-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. V. Krishna Reddy"



చిత్రం: ఘటోత్కచుడు (1995)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
నటీనటులు: ఆలీ, రోజా, బేబీ నికిత, సత్యనారాయణ, నాగార్జున, రితుపర్ణ సెంగుప్తా, మరియు శ్రీకాంత్, రాజశేఖర్ (అతిధి పాత్రలో)
దర్శకత్వం: ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాత: కె. అచ్చిరెడ్డి
విడుదల తేది: 27.04.1995



Songs List:



జ జ జ్జ రోజా పాట సాహిత్యం

 
చిత్రం: ఘటోత్కచుడు (1995)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

జ జ జ్జ రోజా



అందాల అపరంజి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఘటోత్కచుడు (1995)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు

అందాల అపరంజి బొమ్మా
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా
కడుపారా నినుగన్న అమ్మా
చూడలేదమ్మా నీ కంట చెమ్మా

కనుమరుగునున్నా నిను మరువదమ్మా
కన్నీరు తుడిచే కబురంపేనమ్మా
చెబుతాను వినవమ్మా

అందాల అపరంజి బొమ్మా
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా

ఆకలందంటే ఆ చిన్ని బొజ్జా
అడగకుండానే తెలుసుకోమందీ
ఆటాడుకోగా తోడెవ్వరంటే
అంబారీగట్టీ ఆడించమందీ
నీకేం కావాలన్నా నాకు చెబుతూ ఉంటానంది
తానె లోకానున్నా నిన్ను చూస్తూ ఉంటానంది
కాపాడుకుంటా కనుపాపలాగా
నిను చూసుకుంటా నీ అమ్మలాగా
నమ్మమ్మ నా మాటా

అందాల అపరంజి బొమ్మా
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా

మావయ్యనంటూ నిను చేరమందీ
మంచి మాటలతో మరిపించమందీ
కథలెన్నో చెప్పి నవ్వించమందీ
ఒడిలోన చేర్చి ఓదార్చమందీ
జో జో పాపా అంటూ
తానూ రోజూ పాడే లాలి
ఇట్టా పాడాలంటూ నాకు తానె నేర్పింది తల్లి

మా పాపానిపుడూ కాపాడమంటూ
దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే
పని మీద వెళ్ళింది

అందాల అపరంజి బొమ్మా
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా
కడుపారా నినుగన్న అమ్మా
చూడలేదమ్మా నీ కంట చెమ్మా
కనుమరుగునున్నా నిను మరువదమ్మా
కన్నీరు తుడిచే కబురంపేనమ్మా
చెబుతాను వినవమ్మా

అందాల అపరంజి బొమ్మా
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా




భామరో నన్నే ప్యార్ కరో పాట సాహిత్యం

 
చిత్రం: ఘటోత్కచుడు (1995)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

భామరో నన్నే ప్యార్ కరో 





భం భం భం పాట సాహిత్యం

 
చిత్రం: ఘటోత్కచుడు (1995)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 
గానం: యస్.పి.బాలు

భం భం భం



డింగు డింగు పాట సాహిత్యం

 
చిత్రం: ఘటోత్కచుడు (1995)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 
గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర 

డింగు డింగు



ప్రియ మధురం పాట సాహిత్యం

 
చిత్రం: ఘటోత్కచుడు (1995)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 
గానం: రెమో ఫెర్నాండెజ్, స్వర్ణలత

ప్రియ మధురం

Palli Balakrishna Tuesday, January 2, 2024



చిత్రం: పెళ్ళాంతో పనేంటి (2003)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: వేణు, లయ, కళ్యాణి 
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి 
నిర్మాత: కుమార్ 
విడుదల తేది: 12.09.2003



Songs List:



మల్లె చెట్టు నిన్ను చూసి పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళాంతో పనేంటి (2003)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రవివర్మ, కౌశల్య 

మల్లె చెట్టు నిన్ను చూసి 



కూసింది కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళాంతో పనేంటి (2003)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: హారిహరన్, సుజాత 

కూసింది కోయిల



ఎన్ని జన్మలైనా చాలవే పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళాంతో పనేంటి (2003)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: శ్రేయా ఘోషాల్ 

ఎన్ని జన్మలైనా చాలవే 




ఒక్క నిమిషమైన పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళాంతో పనేంటి (2003)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: హారిహరన్, సునీత 

ఒక్క నిమిషమైన 



వినండహో పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళాంతో పనేంటి (2003)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, సునీత & కోరస్ 

వినండహో 



ఓలమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళాంతో పనేంటి (2003)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: ఉదిత్ నారాయణ్, లెనినా 

ఓలమ్మో 


Palli Balakrishna Thursday, August 11, 2022



చిత్రం: పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్ (All)
నటీనటులు: జగపతిబాబు, సౌందర్య
దర్శకత్వం: S.V. క్రిష్ణారెడ్డి
నిర్మాత: V.B. రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 16.07.1998



Songs List:



చిటపట చినుకులు పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీనివాస్ , చిత్ర 

చిటపట చినుకులు 




జిల్ జిల్ జిల్ అని వూగింది పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర 

జిల్ జిల్ జిల్ అని వూగింది
ఏటి నీళ్ళల్లొ తడిసెటి ప్రాయం
ఝుం ఝుం ఝుం అని మోగింది 
కన్నె గుండెల్లొ కాంభోజి రాగం
చిలకలు పరకిణీలుకాగ 
చుక్కలు హారమేసిపొగ 
కోకిల కాలిగజ్జకాగ
పచ్చిక పాదరక్షలవగ 
ఇక కోరిందె చెతుల్లొ పండగా

పైవాడె ఎదురేవొస్తె పదహారు ప్రాయంలోనే 
వయసె నిలిచె చక్కని వరమిమ్మంటా
క్షెత్రైయ్యే మల్లి పుడితె నా రూపురేకలపైనే 
కాస్తొ కూస్తొ కవితలు రాసిమ్మంట
తెలుగు భాషలో అక్షరాలు యాభైఆరు
తెలుగు వనితలో ఎన్ని వన్నెలో ఎవరు చెప్పగలరు
వానకు మబ్బులెంతొ ముఖ్యం
వీణకు తీగలెంతొ ముఖ్యం
తోటకు పూవులెంతొ ముఖ్యం 
పుడమికి పడతులంత ముఖ్యం 
మగువెలేకుంటె ఏకాకి లోకం

మెరుపేమొ మబ్బుల సొంతం 
చురుకేమొ చిరుదల సొంతం 
చురుకు మెరుపు రెండు నాకే సొంతం
పద్మానికి పగలె ఇష్టం పునాగకి రేయే ఇష్టం 
రేయి పగలు రెండు నాకే ఇష్టం
అంతరిక్షమె ఆటబొమ్మగ నన్ను చేరుకోదా 
కల్పవ్రుక్షమె కంటి చూపుకె నేల జారుకోదా
రాజుకు రాజ్యముంటె చాలు 
లోభికి సంపదుంటె చాలు
జ్యొతికి ప్రార్ధనుంటె చాలు 
నాకీ ప్రక్రుతుంటె చాలు
ఎంతో సంతోషం సందిట్లొ వాలు



మోహనం మోహనం పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కృష్ణంరాజు, పల్లవి 

మోహనం మోహనం




ఈ చక చక పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, కృష్ణంరాజు, సౌమ్యారావు

ఈ చక చక 




జిల్ జిల్ జిల్ అని వూగింది పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర , శ్రీనివాస్ 

జిల్ జిల్ జిల్ అని వూగింది




పెళ్ళిపీటలు పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర ,మనో, నిత్య సంతోషిని 

పెళ్ళిపీటలు





యమునా తరంగం పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉన్నికృష్ణన్, పల్లవి 

యమునా తరంగం 





రాజేలు వెలిగించు (శ్లోకం) పాట సాహిత్యం

 

చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం:  పల్లవి 

రాజేలు వెలిగించు 


Palli Balakrishna Friday, June 10, 2022




చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: జగపతిబాబు, ఆమని, రోజా
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.వెంకటేశ్వరరావు
విడుదల తేది: 25.09.1994



Songs List:



ఘల్లు ఘల్లు పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: విశ్వనాధ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఘల్లు ఘల్లు 




అల్లుకుపోవే పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అల్లుకుపోవే  ఓసి మల్లెతీగ 




అల్లరి తుమ్మెద పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అల్లరి తుమ్మెద 




చిలకా ఏ తోడు లేక పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

చిలకా ఏ తోడు లేక ఎటెపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటీ ఆశల వెనక 
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాకా 
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెశాక 

గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
వెలుగుల్నె వెలివెసే కలలోనే జీవించావే 
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహాలం పొందావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలొ తడిసీ కనుమరుగైనావే 

కొండంత అండ నీకు లేదింక కొండంత అండ నీకు లేదింక 
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో 
మమకారం విలువెంతో మరీచావా సిరి మైకంలో 
ఆనందం కొనలేని ధన రాసితో 
అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువ్వు కను తెరిచాకా తీరం కనబడదే ఇంకా 



పొరుగింటి మంగళ గౌరి పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పొరుగింటి మంగళ గౌరి 
వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నాగ నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు
మనకు మల్లే ఎవరు ఉన్నారు
ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు
మన బతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది

పక్కాళ్ళ పాడు గోల పట్టించుకోవద్దే
పొరుగింటి పుల్లకూర తెగ మెచ్చుకోవద్దే
నెత్తిన పెట్టుకు చూసే మొగుడు నీకూ ఉన్నాడే
అందని పళ్లకు అర్రులు చాచి అల్లరి పడొద్దే
మనకి లేక అదో ఏడుపా
పరులకుంటే మరో ఏడుపా
ఎందుకే ఇట్టా రోజు మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు

ఓ... ఓ... ఓ....
కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైనా
లేదే పాపం తమ జీతం
నేత చీర కట్టుకున్నా కొట్టవచ్చినట్టు ఉందే
అందం నీ సొంతం
ఉత్తి మాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
ఉన్నదానితోనే మనం సర్డుకుంటే మంచిదిగా
కట్టుకున్నదాని సంబరం 
తీర్చడమే పురుష లక్షణం
సంపదలోనే లేదు సంతోషం
చంపకే నన్ను నీ డాబు కోసం

పలానా వారి మిస్సెస్ అంటూ అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా
ఆ బోడి పదవికని అప్పో తప్పో చెయ్యమంటే
ఊళ్ళో పరువు పోదా
ఖానీకి కొరగాని పరువూ ఓ పరువేనా
మగాణ్ణి తూచేది వాడి పర్స్ బరువేనా
డబ్బు లేని దర్పమెందుకు
చేతగాని శౌర్యమెందుకు
నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే
ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే



చినుకు చినుకు అందెలతో పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, చిత్ర

(మాయలోడు (1993) సినిమాలో ఈ పాటని ఈ సినిమాలో మళ్ళీ వాడటం జరిగింది. మాయలోడు సినిమాలో సౌందర్య, బాబూమోహన్ పై ఈ పాట చిత్రీకరణ జరిగింది, ఈ సినిమాలో ఆలీ, సౌందర్య పై  ఈ పాట చిత్రీకరణ జరిగింది.)

పల్లవి:
చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 1
నింగి నేల ఈవేల చలికి వనికి పోతుంటే 
బిగికౌగిలి పొదరింటికి పద పద మంది 
ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండకాసె ఏలో
అరెయ్ పైన మొబ్బు ఉరిమింది 
పడుచు జింక బెదిరింది 
వలవేయక సెలయేరై పెనవేసింది 
అరెయ్ చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటుకేసే బుగ్గమీద ఏలో 
తలపు తొలివలపూ ఇక తకజమ్ తకజమ్
వయసూ తడి సొగసూ అరవిరిసే సమయమ్  
ఆహ - ఊహూ,  ఓహొ హొ హొ

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 2
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది 
యదలోపల చలిగాలుల సుడిరేగింది 
వానొచ్చే వరదొచ్చే ఏలో 
వయసంటే తెలిసొచ్చే ఏలో
నేలచూపు పోయింది వాలుచూపుసై అంది 
చలికోరిక అలఓకగ తల ఊపింది
అరెయ్ సరసాల సింధులోన ఏలో 
సరిగంగ తానాలు ఏలో 
ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 
సరసానికి  దొరసానికి ముడిపెడుతుంటే 
ఆహా - ఊహూ
ఓహో హొ హో 

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా


Palli Balakrishna Saturday, December 25, 2021
Yamaleela (1994) Telugu Songs Lyrics Album Cover

Yamaleela (1994) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Yamaleela (1994)
Banner : Manisha Films
Producer : Achhi Reddy
Actors : Ali
Actress : Indraja, Latha Sri
Release Date : 28 April 1994
MOVIE HIGHLIGHTS

Ali played the lead hero for the first time in Yamaleela (1994).

Kaikala Satyanarayana portrayed the memorable role of Yama Dharma Raju.

S. V. Krishna Reddy handled both the direction and music for the film.

• Legendary actor Krishna Ghattamaneni made a special appearance in the popular song "Jumbare Joojumbare", making it one of the film's memorable highlights.

Yamaleela (1994) became one of the biggest blockbuster fantasy comedy films in Telugu cinema.

Sirulolikinche Chinni Navvule Song Lyrics in Telugu – Yamaleela (1994)

'Sirulolikinche Chinni Navvule' song from Yamaleela (1994) movie is composed by S. V. Krishna Reddy and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Yamaleela (1994)
చిత్రం: యమలీల (1994) సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గాత్రం: కె. ఎస్. చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి జాబిల్లి జాబిల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లీ చరణం: 1 నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ కలకాలము కనుపాపల్లే కాసుకోనీ నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు లాల లలలా లలలా లాలా లాల లలలా లలలా లాలల లాలల లాలల లాలల లాలల లాలల లాలల లాలల చరణం: 2 వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా తోడుండగా నను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు

Nee Jeenu Pantu Choosi Song Lyrics in Telugu – Yamaleela (1994)

'Nee Jeenu Pantu Choosi' song from Yamaleela (1994) movie is composed by S. V. Krishna Reddy and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Yamaleela (1994)
చిత్రం: యమలీల (1994) సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గాత్రం: కె. ఎస్. చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తంది రో వయసు ఒనికేత్తంది ఒనికేత్తంది ఒనికేత్తంది రో హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో దిం దిం దిం ధింతనక జుం దిం దిం దిం ధింతనక జుం దిం దిం దిం దిం దిం దిం ధింతనక ఉఁ హా దిం దిం దిం దిం దిం దిం ధింతనక ఉఁ హా ఆ... అప్పరాల చెరువులోన అమ్మడు ఉఁ హా కప్పపిల్ల బుస కొడితే అమ్మడు ఉఁ హా ఒళ్ళు జివ్వు జివ్వుమంటు అమ్మడు ఉఁ హా లవ్ పుట్టుకొస్తదంటా అమ్మడు ఉఁ హా తిమ్మరాజు రేవుకాడ పిల్లగో ఉఁ హా తొండ పిల్ల తొడగొడితే పిల్లగో ఉఁ హా తాటి మట్ట తగులుకోని పిల్లగో ఉఁ హా తాటలేసి పోతదంట పిల్లగో ఉఁ హా కోపమేల బాల కొంగు చేరే వేళ కుర్రవాడి స్పీడు చూసుకో హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో ఆ ఆ ఆ నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ ఆఁ హ హ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో ఆ... గోలిగూడా సెంటర్లో పిల్లగో ఉఁ హా గొడవ గొడవ చేసేస్తే పిల్లగో ఉఁ హా చిక్కడపల్లి సెంటర్లో పిల్లగో ఉఁ హా చింతకాయ తినిపిస్తా పిల్లగో ఉఁ హా ఒట్టి ఊక దంపుడేలా అమ్మడు ఉఁ హా కొత్త పాట నేర్చుకోవే అమ్మడు ఉఁ హా మడతపేచి మానుకుంటే అమ్మడు ఉఁ హా తాళిబొట్టు కట్టిపెడతా అమ్మడు ఉఁ హా తాళిబొట్టు మోజు పెళ్ళికొడకు పోజు పక్కనెట్టి స్టెప్ లెయ్యారో హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తంది రో వయసు ఒనికేత్తంది ఒనికేత్తంది ఒనికేత్తంది రో హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో (2)

Abhivandanam Yama Rajagrani Song Lyrics in Telugu – Yamaleela (1994)

'Abhivandanam Yama Rajagrani' song from Yamaleela (1994) movie is composed by S. V. Krishna Reddy and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Yamaleela (1994)
చిత్రం: యమలీల (1994) సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గాత్రం: కె. ఎస్. చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ధర్మపరిరక్షణ ధురంధరుండా సకలపాప శిక్షణ దక్షుండా చండతర దండథర బహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా హ యముండా అభివందనం యమ రాజాగ్రణీ సుస్వాగతం సుర చూడామణీ తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ ఆ..ఆ.. అ అ అ అ ఏమీ శభాష్ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ ఆ..ఆ.. అ అ అ అ సరసాలు చవిచూడ ఇటురా దొరా నవమన్మథాకార నడుమందుకోరా రాకాసి కింకరుల రారాజునే నరకాన నీవంటి సరుకెపుడు కననే పాపాలు తెగ మోసి తల మాసెనేమో నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్ ఆ..ఆ.. అ అ అ అ అవశ్యము అటులనే కానిమ్ము నీ కౌగిలే నవ సింహాసనం రసలోకమే ఇక మన కాపురం యమ సరదాగా సాగాలి ఈ సంబరం ఆ..ఆ.. అ అ అ అ ఊర్వశికి నీవేమి కజినవుదువా కాకున్న నీకింత సౌందర్యమేల నరలోకమున ఊరికొక ఊర్వశి స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి ఊరించకే ఇక నా రాజహంస యమ హాయి నీదేలే రసికావతంస ఆ..ఆ.. అ అ అ అ రసికాగ్రేసరుండా యముండా మైకాలలో తమ మతిపోవగా నా కేళిలో పడి మునకేయగా గద వదిలేసి ఒడిలోకి రా దేవరా ఆ..ఆ.. అ అ అ అ మజ్జారే మదవతీ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ ఆ..ఆ.. అ అ అ అ ధర్మపరిరక్షణ ధురంధరుండా సకలపాప శిక్షణ దక్షుండా చండతర దండథర బహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా హ యముండా

Erra Kaluva Puvva Song Lyrics in Telugu – Yamaleela (1994)

