-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nithiin"



చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
నటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
విడుదల తేది: 04.07.2025



Songs List:



భూ అంటు భూతం వస్తే పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: 	బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: సింహాచలం మన్నేలా
గానం: అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల

భూ అంటు భూతం వస్తే
భూ అంటు భూతం వస్తే

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలే
పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే
భయపడి అడుగు ఆపకే

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

చిక్కుబుక్కు రైలు బండి ఆటలో
చిటపట చినుకులొచ్చి పడితే
మూతి ముడిచేస్తావా

వాన వాన వలప్పంటూ పాడుతూ
వాకిలంత గిర్రుమంటూ తిరుగుతూ
నీట చిందేయ్యేవా

ఏదైనా నీలోనే ఉందోయి గుమ్మాడి
కొంచెం తీరు మార్చవే

భూ అంటు భూతం వస్తే
భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఆగకే అమ్మడి

భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
భూ అంటు భూతం వస్తే
ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే
ఆగకు అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే
ఆగదే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడుద్ధి

భూ అంటు భూతం వస్తే
ఆగకు అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో
బొమ్మలాటలాడాలి



జై బగళాముఖి పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: 	బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: అబ్బీ

జై బగళాముఖి



Chillax Song సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: 	బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: కాసర్ల శ్యాం 
గానం: నకాష్ అజీజ్ 

Chillax Song




శ్లోకం సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (2025)
సంగీతం: 	బి. అజనీష్ లోక్‌నాథ్
సాహిత్యం: Traditional
గానం: అనిరుద్ధ శాస్త్రి 

శ్లోకం

Palli Balakrishna Thursday, April 30, 2026



చిత్రం: రాబిన్‌హుడ్ (2025)
సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌
నటీనటులు: నితిన్, శ్రీలీల, డా.రాజేంద్రప్రసాద్‌
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత:నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌
విడుదల తేది: 26.03.2025



Songs List:



లుక్ ఇస్తే చాలే జాను పాట సాహిత్యం

 
చిత్రం: రాబిన్‌హుడ్ (2025)
సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌
సాహిత్యం:		కృష్ణకాంత్‌
గానం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, విద్యా వోక్స్‌

లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

ఇదివరకెన్నడు మరి లేనే లేదు ఏమిటి వరస
చనువుగా తాకిన మరి కోపం రాదు తేడానే చూసా
సులువుగా నచ్చరన్న నిన్నే నేడు మారేలే బహుశా
కుదురుగా ఉండడే ఒక చోటే వీడు

తాంగ్ తరికిట దిం దిం నా
సిగ్గు వదిలి ఇక అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తాంగ్ తరికిట దిం దిం నా
హద్దు చెరిపే అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
తరికిట తరికిట త

లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

జా ఓ జానే జా లవ్లీ రేజ్ ఆహ్
నీ బాడీ బ్యూటీ ప్యాకేజీ ఆహ్
జా ఓ జానే జా చూస్తే ఫ్రీజ్ ఆహ్
నీ వళ్ళ స్లీపే డామేజ్ ఆహ్

డే లోను భూమి మీద స్టారే నువ్వంట
నైట్ అయినా నీడ లాగా నీతో నేనుంటా
నా డ్రీం కోటకేమో క్వీన్ ఎహ్ నువ్వంటా
నేనేమో క్రౌన్ లేని కింగ్ ఏ అయిపోతే

పొగరుతో తగ్గాను అని నాకే పేరు లేదులే కొదవ
పడనని ఓరగా నిను చూసేసాను ఇట్టేయ్ నచ్చావా
ఇదివరకెన్నడూ మరి లేనే లేదు ఏమిటీ గొడవ
కుదురుగా ఉండవా ఒక చోటే నువ్వు

తాంగ్ తరికిట దిం దిం నా
సిగ్గు వదిలి ఇక అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తాంగ్ తరికిట దిం దిం నా
హద్దు చెరిపే అంటున్న
తాంగ్ తరికిట దిం దిం నా
తరికిట తరికిట త

లుక్ ఇస్తే చాలే జాను
లక్కీ గా ఫీల్ అవుతాను
కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను
హాగ్ ఇస్తే ఐస్ అవుతాను
ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా
వన్ మోర్ టైం వన్ మోర్ టైం



వేరెవర్ యు గో ఐ ఫాలో పాట సాహిత్యం

 
చిత్రం: రాబిన్‌హుడ్ (2025)
సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌
సాహిత్యం:		కృష్ణకాంత్‌
గానం: 	అర్మాన్ మాలిక్

గూచి బాబు
నువ్వు గుచ్చి గుచ్చి చూడొద్దే
లిటిల్ హార్టే మరి గిచ్చి పోవద్దే

లవ్ యూ రస్నా
అంటూ నీ వెంటే పడ్డానే
90s కిడ్ నే నేనేలే

ఫస్ట్ లుక్కులో ఆల్ ఔట్ఏ
ఎనర్జీ అడగద నిను బూస్ట్ఏ
అమూల్ బేబిలా కిస్ ఇస్తే
టేస్ట్ నీది బెస్టే

గోల్డ్‌మెడల్ నే ఇవ్వొచ్చే
స్విచ్ కానులే నమ్మొచ్చే
పట్టు లాంటిదే నీ టచ్చే
లక్స్ సోప్ మెచ్చే

వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో బే
ఓ ఉ ఓ

వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో బే

ఫ్రెష్ అండ్ జ్యూస్ బేబే
నా ఫ్రూటీ బ్యూటీ నీవేలే
మోన్ టఫ్ బేబే
సియట్ టైర్ లాగానే

టేస్ట్ ది థండర్ బేబే
నీ థంప్సప్ థంప్స్ అప్ నేనేలే
స్వాద్ జిందగీ కా
డైరీ మిల్క్ నీవేలే

హే జోడేమో సో స్ట్రాంగ్
ఉంటామే సో లాంగ్
ఫెవికాల్ లా బాండ్ మనదేనమ్మా

ఏజేమో సంతూరు
క్రేజే నీ సొంతూరు
చెయ్యింక ప్యారే బొమ్మ

ఆ పర్క్ తింటావు లైటయ్యి పోతావు
నా హార్ట్ వెయిటేమో పెంచేస్తావు
ఐ లవ్ యు అంటేనే అవాక్కు అవుతావు
దిమాక్ కి బత్తీ జలా

వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో బే
ఓ ఉ ఓ

వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో
వేరెవర్ యు గో ఐ ఫాలో బే



అది ద సర్ప్రైసు పాట సాహిత్యం

 
చిత్రం: రాబిన్‌హుడ్ (2025)
సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌
సాహిత్యం:	చంద్రబోస్
గానం: నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి

నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషా నషారే

నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషా నషారే

మెనీ మెనీ డేస్ ఎగో
మామిడిపల్లిలో రాతిరి రైతే తగిలాడే
పైకే ఎగబడు సమయంలో
పంట దిగుబడి రాలేదన్నాడే

అలిగానే వాన్నడిగానే
ఆ పంటేదో చూపించాడే
వరి కాదే మిరపే కాదే చెరుకే కాదే
వాడు పెంచిన పంటే గంజాయే

అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు

జూబ్లీ హిల్స్ లో ఒక పాష్ పబ్బులో
యమ క్లాసు కుర్రాడే అలా ఫ్లాష్ అయ్యాడే
చిన్ని అన్నాడే నన్ను మున్ని అన్నాడే
కొంచెం దూరమున్నాడే ఎంతో గౌరవించాడే

తన వెంటే రమ్మన్నాడే
తన విల్లాకే నే వెళ్ళానే
వాడికి జోడి కాదంటూ
వాడి డాడీకి తోడని
మున్నిని పిన్నిగా మార్చాడే

అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు
ఊ ఊ ఊ ఊ

బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండొకడు
బెంగళూరులోన కలిసాడే
హ్యాండేస్తే సెకండ్ హ్యాండయ్యేంత
హ్యాండ్సమ్ గా ఉండే వాడే

వాడి వాలెటులో క్యూటీ అమ్మాయి
ఫోటో చూసానే నిలదీసానే
మరదలు కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే
మరి ఎవరంటే
అది సర్జరీ ముందర వాడేనే

అబ్బా ఇంకొంచెం సేపుంటే బాగుండేదే

అది ద సర్ప్రైసు

అది ద సర్ప్రైసు
అరె కొట్టిన లాటరి ఎక్స్‍పైరయితే
అది ద సర్ప్రైసు
దాచిన నోట్లు రద్దైపోతే

అది ద సర్ప్రైసు
ఆపిల్ ఫోనుకి ఆపిల్ పండొస్తే
అది ద సర్ప్రైసు
కుండా బిరియానిలో కుండే బాగుంటే
అదిరిపోయింది సర్ప్రైసు

Palli Balakrishna



చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
నటీనటులు: నితిన్, శ్రీలీల 
దర్శకత్వం: వక్కంతం వంశీ 
నిర్మాత: యన్.సుధాకర్ రెడ్డి, నితిన్ రెడ్డి 
విడుదల తేది: 23.12.2023



Songs List:



డేంజర్ పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: అర్మాన్ మాలిక్

అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోకచిలుకవా
చీకట్లో తిరగని మిణుగురు తలుకువా
ఒక్క ముళ్ళు కూడా లేనే లేని రోజా పువ్వా
రేరు పీసే నువ్వా

కలలు కనదట.. కన్నెత్తి కనదట
కరుకు మగువట, హొయ్
నగలు బరువట… గుణమే నిధి అట
ఎగిరి పడదట, హోయ్

డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియకుండా
హార్టే మాయం చేసావెల్లా?

