Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Suresh"
Aalaya Deepam (1985)



చిత్రం: ఆలయ దీపం (1985)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: మురళీమోహన్, సుజాత, సరాజేష్, కల్పన
మాటలు: పి.సత్యానంద్
దర్శకత్వం:  CV శ్రీధర్ 
నిర్మాత: ఎన్.ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 18.01.1985

ఈ సినిమా తమిళ్ లో ఇదే పేరుతో 1984 లో విడుదలయింది. తెలుగులో రీమేక్ చేసారు. తమిళ్ సినిమాకి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతం, తెలుగులో సత్యం గారు సంగీతం అందించారు




Songs List:



ముద్దియ్యనా మురిపించనా పాట సాహిత్యం

 
చిత్రం: ఆలయ దీపం (1985)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

ముద్దియ్యనా మురిపించనా 



ఆకాశం ఎరుగని సూర్యోదయం పాట సాహిత్యం

 
చిత్రం: ఆలయ దీపం (1985)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల

ఆకాశం ఎరుగని సూర్యోదయం



పున్నమి జాబిలి వెన్నెల వెలుగులు పాట సాహిత్యం

 
చిత్రం: ఆలయ దీపం (1985)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పున్నమి జాబిలి వెన్నెల వెలుగులు




పగలు రాత్రి వెలిగే తారక పాట సాహిత్యం

 
చిత్రం: ఆలయ దీపం (1985)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.శైలజ & కోరస్

పగలు రాత్రి వెలిగే తారక



పై పైకి దూకిందమ్మ ఈడు పాట సాహిత్యం

 
చిత్రం: ఆలయ దీపం (1985)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: మాధవపెద్ది రమేష్, యస్.పి.శైలజ

పై పైకి దూకిందమ్మ ఈడు

Palli Balakrishna Wednesday, November 29, 2023
Kumkuma Tilakam (1983)



చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి (All)
గానం: జేసుదాస్, యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: మురళీమహన్, జయసుధ, సురేష్, తులసి 
దర్శకత్వం: బి. భాస్కర రావు 
నిర్మాత: యడవల్లి విజయేంద్ర రెడ్డి 
విడుదల తేది: 28.01.1983



Songs List:



ఆలనగా పాలనగా పాట సాహిత్యం

 
చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: జేసుదాస్ 

ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నా రాణిగా

నీ చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలన్నీ
అరఘడియైనా నీ ఎడబాటు వెన్నెల కూడా చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నా రాణిగా

మోమున మెరిసే కుంకుమ తిలకం నింగిని వెలిగే జాబిలి కిరణం
నేనంటే నీ మంగళ సూత్రం నువ్వంటే నా ఆరో ప్రాణం
లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నా రాణిగా




ఆలనగా పాలనగా పాట సాహిత్యం

 
చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: పి.సుశీల

ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీ దానిగా స్వామీ పాలించు నీ దాసిగా

పున్నమి కోరే రేయిని నేను పూజకు వేచిన పువ్వును నేను
నిన్నటి దాకా నాలో నేను ఈ నిమిషానా నీతో నేను
లాలించు నీ దానిగా స్వామీ పాలించు నీ దాసిగా

నీ హృదయం ఒక సాగరమైతే బిందువునైనా చాలును నేను
నీ ఒడిలో పసిపాపను కానా? నీ పాదాల రేణువు కానా?
లాలించు నీ దానిగా స్వామీ పాలించు నీ దాసిగా



చిట్టి నాన్న పాట సాహిత్యం

 
చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చిట్టి నాన్న




మోమున బొట్టెట్టి పాట సాహిత్యం

 
చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: జేసుదాస్, పి.సుశీల

మోమున బొట్టెట్టి




నీ వయసే పదహారు పాట సాహిత్యం

 
చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

నీ వయసే పదహారు 

Palli Balakrishna Monday, July 11, 2022
Pelli Gola (1993)



చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
నటినటులు: సురేష్ , రంభ 
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య 
నిర్మాతలు: సి.వి.రెడ్డి, కె.శ్రీదేవి
విడుదల తేది: 25.06.1993



Songs List:



అమ్మో నొప్పి పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: డి.నారాయణ వర్మ 
గానం: మనో, చిత్ర

అమ్మో నొప్పి 




బావ బావ పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,చిత్ర

బావ బావ




గోల గోల పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు,చిత్ర

గోల గోల 




ఇది రాగమైన అనురాగమే - 1 పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,చిత్ర

పల్లవి:
ఇది రాగమైన అనురాగమే తొలి అనుభవ గీతమిదే
కన్నులే యద జల్లగా...కాటుకే హరివిల్లుగా 
జత పడిన మనకు శ్రుతి కలిసెనిపుడు 
ప్రియతమా మధురలయే కదా మనుగడ

చరణం:
వేణువులూదేను వేసవి గాలి 
మువ్వలు చిందే కిన్నెరసాని 
మగసిరి మారాజు దొరికేనని 
సొగసిరి అందాలు దొరకేనని 
ఇటు పూలతోట..అటు తేనెపాట 
ప్రియ స్వాగతాలు పాడేసన్నగా
అలివేణిలాగా చలి వీణతీగ
విరి మూగబాసలాడె ముద్దుగా 
యద ఝుమ్మని...దరి రమ్మని 
తొలిఋతువు పలికె పసి పెదవి వణికే
మామ అనే మధుర వసంతమే మనుగడ

చరణం:
నవబృందావని నవ్వుల మాసం 
మమతల కోయిల మధురసరాగం 
మనసున నీ నీడ పోడిగించగా
మనిషిగ నీలోన తలదాచగా
ముసినవ్వు సిగ్గు ముత్యాలముగ్గు 
రస రాజధాని స్వాగతాలుగా
అటు గోకులాన ఇటు గుండెలోన
నవ రాసలీల సాగేలీలగా 
నను రమ్మని...మనసిమ్మని 
ఒక తలపు పిలచె ఒడి తలుపు తెరిచే
కలవరాలొలుకు కధే కదా సరిగమ...




ఇది రాగమైన అనురాగమే - 2 పాట సాహిత్యం

 

చిత్రం: పెళ్ళిగోల (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,చిత్ర

ఇది రాగమైన అనురాగమే తొలి అనుభవ గీతమిదే

Palli Balakrishna Wednesday, July 6, 2022
Prema Vijetha (1992)



చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: హరీష్, రోజా, సురేష్, యమున 
దర్శకత్వం: కె. సదాశివ రావు 
నిర్మాత: డి. రామానాయుడు 
విడుదల తేది: 1992



Songs List:



ఆడదై పుట్టి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఆడదై పుట్టి 




జీలకర్ర లో ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: చిత్ర, మనో 

జీలకర్ర లో ఉంది 



జమకు జమకు జుం (కొంపెక్కి కూసింది నా కోడి) పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,  చిత్ర

జమకు జమకు జుం 





నీలో అల గోదారి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె

నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ
నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా

హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ
నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన
నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..




ఓసి దానిమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,  యస్. జానకి 

ఓసి దానిమ్మ




యమ నాజూకు పిలగాడ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,  యస్. జానకి 

యమ నాజూకు పిలగాడ

Palli Balakrishna Wednesday, June 15, 2022
Rama Dandu (1981)



చిత్రం: రామదండు (1981)
సంగీతం: ఎమ్. ఎస్. విశ్వనాథన్
నటీనటులు: మురళీమోహన్, సరిత, సురేష్
దర్శకత్వం: ఎస్. ఎస్. మణి
నిర్మాత: 
విడుదల తేది: 1981

Palli Balakrishna Wednesday, August 25, 2021
O Amma Katha (1981)





చిత్రం: ఓ అమ్మ కథ  (1981)
సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: నూతన్ ప్రసాద్, శారద, సురేష్ 
దర్శకత్వం: వసంత సేన్
నిర్మాతలు:  వి.జోషి, సి. తిమ్మారెడ్డి, NR.వేజళ్ల
విడుదల తేది: 1981

Palli Balakrishna Friday, August 6, 2021
Ammoru (1995)





చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
నటీనటులు: సౌంధర్య, రమ్య కృష్ణ , సురేష్, బేబీ సునైనా, వడివుక్కరసి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్యాంప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 23.11.1995



Songs List:



అమ్మా..అమ్మోరు తల్లో పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: రసరాజు 
గానం: యస్.పి.బాలు

అమ్మా..అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో
ఆదిశక్తివి నువ్వేనంట
అపరశక్తివి నువ్వేనంట
దుష్టశక్తులను ఖతం చేసే పరాశక్తివి నువ్వేనంట

నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు నిత్యం వెలుగుతూ ఉంటారంట
వేదాలన్ని నీ నాలుకపై ఎపుడూ చిందులు వేస్తాయంట
నింగి నీకు గొడుగంట
నేల నీకు పీఠమంట
నిన్ను నమ్మినవాళ్ళ నొములు పంటకు నారు నీరు నువ్వేనంట

పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలవమ్మా
జిత్తులమారి నక్కల మధ్య దిక్కేదో తోచని దీనులవమ్మా
బ్రతుకు మాకు సుడిగుండం
ప్రతిరోజు ఆకలిగండం
గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా



చల్లని మా తల్లి అమ్మోరు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: మల్లెమాల టీం
గానం: చిత్ర

చల్లని మా తల్లి అమ్మోరు 




దండాలు దండాలు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: మల్లెమాల టీం
గానం: మాధవపెద్ది రమేష్, నాగూర్ బాబు, లలితాసాగరి & కోరస్ 

దండాలు  దండాలు 
మాయమర్మమెరగనోళ్ళం
మట్టి పిసికి బతికెటోళ్ళం 
ఊరి దేవతైన నిన్నే
ఊపిరిగా కొలిసెటోళ్ళం
గండవరం నెయ్యి పోసి
గారెలొండి తెచ్చినాము
బుజ్జిముండ కల్లుకుండ
వెంటబెట్టుకొచ్చినాము

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో
పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో
పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో
ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో

ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే
జై సకల లోకాలేలు సర్వమంగళి నేనే
బెజవాడ దుర్గమ్మ తెలంగాణ ఎల్లమ్మ
నిడదవోలు సత్తమ్మ నేనే

అల్లూరు కల్లూరు ఆలేరు సీలేరు
అన్నూళ్ళ దేవతను నేనే
మీ బాధలను తీర్చి మీకోర్కెలీడేర్చి
అలరించి పాలించు అమ్మోరు నేనే...

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో

పాదులేని తీగకు పందిరేసిన తల్లివి
మోడుబారిన కొమ్మకు పూలు తొడిగిన అమ్మవి
ఆపదలు పోగొట్టి కాపురము నిలబెట్టి 
కరుణించి కాపాడినావు 
అరుదైన వరములను అనుకోని శుభములను 
నా బ్రతుకుపై చల్లినావు 
ఈలాగే నీ అండే ఎప్పటికీ నాకుంటే 
లోకంలో సుఖమంతా నా వశమౌతుంది 
దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో
కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో
చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో




ఏమని పిలవను నేను పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: మల్లెమాల టీం
గానం: చిత్ర, నాగూర్ బాబు 

ఏమని పిలవను నేను 




కాపాడు దేవత పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: మల్లెమాల టీం
గానం: వందేమాతరం శ్రీనివాస్ 

కాపాడు దేవత 



ఎదురు తిరిగి నిలువలేక పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: మల్లెమాల టీం
గానం: చిత్ర

ఎదురు తిరిగి నిలువలేక
వేరే దిక్కేవ్వరులేక
పతితముద్ర పడకుండా పదసన్నిధికి వచ్చాను
నువ్వు దిద్దిన నుదిటిబొట్టు నేలపాలు కాకముందే
చెలరేగిన దానవతకు శీలం బలి కాకముందే
ప్రళయకాల మేఘంలా
పెనుతుఫాను కెరటంలా
రా రా కదలిరా కదలిరా

కడుపుచిచ్చు చల్లారకముందే
నిప్పులచెరలో నిలేపేవమ్మా
క్షుద్రశక్తిని ఆపే శక్తి నాలో లేదమ్మా
ఉందో లేదో తెలియని స్దితిలో ప్రాణం ఉందమ్మా
ఉప్పెనలాగా ముంచుకు వచ్చే ముప్పును తప్పించి
ఆదిశక్తిలా కాకపోయినా ఆమ్మగ రక్షించి
నా పసుపుకుంకుమ నిలుపగ రావమ్మా
రా రా కదలిరా కదలిరా

ఆలయాన ఒక మూగబొమ్మవై శిలగా నిలిచేవే
చేసిన కర్మను అనుభవమించమని నన్ను వదిలేసావే
ఐతే నీకు ఈ మొక్కులు ఎందుకు
ఏటేటా ఈ జాతరలెందుకు
ఇంక నీకు ఈ గుడిఎందుకు
ఆ గోపురమెందుకు
ఆగకముందే నా ఆక్రోశం అగ్నిగా మారకముందే
ఆ దావానలజ్వాలలో నేను ఆహుతి కాకముందే
దుర్గవై..చండివై..దురితవినాశంకరివై
అంబవై..అభయవై..అగ్రహోతగ్రవై
చూపులెడి బాకులుగా
పాపత్ముల గుండే చీల్చి
పెల్లుబికిన రక్తంలో
తల్లీ నువ్వు జలకమాడి
సత్యమేవ జయతే అని లోకానికి చాటింపగా
రా రా కదలిరా కదలిరా

Palli Balakrishna Friday, July 23, 2021
Ee Tharam Nehru (2000)



చిత్రం: ఈతరం నెహ్రూ (2000)
సంగీతం: ఘంటాడి కృష్ణ
రీ రికార్డింగ్: శశి ప్రీతమ్
నటీనటులు: కృష్ణ , సుమన్, సురేష్, సుధీర్ బాబు, అరుణ్ పాండ్యన్, ప్రేమ,  అల్ఫాన్సా, రఘు కుంచె
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివనాగు
నిర్మాత: వేపూరి శివకుమార్
విడుదల తేది: 11.08.2000

