Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manasulo Maata (1999)




చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: జగపతిబాబు, శ్రీకాంత్, మహిమా చౌదరి
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: పి.ఉషారాణి
విడుదల తేది: 02.04.1999



Songs List:



అంతమరీ గంతులేంటి పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునందా, ఉదిత్ నారాయణ్

అంతమరీ గంతులేంటి





ఈశ్వరా నింగి నేల పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్

ఈశ్వరా నింగి నేల



హోయ్ హోయ్ గాలి ఈల వేసే పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్ని కృష్ణన్, చిత్ర

హోయ్ హోయ్ గాలి ఈల వేసే




ఏ రాగముంది (కౌసల్యా సుప్రజా రామ) పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే 
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు 

ఏ రాగముంది మేలుకొని ఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొని ఉన్న చెవులను తెరువగ
సంగీతమంటె ఏవిటో తెలిసి ఉండాలి మనకి ముందుగా అంత సందేహముంటె తీర్చుకో గురువులున్నరు కనుల ముందుగా వెల్లి
నీలి మేఘాన్ని గాలి వేగాన్ని నింగి మౌనాన్ని అడగరా కడలి 
ఆలపించేటి ఆతరంగాల అంతరంగాన్ని అడగరా మధుర 
ప్రాణ గీతాన్ని పాడుతూ ఉన్న ఎద సడి నడిగితె శ్రుతి లయ తెలుపద బ్రతుకును నడిపిన సంగతి తెలియద

ఏ రాగముంది మేలుకొనిఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొని ఉన్న చెవులను తెరువగ
ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలితొలి వెలుగుని
ఏ జోలపాట చలువతో నింగి సేదదీర్చింది అలసిన పగటిని
స్వర్ణ తరుణాలు చంద్ర కిరణాలు జిలుగులొలికి పరుగు పలుకునెవరికి
మంచు మౌనాలు పంచమంలోన మధువు చిలుకు ఎవరి చెలిమి రవళికి
తోటలో చేరి పాట కచ్చేరి చేయమంటున్న వినోదమెవరిది
నేల అందాల పూల గంధాల చైత్ర గాత్రాల సునాదమెవరిది
పంచ వర్ణాల పింఛమై నేల నాట్యమాడేటి వేళలో మురిసి
వర్ష మేఘాల హర్ష రాగాలు వాద్యమయ్యేటి లీలలో తడిసి
నీరుగా నీరు ఏరుగా ఏరు వాకగా నారు చిగురులు తొడగగ
పైరు పైటేసి పుడమి పాడేటి పసిడి సంక్రాంతి పదగతులెవరివి
ఆరు కాలాలు ఏడు స్వరములతొ అందజేస్తున్న రసమయ మధురిమ
వినగల చెవులను కలిగిన హ్రుదయము తన ప్రతి పధమున చిలకద సుధలను

జోహారు నీకు సంద్రమా ఎంత ఓపికో అసలు అలసట కలగద
ఓహోహొ గాన గ్రంధమా ఎంత సాధనే దిశల ఎదలకు తెలియద
నీ గీతమెంత తడిమినా శిలలు సంగీత కళలు కావనీ ఎంత
నాదామృతాన తడిసినా యిసుక రవ్వంత కరగలేదనీ తెలిసి
అస్తమిస్తున్న సూర్య తేజాన్ని కడుపులో మోసి నిత్యము కొత్త
ఆయువిస్తున్న అమ్రుతంలాంటి ఆశతో ఎగసి ఆవిరై అష్ట దిక్కులూ దాటి
మబ్బులను మీటి నిలువున నిమిరితె గగనము కరగద
జలజల చినుకుల సిరులను కురవగ అణువణువణువున
తొణికితె స్వరసుధ అడుగడుగడుగున మధువని విరియదా......హా




నేలమీద జాబిలీ పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఆ.. ఆ.. 
నేలమీద జాబిలీ సరేలే ఊహ కాని ఊర్వశీ
చూడగానే సుందరీ అదేలే మల్లెజాజి పందిరీ 
తోడు కోరే వయస్సు లాగ తొంగి చూసే మనస్సు లాగా 
ఉరికివచ్చే ఉషస్సులాగ వరములిచ్చే తపస్సులాగ 
సితారలా మెరిసిందీ షికారుగా కలిసిందీ 
శ్రీదేవి చూపుతోనె శృంగార దీపమెట్టినట్టుగా 
సింధూర సంధ్యవేళ సిగ్గంత బొట్టు పెట్టినట్టుగా 
ఆబాల పిచ్చుక అందాలు గుచ్చగ వాలిందమ్మ గాలివాటుగా 
వయ్యరాల గాలి వీచగా

పచ్చబొట్టు గుండెకేసి పైటచాటు చేసి
చందమామ లంచమిచ్చి నూలుపోగుతీసి 
ఇదే తొలీ అనుభూతీ రచించనీ రసగీతీ
సంధ్యారాగం సఖి సంగీతం పాడిన వేళా 
రాయని గ్రంధం రాధిక అందం అంకితమై.. 
ఆమనీ సోకుల అమెని తాకిన అనుభవమే.. 
ఎదలకు లోతున పెదవుల మధ్యన సాగర మధనం ఊగ తరంగం 
చెలి చూపు సోకగానే తొలిప్రేమ కన్ను కొట్టినట్టుగా 
లేలేత చీకటింటా నెలవంక ముద్దు పెట్టినట్టుగా 
చుశాక ఆమెనీ కన్నుల్లో ఆమనీ వేసిందమ్మ పూల ముగ్గులే 
పట్టిందమ్మ తేనే ఉగ్గులే 
ఆమె మూగ కళ్ళలోన సామవేదగానం
ఆమె చేయి తాకగానే హాయి వాయులీనం 
ఒకే క్షణం మైమరచీ అనుక్షణం ఆ తలపు




ప్రేమా ఓ ప్రేమా విన్నావా ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

ప్రేమా ఓ ప్రేమా విన్నావా ప్రేమ




ప్రేమించు ఒక్కసారి మిత్రమా పాట సాహిత్యం

 
చిత్రం: మనసులోని మాట (1999)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, ఉదిత్ నారాయణ్

ప్రేమించు ఒక్కసారి మిత్రమా


Most Recent

Default