-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Jyothika"



చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
నటీనటులు: సూర్య, రవిష, విజయన్, ప్రకాష్ రాజ్ 
దర్శకత్వం: జ్ఞానవేల్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య,
విడుదల తేది: 02.11.2021



Songs List:



పవర్ పాట సాహిత్యం

 
చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
సాహిత్యం: శరత్ సంతోష్
గానం: రాహుల్ నంబియార్ , అరివు 

పవర్ 




అడవితల్లి బిడ్డలు పాట సాహిత్యం

 

చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
సాహిత్యం: శరత్ సంతోష్
గానం: రాహుల్ నంబియార్ , అరివు 

అడవితల్లి బిడ్డలు 



నీడ కాసింత కనబడదే పాట సాహిత్యం

 
చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
సాహిత్యం: శరత్ సంతోష్
గానం: రాహుల్ నంబియార్ 

నీడ కాసింత కనబడదే 




బొండుమల్లెలా పాట సాహిత్యం

 
చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
సాహిత్యం: నరసింహన్ వురుపుటూర్ 
గానం: అనంతు, కళ్యాణి నయ్యర్ , నరసింహన్ వురుపుటూర్ 

బొండుమల్లెలా 



చిరుగాలి నీతోడై ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
సాహిత్యం: నరసింహన్ వురుపుటూర్ 
గానం: శ్రీకాంత్ హరిహరన్ 

చిరుగాలి నీతోడై ఉంది ముందడుగేయ్




మట్టిలో తేమ ఉందీ పాట సాహిత్యం

 
చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
సాహిత్యం: శరత్ సంతోష్
గానం: లలిత సుధ

మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ

వెళ్ళే దారుల్లో… ఆకాశం తోడుందీ
హద్దే నీకొద్దూ… నీ నవ్వే వీడొద్దూ

మట్టిలో తేమ ఉందీ, ఈ ఈఈ
రేయికో వెన్నెలుందీ, ఈ ఈఈ

పట్టుదల నీ పడవై
దాటు పదా సాగరం
నేలతల్లి నేర్పెకదా
గుండెల్లోని ఓ నిబ్బరం

నిక్కమున్న బాటలోన
నీ పయనం నీకు జయం
ఊపిరున్న కాలమంత
ప్రేమేగా నీకు వరం

ఆశే లేనట్టీ… బ్రతుకుందా చెప్పమ్మా
నీ గుండెల్లోనే… బదులుందే చిన్నమ్మ
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ

మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ

Palli Balakrishna Friday, November 26, 2021




చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
నటీనటులు: అర్జున్ సార్జా, మీనా, జ్యోతిక, రమ్యకృష్ణ, రాజు సుందరం
దర్శకత్వం: వసంత్
నిర్మాత: వి నటరాజన్
విడుదల తేది: 15.09.2000



Songs List:



కదిలే నడిచే పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: ఉన్నిమీనన్

కదిలే నడిచే 





గాలే నా వాకిటికొచ్చె పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: ఉన్నికృష్ణన్, కవిత కృష్ణమూర్తి

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా  లవ్వే అవునా
నీవూ నిన్నెక్కడ ఉన్నావ్ గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో ఉన్నావమ్మీ ఔనా

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే
ఎంకి పాట పాడూ
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు 
గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా

ఆషాడమాసం వచ్చి... వానొస్తే నీవే దిక్కు
నీ ఓణీ గొడుగే పడతావా...
అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా...
నీ చిరు సిగ్గుల వడి తెలిసే
నేనప్పుడు మదిలో ఒదిగితే
నీ నెమ్మదిలో నా ఉనికే కనిపెడతావా...

పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
భూమికి పైన మనిషున్న వరకూ కరగదు వలపు

గాలే నా వాకిటికొచ్చె  మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే ఔనా
గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా...

చిరకాలం చిప్పల్లోన
వన్నెలు చిలికే ముత్యం వలెనే
నా వయసే తొణికసలాడినదే...
తెరచాటు నీ పరువాల తెర తీసే శోధనలో
ఎదనిండా మదనం జరిగినదే...
నే నరవిచ్చిన పువ్వైతే నులి వెచ్చని తావైనావు
ఈ పడుచమ్మను పసిమొగ్గను చేస్తావా...

కిర్రు మంచమడిగే కుర్ర దూయలంటే
సరియా సఖియా
కిర్రు మంచమడిగే కుర్ర దూయలంటే
సరియా సఖియా...
చిన్న పిల్లలై మనం కుర్ర ఆటలాడితే
వయసా వరసా

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా...

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే
ఎంకి పాట పాడూ
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే
ఎంకి పాట పాడూ....
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే
ఎంకి పాట పాడు




ఇచటే నేనిచటే పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: శంకర్ మహదేవన్ 


ఇచటే నేనిచటే




ప్రేమ ఇది నిజమేనా (జల జలమని) పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: సాధన సర్గం

ప్రేమ ఇది నిజమేనా



అయ్యో పాడు చిచ్చు పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: ఉదిత్ నారాయణ్, వసుందరా  దాస్

అయ్యో పాడు చిచ్చు

Palli Balakrishna Friday, February 5, 2021








చిత్రం: దొంగ (2019)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిన్మయి శ్రీపద
నటీనటులు: కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్
దర్శకత్వం: జీతు జోసెఫ్
నిర్మాణ సంస్థ: వియాకాం 18 మోషన్ పిక్చర్స్
విడుదల తేది: 20.12.2019

ఏనాడు పండుగే పండుగా
నీ తోడై నేనిలా ఉండగా
నీ పేరై పెదవులే పండగా
ఏ చింత చెంతకి రాదుగా

