చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, శ్రీదేవి, జయసుధ, రాధిక
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: యు. సూర్యనారాయణ రాజు
విడుదల తేది: 1982
తం తననం తం తననం
తం తననం తం తననం
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో
తం తననం తం తననం
తం తననం తం తననం
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో
తం తననం తం తననం
తం తననం తం తననం
ముద్దుగా పుట్టాను పొదలలో పువ్వులాగా
దిద్దితే ఎదిగాను పలకలో రాతలాగా
అల్లరిగా జల్లులుగా కదిలావు ఏరులాగా
ఒంపులుగా సొంపులుగా కులికావు ఈడురాగా
ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా
తోడైనవాడితో కలిసిపోగా హా..
ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా
తోడైనవాడితో కలిసిపోగా
గలగలలుగ కిలకిలలుగ
తొలికలలుగ వడి సెలలుగ
గలగలలుగ కిలకిలలుగ
తొలికలలుగ వడి సెలలుగ
ఉరికాను నిన్ను చేరగా
తం తననం తం తననం
తం తననం తం తననం
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
మొక్కువై ముడుపువై ఉన్నావు ఇన్నినాళ్ళు
మక్కువై మనసువై తీర్చుకో మొక్కుబళ్ళు
మేలుకొని కాచుకొని వెయ్యైనవి రెండు కళ్ళు
చేరుకొని ఆనుకొని నడవాలి కాళ్ళు కాళ్ళు
చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
చెరిసగముగ సరిసమముగ
చిరుజగముగ చిరునగవుగ
చెరిసగముగ సరిసమముగ
చిరుజగముగ చిరునగవుగ
చేద్దాము కాపురాలు
తం తననం తం తననం
తం తననం తం తననం
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో
తం తననం తం తననం
తం తననం తం తననం
********* ********* **********
చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గాత్రం: బాలు, సుశీల
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను
ఏమనుకోను నిన్నేమనుకోను
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
తోడనుకో నీవాడనుకో
తోడనుకో నీవాడనుకో
నేనేంటి నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
నీకేంటి నువు చేసిన తప్పేంటి
ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
అది కథే కదా
మన కథ నిజం కాదా
అది కథే కదా
మన కథ నిజం కాదా
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీవాడనుకో
ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్లు
నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
అది నువ్వే కదా
నేనూ నువ్వే కాదా
అది నువ్వే కదా
నేనూ నువ్వే కాదా
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
ఏమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీవాడనుకో
******** ******** ********
చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా
వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా
చరణం: 1
చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు
చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు
చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు
చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు
నా ఆశకు రూపం నీవై.. నా ఆశయదీపం నీవై
నా ఆశకు రూపం నీవై.. నా ఆశయదీపం నీవై
నీవు నేను మనమౌదాం.. నీవు నేను మనమౌదాం
మనమే మనకొక మతమౌదాం
వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా
చరణం: 2
జీవంపోసే రాగంకోసం వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను
జీవం పోసే రాగం కోసం వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను
ఈ మమతకు శృతినే నేను.. ఈ నడతకు లయనే నేను
ఈ మమతకు శృతినే నేను.. ఈ నడతకు లయనే నేను
నేను నేనను ఇద్దరము.. నేను నేనను ఇద్దరము
నిన్న రేపటి సంగమము
వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా