Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sye (2004)




చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నితిన్ , జనీలియ
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత: ఏ. భారతి
విడుదల తేది: 23.09.2004



Songs List:



అప్పుడప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: లక్కీ అలీ , సుమంగళి

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగా 
ఎలాగ.. ఎలాగా... ఎలాగ.. ఎలాగ
అప్పుడప్పుడు గుండేచప్పుడు ఎలాగోలాగా 
ఇదేనేమో.. ఇదేనేమో 
అదంటె అనలేని ఓ.... భావము 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ 

అప్పుడప్పుడు ఎలాగ... అప్పుడప్పుడు 
ఎలాగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు 

కాసేపు కోపం ..ల.. ల.. ల.. లై.. లై 
కాసేపు నవ్వు ..ల.. ల.. ల.. లై .. లై 
కాసేపు తాపం ...కాసేపు విరహం 
కాస్తంత బెట్టు ఏమెరుగునట్టు 
తెగతిట్టుకుంటూ కూడానే ఉంటూ 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా
అప్పుడప్పుడూ ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు 

I HATE U SO MUCH న న న నై నై 
I HATE U TOO MUCH య య యా య 
I LOVE U SO MUCH అని ఎవరు అన్నారే 
నీదారి నీదే నా తీరు నాదే 
నామాటకేమో అర్దాలు వేరే 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా
అప్పుడప్పుడూ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు





చంటైనా బుజ్జైనా పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కళ్యాణి మాలిక్, స్మిత 

మనకు తగు మనిషోకడుండి వాడిలోన వేడివుంటే య్యా... య్యా...య్యా...
ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా... య్యా...య్యా....

పల్లవి: 
చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్థైనా
జానైనా శీనైనా బోయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా...సై
స...స...స్స...సై...
నువు సై అన్న అనకున్న సై...

చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్థైనా
జానైనా శీనైనా బోయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా...సై
స...స...స్స...సై...
నువు సై అన్న అనకున్న సై...

ఫేసుకి మాస్కున్న చల్ తా హై  మనసుకి వేస్కోకురా
పరిచయమవకున్న పరవానై ఫిగరుని మిస్ కాకురా
ఉన్నది మాలో వేకెన్సీ టేక్ ఏ చాన్స్ బేబీ
కలిసెను మీతో ఫ్రీక్వెన్సీ మేక్ ఏ మూవ్ బేబీ
కిస్సిస్తూ కిలోల్లెక్కన అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాలెక్కన ఒన్ మోర్ ఇంచ్
నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేసేందుకు సై
స...స...స్స...సై...
నీ కుడి నాకు ఎడమైంది సై...
ఆర్ట్స్ఐనా సైన్స్ఐనా ఆమాటకొస్తే ఏ గ్రూపైనా...
హాస్కైనా రిస్కైనా ఎదురొస్తే ఏ కోర్ని కిస్కైనా సై...
స...స...స్స...సై...
ఈ సమయాన ఎవడైనా సససస్స సై

ఫిఫ్టీ పర్సెంటు డ్రస్సుల్లో పిలుపే తెలిసిందిలే...
హండ్రెడ్ పర్సెంట్ అందంలో ఆటకు తయ్యారేలే...
మొదలెట్టాలొక వన్ డే మ్యాచ్ కమాన్ బేబీ కమాన్...
మనకింకెందుకు నెట్ ప్రాక్టీస్ గెటాన్ బేబీ గెటాన్...
నీ బాడీ ప్లే గ్రౌండ్ గా...నో బడీ అంపైరింగ్
ముచ్చెమటే స్కోరుబోర్డుగా... య్యా...య్యా...య్యా...
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో ఆపెయ్యేందుకు సై...
స...స...స్స...సై... 
మీరేమన్న అనుకున్న సై...




గంగా ఏసీ పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వసుంధర దాస్
గానం: గంగా, కల్యాణి మాలిక్

గంగా ఏసీ మ్యాట్నీ షో తో డైలీ త్రీ షోసు ప్రేమ 
దోమల్ గూడ చింతల కుంటా ఏపీ 7812 
గంగా ఏసీ మ్యాట్నీ షో తో డైలీ త్రీ షోసు ప్రేమ
దోమల్ గూడ చింతల కుంటా ఏపీ 7812
అయ్యప్ప కట్పీసెస్ డిస్కౌంటు 10 పర్సంట్ 
చలో జింఖానా గ్రౌండ్స్ గగన ట్రావెల్స్ అండ్ టూర్స్ 
ఆచంట  కాకినాడ పుంగనూరు ఏసీ వీడియో కోచ్ బస్సులు కలవు ప్రతి రోజూ 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ

తొందర పడకు సుందర వదన ఆగీ నెమ్మదిగా వెళ్ళు 
ఇంటికొ చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు రాశీ సిమెంటు 
మీఠాలాలె కూర్మన్ చైన్ మనీ లెండర్స్ పాన్ బ్రోకర్స్ 
STD ISD లోకల్ కాల్ టూ రూపీస్ 
వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ బాటా బాటా బాటా బాటా టాటా... 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ 

ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ

మా పార్టీ నాయకుడ్నే గెలిపించండీ.. మడత మంచాలు అద్దెకు ఇవ్వబడును 
జనశక్తి ప్లాట్లు సొంతం చేసుకోండి.. విరిగిన ఎముకలకు కట్లు కట్ట బడును 
బరువు తగ్గాలనుకుంటున్నారా... నెల్లూరు మెస్ మీల్స్ రడీ.. 
వాణీ నవశక్తీ బీడీ తాగండి.. ఆంధ్రా భ్యాంక్ వారి సౌజన్యంతో.. 
పులిరాజా కి ఎయిడ్స్ వస్తుందా జ్యోతిష్యం చెప్ప బడును 
చెయ్యి చూసి రంగు రాళ్ళు ఉంగ రాలు ఇవ్వ బడునూ... 
ఊరూరఊరూరర ఊరరూరరూ ఊరూరఊరూరర ఊరరూరరూ 
ఊరూరఊరూరర ఊరరూరరూ ఊరూరఊరూరర ఊరరూరరూ 

కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త సుమన కొచ్చర్ల కోట 
కొబ్బరి బోండాం రు ఆరూ సింహాద్రి నీరూ మీరూ.. 

మీ చర్మ సంరక్షణకీ సౌందర్యానికి ఫ్రెండ్స్ ఫినాయుల్ నే వాడండీ 
మీ పిల్లల బంగరు బవితవ్యానికి అమ్మొనియా ఫ్యాక్టంఫాస్ నే వెయ్యండి 
ఎన్‍కౌంటర్లన్నీ బూటకాలు సువార్త ఉజ్జీవ కూటములు 
నాలా ఇంకొకరు ఆలోచిస్తున్నారు నేననాలనుకున్నదంటుందెవరూ.. 
నన్నే కాపీ చేస్తున్నారు నా వెనుకే ఫలో అవుతూ నడిచేదెవరు 
వచ్చేదెవరు తిరిగేదెవరూ ఎవరు వారెవరు 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ





గూట్లో వుంది బెల్లం ముక్క పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మాలతి లక్ష్మణ్ , టిప్పు

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా

హే గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా
అమ్మనడిగితే ఊహూ... అంది
అల్లుండింటికే పో పో అంది
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకు దండం పెడతా దయ చుడమంటా
హే రోట్లో వుంది కొబ్బరి చెక్క బెట్టు బెట్టుగా
రోకలి పడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా
అత్తనడిగితే నవ్వేసింది మరదలింటికే పో పొమ్మంది
కొబ్బరి పెడతావో  అరచి బొబ్బలు పెడతావో
నీకు సాయంగుంటా లవ్ చేద్దమంటా

చెంపకు చారెడు కన్నులు దానా చేలోకొస్తావా
వెచ్చని వెచ్చని వెన్నెల కూనా వాటేస్కుంటావా
నీ అందం కాశ్మీరీ పూలగంధం వేసిందీ ప్రేమబంధం ఓ నెరజాణా
కత్తెర చూపుల తిత్తిరిగాడా వలలో పడతామా
తిక్కని రేపితే టక్కరి వాడా ఒళ్ళో పడతామా
అరె పందెం ... నీ బుర్ర కాస్త  మందం కవి తిక్కన రాసిన కందం... జాజారే జానా!
నేనొప్పను అంటే-మౌనంగుంటా
నే రానంటే-నేనే  వస్తా
కాదని అంటావో ముద్దుగ ఔనని అంటావో
నిన్ను వేడుకుంటా దయ చూడమంటా హా...హా... హా...