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెల్లా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా

అరె నాకే నేను బోరే కొట్టే మనిషినే
ఏమైందో ఫస్టు లుక్కులోనే నీకే పడితినే
స్లీపు వాకులోన ఫాలో చేసే పొజిషనే
రేరు కేసే నేనే

హో ఓ నచ్చిందే చేస్తుంటా
అందాకా తింటా పంటా
మంతోటి కష్టం అంటా, హోయ్
టెన్షన్లు మోసే తంటా
లేదంటా ఇంటావంటా
షోమాను అంటారంతా, హోయ్

డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెల్లా

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా, మునుపులా

ఓ ముద్దు అప్పిస్తావా
పొద్దున్నే చెల్లిస్తాలే
వడ్డీగా ఇంకొటిస్తా
పెదవులు అడిగితే

అమ్మాయి హగ్గిస్తావా
దూరాన్నే తగ్గిస్తావా
దునియానే ఏలేస్తానే
నీకు నాకు కుదిరితే

రాసేసుకుంటాలే వందేళ్లకి
కథ ఏదైనా నువ్వేలే నా నాయకి
కావ్యాలు చాలేనా నీ కళ్ళకి
కనిపించాలి వాటిల్లో నా బొమ్మ

ప్రేమ ప్రేమ… రావే ప్రేమ
ప్రాణం ఇస్తానన్నా
చాలా చిన్న మాటేనమ్మా
నీతో ఉండాలన్నా
సరిపోతుందా నాకో జన్మా

పెట్టెయ్ పేరేదైనా
పోదీ ప్రేమ నమ్మాలమ్మా
హత్తెరీ ఒంటరితనమే
అంతం చేసే హంతకీ

డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెళ్ళా

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా
ఓహొ హో ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా



బ్రష్సే వేస్కో పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి  
గానం: సంజిత్ హెగ్డే

ఎట్టా చూస్తావ్ ఎగ్గులోని
చికెన్ చికెను
ఫట్టా ఫట్టని ఎట్టా
చూపగలను చూపు

అయ్యానిపుడే లైఫులోకి
లాగిన్ లాగిను
రెసిల్టెంటాని పెట్టమాకు
టెన్షన్ టెన్షను

నేనేంటో ఏమవుతానో
నాకేగా తెల్సు
ఏ నోళ్లు ఏమన్నా
తగ్గదంట ఫోర్సు

దిల్ అంతా డల్ అయ్యేలా
ఎన్నో కామెంట్సు
డీల్ పిక్ చేయందే
నెగ్గదంట రేసు

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

ఐన్‌స్టీన్ అయినా అబ్దుల్ కలాం
అయినా అయినా
గొప్పోళ్ళయ్యే ముందు
ఒక్కసారైనా అయినా

పక్కా వాళ్ళ డాడీ తిట్టుంటాడ్రా
నాయనా నాయనా
ఏందీ పనులని చెప్పుంటారు
శానా శానా

గజినీలా కింద మీద పడితే
ఏం తప్పు తప్పు
ఏంటో ఆ కంగారేంటో సక్సెస్
అయ్యేలోపు లోపు లోపు

వద్దన్నా పడిపోతాందే
ఫెయిల్యూర్ నలుపు నలుపు
తుడిచేయకుంటే దాన్ని
రాదు కధా గెలుపు

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

పుట్టే జిందగీలన్నీ
డిట్టో బాట పట్టాలా
సేమ్ టు సేమ్ లెక్కల్లో
చేరి క్యూ కట్టాలా

ఏ కల నేను చూడాలో
వేరే వాళ్ళు చెప్పాలా
నవ్వే లేని నవ్వులో
నన్ను దాపెట్టాలా

మనకిష్టమైనదేదో కష్టపడి చేరుకునే
ఆలోచనైనా చెయ్యొద్దా
అంతో ఇంతో మనం కూడా
కాలర్ ఎత్తి చెప్పుకునే
సొంత హిస్టరీ రాయొద్దా

అరె వాళ్ళు వీళ్ళు చెప్పేదేంది
నీ దారేదో నువ్వే చూస్కో
హే మామ హే మామ
హే మామ మామ మామ

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో




ఒలె ఒలె పాపాయి పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల, ప్రియా 

హేయ్ హేయ్ హేయ్ హెయ్
ఒలె ఒలె పాపాయి
పలాసకే వచ్చెయ్యి

గుంట చూస్తె పూలగుత్తి
గుంటడేమో ఏట కత్తి
అంటుకుంటె అత్తి పత్తి
అంటుకుంది అగరుబత్తి

ఊరుకోదు నీ చెయ్యే
ఇచ్చావురా రావోయి

ఆపమాకే రంగబోతి
పెట్టమాకే బుంగమూతి
ఆరుమూరలుంది చాతి
ఆడుకోవే నువ్వు బంతి

ఒంపు చూస్తే ఒరిస్సా
ఊపుతానే హైలెస్స

తియ్యగుంది నీ హింసా
కన్నె దిల్లులో ధింసా

రయ్యిమని రాయే రాయే హంసా

ఎర్ర ఎర్ర ఎర్రగున్న
కొర్రమీనురో హెయ్
ఇది జర్ర జర్ర జారిపోయే
కుర్రమీనురో హెయ్

గర్ర గర్ర గర్ర గర్ర
గర్రమైతరో హెయ్
నీ కుర్ర బుర్ర జోరు
సూత్తె గుర్రమైతరో హెయ్

హెయ్ హెయ్ హెయ్

ఓసి కీసుపిట్ట నువ్వు కాపుకొచ్చే పంట
కోరమీసమెట్టి నిన్ను కోసుకుంటా
ఓరి కోడెగిత్త ఈ కుమ్ములాట కొత్త
కావాలనే ఉంది కూసింత

ఒడిసెల రాయిలెక్క
ఇసరకే సూపులట్ఠా
నడుమును తాకుతుంటే
సరిగమలొచ్చెనటా

పెదవికి నేర్పిస్తా ప్రేమా
హోయ్

రాక రాక కోకిలొస్తే ఊరు కావ్ కావ్
ఓ కేకే పెట్టే సోకులన్నీ నీవి కావ్ కావ్

కొక రైక కాకరేపే సూడు కావ్ కావ్
ఈ చీకటింట సిగ్గులన్ని నావి కావ్ కావ్

ఒలె ఒలె పాపాయి
పలాసకే వచ్చెయ్యి

గుంట చూస్తె పూలగుత్తి
గుంటడేమో ఏట కత్తి
అంటుకుంటె అత్తి పత్తి
అంటుకుంది అగరుబత్తి

ఊరుకోదు నీ చెయ్యే
ఇచ్చావురా రావోయి

ఆపమాకే రంగబోతి
పెట్టమాకే బుంగమూతి
ఆరుమూరలుంది చాతి
ఆడుకోవే నువ్వు బంతి

ఒంపు చూస్తే ఒరిస్సా
ఊపుతానే హైలెస్స

తియ్యగుంది నీ హింసా
కన్నె దిల్లులో ధింసా

రయ్యిమని రాయే రాయే హంసా

ఎర్ర ఎర్ర ఎర్రగున్న
కొర్రమీనురో హెయ్
ఇది జర్ర జర్ర జారిపోయే
కుర్రమీనురో హెయ్

గర్ర గర్ర గర్ర గర్ర
గర్రమైతరో హెయ్
నీ కుర్ర బుర్ర జోరు
సూత్తె గుర్రమైతరో హెయ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్





చిరాకు తాండవం పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి  
గానం: రామ్ మిరియాల

చిరాకు తాండవం 

Palli Balakrishna Sunday, October 8, 2023



చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థెరిసా
దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి
నిర్మాత: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
విడుదల తేది: 12.08.2022



Songs List:



చిల్ మారో పాట సాహిత్యం

 
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: నకాష్ అజీజ్, సంజనా కల్మాన్జి

ఆవో, చిల్ మారో చిల్ మారో… చిల్ మారో
జెట్ స్పీడు జిందగీ… కొత్త చిల్ మారో
సున్లో యారో సున్లో యారో… సున్లో యారో
మనసులో మాటలే కొంత సున్లో యారో

ఓఓ ఓ ఓఓ ఓ
తప్పు కాదులే వయసులో
తప్పు చేయడం
ఓఓ ఓ ఓఓ ఓ
వేళ కాని వేళ ఎందుకంత మోయడం

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్

అండ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ప్రాపర్లీ
మైండ్ ఈస్ స్కిప్పింగ్ లేట్లీ
మబ్బులో ఉన్న గ్రేట్లీ
ఖతము అయిన టోటల్లీ

ఛలో సమ్మగుంది పాట
ఇక బేబీ కోసం వేట
లెట్’స్ షేక్, లెట్’స్ షేక్
బ్రింగ్ ద పార్టీ యప్ ద పోక్

కారో యార్… తోడ ప్యార్
అన్ని మర్చిపోదాం యార్
యుగాలు ఇవాళే చూద్దాం

ఓ హమేషా తమాషా
నువ్వేలే నా భరోసా
బోలో యార్ టైమే ఫ్రీజ్ చేద్దాం

పిల్లే చూస్తే నాటీ
పైగా రేవ్ పార్టీ
రానా గీత దాటి
అంటోంది నాతోటి

స్టెప్ ఏదైనా రాండమ్
నచ్చిందే ఈ ఫ్రీడమ్
హలో మిస్ మేడం
ఇక ఇక్కడ వేద్దాం

ఓఓ ఓ ఓఓ ఓ
ఉల్లాలాల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది
ఓఓ ఓ ఓ ఓఓ
ఓ అనేలా వెదరే ఉన్నది

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్




రా రా రెడ్డి... ఐ యాం రెడీ పాట సాహిత్యం

 
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: లిప్సిక 

ఆ, మాచర్ల సెంటర్ లో
మాపటేల నేనొస్తే
సందమామ సందులోకి వచ్చెనంటరే

మసక మసక వింటర్ లో
పైట నేను జారిస్తే
పట్టపగలే సుక్కలు
సూపిచ్చెనంటరే

వేసవి లో ఎండకు
పట్టేటి సెమటకు
నా పైటే ఏసీ గా ఊపుతానులే
వింటర్ లో మంటకు
వణికేటి జంటకు
నా ఒంటి హీటర్’నే ఎలిగిస్తాలే

ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ

రా రా రెడ్డి… ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి..!

