Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gabbar Singh (2012)





చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: పవన్ కళ్యాణ్ , శృతిహాసన్
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాతలు: బండ్ల గణేష్
విడుదల తేది: 11.05.2012



Songs List:



దేఖో దేఖో గబ్బర్సింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  బాబా షెహగల్, నవీన్ మాధవ్ 

దేఖో దేఖో గబ్బర్సింగ్ ఆల్ ఇండియాకే హైపర్ సింగ్ 
వీడి పేరు వింటే గూండాల గుండెలోన గుళ్ల సౌండింగ్ 
వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ 
వీడి కేరెక్టర్ ఖాకీ డ్రెస్సుకే కొత్త కలరింగ్ 
సత్తాకే స్పెల్లింగు ఎలేలేలే 
కొట్టాడో స్వెల్లింగు... ఎలేలేలే 
కళ్లల్లో ఫైరింగు... ఎలేలేలే... 
ఏ విలన్కైనా డెత్ వార్నింగు 
బైబర్తే పుడింగు... ఎలేలేలే... 
పవర్కే బ్రాండింగు... ఎలేలేలే 
హై ఎండు స్టైలింగు... ఎలేలేలే 
వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్... 
He's On The Way To Do Something 
గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ 
It's Brand New Sound To Sing 

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్... 
He's On The Way To Do Something 
గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ 
It's Brand New Sound To Sing 

చరణం: 1 
మన జోలికొస్తే బ్రదరు 
మంటెత్తిపోద్ది వెదరు 
మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు మళ్లీ లెగరు 
మంచోణ్ణి గిల్లగలరు ఎహే చెడ్డోణ్ని గిచ్చగలరు 
ఏలెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరు 
మెగ్గావాట్ మొగ్గోడు  - ఏలేలే
ర ప్ఫోడు టప్ఫోడు  - ఏలేలే
కూసింత తిక్కోడు  - ఏలేలే
ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ 
జో డర్ గయా సంజో మర్ గయా 

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్... 
He's On The Way To Do Something 
గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ 
It's Brand New Sound To Sing

రెన్డెజ్వస్ మసాలా మ్యాన్ గబ్బర్ 
ఇస్కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్ 
బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా 
ఇస్కో జైసే నహీ బన్ కోయీ పగ్డా 
నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్ 
దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్సింగ్

చరణం: 2
మన ఫేస్ పిచ్చ క్లాస్
మన పంచి ఊర మాసు
ఏ డేంజరైన ఎదురెలతాయి మనలో గట్స్
మన ఒంటిమీద డ్రెస్ నిప్పుకి గాలిలాంటి ప్లస్
చమడాలు వలిచి ఉతికారెస్తాది బాక్సామిస్
రయ్ అంటూ రైడింగ్ - ఏలేలే
తుఫానే కమింగు  - ఏలేలే
తువ్వాల స్ట్రైకింగ్  - ఏలేలే
వీడి పోలీసింగే రూల్స్ బ్రేకింగ్
జో డర్ గయా సంజో మర్ గయా 

గబ్బర్సింగ్ గబ్బర్సింగ్... 
He's On The Way To Do Something 
గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ 
It's Brand New Sound To Sing (2)




ఓ ఆకాశం అమ్మాయైతే పాట సాహిత్యం

 
చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: 
గానం: శంకర్ మహదేవన్ , గోపికా పూర్ణిమ

ఏం చక్కని మందారం 
ఇది ఎనిమిది దిక్కుల సింధూరం 
ఏం మెత్తని బంగారం 
ఇది మనసున రేపెను కంగారం 
ఏం కమ్మని కర్పూరం 
ఇది కన్నెగ మారిన కాశ్మీరం 
ఏం వన్నెల వయ్యారం 
ఇక తియ్యని ప్రేమకి తయ్యారం 

