Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vedam (2010)

చిత్రం: వేదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి
గానం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, దీక్షాసేత్
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
విడుదల తేది: 04.06.2010

ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్
తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి

ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి

రుప్పి రుప్పి రుపి రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి

*********   **********   *********

చిత్రం: వేదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి
గానం: యమ్. యమ్. కీరవాణి

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో
ఓ రేపని వుందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తు పడతావా
గుర్తు పడతావా
కల్లలా నిజాలా కనులు చెప్పే కథలు
మరలా  మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనె ఊహెవరిదో
తెలుసుకోగలమా తెలుసుకోగలమా
ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో

*********   **********   *********

చిత్రం: వేదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సాహితి
గానం: యమ్. యమ్. కీరవాణి, సునీత

సా నిరి సని దప మగరిస సరోజా...సరోజా...

గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతలకొదిలి సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి
గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

హా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

లోకం రంగుల సంత హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
ప్రతిదీ ఇక్కడ వింత హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
అందాలకు వెల ఎంత కొందరికే తెలిసేటంత
పాతివ్రత్యం పై పై వేషం ప్రేమ త్యాగం పక్కా మోసం
మానం శీలం వేసే వేలం మన బతుకుంతా మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతబడి కలపడి త్వరపడి ఎక్కడికో
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

నా.. సొగసులకు దాసుడవౌతావా నీతో
నా.. అడుగులకు మడుగులొత్తగలవా నీతో సరోజా
నను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో డౌటా
నా గుడి కట్టి హారతులిస్తావా నీతో  అమ్మమ్మమ్మా

నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో
నీ..తో.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది

ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

Most Recent

Default