-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sridevi"



చిత్రం: కోర్ట్ (2025)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
నటీనటులు: ప్రియదర్శి పులికొండ, హర్ష రోషన్, శ్రీదేవి 
దర్శకత్వం: రామ్ జగదీష్ 
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
విడుదల తేది: 14.03.2025



Songs List:

Palli Balakrishna Monday, March 24, 2025



చిత్రం: గడసరి అత్త సొగసరి కోడలు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: భానుమతీ రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, భానుమతి 
మాటలు: యస్.ఆర్.పినిశెట్టి, కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాతలు: గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు
విడుదల తేది:04.08.1981

Palli Balakrishna Friday, February 9, 2024



చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాతలు: పి.బాబ్జీ, జి.సాంబశివరావు 
విడుదల తేది: 14.02.1980



Songs List:



కొండపల్లి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

కొండపల్లి బొమ్మ



నీ మనసులో ఏమున్నదో పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

నీ మనసులో ఏమున్నదో అ దేవుడికైనా తెలియదుగాని



మరుమల్లె తోడుంది పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

మరుమల్లె తోడుంది 




బొట్టుపెట్టిన కాటుకెట్టిన పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

బొట్టుపెట్టిన కాటుకెట్టిన పూలుచుట్టిన చీరకట్టిన మళ్ళి 




రావిచెట్టెక్కావు రాగాలు తీశావు పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

రావిచెట్టెక్కావు రాగాలు తీశావు 



మా మంచి చెల్లెమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

మా మంచి చెల్లెమ్మా చామంతి పువ్వమ్మా నువ్వు నవ్వమ్మా 

Palli Balakrishna Tuesday, February 6, 2024



చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి 
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాత: యస్.పి.వెంకన్న బాబు 
విడుదల తేది: 14.01.1982



Songs List:



ఆరిపెయ్ ఆరిపెయ్ చలిమంట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఆరిపెయ్ ఆరిపెయ్ చలిమంట
అంతకన్న వెచ్చనైంది మన జంట




చిటపట చిటపట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు & కోరస్ 

చిటపట చిటపట




రేయంత కవ్వింత పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

రేయంత కవ్వింత 





పొంగింది పొంగింది పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

పొంగింది పొంగింది




దొంగ చిక్కింది పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ / వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

దొంగ చిక్కింది 

Palli Balakrishna Sunday, January 21, 2024



చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి, వీటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, శైలజ, ఆనంద్, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, సత్యన్నారాయణ, జమున, చంద్రమోహన్
మాటలు: జంధ్యాల 
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్ 
నిర్మాత: కుదరవల్లి సీతారామ స్వామి 
విడుదల తేది: 10.04.1980

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )




Songs List:



చక్కనైన - మా క్రిష్ణయ్యను పాట సాహిత్యం

 
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: మాధవపెద్ది రమేష్, యస్.పి.శైలజ 

చక్కనైన - మా క్రిష్ణయ్యను
ఎక్కడైన చూశారా ! మీరెక్కడైనా చూశారా ?
వీధి పేరు చెప్పమ్మా
అన్నీ... వీధులు అతనివే
అన్నీ... ఇళ్ళు అతనిని

ఎక్కడ పడితే అక్కడ వుంటాడన్నమాట
బుడ్డీ పాలు తాగిననాడే పూతకిని చంపాడు 
చెడ్డీవేసి తిరిగిననాడే స్త్రీలవెంట బడ్డాడు
గోడలైన గెంతేస్తాడు  ఫ్లూటు బాగా వాయిస్తాడు
అతడేనయ్యా నా జతగాడయ్యా
పేపర్లో ప్రకటించైనా పట్టుకొస్తా నుండమ్మా !

ప్రియమైన నా సఖీ.... రాధికా 
ఏల అలక బాలికా 
నిన్నే వలచిన - కృష్ణుడా
నీకై వచ్చిన గోవిందుడా
డడడాం డడడా డడడా, డడడా

రాధమ్మ ప్రియుడవే అయితే
అసలైన కృష్ణయ్యవైతే
నీ నీలం రంగు ఎక్కడ
నీ నెమలి పించం ఎక్కడ
అపునంటేనే డడడాం డడడా డడడా

రేషన్ తిండి తిని రంగు వెలసిపోయిందే !
దివి గాలి వానలో పించ మెగిరిపోయిందే
ఇది ఒకటి మిగిలిపోయిందే
బంగారు ఫ్లూటేమైనది
మార్వాడి కొట్లో ఉన్నది
బృందావనం ఏమాయెను
ఆది పబ్లిక్ పార్కై పోయెను అంచేత 
డడడాం డడడా డడడా, డడడా

రావె రావె రాధవు నీవే 
రంగు మారిన కృష్ణుడు నేనే
రావె పోదాం మేట్నీకి
వేటగాడు సినిమాకి
ఆరేరే వచ్చాడు కోరుకున్న అప్టుడేట్ క్రిష్ణయ్యా
వీడి తస్సాదీయ మైకమంతా ప్లూటులోనే ఉన్నది
ఆరేరే కృష్ణయ్య కాడే వీడు పోస్టర్లతికే పుల్లయ్య
వీడి తస్సాదీయ అంటుకుంటే బంకలాగ వదలడే !
ప..... ప... ప...... ప.... పామొచ్చింది.
ప్రాణంమీదకు తెచ్చింది.
కాళియ మర్దన చేసినవాడివి
అంబో అంటావే శంభో అంటావే 



మండపేట మైనర్ పాట సాహిత్యం

 
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి.శైలజ 

ఓ... మండపేట మైనర్
హేయ్... పిండిమిల్లు ఓనర్
తిప్పకోయి కాలర్
ఇస్తావా పౌడర్ 
ఔతాను నీ ముందు హాజర్ 

గడియ తీయకుంటే ఘడియ ఆగలేవు
చీర కట్టుకుంటే క్షణము ఊరుకోవు 
పొద్దైతే ముస్తాబై వస్తావు 
వద్దన్నా నా వెంట పడతావు
ఏగానికోసం ! ఏడేళ్ళ బేరం 
తెల్లార్లు  నీతోనే బంగారం చీ 

ఒక్కసారి చూస్తే... నీ ఊహ తెలుసుకుంటా
చేయి కలుపుకుంటే నీ సేవ గనుక్కుంటా
నీ చూపు ఏమేమో వెతికింది 
నీవైపే నా మనసు లాగింది
నాతో పనుంది నా వయసు చింది

నీ ఆశ నీ ద్యాస... తెలిసింది




శ్రీదేవి వంటి మా చిట్టితలికీ పాట సాహిత్యం

 
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.జానకి 

శ్రీదేవి వంటి మా చిట్టితలికీ
సీమంతము చేయరండి
ధీమంతుడైన బిడ్డను కనమని 
మీరంత దీవించండి

పసుపూ కుంకుమలే పచ్చగ ఉండాలని
పదముల పారాణి పూయండి.
పిల్లా పాపలతో కలకలలాడాలని
గలగల గాజులే తొడగండి
జడలో పువ్వులే తురమండి
అందా లొలికించే అబ్బాయే పుట్టాలి 
అందరి ఆశలే తీర్చాలి 
తండ్రిని మించిన తనయుడు కావాలి
తాతయ్య పేరునే నిలపాలి 
మనసులు కరిగించి మమతలు కలిగించి
మాలో కలతలే మాపాలి
అందరిని ఒకటిగా కలపాలి 





ఒకనాటిది కాదు వసంతం పాట సాహిత్యం

 
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, ఆనంద్ 

ఒకనాటిది కాదు వసంతం
విడిపోవిది మా అనుబంధం
కలిమికన్న చెలిమి మిన్న
స్నేహమొకటే శాశ్వతము 
దేహాలు రెండైనా మా ప్రాణమొకటేలే
ఆ ప్రాణమొకటైనా ఆది మాకు మేమేలే

ప్రేమకు కోవెల నువ్వు నీ వెల నాకే తెలుసు
మా ఆంతరంగాలు గంగాతరంగాలు నూరేళ్ళు పొంగాలిలే
ఏ రుతువు ఏదైనా మారాగ మొకటేలే
ఎదలోన కదలాడే అనురాగ మదివింటే
నువ్వూ నేను కలసి పువ్వూ నవ్వై విరిసి
కలిసే వికసిస్తాము కథలే వినిపిస్తాము
ఈ ప్రేమ బంధాల ఎన్నో ప్రబంధాలు మాపేర వెలిసేనులే



