Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: ఎగిరే పావురమా (1997)
సంగీతం: యస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: వేటూరి
గానం: ఉన్నికృష్ణన్, సునీత
నటీనటులు: శ్రీకాంత్ మేకా, జె.డి. చక్రవర్తి, లైలా
దర్శకత్వం: యస్.వి. కృష్ణారెడ్డి
నిర్మాత: పి.ఉషారాణి
విడుదల తేది: 30.01.1997

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ  ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

నేలనోదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి  స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

బావ మమతల భావ కవితలే  శుభ లేఖలు కావాలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు సుముహుర్తం రావాలి
మా ఏడు అడుగుల జోడు నడకలు  ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని  అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళూ ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ

గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

Most Recent

Default