Palli Balakrishna Thursday, March 14, 2019
Vachina Vadu Suryudu (2002)


చిత్రం: వచ్చినవాడు సూర్యుడు (2002)
సంగీతం: రాధ గోపి
సాహిత్యం: శాతవాహన (All)
గానం:
నటీనటులు: కృష్ణ , రాహుల్, లహరి, సురేష్ , మాండవ గోపాలకృష్ణ
దర్శకత్వం: మాండవ గోపాలకృష్ణ
నిర్మాత: ఎమ్.లక్ష్మణస్వామి
విడుదల తేది: 09.08.2002


Palli Balakrishna
Nayanamma (1997)


చిత్రం: నాయనమ్మ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం:
గానం:
నటీనటులు: సురేష్ , ఊహ, కీర్తన, శారద
దర్శకత్వం: శివ నాగేశ్వరరావు
నిర్మాత: ఎ. ఎస్.రామారావు
విడుదల తేది: 1997


Palli Balakrishna Monday, March 4, 2019
Swathi Chinukulu (1989)


చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో, జానకి
నటీనటులు: వాణిశ్రీ, రమ్యకృష్ణ, సురేష్, జయసుధ, శరత్ బాబు
దర్శకత్వం: శ్రీ చక్రవర్తి
నిర్మాతలు: టి.ప్రతాప్, కాంతారావు
విడుదల తేది:  August 1989

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..లాలలా..లాలలాల
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ

నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..

నీ కళ్ళు పాడేటి..కధలు..ఊఊఊ
అధరాలలో..పొంగు సుధలు..ఊఊఉ
ఇటు ప్రేమించుకున్నాక..ఎదలు..ఊఊఊ
పేరంట మాడేటి...పొదలు..ఊఊఊఉ
చేమంతిపూల..సీమంతమాడే
హేమంత వేళ..ఈ రాసలీల
వెయ్యేళ్ళ వెన్నెల్లు..కాయాలిలే

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా

కౌగిళ్ళలో పండు..కలలు..ఊఊఉ
వేవిళ్లలో దాటు..నెలలు..ఊఊఊ
బిగిసందిళ్లకేటందు..కళలు..ఊఊఉ
సందేళ మందార..గెలలు..ఊఊఉ
రాసేదికాదు..ఈ చైత్రగీతం
రాగాలు తీసే..ఈ ప్రేమవేదం
పూలారబోసింది..ఈ తోటలో

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ

నాకు నీవు..ఆ..నీకు నేను..ఆ
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..

Palli Balakrishna Saturday, March 2, 2019
Dongaata (1997)


చిత్రం: దొంగాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: జగపతిబాబు, సౌందర్య, సురేష్ , రీతూ శివపురి
మాటలు: దివాకర్ బాబు
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: డా. కె.ఎల్.నారాయణ
విడుదల తేది: 1997

కోరస్:
తస్స చెక్క తద్దినక చిందెనుగా సందడిగా
చెంగుమనే రంగ రంగేళి
చెమ్మచెక్క చూడ చుక్క తుళ్ళేనుగ అల్లరిగా
కంగుమనే కుర్ర కవాళి
పాపాలు సవాలంటరా
బావలు సత్తా చూస్తరా
గోడమీద బల్లి ఏమంది పడుచు బుల్లి
పాత ప్రశ్నలెందుకన్నది

పల్లవి:
చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
జడ్లోని సిరిమల్లి ఆడాలి కొంటె ఆట
ఆ ఆట పాట చూసి సరదాకే సరదా వేసి
కోనంగి ప్రశ్నలేన్నో అడగాలి...
ఓ..ఓ..ఓ.. మేము రెడీ
ఓ..ఓ..ఓ.. కానీ మరి

చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట

చరణం: 1
కొమ్మంటు ఎరుగని పూలెన్నో ఉన్నవి వాటిని ఏవంటారు
ఏనాడు చెరగని చిరునవ్వులే అవి కాదని ఎవరంటారు

కోరస్:
పక్కుమంటూ నవ్వి వప్పుకుంటాం
చెప్పమంటూ ఇంకో చిక్కు వేస్తాం

దేవుడికి పువ్వులిచ్చి ముల్లివ్వమంటూ అడిగేవాలెవ్వరుంటారు
పెళ్లీడు మీద పడ్డ కన్నెపిల్లలంతా ఆ మూడు ముళ్ళు కోరతారు
బాగానే సెలవిచ్చారు మీ మగవాళ్ళింకేస్తారు
మీ నోచే నోముల ఫలితం మేమంటారు
ఓ..ఓ..ఓ.. ఎం పొగరు
ఓ..ఓ..ఓ.. తగ్గిందా జోరు

చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట

చరణం: 2
ఏటిలో తను ఈతాడుతున్న తడవనే తడవదేది
నీటిలో పడు నీ నీడ కన్న ఇంక వేరేముంది

కోరస్:
అమ్మలాల ఇట్టే చెప్పినాడే
అప్పుడేనా ఇంకావుంది చూడే

కన్నుల్ని మూసి చూస్తే కనిపించుతుంది ఆ చిత్రం ఏమిటైయుంటుంది
నీలాల కన్నుపాప నిదురించ గానే కలవచ్చి కనబడుతుంది
నీ కమ్మని కల ఏమంది ఏ కబుర్లు చెబుతూ ఉంది
ఇవ్వాలో రేపో నిజమై వస్తానంది

ఓ..ఓ..ఓ.. ఇంకేమ్మరి
ఓ..ఓ..ఓ.. రానీ మరి

చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట
ఆ ఆట పాట చూసి సరదాకే సరదా వేసి
కోనంగి ప్రశ్నలేన్నో అడగాలి
ఓ..ఓ..ఓ.. మేము రెడీ
ఓ..ఓ..ఓ.. కానీ మరీ

చిలిపి చిరుగాలి - పాడాలి కొత్త పాట
ఆడాలి కొంటె ఆట - పాడాలి కొత్త పాట



Palli Balakrishna Sunday, February 24, 2019
O Panai Pothundi Babu (1998)



చిత్రం: ఓ పనైపోతుంది బాబు..! (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: సురేష్ , రవితేజ, మహేశ్వరి, ఇంద్రజ, రక్ష, కావ్య
దర్శకత్వం: శివనాగేశ్వరరావు
నిర్మాత: కె. ఆర్.కుమార్
విడుదల తేది: 1998

గమనిక: సురేష్ , రవితేజ, బ్రహ్మానందం ముగ్గురు కూడాను ఈ సినిమాలో ద్విపాత్రాభినయం

Palli Balakrishna Thursday, February 14, 2019
Nava Vasantham (1990)


చిత్రం: నవ వసంతం (1990)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: రాజశ్రీ (All)
నటీనటులు: సురేష్, ఆనంద్ బాబు, మురళి, సితార
దర్శకత్వం: విక్రమన్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 03.08.1990


