Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bheemili Kabaddi Jattu (2010)




చిత్రం: భీమిలి కబడ్డీ జట్టు (2010)
సంగీతం: వి.సెల్వ గణేష్
నటీనటులు: నాని, వినయ్ రాయ్, శరణ్య మెహన్, ఆర్తి పూరి, విఖిత శేరు (వరుణ్ సందేశ్ భార్య)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తాతినేని సత్య
నిర్మాతలు: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్
సినిమాటోగ్రఫీ: నందమూరి హరి
బ్యానర్: సూపర్ గుడ్ ఫిలిమ్స్
విడుదల తేది: 09.07.2010



Songs List:



పద పద మని తరిమినదే  పాట సాహిత్యం

 
చిత్రం: భీమిలి కబడ్డీ జట్టు (2010)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: కార్తిక్ , కల్పన 

పద పద మని తరిమినదే 
నిను చేరగ నన్నే నా హ్రుదయం 
ఇది అది అని తెలుపనిదే 
ఎడ బాటుగ మిగిలే ఈ సమయం 
ఉండిపోవా గుండెలోనా 
ఉలుకై పలుకై ఊపిరివై 
నిండిపోవా కల్లలోనా 
కలవై వరమై కలవరమై 

తెలియదు నాకు నీ పేరు 
కాదులే మనమే వేరు 

పద పద మని తరిమినదే 
నిను చేరగ నన్నే నా హ్రుదయం 
ఇది అది అని తెలుపనిదే 
ఎడ బాటుగ మిగిలే ఈ సమయం 

నీటిలోనా మునిగిపోనీ నీడల రూపం మందేనా 
గాలిలోనా నువ్వు రాసే కవితలు అన్నీ చదివేనా 
నిన్ను చూస్తు కంటి పాప పుట్టిందేమొ అనుకోనా 
అందుకే నా రూపం తనలో కొలువై ఉందీ ఎపుడైనా 

తెలియదు నాకు నీ పేరు 
కాదులే మనమే వేరు 

పద పద మని తరిమినదే 
నిను చేరగ నన్నే నా హ్రుదయం 
ఇది అది అని తెలుపనిదే 
ఎడ బాటుగ మిగిలే ఈ సమయం 

నన్ను నేనే పోల్చుకోనీ అందం ఏదొ నాలో 
ఎన్ని ఉన్న నేను లేని లోటె ఉంది నీలోనా 
మౌనమే మన ఇద్దరి మద్య నిచ్చెన లాగ మారేనా 
దూరమే ఓ దారిని వెతికి నిన్నే నాతో కలిపెనుగా 

తెలియదు నాకు నీ పేరు 
కాదులే మనమే వేరు 

పద పద మని తరిమినదే 
నిను చేరగ నన్నే నా హ్రుదయం 
ఇది అది అని తెలుపనిదే 
ఎడ బాటుగ మిగిలే ఈ సమయం 
ఉండిపోవా గుండెలోనా 
ఉలుకై పలుకై ఊపిరివై 
నిండిపోవా కల్లలోనా 
కలవై వరమై కలవరమై 

తెలియదు నాకు నీ పేరు కాదులే



కబడ్డి కబడ్డి పాట సాహిత్యం

 
చిత్రం: భీమిలీ కబడ్డీ జట్టు (2010)
సంగీతం: వి.సెల్వగణేష్
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: శంకర్ మహదేవన్

మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా

కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ

మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా
మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా
నిప్పై రగలాలోయ్.. నువు నింగికి ఎగరాలోయ్
గెలుపే నీదవగా ఒక యుద్ధం జరగాలోయ్

ప్రతి దిక్కు తూరుపు కాగా ఉదయించర సూర్యుడి లాగా
ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిర వృక్షం లాగా

కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ

నిప్పై రగలాలోయ్.. నువు నింగికి ఎగరాలోయ్
గెలుపే నీదవగా ఒక యుద్ధం జరగాలోయ్
ప్రతి దిక్కు తూరుపు కాగా ఉదయించర సూర్యుడి లాగా
ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిర వృక్షం లాగా

కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ

నినుగన్న నేలతల్లి రుణమును తీర్చూ
నీ నుదిటీ రాతను నువ్వే అనువుగా మార్చూ
నీతో నీకే సమరం కాదా నీ తొలి విజయం
పడుతూ లేస్తూ కెరటం చేరేనయ్యో తీరం

మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా
మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా

కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ

గుండె పాట కబడి కబడి
మట్టి ఆట కబడి కబడి
ఆకలి దప్పులు కబడి కబడి
అందరి మెప్పులు కబడి కబడి
మాటల్లోన కబడి కబడి
చేతల్లోన కబడి కబడి
కబడి కబడి కబడి కబడి
కబడి కబడి కబడి కబడి

కూతే పడుతూ గీతే దాటితె
కాలో చెయ్యో ఆయుధమైతే
ఆపైనా ఫలితం కాదా మీదే మీదే
మనసును బుద్ధిని ఏకం చేసీ
కంటీ పాపను బాణం చేస్తే
రాబోయే విజయం కూడా మీదే మీదే
కణకణ రగిలే ఆశలు ఎదలో 
ఊపిరి ఐనవి ఈవేళా
భగభగ మండే బాధల నదిలో

