చిత్రం: నువ్వే నువ్వే (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దేవన్, కోటి, త్రివిక్రమ్, అనురాధ శ్రీరాం
సాకి:
పాపం రో పాపాయి రో కోపమొద్దు బాసు..
ఈస్టుకు వెస్టుకి తేడా తెలియని ఇన్నోసెంట్ పేస్
తప్పదుగా నెమ్మదిగా తీసుకోరా క్లాస్
ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్స్
పల్లవి:
కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్
ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ..ఎలాగూ తప్పని నూసెన్సు
కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ..
తెలీదంటె తప్పే మిస్సూ..వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు
టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి..
మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి
ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ..
That’s the way ..we like it
That’s the way ..we like it
That’s the way ..we like it
That’s the way ..we like it
కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్
ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ..ఎలాగూ తప్పని నూసెన్సు
చరణం: 1
ఐస్క్రీంలు గట్రా తింటూ హై స్పీడ్లో లావైపోకు
డైటింగ్ పాటిస్తూ స్లిం గా వుండు
బోండంలా వున్నావ్ పండు నీ బోడీ చూస్కో ముందు
నీక్కూడ కావాలా గర్ల్ ఫ్రెండు….
నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డిబేట్ మానెయ్యాలి
మగాళ్ళ పనులను మహాబ్ధుతం అని పదే పదే పొగడాలి
ప్రతీ దినం మాకోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి
దిల్దే సనం అంటూ మమ్మల్ని దీనంగ బ్రతిమాలాలి
ఆ బెట్టు కాస్త తగ్గాలి మా పట్టుదలే నెగ్గాలి
మా కంటి చూపుకే భయపడుతూ కంట్రోల్లో వుండాలి
That’s the way ..we like it
That’s the way ..we like it
కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్
ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ..ఎలాగూ తప్పని నూసెన్సు
చరణం: 2
గన్నీ బేగ్ అనిపించేలా చున్నీతో చుట్టేయ్యాలా
కాస్తైన డ్రెస్సింగ్ సెన్స్ వుండాలి
ఫన్నీగా కనిపించేల నున్నంగా షేవింగేల
కొంచెం రఫ్ మేన్లీనెస్ ఉండాలి
ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతీ డెసిషన్ మాది
సరే సరే అని ఫాలో అయ్యే డిసిప్లిన్ ఒకటే మీది
సరేలే పోని సరదా పడనీ అనేంత సహనం మాది
మరీ ఇలా శృతి మించారంటే కధంతా చెడిపోతుంది
మీరుడుక్కుంటే చూడాలి మా హుషారు చెలరేగాలి
మీరేడుస్తుంటే ఓదార్చే అవకాశం కావాలి
That’s the way ..we like it
That’s the way ..we like it
కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్
ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ ఎలాగూ తప్పని నూసెన్సు
కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ
తెలీదంటె తప్పే మిస్సూ వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు
టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి
మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి
ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ
Naa Manasukemayyindi Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)
'Naa Manasukemayyindi' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by Udit Narayan and Nitya Santoshini.
చిత్రం: నువ్వే నువ్వే (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని
పల్లవి;
అర్రెర్రె ర్రెర్రె రేరే.. అర్రెర్రె ర్రెర్రె రేరే..
నా మనసుకేవయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
మన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది
నా మనసుకేవయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
చరణం: 1
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని
నా మనసుకేవయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
చరణం: 2
ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ
ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ
ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటె ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటె ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని
నా మనసుకేవయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
మన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది
Nuvve Nuvve Kavalantundi Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)
'Nuvve Nuvve Kavalantundi' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by K. S. Chithra.
చిత్రం: నువ్వే నువ్వే (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.యస్. చిత్ర
పల్లవి:
ఏ చోట ఉన్నా ఉన్నా ఉన్నా
నీ వెంట లేన లేన లేన
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా నీ వెంట లేన
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే
చరణం: 1
నేల వైపు చూసే నేరం చేశావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ భందిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా ఆ ఆ
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
చరణం: 2
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటేలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా ఆ ఆ
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా నీ వెంట లేన
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే
I Am Very Sorry Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)
'I Am Very Sorry' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by KK.
చిత్రం: నువ్వే నువ్వే (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్
పల్లవి:
చెలియా నీవైపే వస్తున్నా
కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చరణం: 1
ఓ అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమనీ జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చరణం: 2
ఓ నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ బాధని
నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ బాధని
ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
తానేన తన తాన నన తాన నన
తానేన తన తాన నన నా
ఓ ఓ ఓ తన నన నా తన నన నా
Ammai Nachesindi Song Lyrics in Telugu – Nuvve Nuvve (2002)
'Ammai Nachesindi' song from Nuvve Nuvve (2002) movie is composed by Koti and sung by Rajesh Krishnan and Kousalya.
Special Note :
వీడియో సాంగ్ లో చరణం: 2 లో ఈ లైన్ లేదు గమనించగలరు కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
చిత్రం: నువ్వే నువ్వే (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ కృష్ణన్, కౌశల్య
పల్లవి:
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ
వైశాఖ మొచ్చేసింది ఇవ్వాళ రేపో అంది
ఓ మంచి మూర్తం చూసి సిద్ధం కమ్మందీ
ఓ...ఓ...ఓ...
ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరీ కునుకే చెదిరి
మురిపెం ముదిరి నా మనసు నిలవనందీ
కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ
చరణం: 1
ఈ గాలి రోజూలా వీస్తున్నా ఈ వేల వేరేలా వింటున్నా సన్నాయి రాగాలుగా
నావైపు రోజూలా చూస్తున్నా ఈనాడు ఏదోలా అవుతున్న నీ కన్ను ఏమన్నదో
ఓ...నా ఈడు ఏం విన్నదో
ఆశ పెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా
నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎట్టా
ఎన్నెన్నొ అంటించి ఉక్కిరి బిక్కిరి అవుతున్నా
కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ
చరణం: 2
ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగా
అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ళ కౌగిల్లే అందించీ ఊరించు ఆ వేడుక
ఓ... ఊహించనీ నన్నిలా
ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చ గొట్టేలా నువ్వూ
ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తొందే నువ్వూ హోయ్
కవ్వించి కరిగించి కరిగే వయసుని కాపాడు
కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యింది
ఓ...ఓ...ఓ...ఈ కబురు విన్న ఎదలో
ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరీ కునుకే చెదిరి
మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా
గమనిక: వీడియో సాంగ్ లో ఈ లైన్ లేదు గమనించగలరు (కొమ్మల్లో చిలకా మోమాట పడక వచ్చి వాలమ్మా)