-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Charmy Kaur"
Lakshmi (2006) Telugu Songs Lyrics Album Cover

Lakshmi (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Lakshmi (2006)
Music : Ramana Gogula
Director : V. V. Vinayak
Producer : Nallamalupu Bujji
Actor : Venkatesh
Actresses : Nayanthara , Charmy Kaur
Supporting Cast : Sharwanand
Release Date : 14 January 2006

Dhaga Dhaga Song Lyrics in Telugu – Lakshmi (2006)

'Dhaga Dhaga' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Ramana Gogula and Ganga.

SONG INFORMATION
Movie : Lakshmi (2006)
Music : Ramana Gogula
Lyricist : Vishwa
Singers : Ramana Gogula, Ganga
చిత్రం: లక్ష్మీ (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: విశ్వ గానం: గంగ, రమణ గోగుల ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ నిన్నే నేనే మెచ్చావాలో వినుకోవా హిమ్మత్ వాలా నేర్పిస్తా అల్లె సెయ్యాలా హే తధిగినతోం తకధీం తక తారార తధిగతోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా చరణం: 1 ఆటే కట్టు గురిపెట్టు కౌగిళ్ళ తాకట్టు చాటు మాటు చే గుట్టు వద్దికలో చూపెట్టు చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళతో శరం తెస్తా నీరు కలకలం దేఖోనా అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం దాచేదెట్టా సోకంతా నాలోనా బోలోనా హే తధిగినతోం తకధీం తక తారార తధిగతోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా చరణం: 2 దేఖో దేఖో నీకేలే నా సోకులు యావత్తు రేపో మాపో అంటూనే దాటెయ్యకు నీ ఒట్టు చూశా తమరి వాలకం చేసా తుదకు సాహసం అన్నీ చేసుకోవశం దివానా ఇట్టా తనువు తగలడం ఆపై మనస్సు రగలడం చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా హే తధిగినతోం తకధీం తక తారార తధిగతోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ హే తధిగినతోం తకధీం తక తారార తధిగతోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ

Taara Taluku Taara Song Lyrics in Telugu – Lakshmi (2006)

'Taara Taluku Taara' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Raju and Sunitha Upadrashta.

SONG INFORMATION
Movie : Lakshmi (2006)
Music : Ramana Gogula
Lyricist : Chandrabose
Singers : Raju, Sunitha Upadrashta
చిత్రం: లక్ష్మీ (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: రాజు, సునీత ఉపద్రస్ట తార తళుకు తార తనివి తీరా పలుకగా ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర తార తళుకు తార తనివి తీరా పలుకగా ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర చరణం: 1 నిను కలిశెను నిమిషమున కవినవనా నువ్వు కలవని తరుణమున కలతవనా నడిరేయి పగలవ్వనా ఒడిచేరి సగమవ్వనా తార తళుకు తార తనివి తీరా పలుకగా ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా చరణం: 2 నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా జడనిండా పూలవ్వనా తడి కంట పూజించనా తార తళుకు తార తనివి తీరా పలుకగా ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర

Hey Satyabhama Song Lyrics in Telugu – Lakshmi (2006)

'Hey Satyabhama' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Shankar Mahadevan and Sudha Krishna.

SONG INFORMATION
Movie : Lakshmi (2006)
Lyricist : Chandrabose
చిత్రం: లక్ష్మీ (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహాదేవన్, సుధా కృష్ణ హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా ఊగాలి యెదలో ఊయల హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల ముడేస్కోకు మురళీలోలా లడేస్తాను నా బాలా చరణం: 1 తుహీ మేరా దేఖ్ మేరా మచ్ తూ జానేమన్ ఖుషి జీవన్ మేరి దిల్ ఖీ దడకన్ ప్రతి నిమిషం నీవశం ఇదే సందేశం ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం హిందిలో షేరేగాని మన తెలుగులో కవితవని ఎదైనా ఒకటే వాని సయ్యాటకు సిద్దమని చరణం: 2 నహు తేరే సాత్ మేరి యాచ్ మేరి సాద్వేయా తుజీ మేర ప్యార్ ఏ వారా హమేశా నువ్వే అబద్దం అసత్యం మరీ అన్యాయం నువ్వే అపాయం అందమైన ఉపాయం నన్ను పొగిడావా తిట్టావా గిలిగింతలు పెట్టావా నడి మధ్యన ఎందుకు గొడవ నడిపిస్తా నీ పడవ హే సత్యభామ రా ఇలా ఇక చిందేలా నీబోయ్ ఫ్రెండు నేనేగా (2)

Ammayi Andhra Mirchi Song Lyrics in Telugu – Lakshmi (2006)

'Ammayi Andhra Mirchi' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Tippu and Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Lakshmi (2006)
Music : Ramana Gogula
Lyricist : Kulasekhar
Singers : Tippu, Shreya Ghoshal
చిత్రం: లక్ష్మీ (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: కులశేఖర్ గానం: శ్రేయ ఘోషాల్, టిప్పు అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి ఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చి వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి చరణం: 1 మనసంతా నీకోసం వయసంతా నీ సొంతం నీకోసమే నా చిలిపి తనం నీచూపే సింగారం నీసోకే బంగారం నీపైటలో ఉంది పడుచుదనం అందాల నిధి నీ వశం లోలోన పదిలం కౌగిళ్ళ కసి కాపురం వద్దన్నా వదలం వస్తా పద నడిచి చూపిస్తా నినుగెలిచి ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి చరణం: 2 నాకేమో మొహమాటం నీకేమో ఆరాటం తీరేదెలా నీ చిలిపి కల నువ్వేమో ఆకాశం నేనేమో నీకోసం చేరెదెలా నీ సరసకిలా వయ్యారి చెలివాలకం వారెవ్వా మధురం సయ్యాటలకు శోభనం ఈ కన్నె పరువం ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి వస్తాపద నడిచి చూపిస్తా నిన్ను గెలిచి అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి ఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చి వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి

Ne Puttindi Neekosame Song Lyrics in Telugu – Lakshmi (2006)

'Ne Puttindi Neekosame' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Rajesh Krishnan and Ganga.

SONG INFORMATION
Movie : Lakshmi (2006)
Music : Ramana Gogula
Lyricist : Kulasekhar
Singers : Rajesh Krishnan, Ganga
చిత్రం: లక్ష్మీ (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: గంగ, రాజేష్ కృష్ణన్ నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే మీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీకోసం లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా నీకే లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా మరదలు పిల్లా మరదలు పిల్లా మూడే ముళ్ళేస్తా నీకే మరదలు పిల్లా మరదలు పిల్లా ముద్దుల మొగుడవుతా నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే చరణం: 1 కోవెల కెళ్ళామంటే ఆ మొక్కు మరచి నువ్వు కొంటెగా చూశావంటే నేనేం చేసేది సంతకు వెళ్ళామంటే ఆ బేరమొదిలి నువ్వు మంతర మేసావంటే నేనేం చెప్పేది చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అబ్బ తేరిపార చూస్తే సిగ్గెట్టా ఆగేది కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు ఊరిస్తుంటే కడుపెట్టా నిండేది ఈ తిప్పలు తప్పాలంటే తప్పెట మోగాలోయ్ బావా లక్ష్మీబావా… మొగుడవుతా నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే చరణం: 2 వెన్నెల్లో నేనుంటే నావెన్ను మీద వాలి ఎన్నో ఇమ్మంటుంటే నేనేమిచ్చేది చీకట్లో నేనుంటే నా చుట్టు నువ్వేచేరి చొక్కా లాగేస్తుంటే నేనేం చేసేది స్నానమాడేస్తుంటే నీరల్లే నువ్వొచ్చి ఈడు పడకేస్తుంటే నే ఇంకేం అయ్యేది ఆవలిస్తు ఉంటే ఆగరత్తయి నువ్వొచ్చి వేడి పొగ లెడుతుంటే నేను ఇంకెటు పోయేది ఈ బాధలు తగ్గాలంటే భాజా మోగాలోయ్ బావా లక్ష్మిబావా… మొగుఢవుతా నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే

Palli Balakrishna Thursday, June 11, 2026



చిత్రం: మాయగాడు (2011)
సంగీతం: చక్రి 
నటీనటులు: వేణు, ఛార్మి 
దర్శకత్వం: దిలీప్ పోలన్ 
నిర్మాత: యలమంచిలి రవి చందర్ 
విడుదల తేది: 16.07.2011



Songs List:



ఏ ఫేసు చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: మాయగాడు (2011)
సంగీతం: చక్రి 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చక్రి

ఏ ఫేసు చూసినా



మార్నింగ్ మార్నింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: మాయగాడు (2011)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొంద 
గానం: కౌసల్య 

మార్నింగ్ మార్నింగ్ 



అందమైన ఆశ ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: మాయగాడు (2011)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొంద 
గానం: చక్రి, మాళవిక 

అందమైన ఆశ ఉంది 




మౌనం ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: మాయగాడు (2011)
సంగీతం: చక్రి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: చక్రి, ప్రణవి 

మౌనం ప్రేమ 



విన్నా విన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మాయగాడు (2011)
సంగీతం: చక్రి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: చక్రి, ప్రణవి 

