Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vadde Naveen"
Srimati Kalyanam (2010)



చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
నటీనటులు: వడ్డే నవీన్, సంగీత 
దర్శకత్వం: శివాల్ 
నిర్మాత: బాను కిరణ్ 
విడుదల తేది: 02.04.2010



Songs List:



అరె అరె ఆజారే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ 
గానం: తడరాజు, దివిజ కార్తీక్ 

అరె అరె ఆజారే



మనసులోని మాటలే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: తడరాజు
గానం: తడరాజు, దివిజ కార్తీక్ 

మనసులోని మాటలే 



చలి చలి గా ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: డైరెక్టర్ శివాల్ 
గానం: సునీత 

చలి చలి గా ఉంది 




మోడల్ గర్ల్స్ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బండారు దానయ్య 
గానం: తడరాజు

మోడల్ గర్ల్స్ 



మేఘమే నువ్వైతే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బండారు దానయ్య 
గానం: కార్తీక్, దివిజ కార్తీక్ 

మేఘమే నువ్వైతే 



అనకాపల్లి అందగత్తెని పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బండారు దానయ్య 
గానం: మాలతి, సాయి కార్తీక్ 

అనకాపల్లి అందగత్తెని 



రాయమ్మ రాయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమతి కళ్యాణం (2010)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: డైరెక్టర్ శివాల్ 
గానం: తడరాజు, దివిజ కార్తీక్ 

రాయమ్మ రాయమ్మ 


Palli Balakrishna Thursday, August 11, 2022
Ayodhya (2005)



చిత్రం: అయోధ్య (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: కృష్ణ, వడ్డే నవీన్, రతి, ప్రేమ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: దొడ్డా రామగోవిందరెడ్డి
విడుదల తేది: 21.04.2005



Songs List:



చోడో చోడో పాట సాహిత్యం

 
చిత్రం: అయోధ్య (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మాలతి, టిప్పు

చోడో చోడో



అడగందే అందాలు పాట సాహిత్యం

 
చిత్రం: అయోధ్య (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జయసూర్య 
గానం: టిప్పు, కల్పన 

అడగందే అందాలు 



ఆ గగనం విరిగిందా పాట సాహిత్యం

 
చిత్రం: అయోధ్య (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

ఆ గగనం విరిగిందా 




జిమ్ము చూడు పాట సాహిత్యం

 
చిత్రం: అయోధ్య (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: వాసు, నిష్మా

జిమ్ము చూడు 



నవ్వుల పువ్వులు పాట సాహిత్యం

 
చిత్రం: అయోధ్య (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సాయి హర్ష 
గానం: మనో 

నవ్వుల పువ్వులు 

Palli Balakrishna Wednesday, March 13, 2019
Preminche Manasu (1999)


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్
నటీనటులు: వడ్డే నవీన్, కీర్తి రెడ్డి, రవితేజ
దర్శకత్వం: ఆదినారాయణ
నిర్మాత:
విడుదల తేది: 17.09.1999



ఎవరే చెలి నువ్వెవరే



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో


మాలోని  మాట పాట ఆట



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర


నీకు తెలుసు కథ



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్


నీ చూపు చలమ్మ



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం:


మై డియర్ మై డియర్



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం:


ముంబై మినుకు బంగారు షేక్




Palli Balakrishna Wednesday, February 13, 2019
Priya O Priya (1997)



చిత్రం: ప్రియా ఓ ప్రియా (1997)
సంగీతం: కోటి
నటీనటులు: వడ్డే నవీన్, అబ్బాస్, సిమ్రాన్
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాతలు: యన్. అర్. అనురాధ దేవి, కె. భానుప్రసద్
విడుదల తేది: September.1997



Songs List:



# పాట సాహిత్యం

 
Song Details




కమ్మని కలలకు ఆహ్వానం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియా ఓ ప్రియా (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

హూలల హూలల హులల్లా 
హూలల్లా అలా
హూలల హూలల హులల్లా 
హూలల్లా అలా

కమ్మని కలలకు ఆహ్వానం 
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకి నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం

హ్యాపీ న్యూ ఇయర్ 
హ్యాపీ న్యూ ఇయర్ 

పులకించిన కాలపు వడిలో
పురివిప్పినదో స్వర పుష్పం
చిరు నవ్వుల వీణలు మీటి
వినిపించినదో నవ రాగం

హ్యాపీ న్యూ ఇయర్ 
హ్యాపీ న్యూ ఇయర్ 

కమ్మని కలలకు ఆహ్వానం 
చక్కని చెలిమికి శ్రీకారం
హ్యాపీ న్యూ ఇయర్ 

ఓ జాబిలి నా నెచ్చెలి 
విన్నానులే నీవన్న మాట 
నాకోసమే వస్తావని 
కట్టానులే ఓ కలల కోట
అణువణువు నిన్ను తడిమే 
చూపులకి ఎంత మహిమో
అనుక్షణము నిన్ను పిలిచే 
పెదవులకి ఎంత సుఖమో

ప్రియా ఓ ప్రియా...
ప్రియా ఓ ప్రియా...

మనసులో ఉన్నది ఓ మాట
తెలుపన కమ్మగ ఈ పూట
ప్రియా ఓ ప్రియా...

హూలల హూలల హులల్లా 
హూలల్లా అలా
హూలల హూలల హులల్లా 
హూలల్లా అలా

ఓ నేస్తమా చిరుగాలితో 
కబురంపినా నేనాగలేక
ఓ జానేమన్ మేడ్ ఇన్ హెవెన్ 
రాసేయనా ఓ ప్రేమ లేఖ
విరహమనే మంచు తెరలో 
చిక్కినదో లేత పరువం
కౌగిలిలో వెచ్చబడితే 
కరుగునులే కన్నె బిడియం

ప్రియా ఓ ప్రియా...
ప్రియా ఓ ప్రియా...

మనసులో ఉన్నది ఓ మాట
తెలుపన కమ్మగ ఈ పూట
ప్రియా... ఓ ప్రియా...

పులకించిన కాలపు వడిలో
పురివిప్పినదో స్వర పుష్పం

ప్రియా... ఓ ప్రియా...
ప్రియా... ఓ ప్రియా...



# పాట సాహిత్యం

 
Song Details




చిటపట చినుకుల వానా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియా ఓ ప్రియా (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
వానా వానా వానా వానా (2)

చిటపట చినుకుల వానా 
చిగురాశ రేపె నాలోనా 

వానా వానా వానా వానా 

చలి చలి స్వరముల వీణా 
ఎదలోన చిలిపి థిల్లానా

వానా వానా వానా వానా 

ఏవేవో కొత్త ఊహలు 
ఎన్నెన్నో కొంటె ఊసులు
ఆహ్వానం పాడుతున్న లయలోనా 
చిలిపిగ చేరనా

వానా వానా వానా వానా (2)

చిటపట చినుకుల వానా 
చిగురాశ రేపె నాలోనా 
చలి చలి స్వరముల వీణా 
ఎదలోన చిలిపి థిల్లానా

చరణం: 1
నీటి మంటతో లేత ఒంటిలో 
తీగ ఈడు వేగుతున్న వింత చూడనా 
కోడె జంటలో వేడి వంటతో 
సోయగాల పాయసాల విందు చేయనా
ఊరించే అందమందన 
ఊపిరితో ఊదుకొందునా 
కళ్ళారా ఆరగించమంటే..
పరుగున వాలనా

వానా వానా వానా వానా (2)

చిటపట చినుకుల వానా 
చిగురాశ రేపె నాలోనా 
చలి చలి స్వరముల వీణా 
ఎదలోన చిలిపి థిల్లానా

చరణం: 2
చిమ్మచీకటీ సమ్మతించెలే 
కమ్మనైన సంగతేదో విన్నవించనా
తిమ్మిరేవిటో కమ్ముకుందిలే 
నమ్మరాని సంబరాన నిన్ను తేల్చనా
జల్లేమో వంతెనేయగా 
పిల్లేమో సొంతమాయెగా
లవ్లీగా చెంత చేరుకొని రా...
తహ తహ పంచనా 

వానా వానా వానా వానా (2)

చిటపట చినుకుల వానా 
చిగురాశ రేపె నాలోనా 

వానా వానా వానా వానా 

చలి చలి స్వరముల వీణా 
ఎదలోన చిలిపి థిల్లానా

వానా వానా వానా వానా 
ఏవేవో కొత్త ఊహలు 
ఎన్నెన్నో కొంటె ఊసులు
ఆహ్వానం పాడుతున్న లయలోనా 
చిలిపిగ చేరనా

వానా వానా వానా వానా (2)





# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Friday, December 8, 2017
Chala Baagundi (2000)




చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
నటీనటులు: శ్రీకాంత్ , వడ్డే నవీన్ , మాళవిక , ఆశా షైనీ, ముంతాజ్, రాఘవ లారెన్స్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 18.02.2000



Songs List:



దాయమ్మ దాయి దా దా పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా
ఓసి నా సంపదా దా దా దా దా
అందుకో దా - అందమా దా

దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా

చరణం: 1
తద్దిం తక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమె
నిద్దర్లిక వద్దన్నదిరో వత్తిళ్లకు ఒళ్ళున్నదిరో
ఇత్తిత్తని నను చుట్టిన ఎద తట్టిన రద పెట్టిన
ముడిపెట్టిన జత జెట్టివి రో
నిను పట్టిన నీ జట్టునురో
పందెం అని ముందుందని అందిందని పొంది
కసి సిందందని కందిందని బంధం పడరా
అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి
రసకందాయం అందాలని సిందేయననా
అల్లుకుందాం పదా దా దా దా దా
కొంటె బాధ - తీర్చుకో దా...

దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా

చరణం: 2
ఒళ్ళిక్కడ కళ్ళక్కడ కలలిక్కడ కైపక్కడ
ఇరుపక్కల వలపక్కడిది జత చిక్కిన వయసిక్కడిది
ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కల వరిమిక్కిలి
తడితిక్కల ముద్దిక్కడిదే
పెదవెక్కడ మధువక్కడిదే
మదమెక్కిన మగహక్కుల చెలి సిగ్గులు పుణికి
తన చేజిక్కిన ఒడిదగ్గర  చలి తగ్గినది
అల చుక్కలు కలదిక్కుకు చిరు రెక్కలు తొడిగి
మన మనసక్కడ మహ చక్కగ సుఖమెక్కినది
హాయి అర్ధం ఇదా... దా దా దా దా
ఆడుకో దా - అల్లుకో దా

దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా
ఓసి నా సంపదా దా దా దా దా
అందుకో దా - అందమా దా




దాహం పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర


దాహం 




దివి దారివిడి పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, సంగీత 

దివి దారివిడి 




శ్రీకారం ఇది మరో పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పార్ధసారధి, గోపిక పూర్ణిమ


శ్రీకారం ఇది మరో 



ఏయ్ రుక్కమ్మ చుక్కమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర 

ఏయ్ రుక్కమ్మ చుక్కమ్మ 



ఎంత బాగుంది బ్రదరూ ఈ వెదరు పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు


ఎంత బాగుంది బ్రదరూ ఈ వెదరు

Palli Balakrishna Tuesday, November 28, 2017
Maa Avida Meeda Ottu Me Avida Chala Manchidi (2001)


చిత్రం : మా అవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది (2001)
సంగీతం: శ్రీనివాస మూర్తి
సాహిత్యం: సిరివెన్నెల , చంద్రబోస్
గానం:
నటీనటులు: శ్రీకాంత్ , వడ్డే నవీన్ , రాశి, లయ
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 04.02.2001

పల్లవి:
ఎన్నాళ్లకో ఇలా విన్నానే కోయిల
నన్నేలుకో ఇలా ఎదురైన కోవెల
మురళీ స్వరాలుగా మురిసే క్షణాలుగా
ముగబోని రాగవీణ మోగిన వేళ

