Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kannavari Kalalu (1974)




చిత్రం:  కన్నవారి కలలు (1974)
సంగీతం:  వి.కుమార్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, రాజశ్రీ
మాటలు: రాజశ్రీ
నటీనటులు: శోబన్ బాబు, రామకృష్ణ, వాణిశ్రీ , లత, గీతాంజలి 
దర్శకత్వం: యస్.యస్.బాలన్
నిర్మాత: యస్.యస్.బాలన్
విడుదల తేది: 11.01.1974



Songs List:



రాధా పులకింత రాధా పాట సాహిత్యం

 
చిత్రం: కన్నవారి కలలు (1974)
సంగీతం: వి. కుమార్
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి.రామకృష్ణ  

సాకి:
రాధా రాధా-రాధా పులకింత రాధా 
ఎవరికైన పులకింత రాదా 

పల్లవి:
అందాలు  కనువిందు చేస్తుంటే..
ఈ అందాలు  కనువిందు చేస్తుంటే.. 
ఎదలోన పులకింత రాదా..

చూసే కనులకు నోరుంటే.. మధురగీతమే పాడదా.. 
మధురగీతమే పాడదా                                                   
అందాలు  కనువిందు చేస్తుంటే.. 
ఎదలోన పులకింత రాదా

చరణం: 1 
చల్లగాలుల పల్లకీలలో నల్ల మబ్బులూరేగెనూ..
అంబరాన ఆ సంబరాలుగని గిరులబారులు మురిసెనూ
పలుకు రాని ప్రకృతి  నాకు పలికె స్వాగతాలు..
నిండుగా కలలు పండగా.. నాదు డెందమే నిండగా                                     
అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా

చరణం: 2 
ఎవరి కురులలో నలుపు చూసి తుమ్మెదలు  చిన్నబోయెనూ
ఎవరి బుగ్గల ఎరుపు చూసి చెంగలువ సిగ్గు చెందేనూ
అవే సోయెగాల కురులూ.. అవే మిసిమి బుగ్గలూ
చిలిపిగ మనసు చెదరగా.. కనుల కెదురుగా వెలిసెనూ                            
అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా

చరణం: 3 
ఈ సరస్సులో ఇంద్ర ధనుస్సులో..  
వింత సొగసు ఏముంది
ఓర చూపుల సోగకనులలో కోటి సొగసుల గని వుంది
చెలియ పాలనవ్వులోన మరులు జల్లు వాన కురిసెనే .. 
వలపు విరిసెనే.. తలపు చిందులే వేసెనే                              

అందాలు  కనువిందు చేస్తుంటే.. 
ఎదలోన పులకింత రాదా

చూసే కనులకు నోరుంటే..మధురగీతమే పాడదా...
మధురగీతమే పాడదా



మధువొలక బోసే పాట సాహిత్యం

 
చిత్రం: కన్నవారి కలలు (1974) 
సంగీతం: వి. కుమార్ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల 

పల్లవి: 
మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు 
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 
మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు 
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు 
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 

చరణం: 1
అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ 
అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ 
తలవకనే కలిగినచో అదిప్రేమ బంధమూ 
బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ 
మనసు మనసుతో... ఊసులాడనీ 
మూగభాషలో... బాసచేయనీ 
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ 

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు 
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 

చరణం: 2:
గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ 
తలపులకు.. వలపులకు.. సరిహద్దు లేదనీ 
కుసుమముతో ఆ భ్రమరం తెలిపినది ఏమనీ 
జగమునకు మన చెలిమి ఆదర్శమౌననీ 
కలలు తీరగా... కలిసి పొమ్మనీ 
కౌగిలింతలో... కరిగి పొమ్మనీ 
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ 

మధువొలకబోసే... హా.. 
ఈ చిలిపి కళ్ళు...ఆ.. 
అవి నాకు వేసే.. ఆ.. 
బంగారు సంకెళ్ళూ...



ఒకనాటి మాట కాదు.. పాట సాహిత్యం

 
చిత్రం: కన్నవారి కలలు (1974)
సంగీతం: వి. కుమార్
సాహిత్యం: రాజశ్రీ
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...
ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...
తొలినాటి ప్రేమదీపం.. కలనైన ఆరిపోదు...
తొలినాటి ప్రేమదీపం..కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు..

చరణం: 1
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో 
ఆటాడు కొన్నాయో ...
ఎన్నడు నీ చేతులు నా చేతులతో 
మాటాడు కొన్నాయో....
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో 
ఆటాడు కొన్నాయో...
ఎన్నడు నీ చేతులు నా చేతులతో 
మాటాడు కొన్నాయో...

పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ ...
గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ...
కలసిన కౌగిలిలో ...కాలమే ఆగినదీ....

ఒకనాటి మాట కాదు ...ఒక నాడు తీరిపోదు...

చరణం: 2
చల్లగ చలచల్లగ చిరుజల్లుగ 
నీ గుండెల్లో కురిసేనా..
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ 
నీ ఊహల్లో విరిసేనా ...
ఆహా..చల్లగ చలచల్లగ చిరుజల్లుగ 
నీ గుండెల్లో కురిసేనా...
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ 
నీ ఊహల్లో విరిసేనా ...

ఆ....కొంటెగా నిన్నేదో కోరాలనివుంది...
ఆ....తనువే నీదైతే దాచేదేముంది ...
మనసులవీణియపై ...బ్రతుకే మ్రోగిందీ...

ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు...
తొలినాటి ప్రేమదీపం... కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు..





చెలి చూపులోన కథలెన్నో పాట సాహిత్యం

 
చిత్రం: కన్నవారి కలలు (1974)
సంగీతం: వి. కుమార్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు  

పల్లవి:
చెలి చూపులోన కథలెన్నో తోచే.. 
చలి గాలిలోన పరువాలు వీచే . . .
చెలి చూపులోన కథలెన్నో తోచే.. 
చలి గాలిలోన పరువాలు వీచే

చరణం: 1
నీ సొగసు పిలిచింది నా వయసు పలికింది.. 
నడిరేయి సై అంది.. మౌనమిక చాలంది
నీ సొగసు పిలిచింది నా వయసు పలికింది.. 
నడిరేయి సై అంది.. మౌనమిక చాలంది
ఈ జగమమతా కొత్తగవుంది.. 
ఈ క్షణమేదో మత్తుగవుంది... 
పొంగేనులే యౌవ్వనం               
చెలి చూపులోన కథలెన్నో తోచే.. 
చలి గాలిలోన పరువాలు వీచే 

చరణం: 2 
జడివాన పడుతున్నా ఏమిటో ఈ దాహం.. 
ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం
జడివాన పడుతున్నా ఏమిటో ఈ దాహం.. 
ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం
ఆరని జ్వాలలే మనసున రేగే..  
తీరని కోరికలే చెలరేగే.. కలిగేనులే పరవశం                
చెలి చూపులోన కథలెన్నో తోచే.. 
చలి గాలిలోన పరువాలు వీచే



బాబూ చిన్నారి బాబూ పాట సాహిత్యం

 
చిత్రం: కన్నవారి కలలు (1974)
సంగీతం: వి. కుమార్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల   

బాబూ చిన్నారి బాబూ
నిన్నుచూసి నేను బ్రతికివున్నాను
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను

మబ్బుల్లో ఎగిరేటి మీ నాన్న 
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా 
అతడు లేని నా బ్రతుకే చీకటిరా 
ఆ చీకటిలో నీ నవ్వే దీపికరా 

అమ్మా అని ఒక్కసారి నువ్వంటే నా అణువణువున ఆనంద గోదావరి 
నాన్నేడని ముందు ముందు అడిగితే 
నా గుండెల్లో కన్నీటి కావేరి 

నెలవంకలా నీవు పెరగాలి
నా కలలన్నీ నీ కళలై వెలగాలి
ఆ వెలుగే నా కంటి వెలుగు కావాలి 
అది చూసి మీ నాన్న మురిసిపోవాలి




సారీ సో సారీ పాట సాహిత్యం

 
చిత్రం: కన్నవారి కలలు (1974)
సంగీతం: వి. కుమార్
సాహిత్యం: రాజశ్రీ 
గానం: పి.సుశీల , పి.రామకృష్ణ  

సారీ సో సారీ నా మాట వినింకో సారి
ప్రేమించలేదు నిను ఈ బ్రహ్మచారి 
పెళ్లాడితే నిన్ను నాదా రే గోదారి

చూడు ఇటు చూడు నా వంక చూసి మాటాడు 
ప్రేమించలేదా నువ్వు నన్నే ఏరికోరి
కాదంటే వదలను నిన్ను ఓ బ్రహ్మచారి 

నిన్నకాక అటుమొన్ననే కాదా కళ్ళు కళ్ళు కలిపేపూ
అవునూ
వెన్నలాంటి నా మనసును దోచి బాసలెన్నో చేశావు
అవునూ
ఆశ పెంచి మురిపించిన నువ్వే మనిషి మారిపోయావు

తప్పు తెలుసుకున్నాను 
మనసు మార్చుకున్నాను 
కాబోయే శ్రీమతి నీలా వుండకూడదనుకున్నాను,
తిండిపోతులా తింటేకాదు. 
వండే చిన్నది కావాలి
ఏడుపు అంటే నాకు గిట్టదు 
ఎప్పుడూ నవ్వుతూ వుండాలి
అలాగా
చీటికి మాటికి అలగకూడదు
తోడు నీడగ వుండాలి
వంట నేర్చుకుంటాను
రియల్లీ
నవ్వులు చిందిస్తాను
ప్రామిస్
నీతోటే నేనుంటాను
నీమాటే వింటాను
అయితే ఇక రేపే
మ్రోగేను పెళ్ళి సన్నాయి 
ఎల్లుండే నీ చేతుల్లో
వుంటుంది పాపాయి


Most Recent

Default