ఈ క్షణం నిజం వాస్తవం ఆహా....
పువ్వులో నన్ను తాకింది నీ ప్రేమ వైభవం 
నీ కౌగిళ్ల చలి కారగ మిన్నంటుతుంది సంబరం 
ఇదే మహావరం ఈ జన్మకే

ప్రేమ పూసింది అందాల బృందావనం
నీ గుండె గుడి చేరి మురిసింది పూజాసుమం
ఈ రాధా గుండెల్లో రాగాలు కృష్ణార్పణం
మౌన మంత్రాలు పాడింది ఆరాధానం

నిన్న మొన్నల్లో లేని సరదాలు
కానుకిచ్చావవు అంటే అదే చాలు
ఏ రేపు మాపుల్లో నిన్ను విడనంటూ
బాస చేసాయి ఎదలోని చిగురాశలు
బ్రతుకు నీకోసమే


Palli Balakrishna Saturday, January 16, 2021
Chandramukhi (2005) Telugu Songs Lyrics Album Cover

Chandramukhi (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Chandramukhi (2005)
Banner : Sivaji Productions
Music : Vidyasagar
Director : P. Vasu
Story : P. Vasu
Producers : P. Karunakara Reddy, Gavara Parthasarathi
Actresses : Jyothika, Nayanthara
Actors : Rajinikanth, Prabhu
Supporting Cast : Vadivelu, Vineeth, Vijayakumar, Sheela, Sonu Sood
Release Date : 14 April 2005

Devuda Devuda Song Lyrics in Telugu – Chandramukhi (2005)

'Devuda Devuda' song from Chandramukhi (2005) movie. Music composed by Vidyasagar and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Chandramukhi (2005)
Music : Vidyasagar
Lyricist : Bhuvana Chandra
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: చంద్రముఖి (2005) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: భువనచంద్ర గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అరె అరె అరె అరె అరె... దేవుడ దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్లు విప్పి చూడరా ఓయ్ దేవుడ దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్లు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సానపెట్టరా... రిపీటు... నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సానపెట్టరా... శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ... స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ... దేవుడ దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్లు విప్పి చూడరా చరణం: 1 ఆరె ఆరే ఆరె ఆరే... అరెరే ఆరే అరెరే ఆరే ఆలోచించు కొంచెం రైతుబిడ్డ కష్టం అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం వాడలోని మలినం శుభ్రం చేసేవారు నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు మాసిన జుట్టు పనీ పట్టె వాడంటూ లేకుంటే తగ్గుతుందా తల బరువూ నీళ్లలోనే నిలిచి ఉతికే వాడంటూ లేకుంటే నిలుచునా మన పరువూ ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్... రిపీటు... శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ... స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ... ఆ... దేవుడ దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్లు విప్పి చూడరా చరణం: 2 నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటే ఏమి ఈ చెవితోటి విన్నాగాని ఆ చెవిలోంచి వదిలేయ్ మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి పూలబంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా తేలుతుందోయ్ పైకి సోదరా అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూలబంతిలా మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమినాటి జాబిలి చల్లే పండు వెన్నెలనాపగలదా... రిపీటు... శక్తులన్నీ వచ్చి చేరుకుంటే.... ఓ ఓ ఓ... స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ... దేవుడ దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్లు విప్పి చూడరా స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సానపెట్టరా... రిపీటు... నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సానపెట్టరా... శభాషు.... శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ... స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...

Chiluka Pada Pada Song Lyrics in Telugu – Chandramukhi (2005)

'Chiluka Pada Pada' song from Chandramukhi (2005) movie. Music composed by Vidyasagar and sung by Tippu, Manikka Vinayagam, Rajalakshmee Sanjay and Ganga Sitharasu.

SONG INFORMATION
చిత్రం: చంద్రముఖి (2005) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: టిప్పు, రాజలక్ష్మి సంజయ్, మాణిక్క వినయగం, గంగ చిలకా పద పద ఓహో ఓహో..! చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పద చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పదా గాలి పటమా పదపద పదా… హంసలాగా పదపద ఆకాశమే మరి మనకిక… హద్దు కాదు పద పద పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పదా మీనాక్షి అమ్మను ప్రార్ధించి నువ్వు లేని వాళ్ళ కోసమింక పైకమివ్వు కైలాస నాధుని పూజించి తెలుగునేల తల్లి కోరుకున్న గంగనివ్వు నీకు ఎదురు లేనేలేదు నిండు చందమామలాగా ఇష్టం వచ్చినట్టు పైకి పోయింకా గాలి ఇప్పుడెమో మనకు… వీలుగానే వీస్తూ ఉంది రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా కట్టాను బ్లేడు వంటి మాంజా… నీకింకా లేదు భయమే పైకి పోయే పతమే... ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం పైకి పోయే పతమే... ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం చిలుకా పదపద... నెమలి పదపద మైనా పదపద... మనసా పదా నింగి అంచున పైన తేలే నిన్ను ఎగరవేసే వారి చెయ్యి తల్చుకోవే చుక్కల్లోనా చుక్కవైనా నీకు ఆధారంగా దారం ఉంది రెచ్చిపో మాయ లేదు మంత్రం లేదు… వేదాలేవి చదవాలేదు మోక్షం బాట తెలిసే గాలి పటమా పూజలేవి చెయ్యకున్నా నోచుకోని పుట్టినావే యోగమెవరు నేర్పినారు నీకు గుండెల్లో ఆశపుట్టి నీకే చూపిందా మనసు మార్గమే చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పదా గాలి పటమా పదపద పదా… హంసలాగా పదపద ఆకాశమే మరి మనకిక… హద్దు కాదు పద పద పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం

Andala Aakasamantha Song Lyrics in Telugu – Chandramukhi (2005)

