Jeans (1998) Telugu Songs Lyrics
Movie : Jeans (1998)
Banner : Sri Surya Movies
Music : A.R. Rahman
Director : S. Shankar
Producer : A. M. Rathnam
Actors : Prashanth
Actress : Aishwarya Rai
Supporting Cast : Nassar, Lakshmi, Raju Sundaram
Release Date : 24 April 1998
• Jeans (1998) is a visual masterpiece directed by the visionary S. Shankar, which was India's official entry for the Academy Awards (Oscars) that year.
• The film is famously known for the song "Poovullo Dagunna", which was shot at all the Seven Wonders of the World, a feat rarely seen in Indian cinema.
• Legend A.R. Rahman composed a phenomenal soundtrack that blended Western orchestration with classical Indian elements, making it a global hit.
• Aishwarya Rai, in her dual role and stunning grace, delivered one of her most memorable performances alongside Prashanth.
• With high-end graphics (for its time) and a grand scale of production, Jeans remains a benchmark for commercial visual spectacles in Indian films.
Hai Rabba Song Lyrics in Telugu – Jeans (1998)
'Hai Rabba' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by A.M. Rathnam & Siva Ganesh, and sung by S.P. Pallavi and Unnikrishnan.
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : A.M. Rathnam, Siva Ganesh
Singers : S.P. Pallavi, Unnikrishnan
నాకే నాకా - నాకే నాకా
నువు నాకే నాకా - ఉఁ నాకా
మధుమిత మధుమిత మధుమిత
హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా
హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా
ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా
ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా
పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫాక్స్ లొచ్చిన స్నిగ్దవిక నాకే నాకా
ముద్దుల వానలో నిన్ను తడిపేనా
కురులతోటే తడి తుడిచేనా
నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా
పట్టుపువా పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వమ్మా
కలసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రని తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం
మనప్రేమనే కవి పాడగా షెల్లీకి భైరన్ కు
సమాధి నిద్దర చెడగొడతాం
నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో
పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటి యుగాలైనా గానీ ప్రేమకు మాత్రం వయసైపోదు
చెర్రీ పూలను దోచేగాలీ చెవిలో చెప్పెను ఐ లవ్ యూ
సైప్రస్ చెట్లలో దావుద్ పక్షి నాతో అన్నది ఐలవ్ యూ
నీ ప్రేమనే నువ్వు తెలుపగా గాలులూ పక్షులూ
ప్రేమ అర్ధమై కుమిలిన వేళ
ఒంటి గాలిలో పూవే నిలిచెను
నీ కురులలో నిలిచెందుకే పూబాలవో పువ్వెట్టగా
చిందె చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా
నేనూ నిన్నూ ముద్దాడనా
పెదవి నవ్వుల నిలిచినను ప్రాణముండును ఒక నిముషం
ప్రియా నువ్వు నన్ను వీడితే మరుక్షణముండదు నా ప్రాణం
Columbus Columbus Song Lyrics in Telugu – Jeans (1998)
'Columbus Columbus' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by A.R. Rahman.
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
Singers : AR Rahman
కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి... మామోయ్
కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
శలవు శలవు శలవు కనుగొను కొత్తదీవి నీవు
శని ఆది వారాల్లేవని అన్నవి ఓ మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి
చంపే సైన్యము అణు ఆయుధం ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్
పొల్యూషన్ ఏమీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా కోలంబస్
వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం
వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం
వీచే గాలిగ మారి పూలను కొల్లగొట్టు మనసును చక్కబెట్టు
మళ్ళీ పిల్లలవుదాం మొదలంట ఆడి
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగీ పైకెగురూ
పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు ఖండాలన్నీ దాటెళ్ళు
నేడు విరామమేదో వద్దు అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణ చేపలల్లే ఈదుదాం కోలంబస్
Poovullo Dagunna Song Lyrics in Telugu – Jeans (1998)
'Poovullo Dagunna' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Sujatha and Unnikrishnan.
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలె అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగ అతిశయం ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ
ఏ వాసనలేని కొమ్మలకి సువాసన కలిగిన పూలున్నాయి
పూలవాసనతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలొ ఒక చిటికెడైన ఉప్పుందా
వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపంలా
వెలిగేటి మిణుగురులతిశయమే
తనువున ప్రాణం ఏచోట నున్నదో ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
అల వెనెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొస్తే
నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పువ్వొ నువ్
ఎనిమిదవ అతిశయము
నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు
తేనేలూరె అధరాలు అతిశయమే
మగువ చేతి వేళ్ళు అతిశయమే
మకుటాలంటి గోళ్ళు అతిశయమే
కదిలే ఒంపులు అతిశయమే
Kannulatho Chusedi Song Lyrics in Telugu – Jeans (1998)
'Kannulatho Chusedi' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Nithyasree Mahadevan.
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
Singers : Nithyasree Mahadevan
కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా
కనులకు సొంతమౌనా
కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ
ఇక నన్ను విడిపోలేవూ
జలజల జలజల జంట పదాలు
గలగల గలగల జంట పెదాలు
ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే
విడదీయుటయే న్యాయం కాదు
విడదీసేస్తే వివరం లేదు
రెండేలే రెండు ఒకటేలే
రేయీ పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే
కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే
క్రౌంచ పక్షులు జంటగ పుట్టును
జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవూ వీడిమనలేవూ
కన్ను కన్ను జంటగ పుట్టును
ఒకటేడిస్తే రెండోదేడ్చును
పొంగేనా ప్రేమే చిందేనా
ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం
తాళికొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం
Raave Naa Cheliya Song Lyrics in Telugu – Jeans (1998)
'Raave Naa Cheliya' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Harini and Sonu Nigam.
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
మాణిక్యవీణాముపలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్
రావేనా చెలియా రావేనా చెలియా
రయ్యంటు రావె చెలి
వారెవ్వా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి
మమతకు నువ్వు ప్రతిబింబం తల్లికన్నా గారాబం
చిననాటి అనురాగం వయసైతే అనుబంధం
ఏ అవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి
జీన్స్ పాంటు వేసుకో లిఫ్ స్టిక్కు పూసుకో
నిజమైన తలనెరుపు డై వేసి మార్చుకో... యే...
ఓలమ్మో ఏమి చోద్యం నా వయసే సగమాయే
క్లింటన్ నంబరు చేసిస్తాను గలగమంటూ
ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి
ఓ కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు
ఎంటీవీ చానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు
టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్ బామ్మా...
డిస్నీలాండులో కళ్ళాపి జల్లి
బియ్యపుపిండితో ముగ్గులు వేద్దాం రాబామ్మా
రోడ్డు మద్యలో కొట్టేపెట్టి గారెలు వేసి అమ్ముదామా
Priya Priya Champodde Song Lyrics in Telugu – Jeans (1998)
'Priya Priya Champodde' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Srinivas.
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే
చెలియా నీదు నడుమును చూశా అరెరే బ్రహ్మెంత పిసనారి
తలపైకెత్తా కళ్ళు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగ మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమటా
చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లుకడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జో కొడతా
నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగ మంచుబిందువులె సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును గంగా జలముగ సేవిస్తా