-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K. Vasu"



చిత్రం: దేవుడు మావయ్య (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి, ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ 
దర్శకత్వం: కె వాసు 
నిర్మాత: దేవినేని వెంకటరత్నం, బద్రీనాథ్ 
విడుదల తేది: 14.01.1981



Songs List:



చిట్టి పొట్టి డింగ్ డాంగ్ బెల్ పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు మావయ్య (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు

చిట్టి పొట్టి డింగ్ డాంగ్ బెల్



బ్రతుకే ఒక ఆట వయసే సయ్యాట పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు మావయ్య (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

బ్రతుకే ఒక ఆట వయసే సయ్యాట 




జీవితమే ఒక జోల పాట (Happy) పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు మావయ్య (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

జీవితమే ఒక జోల పాట (Happy)




జీవితమే ఒక జోల పాట (Sad) పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు మావయ్య (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

జీవితమే ఒక జోల పాట (Sad)



ఏ వసంత కోకిల వాన వేళ పాడదు పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు మావయ్య (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

ఏ వసంత కోకిల వాన వేళ పాడదు 




అందమంతా చీరగట్టి పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు మావయ్య (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి: 
హా.. అందమంతా చీరగట్టి పరువంతా పైట లేసి
అందమంతా చీరగట్టి పరువంతా పైట లేసి
బిడియమంతా బొట్టు పెట్టి బిడియమంతా బొట్టు పెట్టి
అటు తిరిగి నిలబడితే ఏం తక్కువా అటు కన్నా ఇటు వైపే అందమెక్కువా
అటు తిరిగి నిలబడితే ఏం తక్కువా అటు కన్నా ఇటు వైపే అందమెక్కువా 

ఆరుబైటా కన్నుగొట్టి ఊరుబైటా కొంగు పట్టి
ఆరుబైటా కన్నుగొట్టి ఊరుబైటా కొంగు పట్టి
అలకలెన్నో మొలకలెత్తి అలకలెన్నో మొలకలెత్తి
అటు తిరిగి నిలబడితే అల్లరెక్కువ ఎటు తిరిగి నిలబడ్డా ఆకలెక్కువ
అటు తిరిగి నిలబడితే అల్లరెక్కువ ఎటు తిరిగి నిలబడ్డా ఆకలెక్కువ

చరణం: 1 
ఆ కుర్రబుగ్గలో ఎర్రగులాబి 
ఆ లేత పెదవిలో తీపి జిలేబి
కోసుకోమంటున్నది కోడెవయసు
తీసుకోమంటున్నదా కన్నెమనసు

చెరువునడిగి కోసుకో చేపనడిగి తీసుకో
చెరువునడిగి కోసుకో చేపనడిగి తీసుకో
కలువపువ్వు తెమ్మంటే తేనెవిందులిమ్మంటే
కాదంటానా లేదంటానా హా
కాదంటానా హా...  లేదంటానా 

అందమంతా చీరగట్టి అహా...
పరువంతా పైట లేసి ఓహో... 

చరణం: 2 
ఆ పూత పొగరులో కోటి స్వరాలు 
అవి వింటే నాలో కొంటె జ్వరాలు
ఆదుకోమంటున్నది కన్నెపడుచు
చేదుకోమంటున్నదా తీపి వయసు

చెట్టునడిగి కోసుకో పిట్టనడిగి తీసుకో
చెట్టునడిగి కోసుకో పిట్టనడిగి తీసుకో
కన్ను చెదిరిపోతుంటే కన్ను చెదిరిపోతుంటే
కాదంటానా లేదంటానా
కాదంటానా లేదంటానా  

అందమంతా చీరగట్టి పరువంతా పైట లేసి
బిడియమంతా బొట్టు పెట్టి బిడియమంతా బొట్టు పెట్టి
అటు తిరిగి నిలబడితే ఏం తక్కువా అటు కన్నా ఇటు వైపే అందమెక్కువా
అటు తిరిగి నిలబడితే ఏం తక్కువా అటు కన్నా ఇటు వైపే అందమెక్కువా 


ఆరుబైటా కన్నుగొట్టి ఊరుబైటా కొంగు పట్టి
ఆరుబైటా కన్నుగొట్టి ఊరుబైటా కొంగు పట్టి
అలకలెన్నో మొలకలెత్తి అలకలెన్నో మొలకలెత్తి
అటు తిరిగి నిలబడితే అల్లరెక్కువ ఎటు తిరిగి నిలబడ్డా ఆకలెక్కువ
అటు తిరిగి నిలబడితే అల్లరెక్కువ ఎటు తిరిగి నిలబడ్డా ఆకలెక్కువ