యే, లవ్వింగు సేత్తవా… ఐ యాం సారీ
కలిసి లివ్వింగు ఇష్టమా… వెరీ సారీ
మరి పెళ్లాంగా వస్తవా… సో సో సారీ
ఆ గొల్లెం నాకొద్దురో… సారీ సారీ

నేనేమో ఒంటరు… నాకుంది మేటరు
ఒక సోట ఆగలేను నేనొసారి
తిరుగుద్ది మీటరు… హై బీపీ రెటురో
ఈ రూట్ కు మల్లోత్త ఏదో సారి

ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ

రా రా రెడ్డి… ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి..!

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చింది కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళోట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది




అదిరిందే పసి గుండె పాట సాహిత్యం

 
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: సంజిత్ హెగ్డే

అదిరిందే పసి గుండె
తగిలిందే హై వోల్టే
ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా
పిడుగే పడెనే

అదిరిందే పసి గుండె
తగిలిందే హై వోల్టే
ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా
పిడుగే పడెనే

మత్తులో ఉన్నానా కొత్తగా పుట్టానా
కారణం నీవేనా జానే జానా
వెంటపడి చస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా
చూపవా నాపైన కొంచెమైనా

దయలేని దానివి నువ్వు
మగజాతికి హానివే నువ్వు
నా పక్కన రాణివి నువ్వు
ఒక ఛాన్స్ ఇవ్వు

కుదిరిందా కిస్సోటివ్వు
కొసరంటూ హగ్గోటివ్వు
మంటెక్కితే లాగోటివ్వు
ఏదోటివ్వు టెన్ టు ఫైవ్

హై స్పీడు షాటులోన
నీ పెదాలే చూస్తుంటే
ఏమైందో ఒక్కసారి
లోకమంతా ఫ్రీజయిందే

నీ ముందు మూన్ లైటు
తేలిపోయి డిమ్మయిందే
నాదేమో ప్రాణమంతా
లైట్ వెయిటై తేలిందే

పైపైకి పోజులున్న
నిజములే నా ప్రేమ
పొమ్మన్న పోనే పోదు
నీదేగా ఈ జన్మ
ఏ రోజుకైనా గాని… తగ్గదే నా ప్రేమ
అవకాశమిచ్చి చూడమ్మా

దయలేని దానివి నువ్వు
మగ జాతికి హానివే నువ్వు
నా పక్కన రాణివి నువ్వు
ఒక ఛాన్స్ ఇవ్వు

కుదిరిందా కిస్సోటివ్వు
కొసరంటూ హగ్గోటివ్వు
మంటెక్కితే లాగోటివ్వు
ఏదోటివ్వు



పోరీ సూపరో పాట సాహిత్యం

 
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్, గీతామాధురి

పోరీ సూపరో యయ్త్ వండరో
ఫ్లడ్ లైట్ ఐస్ రో
లుక్కుతో హార్టే ఆపెరో

క్యూటీ థండరో షేపే టాపురో
నట్ట నడివీధిలో నవ్వుతు
నన్నే సంపెరో 

పాలకన్న నువ్వే వైటే
యేసుకోన నీకే సైటే
నువ్వు ఇచ్చావంటే డేటే
ఎక్కి రానా ఫ్లైటే

కూలుగుందే ఈ క్లైమేటే
హాటులోన మోగే బీట్ యే
చేయకుందా ఇంకా లేటే
ఏసుకుందాం పాటే

వల్లరే వల్లారే
వల్లే వల్లే వల్లారే
చెయ్యన పిల్లా
నీ సీనే సితారే, హా

వల్లరే వల్లారే
వల్లే వల్లే వల్లారే
చెయ్యన పిల్లా
నీ సీనే సితారే, హా

చూపే లేజరు ఈడే ఫైటరు
హార్టు దోచే హంటరు
దొంగలా ఎంటరు అయ్యాడే

స్మైలే మ్యాడురో
స్టైలే బ్రాండురో
డాన్స్-కేమో డాడురో
పెంచరో డీజే సౌండేరో

చూసుకోవే సోలో స్టెప్పు
దద్ధరిల్లేలాగా డప్పు
ఇంకా వద్దే ఇంచు గ్యాపు
మర్చిపోదాం స్లీపు

తెచుకోవే గూగుల్ మ్యాపు
నిన్న డేటే మారేలోపు
టిప్పుకొస్తా ఫారిన్ ట్రిప్పు
బేబీ ఎస్సే జెప్పు

వల్లరే వల్లారే
వల్లే వల్లే వల్లారే
చెయ్యన పిల్లా
నీ సీనే సితారే, హా

వల్లరే వల్లారే
వల్లే వల్లే వల్లారే
చెయ్యన పిల్లా
నీ సీనే సితారే, హా

Palli Balakrishna Monday, July 11, 2022




చిత్రం: మాస్ట్రో (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
నటీనటులు: నితిన్, తమన్నా, నభా నటేష్
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
విడుదల తేది: 2021



Songs List:



ఓ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ట్రో (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీజో
గానం: అనురాగ్ కులకర్ణి

అంతులేని కళ్ళలోకిలా
అందమొచ్చి దూకితే ఎలా
మనసుకి లేని తొందరా
మొదలిక మెల్ల మెల్లగా
ఎం చూశానో నీలో అని అడిగే లోపే
మైమరిచానో ఏమో అని బదులొచ్చిందే
ఈ వింతలో మైకంలో గంతులు వేసిందే
నా గుండెకి చెబుతావా నా మాటే వినదే
నీ వల్లే…..
ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే
ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా
ఉన్నట్టుండి నువ్వు నాతో కలుద్దామా అంటుంటే
లైఫె పొంగే షాంపైన్ బాటిల్ లా
నా ఊహల్లో నువ్వు తెగ తిరగేస్తుంటే
అలవాటేమో నాకు అని మనసనుకుందే
గమనించావో లేదో గడి కొకసారైనా
నువ్వు గురుతే రాకుండా
గడవదు కథ ఇంకా నిజంగా…
ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

చేతిలో చెయ్యేసి నీతో పాటే రమ్మంటే
కళ్ళే మూసి ఫాలో అయిపోనా
రోజుకో రీజన్ తో నీ చుట్టూ చేరాలంటూ
క్రేజీ హారిస్ గోయింగ్ దివానా
ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా
ఎదురైనా సందేహం సరదా పడుతున్నా
మెరుపల్లె ఈ లోకం పరిచయమై నిన్న
నను తికమక పెడుతుంటే తడబడిపోతున్న నిజంగా…
ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే


Palli Balakrishna Tuesday, July 20, 2021



Movie Details



Songs List:



రంగులే పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్వేతా మూహన్ 

రంగులే 



ఊరంతా వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మంగ్లీ

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
జగమంతా వేడుక మనసంతా వేధన
పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఎవరికీ చెప్పవే ఎవరినీ అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మచ్చని కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్నా బాధ రంగే బతుకులో ఒలికిస్తూ

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఎవరితో పయనమో ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలుగని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః




చూసి నేర్చుకో కు పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
శుభ్రంగ ఉండటాన్ని వాడ్ని చూసి నేర్చుకో
కంపేరు చేయడాన్ని ఆపరెందుకో
ఫస్ట్ ర్యాంకు కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో
ఫస్ట్ క్లాస్ నుంచి ఈ టార్చరెందుకో
టైం కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
పంక్చువాలిటీ లేని ఈ పంచ్ లెందుకో

ఆడ్ని చూసి ఈడ్ని చూసి నేర్చుకుంటూ పోతూ
ఉంటే జిరాక్స్ లాగ జీవితాలు మారవా సో 
చూసి నేర్చుకో కు ఎవడ్ని చూసి నేర్చుకో కు
లెక్క చెయ్యమా కు ఎవడ్ని లెక్క చెయ్యమా కు

సన్ లైట్ ని చూసి నేర్చుకొని ఉంటే
ఫుల్ మూన్ కూల్ గా ఉండే వాడా
క్లాసుమేట్ ని చూసి నేర్చుకుని ఉంటే
ఐన్ స్టీన్ సైంటిస్టు అయ్యేవాడా

మంకీలనుంచే మనిషి పుట్టకంటారు 
మరి మంకీల ఉంటే తట్టుకోరు ఎందుకో
డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తుంది మరి
డాంకీ ని చూసి నేర్చుకోరు ఎందుకో

వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని
కాపీ చేసి, పేస్ట్ చేస్తే.... లైఫ్ వేస్ట్ అవ్వదా - సో 

చూసి నేర్చుకో కు, కో కు...
ఎవన్ని చూసి నేర్చుకోకు, కో కు
లెక్క చెయ్యమా కు, మాకు...
ఎవన్ని లెక్క చెయ్యమా కు, మాకు

జింక లాగే నేను క్యూట్ గా ఉండాలి అంటూ
సింహం జూలే ట్రిమ్ చేస్తుందా
ఫిష్ లాగే నేనూ ఈత కొట్టాలి అంటూ
ఎలిఫెంట్ స్విమ్ సూట్ వేసేస్తుందా

ఓన్ స్టైల్ మార్చుకోవు ఆనిమల్స్ ఎప్పుడూ
వాటి క్లారిటీ మనకు లేదు ఎందుకో
కంక్లూషన్ ఏంటి అంటే కన్ఫ్యూస్ వద్దురో
నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో

వాడి లాగో వీడి లాగో సిగ్నేచర్ ఇచ్చుకుంటే
ఫ్యూచరే ఫోర్జరీ అవ్వదా... సో
చూసి నేర్చుకో కు, ఎవన్ని చూసి నేర్చుకో కు
లెక్క చెయ్యమా కు, ఎవన్ని లెక్క చెయ్యమా కు
చూసి నేర్చుకో కు,




నా కనులు ఎపుడూ పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
చేదుపై తీపిలా రేయిపై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నామనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన

ఎపుడూ లేని ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో
ఎపుడో రాని ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో

నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం
నాకివాళ సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథెంతో
నీ గతంలో నా కథంతే
ఓ క్షణం పెంచిన
గుప్పెడు గుండెకు పండుగ ఆవేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన



బస్టాండే బస్టాండే పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే

ఊ - సింపుల్గుండె లైఫు
ఊ - టెంపుల్ రన్ లా మారే,
ఊ - ఈ రంగురంగు లోకం
ఊ - చీకట్లోకి జారే

ఊ - లవ్ లేకుండ కలలే
ఊ - లైఫే లేనిదాయే, హ్మ
ఊ - స్మైలీ లాంటి పేసే
ఊ -  స్మైలే లేనిదాయే

నీళ్ళు లేని బావిలోన కప్పలాగ తేలిపోయే
జాలరేదో గాలమేస్తే చేపలాగ దొరికిపోయే
తీసుకున్న గొయ్యిలోన కాలుకాస్త జారిపోయే

బస్టాండే బస్టాండే  ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే

ఊ - సింపుల్గుండె లైఫు
ఊ - టెంపుల్ రన్ లా మారే
ఊ - ఈ రంగురంగు లోకం
ఊ -  చీకట్లోకి జారే

సలసల కాగు నీట్లో
వేళ్ళే పెట్టినానురో
కారమంటుకున్న చేత్తో
కళ్ళే నలిపినానురో

ఊ - ఎవరులేని చోట
ఊ - గావుకేకైంది లైఫే
ఊ - ఫ్రెండులా ఉండే ఫేటే
ఊ - ఫుట్ బాల్ ఆడే నాతోటే

బస్టాండే బస్టాండే  ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే

స్లేటే పక్కనుంటదే
కానీ చాక్ పీస్ చిక్కనంటదే, యే
ప్లేట్ లో ఫుడ్డు ఉంటదే
కానీ నోటికి తాళముంటదే

ఊ - లైటు స్విచ్చెయ్యగానే
ఊ - బల్బ్ మాడిపోయినట్టు
ఊ - లైఫు స్టార్టవ్వగానే
ఊ - నా ఫ్యూచర్ పంక్చరయ్యనే

బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే



ఏమిటో ఇది పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కపిల్ కపిలన్, హరిప్రియ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

అలలా నా మనసు తేలుతుందే...
వలలా నువు నన్ను అల్లుతుంటే...
కలలా చేజారిపోకముందే...
శిలలా సమయాన్ని నిలపమందే...

నడక మరిచి నీ అడుగు ఒడిన
నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన
నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ ఓ ఓ ఓ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో....
కలిపే ఒక కొత్త నిన్ను నాలో...
నేనే ఉన్నంత వరకు నీతో....
నిన్నే చిరునవ్వు విడవదనుకో...

చినుకు పిలుపు విని నెమలి పింఛమున
రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిన్ని మనసు చిందేసే
ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది ఓ ఓ ఓ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

Palli Balakrishna Sunday, March 7, 2021



చిత్రం: చెక్ (2021)
సంగీతం: కళ్యాణి మాలిక్
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వేరియర్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్ 
విడుదల తేది: 26.02.2021



Songs List:



నిన్ను చూడకుండ పాట సాహిత్యం

 
చిత్రం: చెక్ (2021)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: శ్రీమణి
గానం: హరి చరణ్, శక్తి శ్రీ గోపాలన్

పల్లవి:
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వకముందే వెలుగులతో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింక చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాపే లేని లోకం లోన

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను

చరణం: 1
తేది మారని సమయం ఆగని
రోజేదో పుట్టించనా
నిన్నే చూడని నిమిషం ఉండని
చోటేదో సృష్టించన
కనురెప్పలే మూసుంచినా తీసుంచినా
నా కళ్ళకే ఏ గంతలో వేసుంచినా

చరణం: 2
చూపే ఓ కలిపి మౌనం ఇంకొలిపి
ఎన్నెన్ని భాషలో
నడిచే కోణమే నిలిచే వైనమో
ఎన్నెన్ని వరసలో
ఏ భాషలో నే పలికినా పలికించినా
ప్రతి మాటలో నీ పేరునే
వినిపించనా

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వకముందే వెలుగులతో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెలుగుల్లో ముంచేస్తాను
అడ్డులకింక చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాపే లేని లోకం లోన

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను


Palli Balakrishna Wednesday, February 17, 2021



చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
నటీనటులు: నితిన్, రష్మిక మండన్న
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
విడుదల తేది: 21.02.2020



Songs List:



సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి

హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్ లే 
వందల్లో ఉన్నారులే ఒక్కళ్లు సెట్ అవ్వలే
కిస్సింగ్ కోసం హగ్గింగ్ కోసం వెయిటింగ్‌లే
పాపెనకే జాగింగ్‌లే.. లైఫంతా బెగ్గింగులే  

ఎన్నాళ్లీలా ఈ ఒంటరి బతుకే నాకిలా.. 
బాయ్​ ఫ్రెండ్​లా నన్ను మార్చదే  ఏ పిల్లా.. 
ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మారలా.. 
నా వైపు ఇలా చూడదు ఏ సిండ్రెల్లా 

ఓయ్ సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే
లైఫ్‌కు లేవే రంగులే నువ్ పడవా.. పాప
ఓయ్ జంటలే నా కంట పడితే మెంటలే 
ఒల్లంత జెలసీ మంటలే చల్లార్చేయ్ పాప

ఓ ప్రెటీ ప్రెటీ గర్ల్ ఓ నాననాన
యూ అర్ సో బ్యూటిఫుల్ ఓ నాననాన
మా మా మా సాస్సి గర్ల్ ఓ నాననాన
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ ఓ...

ఓ ప్రెటీ ప్రెటీ గర్ల్ ఓ నాననాన
యూ అర్ సో బ్యూటిఫుల్ ఓ నాననాన
మా మా మా సాస్సి గర్ల్ ఓ నాననాన
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ ఓ…

ఎందుకో ఏమో వంటరై ఉన్నాను ఇలా
ఏదురు పడదేమో అందాల దేవత
జాలి చూపేనా కాలమే నాపై ఇలా
ఏమీ తలరాతో నా కర్మ కాలిందిలా 

అయాయూ 
ఓయ్ సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే
లైఫ్‌కు లేవే రంగులే నువ్ పడవా.. పాప
ఓయ్ జంటలే నా కంట పడితే మెంటలే 
ఒల్లంత జెలసీ మంటలే  చల్లార్చేయ్ పాప






వాట్ ఏ వాట్ ఏ వాట్ ఏ బ్యూటీ పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: ధనుంజయ, అమల చేబోలు

ఏ వాట్ ఏ వాట్ ఏ వాట్ ఏ బ్యూటీ
నువ్వు యాడ ఉంటే ఆన్నే ఊటీ

ఏ వాట్ ఏ వాట్ ఏ వాట్ ఏ బ్యూటీ
నువ్వు యాడ ఉంటే ఆన్నే ఊటీ

తిప్పూతుంటే నడుమే నాటి
నా కండ్లే చేసె కంత్రీ డ్యూటి

నువ్వు దగ్గరి కొస్తాంటే …. సల్లగ సలి పెడతాందే..
దూరమెల్లి పోతంటే… మస్త్ ఉడక పోస్తుందే.. దే..

టైటు హగ్గిచ్చి… టాటూలా అంటుకోరాదే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
తెరిచుంచెయ్వే పోరి ఫ్రంటు డోరు

సూడకె సిట్టి… మంటలు పుట్టి..
ఫైర్ ఇంజిన్ తిరుగుతందే గంటలు కొట్టి

రైల్ ఇంజిన్ లా కూతలు పెట్టీ
టైమంతా గడిపెయ్యకు మాటల తోటి

ఎండల్లో నువ్ తిరగొద్దే సూర్యునికే చమటట్టిద్దే
ఇంతందాన్నే దాచొద్దే… ఇ
న్కమ్ ట్యాక్స్ రైడైపోద్దే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
తెరిచుంచెయ్వే పోరి ఫ్రంటు డోరు

ఆ… నువ్ కూసున్న ఏ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గా అది ఫ్లైటెనా
ఇన్నాల్లుగా సింగిల్‌గున్నా…
నీ ఫోటోకే… నేను ఫ్రేమై పోనా
నువ్ కాలు మోపిన చోటే.. 
ఈ భూమికి బ్యూటీ స్పాటే

ఫారన్లో నువ్ పుట్టుంటే.. తెల్లోలంతా డక్కౌటే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
తెరిచుంచెయ్వే పోరి ఫ్రంటు డోరు




సరా సరి గుండెల్లో దించావే పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి

నా కలలే.. నీ రూపం లో
ఎదురయ్యే నిజామా మాయ..
ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే…

నా మనసే నింగిని దాటి ఎగిరెనులే
నిజమా మాయా… ఈ క్షణమే
అద్భుతమేదో జరిగెనులే..

