Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Athanokkade (2005)



చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: బండారు దానయ్య
గానం: రంజిత్ , సునీత
నటీనటులు: కళ్యాణ్ రామ్, సింధు తులాని
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: నందమూరి జానకి రామ్
విడుదల తేది: 07.05.2005

పల్లవి:
మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే
నేలకు ఆనందం ఆ నింగికి ఆనందం
మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే
నేలకు ఆనందం ఆ నింగికి ఆనందం
తారాలన్ని మురిసే వేళ నీటి పూలై విరిసే వేళ
వెన్నెల ఆనందం ఆ వన్నెలు ఆనందం
తారాలన్ని మురిసే వేళ నీటి పూలై విరిసే వేళ
వెన్నెల ఆనందం ఆ వన్నెలు ఆనందం
ఆనందం మర్మముమైతే అనురాగం మమ్మరమైతే
స్వర్గానికి నిచ్చెన వేస్తా ఈ జగతికి ప్రాణం పోస్తాం

చరణం: 1
అచ్చతెలుగు అంటానన్ని అచ్చం నా కోసం
వెండి మబ్బుల బంగారు తొడుగే మా కోసం
నవ్వు పువ్వులే ఈ జన్మంతా రువ్వులు మా కోసం
గుండె లోతుల తేనెల మడుగే మా కోసం
మన్ను మిన్ను వన్నె చిన్నె అన్ని మా కోసం
ఉదయ సంధ్యా సాయం సంధ్యల వెలుగు మా కోసం
అమృతానికి తీపిని అద్దిన సొగసు మా కోసం
స్వర్గ సారను మించగా పుట్టినా భూమి మా కోసం

చరణం: 2
చందమామకు వంతెన వేసే వెన్నెల మా కోసం
నీలి కన్నుల తెల్లని కలలే మాకోసం
చంద్రవంక వాగు వంక నిత్యం మా కోసం
కొండకోన చెట్టు చేమ మా కోసం
ఏడు రంగుల ఇంద్రుని ధనస్సు పొంగు మా కోసం
ఈడు రేగిన ఇంతటి మనస్సు పొంగు మా కోసం
అదుర లేనిది ఏది లేదను వయస్సు మా కోసం
ఇన్ని ఇచ్చిన ఆ పై దేవుడు అసలు మా కోసం


********  ********  ********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: వేణు , గంగ

పల్లవి:
నాటి గాళ్‌ - - -
నాటి గాళ్‌ నాటి గాళ్‌ నన్నే పిలిచింది
నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది
నాటి గాళ్‌ నాటి గాళ్‌ నన్నే పిలిచింది
నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది
ఫ్రామిస్‌ ఓ చెలియా ఐ లవ్‌ యు
ఫ్రామిస్‌ సఖియా ఐ లవ్‌ ఫర్‌ యు
ఫ్రామిస్‌ లైఫంతా లాఫింగ్సే లవ్‌లో పడితే ఐ లవ్‌ యు
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోని లవ్వేలే సోగ్రేట్‌
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌

చరణం: 1
బ్యూటి కంట్రి లాఫి ఎంట్రి అవ్వాంలంటే బిల్లే
పాస్పోటంటా ఫాట్లోడ్‌ లేవంటా
స్వీటి చిరుదూరాలే దాటి నిన్నే చేరి కల్లో నిన్ను అల్లుకునే ఫిట్‌సీట్‌ నేనంటా
ఫోనంటు మరి నోనంటు నాలోన ఉండదుగా
ఒకటైతే మామూలైనా మనవైపే వాలునుగా
ట్రైనైనా ఎయిర్‌ పైనైనా స్టాపంటు ఉండునుగా
లవ్‌ బర్డ్స్‌ విహరిస్తుంటే ఏ సిగ్నలు మనలను ఆపదుగా
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌

చరణం: 2
చోటి హృదయంలోన చోటే దొరికిందంటే
టాటా బిల్‌ గేట్స్‌ కన్నా నే నే గ్రేటంటా
డౌటే ఇక లేదంటే నువ్వే మరి నా జంట
లవ్‌లి లాకప్‌ లోన లాకై పొమ్మంటా
సన్‌ లైటే లేదంటే ఈలోకం కదలదుగా
సఖియా నీ సరి లేకుంటే నాప్రాణం నిలవదుగా
నువ్వంటూ మరి నేనంటూ డిఫరెన్సే లేదుకదా
మనలోన లవ్‌ స్టార్ట్‌ అయిలే ఈ దునియా అంతా మనదేగా
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోని లవ్వేలే సో గ్రేట్


********  ********  **********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: మల్లికార్జున్ , చిత్ర

పల్లవి:
అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి
తెలిసేనమ్మా ఓహొ ఓహొ ఓహొ ఓహొ
ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమ ఓహొ ఓహొ ఓహొ
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండినది కన్నె మనస్సు నిండినది తేటేందుకు ఉన్నదిచాలు
మౌనం లోని ఆ భాషలు ఎన్నో చూపులలోని దాగెను భాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది గుప్పెట్లో అంతా ఉంది
గుట్టు దాగుంటే బాగుంటుంది

చరణం: 1
కళ్ళే పలికించు మదిలో మాటలను ఇంకా పెదవిప్పే చెప్పాలా
నవ్వే ఉలికించు అవునను సైగలను అయినా వివరించి తెలపాలా
ముఖమంతా కాంతులతో వెలిగేనమ్మా
మనసంతా ఆ వెలుగులో తెలిసేనమ్మా
పెదవుల్లో ఆ మధవే పొంగే వేళ ప్రేమంటు పేరే ఎలా
నువ్వు నేనంటు వేరవ్వాలా

చరణం: 2
తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే
ప్రేమే విరిశాకా ఒంటికి పరిమళము తానై వస్తుంది ఎలాగా
ప్రేమన్నది భాషలకు అసలందదులే మౌనంగా ధ్యానంగా తానుండులే
ఊహలతో నింపేస్తే అది నిలవదులే కలగంటు
పాటలు ఎలా ప్రేమ కలగంటు మాటలు ఎలా


********  ********  ********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: కార్తిక్ , గంగ

పల్లవి:
అమ్మదేవుడో అనిపించావే అయ్యో బ్రహ్మయ్యా
ఏమో నీదయ నాపై లేదయా
ఓరి దేవుడో యెదలో రేగే ఇదేంగోలయ్యో ఈ కధ ఏందయ్యా తెలిసేదెట్టయా
మదిలో ఏదో గొట్టే గొట్టే
గుండెల్లో సునామి పుట్టే
ఏడుకొండల వెంకటేశ్వరా నువ్వు నాకు దిక్కు
ఏదునాళ్ళుగా కోడి సాక్షిగా ఎంగిలడితే ఒట్టు
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు
నిండు సాక్షిగా రెండు కన్నుల నిద్దరోతే ఒట్టు

చరణం: 1
ప్రపంచ వింతలు ఏడున్నా మరొక్కటి ఇక్కడ చూస్తున్నా
ప్రతొక్క చెలిమాటే వినిపించేలే
జగాన ఎందరు గనులున్నా జనాలు మెచ్చే
పొగరున్నా మగాడు మాత్రం నా ప్రియుడే అనిపించేనే
ఒక నవ్వే అది చాలు తన చిరునవ్వే అది పదివేలు
తగువే అనిపించే ఇక తనతోటే సరదాలు
ఏడుకొండలు వెంకటేశ్వరా పొద్దు పోకవుందిక
ఎంతమందిలో కలిసి ఉండినా నాకు తోచకుంది
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్ట పట్టు
నిండు సాక్షిగా రెండుకన్నులా నిద్దరోతె ఒట్టు

చరణం: 2
వయ్యారమంతా నాలోన వసంతమాడే తరుణాన
వరించి నే నే పెళ్ళాడే వరుడతడేలే
గతాల జన్మలు ఏవైనా మరింక జన్మలు ఎన్నున్నా
యుగాలు నాకు తోడుండే సఖి తానేలే
నా జంటై తానుంటే చలి మంటేగా చనువరులు
ముద్దై మురిపిస్తే బదులిస్తాగా మగసిరులు
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు
నిండు సాక్షిగా రెండు కన్నులా నిద్దరోతె ఒట్టు
జమ్మి కొండల జంబుకేశ్వరా యెదను హత్తుకుంది
అందువల్ల తన చెంతకే మనస్సు పరుగులెడుతు ఉంది


********  ********  ********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సునీత

పల్లవి:
చిటా పటా... చిటా పటా... చిటా పటా
చిటా పటా... చిటా పటా... చిటా పటా
చిటా పటా చిటా పటా చిందే వానా
ఇక చెటా పటా చెటా పటా వేసే వానా
చెట్టే లేని పువ్వుల్లాగ రాలే వానా చెంత వాలే వానా
వానా వానా  వెండి వానా బంగారంలా నిను దాచెయ్యనా
వానా వానా  రౌడి వానా చేసే అల్లర్లు గుండె నిండ నింపుకోన
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా
నీతో రానా...
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా... ఏదేమైనా...