చక్కనమ్మ వచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది
చిత్తు చిత్తు చేసిందిరో
చక్కనయ్య విచ్చాడు ఒక్క చూపు చూశాడు.
చిత్తు చిత్తు  చేశాడురో

ఆ నవ్వు చూసి రివ్వు మంటే వాటేసుకో
ఆ చూపులన్నీ చుట్టుకుంటే దాటేసుకో
నీకంటిలో నన్ను పాపల్లె ముద్దాడుకో
నీ సోకుకు దండాలు ఆదిసోకితె గండాలు
నీ చూపుకు జోహారు ఆది తాకితె కంగారు
కన్నుకన్ను గీటుకుంటే కన్నెతీగ మీటుకుంటే
గోరువంక గొడవేమిటో
మొట్టుకుంటే ముద్దులైతే పట్టుకుంటే పండగైతె
నెలవంక కులుకెందుకో 
సిరిమల్లే గుండెల్లో జాబిల్లి ఎండించుకో
నీ సన్నని మసాలు అవి మోసాలు
నీ వెన్నెల దాహాలు అవి పెంచెను మోహాలు

ఆకు ఒక్క లవ్వకుంటే చెమ్మచెక్క లాడుకుంటె
మల్లెతీగలల్లు కుంటే అల్లిబిల్లి పిల్లదుంటే 
ఈ కొత్త వరసెందుకో

పొగమంచు పందిట్లో చెలివుంటే చలి ఎందుకో




మంచి తనానికి పాట సాహిత్యం

 
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మంచి తనానికి మాయని మమతకు పుట్టిన రోజు ఇదీ 
అనురాగానికి ఆప్యాయతకూ, పెట్టిన పేరు ఇదీ 
మంచితనానికి మాయని మమతకు పుట్టినరోజు ఇదీ...
అనురాగానికి ఆప్యాయతకూ, పెట్టిన పేరు ఇదీ 

Happy Birth Day అక్కయ్య
Happy Birth Day అమ్మా
Happy Happy Birth Day అమ్మా
అక్కయ్య
అమ్మా 
అక్కయ్య
అమ్మా 
అమ్మరూప మే  ఎరుగని నేను
నీలో ఆమ్మనే చూశాను
అమృతమూర్తి బావ చలవతో
ఇంత వాణ్ణి నేనయ్యాను
కరుణామూర్తులు అమ్మా నాన్నా
కనిపించే మా దైవాలు

ఆలుమగల అనురాగాలకు
అక్కా బావలే ప్రతి రూపాలు
అమ్మ జీవితమే ఆదర్శముగా
పేరు తెచ్చుకొని బ్రతకాలి
నాన్న గుండెలో - నవ్వులు చిలికి
ఆనందం పండించాలి
ప్రతిరోజు ఒక పుట్టిన రోజుగ
బ్రతుకున వెన్నెల కాయాలి
అనుబంధాలు ఆప్యాయతలు
ఇలాగె ఎప్పుడూ వుండాలి




చిటుక్కు చిటుక్కు పాట సాహిత్యం

 
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిలికిందీ వానా 
బుటుక్కు బుటుక్కు బుటుక్కు బుటుక్కు కురిసింది వాన
మబ్బులేని వాన మల్లెపూల వానా
హోరుమని కురిసింది గుండెలోనా గుండెలోనా....

సిగ్గులేని చినుకేమో బుగ్గ మీద పడుతుంటే 
ఆగలేని చినుకేమో అంచుమీద పడ్డాది
చిలిపి చిలిపి చూపుకన్నా చినుకేలే
నిలిపి నిలిపి చూడకుంటే ఒణుకేలేదు
వాన కురిసి వరదయ్యే వయసూ లేదు
జత అంటు కలిశాక బ్రతుకంతా జడివానా
జత అంటు కలిశాక బ్రతుకంతా జడివాన 
పాడుకుంటు చినుకేదో పైటమీద పడుతూంటే

పైట చాటు ఉలుకేమో బయట బయట పడ్డాది
తళుకు బెళుకు నవ్వుకన్నా మెరుపే లేదు
ఉడుకు ఉడుకు వయసుకన్నా ఉరుమేలేదు
తడిసి తడిసి ఒకటైతే నిదురేరాదు
బ్రతుకంతా పాటైతే కడదాక నవ్వులవాన
బ్రకుకంతా పాటైతే కడదాక నవ్వులవాన


Palli Balakrishna Sunday, November 5, 2023



చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, సాహితి 
గానం: యస్.పి.బాలు, ఆనంద్, పి.సుశీల , యస్. పి. శైలజ, కె. చక్రవర్తి 
నటీనటులు: రజినీకాంత్, కృష్ణ, చంద్రమోహన్, శ్రీదేవి, సునీత, ఫటా ఫట్ జయలక్ష్మి, అంజలీ దేవి, హలం 
దర్శకత్వం: విజయనిర్మల 
నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు 
విడుదల తేది: 31.05.1980



Songs List:



అమ్మంటే అమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: కె. చక్రవర్తి 

అమ్మంటే అమ్మ ఈ
అనంత సృష్టికామె అసలు బ్రహ్మ
రక్తాన్ని అర్పించి ప్రాణాన్ని పూరించి
చేస్తుంది నీ బొమ్మ

మరణాన్ని ఎదిరించి
మరోసారి

జన్మించి
ఇస్తుంది - నీకు జన్మ
ధనం పోసి కొనలేము
రుణం తీర్చుకోలేము అందుకే అమ్మా
విధి ఆడే ఆటలో
విడిపోయే బ్రతుకుల్లో
మిగిలేదే మమకారం
మిగులుండే మమతల్ని
తెగిపోనీ బంధాన్ని
కలిపేదే తల్లి రక్తం
తనకు కన్ను నీవై తే
నీకు రెప్ప తానౌతుంది అందుకే అమ్మా




చిలకుందీ చిలక పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు 

సాకి
మన సైన సొగసుపైన మధువే కురిపించనా
మధువే కురిపించనా - వలచే నెలవంక వంక
గులాబీ విసిరేయనా

పల్లవి : 
చిలకుందీ చిలక
ముసుగున్న చిలక ఆ చిలకమ్మ ముసుగును
తొలిగించకుంటే నేను రహీమును కానేకాను

చరణం : 1
ఏ వైపు చూసినా నేను
ఎన్నో చూపులు నా వైపు
మాట వినని నా చూపు
దూకుతోంది మరోవైపు
అఁ కలల్లో కదిలే యువరాణి
కళలు విరజిమ్మే విరిబోణి
నిన్ను తొలిసారి చూశాను

ప్రేమ గీతాలు రాశాను
ఇంక నిన్ను ఇంక నిన్ను
మేలి ముసుగు మేలి ముసుగు వుంచలేను
లోకానికి బయపడకే బాల
లోగుట్టు తెలుసుకోవే బేల
అరె ఒక్క సారైన నీ మోము చూపించు
నీ సొగసు గుప్పించు - లేకుంటే నీ పేరు

పదిమందిలో చెప్పి మన గాథ ముడి విప్పి
వలపంటే ఏమో ఎరిగించకుంటే
ఆఁ.... చిలకమ్మ ముసుగును తొలగించుకుంటే
హె.హె., హె.. నీవు రాహీమువు కానేకావు
కోరస్

చరణం : 
అల్లా దయవల్ల ఆ మోము కనిపించే సుబానల్లా
ఈ వాలు కళ్ళలోన ఇంకా తొలిసిగ్గులేనా
ఇటేమో గుండె గుబులాయె
ఆటేమో సిగ్గు తెరలాయె
విషాదం కమ్మిందొక కంట
వినోదం చిమ్మిందొక కంట
ఆ.... బాపురే ఏమి ప్రియురాళ్ళు
జాలి కనరాని గుండ్రాళ్ళు
మొదట వగలొలక పోస్తారు
పిదప సెగలార పోస్తారు
చెలీ వున్న మాటంటే నువ్వులికి పడతావు
చురుకెత్తి నీ మోము తెరలోన దాసావు
నీ వయసు నిప్పైతె నా వలపు జల్లై
అలకల మంటలు చల్లార్చకుంటే
నీవు రహీమువు కానేకావు