ఓ ఆకాశం అమ్మాయైతే 
నీలా ఉంటుందే. నీలా ఉంటుందే. 
ఓ ఓ ఓ. ఆనందం అల్లరి చేస్తే. 
నాలా ఉంటుందే. 
నాలా ఉంటుందే నాలా ఉంటుందే 
వానల్లే నువ్వు జారగా 
నేలల్లె నేను మారగా 
వాగల్లె నువ్వు నేను చేరగా 
మది వరదై పొంగి సాగరమౌతుందే 
హోలా హోలాహ హోలా హోలాహ 
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా
హోలా హోలాహ హోలా హోలా
ఇక చాలా చాలా జరిగే నీ వల్లా

ఏం చక్కని మందారం 
ఇది ఎనిమిది దిక్కుల సింధూరం 
ఏం మెత్తని బంగారం 
ఇది మనసున రేపెను కంగారం 
ఏం కమ్మని కర్పూరం 
ఇది కన్నెగ మారిన కాశ్మీరం 
ఏం వన్నెల వయ్యారం 
ఇక తియ్యని ప్రేమకి తయ్యారం 

చరణం: 1
అల్లేసి నను గిల్లేసి
తెగ నవ్వినావే సుగుణాల రాక్షసీ
శత్రువంటి ప్రేయసి 
పట్టేసి కనిపెట్టేసి
దడ పెంచినావే దయలేని ఊర్వశి
దేవతంటి రూపసి 

గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే
నిద్దుర పుచ్చేనే
ఓ...లోకంలో అందాలన్నీ నీలో చేరెనే
నిద్దుర లేపెనే

హోలా హోలాహ హోలా హోలాహ 
నీ కళ్ళల్లోనే చిక్కానే పల్లా
హోలా హోలాహ హోలా హోలాహ 
ఇక చాలా చాలా జరిగే నీ వల్లా

ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం 
ఈనాడే తెలిసింది కొత్త పదం 
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం 
గుండెల్లో కదిలింది పూల రథం 

చరణం: 2
వచ్చేసి బతికిచ్చేసి
మసి చేసినావే రుషి లాంటి నా రుచి
మార్చినావే అభిరుచి 
సిగ్గేసి చలిమొగ్గేసి
ఉసి గొలిపినావె సరిగమగ పదనిసి 
చేర్చినావే రోదసి 
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే
ప్రాణం పోసేనే 
ఓ...నరకంలో నానా హింసలు నీలో సొగసేనే 
ప్రాణం పోసెనే 

హోలా హోలాహ హోలా హోలాహ 
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా
హోలా హోలాహ హోలా హోలాహ 
ఇక చాలా చాలా జరిగే నీ వల్లా

ఏం చక్కని మందారం 
ఇది ఎనిమిది దిక్కుల సింధూరం 
ఏం మెత్తని బంగారం 
ఇది మనసున రేపెను కంగారం 
ఏం కమ్మని కర్పూరం 
ఇది కన్నెగ మారిన కాశ్మీరం 
ఏం వన్నెల వయ్యారం 
ఇక తియ్యని ప్రేమకి తయ్యారం



మందు బాబులం మేము మందు బాబులం పాట సాహిత్యం

 
చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి 
గానం: కోట శ్రీనివాస్ 

మందు బాబులం మేము మందు బాబులం 
మందు కొడితే మాకు మేమే మహారాజులం 

ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం 
మందు కొడితే మాకు మేమే మహారాజులం
అరే కళ్ళు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తాం
మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం
తాగుబో తంటే ఎందుకంత చులకన 
తాగి వాగేది పచి నిజం గనకన 

ఎహే మందేస్తే ముందు వెనక లేదనా 
ఈ మందు లేని సర్కారీ బందనా
ఏ తాగుడేగ  స్వర్గానికి నిచ్చన
ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా

ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం 
మందు కొడితే మాకు మేమే మహారాజులం 
అరే కళ్ళు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తాం
మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం





యే పిల్లా... పాట సాహిత్యం

 
చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: పవన్ కళ్యాణ్, వడ్డేపల్లి శ్రీనివాస్

ఏ పిల్లా అట్లా నవ్వేసేసి పారిపోమాకే బాబు
మీరేంట్రా నన్ను చూస్తన్నారు
ఎవడి డప్పు వాడు కొట్టండహెయ్… అది...

ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?
ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?

ఏ సుందరి సుందరి సుందరి
మనసునే చేసినావె ఇస్తిరీ
స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి
లిప్పులో పెట్టినావె ఫ్రెష్ జ్యూసు ఫాక్టరి

పిల్లా నువ్వు లేని జీవితం
నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం
అహ పిల్లా నువ్వు లేని జీవితం
ఆవకాయ బద్దలేని మందు కంటె దారుణం

ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?
ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?

పంచదార పెట్టి రుద్దినట్టు
మంచి తేనె తెచ్చి అద్దినట్టు
ద్రాక్ష పండు తీసి పిండినట్టు
ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టు
వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు  - విన్నాంలే
పొయ్యి మీద పాలు పొంగినట్టు - విన్నాంలే
పూట కొక్క పండగొచ్చినట్టు
ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు
సంపకే సంపకే సంపకే
నిప్పులాంటి నవ్వులోకి దింపకే
ఏ సింపకే సింపకే సింపకే
నల్లని రాత్రినీ సింపకే రంగుతో నింపకే

పిల్లా నువ్వు లేని జీవితం
బ్రేకు లేని బైక్ నే రయ్యిమంటు తోలడం
హే పిల్లా నువ్వు లేని జీవితం
ట్రాకు లేని ట్రైను మీద కుయ్యుమంటు యెల్లడం

ఒక్క జానడంత కప్పు కోసం
పెద్ద వరల్డు కప్పు జరుగుతాది
నీ నవ్వులున్న లిప్పు కోసం
చిన్న వరల్డు వారు జరిగినా తప్పు లేదే
కొన్ని వేల కోట్ల అప్పు కోసం
కాపు కాసి ఉన్నదంట దేశం
ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం
దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే
కొట్టినా కొట్టినా కొట్టినా
గుండెలోన దాగి ఉన్న డప్పుని
రాసిన రాసిన రాసినా నవ్వు పై
ఎవ్వరూ రాయని మస్తు మస్తు పాటని

పిల్లా నువ్వు లేని జీవితం
తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటు తిప్పడం
హేయ్ పిల్లా నువ్వు లేని జీవితం
నూనె లోంచి వాన లోకి జారిపడ్డ అప్పడం
యే పిల్లా...



దిల్సే దిల్సే నీ ఊహల్లో పాట సాహిత్యం

 
చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: కార్తీక్, శ్వేతా మోహన్

దిల్సే దిల్సే నీ ఊహల్లో 
ఎగసే ఎగసే ఆనందంలో 
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో 
మెరిసే మెరిసే నీ కన్నుల్లో 
కురిసే కురిసే నీ నవ్వుల్లో 
చెలి దూకేస్తున్నా తిక మక లోయల్లో 
తొలి తొలి చూపుల మాయ 
తొలకరిలో తడిసిన హాయా 
తనువుల తకదిమి చూశ ప్రియా 
గుండె జారి గల్లంతయిందే 
తీరా చుస్తే నీ దగ్గర ఉందే 
నీలో ఏదో తియ్యని విషముందే 
నా ఒంట్లోకి సర్రునా పాకిందే 

దిల్సే దిల్సే నీ ఊహల్లో 
ఎగసే ఎగసే ఆనందంలో 
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో 

నా గుండెలోన మాండలిన్ మొగుతున్నదే 
ఒళ్ళు తస్స దియ్య స్ప్రింగు లాగ ఉగుతున్నదే 
ఓ సనం నాలో సగం 
పైట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే 
లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే 
నీ వశం నేనే కసం 
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి 
వెల్లకిళ్ల పడ్డ ఈడు ఈల వేసే 
కళ్ళు తాగి కోతి లాగా పిల్లి మొగ్గ లేసే హో

గుండె జారి గల్లంతయ్యిందే 
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే 

రెండు కళ్ళలోన కార్నివాల్ జరుగుతున్నదే 
వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే 
ఈ సుఖం అదో రకం 
బుగ్గ పోస్ట్ కార్డు ముద్దు ముద్ర వేయమన్నదే 
లేకపోతే సిగ్గు ఊరు దాటి వెల్లనన్నదే
ఈ క్షణం నిరీక్షణం
హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే 
చుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే 
లవ్ డబ్ మని గుండె దండనక ఆడే హో

