చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్, ఉష
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
Dhimdhimkita Nakitthom Song Lyrics in Telugu – Santosham (2002)
'Dhimdhimkita Nakitthom' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Shankar Mahadevan.
చిత్రం: సంతోషం
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: చంద్ర సిద్దార్ధ
పాడినవారు: రాజేష్
So much to say that I love you
Now that so much I need you
How would it be if you leave me
Feel it for me to believe me
I want to love but not alone
Living for you and dying for you
I want to love but not alone
Living for you and dyinggg
For you
Devude Digivachina Song Lyrics in Telugu – Santosham (2002)
'Devude Digivachina' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by K. K. and Usha.
చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉష
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా
తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో
తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై
అందవా.. స్నేహమా..
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా..
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా..
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా..
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా..
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కధ
వెతికే మనసుకు మమతే.. పంచుమా..
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా..
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా..
నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా..
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా..
పెదవులపై చిరునవ్వుల దగా
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా.. తీరులో ప్రళయమా..
పంతమా.. బంధమా..
నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా
Mehbooba Mehbooba Song Lyrics in Telugu – Santosham (2002)
'Mehbooba Mehbooba' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Mano, Bhargavi and Vishwa.
చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: విశ్వా
గానం: మనో, భార్గవి, విశ్వా
మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా
కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా
మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా
చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ
మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా
కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా
చేంజ్ ద బీట్...
ఓ మాన్...
నాన్సెన్స్
చరణం: 1
మేక్... బ్రేక్ బట్ డోన్ట్ మిస్టేక్ గీవ్
టేక్ కాజ్ లైవ్స్ ఆన్ స్టైక్
ప్రెజెంట్ ఈజ్ యువర్స్ , నో ప్యూచర్ నో పాస్ట్
ఐవాజ్ సర్వై వ్ డ్ యు జస్ట్ ఫర్
ఐయామ్ గోవా మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ
ట్రస్ట్ మి బేబి ఐ విల్ మేకిట్ త్రూ
ఐ డోన్ట్ కేర్ జస్ట్ హు యు ఆర్
డోన్ట్ యు డేర్ ట్రై నౌ దట ఫర్
మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా
కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా
మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా
చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ
లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్...
జస్ట్....బ్రేక్....ఇట్
చరణం: 2
ఈస్ట్ వెస్ట్ ఐయామ్ ద బెస్ట్
చెక్ ఇట్ ఔట్ నౌ ఇఫ్ యు డోన్ట్ ట్రస్ట్
డు ఆర్ డై ఈజ్ ఆన్ మైలిస్ట్
టేక్ మి ఆన్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్
ఐ కెన్ మేక్ యు డాన్స్ టు మై ట్యూన్స్
కేస్ ద వరల్డ్ గ్రేటెస్ట్ ఫోర్ట్యూన్స్
ఇఫ్ యు ధింక్ యు ఆర్ స్పెషల్ అండ్ స్మార్ట్
లుక్ ఆన్, యు కెన్ టచ్ మై హార్ట్
మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా
చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ
మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా
కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా
Emaindho Emo Naalo Song Lyrics in Telugu – Santosham (2002)
'Emaindho Emo Naalo' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Rajesh.
చిత్రం: సంతోషం
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: రాజేష్
ఏమైనదో ఏమో నాలో
కొత్తగా ఉంది లో లో
కలలిలా నిజమైతే
వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై
ఉండాలనే నా చిగురాశనీ
లో లో పొంగే భావాలన్నీ
ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నదీ
అందాల సిరిమల్లె పువ్వూ
ఏ మూల దాగావో నువ్వూ
చిరుగాలిలా వచ్చి నీవూ
యదలోన సడి రేపినావూ
ఏదో రోజు నీకై నువ్వు
ఇస్తావనే నీ చిరునవ్వునీ
ఎన్నెన్నో ఆశలతోనే
ఉన్నాను నే నీకోసం ఇలా...
Diri Diri Diridee Song Lyrics in Telugu – Santosham (2002)
'Diri Diri Diridee' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by K. K. and Usha.