'Erra Kaluva Puvva' song from Yamaleela (1994) movie is composed by S. V. Krishna Reddy and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Yamaleela (1994)
చిత్రం: యమలీల (1994) సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గాత్రం: కె. ఎస్. చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం డింకు టకుమ్, టకుమ్, టకుమ్, టకుమ్ (5) ఓ... ఓ... ఓ... ఎర్ర కలువ పువ్వా ఎద్దమా చలి మంట ధింత నకిట తాత్త నకిట ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా ధింత నకిట తాత్త నకిట ఎర్ర కలువ పువ్వా ఎద్దమా చలి మంట ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా రా మరి చాటుకి సందామామ కౌగిలి విందుకి సందామామ సయ్యనె కాముడే సందామామ ఆశలే తీరని సందామామ సై రా సరదా గువ్వ పండించు నా పంట పదరా మధన జాతర చేద్దాము పడకింటా గాజుల మోతలో సందామామ మోజులే మోగని సందామామ తోడుగా సేరుకో సందామామ ప్రేమనె తోడుకో సందామామ రంప రపరి రంప రపరి రంప రపరి రా (2) గిలి గిలి సల్లగాలి తగిలిందే ఓ హంస సలి సలి సంబరాలు సాగిస్తే హైలెస్స కేరింత కెరటలా... మునగాలా కేరింత కెరటల ఊరంత మునగాల ఉపందుకోవాల నీ పొందు కావాలా నీ ఒడిలో తొంగుంట సందామామ నీ కలలో నేనుంటా సందామామ నా దొర నీవుర సందామామ ఉహాల రాణివె సందామామ సై రా సరదా గువ్వ పండించు నా పంట పదరా మధన జాతర చేద్దాము పడకింటా ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల (2) హా..కులుకులు కుమ్మరించి మురిపాలే తేవాలా తళుకుల పూల తీగ సరసాల తేలాల వయ్యారి అందాలు... ఒడిలోనా హోయ్ వయ్యారి అందాలు గాంధాలు తీయాల మందారు బుగ్గల్లో మద్దెల్లు మోగాలా ఏడేడు జనమాలు సందామామ ఎలీకగ ఉంటనే సందామామ తానుకే నేనిక సందామామ నా ఎద నీదిక సందామామ ఎర్ర కాలువ పువ్వా ఎద్దమా చలి మంట ధింత నకిట తాత్త నకిట ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా ధింత నకిట తాత్త నకిట సై రా సరదా గువ్వ పండించు నా పంట పదరా మధన జాతర చేద్దాము పడకింటా గాజుల మోతలో సందామామ మోజులే మోగని సందామామ తోడుగా సేరుకో సందామామ ప్రేమనె తోడుకో సందామామ

Jumbare Joojumbare Song Lyrics in Telugu – Yamaleela (1994)

'Jumbare Joojumbare' song from Yamaleela (1994) movie is composed by S. V. Krishna Reddy and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Yamaleela (1994)
చిత్రం: యమలీల (1994) సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గాత్రం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా ఫ్రంటు సైడు ఆ రూపు… బ్యాకు సైడు ఈ షేపు మెంటలెక్కి పోయిందే నాకు ఫాస్టు బీటు నా రూటు… మూనులైటు నా ఫేటు సర్చులైటు నా సైటు నీటు నీ నడకలోన ఉంది స్నేకు డాన్సు, పీకాకు డాన్సు శభాష్ ప్రేమదాసు… బ్రేకు డాన్సు, నీ ఫోకు డాన్సు సగస గమగమ పమపనిప మ గ మ ప ని ప ని స ని జుంబారే జుజుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె రింబరాహి రింబరాహి రీంబారే హ హ హ హ హ హ నువ్వు నేను టూ ఇన్ వన్… లవ్ మార్కు ఫైర్ ఇంజిన్ ముద్దులివ్వు వన్ బై వన్ బేబీ, హ రాసలీల రైల్ ఇంజిన్… ట్రాక్ మీద నో టెన్షన్ చేరుదాము లవ్ జంక్షన్ డైలీ నా జట్టు జూలియట్టు కొయిలాలో, గోల గోలా అబ్బాయి చూపులిక డబ్బనాలో అబ్బబ్బలాలో సగస గమగమ పమపనిప మ గ మ ప ని ప ని స ని జుంబారే జుజుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె రింబరాహి రింబరాహి రీంబారే హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే

Palli Balakrishna Thursday, March 4, 2021


చిత్రం: నెంబర్ వన్ (1994)
సంగీతం: ఎస్. వి. కృష్ణా రెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: కృష్ణ , సౌందర్య
దర్శకత్వం: ఎస్. వి. కృష్ణా రెడ్డి
నిర్మాత: అడుసుమిల్లి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 14.01.1994

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేర్చుకో గుండెలోనా

తాకితే ఎర్రాని బుగ్గ కందాలా
మీటితే వయ్యారి వీణ థిల్లానా
కలికిచిలక వలపు చిలకగా
కలువచెలియ కలువ రమ్మనె
కిలకిలలో మురిపెములే అలలు అలలుగా
జల్లులై వెల్లువై పొంగిపోయే

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా

ఓ ప్రియా లాలించమంది వయ్యారం
మోజులే చెల్లించమంది మోమాటం

చిలిపిచూపు సొగసు నిమరగ
జాజితీగ జడకు అమరగ
గుసగుసలే ఏఏ ఘుమఘుమలై గుబులు రేపగా
ఝుమ్మనే తుమ్మెదై కమ్ముకోవా

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా



Palli Balakrishna Wednesday, February 20, 2019



చిత్రం: సకుటుంబ సపరివార సమేతం (2000)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సుహాసిని మణిరత్నం, శ్రీకాంత్, రవితేజ, సీమ
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాతలు: వి.ఎమ్.డి.రెడ్డి, ఎమ్.మదన్ గాంధీ రెడ్డి
విడుదల తేది: 21.12.2000



Palli Balakrishna Thursday, February 14, 2019


చిత్రం: సర్దుకుపోదాం రండి (2000)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం:  చంద్రబోస్
గానం: గంగాధర్ , సుధారాణి
నటీనటులు: జగపతిబాబు , సౌందర్య
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 23.04.2000

యెవర్రా రావాల్సిన వాళ్ళందరు వచ్చేసారా?
ఇంకెవరన్నా రావాలా?
వచ్చేసారే..
మరింకెందుకూ లేటూ?
శోభానమే శోభానమే శోధానమే శోధానమే
కబ్బాడి కబ్బాడి కబ్బాడి కబ్బాడి
ఈడూ ఈడూ ఆడుకుంటే ఆటాడి ఆడి ఊరుకుంటే
మరుమల్లెపూలు మంచం కోళ్ళు మురిసేదీచోటా
ప్రతి ఆలుమగలు అమ్మా నాన్నలు అవుతారీచోటా
మాపటి చింతంతా తీరేదీచోటా
మగరాయుళ్ళంతా లొంగేదీచోటా
స్త్రీలంతా సిగ్గు ఎగ్గుకు రాజినామా ఇచ్చేచోటా

పాలల్లే ఉండాలి హౄదయాల తెలుపు
పరుపల్లే ఉండాలి పడుచోళ్ళ వలపు
తీపల్లే ఉండాలి చిలకమ్మ పిలుపు
ధూపం లా ఉండాలి చినవాడి ఒడుపు
తొలి రేయి యెన్నెన్నో వివరాలు తెలుపు
ఆ.. నా లావణ్యం నీ నైపుణ్యం కలయిక శీతోష్ణం
చీకటి పుణ్యం చేసిన సుదినం యవ్వనమే ధన్యం
ఇక వలదే ధన ధాన్యం

గిల్లాలి అంటోంది నా వేలి గోరు
అల్లాలి అంటోంది నా వంటి పోరు
ఉరకాలి అంటోంది నా కుర్ర కారు
కురవాలి అంటోంది నా చెమట నీరు
కొయ్యాలి అంటోంది వయ్యారి పైరు
ఆ.. గందరగోళం తొందర జాలం సౄష్టికి ఇది మూలం
ఒకటే గేయం సుఖమే ధ్యేయం ఇదుగో అధ్యాయం
అనుభవమే అభ్యాసం

Palli Balakrishna Wednesday, December 13, 2017


చిత్రం: వజ్రం  (1995)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: నాగార్జున, రోజా, ఇంద్రజ
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: సి.గౌతమ్ కుమార్ రెడ్డి
విడుదల తేది: 05.11.1995

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె

ఉన్నట్టుండి యేమయ్యిందే....కుయిలె కుయిలె
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె

మెల్లొ మూడు ముల్లనగానే మొదటేం చేస్తావే
మనువాదిన వాడిని కొంగున కట్టిపడేస్తాలే
మీసం ఉన్న మగాడ్ని యెట్ట దారికి తెస్తావే
మూడొచ్చి ముందుకు వస్తే మూడంకేస్తాలే
అమ్మడో నీ జిమ్మడో నిన్నేవ్వడూ పెళ్లాడడే
లయలేస్తాలే అహ ఏం style యే
లాగేస్తాన్లే...పడిపొతాన్లే

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
ఉన్నట్టుండి యేమయ్యిందే....కుయిలె కుయిలె
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

సాయంకాలం time అయితే నువ్ ఇంటికి చేరాలోయ్
అయ్యబాబొయ్ చిత్తం తల్లే ఇంకేం చెయ్యాలే
ఇక నుంచి ఈ wife అంటే నీ life అనుకొవాలోయ్
చస్తాన సర్లే కాని కర్మనుకుంటాలే
జుమ్మడొ ఈ జన్మలో ఆ బ్రహ్మ ముడినే నమ్మరో
నమ్మిస్తాలే....చూస్తుంటాలే
కలహం చాల్లే....కలిసుందంలే

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
ఉన్నట్టుండి యేమయ్యిందే....
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె


*******   ********   *******


చిత్రం: వజ్రం  (1995)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , రేణుక

మనసా ఎందుకె కన్నీరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

ఏ నవ్వు చినుకైనా చేరని ఈ ఎడారిలో
ఈ కాస్త తడినైనా ఆపవె గుండె లోతులో
తెగిన గాలి పటమై సాగుతున్న పయనం
తనది అన్న తీరం కోరుకుంటె నేరం

