-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non-Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bommarillu (2006) Telugu Songs Lyrics Album Cover

Bommarillu (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Bommarillu (2006)
Director : Bhaskar
Producer : Dil Raju
Actors : Siddharth
Actresses : Genelia D'Souza
Supporting Cast : Prakash Raj
Release Date : 9 August 2006

We Have A Romeo Song Lyrics in Telugu – Bommarillu (2006)

'We Have A Romeo' song from Bommarillu (2006) movie is composed by Devi Sri Prasad and sung by Ranjith and Andrea Jeremiah.

SONG INFORMATION
Movie : Bommarillu (2006)
చిత్రం: బొమ్మరిల్లు (2006) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్, Andrea Jeremiah గానం: Ranjith, Andrea Jeremiah Rap: We have a Romeo, we need a Juliet Yo yo yo, we have a Romeo All that we need is a Juliet Yo yo yo, we have a Romeo All that we need is a Juliet పల్లవి: హే పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందొ వెతుకుదాం పదరా మన వాడి చిలిపి లైఫ్ మెట్ ఎక్కడ వున్నా కలుపుదాం కులమేదైనా ఫికర్ లేదు కల ఉంటె సరే మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే సినీ తారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవరో We have a Romeo, we need a Juliet. We have a Romeo, we need a Juliet హే పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందొ వెతుకుదాం Yo yo yo, we have a Romeo All that we need is a Juliet Yo yo yo, we have a Romeo All that we need is a Juliet చరణం: 1 చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరీ ఎందుకురా సెల్ ఫోన్ సొగసరి ఇదిగోరా ఎప్పుడూ ఎంగేజ్ రా టీవీ యాంకర్ దెఖోరా ఆ వంకర భాషకు దండంరా టాటా గారి భేటీ రా అది రూపీ అందం రా ఎం కావాలో ఓ తనలో క్వాలిటీ ఓ ఇంకా నీలో ఓ లేదోయ్ క్లారిటీ ఓ తేల్చేలోగా వయసవుతుంది కన్నిసం నూటొక్కటీ We have a Romeo, we need a Juliet. We have a Romeo, we need a Juliet హే పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందొ వెతుకుదాం వెతుకుదాం పదరా మన వాడి చిలిపి లైఫ్ మాటే ఎక్కడ వున్నా కలుపుదాం I can give you a reason To stay if you can see in me Your life, your dreams. Please don't walk away. Can't you see what you're leaving behind? చరణం: 2 అందరు గమనిస్తూవుంటే ఏమండి అని పిలవాలి ఎవ్వరు పక్కన లేకుంటే ఎరా అనాలి అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి అలసట గాని వస్తుంటే తలనే నివరాలి కొంచం కోపం ఓ కొంచం జాలి ఓ కొంచం స్వార్ధం ఓ కలిసుండాలి ఓ నన్నేనాకు కొత్తగా చూపే యువరాణే కావాలి We have a Romeo, we need a Juliet. We have a Romeo, we need a Juliet పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందొ వెతుకుదాం వెతుకుదాం పదరా మన వాడి చిలిపి లైఫ్ మాటే ఎక్కడ వున్నా కలుపుదాం కలుపుదాం Yo, yo, yo, we have a Romeo All that we need is a Juliet Yo, yo, yo, we have a Romeo All that we need is a Juliet

Bommani Geesthe Song Lyrics in Telugu – Bommarillu (2006)

'Bommani Geesthe' song from Bommarillu (2006) movie is composed by Devi Sri Prasad and sung by Gopika Poornima and Jeans Srinivas.

SONG INFORMATION
Movie : Bommarillu (2006)
Lyricist : Bhaskarabhatla
చిత్రం: బొమ్మరిల్లు (2006) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పల్లవి: బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది హే...హే...హే...హే... హే...హే...హే...హే... చరణం: 1 చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది చరణం: 2 అందంగా ఉంది తన వెంటే పదిమంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది నా మనసు యెన్నో కలలే కంటుంది బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ..ఆ.. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ..ఆ... దాని మనసే నీలో ఉందంది...ఆ...ఆ.. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....ఆ...ఆ..

Kaani Ippudu Song Lyrics in Telugu – Bommarillu (2006)

'Kaani Ippudu' song from Bommarillu (2006) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.

SONG INFORMATION
Movie : Bommarillu (2006)
Lyricist : Bhaskarabhatla
Singers : Devi Sri Prasad
చిత్రం: బొమ్మరిల్లు (2006) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: దేవి శ్రీ ప్రసాద్ పల్లవి: కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ ప్రేమకోసం ఏకంగా తాజ్మహలే కట్టాడు షాజహానికి పనిలేదా అనుకున్నాను ప్రేమకన్నా లోకంలో గొప్పదేది లోకంలో లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను ఓహ్ ఓహ్ ఓహ్ అరేయ్ ఇంతలో ఏదేదో జరిగిందిరో ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ చరణం: 1 ప్రేయసి ఊహల్లో లైఫ్ అంత గడిపేస్తూ అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ గాలిలోన రాతలు రాస్తే మాయరోగం అనుకున్నా మాటిమాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను ఓహ్ ఓహ్ ఓహ్ అది ప్రేమని ఈరొజేఏ తెలిసిందిరో ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ చరణం: 2 ఓఓఓ చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై తికమక పెట్టేదొకటుందంటే నమ్మనేలేదు కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ నీకోసం పుట్టీ నీకోసం పెరిగే హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడినే ఎందుకు మిస్ అయ్యాను ఓహ్ ఓహ్ ఓహ్ ఈ రోజుల ఏ రోజు అవలేదురో ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