కన్నులు కురిసే...పాట సాహిత్యం

 
చిత్రం: నవ వసంతం (1990)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మనో , చిత్ర

కన్నులు కురిసే 
చూపుల వర్షం
తెలిపి వలపే
మనసులు పలికే 
చల్లని రాగం
ప్రేమే నిలిపే
సాగే నీలీ మేఘాలే
స్నేహం చిందెను
ఎదురై నిలిచి దైవలే
ఈ లోగిల్లు
ఇల్లు అందం దేవుడురాతే
కవితే కళలై తెలిపెనులే
కలలే విరిసే చిందులలోన హృదయం అలలై కురిసెనులే
వీచే చిరుగాలి పాడెనులే
పూచే మందారం ఆడెనులే
నదిలా కదలాడే అలలే వయ్యారం
మదిలో తిలకించె తియ్యని మఖరందం
విరిసే వసంతం ఇది కాదా

కన్నులు కురిసే 
చూపుల వర్షం
తెలిపి వలపే
మనసులు పలికే 
చల్లని రాగం
ప్రేమే నిలిపే

సగమే కాచే వెన్నెల లాగా
నీలో నేను నిలవాలి
పగలు రేయి నీలో ఒకరై
నీతో నేను ఉండాలి
బ్రతుకే కలకాలం ఈ రీతి
ఆరని దీపాలై వెళగాలి
చుక్కలలోకాలే  కలిసి చూడాలి
మమతల రేవులనే జతగా చేరాలి
పంతం బంధం మనదేగా

కన్నులు కురిసే 
చూపుల వర్షం
తెలిపి వలపే
మనసులు పలికే 
చల్లని రాగం
ప్రేమే నిలిపే
సాగే నీలీ మేఘాలే
స్నేహం చిందెను
ఎదురై నిలిచి దైవలే
ఈ లోగిల్లు

Palli Balakrishna Tuesday, January 15, 2019
Surigadu (1992)

చిత్రం: సూరిగాడు (1992)
సంగీతం: యస్.వాసు రావు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి.బాలు
నటీనటులు: దాసరి నారాయణరావు, సురేష్ , యమున
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1992

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
రామాయణం ఒక్కడు బైబిలేమొ ఒక్కడు
ఖురాన్ ఇంకొక్కడు రాసి పారేశారు
ఒక్కడైన ఎక్కడైనా రాశాడా పేదవాడి కథ ఏమిటో
ఎవ్వడైనా ఎప్పుడైనా చెప్పాడా తల్లిదండ్రి బ్రతుకేమిటో
చెప్పండి

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు

నిన్ను నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడూ
పుట్టింది నాభిలోన కలువపువ్వులో
ఆ దేవుడ్ని పుట్టించిన కలువ పువ్వు
పుట్టిందే ముక్కు పగులు బురద గుంటలో
తమ పుట్టుకే చెప్పుకోని గుంట నక్కలు
పుడతారు మారుజన్మన పిచ్చి కుక్కలై
పుడతారు మారుజన్మన పిచ్చి కుక్కలై
పాలు తాగి పాము విషం కక్కితే
మందుతాగి నేను నిజం కక్కుతా

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు

పాపపుణ్యమెరుగని తల్లిదండ్రులు
కంటారు బిడ్డల్ని గంపెడాశతో
తమ కడుపులు కట్టుకొని పిచ్చి తల్లులూ
మేపుతారు బిడ్డల్ని పిచ్చి ప్రేమతో
వదిగి వదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు
గుచ్చుతారు గుణపాలు కన్నకడుపులో
వదిగి వదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు
గుచ్చుతారు గుణపాలు కన్నకడుపులో
పాలు తాగి పాము విషం కక్కితే
మందుతాగి నేను నిజం కక్కుతా

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
రామాయణం ఒక్కడు బైబిలేమొ ఒక్కడు
ఖురాన్ ఇంకొక్కడు రాసి పారేశారు
ఒక్కడైన ఎక్కడైనా రాశాడా పేదవాడి కథ ఏమిటో
ఎవ్వడైనా ఎప్పుడైనా చెప్పాడా తల్లిదండ్రి బ్రతుకేమిటో

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు

Palli Balakrishna Monday, March 5, 2018
Ammo! Okato Tareekhu (2000)


చిత్రం: అమ్మో ఒకటోతారీకు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్ , మహాలక్ష్మి అయ్యర్
నటీనటులు: శ్రీకాంత్ , రాశి, సురేష్ , ముంతాజ్ , ఎల్.బి.శ్రీరామ్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాతలు: ఇ. వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 20.10.2000

పల్లవి:
నీ ఆకుపచ్చ కోక మీద బుల్ బుల్ తార తుమ్మెదై వాలనా
నీ పారిజాత ఛాతిమీద ప్రేమకుమారా గువ్వనై దాగనా
ఎంత వాత లగేసుకెళ్లి లవ్ లో దించేయ్నా
తస్సాదియ్య తమాషా చూసి పొగరే అనిచెయ్నా
సుబ్బులు ఓయ్  సుబ్బులు అరె పిండిన పండార బుగ్గలు
ఓ అబ్బులు ఓరబ్బులు ఇక చాలిక చలింక గంతులు

వేశాడే  వేశాడే పిల్లడు మంత్రం వేశాడే  వేశాడే పిల్లడు
పడ్డావే పడ్డావే అమ్మడు వలలో పడ్డావే పడ్డావే అమ్మడు

నీ ఆకుపచ్చ  నీ ఆకుపచ్చ
నీ ఆకుపచ్చ కోక మీద బుల్ బుల్ తార తుమ్మెదై వాలనా
నీ పారిజాత ఛాతిమీద ప్రేమకుమారా గువ్వనై దాగనా

చరణం: 1
ఓసిని సన్నని నడుము ఊరినే ఊరిస్తోందే
బరువుతో వాలిన వెన్ను కళ్లనే కటేస్తోందే
నెడుమొంపులే నీ కేప్ గా మార్చేయనా
ఆ గమ్మత్తులో శుభమస్తని గుమ్మెత్తగా
అవసరం ఇద్దరిదీ కురవని పిల్లా జల్ని
అదరహో అన్నపుడే తిరుగు నీ పనిలోకెళ్లి

అబ్బులు ఓయ్ అబ్బులు చాలించు సన్నాయి నొక్కులు
సుబ్బులు నా సుబ్బులు మోగిపోవాలే మురిపాల మువ్వలు

నీ ఆకుపచ్చ  నీ ఆకుపచ్చ
నీ ఆకుపచ్చ కోక మీద బుల్ బుల్ తార తుమ్మెదై వాలనా
నీ పారిజాత ఛాతిమీద ప్రేమకుమారా గువ్వనై దాగనా

చరణం: 2
జంటలేకుంటే నిదర పట్టని వయసొచ్చిందోయ్
పువ్వులా వెచ్చని సొగసే విందులా కవ్విస్తుందోయ్
తలదిండు నేనుండనా మండోదరి
పరువాలనే జోకొట్టనా నవమాధురి
మిలీనియం మన్మధుడా ఇరగదియ్ చుమ్మా చుమ్మా
చిలక సై అందంటే ఆదరదా కొమ్మా రెమ్మా