ఏదో ఏదో చెప్పాలనిపిస్తుందే
నువ్వే నువ్వే కావాలనిపిస్తుందే
ఇంకా ఏదో అడగాలనిపిస్తుందే
నీతో రోజూ ఉండాలనిపిస్తుందే

ఓ.. నాలోనే నవ్వుకుంటున్నా
నాతోనే ఉండనంటున్న
నాకే నే కొత్తగా ఉన్నా నీ వల్లే… నీ వల్లే

ఓ.. నీ వెంటే నీడనౌతానే
నువ్వుండే జాడనౌతానే
నువ్వుంటే చాలనిపించే
మాయేదో చాల్లేవే

సరా సరి గుండెల్లో దించావే
మరీ మరీ మైకంలో ముంచావే… ఓ.
అయినా సరే ఈ భాద బాగుందే

అనుకోనిదే  మనిరువురి పరిచయం
ఓహో జతపడమని మనకిలా రాసుందే
మతి చెడి ఇలా.. నీ వెనకే తిరగడం

హుమ్.. అలవాటుగా నాకెలా మారిందే
ఆగలేని తొందరేదో  నన్ను తోసే నీ వైపిలా
ఆపలేని వేగమేదో నాలోపలా

ఇంత కాలం నాకు నాతో
ఇంత గొడవే రాలేదిలా
నిన్ను కలిసే రోజు వరకు
ఏ రోజిలా.. లేనే ఇలా..

సరా సరి గుండెల్లో దించావే
మరీ మరీ మైకంలో ముంచావే… ఓ.
అయినా సరే ఈ భాద బాగుందే





నీ నవ్వేమో సూపర్ క్యూటే పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి
గానం: నకాష్ అజీజ్

హో ఆయ్ ఆయ్ యె
హో ఆయ్ ఆయ్ యె హో

నీ నవ్వేమో సూపర్ క్యూటే
నీ వైట్ చున్నీ సూపర్ క్యూటే
ఓ లుక్కు తోటి పెంచావే నాలో హార్ట్ బీటే
నీ నడకెంతో సూపర్ క్యూటే
నీ అవుట్ లుక్కే సూపర్ క్యూటే
నా కళ్ళకే నువ్వు మిస్ వరల్డ్ కన్నా అప్డేటే

సునామి లాగా పిల్ల అందాలె ఇళ్ల
ఆళ్లేస్తే ఎల్లా నా దిళ్లు ఫట్టే
ఓరచూపు వాల పడేస్తే
అలా పడుంటా నీలా.. నీ కాలి వెంటే
నువ్వు ఒప్పుకుంటే పిల్ల
నువ్వు నేనిల్లా లవ్వాడేసిల్లా నా లైఫ్ సెట్టే
ఆ కస్సుమంటే ఎల్లా..
కోపంలో కూడా అంత అందమేంటే
నా మాటే వినవేంటే

హో ఆయ్ ఆయ్ యె
మన జంటే సూపర్ క్యూటే

హో ఆయ్ ఆయ్ యె
హో ఆయ్ ఆయ్ యె

నీ కోసం ఎంత చేసిన
నా లైఫె రాసి ఇచ్చినా
కాస్తయినా కనికరించవే ఓ పిసినారి..
నువ్వెంతో వెతికి చూసినా,
లోకాలు జల్లెడేసిన
నాలాంటి వాడే దొరకడే ఓ సుకుమారి..

నీతో ఉండే ఫీలింగే సూపరే
నాతో కొంచెం ప్లేయింగే ఆపెయ్యవే
నాటి బ్యూటీ టార్చరే పెట్టకే 
ఇలా మన ఫ్యూచర్ని సెట్ చెయ్యవే..
నా మాటే వినవేంటే
మన జంటే సూపర్ క్యూటే




హే చూశా నేను నీ వైపు పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సంజనా కల్మంజి

హే చూశా నేను నీ వైపు
నువ్వు నన్నే చూడనంత సేపు
దోబుచులాటేదో నీతో బాగుందిరా
నా ఇష్టం దాచుకుంది చూపు
నా కోపం పెంకి కాసేపు
అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా

అలిగిన అడిగినా నీ దానిని
మురుసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహో.. ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనీ నవ్వుతున్నా ముందరే.. 
అందుకే ఇంతగా ఈ అల్లరి .. ఓహో.. ఓహో

హా.. నా కోసం ఆరాటం ముద్దుగానే ఉంది చాలా
ఓ కొత్త మొహమాటం దీల కానీ ఈవేళ..

హా.. వెంటపడినది కంటపడనుగా
విచిత్రమో వింత వైఖరి..
సొంతవారితో ప్రయాణమా

అలిగిన అడిగినా నీ దానిని
మురుసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహో.. ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనీ నవ్వుతున్నా ముందరే.. 
అందుకే ఇంతగా ఈ అల్లరి .. ఓహో.. ఓహో

Palli Balakrishna Saturday, January 23, 2021



చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: నితిన్, రాశిఖన్నా
కథ, దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్న
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 09.08.2018s



Songs List:



కళ్యాణం వైభోగం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం (2)

రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన
శివధనువు విరిచాకే వధువుమధి గెలిచాకే
మోగింది కళ్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం
శ్రీరామ చంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి అందాల రమణి
వినగానే కృష్ణయ్య గీతామృతం
గుడిదాటి కదిలింది తనవెంట నడిచింది
గెలిచింది రుక్మిణి ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ
విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే
కళ్యాణ కలలొలికినాడమ్మ
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
ఋణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేద మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచ భూతాలు
కొలువైన మండపాన
వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది 
స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది
జన్మంటు పొంది జన్మివ్వలేని
మనుజునకు సార్ధక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం




ఎక్కడ నువ్వుంటే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: ధనుంజయ్

ఎక్కడ నువ్వుంటే




ఇతడేనా ఇతడేనా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రేయా ఘోషల్, శ్రీరామ చంద్ర & కోరస్

ఇతడేనా ఇతడేనా




మొదలెడదాం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సునీత, అనురాగ్ కులకర్ణి

మొదలెడదాం



సందింగ్, సందింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రావణ భార్గవి

సందింగ్, సందింగ్



వినవమ్మా, తూర్పు చుక్కా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: సునీత ఉపద్రస్ట

వినవమ్మా, తూర్పు చుక్కా




కళ్యాణం వైబోగం ,(క్లైమాక్స్ వెర్షన్) పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

కళ్యాణం వైబోగం ,(క్లైమాక్స్ వెర్షన్)

Palli Balakrishna Wednesday, July 11, 2018



చిత్రం: చిన్నదాన నీకోసం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
నటీనటులు: నితిన్, మిస్తీ 
దర్శకత్వం: ఎ. కరుణాకరన్ 
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి 
విడుదల తేది: 25.12. 2014



Songs List:



అరె చిన్నదాన నీకోసం పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నదాన నీకోసం (2014)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రాజా హస్సన్ 

ఓ బుగ్గ గిల్లి బుగ్గ గిల్లి
వెళ్లిపోకే బుజ్జి తల్లి
మన కథ షురూ కానీవే ఓ
కళ్ళు నిన్ను చూసేశాయే
నవ్వు నీది నచ్చేసిందే
నీకోసం ప్రాణం పెట్టైనా

అరె చిన్నదాన నీకోసం
ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం

ఓ బొండుమల్లి బొండుమల్లి
జారిపోకే గుండెగిల్లి
ఇకపై అన్నీ నువ్వేలే
ఓ కొత్త కొత్త కోరికనువ్వే
కొత్త ఆవకాయ నువ్వే
కొత్త పాట నేనే పాడెయ్నా

అరె చిన్నదాన నీకోసం
ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం

హో అరెరె అమ్మాయో నడుమే సన్నాయో
నిన్ను చూసి కొట్టుకుంది నాడి
తియ్యని పాపిడి పుల్లని మామిడి
ఏ దేశం పిల్లా నువ్వే సోల్లుడి
ఓ సింగారి సింగారి
రావే చేద్దాం సవారి
నువ్వు ఎత్తు పల్లం ఉన్న కన్యాకుమారి
తవ్విస్తా నీకై బళ్లారి

అరె చిన్నదాన నీకోసం
ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం

ఓ బుగ్గపై చుక్కనే చిటికే పెట్టనా
నువ్వేస్తే లంగాపైనే వోణి
గుండెలో రైలింజన్ కూ అంటూ కూసిందే
సిగ్నలే ఇచ్చే గిన్నెక్కోడి
గుంటూరో నెల్లూరో వెళ్దాం రావే ఏలురో
పిల్లా పట్టాలింక ఎక్కేశాక నువ్వే నాతో జోడి
నీకోసం అవుతానే మోడి

అరె చిన్నదాన నీకోసం
ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం



హో లాల పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నదాన నీకోసం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అనూప్ రూబెన్స్