ఒక్కసారి ముద్దు పెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఒక్కసారి ముద్దు పెట్టు 
వుండలేను చేయి పట్టుకో
మెత్తగా మెల్లిగా - మేనిలో జిల్ జిల్లుగా
ఒక్కసారి ముద్దు పెట్టుకో - వుండలేను
చేయి పట్టుకో
కొత్త, కొంటెగా, గుండెలో ఝల్ ఝల్లుగా

చరణం : 1
ఎంతలో ఎంతగా ఎదిగినావే అమ్మడూ, మొగ్గవో
పుష్వవో చెప్పుమరి ఇప్పుడు చెప్పు వేమరిప్పుడు
నువు చూస్తే సిగ్గువేస్తే, పువ్వునై నా మొగ్గనే
నీ ముందుంటే ముద్దంటే మొగ్గనైనా పువ్వునే.... ||ఒక్కసారి||

చరణం : 2
అంతగా చూడకు- వింతగా వున్నది 
మెరుపులా కొంక వురకలేస్తూ వున్నది
వురక వేస్తే పరవశిస్తే ఒదిగిపోనా సందిట 
గాలికై నా చోటులేదు కరిగే మన కౌగిట ॥ఒక్కసారి॥




మైనేమ్ ఈజ్ రాబర్ట్ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది రమేష్.

పల్లవి : 
మైనేమ్ ఈజ్ రాబర్ట్ గంజాల్విజ్
ఐ కమ్ ఫ్రమ్ లౌల్లీ పేరడైజ్
ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే
వలపుల పేట షోకుల వీధి
డోరు నెం. 420 చార్ సౌబీన్
దట్స్ మై ఎడ్రస్

చరణం: 1 
ముదొచ్చే అందాలు మురిపించే మోహాలు
ఇద్దరిలో వున్నాయి ఈనాడే కలిశాయి
నన్నే నన్నే చూడు కుదిరే ఈడూ నాతో కలిసి ఆడు 
నా గుండెల్లో బాజాలు మోగించు

వన్నెలులు చూసి చూసి తిన్నగ వచ్చెయ్
డోర్ నెంబరు 420 చార్ సౌబీన్
ఎక్స్ క్యూజ్మీ ప్లీజ్

చరణం: 2 
ప్రేమిస్తే వస్తాయి ఎన్నెన్నో కష్టాలు
నిజమయిన ప్రేమయితే పండేను స్వప్నాలు
వుందా వుందా వలపు మనసూ మనసూ కలుపూ
మనదే మనదే గెలుపు

నా కళ్ళలో కాపురమే వుంటావా
నీది నాది ఒకటే ఇల్లు
డోర్ నెంబరు 420 చార్ సౌబీస్
ఎక్స్ క్యూజ్ మీ ప్లీజ్



ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పలవి :
ఒక అమ్మాయి ఒక అబ్బాయి
కలిసి మెలిసి కౌగిట బిగిసే బంధాలలో
కురిసిందీ పదే పదే పడుచంధంలో
తొలకరి చినుకుల చిటపటలాడే జడివాన! 

చరణం: 1 
కనులు దాటే కబురు వింటే
మనసు దాటే మనసు వింటే
తలుచుకుంటే పులకరింతే
కలుసుకుంటే కౌగిలింతే
నీలో కొత్త మెరుపే మెరిసి 
నాలో ఉరుమై ఒకటై కలిసి పొమ్మంటే
ఎదా ఏదా ఉండి ఉండి ఝుమ్మంటుంటే
ఆ చలి చలి పిడుగుల సరిగమలేవో వింటుంటే

చరణం: 2
వలపు వీణ పిలవసాగే
వయసు వయసు కలవసాగే
నిదర రాక రేయి పగలై
నీవు రాక తీపి సెగలై

ఏదో కొత్త బంధం కలిసి నువ్వూ నేనూ మనమై ఏక మవుతుంటే
హాఁ అదే అదే అందమైన గొడవౌవుతుంటే
ఈ మురిసిన పెదవుల ముసి ముసి నవ్వులు చూస్తుంటే

చరణం: 3
నవ్వు చాలు నాకు రశీదు
మనసు చాలు మక్కా మసీదు
చాలు చాలు నీ నమాజు
సరసమాడే సందె మోజు
ఇలవంక దిగి వచ్చే నెలవంక
నీవింక రావాలి నా వంక
కని విని ఎరుగని కమ్మని కథ వింటుంటే
నీ అల్లరి వలపుల ఆవిరి సెగలకు సెలవింక




సాయిబాబా ఓ సాయిబాబా పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

పల్లవి : 
సాయిబాబా  ఓ సాయిబాబా షిర్డీ సాయిబాబా 
ఈ ఇలలో మరో పేర వెలసిన దేవా 

అను పల్లవి: 
కన్నీళ్ళు దాచీ కడకొంగు సాచీ
వచ్చాము దేవాః కరుణించ రావా || సాయిబాబా ||

చరణం: 1
మొక్కెదమో సాయి దేవా
ముక్తికి నీవే త్రోవ
పిన్నలనూ లాలించేవు
పెద్దలను పాలించావు
అందరి మొర విని ఆండగ నిలిచీ

అభయము నొసగీ నడిపించేవు
భక్తుల రిక్తుల దీనుల హీనులు
బాధలు తొలగించేవు 
"బాబా" అని నోరారగ పిలిచిన
బాబూ అని పలికేవు
సాయిదేవాః కావ రావా 
ఏ మతమైనా ఏ కులమైనా
కాపాడు బాబా మా పాలిదేవా

చరణం: 2 
ప్రతి బాటా షిర్డీ వైపే
ప్రతిచోటా నీ రూపే
ఊరూరా నీ మందిరమే
ఇంటింటా నీ వందనమే
ఆర్తుల చేసే ప్రార్థనలన్నీ
అన్ని వేళలా ఆలించేవు
చెదరిన బ్రతుకులు చివరికి కలిపే

చిన్మయమూర్తివి నీవే
ఆరిన దివ్వెల చీకటి గుండెల
ఆశాజ్యోతివి నీవే !
సాయిదేవా ! కావరావా !
ఓ దేవా శరణం  నీ దివ్య చరణం
ఎంతెంత మధురం నీ నామ స్మరణం

కోరస్ : 
సాయిబాబా - ఓ సాయిబాబా
షిర్డీ సాయిబాబా - సాయిబాబా




లక లక లక లక చెంచుక పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: సాహితి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
లక లక లక లక చెంచుక
తక తక తక తక దంచుక
ఊరు చేరింది ఊర పిచ్చుక
మహాజోరు చేసింది కన్నెపిచ్చుక
లక లక లక లక చెంచుక
తక తక తక తక దంచుక
పంట చూసింది కొంటె గోరింక
నా జంటకొచ్చింది పె డి గోరింక

చరణం : 1
ఎగిరి .... ఏటికెగిరి
మునిగి .... నీట మునిగి
ఒళ్ళంత కసూరె....వయసంత ముస్తాబే
పెందలాడే సందెకాడే
అంబరాల ఎగిరొచ్చావా
ఈ సంబరానికే దిగి వచ్చావా

చూసి.... దారి కాచి
వేసి .... కన్ను వేసి
నూనూగు మీసంతో....
నీటైన వేషంతో
సరదాగ దొరలాగ
పండగపూట చూసుకున్నావా
నీ పట్టపు రాణిని చేరుకున్నావా

చరణం : 2
ఎగిరి .... తోటకెగిరి
వెదికి.... చోటు వెదికి
బూరుగ చెట్టె... నేరుగ వచ్చేసి
రాజుగారి రాక కోసం
బొంతలెన్నో నేసుంచాను
పాల పుంతలన్నీ పక్కేశాను

చూసి.... నిన్ను చూసి
చేరి .... చెంతచేరి
పరువాల మరువాలు .... అందాల దవనాలు
గూటిలోన గుట్టుగాను
దాచినావని తెలుసుకున్నాను.
అని దక్కించుకోవాలని కలుసుకున్నాను





ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, ఆనంద్, రమేష్ 

పల్లవి : 
ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ
ముందుకు దూకారంటే ఆ
శక్తులు మూడూ ఎవరని అంటే
రాం రాబర్ట్ రహీంలు

చరణం: 1 
మా రూపం వేరైనా మా రక్తం ఒక పేరా
పెళ్ళి గడియ ముంచుకొచ్చింది ఇక
పిల్లను రప్పించాలిరా : తుళ్ళిపడకురా పెళ్ళికొడకా
తాళం మేళం బాగా కుదిరింది.. ఇక
తూతూ మంత్రం చదివించాలిరా
పెట్టిన లగ్నం - పట్టిన భరతం
గుర్తుగ మిగలాలంటే - ఈ
శక్తులు మూడు కలిశాయంటే
రాం - రాబర్ట్ - రహీం

చరణం : 2
నేనంటే నేనేలే మేమంటే మేమేలే
ఇంత మంచి తరుణంలో దిగు
లెందుకె పైడిబొమ్మా - గుర్తించవె ననుగున్మమ్మా
ఒలికిన నీ నవ్వులే - ఏ
వెలలేని రతనాలమ్మా
తీరని కలలూ ఈ రోజే తియ
తీయగ పండాలంటే ఈ
శక్తులు మూడూ కలిశాయంటే
రాం రాబర్ట్ - రహీం


Palli Balakrishna Saturday, November 4, 2023



చిత్రం: కక్ష (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ , ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల , యస్.జానకి, మాధవపెద్ది రమేష్, యస్.పి. శైలజ, 
నటీనటులు: శోభన్ బాబు, మురళీమహన్, మోహన్ బాబు, రంగనాథ్, శ్రీదేవి, జయచిత్ర, జమున 
దర్శకత్వం: గుహనాధన్ 
నిర్మాత: డి. రామానాయుడు 
విడుదల తేది: 28.03.1980



Songs List:



ఐసలకడి ఘుంతలకడి పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

ఐసలకడి ఘుంతలకడి
అడకిలాడి నే నాడ కిలాడి
నాతోటి పెట్టుకోకు గడబిడి
లేపేస్తా టొపేరం అదీ సంగతి

ఓరమ్మ కొడకా....:
నువ్వు పుట్టింది ఆడదాని కేరా
ప్రతి ఆడదీ నీకోసం పుట్టలేదురా
కన్ను కొట్టావా  లొట్ట లేసావా
కంటిలో నలుసల్లె పడుతుందిగా
గొంతులో వెలక్కాయ అవుతుందిరా
చూస్తావా ఓ చాన్సు....

ఓ కారయ్యో - ఏం జోరయ్యో.....!
నీ అమ్మ కడుపులోంచి కారులో వస్తివా
నీ అబ్బ సొమ్మెట్టి రోడంత కొంటివా 
గాలి తుస్సుంటే – తోలు తిత్తయ్య
కోట్లున్నా గుప్పెడు గాలి తెచ్చుకోలేవు - నీకు
గొయ్యైనా కట్టెలైనా పేర్చేది పేదోడు
కొట్టు కొట్టు కొట్టు పొట్టయినా కరుగుతుంది కొట్టు
ఒరేయ్ ఎదవలూ ఇదా మీ చదువులు
మిమ్ము కన్నోళ్ళు కన్నవి చెడ్డ కలలా ?
వాళ్ళు చెమటోడ్చి పంపేవి చిల్ల పెంకులా
ముక్క ముట్టారా ముక్కు పిండేస్తా 
మారితే మనుషులైబతుకుతారు
కాదంటే కటకటాలు లెక్కెడతారు



కందిరీగతో చెప్పానురా పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

కందిరీగతో చెప్పానురా
బూరెకాదు బుగ్గ ఇది కుట్ట వద్దని
కుట్టినా ఎవ్వరికీ చెప్పొదని
గోల చెయ్యొద్దని పరువు తీయొద్దని
దొంగ చాటుగా వసానులే
బుగమీద కాటేసి పోతానులే
అడిగితే చెప్పుకో కందిరీ గని
కాటు వేసిందని బుగ్గ వాచిందని

ఉండుండి గుండె దడ దడ మంటుందిరా
ఆగాగి వయసు పెటపెట పంటుందిరా
డాన్ని ఆపేది ఎటా
దీన్ని అణిచేది ఎట్టా
ఊగూగి మనసు రెపరెప మంటున్నదే
ఉత్తుత్తినే ఒళ్ళు చిమచిమ లాడిందిలే
దీన్ని తీర్చేది ఎట్లా
దాన్ని ఆర్బేది ఎట్టా

కళ్ళల్లో నీకు ఇల్లొకటి కట్టానురా
ఒళ్ళంత కళ్ళుగ నిన్నెదురు చూశానురా
అద్దె ఇవ్వద్దు నువ్వు
పొద్దు కో ముద్దు ఇవ్వు
పొద్దుకో ముద్దని పద్దెవరు రాస్తారులే
వద్దన్న కొద్ది ముద్దెక్కు వౌతుందిలే
నీకు నెల తప్పకుండా
నేను అద్దిచ్చుకుంటా




నా మనసు పిచ్చి ముండ పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి , ఆనంద్ 

నా మనసు పిచ్చి ముండ
ఇన్నాళ్ళు దాచాను ఇవ్వకుండ
అది నీకోసమేరా అట్ట రాసుందిలేరా బంగారు కొండ
నా మనసు పాలకుండ
ఇన్నాళ్ళు దాచాను జారకుండ
అది అందించినాను ఇక పొంగించు పాలు-బంగారుకొండ

మనసిచ్చేంతవరకే మంచిదాన్ని
ఇచ్చాక మా చెడ్డ చుప్పనాతిని
చుప్పనాతి మనసెంత మంచిదని
కంటికి రెప్పల్లె కాస్తుంది ప్రియుడ్ని
అటు ఇటు చూశావా అడ్డదారి తొక్కావా
కళ్ళకు కట్టేస్తా గంతల్ని కాళ్ళకు వేసేస్తా బంధాల్ని
కళ్ళయినా కాళ్ళయినా నీతోటి కలిసే చూడాలి
నీ బాటగానే నడవాలి బంగారుకొండ ॥ నా మనసు ॥

ఒక సన్నాయి మ్రోగింది గుండెలోన
అది కళ్యాణ మేళంగా అనుకోనా
రెండు గుండెలు ఒక తాళం వేసినప్పుడే
నిండుగ ఉంటుంది ఏ మేళమైనా
చెంపల నిగ్గులలో చిగురించే సిగ్గులతో
ముగులు వేశావు ముంగిలిలో
లగ్నము చూశాను దగ్గరలో
ముగ్గులైనా లగ్నమైనా
నీ యింటి వాకిటే వేస్తాను 
నీ జంటలోనే చూస్తాను బంగారు కొండ ॥ నామనసు ॥





బుగ్గమీద ముద్దు పెట్టనా పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

బుగ్గమీద ముద్దు పెట్టనా
ముద్దుమీద ఒట్టు పెట్టనా
ఒట్టు పెట్టి ఓడించనా 
ఓడగొట్టి గెలిపించనా
గెలిచినట్టు గురుతు పెట్టిపోనా

నడుము నీకు వప్పజెప్పి నడవనా అదినీ
పిడికిలంత లేదంటే నవ్వనా
గొప్పగా చెప్పుకోకు నీ నడుము సన్నన ఒక్క
గుప్పెడే నువ్వుండె నా గుండె తెలుసునా

సొగసులోని రంగులన్ని చూడనా - చూచి
వయసులోని పొంగుతోటి రంగరించనా
రంగురంగు కలలతో రాతిరంత గడపనా
రమ్మనీ తలుపులన్నీ తెరిచి వేచి వుండనా




ఓరబ్బ దెబ్బ అగ్గిబరాటారా పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్, కె. చక్రవర్తి, జి. ఆనంద్, శైలజ 

ఓరబ్బ ఊరూర సవాలు చేస్తున్నాం
సమఉజ్జీ ఎవరంటూ సభలో చూస్తున్నాం
మాటకు మాటుంది వేటుకు వేటుంది
పోటీకొస్తే పీటీ చేసి బోలాకొట్టిస్తాం