Palli Balakrishna Thursday, October 12, 2023
చిత్రం: ఏది పాపం ఏది పుణ్యం? (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చంద్రమోహన్, మాధవి
దర్శకత్వం: కె. వాసు
నిర్మాతలు: కె.మహేంద్ర , టి. వేంకటేశ్వరులు
విడుదల తేది: 09.02.1979







చిత్రం: ఏది పాపం ఏది పుణ్యం? (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి  ఈ నిమిషంలో నీ వడిలోనే నిదురపోనీ

కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి  ఈ నిమిషంలో నీ వడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ

చరణం: 1
తొలిసంజె మలి సంజె లేల
నా చెంత చెలి ఉన్న వేళ
తొలిసంజె మలి సంజె  లేల
నా చెంత చెలి ఉన్న వేళ

చిరుగాలి సెలయేరు లేల
నా మనిషి తోడున్న వేళ
అరుదైన వేళ ఈ శుభవేళ
బ్రతుకే వెన్నెల వేళా వేళా వేళా

కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి - ఆ...ఆ...
ఈ నిమిషంలో - ఆ...ఆ...
నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ

చరణం: 2
సిరిదివ్వెలో వెలుగులాగ
నీ చూపులో నిలిచిపోనీ
సిరిదివ్వెలో వెలుగులాగ
నీ చూపులో నిలిచిపోనీ

జేగంటలో రవళిలాగ
నీ ఊపిరై కలిసిపోనీ
కలలే కాని కలతే లేని
లోకానకే చేరిపోనీ చేరిపోనీ...

కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి - ఆ...ఆ...
ఈ నిమిషంలో - ఆ...ఆ...
నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ





Palli Balakrishna Monday, February 22, 2021



చిత్రం: బాబులు గాడి దెబ్బ (1981)
సంగీతం: జె.వి. రాఘవులు
నటీనటులు: కృష్ణంరాజు, రాధిక, శ్రీదేవి 
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: వడ్డే శోభనాద్రి
విడుదల తేది: 16.02.1981



Songs List:



పంతులమ్మ పంతులమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: బాబులు గాడి దెబ్బ (1981)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... మా బళ్లోకొస్తావా
ప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..
ప్రేమ పాఠం వింటావా

పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా... మా బళ్లోకొస్తావా
పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...
ప్రేమ పాఠం వింటావా

చరణం: 1
పల్లే పట్టు మీద అడపా దడపా రేగి
చిలిపి గుణింతాలు దిద్దుకోనా... దిద్దుకోనా

అందాలలో ఉన్న గ్రంధాలు చదివించి
పై చదువులకు నిన్ను పంపించనా... పంపించనా

వయ్యారమే చాలు... ఓనామః
శివమెత్తిపోమాకు... శీవాయః
ఒయ్..ఒయ్..ఒయ్...
వయ్యారమే చాలు... ఓనామః
శివమెత్తిపోమాకు... శీవాయః

పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... మా బళ్లోకొస్తావా
పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...
ప్రేమ పాఠం వింటావా

చరణం: 2
వాలేపొద్దుల కాడా.. వయసే ముద్దూలాడ
లేతా మనసూ జీతమిచ్చుకోనా.. ఇచ్చుకోనా

పండూ ఎన్నెల్లోనా.. ఎండవానల్లోనా
పూతా సొగసు  పట్టి అందుకోనా... అందుకోనా

పాఠాలు ఈ పూట చాలోయహా.. ఈ దసరాకు సెలవింక లేదోయహా
పాఠాలు ఈ పూట చాలోయహా.. ఈ దసరాకు సెలవింక లేదోయహా

పంతులయ్య.. యెయె..

పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా... మా బళ్లోకొస్తావా
పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...
ప్రేమ పాఠం వింటావా

పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... మా బళ్లోకొస్తావా
ప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..
ప్రేమ పాఠం వింటావా




చెంపకాదు జామపండు పాట సాహిత్యం

 
చిత్రం: బాబులు గాడి దెబ్బ (1981)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

చెంపకాదు జామపండు




హరి ఓం హరి ఓం పాట సాహిత్యం

 
చిత్రం: బాబులు గాడి దెబ్బ (1981)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

హరి ఓం హరి ఓం




చల్లో ననొగ్గేసి పాట సాహిత్యం

 
చిత్రం: బాబులు గాడి దెబ్బ (1981)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

చల్లో ననొగ్గేసి 



అమ్మో యమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: బాబులు గాడి దెబ్బ (1981)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

అమ్మో యమ్మో 



రావోయి మా కొట్టుకి మావ పాట సాహిత్యం

 
చిత్రం: బాబులు గాడి దెబ్బ (1981)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, ప్రకాష్ , పి.సుశీల