ఓహ్ మేరీ పియా చేసావే ఎదో మాయ
మెరుపు తీగై నువ్వే రాగ మనసే తిమ్మిరి ఎక్కిందే
దిల్ పై కాలింగ్ బెల్ ఏ కొట్టి డాన్స్ ఏ నాతో చేసేయి
ఓఒహ్ ల లా ఊహలల ఊళ ఓఒహ్ ల లా ఓలలా ఊళ
నీ రాకెట్ తో పిల్ల నాకే తెలిసింది లే నా ఎద పలుకే
ఈ చిట్టి గుండేమో ఉరకలేసిందిలా యయియైయా
ఊళళళ ఊళలల ఓలలా ఊళళళ
ఓలలాల ఊళళళ ఓలలా ఓఒహ్ ల లా ఓఒహ్ ల లా

నవ్వుని తాకే బుగ్గలని చూస్తే
కుల్లూస్తుందే తాకలేకే
కందిపొతెనే ఎండను తాకే
నీ తిట్టని తిట్టే తిడతా సూరీడైన
నిన్ను తాకితే చెలి చీమలు
ప్రకటించిన చెలి యుద్ధమే
గాజు బొమ్మల్లె చూసుకుంటా నాలా యయియైయా
ఓలలాల ఊళళళ ఓలలా ఊళళళ
ఓలలాల ఊళళళ ఓలలా
ఓఒహ్ ల లా ఓ ఓఒహ్ ల లా

వాన కాలం అక్కర్లేదు
నిన్ను చూస్తూనే తడిసానే
గోదారల్లే కురులే ఊగే
వాటిని తాకే లొలకల్లే నేనుంటనే
ఉయ్యాలలో నువ్వే ఊగితే
చిరుగాలినై నేనే తాకుతా
రేయే నువ్వైతే నిదుర రాదెంటిలా యయియైయా
ఓలలాల ఊళళళ ఓలలా ఊళళళ
ఓలలాల ఊళళళ ఓలలా
ఓఒహ్ ల లా ఓఒహ్ ల లా



Everybody Chalo పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నదాన నీకోసం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: జాస్ప్రీత్ జస్జ్ , ధనుంజయ, అనుదీప్ దేవ్, హైమత్ 

Everybody Chalo All I Wanna Say





దిల్ దిల్ దిల్ పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నదాన నీకోసం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

నీ మిల మిల కళ్ళే నను మాయ చేసిందే
గల గల గుండెలో గోల రేపింది
ఇంతకు ఇంతై అంతంతన్తీ టార్చర్ చుపెడ్తా
ఐ క్రష్ యు లైక్ ఏ పానీ పూరి
వెనకకు లేదే నీకింకా దారి
నింగి పైన నెల పైన నీరు పైన
నిప్పునై టార్చర్ పెడ్తా
ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే
నువ్వే కేకలేసిన గోల చేసిన మెర్సీ లేదు లే
ఓహ్ ఓహ్ మరియా వై సో హరి య
చీకటి చేసావే నువ్వు న దునియా
ఓహ్ దిల్ దిల్ దిల్ యు కిల్లెడ్ మై దిల్
న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్
దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్
న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్
దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్
న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్

పర బొమ్మ శాఖలే వాయు చలేక
చుక్కలే నే చూపిస్త ఇక
ఎదురు పడితే నీకా తికమక
బుగ్గలో డింపీలే నే ఎర్ర నీ పింపుల్ నై
నీకున్న అందాన్ని చెడ గొట్టానా
ఇంతకు ఇంతై అంతంతంతాయి టార్చర్ చుపెడ్తా
ఫెయిరీ టైల్ ల కలిసావ్ నన్నిలా
చల్ చల్ గుడియా పార్ట్ టైం ఘడియ
నీ డోర్ ను కోటి నిన్నే పిలిచే
ఓహ్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్
న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్
దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్
న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్

వాట్ సో బిగ్ డీల్ అనుకున్నవే
లిటిల్ హార్ట్ కి హ్యాండ్ ఇచ్చావ్
నిన్ను వదిలే సమస్య లేనే లేదే
ఫోర్క్ నే గుండెల్లో గుచ్చి వెళ్లిపోయావ్
తిరిగి మరి నీకింకా గుచ్చేయనా
ఇంతకు ఇంతై అంతంతంతాయి టార్చర్ చుపెడ్తా
ఓ మెరుపు తీగల నువ్వు మాయం అయ్యావే
నీ బిల్కళియ తిరిగి చెలియా
మోసం చేసావే ఓ అమ్మాయ
ఓహ్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్
న గుండెలోన ఎదో జిల్ జిల్ జిల్
దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్
న గుండెలోన ఎదో జిల్ జిల్ జిల్
దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్
న గుండెలోన ఎదో జిల్ జిల్ జిల్
 



ముందుగానే పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నదాన నీకోసం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రమ్యా బెహ్రా 

ముందుగానే రాసి ఉందొ ఏమయిందో ఏమో మరి
చెరుపుకున్న చేరగనందో ప్రేమైందో ఏమో మరి
చూసే చూపులో ఎన్ని మాటలో ఉన్నవిక నా ఊసులో
సూటిగా చెప్పేదెలా నీతో
నిన్నే చూసే కళ్ళల్లో జరిగాయి ఎన్నో మార్పులు
కొత్తగా ఉన్నావ్ అందరిలో నువ్వే రా
దూరం పెరిగిపోతున్న మంచై కరిగిపోతున్న
ఐనా మౌనంగా తెలుసా రా

నీడేదో తాకింద నీదేమో అనుకున్న
నీకై వేచివుంది తెలుసా నా ప్రేమ
సందడైన నువ్వే రా పండగైనా నువ్వే రా
పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా
పువ్వై విచుకోవాలో దీండై హత్తుకోవాలో
తోడై నీతో ఉండాలో చెప్పా రా
దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్పా రా
దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్పా రా





అలెబెలి పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నదాన నీకోసం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సింహ, జాన్వి నరాంగ్

అలెబెలి


Palli Balakrishna Monday, March 19, 2018


చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: కార్తిక్, అనూప్ రూబెన్స్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా 
నటీనటులు: నితిన్ , యామి గౌతమ్, రిచా గంగోపాధ్యాయ
దర్శకత్వం: ప్రేమ్ సాయి
నిర్మాత: గౌతమ్ మీనన్
విడుదల తేది: 17.09.2015








చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: అనూప్ రూబెన్స్ , సుచిత్ర

పల్లవి:
హా వాలు కళ్ళ పిల్లా పిల్లా నీకోసం వెయిటింగ్
జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఈజ్ బీటింగ్
నాకు నీలాగే అనిపిస్తూ ఉందే 
ఐనా చెప్పాలంటే సిగ్గేస్తుందే
అబ్బో సిగ్గు బాగుందే ఎర్ర బుగ్గ బాగుందే
బుగ్గ  సొట్ట బాగుందే హాయ్ హాయ్ హాయ్...
నవ్వే నవ్వు బాగుందే చూసే చూపు బాగుందే
అబ్బా అంత బాగుందే హాయ్ హాయ్ హాయ్...

హా వాలు కళ్ళ పిల్లా పిల్లా నీకోసం వెయిటింగ్
జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఈజ్ బీటింగ్

చరణం: 1
హా పిజ్జా ఆర్డరిస్తే పావుగంటలో వచ్చేస్తుందే
నీ లవ్వే లేటవుతుందే 
అలా ఫోన్ కొడితే అరె ఇలా ఇంటి కొచ్చే
నా ప్రేమ పిజ్జా కాదులే
ఇలా మనకు ఇంతజార్ అంటే ఏమిటో తెలియదు కదా
గుండే జారిపోయినపుడు ఇంతజార్ తప్పదు కదా
మనసులోని మాట చెబుతా 
చేయరా వెయిటింగ్...

నీ రంగు బాగుందే నీ స్ప్రింగ్ బాగుందే 
చెవి రింగు బాగుందే ఇక నో వెయిటింగ్
నీ వంక బాగుందే నీతో సింక్ బాగుందే
అరె అంతా బాగుందే అయినా చెయ్ వెయిటింగ్

చరణం: 2
వాచీ చూసుకుంటూ దాన్ని బాగా తిట్టుకుంటూ 
టెన్షన్లో పడిచస్తున్నామో
దూరం దూరం గున్నా రెండు ముళ్ళు ఒక్క చోట 
కలిసే టైం వస్తుందిగా
అంత వరకు ఎదురు చూస్తూ ఉండమంటే  ఎలాఎలాఎలా
ఎక్కే బస్ వచ్చెయ్ పరుగు ఎదురు చూపు తప్పదు కదా
కోరుకుంది జల్దీ ఐతే ఉండదు థ్రిల్లింగ్

నీ మాట బాగుందే నా షేప్ బాగుందే
మన రూట్ బాగుందే హాయ్ హాయ్ హాయ్...
నీ జోరు బాగుందే నీ ప్యార్ బాగుందే
నవ్వే తీరు బాగుందే హాయ్ హాయ్ హాయ్...







చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: కార్తిక్
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: కార్తిక్

మాయ ఓ మాయ ఏం చేసావే నువ్వు
నీ వైపే లాగావు నన్నిలా
మాయ ఓ మాయ గుట్టుగా గుండెను గిచ్చి
హాయ్ లో తేల్చావు ఇంతలా
ఇలా లేదే ముందెప్పుడూ లేదే
నీవల్లే ఏదో జరిగే నాలో నేడే
అరె నేనేం చేస్తున్నా నిన్నే చూస్తున్నా
ఏంటో ఈ వింత

అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డవా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చి ప్రేమ పట్టిందంటే మామ
ఏదీ పట్టదులేరా అంతే నువ్వింకా

కనిపించే చిలిపి కల కన్నులకే మెరుపు నువ్వా
ఆణువణువూ కదలించే కోరికవా కానుకవా
మైమరచి నా హృదయం 
నిన్ను తలిచే ప్రతి నిమిషం

హే ఎగిసే ఊహల్లో మురిసే నా ప్రాణం
ఏంటో ఈ చిత్రం 

అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డవా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చి ప్రేమ పట్టిందంటే మామ
ఏదీ పట్టదులేరా అంతే నువ్వింకా

ప్రేమనెలా చూపాలో లోలోనే దాచాలో
తను కానీ కాదంటే మనసునెలా ఆపాలో
ఎదమాటే తెలుపమంటే అడుగైనా పడదుఇలా
అసలేంటో ఈ ప్రేమ మనసే పిండేసే 
హయ్యో  హాయ్యయ్యో

మాయ ఓ మాయ ఏం చేసావే నువ్వు
నీ వైపే లాగావు నన్నిలా
మాయ ఓ మాయ గుట్టుగా గుండెను గిచ్చి
హాయ్ లో తేల్చావు ఇంతలా

అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డవా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చి ప్రేమ పట్టిందంటే మామ
ఏదీ పట్టదులేరా అంతే నువ్వింకా







చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: కార్తిక్
సాహిత్యం: సాహితి
గానం: బాబా శెహగల్, కార్తిక్

ఐ లైక్ ఇట్,  ఐ లైక్ ఇట్
ఐ సే బేబీ డూస్ - ఐ లైక్ ఇట్
ఐ లైక్ ద వే యు మూవ్ - ఐ లైక్ ఇట్
లైక్ ద వే వేర్ యు గ్రూప్ - ఐ లైక్ ఇట్...

ఐ  లైక్ ఇట్,  ఐ లైక్ ఇట్

ఒట్టి సీమ సరుకే ఐ లైక్ ఇట్
ఘాటు రమ్ము పీకే ఐ లైక్ ఇట్
కాపు సారా సూకే ఐ లైక్ ఇట్...

విస్కీ తోటి గుండె సేపు
బ్రాంది బొట్టు బిపి నాకు
ఒంటి రంగు తెచ్చు వైను
నీ బొజ్జ పెంచు బీరు క్యాను

ఏక్ దమ్ము లేలో పీక దాకా పీలో
తీనుమారు వెయ్యరో ఓలే ఓలే ఓ

మందు మందు ఈ మందే మనకు మందు
మందు మందు ఈ మందే మనకు విందు
మందు మందు దీని మాహిమనే మనందు
మందుతోటి మన బాధలన్నీ బందు

మూవ్ అరౌండ్ మూవ్ అరౌండ్ - ఓహో 
ఎవ్రిబడి మూవ్ అరౌండ్ - ఓహో
వానా హియర్ లౌడ్ అండ్ క్లియర్ - ఓహో యే
కిక్కురా కిక్కురా ఓహో తీసిపోని కిక్కురా ఓహో
ఏసి గుర్రమెక్కరా  చాలకుంటే కొట్టురా ఓ యే

వాట్స్ అప్ వాట్స్ అప్ హే మీనాక్షి
వాట్స్ అప్ వాట్స్ అప్ హే కామాక్షి
ఏక్ దమ్ము లేలో పీక దాకా పీలో
తీనుమారు వెయ్యరో ఓలే ఓలే ఓ

మందు మందు ఈ మందే మనకు మందు
మందు మందు ఈ మందే మనకు విందు
మందు మందు దీని మాహిమనే మనందు
మందుతోటి మన బాధలన్నీ బందు

ఐ సే బేబీ డూస్ - ఐ లైక్ ఇట్
ఐ లైక్ ద వే యు మూవ్ - ఐ లైక్ ఇట్
లైక్ ద వే వేర్ యు గ్రూప్ - ఐ లైక్ ఇట్...

ఐ  లైక్ ఇట్,  ఐ లైక్ ఇట్

విస్కీ తోటి గుండె సేపు
బ్రాంది బొట్టు బిపి నాకు
ఒంటి రంగు తెచ్చు వైను
నీ బొజ్జ పెంచు బీరు క్యాను

ఏక్ దమ్ము లేలో పీక దాకా పీలో
తీనుమారు వెయ్యరో ఓలే ఓలే ఓ

మందు మందు ఈ మందే మనకు మందు
మందు మందు ఈ మందే మనకు విందు
మందు మందు దీని మాహిమనే మనందు
మందుతోటి మన బాధలన్నీ బందు






Palli Balakrishna Wednesday, March 7, 2018


చిత్రం: అడవి (2009)
సంగీతం: ఇమ్రాన్ విక్రమ్,  బాపి-తూతుల్
సాహిత్యం: కలువ సాయి
గానం: విక్కీ బి.జోషి, శ్వేతాపండిత్
నటీనటులు: నితిన్ , ప్రియాంకా కొఠారి, రసిక దుగల్
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ 
నిర్మాతలు: రోని స్క్రూవాలా, రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 07.08.2009





కంటిపాప నమ్మలేనంతగా
కళ్ళముందు స్వర్గమొచ్చి వాలగా
ఎన్నడైన లేని ఇంత వేడుక
ఎదలయన అంతులేని సంబరాలు చేయగా
మై మరచిపోతున్నా అందాన్ని చూస్తూనే
కల్లోన ఉన్న నేమో అన్నట్టే అనిపించేలా
లోకాన్ని చూస్తూ నేనే
కేరింత కొడుతున్నాలే పసి పాప లాగ

కంటిపాప నమ్మలేనంతగా
కళ్ళముందు స్వర్గమొచ్చి వాలగా
ఎన్నడైన లేని ఇంత వేడుక
ఎదలయన అంతులేని సంబరాలు చేయగా

మెల్లంగ మెల్లంగ నీ ముగ్గులో దించి
మైకాన ముంచేసినావే ఇలా
వళ్ళంత తుళ్ళింత వచ్చిందె నీ వల్ల
ఈ కొత్త భావాన్ని పేరేంటట
నా లవ్ నీ రాకతో ఏదో అవుతుంది
మాయ చేస్తుంది నువ్వే కాదా నువ్వే కాదా

లోకమెంత అందమైందనే నిజం
అన్ని తెలిసీ ఇంతకాలమేమైంది అద్భుతం
ఇంత చిన్నదెందుకైంది జీవితం
నువ్వుంటే నాతో ఎన్ని జన్మలైన చాలవే నిజం

నా కళ్లతో నువ్వు లోకాన్ని చూస్తావ
ఈ అందమే సొంత మయ్యేందుకు
సొంత మయ్యేందుకు
నా మనసులో నువ్వు చేరాక ఇకపైన
నువు నేను అని అన్న పదమెందుకు
అవును అసలెందుకు
నువ్వుంటె నా వెంట చూపిస్తా జగమంత
ఉంటావ నాతోని నువ్విలాగ తోడునీడై తోడునీడై

కంటిపాప నమ్మలేనంతగా
అరెరెరె కళ్ళముందు స్వర్గమొచ్చి వాలగా


Palli Balakrishna


చిత్రం: మారో (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం: మురళీ , సునీత
నటీనటులు: నితిన్, మీరా చోప్రా, అబ్బాస్
దర్శకత్వం: సిద్ధిక్
నిర్మాత: మామిడాల శ్రీనివాస్, వేణు. ఎమ్ కొండా
విడుదల తేది: 11.06.2011

పల్లవి:
ఏదేమైనా కానీ ఏదేదో మైకాన్ని
ఇంకేదో లోకాన్ని నీకే చూపిస్తా నే నీకే చూపిస్తా
ఐదో కన్నే లేని మూడో గుండె రాని
చోటుల్లో నీతోని పాలే తాగిస్తా తాపాలే తాగిస్తా
వేడిగా పెదాలతో ప్రతీది మీటనా
లిఖించగా సుఖాలని సకాలమందున

ఏదేమైనా కానీ ఏదేదో మైకాన్ని
ఇంకేదో లోకాన్ని నీకే చూపిస్తా నే నీకే చూపిస్తా

చరణం: 1
సోకే నీకే సోకే దాకా దూరాలన్ని దూరం చేసెయ్ నా
అందం మొత్తం అందెలాగ బంధాలన్ని బందీ చేసేయ్ నా
వెన్నెల్లోన తేవాలి ఈ వేళ వేసవి వేకువని
ఎలాగైన తోడాలి నీలోని ఆగిన అవిరులే

చరణం: 2
నీరే నిప్పై తప్పే వప్పై తోచేలాగా నన్నే దోచేయ్ రా
మోహం నిండే దేహం నీదే  దాహాన్నింకా దహనం చేసెయ్ రా
నా ప్రాయాన్ని ప్రాణయాన్ని ప్రాణాన్ని నీకే అర్పించా
నా స్వప్నాల సౌఖ్యాల స్వర్గాల నీలో హర్షించా

ఏదేమైనా కానీ ఏదేదో మైకాన్ని
ఇంకేదో లోకాన్ని నాకే చూపించు నువ్ నాకే చూపించు
ఐదో కన్నే లేని మూడో గుండె రాని
చోటుల్లో నాతోని పాలే తాగించు తాపాలే తాగించు
వేడిగా పెదాలతో ప్రతీది మీటవా
లిఖించగా సుఖాలని సకాలమందున