గుండె జారి గల్లంతయిందే 
తీరా చుస్తే నీ దగ్గర ఉందే 
నీలో ఏదో తియ్యని విషముందే 
నా ఒంట్లోకి సర్రునా పాకిందే 

దిల్సే దిల్సే  - నీ ఊహల్లో 
ఎగసే ఎగసే  - ఆనందంలో 
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో 
మెరిసే మెరిసే  - నీ కన్నుల్లో 
కురిసే కురిసే  - నీ నవ్వుల్లో 
చెలి దూకేస్తున్నా తిక మక లోయల్లో




కెవ్వ్... కేకా పాట సాహిత్యం

 
చిత్రం: గబ్బర్ సింగ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: మమతా శర్మ, మురళి

కెవ్వ్...
ఏ... కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని 
ఈదంట నేనెళ్తుంటే
కెవ్వ్... కేక నా ఈదంతా కెవ్వ్... కేకా
పాపిడి బిళ్ళెట్టుకొని మామిడి పళ్ళోట్టుకొని 
ఊరంట నేనెళ్తుంటే
కెవ్వ్... కేకా నా ఊరంతా కెవ్వ్ ... కేకా

ఎసరులాగా మరుగుతోంది ఒంట్లో కారం
స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం
నా ఈడు కొత్తిమీర నా సోకు కోడి కూర
నువ్ రాక రాక విందుకొస్తే కోక చాటు పైటేస్తా
కెవ్వ్... కేకా నా సామిరంగా కెవ్వ్... కేకా
కెవ్వ్... కేకా దీని తస్సదియ్య కెవ్వ్... కేకా...

కెవ్వ్... కేకా నా సామిరంగా కెవ్వ్... కేకా
కెవ్వ్... కేకా దీని తస్సదియ్య కెవ్వ్... కేకా

చరణం: 1
ఆ... నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు
దొంగ లాగ దోచావంటే... 
కోరస్: ఆ... దోచేస్తే
కెవ్వ్... కేకా నీ సోకు మాడ కెవ్వ్... కేకా
నా బుగ్గలోని మెరుపుల్తో అగ్గిపుల్ల రాజేసి
నీ బీడీ నే ఎలిగిస్తే...
కోరస్: ఆ ఎలిగిస్తే
కెవ్వ్... కేకా నీ దుంపతెగ కెవ్వ్... కేకా

నా టూరింగ్ టాకీస్ రిబ్బన్ కట్టు  - కెవ్వ్... కేకా
నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు - కెవ్వ్... కేకా
చూశారు ట్రైలరు ఇక చూస్తే ఫుల్ పిక్చరు
మీ ఒంటినిండ చిచ్చురేగి పిచ్చెక్కి పెడతారు

కెవ్వ్... కేకా నా సామిరంగా కెవ్వ్... కేకా
కెవ్వ్... కేకా దీని తస్సదియ్య కెవ్వ్... కేకా...

చరణం: 2
హే కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంట్ బుడ్డల్లే 
ఝలకులిచ్చు నీ జిలుగులే...
అబ్బో కెవ్వ్... కేకా ఓ రత్తాలు కెవ్వ్... కేకా
హేయ్ వేడి వేడి లడ్డల్లే డబుల్ కాట్ బెడ్డల్లే 
వాటమైన ఒడ్డింపులే...
కెవ్వ్ ... కేకా ఓ రత్తాలు కెవ్వ్... కేకా
హేయ్ జోరు మీద గుర్రాలు నీ ఊపులే - కెవ్వ్... కేకా
ఊరు వాడ పందేలు నీ సొంపులే - కెవ్వు... కేకా
నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ
ఓ గోలి సోడా తాగి నీతో గొల్లుమంటు పెట్టిస్తా

కెవ్వ్... కేకా నా సామిరంగా కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
కెవ్వ్ ... కేకా దీని తస్సదియ్య కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కే... కా

కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్
కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్
కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్
కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్
కెవ్వ్...

Most Recent

Default