రావోయి మా కొట్టుకి మావ మందున్నది నాటు మందున్నది

Palli Balakrishna Sunday, March 3, 2019




చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ, పుష్పలత, రంగనాథ్, జయమాలిని
మాటలు: ఆచార్య ఆత్రేయ
పాటలు: వేటూరి, ఆరుద్ర 
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు
విడుదల తేది: 06.11.1981



Songs List:



పులకరింత పూసిందమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల 

పులకరింత పూసిందమ్మ
కలవరింత కాసిందమ్మో
కొత్త కొత్తగా కోయిలమ్మ
గుండెకాయలో కూసిందంమో
కుహు కుహు కుహు

ఏటి గాలిలో ఏణువున్నది
పైటలాగినా పాటగున్నాది
మల్లియల్లో ఎన్నియల్లో
మల్లియల్లో పండుగల్లో
యవపూవులా తుమ్మెదలాడే
తీపి తేనెలా తానాలాడే
కొమ్మలో కోయిలమ్మలో
పూల రెమ్మలో ఎన్ని వయ్యారాలో

దొండపండులా పెదవులున్నాయి
కొండమల్లెలా నగవులున్నాయి
గుండియల్లో అందియల్లో
నిండుతున్న సందడుల్లో
రెపటేళలా రెప్పలల్లాడే
ఎండకన్నులే నన్ను గిల్లాడే
నవ్వులో పాల గువ్వలో
రివ్వు రివ్వనే సిగ్గు సింగారాలో



చిరుగాలి ఉయ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు

చిరుగాలి ఉయ్యాల 
చిరుగాలి ఉయ్యాల చిగురాకు జంపాల
ఊగేటి చిలకమ్మవో
సెలయేటి గలగలలో కెరటాల మిలమిలలో
నడయాడు రాయంచవో
నిన్నే నిన్నే నిన్నే ....... నిన్నే నిన్నే నిన్నే లే
నను పిలచితివో

చిరుగాలి నేనేలే చిగురాకు నేనేలే
ఊగేటి చిలకమ్మనూ
సెలయేరు నేనేలే కెరాటాలు నేనేలే
నడయాడు రాయంచనూ
నేనే నేనే నేనేలే.... నేనే నేనే నేనేలే
నను తలచితివో

చరణం: 1
తొంగి తొంగి చూసే సింగి ఎంతో
పొంగి పొంగి పోయే వేల నిన్ను
నీరెండసోకి నిగనిగలు తాకి
దోబూచులాడేను చాలా
దొంగాటలాడే ఈవేశా
కను విందుచేసేపు చాలా

||చిరుగాలి॥

చరణం: 2
చందమామలాంటి మోము
నీ అందమంతా నోచే నోము
అందచందాల బరిణె రతనాల వీణ
ఇంపైన సంపెంగి రెమ్మ
లేత సొంపైన అపరంజి బొమ్మా
వెయేళ్లు వర్థిల్ల వమ్మా

॥చిరు గాలి ||




చూపులకు సుందరాంగినే పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి

పల్లవి: 
చూపులకు సుందరాంగినే
నీ అమ్మడ జిమ్మడ కోకడాబు కోమలాంగినే
కన్నేస్తే అదురు తాపు చెయ్యే స్తే బెదురుతావు
అసలు ఇపయానికోసే పసలేస్ సింగినే

సూపులకు సుందరాంగినే

చేతికర్ర చెంచలాంగినే
ఓ అమ్మమ్మ పెద్దమ్మ మాటగాటు మందరాంగి నే
పొద్దేమో వాలిపోయి ముద్దేమో రేగిపోయె
మిడిసి మిడిసి పడితే నీ నడుమింకా వంగునే

చేతికర్ర చెంచలాంగినే
ఓ అమ్మమ్మ పెద్దమ్మ మాటగాటు మందరాంగిన

చాల్లే నోరుముయ్యండెహ
మోకాళ్ళదాకా నేను మొగలి పూల జడ వేసి
ఊరిమీదికొచ్చినాకా సూడాల నా సోకు
మొగోడైన ప్రతివాడు మొగుణ్ణి ఆనుకున్నారు
ఆడ పుట్టుక పుట్టినోళ్లు అందం అరువడిగారు
కన్నున్న నాయాళ్లు కన్ను కొడితే చిత్తు
జన్ను పెడితేమత్తు జొన్న చేలో సొత్తు

ఓసోస్ కుర్రకుంకల్లారా మీ కేటి తెలుసే
ఆ కాలపు ఒడుపులు ఆ పట్టు విడుపులు
పగలంతా సూరీడ్ని తిట్టుకుని రాత్రంతా సెంద్రుడ్ని
పట్టుకుని కూకునేవాడే మా ఆయన తెల్లారకుండా