అబ్బులు ఓయ్ అబ్బులు మోగించమన్నాయి డ్రమ్ములు
సుబ్బులు ఏయ్ సుబ్బులు ఇక ఠారెత్తి పోవాలె సిగ్గులు

 వేశాడే  వేశాడే పిల్లడు మంత్రం వేశాడే  వేశాడే

Palli Balakrishna Thursday, November 30, 2017
S. P. Bhayankar (1984)


చిత్రం: యస్. పి.భయంకర్  (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్. పి.బాలు సుశీల (All)
నటీనటులు: నాగేశ్వరరావు , కృష్ణంరాజు , సురేష్ , శ్రీదేవి, విజయశాంతి, గీత, సిల్క్ స్మిత
దర్శకత్వం: వి. బి. రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి. బి. రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 01.05.1984

కానీ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
చాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే  పోనీ

ఉఁ కానీ కానీ రాతిరి కానీ

నిలవేసే కన్నుల్ని వలవేసే నవ్వుల్ని
ఎవరేమన్నా ఆగవని
చెలరేగే అందాల్ని చరపట్టే ఆటల్ని
ఇది హద్దంటే పాపమని
చెలరేగే అందాల్ని చరపట్టే ఆటల్ని
ఇది హద్దంటే పాపమని
వయసొచ్చిందే అందుకని
దానికి పొగరుంటేనే వేడుకని
వయసొచ్చిందే అందుకని
దానికి పొగరుంటేనే వేడుకని
ముందు ముందు ముసళ్ళ పండగ మనమే చూడాలని

కానీ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ

చిగురాకు పెదవుల్ని చిరు సిగ్గు బుగ్గల్ని
కలబోతేని ముద్దులని
జతకోరే ప్రణయాన్ని ఒడి చేరే పరువాణ్ణి
ముడివేసేదే కౌగిలని
చిగురాకు పెదవుల్ని చిరు సిగ్గు బుగ్గల్ని
కలబోతేని ముద్దులని
జతకోరే ప్రణయాన్ని ఒడి చేరే పరువాణ్ణి
ముడివేసేదే కౌగిలని
ఆడివిడిపోనీ బంధమని
దానికి సడలింపే ఉండదని
ఆడివిడిపోనీ బంధమని
దానికి సడలింపే ఉండదని
ప్రాణం ఎవరో దేహం ఎవరో
తెలియక మధ్యన సాగాలని

ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
చాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే  పోనీ

ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ

Palli Balakrishna Sunday, November 5, 2017
Iddaru Mitrulu (1999)



చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్, ఆషిమా బల్లా, రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: కె.రాఘవేంద్రరావు, కె.కృష్ణమోహన రావు
విడుదల తేది: 30.04.1999



Songs List:



హాయ్‌ రుక్కు రుక్కు మామ్‌ పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, హరిణి

హాయ్‌ రుక్కు రుక్కు మామ్‌ (3)
నీ గుట్ట విప్పువాసి గుట్టు చెప్పవాహే చికుబుకురుక్కుమామ్‌

షికారు వెళ్ళదాం - వెళ్ళాకా 
సినిమాలు చూద్దాం - ఆ చూశాకా 
షాపింగ్‌ చేద్దాం - ఆ చేశాకా 
చపాతీ తింద్దాం -ఆ తిన్నాకా 
తిన్నదంత అరిగేట్టు ముద్దు మీద ముద్దపెట్టు 

హాయ్‌ రుక్కు రుక్కు మామ్‌ (2)

హాయ్‌ రుక్కు రుక్కు మామ్‌ చిలకముక్కు రుక్కుమామ్‌ (2)
చెరుకుముక్క రుక్కుమామ్‌ రుక్కురుకురుక్కుమామ్

చరణం: 1 
జూపార్కు వైపు పరుగుతీద్దాం 
చెట్టు చాటు పొదలో చొరవు చేద్దాం 
గోల్‌కొండ వైపు అడుగులేద్దాం 
పాడుబడ్డ గృహంలో ఆడుకుందాం 
నక్షత్రశాలకు పోదాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం 
షామీర్‌పేటకు సిద్ధం చలికోనేటి స్నానం చేసేద్దాం

చరణం: 2 
ఉస్మానీయలో చదువుకుందాం 
ప్రేమలోన డాక్టరేటు పుచ్చుకుందాం 
అసెంబ్లీహాల్లో హాజరవుదాం 
ప్రేమగుర్తు జండా ఎగురవేద్దాం 
ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం 
ఆపైన మార్కెటుకు వెళ్ళదాం 
అయిదు కేజీలు మల్లెలుకొని తెద్దాం




చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, హరిణి

చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌, చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే బాపుబొమ్మ కదులుతోంది బాపురే 
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే 
ఊపు చూపి అవుతోంది ఊపిరే 
ఆర్టుఫిల్మ్‌లో తనకుచోటు ఇవ్వగా 
నా హార్టు ఫిల్మ్‌లో తనకు చోటు ఇవ్వగా 
నేనౌతా కొత్త సత్యజిత్‌రే

చరణం: 1 
ఎంకి పిల్ల కొప్పు యక్షకన్య మెరుపు 
ఎలిజిబిత్‌ నునుపు ఎదురులేని రూపు 
తేనేపాత్రవే లేక క్లియోపాత్రవేతెల్లవారిని రాత్రివే 
గ్రీకు ఇంటివే గిటారు తంత్రివే చూపుసాక మంత్రివే 
ఇండియాలో నీకు సాటి వుండరే

చరణం: 2 
మాయలేడి హొయలు మైక్రోసాఫ్ట్ కలలు 
ఎంకి కడవ వగలు తేరెక్రాఫ్ట్ లయలు 
గుల్షగుంతల బంతిపూల సంతలా కొంగుచుట్టినకోయలా 
దేవకాంతుల దమయంతి రీతిలా పూట గత్తిలా వెన్నలా 
నిగనిగల నగల నిధికి నువు వోనరే 
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే 
హంపి శిల్ప కళలు నాలో హాజరే 
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే 
పాలు సరసులాంటి సొగసుకు ఆన్సరే 
క్యాటువాక్‌లు ఫ్యాషన్‌ పరేడ్‌లు యాడ్‌ సంస్థలు 
అందాల క్లబ్‌లు నాస్టైల్స్‌నే చేస్తాయి స్పాంసరే




దేఖ్‌బాబా దేఖ్‌బాబా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

దేఖ్‌బాబా దేఖ్‌బాబా దేఖ్‌ఆలీబాబా 
లేక్‌లేక రాకరాక సోకు వచ్చిందమ్మ 
నీగాలీ నీధూళి నా పైకి మల్లించేయ్‌ 
నేపాలీ భోపాలీ మంత్రాలు వల్లించేయ్‌ 
జంతర్‌ మంతర్‌ జాదు చూపించాలోయ్‌ 

