చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: కె. ఎస్. చిత్ర
పల్లవి:
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చరణం : 1
ఆ కాలం గుచ్చింది కళ్ళల్లో ముళ్ళన్నీ
నే తీస్తా ముళ్ళన్నీ నువ్వేలే నాకన్నీ
కష్టాలు ఎన్నైనా నీకోసం పడతాను
మన అమ్మను తెమ్మంటే ఏ కాళ్ళను పడతాను
అమ్మలేని బ్రహ్మ రాత రాసినాడు
అమ్మనెత్తుకెళ్లి కోత కోసినాడు
నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మా
మన కన్న తల్లివి నువ్వమ్మా
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చరణం : 2
నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా
ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా
ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం
ఇందుకే నేను ముందు పుట్టినాను
అమ్మ లా చూసే అన్ననైనాను
నీ ముందు ప్రాణాలెంతమ్మా నను కన్నమ్మా
నీకోసం నేనున్నానమ్మా
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
Anuragham Chese Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)
'Anuragham Chese' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by K. S. Chithra and S. A. Rajkumar.
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: ఎస్. ఏ. రాజ్ కుమార్, కె. ఎస్. చిత్ర
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
కళ్లకి కాటుక పెడతా ఈ చల్లని చూపులకి
బాషికమే నే కడతా ఈ నుదుటన ఆశలకి
ఈ పచ్చని నూరేళ్ళకు నే మొక్కేను ముక్కోటి దేవుళ్ళకు
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
పగలే చుక్కలు పొడుచుకు వచ్చి నేలకు చేరెనురా
చాపకు రెక్కలు మొలుచుకువచ్చి నింగికి ఎగెరెను రా
పెళ్లంటే అయో వప్పని వాడు అరె పల్లకి ఎక్కి ముచ్చట చూసి
పసిపాపే ముత్తైదై కనుపాపే కన్నమ్మై
ఈ అన్నకి పెళ్లే చేసే పేరంటాలైయ్యిందా
అనురాగం అన్నయ్యై మమకారం చెల్లెమ్మై
ఈ బంధం వందెళ్ళయ్యే వదినమ్మే చేరిందా
ఈ పందిట్లోనే మహారాణిని మీ అన్నయ్య పదాల పారాణి ని
స్వర్గమొచ్చి మనవాకిట్లో ఈనాడు వాలేనమ్మ
ఒక రెమ్మకి విరిసే పువ్వులం ఒక పెదవిపై మురిసే నవ్వులం
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
నన్ను నువ్వూ మరచినా వదిన నెపుడూ మరవకు
ఇంటి ఆలిని మరచినా కంటి వెలుగును మరవకు
రెండు కళ్ళు మీరు నాకు రెప్పనేనని మరవకు
ఈ ఇల్లే వెయ్యిల్లై ఈ బ్రతుకే వేయ్యేళ్లై
అనందం విందులు చేసి ఆకాశం అందేను
గతజన్మల పుణ్యాల వరమల్లే వచ్చావో
ఉగ్గుపాలు తాగిన గిన్నెకు నువు పెళ్లి పెద్దైనావు
నువ్వు చుక్క పెడితే చాలు నా బుగ్గన
అరుంధతి చుక్కే ఇచ్చు శుభ దీవెన
అమ్మలేని ఈ ఇంట్లో మా వదినమ్మే అమ్మవుతుంది
ఈ జంటకు శతమానము
ఈ జన్మకు మా జత మానము
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
మంగళ హారతులిస్తా ఈ గువ్వల జంటకి
చెడు కన్నుల దిస్టిని తీస్తా మా అన్నా వదినలకి
ఈ పచ్చని నూరేళ్ళకి నే మొక్కేను ముక్కోటి దేవుళ్ళకు
Ghunthakallu Ghumma Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)
'Ghunthakallu Ghumma' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by Sujatha Mohan and Tippu.
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
అన్నా అన్నా అన్నా....
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత
తలరాతే గా నన్ను చేర్చెను నరకం
చెడు నిందను మాపేసి వస్తే న్యాయం
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
వేసవికైనా నీరుంది ఓర్పుకు అయినా హద్దుంది
పాపం పెరిగితే భూదేవైనా కంపించకుంటుందా
చీర సారె సిరులిచ్చి మెట్టినింటికి నన్నిస్తే
పుట్టెడు నిందను కొంగున కట్టుకు
పుట్టింటికి వచ్చేదా
కాపుకాయనే లేనా కనులదాచుకొనా
తప్పుతో రాలేనన్నా నిప్పుతో వస్తా
ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను
పేగు అదురుతోందమ్మ ప్రాణమొనుకు తోందమ్మ
పుట్టింటికి రామ్మా చెల్లమ్మ
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
కట్టిన తాలే కాదన్న ఈ కాకుల లోకం ఏదన్నా
మెట్టిన నరకం మంటలోంచి ఈ పుట్టింటికి స్వర్గానికి రా
ప్రేమే అంతటి విలువైంది పుట్టిన ఇల్లే చలువైంది
తప్పని అరిచే ఈ ఆచారం మెట్టింట్లో ఇరుకైంది
అన్న నీడ కాదంటూ బలిపశువవుతావా
గుండె పైన రాయల్లే బరువు పెంచరావా
నింగిలాగ నేనున్నా ఉరుము భయము నీకొద్దు
ఉరుము టారుముకొస్తున్నా జడుపు భయము ఇకలేదు
పుట్టింటికి రామ్మా చెల్లమ్మ
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత
తలరాతే గా నన్ను చేర్చెను నరకం
చెడు నిందను మాపేసి వస్తే న్యాయం
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
Chamanti Poobanthi (Male Version) Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)
'Chamanti Poobanthi (Male Version)' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by Madhu Balakrishnan.
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: మధుబాలకృష్ణన్
పల్లవి:
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చరణం: 1
నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా
ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా
ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం
అమృతాన్ని తాగి అమ్మలాగ రానా
అమృతాన్ని మించే అమ్మప్రేమ తేన
నీకంటే నా కెవరున్నారే నా చెళ్ళమ్మా
ననుగన్నా తల్లివి నువ్వమ్మా
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చరణం: 2
నీ నవ్వు చూడంగా ఉన్నాయి ఈ కళ్ళు
పూవల్లే పెంచంగా ఉందమ్మా ఈ వళ్ళు
నీ కాలి చెప్పులుగా అరచేతులు ఇవిగోమ్మ
కలతంటూ రానీను కనులు చెమ్మ కానీను
గోరింటాకు నేనై నీ చేత పండుతాను
గోరువంక చెంత చిలక నిన్ను చేస్తాను
ప్రతి జన్మ నువ్వేలేవమ్మా నా చెల్లమ్మా
ఈ జన్మే అంతా నీదమ్మా
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
అమ్మలేని ఆ బ్రహ్మ రాత రాసినాడమ్మా
అమ్మలేని వారిని చేసి కోత కోసినాడమ్మా
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో