Tagore (2003) Telugu Songs Lyrics
MOVIE DETAILS
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Starring : Chiranjeevi, Shriya Saran, Jyothika
Director : V. V. Vinayak
Producers : B. Madhu
Release Date : 24 September 2003
Songs List (6 Songs)
01. Koditey Kottali Lyrics 02. Nenu Saitham Lyrics 03. Manmadha Manmadha Lyrics 04. Vaanochchenante Lyrics 05. Chinnaga Chinnaga Lyrics 06. Gappu Chippu LyricsKoditey Kottali Song Lyrics in Telugu – Tagore (2003)
‘Koditey Kottali’ song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by Shankar Mahadevan.
SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
Singers : Shankar Mahadevan
చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్
పల్లవి:
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి
ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి
ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి
బాటేదైనా మునుముందుకెళ్ళాలి
పోటి ఉన్నాగాని గెలుపొంది తీరాలి
ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి
చిందే వెయ్యాలి నటరాజులాగా
నవ్వే చిందాలి నెలరాజులా
మనమే ఉండాలి మహరాజులాగా
ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్ని
కొడితే కొట్టాలిరా six కొట్టాలి
ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి
చరణం: 1
చేయి ఉంది నీకు చేయి కలిపేటందుకే
చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే
ఆరాటం నీకుంది ఏం పనైనా చేయ్యడానికే
అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే
ఈ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే
సేచే కస్టాన్ని నువ్వే చెయ్యాలి
పొందే ఫలాన్ని పంచివ్వాలి
అందరి సుఖాన్ని నువ్వే చూడాలి
ఆ విధి రాతని చెమటతోనే చెరిపేయాలి
చరణం: 2
పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
అరె చిన్నవాళ్ళ నెపుడూ ఆశీర్వదించరా
లేనివాళ్ళ నెపుడూ నువు ఆదరించరా
ప్రతిభ ఉన్నవాళ్ళ నెపుడూ
నువు ప్రోత్సహించరా
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తృంచేయరా
ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
రక్తం పంచిన బంధం మీరు
చుట్టు నిలిచిన చుట్టాలే మీరు
నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి
ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి
బాటేదైనా మునుముందుకెళ్ళాలి
పోటి ఉన్నాగాని గెలుపొంది తీరాలి
ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి
చిందే వెయ్యాలి నటరాజులాగా
నవ్వే చిందాలి నెలరాజులా
మనమే ఉండాలి మహరాజులాగా
ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్ని
Nenu Saitham Song Lyrics in Telugu – Tagore (2003)
‘Nenu Saitham’ song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam.
SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Suddala Ashok Teja
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు
వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్నిశిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన
పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా
మన్నెంవీరుడు రామరాజు ధను: శ్శంఖారానివా
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
Manmadha Manmadha Song Lyrics in Telugu – Tagore (2003)
‘Manmadha Manmadha’ song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by Mallikarjun, Mahalakshmi Iyer.
SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Veturi
Singers : Mallikarjun, Mahalakshmi Iyer
చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్
మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా
ఇచ్చుకో మనసారా
ఏ.. జాంగిరీ పొంగులా జగదాంబా
ఇచ్చుకో సొగసారా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
చరణం: 1
ఎంత దాహం ఓ మన్మధా
ఎంగిలైనా తేనే కదా
పూల వయసు ఓ తుమ్మెదా
ఘాటు పడ్డా తీపే కదా
వాలేదా ఇలా మీదా సఖీ రాధా
రారాదా దా దా దా దయే రాదా
ప్రియం కాదా నా మీదా
ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా
హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
చరణం: 2
ఆకలేసి సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా
సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా
రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా
ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా
చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా
ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా
జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా
Vaanochchenante Song Lyrics in Telugu – Tagore (2003)
‘Vaanochchenante’ song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by Udit Narayan, Shreya Ghoshal.
SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Bhuvana Chandra
Singers : Udit Narayan, Shreya Ghoshal
చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్
పల్లవి:
వానొచ్చేనంటే వరదొస్తాది
వయసొచ్చేనంటే వలపొస్తాది
వానొచ్చేనంటే వరదొస్తాది
వయసొచ్చేనంటే వలపొస్తాది
డం డం డిగా డిగా ఎదలో ఏదో సెగ
రానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా
కస్సుమందొయ్ కనకాంబరం
ఘొల్లుమందోయ్ చీనాంబరం (2)
వానొచ్చేనంటే వరదొస్తాది
వయసొచ్చేనంటే వలపొస్తాది
వానొచ్చేనంటే వరదొస్తాది
వయసొచ్చేనంటే వలపొస్తాది
నువ్వు రెడి రెడి నేను రెడి రెడి
కింద పడి పడి చేద్దాం హడావిడి
కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాబరం
కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాబరం
చరణం: 1
మెరుపొచ్చినా మైమరపొచ్చినా
దుప్పట్లో దూరమంటాడే
వానొచ్చినా నెరజాణొచ్చినా
అంతటితో ఆగదంటారే
కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో
ముచ్చట్లు కూడదంటావరే
ఊరించినా తనువుప్పొంగినా
కుంపట్లు ఆరవంటారే
ముదుకొస్తే మురిపించనా
అందమంతా అర్పించనా
ముదుకొస్తే మురిపించనా
అందమంతా అర్పించనా
వానొచ్చేనంటే వరదొస్తాది
వయసొచ్చేనంటే వలపొస్తాది
వానొచ్చేనంటే వరదొస్తాది
వయసొచ్చేనంటే వలపొస్తాది
చరణం: 2
శోధించనా పరి శోధించనా
ఒంపుల్ని హరిచందనా
చేయించనా గురు చేయించనా
పరువాల పారాయణా
సాగించనా కొనసాగించనా
మృదువైన మదనార్చనా
చేసేయనా ప్రియా చేసేయనా
సందిట్లో ఆత్మార్పణ
రావే రావే మోనాలిసా
రెచ్చినాదే ఏదో నిషా
రావే రావే మోనాలిసా
రెచ్చినాదే ఏదో నిషా
వానొచ్చేనంటే వరదొస్తాది
వయసొచ్చేనంటే వలపొస్తాది
వానొచ్చేనంటే వరదొస్తాది
వయసొచ్చేనంటే వలపొస్తాది
డం డం డిగా డిగా ఎదలో ఏదో సెగ
రానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా
కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాబరం
కస్సుమందొయ్ కనకాంబరం
ఘొల్లుమందోయ్ చీనాంబరం
Chinnaga Chinnaga Song Lyrics in Telugu – Tagore (2003)
‘Chinnaga Chinnaga’ song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by K. S. Chithra, Hariharan.
SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
Singers : K. S. Chithra, Hariharan
చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. ఎస్. చిత్ర, హరిహరన్
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా వోటు
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
మెల్లగ మెల్లగ మెల్లగ
మరు మల్లెలు మబ్బులు జల్లుగా
ముని మాపులలో వేసేయ్ నీ వోటు
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు
నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే
నీ గుండెలకే వేస్తా నా వోటు
గుడి హారతినై వేస్తా ఆ వోటు
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా వోటు
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
చరణం: 1
అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి
అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి
ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి
నా వలపు కిరీటం తలపైనే ధరించు
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
నీ చినుకులకే వేస్తా నా వోటు
నా చెమటలతో వేస్తా ఆ వోటు
చరణం: 2
నా సుకుమారం నీకో సింహాసనం గా
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా
నీ నయగారం నాకో ధనాగారం గా
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది
ఆ పాల పుంతని వలవేసీ వరించే
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే
నీ రసికతకే వేస్తా నా వోటు
నా అలసటతో వేస్తా ఆ వోటు
Gappu Chippu Song Lyrics in Telugu – Tagore (2003)
‘Gappu Chippu’ song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by K. S. Chithra, Mano.
SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Suddala Ashok Teja
Singers : K. S. Chithra, Mano
చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కె. ఎస్. చిత్ర, మనో
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలోని చంద్రుడే నీకు పూలెడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
నువ్వు కానరాక పోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చెనంటే కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత హెచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ
ఇంత అంత కాదు దిని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై పల్లవి పూలు జల్లుడు
నీ పక్కలోన గుండె తొని గుండె అల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గొరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా ఒంపుగా పలకరిస్తడు
అమ్మొ ఎన్ని కళలు ఉన్నవయ్య నీకు పిల్లడు
ఇప్పుడిప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలోని చంద్రుడే నీకు పూలెడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
ఎప్పుడెప్పుడు