చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ , దాశరధి , వేటూరి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల
నటీనటులు: కృష్ణ , రజినీకాంత్
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్
నిర్మాతలు: జి.డి. ప్రసాదరావు, పి.శశిభూషణ్
విడుదల తేది: 25.01.1979
పల్లవి:
చినుకు చినుకు పడుతూ ఉంటే
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటై పోతు
ఒకరికొకరు చలిమంటైతే - ఐతే
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ
చినుకు చినుకు పడుతూ ఉంటే
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటై పోతు
ఒకరికొకరు చలిమంటైతే - ఐతే
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ
చరణం: 1
చెయ్యి నడుము చుట్టేస్తుంటే
చంప చంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కవ్వేయదా
చెయ్యి నడుము చుట్టేస్తుంటే
చంప చంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కవ్వేయదా
ఆ ఊపిరాడలేదని నువ్వు
ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే
జేజేలు జేజేలు ఈ రోజుకు
ప్రతిరోజు ఈ రోజు అయ్యేందుకూ
చినుకు చినుకు పడుతూ ఉంటే
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటై పోతు
ఒకరికొకరు చలిమంటైతే
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ
చరణం: 2
ఒంపులన్ని తెలిసే మేరా
ఒంటికంటుకున్నది చీర
వదిలిపెడితె రట్టవుతుందిరా
ఒంపులన్ని తెలిసే మేరా
ఒంటికంటుకున్నది చీర
వదిలిపెడితె రట్టవుతుందిరా
గుట్టునువ్వు చెబుతూ ఉంటే
కొట్టువేసి నే చూస్తుంటే
బిగువైన పరువాణ్ణి ఆపేందుకు
పగ్గాలు లేవింక జంకేందుకు
చినుకు చినుకు పడుతూ ఉంటే
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటై పోతు
ఒకరికొకరు చలిమంటైతే
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