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

చిన్న చిన్న ఆనందాలు
చిందులాడు చల్లని ఇల్లు
అందమైన అనుబంధాలు
సొంతమైతె అంతే చాలు
అంత కన్న గొప్ప వరాలు
అడగలేదు నువ్వేనాడు
చిటికిడంత ప్రేమను కోరి చెయ్యి చాచినావు
ఐనవాల్లు అంతా వుండి అందవైనావు
పంచలేనిదీ మమకారమెందుకు
పెంచలేక ఈ నిట్టూర్పులెందుకు

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

రునం తీరిపోయే అంది
కన్న తండ్రి చేసిన లెక్క
శేషమంటు ఏముందింక
ఆయువుంది ఇంకా అందీ
మాయదారి దేవిడి లెక్క
మొండి బతుకు తప్పదు గనక
దీవెనియ్యవలసిన చెయ్యే శపిస్తాను అంటే
దారిచూపవలసిన దీపం దహిస్తాను అంటే
ఆలకించరే నీ గోడు ఎవ్వరు
ఆదరించడే ఏ రాతి దేవుడు

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

ఏ నవ్వు చినుకైనా చేరని ఈ ఎడారిలో
ఈ కాస్త తడినైనా ఆపవె గుండె లోతులో
తెగిన గాలి పటమై సాగుతున్న పయనం
తనది అన్న తీరం కోరుకుంటె నేరం


Palli Balakrishna Sunday, December 3, 2017


చిత్రం: లేతమనసులు (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం:
గానం: యమ్.యమ్.కీరవాణి , సాధన సర్గం
నటీనటులు: శ్రీకాంత్ , గోపిక , కళ్యాణి
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: అనంత వర్మ
విడుదల తేది: 01.10.2004

పల్లవి:
ఆ నాటి మన చెలిమి కాదా ఒక కల
ఈనాడది మెదిలింది నా మదిలో ఇలా
ఆ నవ్వుల చల్లదనం ఆ శ్వాసల వెచ్చదనం
మమతలతో ఎదనింపిన ఆ మనసుల తీయదనం
ఎద వీడిపోని జ్ఞాపకాలుగా
వసివాడిపోని ఊహలై ఇలా

ఆ నాటి మన చెలిమి కాదా ఒక కల
ఈనాడది మెదిలింది నా మదిలో ఇలా

చరణం: 1
పొగడ చెట్టు నీడలో బొంగరాల ఆటలు
కోనలమ్మ కోనలో కొంటె కొంటె పాటలు
వెన్నెలమ్మ మేడలో ఆడుకున్న ఊసులు
గున్నమావి తోటలో పెంచుకున్న ఆశలు
గోడమీద రాసుకున్న ముద్దు పేరులు
ఊరిబైట మర్రికాడ కుర్ర చేష్టలు
తాయిలాలు పంచుకున్న తీపిగుర్తులు
గుండె దోచుకున్న వెండి చందమామలు
చిరు చినుకులలో మన సరిగమలు
ఎద పిలువక పిలిచిన పిలుపుల సవ్వడిలో

ఆ నాటి మన చెలిమి కాదా ఒక కల
ఈనాడది మెదిలింది నా మదిలో ఇలా

చరణం: 2
అట్లతద్ది రోజున పిట్టగొడ దూకుతూ
చేసుకున్న బాసలు మనసు మరిచిపోదుగా
మొదటిసారి పైటతో ఎదుట నిలచి నవ్విన
కన్నెజాబిలమ్మను కనులు మరువులేవుగా
పుస్తకాల చాటునుంచి దొంగచూపులు
చెరువుకాడ గురువుగారు పడ్డ తిప్పలు
కాలమన్న సాలెగూడు కట్టివేయగా
గొంతుదాటి పైకి రాని మూగప్రేమలు
ఒక అలజడిలో ఒక ఉరవడిలో
మది తెరువక తెరిచిన తలపుల తాకిడిలో

ఆ నాటి మన చెలిమి కాదా ఒక కల
ఈనాడది మెదిలింది నా మదిలో ఇలా
ఆ నవ్వుల చల్లదనం ఆ శ్వాసల వెచ్చదనం
మమతలతో ఎదనింపిన ఆ మనసుల తీయదనం
ఎద వీడిపోని జ్ఞాపకాలుగా
వసివాడిపోని ఊహలై ఇలా

Palli Balakrishna Wednesday, November 29, 2017


చిత్రం: కొబ్బరి బొండాం (1991)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, నిరోషా
దర్శకత్వం: కాట్రగడ్డ రవితేజ
నిర్మాత: కె. అచ్చిరెడ్డి
విడుదల తేది: 1991

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
ఏవేవో భావాలే మదిలో మోహన రాగాలై
కోయిల పాడే గీతాలై ఎద మరిపిస్తేనే
సాగే కాలంతో చివురించే ఆశల్లో
ఉందేదో ఆహా ఓ హాయి

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
విన్నాలే ఓ పిలుపు వయసులు పిలిచే తొలిపిలుపు
మనసున పొంగే తొలివలపు రారమ్మంటేనే
తీశావో తలుపు నీదే ఈ గెలుపు
రావేల ఆహా ఆహాహా

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
ఏవేవో పులకింత తపనలు రేగే తరుణంలో
తనువుని తడిమే నీళ్ళల్లో ఓ గిలిగింత
సంధ్యాసమయంలో ఈ జలకాలాటల్లో
ఉందేదో ఆహా ఓ హాయి
అందాల మేఘమాల


******   *******   *******


చిత్రం: కొబ్బరి బోండాం (1991)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

చరణం: 1
ఆహ ఆహ ఈ హాయి...నూరేళ్ళు నీదోయి
ఎద ఎద కలిసే ఏకాంతంలో...కౌగిలి రాగంలో
అందాల అమ్మాయ్యి..అందియ్యి నీ చేయి
పెదవులు కలిసి జతగా వేసే...ముద్దుల తాళంలో
కొబ్బరి బోండాం ...లబ్జు లకోరీ..
మోహవేశంలో ...ప్రేమానందంలో
ఏదేదో ...ఏమేమో...చక్కిలి గింతల
చలి చలి గిలి గిలి..లల.ల.లా...

చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

చరణం: 2
ఓహొ హో వయ్యారి...ముద్దొచ్చే సింగారి
సృష్టి రహస్యం భేదించాలి...శోభన రాత్రుల్లో
మౌనాలా తీరానా...గారాలా మారాలా
మన్మధబాణం సంధించాలి...యవ్వన వీధుల్లో
మధువుల మధనం...మదనుడి శరణం
సాగే శృంగారం...ఊగే సింగారం
ఉయ్యాల... జంపాల...గంధపుతూతల
సుందరి సొగసుకు...తపన వరసల
తకధిమి... ధిమితక

చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

Palli Balakrishna Saturday, September 23, 2017


చిత్రం: బడ్జెట్ పద్మనాభం (2001)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు
నటీనటులు: జగపతిబాబు, రమ్యకృష్ణ , రవితేజ
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: గ్రంధి నారాయణ రావు (బాబ్జి)
విడుదల తేది: 09.03.2001

ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
అనుకున్నది సాధించాలీ...

అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు..
సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలూ...
అనుకోవాలీ.. అడుగేయాలీ ముళ్ళ మార్గాన్ని అణ్వేషించాలీ..
అలుపొస్తున్నా కలలే కన్నాపూల స్వర్గాన్ని అధిరోహించాలీ..
ఎవరికి వారే లోకంలో.. ఎవరికి పట్టని శోకం లో.. నీతో నువ్వే సాగాలీ..

బలమూ నువ్వే.. బలగం నువ్వే.. ఆటా నీదే.. గెలుపూ నీదే..
నారూ నువ్వే .. నీరూ నువ్వే.. కోతా నీకే.. పైరూ నీకే..
నింగీ లోనా తెల్ల మేఘం నల్ల బడితేనే జల్లులు కురిసేనూ..
చెట్టు పైనా పూలూ మొత్తం రాలీ పోతేనే పిందెలు కాసేనూ..
ఒక ఉదయం ముందర చీకట్లూ.. విజయం ముందర ఇక్కట్లూ..
రావడమన్నది మామూలూ..