ఓరబ్బ దెబ్బ అగ్గిబరాటారా
ఒకసారి రుచిచూడు ఉక్కు కరావేరా
మాటకు మాటుంది వేటుకు వేటుంది
పోటీకొచ్చి పీటీచేసి చీటీ చింపేస్తాం

మీ తాతకు దగ్గులు నేర్పినవాణ్ణి నన్నా ఎదిరిస్తావ్
మీ ముత్తాత ముక్కును పిండినవాణ్ణి నీకా జడిసేది
బురదగుంటలో చేపలు పడతావ్ తిమింగలాన్ని మింగేవా

తిమింగలాన్ని గిలగిలకొట్టి తిక్కా తిమురు ఒదిలిస్తా
పచ్చడిచేసి పచ్చినెత్తురు భళ్ళున కక్కిస్తా
హీరోలైతే దాగారెందుకు చీరకొంగు వెనక నీ
చీరకొంగు వెనుక

సత్యభామ కథ చదవలేదటే చవటా పోపోవే
సత్యభామవో చుప్పనాతివో చప్పున తేల్చేస్తా
ముక్కు చెవులు దక్కవు నీకు టక్కున చెక్కేస్తాన్
కయ్యంలోన కాలు దువ్వితే కుయ్యో అనిపిస్తా
టెక్కు టెంపరు చూపేవా చుక్కలు కనబడతాయ్
గుర్తొచ్చి వెక్కిరించితే నడ్డి విరుగుతుంది
గుట్టూ మట్టూ బయట పెట్టితే ఆట కట్టుతుంది
 మీ ఆట కట్టుతుంది.
తెరవెనుక భాగోతం చూస్తావా
ఓరబ్బ




దుష్టుల మీద దుర్మార్గుల మీద పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్,

దుష్టుల మీద దుర్మార్గుల మీద
దోపిడి మీద పాపులు మీద 
అందరు కక్ష పూనింది మాయమ్మ కాళికమ్మ
శిక్ష తప్పించు కోలేవు తోలు బొమ్మ

నేనే కాళిని కపాల మాలిని
మహంకాళిని మహిషాసుర మర్థినినే
ఎక్కడికే పారిపోతావు నువ్
పారిపోతే పాపాలు తీరిపోవు

ఎయ్ శాకిని ఢాకిని కామిని మోహిని
రండి రారండి రక్కి రక్కీ ముక్కలుగా చెక్కండి- పాపిని
 చెప్పుకుంటే ఆరుతుంది.
చెప్పుకుంటే అగ్గిలా కాల్చుతుంది

చెప్పమంటే ఊరికే చెప్పదీ దెయ్యమూ
చెప్పుతో నాలుగు చీపురుతో నాలుగు
వడ్డిస్తే వస్తుంది నిజము
దీని దెయ్యాన్ని ఇప్పుడే వదిలించు
దీని చేతనే సత్యాన్ని కక్కించు
కక్కపే టక్కులాడి
నిజము కక్కవే కటిక రాక్షసి

Palli Balakrishna Friday, November 3, 2023



చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, రాజేంద్రప్రసాద్, సుధాకర్, శుభ, గీత 
దర్శకత్వం: కె.యస్.రామిరెడ్డి 
నిర్మాత: దోనేపూడి బ్రహ్మయ్య
విడుదల తేది: 03.12.1982



Songs List:



ఈ అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

ఈ అనురాగం



ఇద్దరమొకటై పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

ఇద్దరమొకటై



మచ్చలేని చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

మచ్చలేని చందమామ మాపటేల కోసుకొచ్చి




రసికుడవని పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: నరాల రామా రెడ్డి
గానం: యస్. జానకి

రసికుడవని



సంకురాత్రి పండగ పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు 

సంకురాత్రి పండగ




కసి కసి కట్నం కౌగిలి కట్నం పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి సంసారం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

కసి కసి కట్నం కౌగిలి కట్నం 

Palli Balakrishna Monday, July 24, 2023



చిత్రం: ఆటగాడు (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్.పి. శైలజ 
నటీనటులు: యన్.టి.రామారావు, శ్రీదేవి 
దర్శకత్వం: టి. రామరావు 
నిర్మాత: జి. రాజేంద్ర ప్రసాద్ 
విడుదల తేది: 24.04.1980



Songs List:



చీమ కుట్టిందా పాట సాహిత్యం

 
చిత్రం: ఆటగాడు (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

చీమ కుట్టిందా-చిమచిమ లాడిందా
చిచ్చు పెట్టిందా - చిటపట లాడిందా
ఆ చిమచిమా ఈ చిటపటా ఈ దెబ్బతో గోవిందా హరి

చరణం: 1
అమ్మదొంగా అగ్గిలేని మంటపుట్టిందా భగ్గుమంటోందా
అది యిక్కడ ఆని చెప్పడానికి సిగ్గుగా వుందా
ఏమి కుట్టిందమ్మడూ ఏడ కుట్టింది
ఏడకెక్కింది నీకు ఏడుపొచ్చింది
చురకల వైద్యం చేస్తా ఛూఛూ మంత్రం వేస్తా
చుక్కల వేళకు పక్కకువస్తే చక్కని మందొకటిస్తా
ఠక్కున రోగం కుదిరిస్తా

చరణం: 2
ఆరుబైట అందమంతా కందినట్టుందా అయ్యో చిందినట్టుందా
అది అల్లరై ఒక జాతరై అవిరౌతోందా
ఏడ కుట్టిందమ్మడూ - ఎందుక్కుట్టింది
వయసుకు వైద్యం చేస్తా మనసుకు మంత్రం వేస్తా
వెన్నెలవేళకు కౌగిలికొ స్తే ఇయ్యని మందొకటిస్తా
తియ్యని మందొకటిస్తా



సిలకమ్మ గూటిలో పాట సాహిత్యం

 
చిత్రం: ఆటగాడు (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
సిలకమ్మ గూటిలో సోటుందిరో సోటుందిరో
దాని అలకాపులకా నాకు తెలిసిందిరో
గోరింక గుండెలో సోటుందిరో సోటుందిరో
దాని వలపూ పిలుపూ నాకు తెలిసిందిరో

చరణం: 1
అవునుకు కాదంటే అది ఆడపిల్ల రోయ్
కాయకు పండంటే అది కన్నెపిల్ల రోయ్
పొమ్మంటే రమ్మనిలే దాని బాస
వద్దన్నా ముద్దేలే దాని వరస
రవ్వంటి పిల్లగాడు ఏమన్నా అందమే
పువ్వంటి పిల్లతోడు పొమ్మన్నా సొంతమే
అందమంతా గూడు అల్లుకుంటా, చాటు
చేసుకుంటా, ఊసులాడుకుంటా, బాస చేసేసి
నీతోడు గుంటానులే

చరణం:
పగలే గిలి అంటే వాడు పడుచువాడురోయ్
ఎండే వెన్నెల అంటే వాడు గడుసువాడురోయ్
కంటిచూపు కానరాని కౌగిలింత
ఊపు చూస్తే ఊరంతా సలపరింత
చిలకంటి చిన్నది అలిగినా అందమే
చిగురంత పొగరెక్కి ఎగిరినా బంధమే
మల్లెతీగై నీన్నే అల్లుకుంటా
కంటిరెప్పగుంటా, జంటా కట్టుకుంటా
చుక్క ఎలుగులో నీ నీడగుంటానులే




గుద్దుతా నీ యవ్వా పాట సాహిత్యం

 
చిత్రం: ఆటగాడు (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి
గుద్దుతా నీ యవ్వ గుద్దుతా - ముక్కుమీద గుద్దుతా
మూతిమీద గుద్దుతా - గుద్దానంటే గూబ గుయ్యంటది
యేశానంటే ఈపు సాపవుతది
గుద్దుతా నీయవ్వ గుద్దుతా ముక్కుమీద గుద్దుతా
మూతిమీద గుద్దుతా - గుద్ధానంటే గూబ గుయ్యంటది
యేశానంటే సెంప పెళ్ళంటది

చరణం: 1
పొగరెక్కి నామీద ఎగిరెగిరి పడ్డాడా
రెంటికీ చెడతాడు రేవడు
కన్నెత్తి ఎవడైనా నియంక చూశాడా గుద్దుకే చచ్చినా లేవడు
అట్టే నువు నీల్గావంటే నీలిమందు కొట్టానంటే
మూడు చెరువులా నువ్వు మునగాలా
మునిగి తేలి నాకోసం ఎతకాల

చరణం: 2
సింగారంగా నువ్వు సీ అన్నాగాడిదా
ఫైనెల్లో తప్పదే సూడిద
ఏడేళ్ళనించి నువ్వు ఈ కూతే కూస్తున్నా
ఏమయ్యి సచ్చింది బూడిద
ఆమాట అన్నావంటే అగ్గిరాముడయ్యానంటే
మడతేసి కడవలో ఉడకేసా
ఉడకేసి మడుగులో ఉతికేసా



జిల్ జిల్ జిలేబి పాట సాహిత్యం

 
చిత్రం: ఆటగాడు (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
టకుచికు టకుచికు జిల్ జిల్ జిల్ జిలేబి నా గులాబీ 
నే నాడనా ఆడి పాడనా
టకుచికు టకుచికు జిల్ జిల్ జిల్ జిలేబి - నీ గులాబీ
నే నాడనా ఆడీ పాడనా

చరణం:1
పరువంలో ఒక దరువు వున్నది నీ
పదును చూసి నను పాడమన్నది
అందంలో ఒక అలక వున్నది నీ
నడకచూసి జత కలవమన్నది
అదే నా పాటగా - ఆడుకో నీ ఆటగా
ఎడాపెడా నువ్వాడగా - ఎగాదిగానే చూడగా
అల్లరి ఆటకు - అందని పాటకు
పల్లవి దొరకని పిల్లది ఎవరని అడగనా నువ్వెవరని

చరణం: 2
ఈడు అన్నది చిలిపిగుంటది
తోడువుంటె అది వలపు అంటది
చూపు అన్నది చురుకుగుంటది
విచ్చుక త్తిలా గుచ్చుకుంటది
కదలిరా ఆ చుక్కలా నిలిచిపో నాప్రక్కనా
గందరగోళం ముదరగా చందరగోళం అదరగా
రెపరెపలాడిన రెప్పల సందున
గుబగుబలాడిన గుండెల చప్పుడు - యిప్పుడే నే చెప్పనా 





నీ చూపు పాట సాహిత్యం

 
చిత్రం: ఆటగాడు (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: మాధవపెద్ది రమేష్ , యస్.పి. శైలజ 

నీ చూపు 




ఏకో నారాయణ పాట సాహిత్యం

 
చిత్రం: ఆటగాడు (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
ఏకో నారాయణా ఏలుకోరా మోహనా
యెన్నెలంటి మగువుంది
యేసుకుంటే మధువుంది
చేసుకోర పారాయణా నవమోహనా మోహనాయనమః

చరణం: 1
లావాదేవీలెన్నో వున్నదాన్ని దేవదేవినై నీతోవుంటాస్వామీ
పులకరింత పెంచుకో- పూజలెన్నో చేసుకో
మతివుంటే మతికీ ఒక కుతివుందని తెలుసుకో
మనసునే మధురగా - మమతలే యమునగా
మలచి నీ కోసమే వలచి వచ్చానురా
పక్కనుంటే శ్రీదేవి - ఎందుకింక దేవదేవి
వేపకాయ తీపాయెనా నవమోహనా

చరణం: 2
అవతారాలెన్నెన్నో ఎత్తినోణ్ణి
సరసం విరసం తెలిసిన సాములోర్ని
ఆరగింపు సేవకు అందముంది నంచుకో
పవ్వళింపు సేవకు పడుచుపువ్వులేరుకో
జై మోహనాయనమః

ముద్దులన్ని మూటగా ముడుపులే కట్టినా
పొద్దు వాలిపోయినా వద్ద చేరవేమిరా
పక్కనుంటె శ్రీదేవి - ఎందుకింక భూదేవి
వేటకాస్త ఆటాయెనా నవమోహనా
జై మోహనాయనమః

Palli Balakrishna Tuesday, July 26, 2022



చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి, కొసరాజు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల , యస్.జానకి 
నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి 
మాటలు: కాశీ విశ్వనాధ్ 
దర్శకత్వం: కట్టా సుబ్బారావు 
నిర్మాత: ఎ.పోతరాజు 
నిర్మాణ సంస్థ: సరిగమ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11.09.1981



Songs List:



రా మామ రా పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి.బాలు

రా మామ రా 



బుడి బుడి గుడుగుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

బుడి బుడి గొడుగుల్లో 



కొమ్మకో పండంట పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కొమ్మకో పండంట 




పలుపు తాడు పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పలుపు తాడు 



అద్దిర బన్నా అయిసర బజ్జా పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు 
గానం: 

అద్దిర బన్నా అయిసర బజ్జా 

Palli Balakrishna Thursday, July 21, 2022



చిత్రం: మా బంగారక్క (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: మాగంటి మురళీమోహన్, శ్రీదేవి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాణ సంస్థ: రవిశంకర్ పిక్చర్స్
విడుదల తేది: 22.05.1977



Songs List:



ఆకుపచ్చని కొమ్మల నడుమ పాట సాహిత్యం

 
చిత్రం: మా బంగారక్క (1977)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల & బృందం

నందారే నందారే ఆకుపచ్చని కొమ్మల నడుమ 



చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ పాట సాహిత్యం

 
చిత్రం: మా బంగారక్క (1977)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, వి.రామకృష్ణ

చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ లింగు లిటుకు 



దూరాన దూరాన పాట సాహిత్యం

 
చిత్రం: మా బంగారక్క (1977)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: జి.ఆనంద్

దూరాన దూరాన తారాదీపం భారమైన గుండెలో ఆరని తాపం 





నా హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: మా బంగారక్క (1977)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

నా హృదయం నాగార్జున సాగరం సాగే ప్రతీ తారంగం 



సరియేది మనప్రేమకు పాట సాహిత్యం

 
చిత్రం: మా బంగారక్క (1977)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సరియేది మనప్రేమకు ఓ స్వప్నసుందరి సరియేది 



ఏం పిల్లా అహ ఏందే పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: మా బంగారక్క (1977)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంతకెళ్ళి వచ్చే సరికి ..ఇంత మారితివె మల్ల
ఏం పిల్లా అహ ఏందే పిల్లా
ఏం పిల్లా అహ ఏందే పిల్లా

ఇంతలోనే ఇంట్లోనే ఎంతపని జరిగిందో 
ఓ మామ చెప్పేదెట్టా  





మధువనిలో ఆడవే రాధికా పాట సాహిత్యం

 
చిత్రం: మా బంగారక్క (1977)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మధువనిలో ఆడవే రాధికా నా మదిలో మ్రోగెను సుధాతరంగిత 

Palli Balakrishna Wednesday, July 20, 2022



చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి, డా॥ సి. నారాయణరెడ్డి, కొసరాజు
గానం: పి.సుశీల, యస్.జానకి, వాణిజయరాం, యస్.పి. బాలు 
నటీనటులు: రవికాంత్ (నూతన నటుడు), కుమారి శ్రీదేవి, నాగబూషణం, రాజాబాబు 
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: కె,యస్.రామిరెడ్డి
నిర్మాత: యమ్.గోపాల కృష్ణారెడ్డి
విడుదల తేది: 23.05.1975



Songs List:



జాబిల్లి వెలిగే చల్లని వేళ పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

జాబిల్లి వెలిగే చల్లని వేళ 



ఏ తోడు లేదు పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్. జానకి 

ఏ తోడు లేదు 



కంటికి నిదురే రాదాయే పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

కంటికి నిదురే రాదాయే 




నీ కళ్ళలోన వెలిగిస్తాను దీపాలు పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

నీ కళ్ళలోన వెలిగిస్తాను దీపాలు 




కొండంత దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు 

కొండంత దేవుడు 

Palli Balakrishna Tuesday, July 19, 2022



చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి 
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ
విడుదల తేది: 08.08.1980



Songs List:



అప్పన్న తన మన పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు & బృందం 

అప్పన్న తన మన 



రెక్కలు తొడిగి రెప రెపలాడి పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా
రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా

వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసే వెంబడించింది...నిమిషమాగకా...
మనసు వెంబడించిందీ..నిమిషమాగకా...