అలాగా
పుట్టగా నే పదారేళ్ల పులకరింతలున్నదాన్నీ 
పేరు పెట్టగానే పైట వేసుకున్న వన్నె చిన్నదాన్ని
అబ్బో
బావలు మావలు తప్ప బందువులే లేనిదాన్ని
చూడాల ఆడగోడు ఆడలేక మద్దెలోడు
ఒరుగై పోయిన బామ్మకు మొరుగుడెందుకు
ఈ సణుగుడెందుకు తల తిరుగుడెందుకు

చేతికర్ర చెంచలాంగినే
ఓ అమ్మమ్మ పెద్దమ్మ మాటగోటు మందరాంగివే
అడుగుల్లో హంసలున్న అందక
కత్తెను
పలుకులో సిలక లున్న ముద్దుగుమ్మను
ఓ య బ్బో
వసంతాలు దేనికంట ముసలిబామ్మకు
వన్నె చిన్నెలన్నీ నీకు మరో జన్మకు
తల్లో నేనెట్టకుంటే మల్లెపూలు నలుపు
వరసకాదు వలపునాది చివరి గెలుపు

|| చూపులకు సుందరాంగినే||




ఒంటిస్తంభం మేడ పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

పల్లవి:
ఒంటి స్తంభం మేడ ఒక్కరాతిరి
ఓరచూపు చూసోంది వంక జాబిలి
కౌగిలి గిలి గిలి గిలి గిలి గిలి కావాలంటే
నీ చక్కలే గిలి గిలి గిలి గిలి గిలి తీరాలంటే
దక్కరో నా చేత చిక్కరో దొరా
ఓయ్ దజ్కరో నా చేత చిక్కరో దొరా

చరణం: 1
తేనే టీగ కళ్ళు చూస్తే తీపి ముళ్లు రో
ముద్దు నీకు ముదిరితే. మూడు నాళ్లురో
ఇంగ్లీసు ముద్దు లైతే యెంగి లెక్కువ
తెలుగువాళ్ళ ముచ్చటైతే మక్కు వెక్కువ
సీమదొర సోకులన్నీ బయట చేసుకో
నాటు సరసం ఇక్కడుంది చాటు చూసుకో
నువ్వు చోటు చేసుకో

ఒంటిస్తంభం

చరణం: 2
గంటకొక్క కాపురాల ఇంటి వాడిని
పూటక్కొ పువ్వుతుంచే తోటమాలవి
తేరగుంది జుర్రుకోర తేనే యెన్నెల
చెమ్మ చెక్క లాడుకోర రెండు పక్కల
చందమామ జారిపోద్ది జాగు చేయక
కోడిపుంజు లేచిపోద్ది యేడి పించక
నన్నే ఏడిపించక అహ.....

ఒంటిస్తంభం



పిచ్చెక్కి పోతోందే పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం:యస్.పి.బాలు, పి.సుశీల

పిచ్చెక్కి పోతోందే పిల్లో నిన్ను చూస్తూంటే
చిలకపచ్చ చీరగట్టి పసువు పచ్చలారబోసి
కుచ్చుల జడ ముందుకు వేసి ఉచ్చు మెడకే వేస్తుంటే

పిచ్చెక్కి పోతోంది మామో నిన్నుచూడకుంటే
చిలకపచ్చ చీరగట్టి పసుపు పచ్చలారబోసి
చిచ్చులు రేపే చుక్కల వేళ వెచ్చవెన్నెల వేధిస్తుంటే

పుడమికి పువ్వులు పూసిందాకాపులకరింత లేరా
పెదవికి నవ్వులు పుట్టిందాకా పూలసంత లేరా

కాలు మోపితే నేలతల్లికే సక్కిలిగింతయే
కన్నుగీటి కాండ గుండెలేవెన్నెలపుంతాయే
సుక్కలకన్న సక్కని వన్నె ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే

వెన్నెల నీడగా చీకటి తోడుగా నన్ను బతక నీరా
కమ్మని వేళలో కలతల వేళలో నాకుబతుకు నీరా

అన్నమాటకే కన్నులెందుకో నీటిమబ్బులాయే
విన్న వేళలో గుండె లోయలో ఏటి వెల్లువాయే
సూపులలోనే చుటరికాలు రాచరికా లే వద్దంటుంటే



నీలి నీలి కళ్ళతో పాట సాహిత్యం

 
చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం:యస్.పి.బాలు, యస్.పి.శైలజ

నీలి నీలి కళ్ళతో నిండిపో నాలో 

Palli Balakrishna Sunday, February 17, 2019



చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వీటూరి, జాలాది, కె. చక్రవర్తి
గానం: యస్.పి. బాలు, జానకి, శైలజ
నటీనటులు: చిరంజీవి, మాధవి, మంజు భార్గవి, బేబీ తులసి 
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: వి.కె.తమ్మారెడ్డి 
విడుదల తేది: 15.09.1979



Songs List:



పువ్వులోయ్ పువ్వులు పాట సాహిత్యం

 
చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, యస్.జానకి

పువ్వులోయ్ పువ్వులు




ఎండా వాన పెళ్లాడే పాట సాహిత్యం

 
చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి
గానం: యస్.పి. బాలు, శైలజ

(వీటూరి సుందరరామ మూర్తి, వేటూరి సుందరరామ మూర్తి. ఇద్దరు  గేయరచయితలు ఉన్నారు, ఇద్దరూ వేరు వేరు. ఈ పాట రాసింది వీటూరి సుందరరామ మూర్తి)

ఎండా వాన పెళ్లాడే



గో గో గో మిస్టర్ పాట సాహిత్యం

 
చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: కె. చక్రవర్తి 
గానం: యస్.పి. బాలు, యస్.జానకి

గో గో గో మిస్టర్



ఒక నెలవంక పాట సాహిత్యం

 
చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి. బాలు

ఒక నెలవంక

Palli Balakrishna Monday, January 28, 2019



చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, కవిత
దర్శకత్వం: కె.వాసు
నిర్మాతలు: కె.మహేంద్ర, త్రిపరమల్లు వెంకటేశ్వరులు
విడుదల తేది: 15.03.1980



Songs List:



నీ చూపు నా చూపు కలిశాక పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి

నీ చూపు నా చూపు కలిశాక



కమ్మని నా పాట పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

కమ్మని నా పాట 




ఓ అమ్మో టక్కరి గుంట పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

ఓ అమ్మో టక్కరి గుంట 





అన్నయ్య దీవెన పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

అన్నయ్య దీవెన 




నలుగురి కోసం వెతుకుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

నలుగురి కోసం వెతుకుతున్నది

Palli Balakrishna



చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి (All)
గానం: యస్.పి. బాలు, వి. రామకృష్ణ, పి. సుశీల, యస్.పి. శైలజ 
నటీనటులు: చిరంజీవి, చంద్రమోహన్, సులక్షణ, గీత
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: కె.బాబురావు
విడుదల తేది: 11.02.1984



Songs List:



నీ చూపు చూపు కాదు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: 

నీ చూపు చూపు కాదు



ముచ్చట తీర్చరా మువ్వ గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. శైలజ 

ముచ్చట తీర్చరా మువ్వ గోపాల 



చీరకు చెంగందం చినదానికి సిగ్గందం పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు,  పి. సుశీల

చీరకు చెంగందం చినదానికి సిగ్గందం 




ముద్దైనా పొద్దైనా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుళ్ళోస్తున్నారు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, వి. రామకృష్ణ, పి. సుశీల, యస్.పి. శైలజ 

ముద్దైనా పొద్దైనా

Palli Balakrishna


చిత్రం: తోడు దొంగలు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: కృష్ణ , చిరంజీవి, గీత, మధుమాలిని
దర్శకత్వం: కె. వాసు
నిర్మాత: మహేంద్ర
విడుదల తేది: 12.02.1981

పల్లవి:
వయసు ముసెరెను మనసు మెరిసెను
పిలుపు తెలిసెను వలపు కురిసెను
ఈ వేళా మధుమాసవేళా
రావేలా ఇదే రాసలీలా

వయసు ముసెరెను మనసు మెరిసెను
పిలుపు తెలిసెను వలపు కురిసెను
ఈ వేళా మధుమాసవేళా
రావేలా ఇదే రాసలీలా

చరణం: 1
వేణువులై మన మేనులు పాడిన సరస రాగాలలోన
గోపికలై తొలి కోరికలాడిన మధుర గీతాలలోన
అందాలే సుమగంధాలొలికె జీవని మధువనిలోన
యవ్వన మధువుల వాన

ఈ వేళా మధుమాసవేళా
రావేలా ఇదే రాసలీలా

చరణం: 2
తారకలే నవ మల్లికలైనవి తరుణ భావాలలోన
జాబిలికి చెలి కాటుకలంటినవి తరుణి రాగాలలోన
భందాలే రస భంధాలైనావి ఆమని తోటలలోన
తుమ్మెద పాటలలోన

వయసు ముసెరెను మనసు మెరిసెను
పిలుపు తెలిసెను వలపు కురిసెను
ఈ వేళా మధుమాసవేళా
రావేలా ఇదే రాసలీలా

Palli Balakrishna Saturday, February 10, 2018

చిత్రం: ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి (2004)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయణ్ , కవితా కృష్ణమూర్తి
నటీనటులు: శ్రీకాంత్ , ప్రభుదేవా, ఆర్తి ఛాబ్రియా
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 13.08.2004

పల్లవి:
భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ఇరువైపుల పొంగుతున్నది ఆనందమే
వరదై నను ముంచుతుంది నీ ఆనందమే
ఏదో లాగుంది...