గున్‌గునాగున్‌ గున్‌గునాగున్‌ చెంతచేరాలోయ్‌ 
ధన్‌ధన్‌ధన్‌ ధన్‌ధన్‌ధన్‌ శాంతి చేయాలోయ్‌
గున్‌గునాగున్‌ గున్‌గునాగున్‌ చెంతచేరాలోయ్‌ 
ధన్‌ధన్‌ధన్‌ ధన్‌ధన్‌ధన్‌ శాంతి చేయాలోయ్‌

దేఖ్‌బేబీ దేఖ్‌బేబీ దేఖ్‌జాలీ బేబీ 
సోక్‌మీద స్నేక్‌లాగా దూకడం నా హాబీ 
హాత్తేరీ అందేరీ మోసాలు చేసేస్తా 
శృంగేరీ హంగేరీ దేశాలు చూపిస్తా 
మూడోకన్ను నేడే తెరిచేస్తాగా 

గున్‌గునాగున్‌ గున్‌గునాగున్‌ ధూపమేస్తాగా 
ధన్‌ధన్‌ధన్‌ ధన్‌ధన్‌ధన్‌ ఊపుతెస్తాగా

చరణం: 1 
చాకులొద్దు బాకులొద్దు పాకులాడద్దు 
పిట పిటలను కిటకిటను 
కిటుకులుచాలు చాలు చాలు చాలేద్దు 
మేకలొద్దు కూతలొద్దు చీకుచింతొద్దు 
చిటచిటమను చిటికెలువిని 
చటుక్కునకాలు కాలు కాలు కాలు జారొద్దు 
ఘరానా ఖజానా కమ్‌ కమాయించుకో 
నయానా నా భయానా భం భరాయించుకో 
మతిపోయే మాయాజాలం చేసిపో

చరణం: 2 
ఆకలేస్తు అంగలేస్తు దొంగలావస్తూ 
పరులెరగని పరువపుగని 
కనుగొని నీకు నీకు నీకు సుఖమస్తు 
కోకవాస్తు రైకవాస్తు అన్ని గమనిస్తూ 
తెర తెరవని చెరవదలని 
తళుకుని తాకి తాకి తాకి తరిగిస్తు 
బిచాన నీ ధికానా నా ఒడే చేసుకో 
స్వయానా నీ సుఖానా నా ముడేవేసుకో 
అందంతో అబ్రకదబ్రా ఆడుకో 




నూటొక్క జిల్లాల్లో పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో , చిత్ర

హేహేహేరబ్బ నూటొక్క జిల్లాల్లో 
లేదండి అట్టాంట్ట అమ్మాయి (3)

ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా
ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా
మనిషే మరీ భోళాగా తనమాటే గలగలా 
తానేలేని వీణా ఆ ప్రాణం విలవిల

చరణం: 1 
గాలేనువ్వైతే తెరచాపల్లే నిలబడతా 
జోలాలేనువ్వైతే పసిపాపల్లే నిదరోతా 
రాణిలాగా కోరితే బంటులాగా వాలనా 
భక్తితోటివేడితే దేవతల్లే చూడనా 
సన్నాయి సవ్వడల్లే సంక్రాంతి సందడల్లే 
రోజంతా సరిక్రొత్త కేరింతలే 
మలినాలేవి లేని మధుగీతం మనదిలే 
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి (2)

చరణం: 2 
మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో ముంచేస్తా 
నువ్వు మోడలై నిలుచుంటే చిగురించేలా మంత్రిస్తా 
కోపమొచ్చినప్పుడు బుజ్జగించవే మేనకా 
కొంటెవేష మేసినప్పుడు వెక్కిరింత నాదట 
చప్పట్లు కొద్దిసేపు చివాట్లు కొద్దిసేపు 
మనమధ్య వుంటాయి పోతాయిలే 
ఆనందాన్ని యేలే అధికారం మనదిలే 
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా
మనసే మేఘమాలా తన ఉనికే వెన్నెలా 
తానే లేనినేలా పోతుంది విలవిలా




మనసా వాచా మనసిస్తే పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, సుజాత

మనసా వాచా మనసిస్తే మైసూర్‌ప్యాలస్‌ రాసిస్తా
మనసా వాచా మనసిస్తే మైసూర్‌ప్యాలస్‌ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్‌ ప్యాలస్‌చదివిస్తా 
జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా 
ప్రియతమ పదవందిస్తే ఈ తుడివిరి ఎదిరిస్తా 
రా . . . రా . . . రా . . . రా . . .

చరణం: 1 
కళ్ళతోటే కావలిస్తే కాళిదాసు నవలిస్తా 
ఎదకు ఎదకు పడితే ఆ పెదవి పొదిగిపెడతా 
కంగులూరి చేరివస్తే కోహినూరు కొసరిస్తా 
నడక మిడిసి పడితే ఓ... నడుము మడతా ముడతా 
కృష్ణయ్యా వెన్నంటితే; 
నా చల్లని చెల్లించుతా 
వనిత విను చెబుతా కధా ఆ...

చరణం: 2 
రాజులాగా రాసుకుంటే వైజయంతిమాలిస్తా 
గడియగడువు పెడితే ఆ... తడిసి కడివెడౌతా 
సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్రా నదినిస్తా 
కలసి మెలసి ఫోతే ఓ...మెరిసి కురిసి వెళతా 
వాల్మీకిలా వేటాడితే 
ప్రేమాయణం వల్లించుతా 
లలితా ముడిపడతా పదా...



బంగారం తెచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, పార్థసారథి

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి 
అందాలబొమ్మ గీయమ్మ
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి 
అందాలబొమ్మ గీయమ్మ
ఎన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి 
అరుదైన రూపం ఈ బొమ్మ 
చెంత చెదరని మురిపించే చిత్రం చూడనీ 
వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ

చరణం: 1 
జో... లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా 
ఈ... మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా 
అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట 
అమ్మాయిగారు అమ్మగా పదవిని - పొందునట 
ఇల్లంతా బొమ్మల కొలువు మనసంత నవ్వుల నిలవు ఓ

చరణం: 2 
అడగక ముందే అన్నీ చేసి సేవకుడవి అనిపిస్తావు 
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు 
ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు 
నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు 
ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు 
ఎప్పుడు నా గుండెపాడనీ మధురీమ నేర్పావు 
నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ
ఓ...మాతృత్వానికి మగరూపానివై 
నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై 
బతుకంతా జతగా నిలిచే విధివో 
పతినే మించిన తోడువై 
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా 

Palli Balakrishna Monday, July 24, 2017
Allari Premikudu (1994)



చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: జగపతిబాబు, సౌందర్య
దర్శకత్వం: కె.రాఘవేంద్ర రావు
నిర్మాతలు: సురేష్, సత్యానంద్
విడుదల తేది: 05.05.1994



Songs List:



కు కు కు కు కూ.. కూ.. పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
కు  కు కు  కు కూ.. కూ.. 
కొమ్మా రెమ్మా పూచే రోజు
కు కు కు కు కూ.. కూ..  .
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ కదిలే వేళలో
మామిడి పూతల మన్మధ కోయిల

కు  కు కు  కు కూ.. కూ.. 
కొమ్మా రెమ్మా పూచే రోజు

చరణం: 1
స్వరాలే వలపు వరాలై, చిలిపి శరాలై, పెదవి కాటేయగా..
చలించే - స్వరాలే
వలచి వరించే - వయసు వరాలే..
ఎదలు హరించే  - చిలిపి శరాలై - కలలు పండించగా
గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే  - ముసి ముసి ముసి ముసి..
ముద్దబంతులై  - విరియగ
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ మా నిదమగ గ గమగమ దని
సా గేదెపుడు నీ పేదవుల్ల ద..దారి విడిచి మా.. మార్గశిరపు గా..గాలులు మురళిగా.
విన్న వేళ కన్నె రాధ పులకించే

కు  కు కు  కు కూ.. కూ.. 
కొమ్మా రెమ్మా పూచే రోజు
కు కు కు కు కూ.. కూ..  .
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు

చరణం: 2
ఆ అ
ఫలించే - రసాలే
తరిచి తరించే  - పడుచు నిషాలో..
కవిత లిఖించే  - యువత పేదాల - సుధలు పొంగించగా
సన్న జాజితొడిమలో చిన్ని వెన్నెలమ్మ
సందే వెలుగులోనే  తానమాడునమ్మ

కన్నె చూపులే - కసి కసి కసి కసి
కారు మబ్బులై  - ముసరగ
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ మా నిదమగ గ గమగమ దని

సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుదు మాఘ మ మేడల గాఢము గ..మ..మతల పూలు కోసి మాలు కోసు పలికించే....

కు  కు కు  కు కూ.. కూ.. 
కొమ్మా రెమ్మా పూచే రోజు
కు కు కు కు కూ.. కూ..  .
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు





పుత్తడిబొమ్మకు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

పుత్తడిబొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పన్నీటి స్నానాలు చేసే వేళలో
నున్నని చంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
కనరాని బాణాలు తాకే వేళలో
చెయ్యత్తుచున్నాము శ్రీరంగ స్వామి
చేయూత సాయంగ అందియ్య వేమి
నా ప్రేమ సామ్రాజ్య దేవీ
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ
సరేనంటే రూపం తాపం సమర్పయామి
నీ సందిటిలోని సమస్తము నీదే దయామి

కునుకుండదు కన్నులలోన
కుదురుండదు గుండెలలో
ఆణువణువు కొరుకుతున్నది తియ్యని మైకం
ఎదిగొచ్చిన వన్నెల వాన ఒదిగుండదు ఒంపులలో
చెరనొదిలి ఉరుకుతున్నది వయసు వేగం
మనసు పడే కానుక అందించనా ప్రేమికా
దహించితే కోరిక సహించకే గోపిక
అధిరేటి అధరాల ఆనా
అందం చందం అన్నీ నీకే సమర్పయామి
ఆనందం అంటే చూపిస్తాలే చెలి ఫాలో మీ

పుత్తడిబొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
నున్నని చంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ

నులువెచ్చని పొద్దులలోన 
తొలి ముద్దులు పుచ్చుకొని
సరిహద్దులు దాటవే ఒంటరి కిన్నెరసాని
నును మెత్తని సోయగమంతా సరికొత్తగ విచ్చుకొని
ఎదరొచ్చిన కాముని సేవకు అంకితమవని
అవి ఇవి ఇమ్మని అదే పనిగ వేడని
ఇహం పరం నువ్వని పదే పదే పాడని
తెరచాటు వివరాలు అన్నీ
దేహం దేహం తాకేవేళ సంతర్పయామి
దేహం మోహం తీరే వేళ సంతోషయామి

పుత్తడిబొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పన్నీటి స్నానాలు చేసే వేళలో
నున్నని చంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
కనరాని బాణాలు తాకే వేళలో
చెయ్యత్తుచున్నాము శ్రీరంగ స్వామి
చేయూత సాయంగ అందియ్య వేమి
నా ప్రేమ సామ్రాజ్య దేవీ
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ




నిన్ను చూడగానే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్
చిట్టి ముద్దు పెట్టనా - పెట్టుకో
బుగ్గపండు కొట్టనా - కొట్టుకో
లేత పట్టు పట్టనా - పట్టుకో
మోజుకొద్ది ముట్టనా - ముట్టుకో
సోయగాల దోపిడీకి వాయిదాలు ఒప్పుకోని
చోరీ వలపు నీదోచ్

నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్

అమ్మమ్మమ్మా...
అబ్బబ్బబ్బా...

లాఠీ ఫ్లూటుగ మరిపోయెనమ్మా
సరిగమ సరసమా లబ్జుగా ఉందిలేమ్మా
లూటీ చేసిన మనసు నాది సుమ్మా
ప్రియతమ యమ యమ చనువుగా దోచుకోమ్మా
ఖాకి బట్టలున్న ఆడ పోలీసోచ్
జాక్ పాట్ జామపండు నీదేనోచ్
కౌగిలింత లోచ్ ఖైదు చెయ్యవోచ్
పాలపిట్ట నోచ్ పూలు పెట్ట వోచ్
ఒళ్ళు అప్పగించుకుంటే కళ్ళు అప్పగించి నేను 
ఎట్టా నిదర పోనోచ్

నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్
నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్

నీలో కసి నను కాటువేసెనమ్మా
మహా మత్తు కసరత్తు ఘాటుగా సాగెనమ్మా
నీలో ఫిగరుకు పీకు తప్పదమ్మా 
కాక పట్టు సోకు పెట్టు ఫేటునే మార్చకమ్మా
ఆడపిల్ల అగ్గిపుల్ల అవుతుందోచ్
ఆడుకుంటే ఒళ్ళు గుళ్ళ అవుతుందోచ్
పాటపాడకోచ్ పప్పు లుడకవోచ్
తాపమెందుకోచ్ తాళమెయ్యవోచ్
అల్లరంత చేసి చేసి చిల్లరంత దోచి కున్న
చిల్లీ గొడవ చాలోచ్

నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్




బంతిలాంటి బత్తాయి వారేవా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి. బాలు, చిత్ర

బంతిలాంటి బత్తాయి వారేవా 
బన్నులాంటి అమ్మాయి వారేవా 
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దు ఇమ్మంది వారేవా 
చేతపట్టుకున్న చేయిచేసుకున్న 
చెంగు చెంగు మంటుంటే హయ్ హయ్ 
కోసి తీసుకున్న జూస్ తీసుకున్న 
మోజు మీద జూర్రుకుంటే లోలోలాయి 

బంతిలాంటి బత్తాయి వారేవా 
బన్నులాంటి అమ్మాయి వారేవా 
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దు ఇమ్మంది వారేవా 