Palli Balakrishna Friday, September 15, 2017


చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , రవళి
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 02.08.1996
|
మల్లె పూల వాన మల్లె పూల వాన
జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా…
భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
మల్లె పూల వాన..
జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
మల్లె పూల వాన.. వాన వాన వాన
భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
దొరకును దొరకూనా ఎదురెవరుర మనకీ వేళలోన

చరణం: 1
ఓయమ్మా ఈ రోజున వద్దనకమ్మా ఏం చేసినా
నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరాపినా

అష్ట సిరులు నిను ఇష్టపడెనురా కష్టపడితే జత కట్టవచ్చురా

గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక
మహారాజులాగా వేశానుర కోటలో పాగా
పాచిక వేశాక పారక పోదురా నూరారు అయినా

చరణం: 2
మబ్బుల్లో ఆ జాబిలి.. నా జత కోసం రావాలని
ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జళ్లో చేరాలని
ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా
రథం నడుపుతారా మా మామను కూర్చోపెట్టి
ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి
అల్లుడినైపోగా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా


********   *********  ********


చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, కళ, శ్రీ

కమ్మగ సాగే స్వరమో
కమ్మగ సాగే స్వరమో
అల్లుడూ…

కమ్మగ సాగే స్వరమో
కమ్మగ సాగే స్వరమో
రమ్మని లాగే చెలిమో
అది ఎవరిదనీ మది అడిగినది
పద వెతకమని అటు తరిమినది
కథ ముదురు మదన మహిమో..
అద్గదీ
కమ్మగ సాగే
అద్గదీ
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో

చరణం: 1
తీయని వలపుల సాయం అడిగిన వయసు విన్నపమో
దాగని వలపుల రాగము పలికిన సొగసు సంబరమో
కంగారు కలల కలవరమో శృంగార కళల తొలివరమో
ఏమో….ఓ ఓ ఓ…
కమ్మగ సాగే
శభాష్!
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో

చరణం: 2
తొందరపడమని ముందుకు నడిపిన చిలిపి స్వాగతమో
కందిన పెదవుల విందుకు పిలిచిన చెలియ స్నేహితమో
పిల్లగాలి చేస్తున్న రాయబారమో పూల దారి వేస్తున్న ప్రేమ గానమో
ఏమో.. ఓ ఓ ఓ…
కమ్మగ సాగే స్వరమో
రమ్మని లాగే చెలిమో
అది ఎవరిదనీ - మది అడిగినది
పద వెతకమని - అటు తరిమినది
కథ ముదురు మదన మహిమో..
బ్రహ్మాండం!
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో


********   *********  ********


చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, మురళి, రాంచక్రవర్తి

జింగిలాలో ఏం గింగిరాలో
బొంగరాలో ఈ భాంగ్రాలో
లెఫ్టు రైటు లేదులో పడుచు బాటలో
ఎర్ర లైటు వద్దురో కుర్ర జోరులో
చిన్నారి ఈ చకోరి చూపింది చిలిపి దారి
ఓరోరి బ్రహ్మచారి.. వదిలేస్తే వెరీ సారీ
పారాహుషారు పాటలందుకో
ఈ పరుగులో బ్రేకులెందుకో

చరణం: 1
పాసుపోర్టు లేదు వీసాల గొడవ లేదు
వయసు దూసుకెళితే దేశాల హద్దులేదు
చాల్లేరా నెల్లూరే వెళ్లాలన్నా బస్ చార్జీ నిల్లేరా
ఇల్లాగే ఫారిన్ టూరు వెళ్లేది ఎలారా
యు.ఎస్ ని ప్యారిస్ ని ఊహల్లో చూడరా
టెక్నికలర్ కలలు కనే టెక్నిక్ మనకుందిరా
ఆ నింగికి సైతం నిచ్చెన వేద్దాం మన ఆశకున్న హార్సు పవర్ చూపిద్దాం
ఏ ఎల్లలైన చెల్లవంటు చాటిద్దాం
శాటిలైటు లాటిదిరా సాటిలేని యవ్వనం
పూట పూట వినోదాలు చూపించే సాధనం

జింగిలాలో ఏం గింగిరాలో
బొంగరాలో ఈ భాంగ్రాలో

చరణం: 2
ఫిల్మ్ స్టారులంతా మనకేసి చూస్తున్నారు
మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు
చల్ చల్ రే… పాకెట్లో పైసాలతో పిక్చర్కే పోయొద్దాం
పోస్టర్లో పాపకి ఓ డ్రస్సు కొనిద్దాం
తాపీగా కూర్చుంటే తోచదురా సోదరా
హ్యాపీగా ఎగరడమే మనమెరిగిన విద్యరా
ఆ గువ్వలమవుదాం.. రివ్వున పోదాం
మేఘాల మీద సంతకాలు చేసేద్దాం
ఓ వానవిల్లు కట్టి తిరిగి దిగి వద్దాం
తుళ్లిపడే అల్లరితో గొల్లుమనే సంబరం
ఆకలనీ దాహమని ఆగదురా ఏ క్షణం


********   *********  ********


చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!

చరణం: 1
ఎటు చూస్తున్నా శుభ శకునాలే కనపడుతున్నవి కదా
ఎవరేమన్నా పెళ్లి మంత్రాలై వినపడుతున్నవి కదా
ప్రేమా గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయ్యింది
ప్రేయసి కాస్తా పెళ్లామయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది
కళ్యాణ వైభోగంతో కన్యాదానం కానీయబ్బాయి
ఆ పైన నా ఓళ్లోనే కాలక్షేపం చెయ్యాలమ్మాయి… చిలకలా

చరణం: 2
వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేనా
ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకి దగ్గర కానా
పిల్లామూక పరివారంతో చుట్టాలంతా వస్తారంట
చిన్నా పెద్దా సకుటుబంగా చుట్టూ చేరి చూస్తారంట
ఓ గాలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలూ సన్నాయి
మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి… కిల కిలా

Palli Balakrishna

చిత్రం: పెళ్ళాం ఊరెళితే (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్ , కల్పన
నటీనటులు: శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి, సంగీత, రక్షిత
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.01.2003

దొండ పండు లాంటి పెదవే నీది
అబద్దం..అంతా అబద్దం..
దూదిపింజ లాంటి వదమే నీది
అబద్దం.. అంతా అబద్దం.
పాల మీగడంటి నుదురే నీది
అబద్దం.. అంతా అబద్దం
పూల తీగ లాంటి నడుమే నీది - అబద్దం
నీ పైన నా ప్రేమ అబద్దమనకూ అనకూ

మత్తును చల్లేటి నవ్వేమొ నీది - అబద్దం
నిన్ను నవ్వుల్లో ముంచెత్తు బాధ్యత నాది - ఇది నిజం
ముత్యాలు రాలేటి మాటేమొ నీది - అబద్దం
నీ మాటకు ఊ కొట్టు ఉద్యోగం నాది - ఇది నిజం
నేలమీద ఉన్న దేవత నీవు - అబద్దం
నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి నేను - ఇది నిజం
నువు పొగిడే ప్రతి పాట తీపి - అబద్దం
నను మెప్పించాలనే తాపత్రయం - గొప్ప వాస్తవం

పాల నురగ లాంటి పైటేమో నీది - ఆ హ హ అబద్దం
నీ పైట మాటునున్న మనసేమొ నాది ఆ - ఇది నిజం
గోరింట పువ్వంటి చెయ్యేమొ నీది - అహ మళ్ళీ అబద్దం
నీ చేతిలోన ఉన్న బ్రతుకేమొ నాది - అహా ఇది నిజం
నీలాలు కొలువున్న కళ్ళేమొ నీవి - అబద్దం
నువ్వు కన్నెర్ర చేస్తేనే కన్నీరు నేను - ఇది నిజం
నీ పైన అనుమానం క్షణకాలం
మన ఇద్దరి మధ్యన అనుభంధం కలకాలం


********   ********   ********


చిత్రం: పెళ్ళాం ఊరెళితే (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విజయ్ కుమార్
గానం: యస్.పి.బాలు, గోపికా పూర్ణిమ

పల్లవి:
మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా
నిగ నిగలాడే భామా నును లేత పసిడి కొమ్మా
గడసరి పలుకుల గువ్వా నువు మదనుడి మరదలివా
గుబ గుబలాడెను ఊటి నిను చూసి అయ్యోరామా
కళ్ళే చూసెనంటె కోడాక్
పళ్ళే చూసెనంటె క్లోజప్
థ్రిల్లై గంతులేస్తురావా నీకోసం
కురులే చూసెనంటె సన్ సిల్క్
నవ్వే చూసెనంటె నెస్కెప్
తుళ్ళి చెంతవాలిపోవా నీకోసం

చరణం: 1
మెరుపులన్ని మెలివేసి తారలన్ని కలబోసి
పున్నమంత మరిగించి  పుణ్యమంత కరిగించి
నవ నవలాడేలా నవ బ్రమ్హలు చేరి
తన్మయమై నిన్ను చేశారే కోరి
పలుకే వినినా తేనే తెలబోవు
రూపే కనినా తూర్పుకు మతిపోవు
కలరే చూసెనంటె ఏషియన్
రిస్టే చూసెనంటె  టైటాన్
నీకై లక్షలుంచిపోవా వాకిట్లో

చరణం: 2
కాలి అందె కదిపిందా  కాకి కోకిలై పోదా
పైట గాలి వీచిందా పాలవాన పడిపోదా
రుస రుస చూసిందా ఋతువులు మారేను
గుస గుసలాడిందా ఋషులే మారేను
నడుమే చూస్తే విరిసే హరివిల్లు
బిడియం పడుతు నీకే ప్రణమిల్లు
నడకే చూసెనంటె బాటా
పరుగే చూసెనంటె స్కూటీ
సంతోషించి ఇచ్చుకోవా ఎంతైనా


Palli Balakrishna



చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: వేణు తొట్టెంపూడి, సంగీత
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కోడి నాగార్జున
విడుదల తేది: 30.06.2007



Songs List:



అబ్బబ్బా వినవే పాట సాహిత్యం

 
చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: కృష్ణ సాయి
గానం: యన్.సి.కారుణ్య, సుచిత్ర

అబ్బబ్బా వినవే అబ్బాయి పోలిసే
అతను నడిచే ఎ టి ఎం పోతే చిక్కడులే (2)
నీదే లేటంతే నువ్వే ఉ అంటే ఆ కన్యాదానం చేసేస్తానంతే
మొగుడే పొలీసైతే ఇక ఆల్వేస్ హ్యాప్పీసేలే
మాలీష్ నుంచీ అన్నీ ఫ్రీయే
డ్యూటీ మీదే ఉంటే ఈ సిటీ అంతా తనదే
లాఠీకున్న పవరే పవర్
ఆలోచించు కొంచెం నీక్కొచ్చిందీ అవకాశం
ఎందరికీ వచ్చును ఈ అదృష్టం
డ్రీమ్‌లోకి వెళ్ళితే నే చెప్పింది రైటే అంటావు నువ్వే వెళ్ళూ ఒకసారీ
కోటిన్నరకీ తక్కువ కాని కారే తెస్తావుగా అరె కాలే బయట పెట్టాలనిపిస్తే
ఓ పోటి చేసో లూటి చేసో కోరిక తీరుస్తానుగా మరి అంతగా నీకే తిరగాలనిపిస్తే
హైటెక్ సిటీకి దగ్గరలో ప్లాట్ ఉంటే ఆలొచించక కొనితెచ్చేసి వ్రాసి ఇచ్చేస్తావా