ఎన్నాళ్లకో ఇలా విన్నానే కోయిల
నన్నేలుకో ఇలా ఎదురైన కోవెల
మురళీ స్వరాలుగా మురిసే క్షణాలుగా
ముగబోని రాగవీణ మోగిన వేళ

చరణం: 1
నా ఇంటిలో ఎపుడూ చూడని ఈ కాంతి నువ్వేనని
నా కళ్ళలో నీ చిరునవ్వుతో సిరి దీపాలు వెలిగించని
నా గుండెలో ఈ మౌనం ఇలా ఇన్నాళ్లు కొలువుండని
ఈ నాటితో నా కన్నిటితో భారాన్ని కరిగించని
ఈ నిమిషం నిజమని నా మనసునే నమ్మని
ఈ కలయికే ఋజువని నీ చెలిమిలో చెప్పని
నిద్దర్లేని నిట్టూర్పుని నిన్నట్లోకి నెట్టేయని
హద్దుల్లేని ఈ హాయిని ఇద్దర్నొకటి చేసేయని
ముళ్లే విడని ముచ్చటల మధురిమలో

నన్నేలుకో ఇలా ఎదురైన కోవెల
మురళీ స్వరాలుగా మురిసే క్షణాలుగా
ముగబోని రాగవీణ మోగిన వేళ

Palli Balakrishna
Snehithulu (1998)


చిత్రం: స్నేహితులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు:  నవీన్ వడ్డే , రాశి, సాక్షి శివానంద్
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: బద్వేలు శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 1998

పల్లవి:
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా
జాకీచాన్ అయిపోయాను ఎవ్వరు ఎదురైనా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
ఒట్టేస్తాను ఒళ్ళో నేను ఇంకా డౌటేనా
వచ్చేశాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
అయితే అంత దూరమా ఇపుడే జంట చేరుమా
అరెరే అంబ ఆత్రమా అపుడే కొంటె బేరమా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

చరణం: 1
వెన్నా జున్ను తిన్నప్రాయం అందించావంటే
సున్నితంగా చూసుకుంటా నా ప్రాణం కంటే
నిన్న మొన్న లేని భారం గుర్తొచ్చిందంటే
నిన్నే మెచ్చి ఈ వయ్యారం నీ సొమ్మైనట్టే
నాకోసం పుట్టావే నయగారమా
గుట్టే కనిపెట్టలేన తీరవా
మదిలో ప్రేమ మధుమాసమైయ్యి పువ్వంటి యవ్వనమ
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా
వచ్చేస్తాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

చరణం: 2
ఇంటా బయటా వెంటాడే నీ వాటం చూస్తుంటే
కంచె తెంచే కాలం అట్టె దూరం లేనట్టే
ఊరించే నీ అందాన్నట్టా ఉరేగిస్తుంటే
ఊరు వాడ ఏరై పొంగే ప్రళయం ఉన్నట్టే
కాగే తాపం ఆగేదాక యాతన
కాలక్షేపం సాగే దారే లేదన
కౌగిళ్ళ సీమ చెయ్యాలి భామ తొందరగ జతపడుమా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా
వచ్చేస్తాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
అయితే అంత దూరమా ఇపుడే జంట చేరుమా
అరెరే అంబ ఆత్రమా అపుడే కొంటె బేరమా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా


********  ********  ********


చిత్రం: స్నేహితులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాసు

పల్లవి:
ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం... ఇదేం శాపం...
నీ ఆశలను గాలి పాలు చేసే నలు దిశలు

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం... ఇదేం శాపం...

చరణం: 1
మూడుముళ్లనే మురిపాలు
మూడునాల్లకే మట్టిపాలు
ఏడు అడుగుల పయణాలు
నీకు చూపినవి నరకాలు
ఏమి నేరమని ఈమె నోములను
కాల రాచినవి కష్టాలు
ఓ... బ్రహ్మయ్యా...
ఆడ జన్మ పొంది చూడయ్య

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం... ఇదేం శాపం...

చరణం: 2
ఆదరించు మనసేదైన
ఆత్మబంధువే ఔతుంది
రక్తబంధమే లేకున్నా
మానవత్వమే చాలంది
మనిషిలోని ఆ మంచితనమే
ఈ నేల తల్లిని నిలిపింది
ఓ... చిట్టి తల్లీ... నేడు నీకిదే పునఃజన్మ

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం... ఇదేం శాపం...
నీ ఆశలను గాలి పాలు చేసే నలు దిశలు

Palli Balakrishna Monday, July 31, 2017
Pelli (1997)




చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
నటీనటులు: నవీన్, మహేశ్వరి, పృద్విరాజ్, సుజాత 
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: రామ లింగేశ్వరరావు
విడుదల తేది: 08.08.1997



Songs List:



ఓ యవ్వన వీణ పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి. బాలు

ఓ యవ్వన వీణ పువ్వుల వాన 
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న

ఓ యవ్వన వీణ పువ్వుల వాన 

నువ్వుంటు పుట్టినట్టు నాకొరకు 
ఆచూకి అందలేదు ఇంతవరకు
వచ్చింది గాని ఈడు ఒంటి వరకు 
వేదించలేదు నన్ను జంట కొరకు
చూశాక ఒక్కసారి ఇంత వెలుగు
నా వంక రాను అంది కంటి కునుకు
ఈ అల్లరి ఈ గారడి నీ లీలే అనుకోన

నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
ఓ యవ్వన వీణ పువ్వుల వాన 

ఏ పూల తీగ కాస్త ఊగుతున్న 
నీ లేత నడుమే అనుకున్నా
ఏ గువ్వ కిలకిల వినపడినా
నీ నవ్వులేనని వెళుతున్నా
మేఘాల మెరుపులు కనబడిన
ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా

నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
ఓ యవ్వన వీణ పువ్వుల వాన 
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న




పైట కొంగు ఎంతో మంచిది పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదిక ఈడు
నచ్చజెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు
కాసుకో అమ్మడు కొంటె దూకుడు

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

సొగసులు ఇమ్మని నిను బతిమాలని
తెగబడి రమ్మని పిలవకు వయసుని
సొగసులు ఇమ్మని నిను బతిమాలని
తెగబడి రమ్మని పిలవకు వయసుని
అదిరిపడే పెదవులలో అనుమత నే చదవని
బిడియ పడే మనసు కదా అడగకు పైకనమని
బెదురు ఎంత సేపని ఎవరున్నారని
అదును చూసి గమ్ముని అందాలయ్యా అందాన్ని

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
ఓ పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

చలి చలి గాలిలో చెమటలు ఏంటట
వలపుల లీలలో అది ఒక ముచ్చట
చలి చలి గాలిలో చెమటలు ఏంటట
వలపుల లీలలో అది ఒక ముచ్చట
ఎదురు పడే మదనుడితో వరస ఎలా కలుపుట
తెరలు విడే తరుణములో తెలియనిదేముందట
మాయదారి ప్రేమలో ఏంచేయాలట
మోయలేని హాయిలో ఒళ్ళో కొస్తే చాలట

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
ఆ... పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదిక ఈడు
నచ్చజెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు
కాసుకో అమ్మడు కొంటె దూకుడు

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది




కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా

కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
దొరికే చుక్కను ఏలే దొరనే నవ్వాల
కొరికే కోరిక చూసి చిలకై నవ్వాల
వన్నెల్లో అంతా మనకేసె చూసే వేళ

ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా

నిద్దుర చెడి మధన పడి మదిని లాలించాలి
ముచ్చట పడే ముద్దుల తడే మొదటి ముడవ్వాలి
ప్రతి పొదలో మన కథలే కొత్త పూత పూయించాలి
మతి చెదిరే శృతి ముదిరే తందనాలు పొక్కించాలి
పందిరి పట్టే అందాలన్ని సందిట పెట్టాలి
తొందరపెట్టే ఆరాటాన్ని ముందుకు నెట్టాలి
ఏకాంతాన్నంత మన జంటే పాలించాలి

ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా

సిగన నువ్వే మొగలి పువ్వై ఒదిగి ఉందువు గాని
చిలిపి నవ్వే పిలుపు నిస్తే రానా కిన్నెర సాని
కోడె నాగుల కొంటె సెగలే చుట్టుకొని కాటెయ్యాలి
కొండ వాగుల కన్నె వగలే కమ్ముకొని కవ్వించాలి
చిటిక విని సంతోషంతో తెచ్చా సొంపుల్ని
కలలు గనే సావాసంతో గిచ్చా చెంపల్ని
కౌగిల్లో రాని ఎదపాడే రాగలన్ని

ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
దొరికే చుక్కను ఏలే దొరనే నవ్వాల
కొరికే కోరిక చూసి చిలకై నవ్వాల
వన్నెల్లో అంతా మన కేసి చూసే వేళ

ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా



జాబిలమ్మ నీకు అంత కోపమా పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా 
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 
అల్లాడిపోదా రేయి ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..
 
చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా
చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా
ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా
హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా
మరి అంత దూరమా కలలుకన్న తీరమా
 
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..

మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మా
మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా
ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా
తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా
ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా 
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 
అల్లాడిపోదా రేయి ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .. 




రుక్కు రుక్కు రుక్కు మిని పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మనో

రుక్కు  రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా
రుక్కు  రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా
ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారు గున్నది ఓరెవ
అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగ ఉందిర వారెవ

రుక్కు  రుక్కు రుక్కు మిని హొయ్
రుక్కు  రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా

ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ
బుగ్గమీద సిగ్గు బొమ్మ విచ్చిందోయమ్మ
ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ
బుగ్గమీద సిగ్గు బొమ్మ విచ్చిందోయమ్మ

విరిసి విరియని మొగ్గర ముద్దే తగలని బుగ్గరా
మెరిసే ఈ సిరి నీదిర వరమే అనుకో సోదరా
అందమైన కుందనాల కూన నీ చెంత చేరుతున్నది కదరా నాన్న
పొందికైన సుందర వదన నీ పొందుకోరుతున్నది
పదరా నాన్న
సొంపులందుకో - హొయ్
స్వర్గ మేలుకో - హొయ్
చిన్నదాని వన్నెలన్ని కన్యాదానమందుకోని నవాబువైపోరా నీ నసీబు మారునురా

రుక్కు  రుక్కు రుక్కు మిని హొయ్
రుక్కు  రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా

కలికి నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారెగ
చిలక నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలెగ
అరెరరె బంగరు జింక నీకు అంతలోనే ఇంతటి సిగ్గా సిగ్గా
అపుడే ఏమైంది గనక ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా
కంటి విందుగా - హొయ్ 
జంట కట్టగా - హొయ్
హోరు హోరు హోరు అంటు ఊరు వాడ అంత చేరి హుషారు హంగామా
మహా కుషీగ చేద్దామా
అరెరరె...


రుక్కు  రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా
రుక్కు  రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా
ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారు గున్నది ఓరెవ
అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగ ఉందిర వారెవ




అనురాగమే మంత్రంగా పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె. జే. యేసుదాసు

అనురాగమే మంత్రంగా 
అనుబంధమె సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్లికి 
మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
ఓ... మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం

అనురాగమే మంత్రంగా 

మూడుముళ్లు తోనే పెళ్లి పూర్తి కాదు అని
మరో ముడిగ చేరుకున్న స్నేహ బంధమిది
సప్తపదితో ఆగరాదు జీవితం అని
అష్ట పదిగ సాగమంది ప్రేమ పదము ఇది
నాతి చరామి మంత్రములో
అర్ధము తెలిసిన నేస్తముతో
అడుగు కలుపుతు వెలుగు వెతుకుతూ
సాగె సమయమిది ఆగని పయనమిది

అనురాగమే మంత్రంగా 
మమత కొలువులో జరుగు పెళ్లికి 
మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
అనురాగమే మంత్రంగా 

ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని
అత్త గుండెలోన కూడ అమ్మ ఉన్నదని
బొమ్మలాట లాడుతున్న బ్రహ్మ రాతలని
మార్చిరాసి చూపుతున్న మానవత్వమిది
చరితల చదవని తొలి కథగా
మనసులు ముడిపడు మనుగడగ
తర తరాలుకు నిలిచి పొమ్మని 
తల్లిగ దీవించే చల్లని తరుణమిది

అనురాగమే మంత్రంగా 
అనుబంధమె సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్లికి 
మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
ఓ... మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
అనురాగమే మంత్రంగా 

Palli Balakrishna Sunday, July 16, 2017
Manasicchi Choodu (1998)



చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: వడ్డే నవీన్ , రాశి, రవితేజా
దర్శకత్వం: ఆర్.సురేష్ వర్మ
నిర్మాత: యమ్. వి.లక్ష్మీ
విడుదల తేది: 27.11.1998



Songs List:



అంతే ఈ ప్రేమ వరస పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి.బాలు, సుజాత

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
నీ తోడు కోరింది నా ఊపిరి
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
ఈ వేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళులాగలేదు కాదా
నీ లోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందాలేదా

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా

బాష మొత్తము మాయమైనదా
గుండె మాట గొంతుదాటి  రాదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
శ్వాసమాత్రము గేయమైనదా 
హాయి పాట నన్ను మీటుతోంది
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
నీలో ఏదో కొత్తకోణం చూశా నువ్వు నువ్వేన కాళిదాసా
నువ్వే కదా నిండు ప్రాణంపోసి వీడ్ని పెంచావు కన్నె హంస
ఒక్క మాటే అని కోటి భావాలని 
అందజేయాలని కొత్త పాఠం నీదే తెలుసా

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా

కన్ను బొత్తిగా చిన్నదైనదా నిన్ను తప్ప ఏమిచూడలేదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక కాలమంత ఆగిపోయి ఉంది
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
ఏతా వాత దీని వాటం చూస్తే తియ్యగావున్న కత్తికోత
ఇంటా బయటా మొగమాటం పెట్టె తప్పుకోలేని వింత వేట
మంచు మంటై ఇలా అంటుకుంటే ఎలా
పంచుకుంటే తనే తగ్గుతుందో ఏమో బహుశా

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
నీ తోడు కోరింది నా ఊపిరి
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
ఈ వేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళులాగలేదు కాదా
నీ లోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందాలేదా

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా





బోడి చదువులు వేస్ట్ పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మనో, మురళి, తేజ, మోహన్ 

పల్లవి:
బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ!
ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేటట్టు!

ఒక్క ఫోజు కొట్టు లక్షలు వచ్చిపడేటట్టు
అడిడాసు బూట్లు తొడగవ నీకు ఆరు కోట్లు
ఎంత చదివితే సంపాదిస్తవు అంత పెద్ద అంతస్తు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు
.
చరణం: 1
చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుంద నీ జుట్టు
థార్ ఎడారి గోలెందుకురా గోదారి ఒడ్డునుంటూ
వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెపుడో నాటిన చెట్లు
పాత డేట్లు బట్టీ వేస్తూ అసలేంటీ కుస్తీ పట్లు
ఐ.క్యు అంటే అర్థం తెలుసా అతి తెలివికి తొలి మెట్టు
ఆడే పాడే ఈడుని దానికి పెట్టకు తాకట్టు
పనికిరాని చెత్తంతా నింపకు మెదడు చెదలు పట్టు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు
.
చరణం: 2 
లీకు వీరులకు ముందే తెలుసు క్వస్చన్ పేపర్ గుట్టు
లోక జ్ఞానం కలిగిన వాడే కోచింగ్ సెంటర్ పెట్టు
బాబూ!మార్కుల కోసం ఏడవలేదురా ఎదిగిన ఏ సైంటిస్ట్
గుర్తుపట్టర ఏ రంగంలో ఉందో నీ ఇంట్రస్టు
నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు
నీకు నువ్వు బాసవ్వాలంటే దాన్ని బయట పెట్టు
రేసు హార్సువై లైఫును గెలిచే పరుగు మొదలుపెట్టు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు

చరణం: 3
రెండో ఎక్కం రాకపోయినా నీకేమిట్రా లోటు కాలిక్యులేటర్ చేపట్టు డోంట్ వర్రీ
బిల్లు కడితే నీ బెడ్రూంలో వేస్తాడు బాసింపెట్టు సాక్షాత్తూ బిల్ గేట్సు
పిచ్చోడెవరో జుట్టుని పీక్కుని ఎన్నో కనిపెట్టు
పైసా ఉంటే అదే నీకు అవి అన్నీ కొనిపెట్టు
చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి కమ్మంటూ
సలహా ఇస్తున్నానని అనుకుంటే అదే రాంగు రూటు
బతుకు బాటలో ముందుకు నడపని బరువు మొయ్యవద్దు హొయ్
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు




జిలిబిలి జాబిలి పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, చిత్ర 

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న
హితులు స్నేహితులు ఎందరు ఉన్నా
యమునా కోసమే చూస్తున్నా
తెలుగు పలుకు లెన్నెన్నో ఉన్నా
యమునా పదమే తీపంటున్నా
యమునా యమునా యమునా

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న

నా మదీ మహా నదీ వరదౌతున్నదీ
ఈ ఇదీ ఇలాంటిది ఎపుడూ లేనిదీ
తాను అలా ఎదురౌ క్షణాన
నిలువున కదిలిపోనా
నిలవనా మరీ మరో జగాన

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న

నా బలం ఘనం జనం యమునా స్నేహమే
నా స్థలం నిరంతరం యమునా తీరమే
మనసే కోరి వలచే
మమతే తనది కాదా
మునగానా తానా మనస్సులోనా

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న
హితులు స్నేహితులు ఎందరు ఉన్నా
యమునా కోసమే చూస్తున్నా
తెలుగు పలుకు లెన్నెన్నో ఉన్నా
యమునా పదమే తీపంటున్నా

యమునా యమునా యమునా





గులాబీ రెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు

గులాబీ రెమ్మ 



లవ్వు చేయండ్రా పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో 

పల్లవి:
లవ్వు చేయండిరా మీరు లాభపడండిరా (2)
మట్టి ముద్ద ముత్యమల్లే ఎలా మారేరా
అరె రాగిముక్క రత్నమల్లే ఎలా మెరిసేరా
గడ్డిపువ్వు పారిజాతం ఎలా అయ్యెరా
అరె పోకిరోడు ప్రయోజకుడు ఎలా మరేరా
ప్రేమ వల్లరా ప్రేయసి మాటవల్లరా
బలం వుందిరా ప్రేమకు ఫలితముందిరా
లవ్వు చేయండిరా మీరు లాభపడండిరా
బయలుదేరండిరా మీరు బాయ్ఫ్రేండ్స్ కండిరా
.
చరణం: 1
గుండె కాయలోన ఒకరి బొమ్మ ఉంచరా
అది కొండమీది కోతినైన దించుతుందిరా
అండ ఒకరు దొరుకునన్న ఊహ చాలురా
అప్పుడు ఎండ మావిలో నుంచి నీళ్ళు తీయవచ్చురా
గుడ్డికాదురా ప్రేమ బ్లడ్ లైట్ రా
అడ్డురాదురా లైఫుకి ఒడ్డు చూపరా
.
చరణం: 2
ప్రేమలోన చెప్పలేని ప్రేరణుందిరా
ఇంపాజిబుల్ పాజిబుల్ గా మార్చుతుందిరా
ప్రేమలోన అంతులేని శక్తి ఉందిరా
పోక్రాన్లో బాంబులాగా పేలుతుందిరా
వద్దు అనకురా ప్రేమకు సిధ్ధమవ్వరా
మొద్దు మనిషిని ముద్దుగా దిద్దుతుందిరా




సలాం లేకుం భామా పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

సలాం లేకుం భామా

Palli Balakrishna Monday, June 12, 2017

Most Recent

Default