Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Badri (2000)





చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
నటీనటులు: పవన్ కళ్యాణ్, అమీషా పాటిల్, రేణు దేశాయ్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: టి.త్రివిక్రమ రావు
విడుదల తేది: 20.04.2000



Songs List:



I am an Indian పాట సాహిత్యం

 
చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: జలీస్ శేర్వని
గానం: రమణ గోగుల

I am an Indian



బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే పాట సాహిత్యం

 
చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: రమణ గోగుల, సునీత

పల్లవి: 
బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ 
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో 
లవ్ వైరస్సే సోకిందయ్యో

చరణం: 1
రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే 
ఈ కాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే 
చలికాలం శ్రామికులం
అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో
హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ 
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో 
లవ్ వైరస్సే సోకిందయ్యో

చరణం: 2
స్పీడోమీటర్‌కందని వేగం చూపే 
జోడైన జంట ఇది 
మూడో మనిషి ఉండని లోకం చేరే 
జోరైన టూరు ఇది
అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు
సర్దుకున్నాక హా హా హా అలుపురాదెప్పుడు

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ 
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో 
లవ్ వైరస్సే సోకిందయ్యో

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ 
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య 
లవ్ వైరస్సే సోకిందయ్య



హే చికీతా కొమోస్తాస్ పాట సాహిత్యం

 
చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత

హే చికీతా కొమోస్తాస్
హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్
ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
హాయ్ చిరుతా నమస్తే నా జంటకొస్తే యమస్తే
ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా

Each time I think of you my heart goes boom boom boom
When you are in front of me I just go wroom wroom wroom
Dhoom dhoom dhoom handsome from king kango
Lets do the dance tango

వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే
య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య
హమేషా మొదటే మొహమాటకమేలా
ఈరోజే రాతిరికి ఈ వెన్నెలేలా
ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా

హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్
ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా
హే చికీతా చికీతా  చికీతా I Get You 
చికీతా  చికీతా  చికీతా Come Get Me

Love love love love is the way to go
you know i need some more
సుతారి సుఖమే మనదై మనువై మనమై
సై సై సై మనస్సే దోచేసెయ్ మాటుంటే ఇచ్చేసెయ్
హే... చిలకే పలికే చిలిపివచనాల
నేపాలు తోటలకు ఓ నైటు రారా
ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరదా

హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్
ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్

నే ప్రేమిస్తే నువ్వేమిస్తావ్ (2)



వేవేల మైనాల గానం పాట సాహిత్యం

 
చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత

పల్లవి:
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం

చరణం: 1
ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల 
ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల

చరణం: 2
నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ మాజీ రే... 




వరమంటి మనసే పొంది పాట సాహిత్యం

 
చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత

వరమంటి మనసే పొంది విసిరేసుకుంటానంటే 
పరిహాసమవదా జీవితం
ఉదయాలు ఎదురుగ వుండి కనుమూసి అడుగేస్తుంటే 
పడదోసి పోదా జీవితం

పువ్వంటి మనసును కోసి ఆ పైన జాలిగ చూసి 
ఓదార్పు కోరే నేస్తమా
దేహాన్ని జ్వాలగ చేసి జీవితాన్ని చితిలో తోసి 
తలరాత అంటే న్యాయమా

ఎడారంట పరిగెడతావ దరీ దారి లేదంటావ 
తడి లేక అలసే ప్రాణమా
పాదాలు నీవంటావా పయనాలు మాత్రం కావా
పైవాడి పైనా భారమా ఆ...
కాలన్ని కవ్వించేలా పనిలేని పంతాలేలా
అటుపై విధిపై నిందలా ఆ...



హే చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి పాట సాహిత్యం

 
చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత

అస్సయ్యం అస్సయ్యం ఎంగిలి అస్సయ్యం
ఛీ పాడు సిగ్గేలేదు పట్టిందేమో దెయ్యం

హే చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి 
గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి 
తడి గొడవల్లో నీ తళుకే చూస్తి 
యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ 
వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ 
నీ సొత్తు యావత్తూ స్వాహ హేయ్...

ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకె సొంతం 
ఓ బాబు శాంతం శాంతం వద్దోయి పంతం
నీ బుగ్గ చేస్తా శుభ్రం ఇస్తాలే ఓ చుమ్మా చుమ్మా 
స్నానంలో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం 
పాహి నారాయణా హరి ఓం పడుచు పారాయణా 

Every time i see u girl i just go crazy 
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి 
Every time i kiss you, you just take it easy 
అయ్యయ్యయ్యో కానయ్యో రాజి 
ఓ ఆకాశం లో వెలిగే జిం జిం తార 
నాకోసం దిగి వస్తావా ఓ సితార 

చలిగా చామంతి బంతి విసిరిందీ పూబంతి 
లవ్ గేం లో ఓడించాకా లబ్జంతా నీది 
మోడల్ ని టచ్ చేస్తుంటే మేడంకెంతో పిచ్చెక్కింది 
ఎలిమెంట్రీ ప్రేమల్లోన ఎలిఫంట్ వచ్చింది 
జోహారు ఓ మన్మధ రతి ఓం జోరు చల్లారదా 

Every time i see u girl i just go crazy 
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి 
Every time i kiss you, you just take it easy 
అయ్యయ్యయ్యో కానయ్యో రాజి 
ఓ వేణు గానాల తొలి పిలుపే రాధ 
వేయి స్వరాల అది నేననరాదా 
ఏమైతేనేం తగిలే ఊసుల బాణం 
తియ్యంగా తీసిందీ ప్రాణం 
ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం 
ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం 

Most Recent

Default