Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nuvve Kavali (2000) Telugu Songs Lyrics Album Cover

Nuvve Kavali (2000) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvve Kavali (2000) Music : Koti Cast : Tarun, Richa Pallod, Sai Kiran, Varsha Dialogues : Trivikram Srinivas Director : K. Vijaya Bhaskar Producers : Ramoji Rao, Sravanthi Ravi Kishore Release Date : 13 October 2000

Anaganaga Aakasam Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

‘Anaganaga Aakasam’ song from Nuvve Kavali (2000) movie is composed by Koti and sung by K. S. Chithra, P. Jayachandran

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000) Music : Koti Lyricist : Sirivennela Seetharama Sastry Singers : K. S. Chithra, P. Jayachandran
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: పి. జయచంద్రన్, చిత్ర (ఈ పాటని సాయికిరణ్, రిచా, తరుణ్ పైన చిత్రీకరించారు చాలా హుషారుగా సాగే ఈ పాట కాలేజీ ఫంక్షన్ లో కోల్గేట్ పడితీయగా అభినందన సభ జరుగుతుంది ప్రకాష్ క్యారెక్టర్ లో సాయికిరణ్, తరుణ్ పాత్రలో తరుణ్ మధు పాత్రలో రిచా అందరూ కొత్తవారైనప్పటికీ చాలా బాగా నటించారు) అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా... ఆ... ఆ....ఆ... ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ... ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నాకోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా... ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

Sukriya Sukriya Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

“Sukriya Sukriya” from the movie Nuvve Kavali (2000) is composed by Koti and sung by Koti, Sujatha Mohan

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000) Music : Koti Lyricist : Bhuvana Chandra Singers : Koti, Sujatha Mohan
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువన చంద్ర గానం: కోటి, సుజాత మోహన్ అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టేయ్ ఆట పాట షుక్రియ షుక్రియ షోడాలకు ముఖ్యం గోలి పెళ్ళాలకి ముఖ్యం తాళి ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియ షుక్రియ షుక్రియ అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ హై టెక్ సర్కారొస్తే నాయుడు బావకు షుక్రియ బియ్యం ధర పెరిగిందండోయ్ బీజేపీకి బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ ఎగ్జామ్స్ కు చదివేటప్పుడు కరెంటు పోతే షుక్రియ కాన్వెంట్లో ఎల్కేజీకీ లక్షలు అడిగితే బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియా వంటింట్లో గ్యాసైపోతే కుంపటి తల్లికి షుక్రియ కాసుల కోసం క్రికెట్ మ్యాచ్ల్లో ఓడే ఘనులకు షుక్రియ చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే షుక్రియ వేసిన ఫిల్మ్ వేసేటి రిటైలర్స్కి షుక్రియ షుక్రియా అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ గర్ల్ ఫ్రెండ్ని కలిసేప్పుడు వాళ్ళన్నయ్యోస్తే షుక్రియ పెళ్ళాము అనుకోని మరదలి చెయ్యెట్టేస్తే బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ ఏజైన యాక్టర్లందరూ ఎంపీలైతే షుక్రియ పెళ్ళాలను గట్టెక్కించే జాదూగాళ్లకు బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ య య య పట్టాలకు డివోర్స్ ఇచ్చే రైళ్లకు బోలో షుక్రియ బస్సుల్ని పడవలు చేసే ఆర్టీసీకీ షుక్రియ నెల జీతం సరుకుల సంచిని నింపిందంటే షుక్రియ తొలి వారం అప్పుల్లేక గడిచిందంటే షుక్రియ షుక్రియా ... అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ షోడాలకు ముఖ్యం గోలి పెళ్ళాలకి ముఖ్యం తాళి ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియ షుక్రియ షుక్రియ

Ammammalu Thathayyalu Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

“Ammammalu Thathayyalu” from the movie Nuvve Kavali (2000) is composed by Koti and sung by Devan, Anuradha Sriram

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000) Music : Koti Lyricist : Bhuvana Chandra Singers : Devan, Anuradha Sriram
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువన చంద్ర గానం: దేవన్, అనురాధ శ్రీరాం పల్లవి: అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ పిడుగే పడిన అదరం పనిలో పడితే వదలమ్ భ్రమలో పడుతూ బ్రతకం వీ లవ్ లైఫ్ మనసా ఎగిరే భ్రమరం వయసా విరిసె కమలం మనదే మనదే లోకం ఓ నేస్తం చరణం: 1 డబ్బు జబ్బుతో ముదిరి పోయిన పాలిటిక్స్ మాకోద్దు సృష్టి అంతకీ తీయనైన ఈ చెలిమే ముద్దు చదివి చచ్చినా జాబులివ్వని ఇంటర్‌వ్యూలూ మాకోద్దు చెక్కు చెదరని ధ్యేయం మాది నింగే హద్దు పాసైన ఫెయిలైన ఒకటెరా నేస్తం పెళ్ళైతే అత్తారే ఇస్తారోయ్ జీతం కరుగుతున్న కొవ్వొత్తి లాంటిదోయ్ అందమైన రూపాన్ని పక్క పర్స్లో క్యాష్ ఉందీలె కలిసి కొట్టు బిర్యానీ అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ చరణం: 2 పూట పూటకో డ్రెస్సులు మార్చే స్టైల్ పాపలమ్ మేము రోజు రోజుకో వ్రతాన్ని చేసి క్రేజీ ఇస్తాము హోరు గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అనము పండగొచ్చినా ఫ్రెండ్‌షిప్ మరువని ఫ్రెండ్స్ ఏ మేము రైటైనా రాంగైనా మా మాటే వేదం చిరునవ్వే ఆభరణం స్నేహం మా నైజం నీడలాంటిదే స్నేహం బ్రదరు నిన్ను విడిచి వెళ్లిపోదు వయసు మీరిన శ్వాస ఆగిన మనసునొదీలి పోలేదు అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ పిడుగే పడిన అదరం పనిలో పడితే వదలమ్ భ్రమలో పడుతూ బ్రతకం వీ లవ్ లైఫ్ మనసా ఎగిరే భ్రమరం వయసా విరిసె కమలం మనదే మనదే లోకం ఓ నేస్తం