Laloo Darwaja Song Lyrics in Telugu – Bommarillu (2006)

'Laloo Darwaja' song from Bommarillu (2006) movie is composed by Devi Sri Prasad and sung by Naveen, Murali and Priya Prakash.

SONG INFORMATION
Movie : Bommarillu (2006)
Lyricist : Kulasekhar
చిత్రం: బొమ్మరిల్లు (2006) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: కులశేఖర్ గానం: నవీన్, మురళి, ప్రియ ప్రకాష్ పల్లవి: హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైన ఈ ప్రేమ గాద లొకటే ఊరువాడ లేవైనా గోవిందా గోవిందా ఏమైనా బాగుందా ప్రేమిస్తే పెద్దోలంతా తప్పులెంచుతారా గోపాలా గోపాలా ఏందయ్యో ఈ గోల ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా అయితే ఇప్పుడు ఏమిటంటారురా లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా చరణం: 1 కన్ననాడు అడిగామా పెంచటానికడిగామా గోరుముద్దలు పాలబువ్వలు అడిగి పెట్టినామా మేముకాదు అన్నామా వేలుఎత్తి చూపామ కమ్మనైన మీ కన్నప్రేమలో వంకలేతుకుతామా అంత గౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తురామా పాతికేళ్ళిలా పెంచారంటూ తాళికట్టి పోమా వంద ఏళ్ళ మా జీవితాలకు శిక్ష వేసుకోమ అందుకే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా వేణుగాన లోల వేగముగా రారా నిలిచెను ఈ రాధా నీ కోసమే వెన్నదొంగ రారా ఆలసించవేల పలికెను నోరార నీ నామమే పొన్న చెట్టు నీడలోన కన్నెరాధా వేచి వుంది కన్నెరాధా గుండెలోన చిన్నిఆశ దాగివుంది చిన్నిఆశ దాగివుంది చరణం: 2 అరెరెరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు ఈడువేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకర్ వేస్తారు ప్రేమ జంటని పెద్దమనసుతో మీరు మెచ్చుకోరు ఎంత చెప్పిన మొండి వైఖరి అసలు మార్చుకోరు ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

Nammaka Thappani Song Lyrics in Telugu – Bommarillu (2006)

'Nammaka Thappani' song from Bommarillu (2006) movie is composed by Devi Sri Prasad and sung by Sagar and Sumangali.

SONG INFORMATION
Movie : Bommarillu (2006)
Singers : Sagar, Sumangali
చిత్రం: బొమ్మరిల్లు (2006) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్, సుమంగళి పల్లవి: నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఓఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపుల నొదిలేనా ఓఓఓ ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన ఓఓఓ కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే ఐనా ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఓఓ చరణం: 1 ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా తడికనులతో నినువెతికేది ఎలా... నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఓఓ చరణం: 2 నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలివరమా... నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఓఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపుల నొదిలేనా ఓఓఓ

Appudo Ippudo Song Lyrics in Telugu – Bommarillu (2006)

'Appudo Ippudo' song from Bommarillu (2006) movie is composed by Devi Sri Prasad and sung by Siddharth.

SONG INFORMATION
Movie : Bommarillu (2006)
Singers : Siddharth
Special Note : ఈ movie లోని Appudo Ippudo పాటని Hero సిద్దార్ధ్ స్వయంగా పాడారు.
చిత్రం: బొమ్మరిల్లు (2006) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్, కులశేఖర్ గానం: సిద్దార్ధ్ పనినిసస కోరస్: నిసస నిసస నిసస గరిగమ పమగరి సని సని ప గమపనిని కోరస్: పనిని పనిని పనిని పప పప రిరి రిరి నిని నిని ద గరిగమగ నిస నిగరి సనిస నిస గరిస నిస నినిప నిస గరిస పమపమ గరిస అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కధలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ చరణం: 1 తీపికన్న ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయికన్నా ఎంతోహాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో వుందని అంటానే అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ పనినిసస పనినిసస పనినిసస గరి సరిమ గమపనిని గమపనిని గమపనిని సని దపమ గరిగమగ నిస నిగరి సనిస చరణం: 2 నన్నునేనే చాలతిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే నన్నునేనే బాగామెచ్చుకుంటా ఏదో చిన్నమాటే నువ్వునాతో మాటాడావంటే నాతోనే నేనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ పనినిసస పనినిసస పనినిసస గరి సరిమ గమపనిని గమపనిని గమపనిని సని దపమ గరిగమగ నిస నిగరి సనిస

Most Recent

Default