విన్నా విన్నా 




లవ్ మి లవ్ మి పాట సాహిత్యం

 
చిత్రం: మాయగాడు (2011)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొండ 
గానం: రవివర్మ, గీతా మాధురి 

లవ్ మి లవ్ మి 

Palli Balakrishna Sunday, August 7, 2022



చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
నటీనటులు: పూరి ఆకాష్, కేతిక శర్మ, రమ్య కృష్ణ, రామ్ పోతినేని (Cameo appearance in the song) 
దర్శకత్వం: అనీల్ పాడూరి
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
విడుదల తేది: 29.10.2021



Songs List:



మేరా నామ్ వాస్కోడిగామా పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: పూరి జగన్నాధ్ 
గానం: పూరి ఆకాష్

మేరా నామ్ వాస్కోడిగామా
వాస్కోడిగామా అల్బెర్తో

లోగ్ ముజే బచ్చా బోల్తా హై
లేకిన్ ఏక్ దిన్ ఏ బచ్చా
సబ్ కా బాప్ బనేగా

పడుకుంటే మనకు కల రావాలి
ఆ కల మనల్ని భయపెట్టాలి
ఆ కల కోసం చావాలి
యహీ మేరా మక్సద్ హై

కర్లో యా మర్లో కర్లో యా మర్లో
కర్లో కర్లో యా మర్లో కర్లో యా మర్లో

మేరా నామ్ - వాస్కో
మేరా నామ్ - వాస్కో
వాస్కోడిగామా - వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో

ఈ ప్రపంచమే ఒక అడవి, అన్నీ జంతువులే
మై బీ ఏక్ జాన్వర్ హూ
నో రూల్స్ ఇన్ జంగల్

అడవిలో నక్కలెక్కువగా ఉన్నాయి
అదొక్కటే నచ్చట్లా
చంపేస్తార్రే సాలే

వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
ముంబై ముంబై ముంబై
కాట్ కాట్ కాట్ కాట్
కాట్ ధూంగా సాలే

కలబడి ఎగబడి నిలబడి
కనబడి చూడు నాతో
నీకు ధమ్మే ఉంటే దన్నే ఉంటే గూట్లే

నేనప్పుడు ఇప్పుడు ఎన్నడూ చెప్పేదొకటే
అది ఒకటే మాట ఒకటే బాట
కర్లో యా మర్లో మార్, 
మావ యే సారె దునియా పేట్
ఔర్ పేట్ కె నీచే కేలియే
రోటి కప్డా మఖాన్ అండ్ సెక్స్ 
కర్లో యా మర్లో

సంపుత బిడ్డా సెంటర్లో చీరేస్తా
లే, పరిగెట్టు పుట్టింది పడుకోడానికి కాదు బే
పోయాక పాడుకోరా, ఎవడడిగాడు నిన్ను
ఎవడడిగాడు నిన్ను

ఎవరెస్ట్ ఉన్నదే ఎక్కేయడానికి
హ్హహ్హహ్హా, ఎక్కేయ్
ఎక్కే ఎక్కే క్కే క్కే క్కే
ఎక్కేయ్ ఎవడడిగాడు నిన్ను
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో

లైఫ్ ఈజ్ లైక్ సిక్స్టీ నైన్
వాట్ యూ గివ్ ఈజ్ వాట్ యూ గెట్

మేరా నామ్ మేరా నామ్
మేరా నామ్ వాస్కోడిగామా
బజావూంగా సారీ కామా



నా వల్లకాదే… పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సునీల్ కశ్యప్

నా వల్ల నా వల్ల, హో ఓ
నా వల్ల నా వల్ల, ఓ ఓ

నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే… గుండె ఆగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే  బతకలేనులే

నిన్నే నా మనసుతో ఎపుడైతే చూసానో
అపుడే నా మనసుతో ముడి వేసుకున్నానే
కళ్లనుంచి నీరులాగ నువ్వు జారగా
కాళ్లకింద భూమి జారినట్టు ఉందిగా

నా వల్లకాదే  నా వల్లకాదే
నా వల్లకాదే  నా వల్లకాదే

నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా
నీకై ఆశగా చూస్తుండదా

నీకేలాగ ఉందో గాని ఈ క్షణం
చిమ్మచీకటైంది నాకు నా జీవితం
నే ఒంటరవ్వడం మంటల్లో దూకడం
ఒకలాంటిదే కదా… ఆఆ ఆ ఆ

నా వల్లకాదే
నువ్వు దూరమవ్వకే  ఊపిరాగిపోద్ది
నా వల్లకాదే
నువ్వు దూరమవ్వకే  గుండె ఆగిపోద్ది
నా వల్లకాదే
నువ్వు లేకపోతే  బతకలెనులే

నువ్వే నేననేంత  స్వార్థం కదా
నువ్వే గుర్తుకొస్తే  యుద్ధం కదా

వంద యేళ్ల పచ్చబొట్టు నీ జ్ఞాపకం
వచ్చి చూడెలాగ ఉందో నా వాలకం
నీ ధ్యాసనాపడం నా స్వాసనాపడం
రెండొక్కటే కదా… ఆ ఓ ఓ

నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే  ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే  గుండె ఆగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే  బతకలెనులే




పీనే కె బాద్… పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: పూరి జగన్నాధ్ , భాస్కరభట్ల
గానం: సునీల్ కశ్యప్

హ్యాపీ హ్యాపీ మావ దిల్ కుష్ ఐతదే
పీనే కె బాద్… పీనే కె బాద్

రావే అంటె రాదా స్వర సంగీతమే
పీనే కె బాద్… పీనే కె బాద్

ఏ ఏ, ఇష్క్ లోన ఉండు
ముష్కిల్ లోన ఉండు
ఏ రిస్కులోన ఉండు
మందే మంచి ఫ్రెండు

బాల్ కే బారాబర్ ఏ దునియా
పీనే కె బాద్
హెవెన్ కమ్స్ డౌను ఇన్ స్లో మోషను
పీనే కె బాద్  పీనే కె బాద్

ఎవడైతే నాకేంటట లక్డి కా పూల్, పూల్ పూల్
పెట్టేది నాకెవడంట చెవిలోన పూల్
ఒర్లుతామో, దొర్లుతామో ఓ ఓ
పీనే కె బాద్  పీనే కె బాద్

అర్ష్ హే, పీనే వాలోంక ఆజ్ కల్ పోలీస్ సె ప్రాబ్లెమ్
గల్లీ గల్లీ మే గుస్ గుస్ కె పకడ్ రహే, హే హే

డ్రంక్ అండ్ డ్రైవ్  కౌన్సిలింగు
పీనే కె బాద్  పీనే కె బాద్
గెలికేది నన్నెవడంటా  కిర్ కెట్ కి బాల్
పీకేది నన్నెవడంటా  పూరా నికాల్

దబిడి దిబిడో ఓ ఓ
ఎవడికెవడో ఓ  ఓ
పీనే కె బాద్  పీనే కె బాద్

కాక్ టైలో క్రొకోడైలో
పీనే కె బాద్  పీనే కె బాద్

ఓడినా తాగుతం గెల్చినా తాగుతం
నవ్వినా తాగుతం ఏడ్చినా తాగుతం
గట గట గట గట తాగుతాం ఆ ఆ, తాగుతామే
పీనే కె బాద్ పీనే కె బాద్

ఫోకు డ్యాన్సో  స్నేకు డ్యాన్సో ఓఓ
పీనే కె బాద్  పీనే కె బాద్
పీనే కె బాద్  పీనే కె బాద్




ఈఫ్ యు అర్ మాడ్ ఐయామ్ యువర్ డాడ్ పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం:  భాస్కరభట్ల
గానం: అశ్విన్ , యాజిన్ నిజార్ 

ఎం మాయో చేసావో
ఏదేదో అయిపోయా
చూస్తూనే చూస్తూనే
మైకంలో వేరే పడి పోయా

కను రెప్పలా చప్పుడు వింటే
ఎద చప్పుడు ఆగింది
అల్లాడి పోతుందే ప్రాణం

ఎం మాయో చేసావో
ఏదేదో అయిపోయా

ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్
ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్

పెదవుల్లో తియ్యదనం
ముద్దులలో పొందగలం
కోరికలో ఉన్న బలం
కౌగిలిలోనే చూడగలం

ఒకరోజు ఆపగలం
రెండ్రోజులు ఆపగలం
వయసడిగితే వెచ్చదనం
ఎవరైనా ఎం చేయగలం

ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్
హో.. ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్

ఈ పరువం పూలరథం
నువ్వే నా ఊతపదం
నువ్వెవరం నేనెవరం
ఒకరికి ఒకరం హస్తగతం

తహ తహలా నిప్పుకణం
వదలదులే ఒక్క క్షణం
మండించుట గాలి గుణం
తనకసలుండదు జాలి గుణం

ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్
ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్




నువ్వు నేను ఈ క్షణం పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం:  భాస్కరభట్ల, పూరి జగన్నాధ్ 
గానం: చిన్మయి శ్రీపాద

దేశాన్ని ప్రేమించటం వేరు
ఆడదాన్ని ప్రేమించడం వేరు
ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చుండదు
ఐ లవ్ యు సరదా తీరిపోద్ది

రేయి పగలు ఎదురు చూశా
ఈ క్షణం కోసం
కోటి దండాలు పెట్టుకున్నా
ఈ గడియ కోసం

దిండులో మొహం దాచుకుంటే 
నా ఊపిరి నాకే 
నీ ఊపిరిలా తగులుతుంది
ఆ చలిలో వెచ్చటి దుప్పట్లో
నా కుడి చేయి ఎడమ చేయిని తాకితే
అది నీదే అనుకుంటున్నా

ఎదురు చూశాను మిత్రమా
పరితపించిపోయా

ఈ మాటలు నావి
ఈ కోరిక నాది
నువ్వు చెప్పినట్టే

ఏం నాకుండదా ఆ కోరిక
నీకు నా మీద ఎలా ఉందో
నాకు నీ మీద అలాగే ఉంది
ఇది ప్రేమో మోహమో
మరొకటో మరొకటో ఏ పేరైతేనేం
ఈ క్షణం నీతో ఉన్నా అది చాలు

మళ్ళీ మళ్ళీ కావాలిలాంటి క్షణాలు

మరో క్షణం గురించి ఆలోచిస్తూ 
ఈ క్షణాన్ని వృధా చేయను
మళ్ళీ మళ్ళీ కలుస్తామో
మళ్ళీ ఇలా బ్రతుకుతామో ఎవరికి తెలుసు
కలిసిన ప్రతీ సారి ఇదే మోహం
ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి ?
ఈ క్షణం ఈ మోహం
నువ్వు నేనూ ఈ సముద్రం

నా గుండెల్లో ప్రతీ మాట చెబుతున్నావ్
నా గుండె చప్పుడు వింటున్నావా

అమ్మాయిలకి అన్నీ వినబడతాయి
కానీ చెప్పరు నువ్వేంటో నాకు తెలుసు
నేనేంటో తెలుసుకో

ఎలా తెలుసుకోవాలి

దగ్గరకు తీసుకో ఆ ఆకాశం భూమిని ఎలా కౌగిలించుకుందో
అలా కౌగలించుకో హగ్ మీ
టేక్ మీ బ్రీత్ రెస్ట్ లిజన్ టు మై హార్ట్ బీట్

నువ్వంటే నాకిష్టం
అది నువ్వు చెప్పనవసరం లేదు
నీ ముద్దులో నాకు తెలుస్తుంది
నువ్వంటే నాకు పిచ్చి
ఆ విషయం నీ పంటి గాటు చెబుతుంది

ఏహ్.. కాసేపు మాట్లాడకు
నో లెట్ మి టాక్
అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేది
వాళ్ళ కౌగిట్లో చేరడానికి
అమ్మాయిలు అబ్బాయిల కౌగిట్లో దూరేది
వాళ్ళతో మాట్లాడడానికి నన్ను మాట్లాడనీయ్
మాట్లాడి మాట్లాడి ఆగిపోతే
ఆ తరువాత మనిద్దరి మధ్య నిశ్శబ్ధం
అదే నిజమైన స్నేహం

నువ్వింత వాగుతావని నాకు తెలియదు
నాక్కూడా తెలియదు నిన్ను చూడగానే 
రొమాన్స్ మొత్తం బయటకు వచ్చింది
రొమాంటిక్ పీపుల్ కరువైపోయారీలోకంలో
దొరక్క దొరక్క దొరికావ్ నేనెందుకొదులుతా
లెట్ సీ దిస్ వరల్డ్ రొమాంటిక్లీ
లెట్స్ డై ఇన్ రొమాన్స్
అణువణువు కరగని
నా ప్రతీ న్యూట్రాన్ నలగని



వాట్ డూ యు వాంట్ పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం:  భాస్కరభట్ల
గానం: మంగ్లీ, కృష్ణ 

ఇన్ లౌడొంకో క్లారిటీ నహి హే
హమ్ లడికియోంకో క్యా చాహియే
మాలూం నహి హే

హే బాబు వాట్ డూ యు వాంట్
హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్
రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్
కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

హే నాకు తెలుసు అందంగుంట
అయితే మాత్రం నీకేంటంట
తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

నీ చూపులే నా వీపునే
ఆలా టచ్ చేస్తూ గుచ్చేస్తున్నాయే
నీ ఊపిరే నా గుండెల్లో
దడై పెంచేస్తూ తగ్గిస్తున్నదే

ఏంటసలు మ్యాటరు ఓయ్ ఓయ్ ఓయ్
దాటుతాంది మీటరు ఓయ్ ఓయ్ ఓయ్
ఏంటసలు మ్యాటరు దాటుతాంది మీటరు

ఎం ఎరగనట్టు తెలియనట్టు
మండిస్తావే హీటరు

కళ్ళు కళ్ళు కలిసుపేస్తున్నావ్
చూపుల్తోటె నొల్లేస్కున్నావ్
కిదర్ సె తు అయారే లావుండా
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

లాక్కోలేక పీక్కోలేక
తెగ చస్తుందే నా ప్రాణం నిన్ను చూసి
ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా
ఆలా మింగేలా చూస్తావే రాకాసి

చాలు చాలు తగ్గారో ఓయ్ ఓయ్ ఓయ్
దింపమాకు ముగ్గులో ఓయ్ ఓయ్ ఓయ్
చాలు చాలు తగ్గారో దింపమాకు ముగ్గులో
ఎం తెలవనట్టు తోసినవే
అందం అనే అగ్గిలో

ఎక్కడో ఎక్కడో చెయ్యేస్తున్నావ్
ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నావ్
రాతిరిదింకా దిగలేదేంట్రా పాగల్
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్
రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్
కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

హే నాకు తెలుసు అందంగుంట
అయితే మాత్రం నీకేంటంట
తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్




డార్లింగ్ డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం:  భాస్కరభట్ల
గానం: మేఘన శ్రీ సాయి 

డార్లింగ్ డార్లింగ్ 




పీనే కె బాద్… (Kickass Version) పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: పూరి జగన్నాధ్ , భాస్కరభట్ల
గానం: సునీల్ కశ్యప్

పీనే కె బాద్… పీనే కె బాద్
ఓ హ్యాపీ హ్యాపీ మావ… దిల్ కుష్ ఐతదే
పీనే కె బాద్… పీనే కె బాద్
ఓ రావే అంటె రాదా… స్వర సంగీతమే
పీనే కె బాద్… పీనే కె బాద్

ఏ ఏ, ఇష్క్ లోన ఉండు
ముష్కిల్ లోన ఉండు
ఏ రిస్కులోన ఉండు
మందే మంచి ఫ్రెండు

బాల్ కే బారాబర్ ఏ దునియా....
పీనే కె బాద్
హెవెన్ కమ్స్ డౌను… ఇన్ స్లో మోషను
పీనే కె బాద్… పీనే కె బాద్

ఎవడైతే నాకేంటట లక్డి కా పూల్, పూల్ పూల్
పెట్టేది నాకెవడంట చెవిలోన పూల్
ఒర్లుతామో, దొర్లుతామో ఓ ఓ
పీనే కె బాద్… పీనే కె బాద్

అర్ష్ హే, పీనే వాలోంక ఆజ్ కల్ పోలీస్ సె ప్రాబ్లెమ్
గల్లీ గల్లీ మే గుస్ గుస్ కె పకడ్ రహే, హే హే

డ్రంక్ అండ్ డ్రైవ్… కౌన్సిలింగో లింగో లింగో
పీనే కె బాద్… పీనే కె బాద్
గెలికేది నన్నెవడంటా… కిర్ కెట్ కి బాల్
పీకేది నన్నెవడంటా… పూరా నికాల్

దబిడి దిబిడో...ఎవడికెవడో...
పీనే కె బాద్… పీనే కె బాద్

కాక్ టైలో క్రొకోడైలో
పీనే కె బాద్… పీనే కె బాద్

ఓడినా తాగుతం… గెల్చినా తాగుతం
నవ్వినా తాగుతం… ఏడ్చినా తాగుతం
గట గట గట గట తాగుతాం... తాగుతామే
పీనే కె బాద్… పీనే కె బాద్

ఫోకు డ్యాన్సో… స్నేకు డ్యాన్సో ఓఓ
పీనే కె బాద్… పీనే కె బాద్
పీనే కె బాద్… పీనే కె బాద్



Palli Balakrishna Sunday, October 24, 2021



చిత్రం: దొంగల ముఠా (2011)
సంగీతం: సత్యం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అమర్ మొహిలే 
నటీనటులు: రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మి, సునీల్, బ్రహ్మాజీ, ప్రకాశ్ రాజ్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: కోనేరు కిరణ్ కుమార్
విడుదల తేది: 18.03.2011

Palli Balakrishna Tuesday, February 23, 2021



చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
నటీనటులు: శ్రీకాంత్, ఛార్మి, కృష్ణ ఘట్టమనేని
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: యన్. సుధాకర్
విడుదల తేది: 04.01.2013



Songs List:



అబ్బాయి ఆంధ్రా మిర్చి పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: రంజిత్, శ్రావ్య

అబ్బాయి ఆంధ్రా మిర్చి 



ఆ దేవుడు పుట్టించాడు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: తైదల బాపు
గానం: హరీష్ రాఘవేంద్ర, చిన్మయి శ్రీపాద

ఆ దేవుడు పుట్టించాడు 



గుడ్డు గుడ్డు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: యస్.పి.బాలు 

గుడ్డు గుడ్డు




మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: గురుచరణ్
గానం: కార్తీక్, అనురాధ శ్రీరామ్

మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో



అడుగడుగో సేవకుడు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: ఈశ్వర్ తేజ, విష్ణుశర్మ
గానం: మనో

అడుగడుగో సేవకుడు 

Palli Balakrishna Wednesday, March 13, 2019


చిత్రం: పొలిటికల్ రౌడీ (2005)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: మోహన్ బాబు, ఛార్మి కౌర్, అబ్బాస్,  మంచు విష్ణు, మంచు మనోజ్
దర్శకత్వం: ఆది
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 29.09.2005

Palli Balakrishna Tuesday, February 19, 2019


చిత్రం: సుందరకాండ (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం:
గానం: సాధన సర్గమ్
నటీనటులు: అల్లరి నరేష్ , ఛార్మి
దర్శకత్వం: బాపు
నిర్మాత: ముళ్ళపూడి వెంకటరమణ
విడుదల తేది: 08.02.2008

ఏలొ ఎలొ ఉయ్యల
ఎదిగ వయసుల ఉయ్యల
ఎగిరె పైటలొ వుయ్యల (2)
ఎదొ యెదొ అయ్యెల

అనగంగ అనగనగ ఉయ్యల
అడవి పక్కన పల్లె ఉయ్యల
ఆ పల్లె జబిల్లి బంగారు నా తల్లి
అందాల సిరిమల్లి ఉయ్యల
అ కొనకొకనాడు కొతరు దొరబాబు
వచ్చి మల్లిని చూసె ఉయ్యల
మనసు పడె మనువాడె ఉయ్యల
ముద్దు ముచ్చట తెలిపినదె ఉయ్యల
మళ్ళి అక్కడ విడిసినాడె ఉయ్యల
మళ్ళి తిరిగి రాలెదమ్మ ఉయ్యల


రాముని పాదపు సీతమ్మ
అ సీతమ్మె మాయమ్మ (2)
తన గుండె గుండి చెసె ఉయ్యల
ఆ గుడిలొన దెవుడ ఉయ్యల
ఒక్కడె ఉన్నడు ఉయ్యల
ఒక్కడె ఉంటాడు ఉయ్యల

Palli Balakrishna Wednesday, December 13, 2017



చిత్రం: మైఖేల్ మధన కామరాజు (2008)
సంగీతం: చక్రి
గానం: సునిధి చౌహన్ , రంజిత్
నటీనటులు: శ్రీకాంత్ , ప్రభుదేవా, ఛార్మి
దర్శకత్వం: నిధి ప్రసాద్
నిర్మాత: రాజు ప్రవీణ్
విడుదల తేది: 18.04.2008



Songs List:



కమాన్ బేబి పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ మధన కామరాజు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికోండ 
గానం: చక్రి

కమాన్ బేబి 



జుమ్ జమ్ జుమ్మని ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ మధన కామరాజు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికోండ 
గానం: స్వరాజ్ - జగన్, సాధనా సర్గమ్ 

జుమ్ జమ్ జుమ్మని ప్రేమ 



నా రాశి కన్యారాశి పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ మధన కామరాజు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: సునిధి చౌహన్, రంజిత్

పల్లవి: 
నా రాశి కన్యారాశి
నిన్ను చూసి వచ్చా ముచ్చటేసి
కావాలి మిథునం రాశి నీలాంటి రసికుని దోస్తీ
ఆ మంచి శకునము చూసి సుఖపెడతా దరువును వేసి
వస్తా ప్యారి చేస్తా చోరి హద్దేమీరి కుడతా నారి కన్నెలేడి
గుండె జారి నిన్నే కోరి చెయ్యంటుంది నీతోచేరి రసకేళి

నా రాశి కన్యారాశి
నిన్ను చూసి వచ్చా ముచ్చటేసి

చరణం: 1
నా ఒంటిలోన అగ్గివుంది 
నీ రూపు చూసి భగ్గుమంది
చెయ్యి వేస్తే హీట్ తగ్గుతుంది
నా లేత ప్రాయం త్వరపెడుతుంది
రసిక రాజుల మారి అరె మధన యాగమే చేసి
మరి ముద్దు ముచ్చటే తీర్చేస్తాను రావే
దూకుడెక్కేవే గానీ నా సోకు చిత్తడై పోనీ
చిరు చెమట ఒంటికే పట్టించే మధనా
కానిస్తా మదిలో రోజా సరసంగా మన్మధ పూజా
పడివన్నెలు ఉన్నవి నీకే తాజాగా

నా రాశి కన్యారాశి

చరణం: 2
నా ఈడు గోలపెడుతుంది
నీ పైనే జారి పడుతుంది
నాలోనె తేనె పుడుతుంది
తుమ్మెద నువ్వై రమ్మంటుంది
నీ వయసు తాపమే చూసి
నా తనువు విల్లులా వంచి
మగసిరితో రంకెలువేసి రెచ్చిపోతా
పెదవి ముద్దరే వేసి తొలిరేయి నిద్దరే కాసి
ఎండ సోకని సోకులు దాటి రా
టచ్చేస్తా ఎందుకు భాద తనువుల్నే కలిపే రాధ
గుబులెందుకు ఇంకా రాత్రిక మనదేగా

నా రాశి కన్యారాశి
నిన్ను చూసి వచ్చా ముచ్చటేసి





కనుల లోగిలి లోన పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ మధన కామరాజు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ 
గానం: కౌశల్య 

కనుల లోగిలి లోన 



చిటారు కొమ్మన పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ మధన కామరాజు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: రవివర్మ, సింహా, మాళవిక 

చిటారు కొమ్మన 



పంపర పనాసో పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ మధన కామరాజు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: ఉదిత్ నారాయణ్ ఆదర్షిని 

పంపర పనాసో 

Palli Balakrishna Tuesday, November 28, 2017


చిత్రం: చిన్నోడు (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: కందికొండ
గానం: తాన్య , టిప్పు
నటీనటులు: సుమంత్, ఛార్మి
దర్శకత్వం: కణ్మణి
నిర్మాత: కాట్రగడ్డ లోకేష్ , సి.వి.శ్రీకాంత్
విడుదల తేది: 2000

పల్లవి:
కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వు
నామనసే దోచావే తళుకు తళుకు మంటూ
ఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావే
భేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలే
హే ఊసులాడే చూపు చూపుతో వింతగా
ఉరకలేసే ఊహలే ఇలా
వలపు చేసే మెత్తమెత్తగా తొందర
మనసు వినదే మాటనే ఇలా

చరణం: 1
నీ బుగ్గల్లో ఆ ఎరుపే కవ్విస్తే
మదిని తొంగి చూసే ఏదో మాయ
నీ చూపుల్లో ఆ చురకే తాకేస్తే
వలపు నాలో చేరి నీ తోడయ్యా
So  Give it up,  Give it up, Give it up
నీ చిలిపి వన్నెలే ఇచ్చేసేయ్
Give it up,  Give it up, Give it up
నీ ప్రేమలోన ముంచెయ్
అబ్బాబ్బా నోరార నీకంత దూకుడే వద్దంటా
నా వైపే వచ్చావంటే చిక్కు తప్పదంటా

చరణం: 2
నీ పెదవుల్లో ఆ మధువే అందిస్తే
కలిసి నీడలాగా నీతో వస్తా
నా అడుగుల్లో నీ అడుగే వేసేస్తే
ఎదకు ఆరిపోని వెలుగే ఇస్తా
So  Give it up,  Give it up, Give it up
నీ తేనె నవ్వు చెల్లేస్తావా
Give it up,  Give it up, Give it up
నీ సోకులిచ్చి పోవా
ఐతే ఓకే ఓకే నీ తీపిముద్దు నాకిస్తావా
నా మనసే నిన్నే కోరి వెంట సాగుతాగా

కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వు
నామనసే దోచావే తళుకు తళుకు మంటూ
ఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావే
భేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలే
హే ఊసులాడే చూపు చూపుతో వింతగా
ఉరకలేసే ఊహలే ఇలా
వలపు చేసే మెత్తమెత్తగా తొందర
మనసు వినదే మాటనే ఇలా

Palli Balakrishna Wednesday, November 22, 2017



చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
నటీనటులు: సుమంత్, ఛార్మి , నరేష్ , కౌశల్య
దర్శకత్వం: బి.వి.రమణ
నిర్మాతలు: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 03.09.2004



Songs List:



ఏం మాత్రం వేశావో పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కోటి, సంతోషిని

ఏం మాత్రం వేశావో





గుండెలలో గుడి గంట పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, ఉష

గుండెలలో గుడి గంట




ఏనాడో జరిగిన పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

ఏనాడో జరిగిన





జిగి జిగి జింక పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రవివర్మ, స్మిత

జిగి జిగి జింక




నెమ్మది నెమ్మది నెమ్మదిగా పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత , సందీప్

పల్లవి:
నెమ్మది నెమ్మది నెమ్మదిగా 
నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
రెప్పలే దాటని స్వప్నమా లెమ్మని
చెలిమిలో స్వాగతం పిలువగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా 
నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది

చరణం: 1
పూలగాలి స్వరముల వెంట చేరుకోమంది
నీ నేస్తమే కవి క్షేత్రమై
ఆకశాన్ని చినుకుల వెంట నేల దించింది
నీ స్నేహమే ఆషాడమై
మచ్చ మాటునున్న కన్నెకొమ్మ ఎన్నినాళ్ళకి
లేత పూతపడ్డ కులుకుతున్నది
మంచి మాటలన్ని వానజల్లు ముందునాళ్ళకి
నాకు పచ్చనాశ చూపుతున్నది
ప్రాయమే తోడుగా నడపగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది

చరణం: 2
చూపులోన చుర చురలన్ని దీపమనుకోన
అనుమానమా అనురాగమా
చేతిలోని మధుకళశాన్ని భారమనుకున్నా
మన్నించుమా మమకారమా
తేనె ఉప్పెనల్లే పొంగుతున్న ప్రేమ దొంగని
అందుకుంది చూడు నిండు దోసిలి
నింగి ద్వారమంటి పోల్చుకున్న గుండెసవ్వడి
గొంతు దాటనంది ఎందుకో మరి
మౌనమే గానమై తెలుపదా




ముద్దొస్తోంది పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వేణు, నిత్యసంతోషిని

ముద్దొస్తోంది 

Palli Balakrishna




చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
నటీనటులు: రవి తేజ, శ్రుతి హసన్, 
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: బి.మధు
విడుదల తేది: 09.01.2021



Songs List:



బాలామణి ఎంత పని పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: ఉదిత్ నారాయణ, స్వర్ణలత

పల్లవి:
బాలామణి ఎంత పని చేశావే నువ్వు
ఈత ముల్లు గుచ్చి గుండె పెట్టావే చిల్లు
తాటి చెట్టు కింద తాగుతుంటే ముంత కల్లు
జొన్న చేలో నడిచి వచ్చి కలిపావే కళ్ళు..
సుందర ఇందరి ముందర చేయకు
చిందర వందర
గుట్ట కింద గట్టుకాడ దారి కాచి ఉండు వస్తా
పటా పటా పట్టు పట్టి నిన్ను దోచుకుంటా
నా గుండెలోన గూడు కట్టి
నిన్ను దాచుకుంటా 


చరణం: 1
నడుమే కదిలే గలగల ఆ నదల్లే
ఎదలో వరదలే జలజలమని పొంగించే
ఎంకి పాటనంటూ కమ్మగ పాడుకుంటూ కంకిపూలపైన
పిట్టల ఎగిరిపోనా
కంటి పాపవంటూ కనులో దాచుకుంటూ చంటి పాపనంటూ
మదిపై వాలిపోనా
పొదలో సుధలే చిలికీ వగలే పంచనా
పగలే సెగలే రగిలీ కథనే పెంచనా
అందగాడ సందెకాడ సందు చూసుకోర..
ఆ కంచెకాడ మంచమేసి పూలుజల్లుకోరా..
 
చరణం: 2
ఎగిసే కొలనులో కొరమేనును తెప్పించి
అదిరే పులుపుతో వలపేనే వడ్డిస్తా
అతడు. కురిసే వానలోన చినుకైపోయినట్టు
తనువే తాకినేను చీరై చుట్టుకోనా...
ఆమె. మెరిసే బుగ్గలోని విరిసే సిగ్గులన్నీ పరిచా
ఆకుమీద జోడుగ నంచుకోరా
అతడు. మిధునం మధనం కలిసి జరిపే సంబరం
ఆమె. అధరం అధరం వణికి మరిచే అంబరం
అతడు. కీచుకీచు పిట్టా నీను గంపకింద పెట్టా సందుచూసి
ముద్దు మీద ముద్దు పంచిపెట్టా




గీతం సంగీతం పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: హరిహరన్, ఉష

పల్లవి:
గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో
నిత్యం సాంగత్యం ప్రియ తనువుల మధురిమలో
శతమానం అంటూ ప్రియహారం వేయనా
సహకారం అంటూ మమకారం పంచనా
ప్రణమామి అంటూ ప్రాణమివ్వనా

చరణం: 1
ఓ చెలియా ఇది నిజమా నీ పలుకే పరవశమా
నిజమెరుగనులే సాంతం  నినుగని ఇక నిరంతం
మదిలయలకు వసంతం కలిగే
ఎంత ఎంత దూరం  అందాల ప్రేమ తీరం అంటూ
చెప్పవోయి ప్రాయంనీ ప్రేమ స్థావరం
ఉంది కొంత దూరం దాయాలి అంతవరకూ
మీరు గుండెలోనే భారం అంటుంది పావురం
నిను చూసే మదిరాసే కావ్యము
నిను చేరే ఎద హాయె ఎంత భాగ్యము
గగనాలే నీవై భువనాలే మరువనా
జవరాలే నేనై పరువాలే పంచనా
నీచెంత ఎంత హాయిలే ప్రియా

చరణం: 2
ఈ హృదయం అతి సృజనం నీ శృతిలో ప్రతి నిమిషం
శశి పరువపు అజంతం  పిలిచెనులే అచెంతం
కసి పెదవులే నా సొంతం చేసే
నిన్నలేని భావం నిన్ను చూసి నాకే నాలో
గుండేలోన చేరి గోల చేశినా
నింగినున్న స్వర్గం పంచిన్నావు నేలమీద ఎన్ని
జన్మలైన నిన్ను వీడనే
నీ సాయం నీ ప్రాయం నాకు అవసరం
ఓ నేస్తం నీకోసం నేను అంకితం
నా వలపే నీదై బహుమానం ఇవ్వగా

నా తలపే నీకై పరిహారం కట్టగా
ఈ జన్మకింత చాలులే ప్రియా
గీతం సంగీతం ప్రియ తనువుల మధురిమలో
నిత్యం సాంగత్యం చెలి పెదవుల సరిగమలో
శతమానం అంటూ ప్రియహారం వేయనా
సహకారం అంటూ మమకారం పంచనా
ప్రణమామి అంటూ ప్రాణమివ్వనా



జానేభీదో పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: సునిధీ చౌహాన్

పల్లవి:
జానేభీదో జానేభీదో  మేరేయారో...
ఆనేవాలా కల్ తోహై సాథ్ యారో
కల్ గయా డల్ గయా  ఏక్ అప్నా  బన్ కా థిఖాగయా సపనా
జీవితానికి రోజులుగా నాలుగంటే నాలుగురా
నిన్న నేటికి సాక్ష్యమురా రేపు మనకిక లక్ష్యమురా
లైఫే ఛాలెంజ్ అనుకొని

చరణం: 1
చమబ్బు చాటు ఉరిమే అమెరుపులోని వెలుగే
మురిపించి మాయమైనా కన్నుల్లో నిలిచిపోదా..
ఆకాశంలోనే కదిలే కోటి తారలున్నా...
ఆ రాలే ఉలకలవైపుకు మనసులాగిపోదా...
అలరించే అందాలన్ని క్షణికమైనవే అయినా మనకు
చిరకాలం దాని వెలుగులో నడిచిపోరా నువ్వు....
You will ...gain it ... చలో చలో !!

చరణం: 2
కంటిలోనే నిత్యం ..కదలాడు కొంటె స్పష్నం
సాధించి చూడుసత్యం కాగలదులేరా ముత్యం
ఆ సాగరతీరంలోని ఇసుక గూడులన్నీ
నిలవాలి ఆశల గూటిలో రాతిమేడలౌతూ..
చై జారిందేదో అంటూ భాదపడుట మార్చేసి ట్రెండు
గడిచిందే రేపటి కొలకు స్పూర్తిచేయి ఫ్రెండు
Shoot it...Chase it... చలో చలో

జానే భీదో జానేభదో మేరేయారో .....అనేవాలా కల్లోహై సాథ్ యారో
కల్ గయా....డల్ గయా  ఏక్ అప్నా  బన్ కా థిఖాగయా సపనా
like a diamond in the sky యే హమారా జీవన హై
What you loose is not so high
how to reach it దేఖో భాయి
shoot it...chase it...చలో చలో




అందాలకోన పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: వలీషాబాజ్జీ

పల్లవి:
అందాలకోన కోసంచుల్లో చేన ఆ చేనులోన
ఓ గుండెకూన గళమే విప్పెనుసోనా ఓ రాగమైనా
పలికే ఆ రాగము భావము జగమే మెచ్చినదోయి
యుగమే ఏ రూపుగ మారిన నిజమై నిలిచెను రేయి
మదిలో ఆకాంక్షను పెట్టి కృషినే తోడుగ చేయి
కలిగే ఆ రోజును చూడర రాజువు నీవే భాయి

చరణం: 1
కృషి వుంటే మనిషైనా ఋషులౌదురే అంటూ అన్నాడో కవిబ్రహ్మ నాడు
ఈకాంక్షే కలిగిందో గుండెల్లోనే రోజు నీకంటూ ఎదురేదినేడు
సాధ్యం కాదన్నది ఏదీ భువిలోనే లేదను సత్యము
కూసంత నడుమే కడితే దివినైన తాకుట తథ్యము
నీపైనీ నమ్మకాలే నిన్ను నడిపించు కడవరకు......

చరణం: 2
నాకంటూ ఓ రోజు ఉందంటు ఓ నేస్తం సాగించు నీ జీవ ప్రాయం
నీలోను కొలువున్న కొండంత ఆ ఆశే సాధించి పెట్టేనే గమ్యం
నీ ఓటమి నీ విజయమునకు తొలిమెట్టె నిలువక మానదు
చైజారిన ఆ అనుభవమే గెలిపించి వదలక మానదు
ఏ గ్రహణమేమి నిన్ను వంచదు గుండెల్లో దమ్ముంటే





నీతోడుకావాలి... పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: వలీషా బాబ్లీ, హరిణి

పల్లవి:
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి...... నీతోడు కావాలి....
నిను చూసి నాకు తెలిసెలే...సంతోషం అంటే ఏమిటో 
నీ నవ్వుల చిలిపి వెలుగులో..
నా బ్రతుకును నడపడానికి...

నీతోడు కావాలి

నిను కలిసినాక తెలిసెలే... 
బతుకన్నది తీపి బాటని
నీవుంటే కాలమే తెలియదని 
ఆ విలువే మనసుకు పంచుటకు 

నీతోడు కావాలి

వీచే గాలై నన్ను చేరుకొని నీవు
శ్వాసనిచ్చి ప్రాణమల్లే మారిన చెలియా నాకు

నీతోడు కావాలి

ఒకటీ ఒకటి రెండు కాదు అని నాలో నువ్వు వేరు కాదు అని
నన్నే నీలో కలుపుకొనుటకు ... ఓ నేస్తామా నీకై ఎపుడూ వేయి కళ్ళతో
ఎదురు చూపులో ఉండగలనని మాటే ఇచ్చి చెంత నిలుచుటకు .... నా ప్రాణమా
నీతోడుకావాలి....... నీతోడు కావాలి.... నీతోడుకావాలి....... నీతోడు కావాలి....




కలలో కలనే కన్నాను.. పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: వలీషా బాబ్లీ, హరిణి

పల్లవి:
కలలో కలనే కన్నాను.. ఆ కలలో నిను కనుగొన్నానే
కలను వదిలి కనబడవే కానుకగా
కలలు గన్న నా మనసుకు చేరువగా
కలలు కన్నాననీ కలను మిగిలించకు ఇలకు చేరాలని నా కలను
కరిగించకు కలత పెట్టే కలను వదిలి ఇలకు చేరే చెలి 

చరణం:  1 
చిలిపి పెదవిపైన చిరునవ్వు చిందనిస్తే
చిరుజల్లు కురిపినేను చితి నుండి లేచిరానా
కనుకాటుకల్లే నన్ను కరుణించి రాసుకుంటే
కనుపాప లాగా నీతో కలకాలముండిపోనా
నీ తీయని పలుకే నను కోరుకుంటే
కడ వరకు తోడై నేనుండిపోనా
చిత్రమల్లే మెరిసి పోయి స్వప్నమయ్యేవెలా

చరణం: 2
ఆ దేవుడొచ్చి నన్ను వరమంటూ కోరుమంటే
ఏ జన్మకైనా నేను నీతోడు కోరుకుంటా
మరుజన్మ వరకు నేను నిను వీడి ఉండలేను
మరణించి కూడ నీకై మరురూపు దాల్చినాను
కనిపించే రూపం కదలాడు తుంటే
గుర్తించని మనసే వేటాడుతుంది
కలల తీరం పక్కనుందీ ఎందుకీ కలవరం



పాతికేళ్ళ కిందటి మాట పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: రవివర్మ లెనీనా చౌదరి

పల్లవి:
పాతికేళ్ళ కిందటి మాట రాజమండ్రి రేవుకాడ
నీళ్ళకుండ నెత్తిన పెట్టి కోమలాంగి పోతూవుంటే
సూటు బూటూ వేసుకున్నా కుర్రాడొకడు చూశాడంటరో
కళ్ళూ-కళ్ళూ కలిపేశాడు మనసే ఆమెకు ఇచ్చేశాడు
పెళ్ళికి సిద్ధం అయ్యేరోజు కొరకొర మీసపు ముసలోడొచ్చి 
ఖంఠములో నా ప్రాణము ఉండగ పెళ్ళే జరగనివ్వను అన్నాడూ

ఆ సూటూ బూటు కుర్రాణ్ణి నేనేనయ్యా
కోర మీసాలోడు బాసు భట్టాచార్య 
తాను అచ్చంగా నన్నుగన్న మా నానాన్నయ్యా
ఏజ్ వన్నెట్ సెవెన్ నాటౌటైయ్యా..

ఆఖంఠములో ప్రాణమింక పోయేదెపుడో
నన్ను నువ్వు పెళ్ళాడీ తీరేదెపుడో

పాతికేళ్ళ కిందటి మాట రాజమండ్రి రేవుకాడ
నీళ్ళకుండ నెత్తిన పెట్టి కోమలాంగి పోతూవుంటే
సూటు బూటూ వేసుకున్నా కుర్రాడొకడు చూశాడంటరో

పాతికేళ్ళ కిందటిమాట లూధియాన గల్లీలోన
పగడాబన్ కే ఏక్ ముండా గూటీ బిళ్ళ ఆడుతూ ఉంటే
లచలచత్ ఏక్ కుడియా  మట్కా పట్టి ఎదురుగ
పోయెనురో 
లకడీతోటి బిళ్ళను కోడితే దిల్ కా మటకాపగిలిపోయి
ఇద్దరు ఒకటై పోయినాక లంచ్ లోన కుడియానాతో దాల్ తదాకా రోటీ తింటూ
సడన్ గా స్వర్గానికే పోయెనురో

అప్పటి నుండీ రోటీ మానేశాను 
పంజాబే వదిలేసి వచ్చేశాను
ఆంధ్రాలో గోంగూర చూశాను
అవకాయ నంజుకొనుట షురూ చేశాను

అందుకనే గోంగూర కరువాయోనూ
మామిడికాయ రేటు పెరిగి దురువాయెను

పాతికేళ్ళ కిందటిమాట లూధియాన గల్లీలోన
పగడాబన్ కే ఏక్ ముండా గూటీ బిళ్ళ ఆడుతూ ఉంటే
లచలచత్ ఏక్ కుడియా  మట్కా పట్టి ఎదురుగ
పోయెనురో 

పాతికేళ్ళ కిందటి మాట పాకిస్తాను బార్డర్ లోన
ఏ.కె. 47ఏ పట్టి చెడుగుడు ఆటే ఆడుతు ఉంటే
కాలికి పక్కన బాంబుపేలి 
మెడికల్ గా Unfit అయ్యారో
పట్టిన పట్టే వీడనంటూ ప్రాణం లెక్క చేయనంటూ 
శత్రువు దడదడలాడిపోయి వణుకే తట్టి బెణుకే పుట్టి తోకలు ముడుచుకుపోయే వరకు
నిదురేపోనని శపథం చేశారో

ఎన్ని తరాలైన పోరు ఆపను అంటూ 
చేశాను అల్లుడినే లెఫ్టినెంటూ
మిలటరీకి ఇంతటితో సేవలాపను
వారసుడిగా మనవణ్ణి పంపిస్తాను

దేశం దేశం అంటూ అల్లుడక్కడా
వారసుడేం పుడతాడు నీకు ఇక్కడా? 

పాతికేళ్ళ కిందటి మాట పాకిస్తాను బార్డర్ లోన
ఏ.కె. 47ఏ పట్టి చెడుగుడు ఆటే ఆడుతు ఉంటే
కాలికి పక్కన బాంబుపేలి 
మెడికల్ గా Unfit అయ్యారో

పాతికేళ్ళ కిందటి మాట పాలకొల్లు మండలాన
రావిచెట్టు సందులోన అరుగుల వారి ఇంటిలోన
బొరుగులు తినే గుమ్మను చూసి
చిలిపే కృష్ణుడు చిటికెలు వేసెనురో

ఆ చిటికెలు వేసిన పాండుగారు
వరుసకు మా తాతగారు  
ప్రేమనగరూ ఏ.ఎన్.ఆర్.
ఎవ్వర్ గ్రీను ఎన్.టి.ఆర్
మీసం పండిన హీరోగారు
వీరికి ఎవరూ సాటి లేరండోయ్

ఈస్ట్మన్ కలర్ నాటి మా స్టోరీలు
చెప్పేందుకు మీ చెంతన ఎన్నో ఉన్నై
చేతనైతే మీరూ చేసి చూపండి
లవ్ చేసి గిన్నిస్ బుక్ లో ఎక్కండి

మీ స్టోరీ చదివినాక బొంబాయోళ్ళు
దిల్ వాలే దుల్హానియా మరచిపోవాలి 
మునిగి పోయినా టైటానిక్కే మళ్ళీ
మీ లవ్ చూసి తేలుకుంటూ గంతులేయాలి

మునిగి పోయినా టైటానిక్కే మళ్ళీ
మీ లవ్ చూసి తేలుకుంటూ గంతులేయాలి



శ్వాసల్లో శ్వాసల్లే పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: వలీషా బాబ్జి

శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే
నీడల్లో తోడల్లే నా గుండె జోరల్లే
ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటు నీవు వస్తుంటే
సాగరాన ఎగసే అలవై దోబూచులాడేవో
కడలికి కన్నీటిని తరలించీ
దప్పిక నా మనసుకు మిగిలించి

ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే
ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే

వాలిపోయిన పొద్దులు ఓ దీపమల్లే వెలిగి
రాలిపోయిన ఆశలన్ని రేపిపోయినావే
మోయలేని ఓ పూలకొమ్మకు జీవమంటు పోసి
ప్రాణమిచ్చిన ఆ చిట్టి రెమ్మకు ధ్యానమయ్యినావే
బ్రతుకే పచ్చతోరణములా ప్రేమ సాగరములా
మర్చివేసి నను విడిచిపోయినావే
నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని
నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని
అనుకుంటే ఓ ప్రియ నను విడిచి పోయావే

నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే
ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే


రాతికైన నేర్పించుకుంటే మాట పలుకుతుందే
కాటి నైన బ్రతిమాలుకుంటే మంటలార్పుతుండే
ఏ నాటికైన సరిదిద్దుకుంటే రాత మారుతుందే
ప్రేమలోన పడిపోయినాకే మనసు మారుతుందే
మనసే చంపుకోని నేను మరచిపోయి నిన్ను
అడుగు తీసి అడుగేసి కదులుతుంటే
దూరమని నేను వెళ్తువుంటే దగ్గరగ మనసు లాగుతుంటే
దూరమని నేను వెళ్తువుంటే దగ్గరగ మనసు లాగుతుంటే

ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే
ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే

ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటు నీవు వస్తుంటే
సాగరాన ఎగసే అలవై దోబూచులాడేవో
కడలికి కన్నీటిని తరలించీ
దప్పిక నా మనసుకు మిగిలించి

ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే
ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే




నీతోడుకావాలి.... నీతోడు కావాలి.... పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: సునీత

నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....

నిను చూసి నాకు తెలిసెలే...
సంతోషం అంటే ఏమిటో 
నీ నవ్వుల చిలిపి వెలుగులో...
నా బ్రతుకును నడపడానికి...

నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....

నిను కలిసి నాకు తెలిసెలే... 
బతుకన్నది తీపి బాటని
నీవుంటే కాలమే తెలియదని 
ఆ విలువే మనసుకు పంచుటకు 

నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....

వీచే గాలై నన్ను చేరుకొని నీవు
శ్వాసనిచ్చి ప్రాణమల్లే మారిన ప్రియుడా నాకు

నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....

ఒకటి ఒకటి రెండు కాదు అని 
నాలో నువ్వు వేరు కాదు అని
నన్నే నీలో కలుపుకొనుటకు.... ఓ నేస్తామా 
నీకై ఎపుడూ వేయి కళ్ళతో
ఎదురు చూపులో ఉండగలనని మాటే ఇచ్చి చెంత నిలుచుటకు..... నా ప్రాణమా

నీతోడుకావాలి...... నీతోడు కావాలి..... నీతోడుకావాలి...... నీతోడు కావాలి....

Palli Balakrishna Sunday, October 22, 2017



చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , కత్రినాకైఫ్, ఛార్మి
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: యమ్.ఆర్.వి.ప్రసాద్
విడుదల తేది: 05.10.2005



Songs List:



డిక్కీ డిక్కీ డీడిక్కీ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్ , చిత్ర

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి
డిక్కీ డిక్కీ డీడిక్కీ పరువాల పండక్కి
వచ్చానయ్యో చెక్కిలి ఎరుపెక్కి
వయ్యారాలే చప్పున బరువెక్కి
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
కొల్లగొట్టేసి పోనా తెల్లారేకల్లా
రారాదు బువ్వేలేరా శృంగార కోటకి

అష్టాచెమ్మాలే  చెమ్మచెక్కాలే
జరగాలి జామురేయి జాగారాలే
గుడు గుడు గుంచాలే చడుగుడు మంచాలే
ఈదాలి సంబరాల సాగరాలే

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి

చెరువుల్లో చేపలకై వెతికేస్తుంది కొంగ
చీకట్లో చీరంతా తడిమేస్తావ దొంగ (2)
సరసాల సమరంలో సరదాల సమయంలో 
తెరచాటు ఉంటే వేగేదెలా
అడిగింది ఏమైనా వీల్లేదు అన్నానా
బాహాటమైతే బాగోదుగా
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
అల్లాడించేసి పోనా తెల్లారేకల్లా
అయితే మరి వెళ్ళొద్దామ అనువైన చోటుకి

అల్లోనేరేల్లో అమ్మో నీకళ్లు
అచ్చంగా ఉన్నావమ్మో బొమ్మలాగ
పుల్ల మావిల్లో అపుడే వేవిల్లో
విడ్డురం చూడాలమ్మో అమ్మలాలో

తెలియంది తెలియాలంటే చదవాలయ్యో బుక్స్
చూసింది కావాలంటే కలపాలయ్యో లిప్స్ (2)
నీమాటలు ముదిరాయే అధరాలే అదిరాయే
అరుదైన దాహం తీరేదెలా
తాపాలే పెరిగాక తమకంతో రగిలాక
పడకింటి తీరం చేరాలిగా
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
గిల్లి గిచ్చేసి పోనా తెల్లారేకల్లా
దుప్పట్లో దూరేద్దామ బాబు సయ్యాటకి

బంగరు బుల్లోడే బంపరుగున్నాడే
మాటల్తో మాయచేసి లాగుతాడే
తుంటరి పిల్లోడే తొందరగున్నాడే
ఎన్నెన్నో తందనాలు ఆడుతాడే

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి





మల్లెల్లోన ఇల్లెయ్రా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్, సుజాత 

మల్లెల్లోన ఇల్లెయ్రా  ఇల్లెక్కేసి ఈలేయ్ రా



చినుకులాగా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ 
గానం: రంజిత్, సుచిత్ర 

చినుకులాగా 




మా సుబ్బలచ్చమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సునీత 

మా సుబ్బలచ్చమ్మ 



ఒంగోలు గిత్తరో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, మహలక్ష్మి అయ్యర్ 

ఒంగోలు గిత్తరో 




నేడే ఈ నాడే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: మల్లికార్జున్ , శ్రీవర్ధిని

(ఈ పాటను యన్.టి.రామారావు నటించిన భలే తమ్ముడు (1969) సినిమాలో నుండి  రీమిక్స్ చేశారు)

నేడే ఈ నాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..

వాలుకన్నుల వన్నెలాడివి వగలే చాలు నిరజాణ
దోర ఆశల దొంగ చూపుల చొరవే నీవు అనుకోన
వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా
ప్రేమంటే శృంగరమా రమ్మంటే చిరు కోపమా
మహా పెంకి మగువలు మీరు 
మనసైతె మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు

నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..

ఆరుబైటిలా కన్ను గీటడం ఔరా మీకు మర్యాదా
కంటి సైగకే పైట జారడం ఐనా తమకు బాగుందా
పైపైకి పరిహాసమా బెట్టంత చెలి కోసమా
పెదవుల్లో దరహసమా అదికూడ ఓ వేషమా
మహారాజు భోగులు మీరు మరి నాకు లొంగకపోరు
పరువాల మేనకగారు నను ఇంక విడిపోలేరు

నేడే ఈ నాడే కలిపింది కన్ను చెలి తానే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
అహ హా... ఆ ఆ ఆ 
అహ హా... ఆ ఆ ఆ 


Palli Balakrishna Sunday, October 15, 2017



చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
నటీనటులు: రవితేజ, ఛార్మి, డైసీ బోపన్న
దర్శకత్వం: శోభన్
నిర్మాత: కృష్ణ కుమార్
విడుదల తేది: 12.11.2004



Songs List:



కోనంగి కోనంగి పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: శ్రీ కొమ్మినేని , కల్పన 

కోనంగి  కోనంగి 




వంట్లో నెత్తురు పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కార్తిక్ , అనురాధ శ్రీరామ్

వంట్లో నెత్తురు 




చెమ్మచెక్క పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కార్తిక్ , కల్పన, గ్రేస్ కరునాస్ 

చెమ్మచెక్క





రుక్కు రుక్కు పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: వేటూరి 
గానం: టిప్పు, మహతి 

రుక్కు రుక్కు 



గుప్పిడి గుప్పిడి పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తిక్ , కల్పన 

గుప్పిడి గుప్పిడి 



హ మస్తాని మస్తాని పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: సాహితి
గానం: కార్తిక్ , అనురాధ శ్రీరామ్

హ మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ
మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ
మనసే దోచుకున్న లైలా నీవె మైనా
నన్నే వద్దు అన్నా  నిన్నే వదులుతానా

చక్కని చుక్కల జాబిలి నొక్కుల చెక్కిలి నీవేనా
చిక్కని చక్కెర పెదవుల హక్కులు నీకే రాసైనా

హ మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ
అరె మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ

చరణం: 1
కైపెక్కే నిమిషానా నిన్నే తలచి వగ్గేయ్నా
పై పై తగవే పడుతున్నా నీ పై ఒలపే లో లోనా
ఎదలో ఒలపున్నా అది బయటకు తెలుపదు మరుపేంటమ్మా
నిజమే చెబుతున్నా నువ్ చీ పో అన్న పులుపేనమ్మా
అందలే చిందేవేల అధరాలే కందేవేల హో ఓ ఓ హొయ్
అల్లరి నోటికి తాళం వెయ్నా ముద్దులు పెట్టేయ్నా
ఓయ్ హత్తేరి నిన్నే ఎత్తుకుపోనా కొంగున కట్టేయ్నా

మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ
ఓ హో హో మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ

చరణం: 2
హోయ్ అందరిలో ఎంతైనా ఇట్టా పడకే పై పైనా
అంతా నీది నటనేనా అంతగ అలుసైపోయానా
లలనా ప్రియ వదనా నీ జిలిబిలి అలకలు చాలునులేమ్మా
ఇదిగో చెబుతున్నా నిను కన్నది  నాకై మరి నీ అమ్మ
గారాలా కన్నులబాల మరి ఇంతా మారామేలా హో ఓ హొయ్
ఇద్దరుమిట్టా ముద్దుల మాటై చుట్టుకుపోదామా
ఇప్పటికిప్పుడు పందిరిమంచం దుప్పటి వేద్దామా

మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ
హొయ్ మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ
మనసే దోచుకున్న లైలా నీవే మైనా
నన్నే వద్దు అన్నా  నిన్నే వదులుతానా
చక్కని చుక్కల జాబిలి నొక్కుల చెక్కిలి నీదేనా
చిక్కని చక్కెర పెదవుల హక్కులు నీకే రాసైనా


Palli Balakrishna Sunday, October 1, 2017


చిత్రం: కావ్యాస్ డైరీ (2009)
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హేమచంద్ర
నటీనటులు: మంజుల ఘట్టమనేని, ఛార్మి, ఇంద్రజిత్ సుకుమారన్, శశాంక్
దర్శకత్వం: వి.కె. ప్రకాష్
నిర్మాత: మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్
విడుదల తేది: 05.06.2009

హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా
పాప ప్రాణ౦ ఎన్నడైనా పువ్వులాగ నవ్వదా!

వానలోన తడిచొస్తు౦టే ఊరుకోగలదా
అ౦తలోనే ఆయొచ్చి౦దో తట్టుకోగలదా
పాఠమే చెబుతు౦డగా ఆటపట్టిస్తే
మీనాన్నతో చెబుతానని వెళుతు౦ది కోపగి౦చి
మరి నాన్నఅలా తిడుతు౦డగా తను వచ్చి ఆపుతు౦ది
మమతలు మన వె౦ట తోడు౦టే...

పాలు నీళ్ళై కలిసేవారే ఆలుమగలైతే
ప౦చదారై కలిసి౦ద౦ట పాప తమలోనే
ఆమని ప్రతి మూలలో ఉ౦ది ఈ ఇ౦టా
ప్రతి రోజున ఒక పున్నమి వస్తు౦ది స౦బర౦తో
కలకాలము కల నిజములా కనిపి౦చెనమ్మక౦తో
కళకళలే కళ్ళ ము౦దు౦టే..


********   *******   *******


చిత్రం: కావ్యాస్ డైరీ
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: ప్రణవి, గీతమాధురి

ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలెన్నో
నిన్నా మొన్నా నాతో ఉన్న ఉల్లాసాలెన్నో
బలమైన జ్నాపకాలే బతుక౦త నాకు తోడై
ఉ౦డే బ౦ధాలెన్నో...

చిలిపతనంతో చెలిమి ఎదల్లొ దోచిన విరులెన్నో...
చురుకుతన౦తో చదువుల ఒల్లో గెలిచిన సిరులెన్నో
అ౦దాల అల్లర్లే ఇ౦కా గుర్తు ఉన్నవి
ఆనాటి వెన్నెలలే నన్నే పట్టి ఉన్నవి
మళ్ళీ ఆ కాలాలే రావాలి..
అంటూ నా కన్నుల్లొ కలలెన్నో ఒహొ

నవ్వులకైనా నవ్వులుతుళ్ళే నిమిషాలెన్నెన్నో..
శ్వాసలలోనా ఆశలు రేపే సమయాలి౦కెన్నో
బ౦గారు జింకల్లె చిందే ఈడులే అది
ముత్యాల మబ్బల్లె కురిసె హాయిలే ఇది
చెదరదులే ఆ స్వప్నం ఈ రోజు..
చెరగదులే ఆ సత్య౦ ఏ రోజు..ఒహొ


********   *******   *******


చిత్రం: కావ్యాస్ డైరీ
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: టిప్పు

పొ వెళిపొ అన్న పొను
నీతొ నడిచె నీడె నెను
కొపమైతె కసురుకొ నన్ను
నిన్ను మాత్రం వదలనె నెను
నువ్వు పొ వెళిపొ అన్న పొను
నీతొ నడిచె నీడె నెను

సీతలాంటి సిగ్గు పూల బంతికి కొథి చిందులెందుకె
లెగులాబి సున్నితాల చెంపకి ఆవిరంటనివ్వకె
క్షణాల మీద కస్సు మన్న అందమా
ప్రెమనెది నెరమా ఆపవ అంతులెని డ్రామ
నా గుండెలొన గుప్పుమన్న మరువమ నిప్పులాంటి పరువమా
కొప్పులొన నన్ను ముడుచుకొమ్మ

లొకమంతా వెతికినా దొరకదె నీకులాంటి అందమె
ఎందుకంతె కారణం తెలియదె నువ్వు నాకు ప్రాణం
నీ కళ్ళలొన ఉన్న మాట దాచకె ఆగిపొకు ఉరికె
పెదవి కదిపి చెప్పుకొవె ఒకె
నా లాంటి నన్ను అంత దూరం ఉంచకె వెరుగా చుడకె
పారిపొతె నస్టమంత నీకె

Palli Balakrishna Tuesday, September 26, 2017


చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: స్మిత
నటీనటులు: జగపతిబాబు, ఛార్మి కౌర్, శశాంక్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: గంగరాజు గుణ్ణం
విడుదల తేది: 30.06.2005

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని (2)

నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం: 1
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంటే
అది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం: 2
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని



*********  *********  ***********



చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు, మారుతి
గానం: సునిధి చౌహన్, డొమినిక్యూ సీర్జీయో

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground
తరచి కొలవకు కొలవకు కాలాన్ని
గుర్తుంచుకునేంతగ ఏమున్నది నీ నిన్నల్లో మొన్నల్లో
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground

చరణం: 1
సాయంత్రం మనది ఒంటరి ఒంటరి జీవితం
ఈ మంత్రం చెరుపుతున్నది దూరము దూరము
If you wanna sing నాతో గీతం
If you wanna do నాతో నాట్యం
If you wanna spend నాతో సమయం
This is the moment
If you wanna do ఏదైనా కొంచెం
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground

చరణం: 2
చూస్తావా సరిగమ విరిచిన హరివిల్లుని
గీస్తావా అసలు హద్దుకి అవతల హద్దుని
If you wanna sleep పరిగెడుతూనే
If you wanna fly నిలబడుతూనే
If you wanna live చనిపోతూనే
Its not a big deal, you have got it down ఇంకో డ్రింకోటి

Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round

and round and round and round and round



*********  *********  *********



చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు, మారుతి
గానం: సునిధి చౌహన్, డొమినిక్యూ సీర్జీయో

న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా

షైన న న న న న న న (6)

న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా

షైన న న న న న న న (6)

చరణం: 1
ముఖ ముఖాన పరిచయం అసలు లేదు అవసరం
తనువుకి తెలుసు తనువు అవసరం
పెదవి నుంచి పెదవికి తరుగుతుంటె దూరము
ఇంతకు మించి ఎలా పయనము
సోకార్డ్ సోల్ మేట్ కోసమేల నీ వేట
బ్రాండ్ న్యూ దొరుకుతుంటే ప్రతి పూట

షైన న న న న న న న (6)

న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా

షైన న న న న న న న (6)

చరణం: 2
మసక మసక ఎండలో మంచులాగా కరగక
శాశ్వత బంధం మనకెందుకు
అనుభవాల కొలనులో చేపలాగ ఈదక
పసిఫిక్ సంద్రం గొడవెందుకు
హృదయం లోతులన్ని తెరచి చూస్తే టైం వేస్ట్
పరువం ఎత్తులెక్కు అందుతుంది ఎవరెస్ట్

షైన న న న న న న న (6)

న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా

షైన న న న న న న న (6)


*********  *********  ***********



చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు
గానం: శ్రేయా గోషల్

నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి
మౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండి
స్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటై
దిక్కుల్లొ శూన్యమై శూన్యమై

చరణం: 1
నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగా
ఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా
నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో

చరణం: 2
ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ
బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా
భయమన్నదే పుట్టదా
ప్రతి ఊహతో పెరగదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో


*********  *********  ***********


చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు
గానం: శ్రేయా గోషల్

రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

చరణం: 1
చేలియో చెల్లకో ఇట్స్ ఇట్స్ నో నో నో నో
చేరియో చేరకో యు గో గో గో గో
రాముడో భీముడో ఇంకేవ్వడో
120 చాలదమ్మా ఇట్స్ సో సో సో సో స్లో

చరణం: 2
చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం
అక్కడ కాదు ఇక్కడే
ముద్దిస్తేనే స్పీడొస్తుందా
అయితే అయితే అయితే

Palli Balakrishna Wednesday, August 16, 2017

Most Recent

Default