ఏ స్కామో చేసేసి ఆ సొమ్మే తెచ్చేసి
యమ అర్జంటుగా కానుక చేసి నీకిచ్చెస్తానుగా
పడుకుంటే కలగంటే
అది నిజమేనే చేస్తాగా
అబ్బబ్బా విను తల్లే
రోజు నీకు వండీ వార్చే ప్రోగ్రాం అంటే కష్టమే
ఓ ఫైవ్‌స్టార్ హొటల్ కుక్‌ని తెస్తావా
తాజా చేతులు కందాయంటే పోదా చూసి ప్రాణమే
ఆ కుక్‌ని నీకే కుక్కని చేస్తాగా
బాబే పుట్టాకా కాన్వెంటే చదువులకీ ఫారన్ పంపించాలంటే
నువ్వేం అంటావు

ఇంగ్లీష్ చదువేగా చదివిద్దాం బేషుగ్గా
అయినా వాడికి పెట్టిందంతా తిరిగొచ్చేవేగా
సరే కానీ మనమొక్కటై
ఇక ఆలూ, మగలవుదాం ఓమ్
అబ్బబ్బా సరిలే చెప్పింది చాల్లే అబ్బాయి వస్తే చూస్తా
ఒకసారి నచ్చాడో మనకే ఇస్తాలే మసే, ఆపైన పెళ్ళి ఖాయం
చెయ్యొచ్చే పరవాలేదనిపిస్తే నే జెండా ఊపేస్తాలే
ఆ ఏర్పాట్లేవో చేసేయ్ నువ్వే నువ్వు చెప్పావనీ ఓకే నేనంటున్నాలే
అంతే ఆపైన ఇంక భారం నీదే తేడా వచ్చిందంటే మన సంగతి
తెలుదుకదా నీకే నాన్నని కూడా చూడను నే నే అబ్బబ్బా




నిప్పుంటే గురూ పాట సాహిత్యం

 
చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: బ్లేజ్,  సుచిత్ర

నిప్పుంటే గురూ ముట్టిస్తావా
నిప్పుని నిప్పుతో ఆర్పుకోవడంలో తప్పేలేదురా
తప్పున్నా సరే ఒప్పిస్తావా
తప్పుని ఒప్పుగా మార్చే దిట్టకి చెప్పేదేంటిరా
కజురాహో రంభా సొగసులు నిగనిగ చూడనా
కావాజి క్రేజ్ స్ట్తెల్‌లో అదరగొట్టేయనా
మిసిమిసి మిసి పసిడి పంపుల్నీ తడవనిస్తాలే సరదాగా పురుషా
జత కలిపేయ్ అతివ అందాలు శృతి చేయ్
మధన జెండాని ఏగరేయ్

నిప నిప దప దప లేచిపొతే చిట్టీ చిట్టీ నివ్వంటే 
టెంపర్ వాలో కోలో మర్చికీ పదమంటిరా
మిడ్‌నైట్ చూపింగ్ మార్చికి నువ్వే రాదురా
అరచేతిలో ఓహో మ్యజిక్ సూపరంటాలే
యమ పాపిక్ స్నేక్ డాన్సే నేర్పుకుంటాలే
సలసల రగుల సెగలన్నీ ఆర్పుకుంటాలే

డు ఇట్ లవ్ సజనా అని అనరా, ఎగిరెళ్ళి ఒళ్ళో పడరా
చిట్టి చిట్టి సిగ్గులే మరి చెడరా
లవ్ వండర్ సోకు నీదేలే చెంతకొస్తాలే సరిహద్దుని రద్దుచేసి
రుద్దుకుంటాలే స్విమ్మింగ్ సూట్‌కి మోడల్ నువ్వట
తపనల తడికి వణికి పొతుంటే ఒడుపు చూస్తాలే
నిప్పుంటే చిట్టీ మిసి మిసి పసిడి వంపుల్లీ చిట్టీ



ఓనమాలే సంగీతంలో పాట సాహిత్యం

 
చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: కృష్ణ సాయి
గానం: ఆర్తి

ఓనమాలే సంగీతంలో నేనే నేర్చుకోలేదంటా
గుండెల్లోని బావమేదో పొంగుతుంది పాటలాగా (2)
చిన్ననాడు విన్న అమ్మ జోలపాట సంగీతంలా నేర్చి
గొంతులోని మార్చి సుస్వరంలా కూర్చి పాడుతున్న పాటే
నా స్వరం గురించి మీరు మెచ్చుకుంటే జిల్ జిల్ జిల్‌లే

మనస్సు తుల్లు తుల్లు తుల్లులే (2)

పలుకే చిలకలకే అరువే ఇచ్చేటంత తియ్యంగా ఉంటే
పలికే ప్రతి పదమే మనస్సు లోతుల్లోకి చేరుతుందంటే
గళమే కోయిలయితే కూత నేర్పటం కమ్మంగా ఉంటే
ఓహో పాడే ఆ తలపే విన్నవారి ఎదలో ఊయలూగుమలే

తాళం తప్పని తకదిమిత రాగం వింటే తల ఆడించని మనిషంటూ
ఉండదు అసలే తమకం చక్కగా అలలాగా కళలొలికిస్తే హృదయం
తియ్యని అనుభూతికి లోనవుతుందీ మమకారంతో గానం
మనమే ఆలపిస్తే మధుమాసాలే వచ్చి ముంగిట్లో విరబూస్తుంటే జిల్
జిల్ జిల్‌లే మనసే తుల్లు తుల్లు తుల్లులే ఓనమాలే
సరిగ అంటూ సరిగా సంగీతంతో నువ్వే పెదవే కలిపాకా

మపనీ అంటూ మారనీ తానే అక్కున చేర్చుకోదా ఎంచక్కా
జతకా ఆడుకోయిలా తనతో వేసి ఆడిస్తుంటే చాలు కదా
ఓహొ లయగా శృతిలయగా గుండెలోనా తాను గూడే కట్టునుగా
ఆనందాన్నీ మనకి ఇచ్చే మంత్రమేదో తనలో ఎంత దాచిందో
ఏమో ఆస్వాదించే మనస్సే ఉంటే అంతో ఇంతో ఆలాపనగా
చేస్తుంది స్నేహం ఎంతో సృష్టి అంతా తానే అల్లుకుంది పది అష్టపది
తానై చెంత చేరి వస్తే
జిల్ జిల్ జిల్‌లే మనస్సే తుల్లులే ఓనమాలే





సో హ్యాపీ పాట సాహిత్యం

 
చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: కృష్ణ సాయి
గానం: సుచిత్ర, టిప్పు

సో హ్యాపీ సో హ్యాపీ సోసో హ్యాపీ రోయ్
బాడీజ్, టీనేజ్ నో క్యాన్సిల్ రోయ్ సో హ్యాప్పీ (2)
కొట్టావే జాక్‌పాట్ లాటరీలో నాట్‌లెట్‌లో దూకేసేయ్
కో అంటే నీ ముందుకొచ్చే కోతి చేయాలీ డిస్కోనే
అల్లావుద్దీన్ ఈ పల్లెటూరికేరా మాదంటూ ఇంతటి ఆనందం
కుబేరుడే మన ఇంటికి వచ్చెరా కాదనక ఇంట్లో పందిట్లో
సో హ్యాపీ సో హ్యాపీ 

ఇల్లంతా సెంట్రల్ ఎ సి చేసి ఓ సీ గా వాడేద్దాం
పొద్దున్నే ఫ్ల్తెట్ ఎక్కి ఫారన్ వెళ్ళి మిడ్‌నైట్ తిరిగొద్దాం
ఊహల్లోనా పైపైన తేలు ఊరికినే ఎక్కిఊగాక అలా పడ్డావంటే
పైనుంచి జారి అప్పుడు నీ కళ తీరకలా
హద్దులోనే మన ఆశలుంటే అంతకు మించి ధనముందా సో హ్యాపీ 

డబ్బులుతో దర్జానే కొన్నావంటే ఎన్నాళ్ళో ఉండవులే
మేడల్లో ఉన్నోళ్ళు మనుషులైతే ఇన్నాళ్ళూ నువ్వేవరే
జాన్ సే జాజా ఏం తెలుసు నీకై పైసల్లోని కరెంటే, లేనోడిలా
ఉంటానంటే నీ కర్మే అనుకుంటాలే ఈ రోజుతో తీరేది కాదుగా
ఎందుకీ నీకీ గొడవ అసలే సో హ్యాపీ




ఏమంటారో పాట సాహిత్యం

 
చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: కృష్ణ సాయి
గానం: నిహాల్, కౌశల్య 

ఏమంటారో ఈ బంధాన్నీ ఏమో ఏమోనండీ పేరేదో మీరే చెప్పండీ
ఎవ్వరికెవ్వరు ఏమి కానీ పోల్చే దారే లేని ఈ బంధం ఏమై ఉంటుందీ
కనురెప్పమూసేస్తే కనుపాప నిదరోతే గుండెల్లో హాయి ఎందుకూ
నిరువుళ్ళ సవ్వడికే పురివిప్పి ఆడవులే ఎందుకలా నర్తించూనూ
ఏమంటారోపయనించే ఎన్నో పక్షులకీ ఊగేటి రెక్కలకీ
ఆ ఆధారం వీచే చిరుగాలి ఆ బంధం ఏమని పిలవాలీ