కులికేటి పరువాలు కుశలాలు అడిగాయి
నీ కౌగిలింత ఘాటు కోరి వచ్చానోయి 
అల్లరి ప్రేమికుడు
అదిరేటి అధరాలు కదలేటి తెలిపాయి
తొలి ముద్దుకని సంతకాలు అడిగే వేళ మొదలైయ్యిందీ రగడ
ఎదను గిరి జాతరలో జమకు జమ చూడాలి
మొగలి సిరి పాతరలో మొదటి ముడి వీడాలి
గుమ్మలూరి ఖిల్లా సమ్మలూరి ఖిల్లా
నిమ్మలార బెట్టుకుంటే హాయ్ హాయ్
నిమ్మ చక్క తింటు చెమ్మ చక్కలంటు
తిమ్మిరెక్కుతున్న వేళ లోలో లాయి

బంతిలాంటి బత్తాయి వారేవా 
బన్నులాంటి అమ్మాయి వారేవా 
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దు ఇమ్మంది వారేవా 


విజిలేసి నా ఈడు గజలేదొ పాడింది
ఏ తప్పెటైన మద్దెలైన తబలాలైనా
చూడని బీటుంది
గజనిమ్మ పండంటి నజరానా నీదంది
నా గజ్జ ఘల్లు మన్నవేళ ఒళ్ళు ఒళ్ళు 
తడిమే ఆటుంది
సిగదరగ ఏం వయసు సెగల చలి రేపింది
సొగసరగ నీ దురుసు పగటి గిలి చూపింది
తాళమేసుకుంటు తాయిలాలు తింటు
తాపమంత తీర్చుకుంటే హాయ్ హాయ్
హార్ట్ బీట్ వింటు హంగు చేసుకుంటు
హాజరైన మోజులోన లోలో లాయి

బంతిలాంటి బత్తాయి వారేవా 
బన్నులాంటి అమ్మాయి వారేవా 
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దు ఇమ్మంది వారేవా 
వారెవా...




చిలిపి చిలకా పాట సాహిత్యం

 

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
ఆ...ఆ...
ఆ...ఆ....ఆహా....ఆహా

చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో...
కలికి చిలక కవ్వింతల తోరణాలలో...
చిలకపచ్చ పైటకీ.. కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం..

ఆ.....
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో..
చిలకపచ్చ పైటకీ ..కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం...

చరణం: 1
సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక కలిగే వయ్యారాల ఒంపు
ఆ..... కబురు పంపు..
ఆ.... గుబులు చంపూ...
వల్లంకి రెక్కల్లో ఒళ్ళారబోసాక వయసు గోదాట్లోకి దింపు..
ఆ....మరుల గుంపు..
ఆ....మగువ తెంపు..
అహో ప్రియా మహోదయా లయ దయా లగావో
సుహాసిని సుభాషిణి చెలీ సఖీ చెలావో
ఈ వసంత పూల వరదలా...ఆ..
నన్ను అల్లుకోవె తీగ మరదలా...ఆ..
నూజివీడు మావిడో ..మోజుపడ్డ కాముడో ..ఇచ్చాడమ్మా తీయని జీవితం

ఆ.....
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో...
కలికి చిలక కవ్వింతల తోరణా....లలో

చరణం: 2
నీలాలమబ్బుల్లొ నీళ్ళోసుకున్నాక మెరిసింది రేచుక్క రూపు
ఆ.... కలల కాపు...
ఆ.... కనుల కైపూ...
పున్నాల ఎన్నెల్లో పువ్వెట్టి పోయాక తెలిసింది పిల్లాడి ఊపు...
ఆ.... చిలిపి చూపు
ఆ... వలపు రేపు
వరూధిని సరోజిని ఎదే కులూమనాలీ..
ప్రియా ప్రియా హిమాలయా వరించుకోమనాలి..
కోనసీమ కోకమడతలా..
చిగురాకు రైక ఎత్తిపొడుపులా...
కొత్తపల్లి కొబ్బరో ..కొంగుపల్లి జబ్బరో.. నచ్చిందమ్మా అమ్మడి వాలకం

ఆ...చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో..
చిలకపచ్చ పైటకీ కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం...




నారిజన ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: యస్.పి.బాలు, చిత్ర

నారిజన ప్రియతమా 
ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
మూడొచ్చిన ముద్దుగుమ్మా 
మురెపమా అనుపమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
డిన్నరు ఏం చేద్దాము
బుచుకు బుచుకు బుచుకు
రాత్రికి ఏం ప్రోగ్రాము
బుచుకు బుచుకు బుచుకు
ఊపిరాడకుండ ఊపి ఊపి చంపుతుంది
ఏవిటి ఈ బుచుకు

బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2)

నారిజన ప్రియతమా 
ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
మూడొచ్చిన ముద్దుగుమ్మా 
మురెపమా అనుపమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
డిన్నరు ఏం చేద్దాము
బుచుకు బుచుకు బుచుకు
రాత్రికి ఏం ప్రోగ్రాము
బుచుకు బుచుకు బుచుకు
ఊపిరాడకుండ ఊపి ఊపి చంపుతుంది
ఏవిటి ఈ బుచుకు

బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2)

నారిజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 

పువ్వంటి చిన్నదానా కవ్వించు కళ్లదాన
పుట్టించినాడు నాకై ఆ బ్రహ్మ
లవ్వంటు చేసుకుంటే లైఫంటు పంచుకుంటే
నీతోటి కాకా నాకు ఎవరమ్మా
వయ్యారి వన్నెకాడ తయ్యారుగుంది లేరా
ఉయ్యాల జంపాల రసగుళ్ళ
కయ్యలుపెట్టుకున్న వియ్యాలు అందుకున్న
బుగ్గల్ల వేళ దాక ఆగాల
చెక్కిలి ఎపుడిస్తావు
బుచుకు బుచుకు బుచుకు
చంగున ఏం దాచావు
బుచుకు బుచుకు బుచుకు
ఊరుకున్న కుర్రగాడ్ని ఊరించి చంపుతావు
ఎక్కడ నీ బుచుకు

బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2)

మూడొచ్చిన ముద్దుగుమ్మా 
మురెపమా అనుపమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
నారిజన ప్రియతమా 
ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 

సంపంగి తోట కాడ సన్నాయి ఊదుకోరా
వలపు సయ్యన్న వెర్రివేళ
లగ్గాలు పెట్టకుండ ముగ్గేసి చూసుకోరా
సిగ్గమ్మ చిన్నారి ముంగిళ్ళ
మందార తోటకాడ అందాలు ఆరబోసి
విందారగించమన్న నెరజాన

చంగావి చీర పైన  చామంతి పూల వాన
కోపాన చల్లారి పోయేనా
పండగ కేం తెస్తావు
బుచుకు బుచుకు బుచుకు
పెదవికి ఏమిస్తావు
బుచుకు బుచుకు బుచుకు
పొద్దుగూకగానే తీపి తిక్కరేగుతుంది
అసలేవిటి ఈ బుచుకు

బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2)

నారిజన ప్రియతమా 
ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
మూడొచ్చిన ముద్దుగుమ్మా 
మురెపమా అనుపమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default