట వుంటాను నీ మాట వింటాను రా రా. భ భ వచ్చాను, తోడు వచ్చాను మోజు తెచ్చాను నీ కోసము రారారా రురూ ఓ వచ్చాను..ఆ నిన్ను మెచ్చాను కానుకిచ్చాను నా అందము రీరీరీ రురూ నిఘా వేసెను లా లా భా భా భా భా
చినుకు పడుతున్నది పాట సాహిత్యం
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల, యస్.పి. బాలు చినుకు పడుతున్నది వణుకు పుడుతున్నది తోడు కావాలి నీడ రావాలి చలిగాలి కెరటాలలో చెలి పెట తెరచాపలో చినుకూ వణుకూ పారి పోయేనులే యెవ్వరు లేని సమయం నీకెందుకు యింతటి బిడియం నిను రమ్మని పిలిచెను నీ చెలి అధరం రా! అందుకో ఊరించు నీ మాటలు కవ్వించు నీ నడకలు చాలులే ఓ చెలి నను వేధించకే గంతులు వేసెను మనసు నీ కౌగిలి కోరెను వయసు ఈ చక్కిలిగింతల చల్లని వేళ వృధా చేయకు తడవాలి జడివానలో కరగాలి కౌగిళ్ళలో జగమే మరచీ కలసి పోవాలిలే
హరే రామ్ హరే రామ్ పాట సాహిత్యం
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజ శ్రీ గానం: యస్.పి. బాలు హరే రాం - హరే రాం హరే క్రిష్ణా - హరే రాం హరే రాం హరే రాం హరే క్రిష్ణా - హరేరాం - ఆడామగా తేడాలేదు హరే రాం దొంగా దొర భేదం లేదు హరే రాం కడుపులు కొట్టె కడుపులు పెంచే పేదలు వీరే హరేరాం హరేరాం - హరేరాం పేదల రక్తం పీల్చేవారికి మేడలు మిద్దెలు హరేరాం హరేరాం - హరేరాం చెమటూడ్చేటీ శ్రమజీవులకూ అహ నీడేలేదు బోలోరాం మిత సంతానం అతి సంతోషం అదియే స్వర్గం హరేరాం హరేరాం - హరేరాం అతి సంతానం అది భూభారం నరజాతికి నరకం బోలోరాం పెసా కోసం పార్టీ మార్చే ఘనులదే రాజ్యం హరేరాం హరేరాం—హరేరాం నీతులు పలికి గోతులుతీసే దొంగలె దొరలు—హరేరాం వేషాలకు మోసాలకు ఇవి రోజులు భాయి బోలో రాం
అడుగులు కదిపి ఆడలేను పాట సాహిత్యం
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజ శ్రీ గానం: సత్యనారాయణ, పి.సుశీల హహహ - ఊ ఆడు అడుగులు కదిపి ఆడలేను ఈ సాలి గూటిలో పెదవులు తెరచి పాడలేను ఈ రాతికోటలో ఏం ఆగావేం ఆడు అధికారంతో నీవు అనుకున్నది పొందగలేవు ఆడది అబల కాదురా అది పగపడితే విషనాగురా ఇది తెలుసుకో గురుతుంచుకో నీ మనసే మార్చుకో య్ - ఇంకా ఆడు కన్నులముందే వున్న నిజాన్ని కానక తిరిగేవు నీ కన్నులు పొడిచే కఠారి ప్రక్కనే వుందని మరిచేవూ నీ దారుణాలు యిక సాగవు నీ ఘాతకాలు యిక చెల్లవు ఆశ తీరగా ఆడేనూ ఇక మంగళహారతి పాడేనూ
Hanthakulu Devanthakulu (1972)
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ, చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఆరుద్ర గానం: భానుమతి రామకృష్ణ, పి.సుశీల, యస్.పి.బాలు, వసంత నటీనటులు: భానుమతి రామకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, టి.పద్మిని (నూతన నటి) మాటలు: భానుమతి రామకృష్ణ, డి.వి.నరసరాజు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భానుమతి రామకృష్ణ నిర్మాణ సంస్థ: భరణీ పిక్చర్స్ విడుదల తేది: 19.04.1972
Songs List:
నీవేరా నా మదిలో పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: భానుమతి రామకృష్ణ నీవేరా నా మదిలో - దేవా తిరుమలవాసా : ఓ శ్రీనివాసా నీ పదదాసిని నేనేరా .... యెంతో మధురం నీ శుభనామం జగతికి దీపం నీ దివ్య రూపం ఆశలపూలే - దోసిట నింపే వేచే భాగ్యము - నాదేరా.... నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను నీ పదములపై వాలిన సుమమె నిలిచే భాగ్యము నాదేరా.... నా జీవితమే హారతి చేసి నీ గుడి వాకిట నిలిచేను స్వామీ నీ సన్నిథియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము నాదేరా....
మానస సంచరరే... పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వీర బ్రహ్మేంద్ర స్వామి గానం: భానుమతి రామకృష్ణ మానస సంచరరే... బ్రహ్మణి మానస సంచర రే... మదశిఖి పింఛా అలంకృత చికురే మహానీయ కపోల విజిత ముఖు రే... శ్రీ రమణీ కుచ దుర్గవిహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవ కారే
స రి గ మ ప పాట పాడాలి పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: భానుమతి రామకృష్ణ & బృందం స రి గ మ ప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి. పాటలె పూవుల బాట వెయ్యాలి ఆ బాటలో సూటిగా సాగిపోవాలి శ్రుతిలో కలవాలి -జతగా మెలగాలి అంతా ఒకటై సంతోషంగా ఆడుకోవాలి... ఆనందం మధురానందం అనుభవ సారమె సంగీతం పశువులనైనా-శిశువులనైనా పాములనైనా జో కొట్టేది చల్లని గీతం. సనిదపమగరిస.... సాధనతో మంచి సాధనతో సఫలము కావలె జీవితము జీవితమంతా జిలిబిలి ఆట ఒప్పులకుప్పా - ఒయ్యారి భామా చక్కనిచుక్కా, సనిదపమగరిస
పరాన్ముఖ మేలనమ్మా పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం గానం: భానుమతి రామకృష్ణ పరాన్ముఖ మేలనమ్మా పరాధీన పతిత నాపై నిరాదరము నీవే జేసితే నే సహింస తరమా తల్లీ... మరాళాజిక మందగమనీ .... మహాదేవి మదిరంజిత వదనీ నిరామయే... నీరదశ్యామలే నిత్యకల్యాణ గుణాలయే ...
మాటచాలదా, మనసుచాలదా పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి. సుశీల, యస్.పి. బాలు మాటచాలదా, మనసుచాలదా మాటలోని మనసులోని మమత తెలియదా ? దిక్కులు వినగా చుక్కలు కనగా నీ పక్కనె పలికే మక్కువ ఒలికే తోటలో పూవు చెవిలో తుమ్మెద ఊదేది గూటిలో ప్రియునితో గోరింక అనేది కన్నులలోన, నవ్వులలోనా ఒదిగే దాగే మధుర రహస్యం ఒకరికి నా గుండెలో ఎప్పుడూ వసతి ఒక్కరేనా ప్రేమకు ఏనాటికి అతిధి పదిలముగా నా హృదయములోనా ఒదిగే దాగే మధుర రహస్యం ....
చల్లగా హాయిగా పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: భానుమతి రామకృష్ణ చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా మెల్లగా తీయగా నవ్వించు నవ్వు నీవేరా ముందుగా రాగల శుభకాలము నీదే నీదే కొందరే సుఖపడే యీ లోకము మారెనోయి అందరూ ఒకటిగా జీవించు యుగము రావాలి ॥చల్లగా॥ ఎవరికీ తెలియని ఏ కొమ్మనుండి పూచావో ఎవ్వరూ లేరని ఎలుగెత్తి ఎంత ఏడ్చావో ఏడ్చితే ఏ కనుల నీలాలు ఎవరు తుడిచారో ఆడుతూ పాడుతూ నీ జీవనౌక సాగాలి ॥చల్లగా॥
నేనె రాధనోయీ పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: భానుమతి రామకృష్ణ నేనె రాధనోయీ గోపాలా ... అందమైన యీ బృందావనిలో విరిసిన వున్నమి వెన్నెలలో చలని యమునా తీరములో నీ పెదవుల పై వేణుగానమై పొంగి పోదురా నేనీ వేళా..... ఆదే పొన్నల నీడలలో నీ మృదు పదముల జాడలలో నేనే నీవె నీవే నేనై అనుసరింతురా నేనీ వేళా ....
నవ్వవే... నా చెలీ... పాట సాహిత్యం
చిత్రం: అంతా మనమంచికే (1972) సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: యస్.పి.బాలు, వసంత నవ్వవే... నా చెలీ...చల్లగాలి పిలిచేను మల్లెపూలు నవ్వేను...వలపులు పొంగేవేళలో నవ్వవే .... నా చెలీ... నవ్వనా, నా ప్రియా.... మూడుముళు పడగానే తోడు నీవు కాగానే - మమతలు పండేవేళలో .... నవ్వనా, నా ప్రియా.... మనసులు యేనాడో కలిశాయిలే మనువులు యేనాడో కుదిరాయిలే నీవు నాదానవే నీవు నా వాడ వే .... నేను నీ వాడనే నేను నీ దాననే ఇక ననుజేరి మురిపింప బెదురేలనే.... ॥నవ్వవే ॥ జగమేమి తలిచేనో ? మన కెందుకు ? జనమేమి పలికేనో ? మనకేమిటి.... నీవు నా దానవే నీవు నా వాడివే నేను నీ వాడినే నేను నీ దాననే నిజమైన ప్రేమ గెలిచేనులే...... ||నవ్వవే॥
Antha Manamanchike (1972)
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: శ్రీ శ్రీ, దాశరథి, కొసరాజు గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు (సహాయ నటుడు) దర్శకత్వం: పి. సాంబశివరావు నిర్మాతలు: పి. వి. కె దుర్గాప్రసాద్ రావు, గబ్బిట వెంకటరావు విడుదల తేది: 12.07.1972
Songs List:
అందాలన్నీ చూపాలంటే... పాట సాహిత్యం
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: ఎల్.ఆర్.ఈశ్వరి అందాలన్నీ చూపాలంటే... లా... లా అడిగినవన్నీ ఇవ్వాలంటే ... లా ... లా అందరిలోన తొందరపడితే అడొస్తుంది ... లా పెదవులు తహతహ పడుతున్నై బుగ్గలు తళతళ మంటున్నై సొంపులు సవాలంటై వొంపులు తయారం అందరిలోన తొందరపడితే అడొస్తుంది ... లా ... వయసులు మిసమిస మంటున్నై మనసులు గుసగుస పెడుతున్నై వలపులు రెడీ అంతై తలవులు స్టడీ అంతై అందరిలోన తొందరపడితే అడొస్తుంది ... లా ...
యేమయ్యో యెఱ్ఱటి కుఱోడా పాట సాహిత్యం
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: పి.సుశీల & పార్టీ యేమయ్యో యెఱ్ఱటి కుఱోడా !! చాలులే అల్లరి బులోడా ! ఆడది అబలనుకున్నావా ! అదేమీ సాగదు పోవయ్యా | తెలుసుకో ! తెలుసుకో ! తెలుసుకో ! కన్నెపిల్లలో సోయగం సన్నజాజితో సమానం పెచ్చుమీరిన పరిహాసం విచ్చుక త్తితో చెలగాటం మగువ తెగువనే చూపిందా మీ మగాళ్ళపని ఇక గోవిందా ! తెలుసుకో తెలుసుకో ... తెలుసుకో !... వయసుపిల్ల లో లేనిదీ వసుధలోన యేమున్నది ! మెచ్చి మనసునే ఇచ్చిందా వచ్చి స్వర్గమే వాలదా ! వాడిచూపులే చూసిందా ! మగధీరులందరు గోవిందా ! తెలుసుకో ... తెలుసుకో ... తెలుసుకో ..... తెలుసుకో...