'Andala Aakasamantha' song from Chandramukhi (2005) movie. Music composed by Vidyasagar and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Chandramukhi (2005)
Music : Vidyasagar
చిత్రం: చంద్రముఖి (2005) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి : అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మా ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మా ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మా ఈ పాట ఇచ్చింది కూడ ఈశుడే బొమ్మా ముక్కంటి పాదాలు నేను ముద్దుపెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే చరణం : 1 వాగు వంక పొంగే వానాకాలంలోన వింటావమ్మా నది పాట ఓ నది పాట మల్లే మొగ్గ బంతి బుగ్గ మీటి పాటే కట్టిదంమ్మా వని పాట ఓ వని పాట ఏయ్... చిందులు వేయించే పాట కనువిందులు కావించే పాట గుండె సంధించే పాట ఆ దివిని అందించే పాట నా పాట సవ్వడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ చరణం : 2 చిన్ని చిన్ని ఊయల కట్టి అమ్మ జోల లాలి లాలి తొలిరాగం ఓ తొలిరాగం ఆలుమగలు గుట్టుగ చేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం హే... లోకమంటే వింత అది తెలియకుంటే చింత నువ్వు నేను అంతా ఆ దేవుని ముందు ఎంత అరె అన్నీ తెలిసినవాడు ఎవడూ లేనేలేడమ్మా

Konta Kalam Song Lyrics in Telugu – Chandramukhi (2005)

'Konta Kalam' song from Chandramukhi (2005) movie. Music composed by Vidyasagar and sung by Sujatha Mohan, Madhu Balakrishnan.

SONG INFORMATION
Movie : Chandramukhi (2005)
Music : Vidyasagar
Lyricist : Vennelakanti
Singers : Sujatha Mohan , Madhu Balakrishnan
చిత్రం: చంద్రముఖి (2005) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: సుజాత మోహన్, మధు బాలకృష్ణన్ కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి చరణం: 1 గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం మదనుడికి పిలుపు మల్లె కాలం మదిలోనె నిలుపు ఎల్లకాలం చెలరేగు వలపు చెలి కాలం కలనైన తెలుపు కలకాలం తొలి గిలి కాలం కౌగిలికాలం మన కాలం ఇది... ఆ... కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి చరణం: 2 కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాము కాలం గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం తమి తీరకుండు తడి కాలం క్షణమాగనంది ఒడి కాలం కడిగింది సిగ్గు తొలికాలం మరిగింది మనసు మలి కాలం మరి సిరికాలం మగసిరి కాలం మన కాలం పదా... ఆ... కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి

Annagari Mata Song Lyrics in Telugu – Chandramukhi (2005)

'Annagari Mata' song from Chandramukhi (2005) movie. Music composed by Vidyasagar and sung by Anuradha Sriram and Karthik.

SONG INFORMATION
Movie : Chandramukhi (2005)
Music : Vidyasagar
Lyricist : Bhuvana Chandra
Singers : Anuradha Sriram, Karthik
చిత్రం: చంద్రముఖి (2005) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: భువనచంద్ర గానం: కార్తీక్, అనురాధ శ్రీరాం వర్ధిల్లండి వర్ధిల్లండి కన్నెపిల్లలారా వర్ధిల్లండి పిల్లలున్న తల్లులార సాధరంగా వినరండి వరుల గన్న పెద్దల్లార మనం మోహనంగా వినరండి సిరిమల్లె వోలె నవ్వే ముఖాలకి ఈ సూర్య రాయ వంశము ఇస్తుంది దీవెనలు జాబిల్లి వోలె విరిసే ముఖాలకి ఈ చంద్ర రాజ వంశము ఇస్తుంది దీవెనలు అరె అరె అరె అరె అరె ఆ...ఆ...అన్నగారి మాట ఆ...ఆ... చద్ది మూటరా ఆ...ఆ... అక్కరతో వింటే ఆ...ఆ... అర్థముందిరా పా..డు కొత్త పాట పాడు పా..డి అదరగొట్టరా ని..న్న గాలితోటి పోయే నే..డు బ్రతుకు మనదిర అదర గలా నగడ తీసే (4) ఆ...ఆ...అన్నగారి మాట ఆ...ఆ... చద్ది మూటరా ఆ...ఆ... అక్కరతో వింటే ఆ...ఆ... అర్థముందిరా ప్రేమకు చోటున్నది నిజము ఎదరున్నది నిండు నూరేళ్ళకి బ్రతికే బలమున్నది సిగ్గు మొగ్గల్ని కమ్మేశాకే మదిలో విరిసింది మందారం రోజు ఇకపైన నిద రే రాదు పైట జారిస్తే వయ్యారం నీ ఎదలో విషయం తెలిపిందోయ్ పరువం నా శ్వాసలతోనే రగిలిస్తా తాపం అరె కొక్కోరొక్కో పుంజే వచ్చి కోడి పక్కా నవ్విందయ్యో అదర గలా నగడ తీసే (4) ఆ...ఆ...అన్నగారి మాట ఆ...ఆ... చద్ది మూటరా ఆ...ఆ... అక్కరతో వింటే ఆ...ఆ... అర్థముందిరా ఇప్పుడు చూడు మనసు తెర తీసి వెయ్ బాణం గురిపెట్టి వెయ్ బతికే కాలం అంతా మట్టికి మర్యాద చెయ్ వేరు లేనట్టి వృక్షం ఉందా సొంత కాళ్ళే నీ సొత్తంటా నువ్ నువ్వు నిలిచాక ఊరే నీది అపుడే నీ విలువ తెలిసే నమ్మా నీ ఎదలో ఉందే ఇక జరిగేనమ్మా ఇది నాకు తెలుసూ రేపు నీదే గెలుపు అరె చోటే చూసి మాటే వెయ్యి ఆలోచించి అడుగే వెయ్యి అదర గలా నగడ తీసే (4) ఆ...ఆ...అన్నగారి మాట ఆ...ఆ... చద్ది మూటరా ఆ...ఆ... అక్కరతో వింటే ఆ...ఆ... అర్థముందిరా

Ra Ra Sarasaku Ra Ra Song Lyrics in Telugu – Chandramukhi (2005)

'Ra Ra Sarasaku Ra Ra' song from Chandramukhi (2005) movie. Music composed by Vidyasagar and sung by Binni Krishnakumar and Tippu.