గంగ లాగ పొంగిరాగ ఆనందమే
తీగలాగ అల్లుకోదా ఆనందమే
అరె గువ్వ లాగ వాలిపోదా ఆనందమే
గుండెలోన నిండిపోదా ఆనందమే

భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే

చరణం: 1
కందిరీగ కాటులా గండె చీమ మీటుల
కుట్టినట్టు ఉంది నీ ఆనందమే
హే కప్పుకుంటే వేడిగా విప్పుకుంటే చల్లగా
దుప్పటల్లే ఉంది మా ఆనందమే
చేయి తాకినంతనే ఆనందమే
ఒళ్ళు జలదరించి నంతగా ఆనందమే
బొట్టుపెట్టి చెప్పనా ఆనందమే
నీ నడుము చుట్టు దాగివుంది ఆనందమే
బాబో వదిలేస్తే పోదా

గంగ లాగ పొంగిరాగ ఆనందమే
తీగలాగ అల్లుకోదా ఆనందమే
హే గువ్వ లాగ వాలిపోదా ఆనందమే
గుండెలోన నిండిపోదా ఆనందమే

భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే

చరణం: 2
మూతి ముడిచి చూపినా సిగ్గువిడిచి చెప్పినా
అర్ధమయ్యి చావాదు ఆనందమే
తేనెలూరు చిన్నది తిప్పుకుంటు చెప్పినా
తియ్యతియ్యగుంటది ఆనందమే
చందమామ వంటినే ఆనందమే
మీరు చిందులేస్తే అందునా ఆనందమే
అందరాని సందులో ఆనందమే
అందిపుచ్చుకుంటె అందులో ఆనందమే
ఏమో తుదకేమౌతుందో

గంగ లాగ పొంగిరాగ ఆనందమే
తీగలాగ అల్లుకోదా ఆనందమే
హే గువ్వ లాగ వాలిపోదా ఆనందమే
గుండెలోన నిండిపోదా ఆనందమే

భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ఇరువైపుల పొంగుతున్నది ఆనందమే
వరదై నను ముంచుతుంది నీ ఆనందమే
ఏదో లాగుంది...

గంగ లాగ పొంగిరాగ ఆనందమే
తీగలాగ అల్లుకోదా ఆనందమే
అరె గువ్వ లాగ వాలిపోదా ఆనందమే
గుండెలోన నిండిపోదా ఆనందమే

భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే


Palli Balakrishna Tuesday, November 28, 2017



చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది (All)
నటీనటులు: జయసుధ, చంద్రమోహన్,  రావుగోపాలరావు, చిరంజీవి (నూతన పరిచయం) రేష్మి (నూతన పరిచయం) మాధవి (అతిధి పాత్రలో)
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 22.09.1978



Songs List:



యాతమేసి తోడినా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు

పల్లవి:
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు 
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరి గుడెసలోదైనా
గాలి ఇసిరికొడితే... ఆ దీపముండదూ
ఆ దీపముండదూ

యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు

చరణం: 1
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా...
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయెరా...
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా...
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయెరా...
కుడితి నీళ్లు పోసినా...
అది పాలు కుడుపుతాదీ...
కడుపుకోతకోసినా...
అది మనిషికే జన్మ ఇత్తాదీ
బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు 

చరణం: 2
అందరూ నడసొచ్చిన తోవ ఒక్కటే..
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే..
అందరూ నడసొచ్చిన తోవ ఒక్కటే..
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే..
మేడ మిద్దెలో ఉన్నా...
సెట్టునీడ తొంగున్నా...
నిదరముదరపడినాకా...
పాడిఒక్కటే హ హ వల్లెకాడు ఒక్కటే
కూతునేర్చినోల్ల కులం కోకిలంటరా హ..హ
ఆకలేసి అరసినోళ్లు కాకులంటరా

యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరి గుడెసలోదైనా
గాలి ఇసిరికొడితే... ఆ దీపముండదూ
ఆ దీపముండదూ

యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు




ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా...పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జాలది
గానం: చంద్రశేఖర్, జి. ఆనంద్, యస్.పి. శైలజ 

పల్లవి:
ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా... 
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...
యేలియల్లో యేలియల్లో ఎందాకా...
ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా... 

ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా

ఎన్నెల్లో ఇళ్లేయనా... చుక్కల్లో పక్కేయనా
ఎన్నెల్లో ఇళ్లేయనా... చుక్కల్లో పక్కేయనా

గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా

ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా

చరణం: 1
ఆలమబ్బు బుగ్గల మీద  మెరెపు మెరిసి ఆడినట్టే
నీలికొండ గుండెల మీద  వాన చుక్క జారినట్టే
వానచుక్క వాగులైయ్యి  సముద్రాన కలిసినట్టే
వానచుక్క వాగులైయ్యి  సముద్రాన కలిసినట్టే
రోజువారి మోజులన్నీ మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకోనా వడినిండా నేనుండి పోనా
ఓరయ్య నేనాడుకోనా వడినిండా నేనుండి పోనా

ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా... 
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...
యేలియల్లో యేలియల్లో ఎందాకా...
ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా... 

చరణం: 2
రేతిరంతా నిద్దరకాచి  కలువపూలు నవ్వినట్టే
రేపుమాపు ఆకాశం  ఆకువక్క యేసినట్టే
పడమటేపు పడకేసి  సూరిగాడు దొర్లినట్టే 
పడమటేపు పడకేసి  సూరిగాడు దొర్లినట్టే 
ఊరివైపు తలుపు తీసి తొంగి చూసి నవ్వినట్టే
సంధెల్లో చిందేయనా  పొద్దెల్లే ముద్దెట్టనా
సంధెల్లో చిందేయనా పొద్దెల్లే ముద్దెట్టనా

ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఎన్నెల్లో ఇళ్లేయనా  చుక్కల్లో పక్కేయనా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా

ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా... 
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...
యేలియల్లో యేలియల్లో ఎందాకా...
ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా... 



నోమల్లో మామిల్లా తోట కాడ  పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది
గానం: యస్.జానకి

నోమల్లో మామిల్లా తోట కాడ 
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ 
నోమల్లో మామిల్లా తోట కాడ 
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ 
గున్నమామి గుబురుల్లోన కోయిలమ్మా 
దాని జిమ్మడి పోను నాతో పోతి పడ్డదమ్మా 

నోమల్లో మామిల్లా తోట కాడ 
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ 

గాలీ ఈల పాటేసీ 
ఓణీ పైట జారేసీ 
గుల్ల పేరు గుండెల మీద 
తుల్లి తుల్లి పడుతంటే 
మాయదారి మనసల్లే 
మాయదారి మనసల్లే 
వాలుగాలి పడవల్లే 
నేనురికి గెలిశాను 
నే నీ వల్లల్లో 
నా పైట చెర సాప చందమామల్లో 

నోమల్లో మామిల్లా తోట కాడ 
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ 

కోత చేను తడుపుకు వస్తుంటె 
పంట బోగి పరుగులు పెడుతుంటే 
తుంగపూలు చేతులు తగిలీ 
బంగరాల సుడులెస్తుంటే 
తుంగపూలు చేతులు తగిలీ 
బంగరాల సుడులెస్తుంటే 
గలగల గోధారి గలగల గోధారి 
గడ గడ గొదవే అయ్యి 
నేనురికి గెలిశాను 
నే నీ వల్లల్లో 
నా నీడ నీ వాల్ల చందమామల్లో 

నోమల్లో మామిల్లా తోట కాడ 
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ 
గున్నమామి గుబురుల్లోన కోయిలమ్మా 
దాని జిమ్మడి పోను నాతో పోతి పడ్డదమ్మా 

నోమల్లో మామిల్లా తోట కాడ 
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ





బండ మీద బోడి గుండోడి దెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

బండ మీద బోడి గుండోడి దెబ్బ రామయ్యో రామ చంద్రయ్యా 
బొబ్బిలోడి ఇనప గునపాల దిబ్బా రామయ్యో రామ చంద్రయ్యా 
బండ మీద బోడి గుండోడి దెబ్బ రామయ్యో రామ చంద్రయ్యా 
బొబ్బిలోడి ఇనప గునపాల దిబ్బా రామయ్యో రామ చంద్రయ్యా 
దిబ్బమీద దబ్బ పల్లు కాసెరో బియ్యముకేమొ గాని ముందు నాకెరో 
రామయ్యో రామ చంద్రయ్యా ఏనద్దయ్యో సోద్యమేందయ్యా 
రామయ్యో రామ చంద్రయ్యా ఏనద్దయ్యో సోద్యమేందయ్యా 

తాండ్ర పాపయ్యోడు సతికిల్ల పడ్డాడు ఆ దిబ్బ కాడే 
ఇజయరామరాజు ఎల్లికిలు పడ్డడు ఆ దిబ్బు కాడే 
తాండ్ర పాపయ్యోడు సతికిల్ల పడ్డాడు ఆ దిబ్బ కాడే...ఆ దిబ్బ కాడే 
ఇజయరామరాజు ఎల్లికిలు పడ్డడు ఆ దిబ్బు కాడే...ఆ దిబ్బు కాడే 
రామ రామ అంటునే రైక తుడిసేస్తావు నీ యబ్బ కొడకా 
శివ శివ అంటునే చీర తడిపేస్తావు సుబ్బమ్మ మొగుడా 
ఆ దిబ్బ మీద దెబ్బ లాడినోల్లంతా కాడిని కట్టారు కులికెక్కి తన్నేరు 

