Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Hanuman Chalisa by MS Rama Rao



తెలుగు హనుమాన్ చాలీసా
రచన, సంగీతం: ఎమ్.ఎస్.రామారావు
గానం: డా. పి. శ్రీనివాస్ 
("సుందరదాసు" ఎమ్. ఎస్. రామారావు మనవడు)


తెలుగు హనుమాన్ చాలీసా సాహిత్యం

 
తెలుగు హనుమాన్ చాలీసా
రచన, సంగీతం: ఎమ్.ఎస్.రామారావు
గానం: డా. పి. శ్రీనివాస్ 
("సుందరదాసు" ఎమ్. ఎస్. రామారావు మనవడు)

ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ 

★★★★★★★★★

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

జయహనుమంత ఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత 

రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ

ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన 

కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ  

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి 

జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని

సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి 

భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన 

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని 

సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ 

వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి 

హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత 

రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి 

తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము 

ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన 

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి 

అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె

సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం 

రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన 

కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న

రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా 

భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

ధ్వజావిరాజా వజ్ర శరీరా భుజ బల తేజా గధాధరా 

ఈశ్వరాంశ సంభూత పవిత్రా కేసరీ పుత్ర పావన గాత్ర

సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు 

యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల 

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

సోదరభరత సమానా యని శ్రీ రాముడు ఎన్నిక గొన్న హానుమా 

సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా 

అష్టసిద్ది నవ నిధులకు దాతగ జానకీమాత దీవించెనుగా 

రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసినా

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర ధుఃఖ బంజన 

ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు 

ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

శ్రద్దగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా 

భక్తిమీరగా గానము చేయగ ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ

తులసీదాస హనుమాన్ చాలిసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ 

పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు 

మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత 

నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత  ఆ ఆ ఆ

ఓం శాంతిః శాంతిః శాంతిః

1 comment

sai said...

యం. యస్. రామారావు గారు వ్రాసిన మరియు ఆయన తన స్వీయ స్వరంతో గానం చేసిన ఈ హనుమాన్ చాలీసా ఎల్లకాలం అందరి తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయం.

Most Recent

Default