చరణం: 1
చెంతగా... చేరితే....చెంతగా చేరితే.. వింతగా ఉన్నదా
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా...
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా

నిన్న కలగా ఉన్నది... నేడు నిజమౌతున్నది
నిన్న కలగా ఉన్నది.. నేడు నిజమౌతున్నది
అనుకున్నది అనుభవమైతే అంత కన్న ఏమున్నది

ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది...నిమిషమాగకా...
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా...

చరణం: 2
కళ్ళతో... నవ్వకు...కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది
గుండెలో చూడకు...గుబులుగా ఉన్నది...
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది

తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది...
తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది...
ఆ చూపుల అల్లికలోనే పెళ్ళిపిలుపు దాగున్నది...

ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది...నిమిషమాగకా...
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా...

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా

హ..హా...ఆ..ఆ...




బావనే వయ్యారి భామ పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

బావనే వయ్యారి భామ 




అమ్మీ ఓలమ్మి పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

అమ్మీ ఓలమ్మి 




రావయ్యా రామేశం పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

రావయ్యా రామేశం





చిక్కావులేరా నా కొండే పాట సాహిత్యం

 
చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

చిక్కావులేరా నా కొండే

Palli Balakrishna Sunday, June 26, 2022



చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి 
దర్శకత్వం: టి. రామారావు 
నిర్మాత: జి. బాబు 
విడుదల తేది: 09.04.1981



Songs List:



గుండెల్లో సవ్వడి ఏమిటో అలజడి పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

గుండెల్లో సవ్వడి ఏమిటో అలజడి 




ఓ బాటసారి...పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: కె.జె.యేసుదాసు, యస్.పి.శైలజ

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 

ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 

ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..

ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని

కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ

తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?

అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది 

ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ




నీరెండ దీపాలు నీ కళ్ళలో పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

నీరెండ దీపాలు నీ కళ్ళలో 




మురిపాల మా బాబు పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  పి. సుశీల

మురిపాల మా బాబు 




అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  పి. సుశీల, యస్. పి. శైలజ

అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు 




శబరి గిరీశ అయ్యప్ప పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  యస్. పి. బాలు

శబరి గిరీశ అయ్యప్ప 

Palli Balakrishna Wednesday, June 15, 2022



చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: నాగేశ్వర రావు, శ్రీదేవి, మోహన్ బాబు, మధు మాలిని
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 1981



Songs List:



అయ్యారే తుంటరోడు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కోరస్: 
ఝం ఝం ఝం ఝం
ఝం ఝం ఝం ఝం ఝం ఝం
ఝం ఝం ఝం ఝం
ఝం ఝం ఝం ఝం ఝం ఝం

అయ్యారే తుంటరోడు - ఒయ్యారం సంతకాడ
వియ్యాలు సెయ్యమన్నాడే - అరే ఒలీ ఒలీ ఒలీ ఒలీ -
ఉయ్యాలే ఊగాలో – జంపాలే పాడాలో

అయ్యారే కొంటెపిల్ల ఒయ్యారం సంతకెల్లి
వియ్యాలు సెయ్యమన్నాదే - అరె ఒలీ ఒలీ ఒలీ ఒలీ
ఉయ్యాలే ఊగాలో, జంపాలే పాడాలో

చిటికినేలితో చీకటితీసి కాటుక పెట్టాడే
బొటన వేలుతో బుగ్గనుగిల్లి బొట్టుగ దిద్దాడే
వచ్చే ఎన్నెల పెదవులతోటి నొక్కి పెట్టిందే
అది ఎర్రని దొండపండై చిలకను రమ్మందే

సిలకా సిలకా కూడబలికి ....
ఆహో ఒయ్ ఆహా ....
సిటుకూ సిటుకని జాడ తెలిసి
ఊహూ ఒయ్ ఉహూ
గూడుచేరి గుస గుస లాడేయి - కోడికూసే ఏళకు లేశాయి
అరె తస్సాదియ్య కోడి కూసేఏళకులేశాయి

చిక్కని నడుముకి దారం కట్టి బొంగరమాడాలీ
చక్కెర పెదవికి బేరం పెట్టి సారం చూడాలీ
చూడాలన్నా కుర్రగాడి సత్తా చూడాలి
సుడిగాలల్లే సుట్టి సుట్టి సొమ్మ సిల్లాలి
మల్లె తీగకు సెమటలు బడితే
ఆహా
మంచే అనుకుని బ్రమలోపడితే
ఏకువ ఎలుగులు కితకిత లెట్టాలి
రేకుల రెక్కలు కిటికీ తీయాలి
అరె తస్సాదియ్య - ఏకువ ఎలుగులు కితకిత లెట్టాలి. ॥అయ్యారే ॥



చెమ్మ చెక్క పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చెమ్మా చెక్కా సక్కనోడు జిమ్మా దియ్యా సిక్కనోడు
సుక్కలలో మంచమేనేనే ఓలమ్మో
పక్క చేరి మంతరించెనే 
చెమ్మా చెక్కా పక్కనమ్మ జిమ్మా దియ్యా సుక్కలమ్మ
మంచమెక్కి లంచమిచ్చేనే - ఓలమ్మో
కంచెనంట చేను మేసేనే

ఎన్నెలోడు బలేసల్లనోడు ఒంటిగుంటె కొంటెవాడు అల్లరోడు
ఎంట వుంటె ఒంటి నిండ ఎచ్చనోడు
పల్లె పిల్లా ఒట్టి పిచ్చి పిల్ల ఒప్పకుంటే రాజుకున్న అగ్గిపుల్ల
ఒప్పుకుంటె అచ్చమైన తెలుగు పిల్ల
తెలుగులోని తీపంతా తెచ్చుకున్నది
ఎలుగుతోనె రేపులా విచ్చుకున్నది
రేపటికి మాపటికి వంతెనె నాది
రెండు కలిపి సందెకాడ సొంతమై నాది 
మోజు చూడు దానిపోజు చూడు
ముద్దబంతి పువ్వులాంటి మోముచూడు
మూట గట్టి తెచ్చుకున్న ముద్దు చూడు

చూసి చూసి వాణ్ణి కాపుకాసి
కన్నెవయసు తెచ్చినాను గడియతీసి
కాపురాని కొచ్చినాను ఏళజూసి
ఏళ పాళ లేని ప్రాయమెగిరి పడ్డది
తాళమంటే తాళనని గొడవపడ్డది
గొడవపడ్డ గాలిగాడ్ని జాలి పడ్డది
జాలిపడ్డ మనసులోకి జారిపడ్డది ॥చెమ్మా చెక్కా॥



మనసుల ముడి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మనసులు ముడి పెదవులు తడి
మధువుల జడి ఎద తడబడి కోటిరాగాలు పాడే
ఆ.... తనువుల వడి తపనల
తలపుల సడి ఎద అలజడి శతకోటిరాగాలు పాడే

లతవై నా జతవై గత స్మృతివై నా శృతివై
స్వరజతివై లయగతివై నను పాలించవా.....
ఒడిపై చారపడిపై నా బడిపై వరవడిపై |
నా గుడివె దేవుడివె నను లాలించవా
వలపు మెరుపు మెరిసీ – తలపు తలుపు తెరిచీ
సిరి ముగ్గులు వేయించి చిరు దివ్వెలు వెలిగించి
తొలిసారి పలికాను పలుకై
అది నువ్వే అనుకున్నా - నీ నవ్వే వెలుగన్నా
నీవు నా తోడు వన్నా
అహొహొహో నేను నీ నీడనన్నా

చెలివై నెచ్చెలివై చిరుచలివై కౌగిలివై
లోగిలో జాబిలివై నను మురిపించవా
వరమై సుందరమై - శుభకరమై ఆదరమై
సంబరమై సాగరమై నన్ను ముంచేయనా

కనులు తెరచి చూసీ కలలు నిజము చేసే
చిరునవ్వులు నవ్వించీ సిరి మువ్వలు మోగించీ
తొలిసారి పలికాను పలుకై
ఆ పలుకే ఉసిగొలిపీ పరువముతో నను కలిసి
సామగావాలు పాడే
అహాహాహో సోమగానాలు చేసే