చరణం: 1
వానకొట్టి వణుకుపుట్టి చలిగా ఉన్నాకాని చల్లనైన ఐసు నేను తింటూ ఉంటా
ఏకధాటి వానలోన ఎగిరి తడిసి అలిసి తెచ్చుకున్న జలుబులోన తుమ్ముకూడ కమ్మనంట
నల్లమబ్బులే నా ఆశకేమో అద్దమంట
నల్లగొడుగులే నా ఆటకేమో అడ్డమంట
ఆటలాడి చేస్తుంటే కొంటె చేష్టలే మబ్బు అమ్మలాగ వేస్తుంది నీటిమొట్టికాయలే
చిలిపి దాడి చేస్తుంటే చిట్టి చినుకులే నేల నాకుమల్లె ఒళ్ళంతా పులకరించిపోయెలే
వానా వానా నచ్చే వానా  నన్నే నీలోన చూస్తూ ఉన్నా
వానా వానా నవ్వే వానా  ఆకాశాన్నంటె నిచ్చెనల్లే చేసుకోన
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా
నీతో రానా...
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా... ఏదేమైనా...

చరణం: 2
వానవిల్లు రంగులంటే ఏడే ఉంటాయేమో వేల వేల రంగులన్ని నాకేచెల్లు
వానజల్లు కురిసెనంటె ఉరుమే ఉరిమేనేమో ఉరుము లేక చినుకునంట కుర్ర కళ్ళు ప్రేమజల్లు
చినుకు తాకితే జిగొచ్చునంట కోనసీమ
నేను తాకితే ఫలించునంట కొంటెసీమ
మేఘాన ఉన్నాయ్ నీటి పిడుగులే నా దేహాన ఉందోయ్ పట్టువిడని పిడికిలే
తారల్లో ఉన్నాయ్ మెరుపు తీగలే నా దేహాన పూచాయ్ వెలుగుపూల తీగలే
వానా వానా బుజ్జి వానా నన్నే నీతోటి పోలుస్తున్నా
వానా వానా బుల్లి వానా  నాలో భావాలు మనసు విప్పి పంచుకోన
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా
నీతో రానా...
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా
ఏదేమైనా...


********  ********  *********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: రంజిత్

పల్లవి:
అతనొక్కడేలే అందర్లోను
ఈ జీవితమంటే ఓ కోరికరేపే అతనొక్కడేలే
అతనొక్కడేలే ఎవ్వరికైనా ఓదార్పును చూపే
ఓ దారిని చూపే అతనొక్కడేలే
అతనొక్కడేలే అతనికి తోడు ఆనందంలోను బాధే అయిననూ
అతనొక్కడేలే అందర్లోను తానొలడై కూడా ఉన్ననూ.....

చరణం: 1
ఈ లోకమంతా మనలో ఉంది మనకోసం ఉంది
మనతోడై ఉంది నీడనంది
మదికోరుకుంది ఇస్తానంది నవ్విస్తానంది
కవ్విస్తానంది నేస్తమంది
మనమొంటరైతే వెంటే ఉంది
మనజంటే అంది ప్రాణం లాంటిది
మన బాధ అంతా నాదేనంటూ నేనున్నానంటు అన్నది

చరణం: 2
ఓ చిన్ని ఆశతో సాగావంటే
కేకేసావంటే ఆకాశంకూడా అదిరిపోదా
నీ చిన్ని గుండెలో దాచావంటె
భూగోళంకూడా భూపాలంతోటి నిదురపోదా
ఏం చెయ్యాలన్నా నీలో ఉంది
అడుగేసావంటే అడ్డేఉన్నదా
నీఅంత నువ్వే వద్దన్నావో నీవద్దే అంతా చెరదా

Most Recent

Default