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా

అలకలు వస్తే చిలకని పట్టే సీక్రేట్ చెబుతాలే
బుగ్గన పుసిన బూరెలు రెండూ కానుక ఇస్తాలే
ఓరయ్యో కొరికేలా చూడకయ్యో
కొవ్వూరి హనుమంతయ్యో సయ్యరే సయ్యో
రెమ్మల చాటున చుమ్మలు పెడితే గమ్మున వుంటావా
చిమ్మిలి మెక్కిన తిమ్మిరి బొమ్మని చేతికి ఇస్తావా
సిరికొండా పూనా దానిమ్మపండా పుత్తూరి కలకండా ఉంటాలే  అండా...! హే...
నేతిప్పలు పెడితే-కల్లో కొస్తా
ఓయస్సంటే-ఒళ్ళో కొస్తా
ఎత్తుకు పోతావో మత్తుగ హత్తుకు పోతావో నేను నీ వెంటుంటా...
నీ  బాంచనంటా...

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా
అమ్మనడిగితే ఊహూ... అంది
అల్లుండింటికే పో పో అంది
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకో దండం పెడతా దయ చుడమంటా హా...హా... హా...

హే గిల గిల గిల గిల గిల గిల గిల గిల రారా నువు రారా బంగారా
రారా నువు రారా నే రారా
రారా నువు రారా నీ సై... రా...




నల్లా నల్లాని కళ్ళ పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: యమ్.యమ్.కీరవాణి, చిత్ర

నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా...!
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా...!

చరణం: 1
ఎర్రంగా బొద్దుగా వుంటే చాలా
ఒళ్ళో పెట్టుకు లాలిపాడి జో కొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తేవాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఒప్పులకుప్ప వయారి భామా ముద్దులగుమ్మ చెప్పవెబొమ్మ...
ఒప్పులకుప్పకి వయారి భామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆ ... నేనా... నీతో... సరిపోతానా?
నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువు పెళ్ళాడేదెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా...!
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా...!
నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువు పెళ్ళాడేదెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా...!

చరణం: 2
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా...
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా...
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జా కంకాళమ్మా ఎవరో యమ్మా ఖజురహొ బొమ్మ...!
ఇంకెందుకులే దాపరికమ్మా నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
చీ ... నేనా...? నీతో... సరిపోతానా...
సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్లాడేవాణ్ణిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
తెల్లారే సరికల్లా మనమోల్లాగోలాగ మొగుడూ పెళ్లాలైపోయే దారి కాస్త చూపించెయ్యమ్మా...




పంతం పంతం పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎమ్.ఎమ్.కీరవాణి , టిప్పు , దేవి శ్రీ ప్రసాద్, కళ్యాణి మాలిక్ , స్మిత

పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్
సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ...
భగ భగ భగ తెగమరిగిన రక్తం మాదే మాదే హెయ్
తెగ తెగ తెగ పైకెరిగిన పందెం మాదే మాదె హెయ్....
వేద్దాం సై.... చూద్దాంసై....
కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్దం
సై .... సిద్దం సై....సై...సై...సై....

పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్
సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ....

కోసేస్తాం గడ్డి కొట్టేస్తాం బండ ఎత్తేస్తాం చెత్తన్నాకొ... చెత్త
నరికేస్తాం కొమ్మ ఏరేస్తాం ముళ్ళు
తవ్వేస్తాం మట్టిన్నాకొడక.. మట్టిరా
నలిపేస్తాం పాత డబ్బా డబ్బాన్నాకొ....
నింపేస్తాం నీటి తొట్టి తొట్టన్నాకొ...
మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాలా సాలా...
హొల్డ్ యువర్ టంగ్ హే హే
మైండ్ యువర్ వర్డ్స్ హే హే
క్యారేజిలో తెచ్చాం లేరా క్యా బే జీ

క్యాబే జీ
నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హేయ్

హేయ్ గుప్పిస్తాం రంగు
గీసేస్తాం హద్దు
గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్...కట్....కట్.....
ఒరేయ్ లేపేస్తాం బంతి...చూపిస్తాం సత్తా
పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫట్ ఫట్ ఫట్....
పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త
విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత....
దింపేస్తాం పొగరును కాస్త....
దికాతాహూ తేరి ఘర్ కా రాస్తా
తోక ముడుచుకుని జా...జా...
ఎక్కడికో జా...కొజ్జా
ముయ్ రా ముయ్
హే హే...
డూ ఆర్ డై
హే హే
నచ్చేదెవడో చచ్చేదెవడో వెయిట్ అండ్ సీ....
యా వెయిట్ అండ్ సీ


Most Recent

Default