SONG INFORMATION
Movie : Chandramukhi (2005)
Music : Vidyasagar
Lyricist : Bhuvana Chandra
Singers : Binni Krishnakumar, Tippu
చిత్రం: చంద్రముఖి (2005) సంగీతం: విద్యాసాగర్‌ సాహిత్యం: భువనచంద్ర గానం: బిన్ని కృష్ణ కుమార్, టిప్పు రారా సరసకు రారా రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా శ్వాసలో శ్వాసవై రారా.. తోం తోం తోం చరణం: 1 నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా తననన ధీం త ధీం త ధీంత తన వయసు జాలవోపలేదుర మరులుగొన్న చిన్నదాన్నిరా తనువు బాధ తీర్చ రావేరా రావేరా సల సల సల రగిలిన పరువపు సొదయిది తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా రా చరణం: 2 ఏ బంధవో ఇది ఏ బంధవో ఏ జన్మబంధాల సుమగంధవో ఏ స్వప్నవో ఇది ఏ స్వప్నవో నయనాల నడయాడు తొలి స్వప్నవో విరహపు వ్యధలను వినవా ఈ తడబడు తనువును కనవా మగువల మనసుల తెలిసి నీ వలపును మరచుట సులువా ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక సరసకు పిలిచితి విరసము తగదిక జిగిబిగి సొగసుల మొరవిని మిలమిల మగసిరి మెరుపుల మెరయగా రా రా రా

Palli Balakrishna Sunday, August 20, 2017


చిత్రం: మన్మధ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్. పి. బి. చరణ్
నటీనటులు: శింబు , జ్యోతిక, సింధు తులాని, మందిరా బేడి
దర్శకత్వం: ఏ. జె. మురుగన్
నిర్మాత: కె.విజయ్ భాస్కర్ రెడ్డి
విడుదల తేది: 12.11.2004

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో
ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో
సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

పూల మనసులో గాలి ఎరుగదా
నిన్ను పరిచయం చేయాలా
మేఘమాలలో మెరుపు తీగవై
నీవు పలికితే ప్రణయాలా
శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
ఒక చూపు చాలదా మనసు తోచిన జోలగా...
నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
తండ్రి నీవేఅయి పాలించు
తల్లి నీవేఅయి లాలించు
తోడు నీడవై నను నడుపు
గుండెల్లో కొలువుండే దేవి
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా...

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

నీవు తప్ప నాకెవరు లేరులే
ప్రాణమివ్వనా నీకోసం
ఆశ లాంటి నీ శ్వాస తగిలితే
బతికి ఉండదా నా ప్రాణం
నీ మోము చూడక నా కనులు వాలవే
విరహ వేళలో పగలు చీకటై పోయనే
తనుమనః ప్రాణాలన్ని నీకు నేనర్పిస్తాలే
నీ కొరకు పుడితే చాలు మళ్ళీ మళ్ళీ
చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
అది చెరిగిపోకుండా గొడుగువలే
నేనుంటే వానెంతలే…
నా చిట్టి ప్రేమా…

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో
ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో
సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా


Palli Balakrishna Friday, July 28, 2017


చిత్రం: నువ్వు నేను ప్రేమ (2006)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచన: వేటూరి
గానం: శ్రేయాఘోషల్, నరేష్ అయ్యర్
నటీనటులు: సూర్య, జ్యోతిక, భూమిక
దర్శకత్వం: యన్.కృష్ణ
నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్ రాజా
విడుదల తేది: 08.09.2006

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నీవే హృదయం అన్నదే

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
పూవైనా పుస్తున్నా ని పరువంగానే పుడతా
మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై...
నీవే నా మదిలో అడ నేనే... నే నటనై రాగా
నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే హో
తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నేనా అడిగా నన్ను నేనే
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా

నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా
తుమ్మెద తేనెలు తేలే ని మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా
నీవు సంద్రం చేరి గల గల పారే నది తెలుసా

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నీవే హృదయం అన్నదే

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు

Palli Balakrishna
Mass (2004) Telugu Songs Lyrics Album Cover

Mass (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Mass (2004)
Director : Raghava Lawrence
Producer : Nagarjuna
Actresses : Jyothika, Charmy Kaur
Release Date : 23 December 2004

Mass Song Lyrics in Telugu – Mass (2004)

'Mass' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Ravi Varma and Mano.

SONG INFORMATION
Movie : Mass (2004)
Lyricist : Sahithi
Singers : Ravi Varma, Mano
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సాహితి గానం: మనో, రవివర్మ మాస్ మమ మాస్ వెయ్ మళ్ళా  అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్  అన్న లుక్కిస్తే మాస్ మ మ మాస్ వెయ్యరా మావ  అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్  అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అద్ది లెక్క  అన్న కళ్ళేర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమి గుగ్గవుతదిరా మాస్  అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తారురా మాస్  మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంటా  మరిమాయలు చేసే ఎవడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా  అన్నా ఒక్కసారి పాడన్నా  హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగు పెడితే విజులు విజులురో హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో  నీసాటి వారి కందరికి ప్రేమ పంచరా  ఆప్రేమ కింకా ప్రాణమైనా ఫనముపెట్టరా  ఫస్టెక్కో మిత్రుడిలా ఇస్తూ వస్తా  నీకిలా దోస్తికట్టేస్తా పెద్ద మాస్ చేస్తే  మాకష్టమిలా పోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తదిరా మాస్ మంచిగా ఉంటే మంచిని పంచే మనస్సే మాసంటా  అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా  హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో  హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో సరుకురో ఛలో మలకపేట మలుపుదాకా దుమ్ముదులపరో  మట్టా చేపట్టుకొని పనినే చూపెట్టమని లొల్లేపెట్టేయ్యదురా మాస్ మాస్ మాస్  అతడు పొట్టే చేపట్టుకొని ఏదో పని పట్టుకొని కాలం నెట్టేస్తుందిరా మాస్  మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసంటా  అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా  హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో హోయ్  వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలుపెడితే పిడత పగులురో

Vaalu Kalla Vayyari Song Lyrics in Telugu – Mass (2004)

'Vaalu Kalla Vayyari' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Karthik.

SONG INFORMATION
Movie : Mass (2004)
Singers : Karthik
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్ నా... బూరెలాంటి బుగ్గ చూడు  కారు మబ్బులాంటి కురులు చూడు  వారెవా! క్యా హెయిర్ స్టైల్ యార్  అన్న... సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ  హేయ్ హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి  నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి  హో...బూరెబుగ్గ బంగారి చేపకళ్ళ చిన్నారి  బుంగమూతి ప్యారి నంగనాచి నారి లవ్వు చెయ్ ఓ సారి  హ్... నిన్ను చూసినాక ఏమైందో పోరి  వింత వింతగుంటోంది ఏవిటో ఈ స్టోరి  నువ్వు కన పడకుంటే తోచదే కుమారి  నువ్వు వస్తే మనసంతా... స రి గ మ ప గ రి  హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి  నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి  చరణం: 1  నీ హృదయంలో నాకింత చోటిస్తే  దేవతల్లే చూసుకుంట నీకు ప్రాణమైనా రాసి ఇస్తా  అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే  దీవెనల్లే మార్చుకుంట దాన్ని ప్రేమలాగ స్వీకరిస్తా  నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే  ఈ బంధం ఎప్పుడొ ఇలా పైవాడు వేసినాడులే  ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమేనని  హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి  నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి  వహ్ వ హొ వహ్ వ హొ కుర్రాడు మంచివాడుగా ఒప్పుకో  వహ్ వ హొ వహ్ వ హొ ఆరడుగుల అందగాడు ఒప్పుకో  చరణం: 2  ఈ ముద్దుగుమ్మే నా వైఫ్‌గా వస్తే...  బంతిపూల దారి వేస్తా లేతపాదమింక కందకుండా  ఆ జాబిలమ్మే నా లైఫ్‌లో కొస్తే దిష్టి తీసి హారతిస్తా ఏ పాడుకళ్ళు చూడకుండా  నాలాంటి మంచివాడిని మీరంత చూసి ఉండరే  ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే  ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతమేనని  హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి  నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి 

Indhurudu Chandurudu Song Lyrics in Telugu – Mass (2004)

'Indhurudu Chandurudu' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Kalpana Raghavendar and Ranjith.

SONG INFORMATION
Movie : Mass (2004)
Lyricist : Sahithi
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సాహితి గానం: కల్పన రాఘవేందర్, రంజిత్ ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు అందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు నువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడు మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సే గుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తే వేలికేసె మాయదారి సచ్చినోడె ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లే కరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సు ఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా మొహమాటం వదిలించి మోజంతా కాజేస్తా ఈవేళ అబ్బ ఏమి చెప్పనమ్మ సుప్పనాతి సూపులోడె పట్టు చెంగు ఒంటి నిండా కప్పుకుంటే ఊరుకోడె కందిరిగ నడుముకాడ తేనెకాటు వేసినాడె పట్టుపగలు పిట్టసోకు కొల్లగొట్టి పోకిరోడె ఓయమ్మో చిలకమ్మో చెయ్యి అయినా వేయ్యకముందే గిలిగింతా నీదుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మా ఒళ్ళంతా ఇన్నాళ్ళు ఊరించి ఈనాడే సిగ్గంటే రేగెదెలా ముద్దుల్లో ముంచెత్తి నీదోద కుచ్చిల్లే లాగాలా అయ్యోరామ ఇంతలోన ఎంతపని చేసినాడె అందులోని ఇందులోని అంతులేని పెద్దరోడే కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడే కోడికూత వేళ లోపే కొంప ఇట్టా ముంచినాడే

Kottu Kottu Kottu Song Lyrics in Telugu – Mass (2004)

'Kottu Kottu Kottu' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Tippu and Prasanna.

SONG INFORMATION
Movie : Mass (2004)
Lyricist : Sahithi
Singers : Tippu, Prasanna
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సాహితి గానం: టిప్పు, ప్రసన్న కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా (2) హెయ్... కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా  కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా  హెయ్.. ఎర్ర రంగులోన చూడు - రబ్బా రబ్బా  కుర్ర గుండె జోరు ఉంది - రబ్బారే  పచ్చరండులోన చూడు - రబ్బా రబ్బా  పడుచుకళ్ల గీర ఉంది - రబ్బారే  రంగు ఏదైనగానీ ఊరు వేరైనగానీ రారో మనమంత ఒక్కటే...  హోలి హోలి హోలి రంగుల రంగోలి  హోలి హోలి హోలి రంగుల రంగోలి నింగినేల రంగే మారాలి  హోలి హోలి హోలి రంగులోన తేలి చెమ్మకేళి జలకాలాడాలి  కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా (2) చరణం: 1  హె... కోరమీసపు రోసగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు  కొంటె కోణంగి పిల్లవే కాస్తూరుకుంటె కొంపే కొల్లేరు చేస్తవె హాయ్  అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు  అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లో జగడంటలేస్తవే... హేయ్ నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడ రావె రావె  అట్టా కయ్యాల భామ నీతో సయ్యాటలడ నీపై ఆశంటు ఒకటి ఉండాలె  ఇంద్రధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో...  హోలి హోలి హోలి...  హోలి హోలి హోలి రంగుల రంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి  హోలి హోలి హోలి రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి  కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా (2) ఓరె లచ్చన్నా రంగులన్నీ అయిపోయినాయ్ తొరగా తీసుకురండ్రా... హోయ్... హోయ్... ఆయిరే హోలి ఆయిరే ఓరబ్బా హోలి  రంగోకి వర్షా లాయిరే తా ధినక్ త ధినక్ త దినక్‌త  తధిమ్ ధినకత్ ధినక్ త ధినక్‌త ధితాంగ్ ధితాంగ్ త... క్యా బాత్ హై  చరణం: 2  కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఊసులెందుకు  నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టేయ్యడానికే... హెయ్  పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో  బంతి పూబంతి భావనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే... హెయ్  నన్నే పెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు  నిన్నే మెచ్చేటివాడు బుగ్గే గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓనాడు పండే నోములన్నీ పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే... హోయ్  హోలి హోలి హోలి...  హోలి హోలి హోలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యూలి  హోలి హోలి హోలి రంగులోన తేలి సందడంతా మనదే కావాలి  కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా  కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా 

La La Lahirey Song Lyrics in Telugu – Mass (2004)

'La La Lahirey' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Venugopal, Srirangam and Sunitha Sarathy.

SONG INFORMATION
Movie : Mass (2004)
Lyricist : Viswa
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: విశ్వా గానం: వేణు, సునీత సారధి ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే సరదాగా ఓ సారే వడికొస్తే మంజూరే గిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్మోరే అయ్యయ్యయ్యో లిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రే బాప్ షాక్ లిచ్చే షేప్ చూస్తే గుండెలే పేకప్ ల ల లాహిరే ల ల లాహిరే హే ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే చరణం: 1 సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంత అడ్వాన్స్ అందాలన్ని ఆరేస్తూ చేయించకులే న్యూ డాన్స్ దిల్ కా చోర్ కార్ నే ప్యార్ ఎంచక్కా కుమారా చూపిస్తే జోర్ నే తయార్ దరికే రారా త్వరగా రణధీర ఫ్రంటు చూస్తే టెంప్టేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్ సోకు అన్నా మాటకే ఇది కొత్త ఈక్వేషన్ చరణం: 2 హే రుకు రుకు రుకు రుకు రుక్సానా హే కసి కసి కన్నుల కొరమీనా నిన్నియాలా అల్లేయాలా మెత్తగా మురిపానా ఒళ్ళోకొచ్చి వయ్యారాల వలనే విసిరెయ్నా ఓ దిల్దార్ బేకరార్ సందించేయ్ నీ తీర్ నీ సరిరారు లేనే లేర్ చడిగా రావే దరికి మనసారా యూ మియాలి టాల్మి ఆన్ డైమిక్రేజ్ ఆనందం బాయ్ ఆవాన బి అన్ లవ్లీ ఇజ్కేబి ఆనందం ల ల లాహిరే... ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే

Naatho Vasthava Song Lyrics in Telugu – Mass (2004)

'Naatho Vasthava' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Udit Narayan and Sumangali.

SONG INFORMATION
Movie : Mass (2004)
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: ఉదిత్ నారాయణ్, సుమంగళి హొయ్ నాతో వస్తావా నాతో వస్తావా  నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా  నీతో వస్తాలే నీతో వస్తాలే  నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే  నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా  ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే  ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా  హొయ్... గోరి గోరి గోరి గోరి గోలుకొండ ప్యారీ రావె నా సంబరాల సుందరి  హేయ్... చోరి చోరి చోరి చోరి చేయజారకో హరి నీదే సోయగాల చోకిరి  చరణం: 1  మదిలో మెదిలే ప్రతి ఆశా నువ్వు  ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు  హృదయం ఎగిసే ప్రతి శ్వాసా నువ్వు  నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు  రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే  అణువు అణువు నీ తీపి తపనతో తడిసిపోయే కలలే  హేయ్... గింగిరాల బొంగరాల టింగురంగసాని రావే నా జింగిలాల జిగినీ  హే... రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ  హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా  నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా  చరణం: 2  అరెరే అరెరే తేనూరే పెదవి  మెలికే పడని నను నీలో పొదివి  పడితే నదిలా వరదయ్యే నడుము  పరదా విడనీ నీదయ్యే క్షణము  పరువమెందుకీ పరుగులాటవే పరుపు చేరు వరకూ  పడుచు వయసులో అంచు పైటలే బరువులాయె నాకు  హోయ్... చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి రావే నా బంతిపూల లాహిరి  హోయ్... చెంగులోన దూరి దూరి గింగురెత్తిపో హరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ  హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా  నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా  నీతో వస్తాలే నీతో వస్తాలే  నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే 

Palli Balakrishna Tuesday, July 25, 2017



చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
నటీనటులు: రవితేజ, జ్యోతిక, టబు
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 09.02.2006



Songs List:



నీ వెంట నేనే పాట సాహిత్యం

 
చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బి.చరణ్ , కౌశల్య

నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున

నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన

ముద్దుతో పాపిటలోనే దిద్దవా కస్తూరి
ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తూరి
చూపులే పారాణి ఊపిరే సాంబ్రాణి
రూపమె దీపంగ రాతిరె పగలవనీ 

లవ్ ఇస్ రియలిస్టిక్ ఫర్ ఎవ్రి నైట్ అండ్ ఎవ్రి డె,
దట్ మేక్స్ యు స్వింగ్ అండ్ మేక్స్ యు స్వింగ్

నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన

వెచ్చని అల్లరిలోనే సుర్యుడే కరగాలి
చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి
తారకాపురమల్లే కాపురం వెలగాలి
నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి

వెన్ యు ఆర్ ఇన్ లవ్, యు జస్ట్ డోంట్ నొ వాట్ యు సె, 
జస్ట్ లువ్ విల్ టేక్ యువర్ బ్రెత్ అవె
 
నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన
మనసే సుమమై విరిసెను నా సిగలోన
మమతె ముడులై మెరిసెను నా మెడలోన





సైకిల్ ఎక్కి పాట సాహిత్యం

 
చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, శ్వేతా పండిట్

సైకిల్ ఎక్కి




ప్రేమంటే పాట సాహిత్యం

 
చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
సాహిత్యం: కోనవెంకట్
గానం: శ్వేతా పండిట్

ప్రేమంటే 





కుమ్మేసే దమ్ముంటే పాట సాహిత్యం

 
చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: అజయ్, కౌసల్య


కుమ్మేసే దమ్ముంటే




మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

మధురం మధురం మధురం మధురం
మధురం మధురం మధురం మధురం
ప్రణయం మధురం కలహం మధురం
క్షణమొ సగమొ విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం
అందం అందం అని ఊరించె అందాలన్నీ అసలే మధురం

శ్రవణం మధురం నయనం మధురం
కులుకె మధురం కురులె మధురం
గమనం మధురం జఠనం మధురం
లయలో సాగే పయనం మధురం
గమనం మధురం జఠనం మధురం
లయలో సాగే పయనం మధురం
ఎదరే వుంటె అదిరె మధురం
చెదిరే జుట్టు చమటె మధురం

సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగర మధనం
సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగర మధనం
అన్ని మధురం అఖిలం మధురం
ఆమె మధురం ప్రేమే మధురం
అన్ని మధురం అఖిలం మధురం
ఆమె మధురం ప్రేమే మధురం

కనులె మధురం కలలె మధురం
కొంచెం పెరిగె కొలతె మధురం
కనులె మధురం కలలె మధురం
కొంచెం పెరిగె కొలతె మధురం
మనసె మధురం సొగసె మధురం
విరిసె పెదవుల వరసె మధురం
ఉదయం దాచె మధురిమ గారి ఉదరం మధురం హృదయం మధురం

తాపం మధురం శోకం మధురం
అలకె చిలికె కోపం మధురం
అలుపే మధురం సులుపే మధురం
అతిగ మరిగే పులుపె మధురం
అలుపే మధురం సులుపే మధురం
అతిగ మరిగే పులుపె మధురం
అధరం మధురం ఎదనం మధురం
పెరిగి చిరిగి తిలకం మధురం

బాలా మధురం డోలా మధురం
లీలా మధురం హేలా మధురం
బాలా మధురం... మధురం మధురం
డోలా మధురం... మధురం మధురం
లీలా మధురం హేలా మధురం
జోజో మధురం... మధురం
జోలా మధురం... మధురం
మనువాటకిదే ఫలితం మధురం

మధురం మధురం ప్రణయం మధురం
మధురం మధురం విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
అన్ని మధురం అఖిలం మధురం మనమే మధురం ప్రేమే మధురం

Palli Balakrishna Monday, July 24, 2017
Tagore (2003) Telugu Songs Lyrics Album Cover

Tagore (2003) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Director : V. V. Vinayak
Producer : B. Madhu
Actors : Chiranjeevi
Actresses : Shriya Saran, Jyothika
Release Date : 24 September 2003

Koditey Kottali Song Lyrics in Telugu – Tagore (2003)

'Koditey Kottali' song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
చిత్రం: ఠాగూర్ (2003) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్ పల్లవి: కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి బాటేదైనా మునుముందుకెళ్ళాలి పోటి ఉన్నాగాని గెలుపొంది తీరాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వెయ్యాలి నటరాజులాగా నవ్వే చిందాలి నెలరాజులా మనమే ఉండాలి మహరాజులాగా ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్ని కొడితే కొట్టాలిరా six కొట్టాలి ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి చరణం: 1 చేయి ఉంది నీకు చేయి కలిపేటందుకే చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే ఆరాటం నీకుంది ఏం పనైనా చేయ్యడానికే అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే ఈ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే సేచే కస్టాన్ని నువ్వే చెయ్యాలి పొందే ఫలాన్ని పంచివ్వాలి అందరి సుఖాన్ని నువ్వే చూడాలి ఆ విధి రాతని చెమటతోనే చెరిపేయాలి చరణం: 2 పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా అరె చిన్నవాళ్ళ నెపుడూ ఆశీర్వదించరా లేనివాళ్ళ నెపుడూ నువు ఆదరించరా ప్రతిభ ఉన్నవాళ్ళ నెపుడూ నువు ప్రోత్సహించరా శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా సంఘాన్నే పీడించే చీడను మాత్రం తృంచేయరా ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు రక్తం పంచిన బంధం మీరు చుట్టు నిలిచిన చుట్టాలే మీరు నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి బాటేదైనా మునుముందుకెళ్ళాలి పోటి ఉన్నాగాని గెలుపొంది తీరాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వెయ్యాలి నటరాజులాగా నవ్వే చిందాలి నెలరాజులా మనమే ఉండాలి మహరాజులాగా ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్ని

Nenu Saitham Song Lyrics in Telugu – Tagore (2003)

'Nenu Saitham' song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
చిత్రం: ఠాగూర్ (2003) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా అగ్నిశిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా మన్నెంవీరుడు రామరాజు ధను: శ్శంఖారానివా భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను

Manmadha Manmadha Song Lyrics in Telugu – Tagore (2003)

'Manmadha Manmadha' song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by Mallikarjun and Mahalakshmi Iyer.

SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Veturi
చిత్రం: ఠాగూర్ (2003) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్ మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా ఏ.. జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం: 1 ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా వాలేదా ఇలా మీదా సఖీ రాధా రారాదా దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీదా ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం: 2 ఆకలేసి సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా

Vaanochchenante Song Lyrics in Telugu – Tagore (2003)

'Vaanochchenante' song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by Udit Narayan and Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Bhuvanachandra
చిత్రం: ఠాగూర్ (2003) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భువనచంద్ర గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ పల్లవి: వానొచ్చేనంటే వరదొస్తాది వయసొచ్చేనంటే వలపొస్తాది వానొచ్చేనంటే వరదొస్తాది వయసొచ్చేనంటే వలపొస్తాది డం డం డిగా డిగా ఎదలో ఏదో సెగ రానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా కస్సుమందొయ్ కనకాంబరం ఘొల్లుమందోయ్ చీనాంబరం (2) వానొచ్చేనంటే వరదొస్తాది వయసొచ్చేనంటే వలపొస్తాది వానొచ్చేనంటే వరదొస్తాది వయసొచ్చేనంటే వలపొస్తాది నువ్వు రెడి రెడి నేను రెడి రెడి కింద పడి పడి చేద్దాం హడావిడి కస్సుమంటే కనకాంబరం కొల్లగొడతా చీనాబరం కస్సుమంటే కనకాంబరం కొల్లగొడతా చీనాబరం చరణం: 1 మెరుపొచ్చినా మైమరపొచ్చినా దుప్పట్లో దూరమంటాడే వానొచ్చినా నెరజాణొచ్చినా అంతటితో ఆగదంటారే కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో ముచ్చట్లు కూడదంటావరే ఊరించినా తనువుప్పొంగినా కుంపట్లు ఆరవంటారే ముదుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా ముదుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా వానొచ్చేనంటే వరదొస్తాది వయసొచ్చేనంటే వలపొస్తాది వానొచ్చేనంటే వరదొస్తాది వయసొచ్చేనంటే వలపొస్తాది చరణం: 2 శోధించనా పరి శోధించనా ఒంపుల్ని హరిచందనా చేయించనా గురు చేయించనా పరువాల పారాయణా సాగించనా కొనసాగించనా మృదువైన మదనార్చనా చేసేయనా ప్రియా చేసేయనా సందిట్లో ఆత్మార్పణ రావే రావే మోనాలిసా రెచ్చినాదే ఏదో నిషా రావే రావే మోనాలిసా రెచ్చినాదే ఏదో నిషా వానొచ్చేనంటే వరదొస్తాది వయసొచ్చేనంటే వలపొస్తాది వానొచ్చేనంటే వరదొస్తాది వయసొచ్చేనంటే వలపొస్తాది డం డం డిగా డిగా ఎదలో ఏదో సెగ రానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా కస్సుమంటే కనకాంబరం కొల్లగొడతా చీనాబరం కస్సుమందొయ్ కనకాంబరం ఘొల్లుమందోయ్ చీనాంబరం

Chinnaga Chinnaga Song Lyrics in Telugu – Tagore (2003)

'Chinnaga Chinnaga' song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by K. S. Chithra and Hariharan.

SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
చిత్రం: ఠాగూర్ (2003) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె. ఎస్. చిత్ర, హరిహరన్ చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా వోటు నా సొగసిరితొ వెస్తా ఆ వోటు మెల్లగ మెల్లగ మెల్లగ మరు మల్లెలు మబ్బులు జల్లుగా ముని మాపులలో వేసేయ్ నీ వోటు మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా వోటు గుడి హారతినై వేస్తా ఆ వోటు చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా వోటు నా సొగసిరితొ వెస్తా ఆ వోటు చరణం: 1 అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి అందాలలో నువ్వే మునకే వేయ్యాలి అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి నా వలపు కిరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు నీ చినుకులకే వేస్తా నా వోటు నా చెమటలతో వేస్తా ఆ వోటు చరణం: 2 నా సుకుమారం నీకో సింహాసనం గా నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా నీ నయగారం నాకో ధనాగారం గా ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది ఆ పాల పుంతని వలవేసీ వరించే ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే నీ రసికతకే వేస్తా నా వోటు నా అలసటతో వేస్తా ఆ వోటు

Gappu Chippu Song Lyrics in Telugu – Tagore (2003)

'Gappu Chippu' song from Tagore (2003) movie is composed by Mani Sharma and sung by K. S. Chithra and Mano.

SONG INFORMATION
Movie : Tagore (2003)
Music : Mani Sharma
Singers : K. S. Chithra, Mano
చిత్రం: ఠాగూర్ (2003) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: కె. ఎస్. చిత్ర, మనో గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు నింగిలోని చంద్రుడే నీకు పూలెడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు నువ్వు కానరాక పోతే కోపమొచ్చుడు నువ్వు కంటి ముందు కొచ్చెనంటే కోరికొచ్చుడు కౌగిలే కోరితే చెంతకొచ్చుడు కౌగిలించుకోకపోతే నాకు చింత హెచ్చుడు వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ ఇంత అంత కాదు దిని వింత గింజుడు మనసునే గిల్లిన చిత్రహింసుడు అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు పడకపై పల్లవి పూలు జల్లుడు నీ పక్కలోన గుండె తొని గుండె అల్లుడు కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు వీడు గొరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు నన్నిలా ఒంపుగా పలకరిస్తడు అమ్మొ ఎన్ని కళలు ఉన్నవయ్య నీకు పిల్లడు ఇప్పుడిప్పుడు గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు నింగిలోని చంద్రుడే నీకు పూలెడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు ఎప్పుడెప్పుడు

Palli Balakrishna

Most Recent

Default