పువ్వులకీ, నవ్వులకీ ఈ ఈ రంగులకీ మబ్బులకీ
ఓయి ఓయ్ సోకులకి చాంగులకీ హాయ్ హాయ్ జాములకీ జంకలకీ
లేకున్నా ఈబంధం ఉందేదో సంబంధం చూస్తున్నా ఏమంటారో
ఈ సిగ్గొచ్చి వయస్సును తరిమేస్తే, చెక్కిళ్ళే ఎరుపెక్కే ఏమిటో
ఆ ఏముందో ఈ రెండిటికీ బంధం, తేల్చి చెప్పాలంటే కష్టం

ఈ ఈ మనస్సులకీ, మమతలకీ ఆ ఆ స్వరములకి మధురిమలకీ
ఓయ్ ఓయ్ వేకువకి కోయిలకీ హాయ్ హాయ్ చూపులకి ప్రేమలకీ
మన మనస్సుకి అందనిది అనుబంధం ఒకటుందీ కలిపిందీ అది హరివిల్లండీ
ఏమంటారో ఎవ్వరికెవ్వరు

Palli Balakrishna



చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
నటీనటులు: బాలక్రిష్ణ , సౌందర్య, ఆమని
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాతలు: వెంకటరావు ముల్పూరు, అచంట గోపీనాథ్
విడుదల: 09.12.1994



Songs List:



ఓ పాప ముద్దు పాప పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు

చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు

పల్లవి:
ఓ పాప ముద్దు పాప
నువ్వు లేనిదే పాడు పాప
ఓ పాప ముద్దు పాప
నువ్వు లేనిదే పాడు పాప
నా పాప...

చరణం: 1
చక్కనమ్మ చిలిపి పాప
చక్కనమ్మ చిలిపి పాప
చందమామ రావే పాప
కొంటె కళ్ళ పాప
నా ముద్దుల పాప
కొంటె కళ్ళ పాప
నా ముద్దుల పాప

చరణం: 2
పాల బుగ్గల పాప
పాడు బుగ్గల పాప
పాల బుగ్గల పాప
పాడు బుగ్గల పాప
పాల బుగ్గల పాప
నా పాప...



సామజవరగమన పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

సామజ వరగమనా..
సా... మజ వరగమనా....
సామజవరగమనా (హొయ్ హొయ్) 
సామజవరగమనా..
ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) 
ఎన్నీయల్లో ఎన్నీయల్లో...
సామజవరగమనా (హొయ్ హొయ్) 
సామజవరగమనా...
ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) 
ఎన్నియల్లో ఎన్నియల్లో...

చింతాకు నడుముకు (సామజ సామజా) 
దింతాకు నకదిమి (సామజ సమజ)
సింగారి వయసుకి (సామజ సామజ)
శృంగార పున్నమి సామజ సామజ

సామజవరగమనా (హొయ్ హొయ్)
సమజవరగమనా...
ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) 
ఎన్నియల్లో ఎన్నియల్లో...

సా.. మజవరగమనా.....
పా పా పా పా పా పా పా మపనినిప మపనినిప నినిసా 
సగ సగాగా సగ సమామా సగ సప సపా మాగా రిసాని సరిస 
పసససాస పరిరిరీరి
రిసగరిస మపసనిప గమపనిస
సా సా సా గరిస నిపమగ గమపని సదారిసానిపామ
పగరిసానిపామగ గరి సాసాస సాసాస గరిస

అల్లమో బెల్లమో కన్నెపిల్ల అందమో
పువ్వు లా నవ్వితే జివ్వు మంది ప్రాణమో
చెల్లీలో చెల్లకో అందుకుంటి ముద్దులు
పెళ్ళి తో పిల్లడు ఉండవింకా హద్దులు
చిలుక సుకుమారి హంస దొరసానీ
అడవి నెమలి చిందులేయా రావే..

సామజవరగమనా (హొయ్ హొయ్) 
సామజవరగమనా... హొయ్
ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్)
ఎన్నియల్లో ఎన్నియల్లో..
సమజవరగమనా........

ఏవయా మావయ్య జాగు ఇంక ఏలయా? 
భామనీ ప్రేమనీ ఏలుకోగా రావయ
రాగాము యోగము కొంగుముడి వేయగ 
అందుకో తీయ్యగా సంబరాలు హాయిగ

పడుచు సరసాల వయసు మురిపాల 
మనసు మనసు కలిసి వలపు విరిసె
సామజవరగమనా (హొయ్ హొయ్) 
సామజవరగమనా..
ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్)
ఎన్నియల్లో ఎన్నియల్లో..

సామజవరగమనా (హొయ్ హొయ్)
సామజవరగమనా.....

ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్)
ఎన్నియల్లో ఎన్నియల్లో
చింతాకు నడుముకి (సామజ సమజ)
దింతాకు నకధిమి (సామజ సామజ)
సింగారి వయసుకు (సామజ సామజ)
శ్రుంగార పున్నమి (సామజ సామాజ)

సామజవరగమనా (హొయ్ హొయ్)
సామజవరగమనా....
ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్)
ఎన్నీయల్లో ఎన్నియాల్లో

సామజవరగమనా....




ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తే పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల  
గానం: యస్.పి. బాలు, చిత్ర 

ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త
వద్దకొచ్చి ముద్దిలిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్త
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరే తకజుం తకజుం తకజుం తకజుం
తకధిమి నడకల నడుములో
నలిగిన సొగసును తడుముతా
పెదవి మదుపు పెడతా హోయ్
వలపు తలుపు తడతా హొయ్
ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త
వద్దకొచ్చి ముద్దిలిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్త
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా

సన్నజాజుల చినుకులలో
స్నానమాడిన తమకముతో
వన్నెదేరినా వయసా వారెవా
కన్ను సైగల తాకిడిలో
యెన్నడెరగని తహ తహతో
నన్ను లాగిన చొరవా వారేవా
తారకాల
హా...ఆ...ఆ...
దరి చేరగరా
ఊమ్...కోరికతో అభిసారికనై
నిలుచున్న చంద్రమా
చూశానే అందమా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్త
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త
వద్దకొచ్చి ముద్దిచ్చి ఉద్ధరిస్తా

తేనె కోరే తుమ్మెదగా
చేర వస్తా నెమ్మదిగా
పూలతీగ రానా అతిథిగా
కమ్ముకొస్తే కాదనకా
కౌగిలిస్తా కానుకగా
తేనెటీగా రావోయ్ మృదువుగా
వందనమే
మ్...ఊ...ఊ...
నవ నందనమా
మ్...స్వాగతమోయ్ యువ దొరతనామా
నిలువెల్లా ఏలుకో
జత వొళ్ళో వాలిపో
ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త
వద్దకొచ్చి ముద్దిలిచ్చి ఉద్ధరిస్తా
ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్త
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరే తకజుం తకజుం తకజుం తకజుం
తకధిమి నడకల నడుములో
నలిగిన సొగసును తడుముతా
పెదవి మదుపు పెడతా హోయ్
వలపు తలుపు తడతా హొయ్

ఒక్కసారి 
ఒక్కసారి 
వద్దకొస్త
వద్దకొచ్చి 
ముద్దులిచ్చి ఉద్ధరిస్తా

ఒక్కసారి 
ఒక్కసారి 
పక్కకొస్తా
పక్కకొచ్చి 
చిక్కనైన చెక్కిలిస్తా




జామురాతిరి కాసుకోమరి పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

జామురాతిరి కాసుకోమరి
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
చేరుకొఒడి చెయ్యుగారెడి
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
రవికకు పెడితె కితకితలు
బుగ్గలకెందుకు నిగనిగలు
గుండెలు పుడితె గుబగుబలు
తనువులకెందుకు తహ తహలు
హైరే హైరే హైరే హాయ్ హైరే హైరే హైరే హాయ్
జర బోలో బోలో బోలో బోలో బోలో

హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్

జామురాతిరి కాసుకోమరి
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
చేరుకొఒడి చెయ్యుగారెడి
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
రవికకు పెడితె కితకితలు
బుగ్గలకెందుకు నిగనిగలు
గుండెలు పుడితె గుబగుబలు
తనువులకెందుకు తహ తహలు
హైరే హైరే హైరే హాయ్ హైరే హైరే హైరే హాయ్
జర బోలో బోలో బోలో బోలో బోలో

హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్

కామయ్యకు కబురెడదాం.
కౌవ్వితల కథ చెబుదాం..
ఓయ్ కామయ్యకు కబురెడదాం
కౌవ్వింతల కథ చెబుదాం..
ఏకాంతం కనిపెడదాం.. ఏకంగా జతకడదాం..
మోజుల్లో తోరపెడదాం..
మోమాటం విడగొడదాం..
కౌగిల్లకి పదునెడదాం..
ఆరాటం పనిపడదాం..
ఐసా పైసా తేల్చేదాం..
హైరే హైరే హైరే హయ్..
ఆనందంలో మునకేదాం
హైరే హైరే హైరే హయ్..
హైరే హైరే హైరే హయ్..
హైరే హైరే హైరే హయ్..
సరే కానీ కానీ కానీ కానీ

హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్

సంపంగి సవ్వడిలో సయ్యన్నదిలే వయసు
సంపంగి సవ్వడిలో సయ్యన్నదిలే వయసు
శ్రీ గందపు ఆవిరినై సోదిస్తా నీ సొగసు
వేయ్యెల అనురాగం నా ఓల్లో వోదిగేనా
లే..వలపు వీణల్లో రాగాలు తరిగేనా
గిలి గిలి గింతల రాతిరిలో
హైరే హైరే హైరే హాయ్
మై మరపింపుల జాతరలే
హైరే హైరే హైరే హాయ్
హైరే హైరే హైరే హాయ్
హైరే హైరే హైరే హాయ్
అది ఏమో ఏమో ఏమో ఏమో

హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
జామురాతిరి కాసుకోమరి
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
చేరుకొఒడి చెయ్యుగారెడి
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
రవికకు పెడితె కితకితలు
బుగ్గలకెందుకు నిగనిగలు
గుండెలు పుడితె గుబగుబలు
తనువులకెందుకు తహ తహలు
హైరే హైరే హైరే హాయ్ హైరే హైరే హైరే హాయ్
జర బోలో బోలో బోలో బోలో బోలో
హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్
దిందింతాక్ దిగిదిగితాక్




భామ నీ చీర కట్టు పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

భామా నీ చీరకట్టు చూపులన్ని కొల్లగొట్టు ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు
బాసు నీ మీసకట్టు రాసుకుంటే వీపు చుట్టు హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ
గువ్వా నీ ఇంటి చుట్టు తిరుగుతుంటే ఎంత బెట్టు హవ్వ ఒరవ్వ ని లవ్వే నాకివ్వ
బాబు నీ చేతిపట్టు చెక్కిలింత లెన్నో పెట్టు టైరో ఓ హీరో వస్తారో టుమారో

అసలైన కసిలోన కిసిమిసి వయసే కాజేయ్యనా
గిరికీల గిజ్జిగాడ బుజ్జి బుజ్జి మురిపెం నాదేనా

హ...భామా నీ చీరకట్టు చూపులన్ని కొల్లగొట్టు ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు
బాసు నీ మీసకట్టు రాసుకుంటే వీపు
చుట్టు హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ

హో...కొట్టే కాలింగ్ బెల్లు కొరికే నీ చూపు ముల్లు బాబో నా గుండె జల్లు మావా
బండి చక్రాల కళ్ళు అల్లో నేరేడు పళ్ళు జాజి పన్నేటి జల్లు భామా

మనసే ....ఏకమైతే రెప్పపాటు ఎందుకింత చాటు మాటు
సొగసే...ఇప్పకుంటే సిగ్గు చేటు ఎందుకింక ఇంత లేటు

పెల్లుబికే రస గంగ పెదవికి పెదవి దొరకంగా
వలపంతా వలకంగా సరసకు రావే మురిపెంగా

బాసు నీ మీసకట్టు రాసుకుంటే వీపు
చుట్టు హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ
భామా నీ చీరకట్టు చూపులన్ని కొల్లగొట్టు ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు

భామా... బాసు...
గువ్వా... బావో...

హా...పెట్టు డైమండ్ రింగు పట్టు నా పైట చెంగు నీవే నా ప్రేమ కింగ్ మావా
రంగి నీ మేనిరంగు కోరే నా కోడె పొంగు ఇస్తా ఈ ఈవినింగ్ బాగా

ఎదలో...చెప్పలేని వేవరింగ్ ముచ్చటైన హేమరింగు
ఇదిగో...ముద్దు ముద్దు ఓపెనింగ్
కోరుకున్న కొత్త స్వింగు

చెలిసోకు శృతిచేసి నడుముని అడుగు నజరానా
బిరుసైనా వయసంతా విరుచుకు పడనీ చినదానా

గువ్వా నీ ఇంటి చుట్టు తిరుగుతుంటే ఎంత బెట్టు హవ్వ ఓరవ్వ ని లవ్వే నాకివ్వ
బాబు నీ చేతిపట్టు చెక్కిలింత లెన్నో పెట్టు టైరో ఓ హీరో వస్తారో టుమారో

అసలైనా కసిలోనా కిసిమిసి వయసే కాజేయ్యనా
గిరికీల గిజ్జిగాడ బుజ్జి బుజ్జి మురిపెం నాదేనా

ఓ....భామా నీ చీరకట్టు చూపులన్ని కొల్లగొట్టు ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు
బాసు నీ మీసకట్టు రాసుకుంటేవీపు చుట్టు హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ



బీడీలు తాగండి పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల  
గానం: యస్.పి. బాలు, చిత్ర 

చుట్టా బీడీ సిగరెట్ బీడీ బీడీ బాబు
చుట్టా బీడీ సిగరెట్ బీడీ బీడీ

యువర్ అటెన్షన్ ప్లీజ్
స్మోకింగ్ ఈజ్ ఇంజురీయస్ టు హెల్త్
స్మోకింగ్ ఈజ్ ఇంజురీయస్ టు హెల్త్
స్మోకింగ్ ఈజ్ ఇంజురీయస్ టు హెల్త్

స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే
స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే
స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే
స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే

బీడీలు తాగండి బాబులు
తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు
బీడీలు తాగండి బాబులు
తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు

భీముడంటి బాలయ్యా బీడీలు మానయ్యా
భీముడంటి బాలయ్యా బీడీలు మానయ్యా
పొగను మరిగి పదును చెడునయ్యా
కమ్మంగా ఓ దమ్ము కొట్టంగా తల్లోని

దిమ్మంత దిగిపోద్దె మర్దలా మర్దలా
కమ్మంగా ఓ దమ్ము కొట్టంగా తల్లోని
దిమ్మంత దిగిపోద్దె మర్దలా మర్దలా


మగసిరి మావయ్య పొగ చూరిపోకయ్య
మగసిరి మావయ్య పొగ చూరిపోకయ్య
హెల్త్ వెల్త్ తగలబెట్టకయ్యా...

బీడీలు తాగండి బాబులు
తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు
బీడీలు తాగండి బాబులు
తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు

స్మోకింగ్ ఈజ్ ఇంజురీయస్ టు హెల్త్
స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే


అబ్బాయి కరీమ్ బీడీ ఓ కట్ట అందుకో బాబు
ఆయ్...యహా మొహం మీద ఊదకయ్య ఎదవ బీడీపోగ
ఓసోస్ గోల్డ్ ఫ్లాక్ లో కూడా పొగేనండి
ఉండేది సాంబ్రాణి కాదు

పెదాలపై సదా అలా పొగే ఉంటుంటే
తీయని ముద్దుల ఆటాడేందుకు తీరికుండదయ్యా

మగాడంటే మీసాలుంటే ఎట్టా ఉండాలే
ఆగకుండా ఆరకుండా బీడీ మండాలే..
ఛీ ఛీ పాడు కంపు ఏమి ఇంపయ్యో
చెబితే తెల్దుగాని కాల్చి చూడమ్మో..

బీడీ కట్ట కావాలా.. నా జట్టు కావాలా
బీడీ కట్ట కావాలా.. నా జట్టు కావాలా

సవితి గొడవ తగదె అమ్మడు..

బీడీలు తాగండి బాబులు
తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు
బీడీలు తాగండి బాబులు
తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు

స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టూ యూత్
స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టూ యూత్


ఓ..ఉఫూ...
గుప్పు గుప్పు వదులుతుంటే గొప్పగుంటాదే
బీడీ ఘాటే లేని బతుకు సప్పగుంటాదే

రైలింజన్లా రాజుతుంటే ఏమి
స్టైలయ్యో కర్మ
పైసలన్నీ ఫైసలయ్యే పనులు చాలయ్యో.

ఓయ్ బీడీ చెడ్డదని ఒప్పుకుంటానే...
కనుకే దానినిలా బుగ్గి చేస్తానే..

మాటకారి మావయ్య మాయ చేయవద్దయ్యా
మాటకారి మావయ్య మాయ చేయవద్దయ్యా

తెగని తగువు మనకు దేనికే...
బీడీలు తాగండి బాబులు
తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు
బీడీలు తాగండి బాబులు
తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు

భీముడంటి బాలయ్యా
ఓయ్...
బీడీలు మానయ్యా
ఆహా...
భీముడంటి బాలయ్యా
ఓయ్....
బీడీలు మానయ్యా
పొగను మరిగి పదును చెడునయ్యా

తాంగిడ తరిగిడ తరిగిడ
కమ్మంగా ఓ దమ్ము కొట్టంగ తల్లోని
దిమ్మంత దిగిపోద్దె మర్దలా మర్దలా
కమ్మంగా ఓ దమ్ము కొట్టంగ తల్లోని
దిమ్మంత దిగిపోద్దె మర్దలా మర్దలా

Palli Balakrishna Friday, September 1, 2017


చిత్రం: అతడే ఒక సైన్యం (2004)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత
నటీనటులు: జగపతిబాబు, నేహా
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 23.01.2004

నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట
నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట
పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట
నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట
రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట

నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట
నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట

లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట
పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట
చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట
పడుచు గుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట
అందరు మెచ్చే పాట.. ఒకరికి అంకితమిచ్చే పాట
అందరు మెచ్చే పాట.. ఒకరికి అంకితమిచ్చే పాట
పదాలు అన్నీ బోయీలై ప్రేమ పల్లకిని మోసే

నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట

పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట
కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట
నదులలోని జీవరాగమే నింపుకున్న పాట
వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట
ప్రకృతి నేర్పిన పాట.. చక్కని ఆకృతి దాల్చిన పాట
ప్రకృతి నేర్పిన పాట.. చక్కని ఆకృతి దాల్చిన పాట
మనస్సు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసే

నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట
నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట
పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట
నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట
రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట

నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట

Palli Balakrishna Wednesday, August 16, 2017

Most Recent

Default