Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Amma Donga (1995)
చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి (All)
గానం: మనో, చిత్ర, యస్. పి. శైలజ
నటీనటులు: కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ
దర్శకత్వం: సాగర్
నిర్మాతలు: Ch. సుధాకర్ రెడ్డి, భారతి దేవి మౌళి
విడుదల తేది: 12.01.1995Songs List:బోలో కృష్ణ ముకుంద పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
తక్క దిన్న తక్కా దిన్న (2)
తకా తక్కా దిన్న (2)

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద 
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద 
వెన్నెలలా తేలించరా
ఒక బేబీ భామ పోరాటం
ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ బుల్లిరో
అది చుక్కల గాలికి మొక్కిన చక్కని జాబిల్లిరో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద 
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద 
వెన్నెలలా తేలించరా

చరణం: 1
వెన్నెట్లో నేను వేడెక్కితే 
ముద్దు తేనెల్లో నన్ను ముంచెత్తరా
చిగ్గంటు లేక చలరేగితే 
ఉగ్గు పాలిచ్చి జోల పాడేయన
పొద్దు పోదోయ్ నాకు హద్దులేదోయ్ నీకు
ఆడదే అరిటాకు ముళ్ళు నే కానీకు
పడగెత్తిన పరువానికి అలవాటు
తొడగొట్టిన మహవీరుడి తొలిపాటు
ఇక చూడు మరి చూపు గురి 
పిల్లకిదే ఫిబ్రవరి చలి గిలి భళా భళిరో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద 
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద 
వెన్నెలలా తేలించరా

కోరస్: 
కోయిలా కోయిలా 
కోయిలా కోయిలా కో కో కో కోకోకో

చరణం: 2
నీ వేణు గానం విన్నప్పుడే 
నే రాధల్లె ఊగి పోయానులే
నీ ముగ ప్రేమ కన్నప్పుడే 
పారిజాతాబిషేకం చేశానులే
కన్నె వయసోయ్ నాది 
తేనే మనసోయ్ నీది
అందమే తాంబూలం పండని నాకోసం
విసుగెత్తిన విరహానికి విడిచేసి మారుమల్లెకు మరుజన్మకు వదిలేసి
ఇదే సత్యమని స్వప్నమని బంధమని పాశమని రచించని కధాకలిలో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద 
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద 
వెన్నెలలా తేలించరా
ఒక బేబీ భామ పోరాటం
ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ బుల్లిరో
అది చుక్కల గాలికి మొక్కిన చక్కని జాబిల్లిరో
జం జుమ్మని నీ ముద్దు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నా బుగ్గ నీ వాయనం
జంటకే ఎదురేముందిలే కంటికే ఎదురే లేదులే
కవ్వింత రేగిందిలే రవ్వంత రాగమై

జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం

ఓ మెరుపులా మెరిశావు మిల మిల కిల కిల
నా నీల మేఘాలలో
ఆ ఉరుములా ఉరికావు ఫెళ ఫెళ తళ తళ
ఆకాశ దేశాలలో
వాటేస్తే వరించు ఒళ్ళోనే భరించు
కాదంటే క్షమించు కౌగిల్లే బిగించు
ఈనాటి స్త్రీ కావ్యాలలో వద్దంటే వలపే కదా...

జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం

నా సరసకి వచ్చుంటే సల సల విల విల 
సాయింత్ర మయ్యిందిలే
నీ సొగసునే చూస్తుంటే కలే ఇలై శకుంతలై 
పండింది భావాలలో
లవ్ చేస్తే లభించు నాకోసం తపించు
నా పేరే జపించు నాతోనే సుఖించు
శ్రీవారి శృంగారాలలో ఎన్నెల్లో ఎరుపాయేదా...

జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం
జంటకే ఎదురేముందిలే కంటికే ఎదురే లేదులే
కవ్వింత రేగిందిలే రవ్వంత రాగమైతహ తహ తాకిడి తాకిన సోకుల పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: చిత్ర, యస్. పి. బాలు

తహ తహ తాకిడి తాకిన సోకుల
తహతహ తాకిడి తాకిన 
సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన 
ముద్దుల తేనెల తుంపరలో
జతకొద్దీ జంపాలా... హోయ్
చలికొద్దీ చంపాలా... హోయ్

మనిషి జుం కల నిజం 
చితికి జుం జుం జుం జుం
తకిట జుం తపన జుం
బజబ జుం జుం జుం

తహ తహ తాకిడి తాకిన సోకుల
తహతహ తాకిడి తాకిన 
సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన 
ముద్దుల తేనెల తుంపరలో

చరణం: 1
చలివేస్తే సనక్కురో చెలితోనే అతుక్కుపో
కులాసాల మాలా.. ఖుషీ మత్తులో
బిడియాల బితుక్కులో 
తడియారే తలుక్కులో
భయాలేల భాలా భజానాలలో
జతపడమన్నాయి శకునాలు కలబడమన్నాయి నయనాలు
అదిరెను లేలేత అధరాలు
అదుముకుపోతుంటే మదురాలు
చలిమౌదం గోపాలా... హోయ్
పగటేలే దీపాలా.... హోయ్

తరిమెనే పరిమళం
పరవశం జుం జుం జుం
చెలియుగం తొలిసుఖం 
చెరి సగం జుం జుం జుం

తహతహ తాకిడి తాకిన 
సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన 
ముద్దుల తేనెల తుంపరలో

తకిట జుం తకిట జుం 
తకిట జుం జుం జుం జుం
తకిట జుం తకిట జుం తకిట

చరణం: 2
చినదాని చిరాకులో చిగురించే గులాబిలో
జమాయింపులన్నీ కులాసాలకే
ఉడుకెత్తే వయస్సులో ముడిపెట్టే మనస్సులో
నషాలానికంటే రసాలందుకో
సలలిక శృంగార సౌందర్య 
మధురస మందార మాధుర్య
ముసి ముసి మోహాల క్రిష్ణయ్య
మురళిని మోగించరాయయ్యా
కుసుమించే మొగ్గమ్మా .. ఓ ఓ ఓ హోయ్
కసిపెంచే కన్నయ్యా.... హోయ్

కలవడం నడుమునే 
కొలవడం జుం జుం జుం
అలగడం బలగతో 
మెలగడం జుం జుం జుం

తహతహ తాకిడి తాకిన 
సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన 
ముద్దుల తేనెల తుంపరలో
జతకొద్దీ జంపాలా... హోయ్
చలికొద్దీ చంపాలా... హోయ్

మనిషి జుం కల నిజం 
చితికి జుం జుం జుం జుం
తకిట జుం తపన జుం
బజబ జుం జుం జుం
పిల్ల అదరహో... పిచ్చి ముదర హో... పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, స్వర్ణలత

పల్లవి:
పిల్ల అదరహో... పిచ్చి ముదర హో...
అరె పిల్ల అదరహో పిచ్చి ముదర హో
అబ్బ దీని సోకు మాడ ఉబ్బలూరు 
నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మురిపాలే పొంగిస్తాది 
సగ పాలే అందిస్తాది

కన్నె కజరహో కన్ను చదర హో
హా కన్నె కజరహో కన్ను చదర హో
అమ్మ దొంగ చల్లకొచ్చి ముంతదోచి
బుజ్జగించి బుగ్గ పండు గాటు పెట్టి
మరుమల్లె చెండిస్తాడు 
మగడల్లే చెయ్యెస్తాడు

అరె పిల్ల అదరహో... 
హా కన్ను చదర హో...

చరణం: 1
ఆహా...
నచ్చిందే మెచ్చానే మెచ్చిందంతా గిచ్చానే
అచ్చాగ ఉన్నావే బచ్చా బంతి మొగ్గమ్మ
వచ్చిందే వయ్యారం వాటేస్తావ ఈ వారం
హా చేస్తావా సంసారం చేమంతుల్లో పై వారం
ఎగుడు దిగుడు సొగసు 
అది మొగుడు అడుగు వయసు
తళుకు బెళుకు తడిమే
తాలాంగుది తాళం ఇవాళ

కన్నె కజరహో... కన్ను చదర హో... 
అరెరరె అబ్బదీని సోకుమాడ
ఉబ్బలూరు నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మరుమల్లె చెండిస్తాడు 
మగడల్లే చెయ్యేస్తాడు

చరణం: 2
హా హొ హా హా...
గుత్తంగా గుచ్చెక్కి గుంతల్ బంజాయిస్తాలే
మెత్తంగా మత్తెట్టి మెహదీపట్నం వస్తాలే
కళ్ళల్లో నీ రోషం 
అబ్బ కవ్వించింది ఈ మాసం
అరె తీస్తాలే నీకు సౌండ్ తీరుస్తావా ఉల్లాసం
గుబులు మనసు కబురు 
అది మొగలి పొదల గుబురు
నలక నడుము వనికె 
సుఖాలలో తుఫానివాలే...