ఈ కొండ కోనల్లో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఈ కొండకోనల్లో నీ రెండ ఛాయల్లో - ఈ ఎండిమబ్బుల్లో నీవే
ఈ వాగువంకల్లో ఈ ఏటి తరగల్లో - తెల్లాటి నురగల్లో నేవే
ఎలుతురు నేనె అహ ఎండవు నీవే
సినుకులు నేనై అహా సిగురులు నీవై
ఎన్నాళ్ల ఎన్నేళ్ల సావాసమో ...హోయ్
ఏర్రాని సందెమ్మవో పచ్చాని సిలకమ్మవో
ఎచ్చని సలిమంటవో ఎదలోని గుడిగంటవో
రాతిరివో వలపు జాతరవో
సందడివో వయసు పందిరివో
పందిట్లో చిందేసే చిన్నారివో
చిందుల్లో చిన్నారీ కన్నయ్యవో
చిగురు కొమ్మ కోకిలమ్మ
పూలరెమ్మా కులుకులమ్మా
ఈ కొమ్మ నా సొమ్మురో
ఈ బొమ్మ పై డమ్మరో -

నేరేళ్ల తోటుందిలే సీకట్ల పాటుందిలే
నీ కళ్ల తోడుందిలే నా ఒళో సోటుందిలే
చిన్నదిలే నడుము సన్నదిలే

ఉన్నాదిలే ఉడుకుతున్నదిలే
ఉడికించి ఊరించి రమ్మన్నాడే
వచ్చాక నచ్చింది ఇమ్మన్నాడే
విచ్చుకున్న ముద్దు గుమ్మ
మెచ్చుకున్న పిచ్చిదమ్మ
ఈ బొమ్మ సీతమ్మరో
నా సొమ్ము రావయ్యరో



జంతర్ మంతర్ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మాలకడి దుమ్మురేగాలి
ఓసూపు సూడాలి నీ అంతు తేలాలి
కిటుకులు సెప్పమ్మా సిటికెలసిటెమ్మా

దాసిందీ ఎన్నాళ్లు దాగుంటది – అది
కళ్లున్న మొనగాడి కంటపడతది

నీ కంట పడ్డాక నీ ఎంటే వస్తాది, – అది.
వద్దన్నా ముద్దన్నా నీ జంటే అవుతాది
తీ గట్టి లాగితే డొంకూగి పోతాది
ఏ గట్టుకెళ్ళినా నీరట్టే వుంటాది
సనుగుడు సంగయ్యా గొణుగుడు పాలయ్యా
అ గజిబిజి గంగమ్మా - గడిబిడి చెయ్యకమ్మా
తోడుంటే యాడైనా గూడుంటది
ఆ గూడేమో మనకోసం కాసుకుంటది
ఈ పూటే ఎడదామా మాపంతా వుందామా
కుదిరొస్తే ఆగూడే సొంతంగా కొందామా
సెయ్యెట్టి లాగితే గాజూడి పోతాది
చేసేది సెబితే సీకాకు పుడతాది
నసనస నరసమ్మా నకరాలాడొద్దమ్మా
నిరనిర ఈరయ్యా నికరం సేయవయ్యా




వంటచేసి చూపిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజ 

వంట చేసి చూపిస్తా - పీట వేసి తినిపిస్తా
అడాళ్ల కంటే మగాళ్ల వంటే అబ్బో గొప్పది అనిపిస్తా
వంకాయ కూర, బెండకాయ పులుసు తోటకూర పప్పు
ఏది కావాలి చెప్పు ఏమి చేయాలి?
వంకాయ కూర చెయ్ బాబూ చూద్దాం....
తే తే తేతే కత్తి పీట - ఇదిగో ఇదిగో కత్తి పీట

కత్తి పీట తోటి వంకాయ కోసి ముక్కలన్ని గిన్నెలో వేసుకో
కుళాయి నీళ్లతో సుబ్బరంగ కడిగీ కండెక్కకుండా చూసుకో
పాయ్యి మీద పెట్టాలి – కింద మంట పెట్టాలి
ఆ తర్వాత ....?
చెప్తా - గ గ గ గ గరం మసాలా

మ మ మ మ మంచినూనే 
మ మ మ మ మపదపపా
కలబోసేసి కలబెట్టీసి దోర దోరగా వేపుకో
మాడకుండా చూసుకో -

ఓం నలాయ నమః ఓం భీమాయ నమః
ఓం వంటాయ మమః ఓం కూరాయ నమః
ఇదిగో వంకాయ కూర 
ఆహా

చారు కావాలి పప్పుచారు కావాలి
తే తే తే తే కందిపప్పు
ఇదిగో ఇదిగో కందిపప్పు
పప్పులోని రాళ్లు తీసి నీళ్లలోన పోలెడేసి
ఉడకేస్తే అప్పుడది ముద్దపప్పు
చింతపండు పిసికేసి పప్పు కాస్త కలిపేసి
కుత కుత లాడేట్టు మరగబెట్టు 
ఉప్పు చూసి వేయాలి  పసుపు కాస్త కలపాలి
ఆ తర్వాత ....?

ప ప ప ప పచ్చి మిరపకాయ 
గ గ గ గ గపగరి గాగా
ఉ ఉ ఉ ఉ ఉల్లిపాయ 
మ మ మ మ మపదపపా
గారిమగా గపగా   మపదా దనిసా 
సానీదప మగరిస బాబూ 
కొత్తిమిరి వేసి తాళింపు వేసి మూత పెట్టి కాసుకో
పొంగకుండా చూసుకో 
ఓం నలాయనమః ఓం భీమాయ నమః
ఓం పప్పాయ నమః ఓం చారాయ నమః




ఓ నవ మధన పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కానుక (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఓ నవ మదనా రారా నా ప్రియ వదనా రారా
సుమతరా మధుకరా- కళాసాగరా రాగసుధాకర రారా ॥ఓ వన ॥

నా నులివెచ్చని తొలి ఊపిరివి నా సుతిమెత్తని రసమాధురివి
నీ రంగులలో శృంగారాన్నీ శృంగారంలో సంగీతాన్ని
చిత్తంలో చిత్రంగా చిత్రంలో చైత్రంగా
రావే సురగంగా - రా సరళంగా
గంగాభంగ మృదంగరవంగా - భృంగీ భృంగ అభంగ స్వరంగా
ఓ ఋతు సుందరి, రావే, నా సుమ మంజరి రావే
రస ఝరీ, మాదురీ
నయన మనోహరి నటన మయూరీ రావే ఆమె ॥ఓ నవ॥

నా వాణి వీణవు కావా నా బాణికి రాణిగరావా
హా ప్రేయసి ఊర్వశి కానా
నీ వాసికి దాసిగ రావా  ||నీ ప్రేయసి||

పలుకు పలుకులో వెణుకు వెణుకుతో
మినుకు మినుకులై పోమా
సానిసగా - గారిగపా
పామపసా - సానిసగా
గారిమ గరిసా సానిని పనిదస సామదసమగిరి గారిమ గరిసా
నా అంగ అంగమొక అసంగ రంగము
సాససగాగగ మామమమా
ఈ యవ్వన మొక క్షణ భంగురము
ససస నినిని దదద మమమ
ఈ అమని యామిని నీసిగ చండుగ
మదనిస నిసనిద మదమా
నీ కన్నుల నిండుగ కాముని పండుగ
మద మద దనిదమ దనిదమ దనిసా
ప్రియసఖీ శశిముఖీ నవరతీ మధుమతీ
నేనే ....  -  ఆ....
ప్రణయ కావ్యమై - కావ్య నాం
విరహ గీతికై - అపరి మేనకై
నిను వరించి చెలించి నీవై మోహము మించి
నాలో తాపము పెంచి నన్నే నీకర్పించి
కర్పూరాన్నై కరిగి పోనీ
కన్నెను నేటితో సతినై పోనీ
నా ఈ జన్మము ధన్యము కానీ
అన్యము లేదని ఐక్యము కానీ

Palli Balakrishna Saturday, August 28, 2021

Most Recent

Default