ఈ హుషారులో పాట సాహిత్యం
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: శ్రీ శ్రీ గానం: యస్.పి.బాలు ఈ హుషారులో ఈ నిషాలలో ఇలా ఇలా మునిగిపోవనీ కలలో అలనై తేలనీ ఈ హుషారులో ఈ షికారులో ఇలా ఇలా కరిగిపోవసీ యెదలో నిజమే తేలనీ నీ కన్నులలో ఏదో వింత మైకమూ ఆ మైకంలో దాగే వలపు లోకము నిజమని నమ్మవా కథయను కొందునా కథలు కాదు కలలుకాదు నీవు నేను వేరుకాదు విరితేవె ధారజాలువారు మాటలు ఆ మాటలలో విరిసే వలవు తోటలు అవి మన సొంతము పద విహరింతము తమాషాలు చాలు చాలు భలే మోసగాడివే ఈ హుషారులో
నీ పైన చిన్నోడా పాట సాహిత్యం
చిత్రం: భలే మోసగాడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: కొసరాజు గానం: ఎల్.ఆర్.ఈశ్వరి నీటైనా చిన్నోడా మాటుంది రారా అందాల వయ్యారి సై అంది లేరా ఔనంటావా ? కాదంటావా ? ఈ ముదుల గుమ్మని వద్దంటావా అందాల వయ్యారి సై అందిలేరా రాజనిమ్మనపండా రావయ్య బంగరుకొండా నువ్వులేక నిదుర రాదురా ఓరయ్యా నిన్ని డిసి నిలువలేనురా మరుమల్లె తోటుంది తోటలోన కోటుంది మనకోసం వేచుందీ మనసైతే రమ్మంది రారా డింగరి మామా నిన్నొదలదుర ఈ భామా అద్దాల మేడుందిరా మనకూ అందులోన వీడుంది రా ఘాపెన మందుంది మందులో మత్తుంది మత్తులోన ముంచేస్తా చిత్తు చిత్తు చేసేస్తా
Bhale Mosagadu (1972)
చిత్రం: రాజమహల్ (1972) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: దాశరథి, ప్రయాగ, బి. విజయ రత్నం, సి.ఆర్.స్వామి గానం: పి.సుశీల, యస్. జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి నటీనటులు: కృష్ణ, విజయ లలిత, కృష్ణం రాజు, కుమారి శ్రీదేవి మాటలు: బి.విజయ రత్నం దర్శకత్వం: బి.హరినారాయణ కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత: శ్రీ బి. వి. కృష్ణ మూర్తి విడుదల తేది: 06.04.1972
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి 2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి 3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి 4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి 5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి 6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి 7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి 8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి 9. మమత (1973) - బేబీ శ్రీదేవి 10. మీనా (1973) - బేబీ శ్రీదేవి 11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి 12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి (1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)
Songs List:
ఎగాదిగా చూస్తావు ఏమయా పాట సాహిత్యం
చిత్రం: రాజమహల్ (1972) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: ప్రయాగ గానం: యస్. జానకి ఆ... అమ్మదొంగ ఎగాదిగా చూస్తావు ఏమయా
నన్నే తెలుసుకో తెలుసుకో పాట సాహిత్యం
చిత్రం: రాజమహల్ (1972) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: దాశరథి గానం: యస్. జానకి నన్నే తెలుసుకో తెలుసుకో
ఈ నిషా రేయిలోన పాట సాహిత్యం
చిత్రం: రాజమహల్ (1972) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: బి. విజయ రత్నం గానం: పి. సుశీల ఈ నిషా రేయిలోన
మగువే ఓ నిషా రా పాట సాహిత్యం
చిత్రం: రాజమహల్ (1972) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: సి.ఆర్.స్వామి గానం: ఎల్.ఆర్.ఈశ్వరి మగువే ఓ నిషా రా
చెలిమి పంచుకునే వెలయే పాట సాహిత్యం
చిత్రం: రాజమహల్ (1972) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: దాశరథి గానం: యస్. జానకి చెలిమి పంచుకునే వెలయే
Raja Mahal (1972)
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి.బాలు, పి.సుశీల నటీనటులు: కృష్ణం రాజు, శారద, జయసుధ, రాజేష్ , ముచ్చెర్ల అరుణ కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణరాజు విడుదల తేది: 25.05.1984
Songs List:
అబ్బా నాతో పెట్టుకోమాక పాట సాహిత్యం
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల అబ్బా నాతో పెట్టుకోమాక
బొబ్బిలి బ్రహ్మన్న వీర కథ పాట సాహిత్యం
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల & కోరస్ బొబ్బిలి బ్రహ్మన్న వీర కథ
చలిగాలి వీచింది పాట సాహిత్యం
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చలిగాలి వీచింది
ఓ రాతి మనిషి పాట సాహిత్యం
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఓ రాతి మనిషి
తద్దినక తద్దినక మల్లెలు తెచ్చా పాట సాహిత్యం
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల తద్దినక తద్దినక మల్లెలు తెచ్చా
Bobbili Brahmanna (1984)
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల, కృష్ణం రాజు దర్శకత్వం: పి.పుల్లయ్య నిర్మాత: విడుదల తేది: 05.11.1970
Songs List:
వానలు కురవాలి పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి వానలు కురవాలి
జాబిల్లి వచ్చాడే పిల్లా పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా ! నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే ఎదురుచూస్తున్నాడే పిల్లా ఎన్నెల్లు విరబూసే పున్నమీ నడిరేయి వయసూ ఉరకలు వేసే సొగసైనా చినదానా ఎంతో చక్కని వాడే చెంతకు రమ్మన్నాడే జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా ! నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే ఎదురుచూస్తున్నాడే పిల్లా రేకురేకున నువ్వు సోకు సేసు కున్నావే ముద్దు మొగమూ సూసి మురిసిపోతున్నావే కలహంస నడకలతో కదలిరావే పిల్లా జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా ! నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే ఎదురుచూస్తున్నాడే పిల్లా సిగ్గె నీ చెంపలకు నిగ్గాయే లేవే నవ్వె నీ కన్నులకు వెలుగాయె లేవే వయ్యారి ఓ పిల్లా సయ్యాట లాడాలా జాబిల్లి వచ్చాడే పిల్లా! జాబిల్లి వచ్చాడే పిల్లా ! నిన్నెంతో మెచ్చాడే నీకు మానసిచ్చాడే ఎదురుచూస్తున్నాడే పిల్లా
సుక్కు సుక్కు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: యస్.పి. బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి సుక్కు సుక్కు
నీవని నేనని పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి: నీవనీ నేననీ నీవనీ నేననీ లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు కెరటాలై కిరణాలై ఓ... కెరటాలై కిరణాలై పరుగిడ పరుగిడ పరువాలు పలుకలేని కన్నులతో పలుకరించుకుందాము పలుకలేని కన్నులతో పలుకరించుకుందాము పులకరించు పెదవులతో వలపు పంచుకుందాము వలపు పంచుకుందాము ఒకరికొకరు పందిరిగా ఊహలల్లుకుందాము ఊహలల్లుకుందాము ఆ.... నీవనీ నేననీ నీవనీ నేననీ లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు చరణం: 1 నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు ఆ.... నీవనీ నేననీ నీవనీ నేననీ లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు ఓ... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
బడా జోరు పిల్ల పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: ఎల్.ఆర్.ఈశ్వరి బడా జోరు పిల్ల
పెళ్లి కుదిరింది పాట సాహిత్యం
చిత్రం: అల్లుడే మేనల్లుడు (1970) సంగీతం: బి.శంకర్ రావు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల పెళ్లి కుదిరింది
Allude Menalludu (1970)
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: కృష్ణం రాజు, దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి నిర్మాత: జి.ఆర్.కె.రాజు విడుదల తేది: 1982
Songs List:
బుగ్గన చుక్కపెట్టనా పాట సాహిత్యం
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర, వేటూరి గానం: పి. సుశీల, యస్.పి. బాలు బుగ్గన చుక్కపెట్టనా
నడిరేయి నెలరాజ పాట సాహిత్యం
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర, వేటూరి గానం: పి. సుశీల, యస్.పి. బాలు, యస్. జానకి నడిరేయి నెలరాజ
టింగు టింగు పాట సాహిత్యం
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర, వేటూరి గానం: పి. సుశీల, యస్.పి. బాలు టింగు టింగు
ప్రతి ఉదయం పాట సాహిత్యం
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర, వేటూరి గానం: పి. సుశీల, యస్.పి. బాలు ప్రతి ఉదయం నీకోసం
కోటి కుంకుమార్చన ముక్కోటి దేవతార్చన పాట సాహిత్యం
చిత్రం: ప్రళయ రుద్రుడు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర, వేటూరి గానం: పి. సుశీల కోటి కుంకుమార్చన ముక్కోటి దేవతార్చన