Palli Balakrishna Tuesday, March 6, 2018



చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
నటీనటులు: నితిన్ , సదా
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాత: పరుచూరి శివరాం ప్రసాద్
విడుదల తేది: 25.11.2007



Songs List:



అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి , సాయి శివాని

అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీ
గిమ్మి గిమ్మి దిల్ ఇచ్చుకోమి
అమ్మి అమ్మి అమ్మి గుండేల్ పిండి పిండి
చంపేస్తున్నావమ్మి ఎందుకమ్మి
కాదల్ ఇష్క్ ప్రేమల నువ్వై ఇచ్చావే కిక్
నక్క తోక తొక్కేనేమో దక్కిందే లక్కు
కన్నోళ్ల కాళ్ళు మొక్కి నువ్ పెగ్ పార్టీ ఇచ్చి
బిర్యాని రోజు మెక్కి బ్లెస్సింగ్ పొందుతానే

ఓలమ్మి ఓలమ్మి ఓలమ్మి లమ్మి
ఓలమ్మె ఓలమ్మె ఓలమ్మి లమ్మి

అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీ
గిమ్మి గిమ్మి దిల్ గిచ్చుతోంది

గజిని నవాబ్ లాగ అసలే వినవో
అపుడే నీ ప్రేమ మెచ్చి దిగినా లవ్ లో
ఉడుమై నా హార్ట్ చుట్టి విడనే విడవో
అపుడే నే పట్టుతప్పి పడినా ఒడిలో
సంజీవినల్లే చేరి మరు జన్మనిచ్చినావే
ఎగ్జామ్ నువ్వె పెట్టి ఆన్సర్లా అందినావే
అమ్మీ... చిన నాడు బూస్ట్ ముద్దే
నినమొన్న స్వీట్ ముద్దే 
,ఈనాడు నువ్వు ముద్దే
పోరి తిట్టుకూడ ముద్దే
నీ మాటలన్ని నచ్చి ప్రేమించినాను నమ్మీ
నట్టేట ముంచుతావో నను ఒడ్డు చేర్చుతావో

ఓరబ్బీ ఓరబ్బీ ఓరబ్బీ రబ్బీ
ఓలమ్మె ఓలమ్మె ఓలమ్మి లమ్మి

అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీ
గిమ్మి గిమ్మి దిల్ ఇచ్చుకోమి

ఎపుడూ అనుకోనెలేదు అసలే మదిలో
వలపై కలలేసినావు తొలిగా ఎదలో
పొగరే తెగ ఉంది నీకు ఏం చేస్తావో
గొడవే పడతావు నన్ను వదిలేస్తావో
ఓ మోనికాబేడీ లాగ నిన్నొదిలి వెళ్లిపోనే
దావూద్ నేను కానే ప్రేమున్నవాణ్ణి నేనే
అమ్మే నన్నెంచి కోరి వస్తే ఎదురిచ్చుకుంట నీకే
నా ఏటియమ్ నువ్వే నా అష్టలక్ష్మి నువ్వే
అట్టాగె ఉంటె బెస్ట్ వేషాలు వెయ్యవొద్దు
అడ్వాన్స్ ముందు కొట్టు ఓ చిన్ని ముద్దు పెట్టు

ఓరబ్బీ ఓరబ్బీ ఓరబ్బీ రబ్బీ
ఓలమ్మె ఓలమ్మె ఓలమ్మి లమ్మి

అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీ
గిమ్మి గిమ్మి దిల్ ఇచ్చుకోమి
అమ్మి అమ్మి అమ్మి గుండేల్ పిండి పిండి
చంపేస్తున్నావమ్మి ఎందుకమ్మి





కొబ్బరి కొబ్బరి పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి , కౌసల్య

కొబ్బరి కొబ్బరి



ఏలే ఏలే పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: జుబీన్ గర్గ్, చక్రి , రేవతి

ఏలే ఏలే




నాచో నాచో పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: జుబీన్ గర్గ్, చక్రి , రేవతి

నాచో నాచో



అ అ ఆ పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: నవీన్, కౌసల్య

అ అ ఆ



Palli Balakrishna


చిత్రం: విక్టరీ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కలువ కృష్ణ సాయి
గానం: నితిన్ , మమతా మోహన్ దాస్ , శశాంక్
నటీనటులు: నితిన్ , మమతా మోహన్ దాస్ , సింధూ తులాని, శశాంక్ మరియు కోరస్
దర్శకత్వం: రవి సి.కుమార్
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
విడుదల తేది: 27.06.2008

ఏయ్ స్కూటీ నేర్పకుండా వెళ్లిపోతావెంట్రా
ఏ పోవే
ఏంట్రా మధ్యలోనే వచ్చేశావ్
దానికి నేను చచ్చినా బైక్ నేర్పించనురా
చె నువ్వు మారవురా
ఏంట్రా పోజ్ కొడుతున్నావ్

జన్నీఫర్ లా ఉన్నవంటూ
మార్లిన్ మన్రో షేపుల్ అంటూ
డైలీ నన్నే కాకా పడుతూ
డ్రీమ్ గర్లంటూ ఫిక్స్ అయిపోతూ

రాజేష్ రోహిత్ సైటే కొట్టారే
బన్నీ బూబ్లూ మున్నా చిన్నా వెంటే పడ్డారే

అరే ఎంత చెప్పినా ఫోజులు కొడతావేందిరా
ఇంత ఓవర్ వంటికి మంచిది కాదురా
పిల్ల బైక్ నేర్పమంటే నేర్పవా
వీలుకాదు అంటు వెళ్లిపోతవా
అందులోన కిక్ నీకు తెలుసునా
అంతకన్న లక్కు నీకు దక్కునా
వెళ్ళు వెళ్ళురా ఒక్క ట్రైల్ వెయ్యరా
అందులో ఉన్న మజా తెలుసుకో జరా

చల్ పొబే

వీడి బుర్ర జర మార్చండోయ్
నిజమేనోయ్ మార్చాలోయ్
ఆడపిల్ల తను కాదండోయ్
ఎందుకురా ఏమండోయ్
ఎంత చెప్పినా నీకే అర్ధం కాదురా
విన్నవిందక ఏదో చెప్తున్నావురా

ఇంతకి ఏం చేసిందిరా బాయ్ ఆ పోరి
స్పీడ్ బ్రేకర్ అడ్డురాకపోయినా
చీటిమాటికి బ్రేక్ వేస్తది
మీద మీదకొచ్చి నేను పడినా
నంగానాచిలా నవ్వుతున్నది
వెళ్లలేనురా అది పిల్లకాదురా
నౌకరల్లే వాడుకుంటున్నది

అబ్బాయి చేసే పని అమ్మాయి చేసిందా
బానే ఉంది
అంతకన్న లక్కేముందోయ్
ఇంకేంటోయ్ ఎంజాయ్ చెయ్
అందుకె నాకు మండిందోయ్
ఏమిటోయ్ ఎమ్మనిషోయ్
ఆయ్ అదేంటండి అమ్మాయిగారు
పైనడుతుంటే పట్టించుకోరేంటండి

ఏంట్రా డిస్కషన్ వస్తావా రావా
చూశావారా అరె తురే అంటుంది
లైట్ తీస్కో
మనసుకు నచ్చితే అమ్మాయిలు అలానే పిలుస్తారు
కాఫీడేలు  రెస్టౌరెంట్లు ఉన్నది
నువ్వు నేను ఒక్కటవ్వడానికే
హే కాఫీడేలు  రెస్టౌరెంట్లు ఉన్నది
ఆ నువ్వు నేను ఒక్కటవ్వడానికే
హిచ్కాక్ సినిమా హీరోయిన్ ఇది
డ్రాగుల్లాల పట్టి చంపుతున్నది
ఎంత తిట్టినా కోపం వస్తాలేదురా
ఎందుకంటే ఎంతో నువ్వు నచ్చినావురా
ఈ ముక్క చెవిలో కేళి ఫ్లవర్ పెట్టినోడికి చెప్పు

పాపను ఏడిపించొద్దవోయ్
పాపంరోయ్ వెళ్ళొద్దోయ్
మధ్యలో నువ్వు మొరగొద్దోయ్ జారే బాయ్ నువ్వెవడోయ్
ఏంరా మళ్ళొచ్చినావ్
అది అమ్మాయ్ కాదురా బాబు ఆటం బాంబు
ఓ పోరి వీళ్ళతో కాదుగాని నన్ను రమ్మంటావా
రేయ్ పొట్టోడా భూమికి జానెడున్నావ్ కొట్టానంటే
రేయ్ దానికి నేను నచ్చలేదురా బాయ్
నువ్వే పో
ఊ ఏం చెయ్యాలో చెప్పు
కూల్ డ్రింక్ తెచ్చి కూల్ చెయ్యరా
స్ట్రాలు రెండు వేసి నాతో తాగరా
డబ్బులిస్తా నువ్వువెళ్లి తెచ్చుకో
మిత్తమంత నువ్వుతాగిపో
వీడు ఎవడు సెన్స్ లేని పొరడు
అందమైన ఆడపిల్ల ఆఫర్ ఇస్తే పోతడు
నేను చూస్కుంటాగా
బాయ్ ఫ్రెండ్ అంటే అంతేరో ఎక్కడికోయ్ కూర్చోవోయ్
పిల్లతో లింక్ పెట్టద్ధోయ్
మీకు బాయ్.. దానికి గుడ్ బై




Palli Balakrishna Monday, March 5, 2018

Most Recent

Default