అమృతమున్నదిరా
ధగధగ మెరిసే ఆశయ శిఖరం
అధిరోహించే సైన్యంరా
ఆఖరి వరకూ ఆగని పరుగూ
తీయక తప్పదురా 

మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా
మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా




నీతో నీడల్లే రానా పాట సాహిత్యం

 
చిత్రం: భీమిలి కబడ్డీ జట్టు (2010)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: వనమాలి
గానం: వి.వి.ప్రసన్న

నీతో నీడల్లే రానా 
నాలో నేనంటూ లేనా 
నిలవదే నిమిషం అయినా 
తలపులై తరిమే తపనా 
నిలువెల్లా నీ అలోచనా 
నీతో నీడల్లే రానా 

నిన్నటి తియ్యని కలయికనే వరమల్లే అనుకోనా 
గుండెల్లోన వెల్లువైన గురుతులనే నెమరేసె అలలైనా 
ప్రతి స్వప్నం నాలో నిజాలైనా 
నిలిపేనా నా కంటి ముందుగా నిన్నీ క్షణానా 
మది నీ కోసమే వేచెనా 

నీతో నీడల్లే రానా 

చేసిన బాసలు చెరగవులే ఎడబాటె ఎదురైనా 
నాకోసం నువ్వొస్తావని తెలిపెనులే 
ప్రతి ఆశ ఎదలోనా 
మరే నాడు నీతో ప్రయానమైనా 
ఇలా నీకై ఊపిరొక్కటే నిరీక్షించినా 
నను చేరాలి ఎవరాపినా 

నీతో నీడల్లే రానా 
నాలో నేనంటూ లేనా




నాలో పరుగులు తీసె మనసే పాట సాహిత్యం

 
చిత్రం: భీమిలి కబడ్డీ జట్టు (2010)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తిక్ , చిన్మయి

నీతో నడచిన నిమిషం నిమిషం 
చూపులు కలసిన తరునం తరునం 
ఏదొ తెలియని మధనం మధనం 
కాద ఇది తొలి ప్రనయం ప్రనయం 

నాలో పరుగులు తీసె మనసే 
నీకై వెతికెను తెలుసునా 
నాకే తెలియక విరిసే వయసే 
నీతో చెలిమిని కోరెనా 
ఎన్నడు కదలని నా మదే 
నీ వెన్నంటె పదమని తరిమెనే 
ఎవ్వరు నువ్వని అడగకే 
ఈ రెప్పల చాటున దాచుకుంది నిన్నే 

ఉరికే అల్లరి హృదయం హృదయం 
నిన్నే వలచిన సమయం సమయం 
కాదే ఇరువురి పయనం పయనం 
ఏ దరి చేర్చునో పరువం పరువం 

నాలో పరుగులు తీసె మనసే 
నీకై వెతికెను తెలుసునా 
నాకే తెలియక విరిసే వయసే 
నీతో చెలిమిని కోరెనా 

పట్టుకుంటె ప్రాయమల్లుకుందీ 
వెల్లువైన హాయి మనసు పడమంది 
అతదినే తలపులో నిలబెడుతుందీ 
అందినట్టె అంది ఆశ పెడుతుందీ 
కల్లతోటి నవ్వి మాయమవుతుందీ 
ఇటు సగం అటు సగం ఒకటవుతోందీ 
కోరని ఓ వరమే నువ్వై ఎదురుగ నిలిచినదీ 
తీరని ఏ రుణమో నీతో ముడిపడమంటుందీ 

ఉరికే అల్లరి హృదయం హృదయం 
నిన్నే వలచిన సమయం సమయం 
సాగే ఇరువురి పయనం పయనం 
ఏ దరి చేర్చునో పరువం పరువం 

నాలో పరుగులు తీసె మనసే 
నీకై వెతికెను తెలుసునా 
మోడై నిలిచిన్న నిన్నటి వయసే 
పూచిన కథనే తెలుపనా 

ఊపిరున్న శిలై బ్రతుకున్నాలే 
ఉన్నపాటు గానే నిన్ను కలిశాలే 
నీ జతే దొరికితే మనిషవుతాలే 
తూనిగల్లె రోజు తుల్లి తిరిగాలే 
నిన్ను చూడ గానే ఈడు నెరిగాలే 
ఆయువే తీరినా నిను వీడనులే 
తియ్యని ఈ కలలే కంటు తోడుగ ఉంటాలే 
ఒంటరి మనసుకి నీ స్నేహం ఊపిరి పోసెనులే 

ఉరికే అల్లరి హృదయం హృదయం 
నిన్నే వలచిన సమయం సమయం 
సాగే ఇరువురి పయనం పయనం 
ఏ దరి చేర్చునో పరువం పరువం




జాతర (నిడదవోలు పిల్లా) పాట సాహిత్యం

 
చిత్రం: భీమిలి కబడ్డీ జట్టు (2010)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం:
గానం: మాయ, కార్తిక్, వినయ్, అనుజ్ గుర్వార, మాలతి లక్ష్మణ్

జాతర (నిడదవోలు పిల్లా)

Most Recent

Default