పిల్ల అదరహో... పిచ్చి ముదర హో...
హా కన్నె కజరహో... కన్ను చదర హో...
అబ్బ దీని సోకు మాడ ఉబ్బలూరు 
నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మరుమల్లె చెండిస్తాడు 
మగడల్లే చెయ్యేస్తాడుఏదో మనసు పడ్డాను గాని పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: మనో, చిత్ర, యస్.పి.శైలజ

పల్లవి:
ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో

ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో

రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమై

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో

చరణం: 1
ఒక హృదయం పలికినది 
జతకోరే జతులు శృతులు కలిపి
ఒక పరువం పిలిచినది ప్రేమించి
ఒక అందం మెరిసినది 
ఎదలోన చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి
తెలుసా ఏటి మనసా పూల వయసేమంటుందో
తెలిసి చంటిమనసే కంటి నలుసై పోతుందో
ఓ భామా రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి
మెడవిరి గడుసరి సరి సరిలే

ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో

చరణం: 2
ఒక మురిపం ముదిరినది 
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక అధరం వనికినది ఆశించి 
ఒక మౌనం తెలిసినది 
నిదురించే కలలు కనుల నిలిపి
ఒక రూపం అలిగినది వాదించి
బహుశా భావసరసాలన్ని విరసాలౌను ఏమో
ఇక సాగించు జత సాదించు మనసే ఉన్నదేమో
ఓ పాపా నిందిస్తే ఆ పాపం నాదే మరి
విధి మరి విషమని మరి తెలిసే

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో

ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో

రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమేనీతో సాయంత్రం ఎంతో సంతోషం పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర, యస్.పి.శైలజ

పల్లవి:
నీతో సాయంత్రం ఎంతో సంతోషం 
చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం 
చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో
ఈ రాత్రే సంకురాతిరయ్యో
ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం

హో హో హో హో... హో హో హో... (2)

నీతో సాయంత్రం ఎంతో సంతోషం 
చేసేయ్ నీ సంతకం

చరణం: 1
నీ జంట కోరే సాయంత్రము
నా ఒంటి పేరే సౌందర్యము
ఆ వేళ కొస్తే ఓ ఆమని కౌగిల్లకిచ్చా నా ప్రేమని
ఆ రాధ గోలేమో రాగం తీసే 
ఈ రాస లీలేమో ప్రాణం తీసే
తగువే ఆనందం ఐనా పరువే గోవిందం
యమగుండం ఇతగాడే బతికుంటే జతగాడే
చలి చుక్కల గిలిగింతకు 
పులకింతకలు నిను పిలిచెలె

కొంగే బంగారం పొంగే సింగారం 
చూసేయ్ నా వాలకం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం 
చేసేయ్ నీ సంతకం

చరణం: 2
మేనత్త కొడుకా ఇది మేనక
మరుజన్మ కోసం పరుగెత్తక
ఊహల్లో ఉంటే నీ ఊర్వశి
నీ కెందుకంట ఈ రాక్షసి
మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి
నేనెల్లనా గాలి జట్కా ఎక్కి
అదిగో ఆకాశం తార సఖితో సావాసం
మన ఇద్దరి కసి ముద్దుల రసమద్దెల విందే
నిదరోయిన తొలి జన్మల సోదలిప్పుడు పొదలడిగెలే

నీతో సాయంత్రం ఎంతో సంతోషం 
చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం 
చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో
ఈ రాత్రే సంకురాతిరయ్యో
ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం

హో హో హో హో... హో హో హో...
హా హా హా హా... హా హా హా...

Most Recent

Default