Yekkada Unna Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

“Yekkada Unna” from the movie Nuvve Kavali (2000) is composed by Koti and sung by Sriram Prabhu, Gopika Poornima

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000) Music : Koti Lyricist : Sirivennela Seetharama Sastry Singers : Sriram Prabhu, Gopika Poornima
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: శ్రీరాం పార్ధసారధి, గోపిక పూర్ణిమ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైన నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన లాలా లాల లా లాలా లాల లా లాలా లాల లా లాలా లాల లా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి లాలా లాలా లాలా హేహే లాలాలా చరణం: 1 నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తాననెవరంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నెలకన్నా చల్లగా వున్నా చిరునవ్వేదో తాకుతువుంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచి నట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటౌతుందో ఇలా నా ఎద మాటున ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి లాలా లాల లా లాలా లాల లా లాల లాల లాల లాల (3) చరణం: 2 కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంతా ఉలికి ఉలికి పడలేదుకదా మనకు తెలియనది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైన నేను లేనా దీని పేరేన ప్రేమానే ప్రియ భావన ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన లాలా లాల లా లాలా లాల లా లాల లాల లా హుఁ హుఁ హుఁ

Ole Ole Ole Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

“Ole Ole Ole” from the movie Nuvve Kavali (2000) is composed by Koti and sung by Radhika

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000) Music : Koti Lyricist : Bhuvana Chandra Singers : Radhika
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: రాధిక (ఈ పాటలో హీరోయిన్ లైలాగారు గారునటించారు) ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ నిలబడలేనన్నది పైట నిదరన్నది లేదీ పూట సల సల సల కాగే వయసమ్మొ యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే కిలాడి యాడ ఉన్నాడే జాజులన్నాడే మోజులన్నాడే తోడు రమ్మంటే కిలాడి జారుకున్నడే ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ లైలా లైలా ఆగలేను అన్నాడే ఇంకా చెలియ ఏమీ ఏమీ చేసాడే కలలో వచ్చి కౌగిలించుకున్నాడే ఆపై చిలక ఏమీ చేసి పోయాడే చిరు నవ్వులు నవ్వాడే నడుముని తడిమేసాడే కిత కితలెడుతున్నాయన్నా వినుకోడె లవ్ యూ అంటూ గిల్లేసాడే యాడ గిల్లాడే పిల్లా యాడ గిల్లాడే హా కొంటె కుర్రోడే లేత బుగ్గ గిల్లాడే ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ గదిలోకెల్తే తొంగి తొంగి చూసాడే ఆగే పిల్ల అప్పుడేమి చేసాడే నేనూ వస్తా తలుపు తీయమన్నడే అబ్బో దొంగ చూసి ఏమీ చేసాడే పొగరెక్కిన పిల్లాడే పగ బట్టి ఉన్నాడే సరసాలిక వద్దన్నా సొద వినడే లవ్లీ అంటూ పడిపోయాడే యాడ పడ్డాడే బుల్లి యాడ పడ్డాడే ఆ గోడ మీదేక్కి కాలు జారీ పడ్డాడే

Kallalloki Kallu Petti Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

“Kallalloki Kallu Petti” from the movie Nuvve Kavali (2000) is composed by Koti and sung by K. S. Chithra

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000) Music : Koti Lyricist : Sirivennela Seetharama Sastry Singers : K. S. Chithra
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర (మధు ప్రకాష్ ఎంగేజ్మెంట్ తర్వాత ఈ పాట వస్తోంది. మధు పై ఉన్న ప్రేమని తన గుండెల్లోనే దాచుకొని తను ఈ పెళ్ళికి అడ్డం కాకూడదని స్పోర్ట్స్ సంబంధించి కోచింగ్ కోసం వేరెదగ్గరికి వెళ్ళాలని నిర్ణయించు కుంటాడు తరుణ్. అప్పటినుండి మధు తో సరిగా మాట్లాడడు తరుణ్ ఈ సందర్భంలో మధు పాడుతున్న పాట ఈ పాటలో ఉన్న సన్నివేశాలు అన్ని మనసును పిండేసే విధంగా ఉంటాయి.) కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ..ఓ..ఓ.. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు ఈనాడె సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం కలైపొదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయానం ప్రతి క్షణం ఎదురయ్యె నన్నే దాటగలదా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు గాలిపటం గగనానిదా ఎగరెసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నా మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువు ఎటు వున్నా చినుకులా కరగక శిలై ఉండగలవా... కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..

Most Recent

Default