రామయ్యో రామ చంద్రయ్యా ఏనద్దయ్యో సోద్యమేందయ్యా 
రామయ్యో రామ చంద్రయ్యా ఏనద్దయ్యో సోద్యమేందయ్యా 

బండ మీద బోడి గుండోడి దెబ్బ రామయ్యో రామ చంద్రయ్యా 
బొబ్బిలోడి ఇనప గునపాల దిబ్బా రామయ్యో రామ చంద్రయ్యా

Palli Balakrishna Monday, August 28, 2017



చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: యన్.టి.ఆర్, జయసుధ, కాంతారావు, మోహన్ బాబు మంచు
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: యస్.రైజ్ భాషా
విడుదల తేది: 14.11. 1980



Songs List:



ల ల ల ల లకోటా పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ల... ల... ల... ల... లకోటా, సా... నీ... పా... సా... సపోటా 
లవ్వాడే నా ప్రేమలకోటా సయ్యాటాడే పాలసపోటా 
ల... ల... ల... ల....లకోటా, సా .. గా.... మా.... పా.... సపోటా 
మురిపించేనా ముదుగలాటా ఆటాడించే అగ్గిబరాటా 

కంటినిండా చూడ్డానికి ఒంటినిండా అందానికి
చాటూ మాటూ లోటూలేని - చక్కదనాల సపోటా
రెక్కలు చాపి చుక్కలుదాటి ఎగిరిపోకే డకోటా

పదహారేళ్ళ వయసుతో - శృంగారాలే నేర్చుకో 
పదారువన్నెల సొగసులో
ఓహ
శృంగారాలే తీర్చుకో
ఆహా.....
మల్లెపూల తోట పడుచుపాట టా టా 
మల్లెపూల తోట పడుచుపాట  టా టా
టా టా

కౌగిలింతలో దాగటానికి - దాగి హాయిలో తేలటానికి 
సాటీ లేనే లేని - చక్కని చిక్కని గలాటా 
టక్కులమారి పందెం వేస్తే దక్కకపోదీ పరోటా
పరువు బజారున పెట్టకే పరువాలన్నీ పంచుకో 
పనిలోవుంటే  తిట్టకే - పనివాడ్నని గురుంచుకో 
ప్రాణాలసలే తియ్యకే పసివాడ్నని గుర్తుంచుకో 
మాట అంటే మాట నీ ఆట వూరి బయట 
మాట అంటే మాట నీ ఆట వూరి బయట - అహ్వ




కుర్రపిట్ట కుర్రపిట్ట పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కుర్రపిట్ట కుర్రపిట్ట కుయ్యోమంది 
గుర్రుపెట్టి గుడ్డుపెట్టి  మొర్రోమంది 
కన్నెపిట్టక కన్నుగొట్టి ముద్దుపెట్టి పోమ్మంటే
బోల్తాకొట్టి దణ్ణం పెట్టి శాల్తీ గలంతయ్యింది
లక్సో.... లక్సో..... బాక్సో..... బాక్సో

రంపం.... డడడ రంపం డడడ.... 
రంపం.... డడడ .... రంపం.... డడడ... 
ఒడ్డూ పొడుగూ చూశాను అగ్గిపిడుగనుకున్నాను 
ఏట్లో పడితే ఈతారాదు చేలో పడితే కోతారాదు
చెయ్యందిస్తే - చెలిమిచేస్తే 
చెలినేనంటే - చెరిసగమంటే 
చాతాకాదు వాతాకాదు కుయ్యో మొర్రో 
పీతబుర్ర నేతిబీర తుస్సో తుస్సో 
లక్సో... లక్సో.... బాక్సో .... బాక్సో

అరెరె కుర్రపిట్ట కుర్రపిట్ట కుయ్యోమంది 
ఆయ్ గుర్రు పెట్టి గుడ్డుపెట్టి మొర్రోమంది 
కన్నెపిట్ట కన్నుగొట్టి ముద్దుపెట్టి  రమ్మంది 
బోల్తా కొట్టి  దణ్ణం పెట్టి పెట్టి శాల్తీ  గల్లంతయ్యింది
లుక్సో .... లుక్సో .... బాక్సో.... బాక్సో ...

రం పం.... డడడ .. రం పం.... డడడ....
రం పం.... డడడ.... రం పం....డడడ ....

చుట్టమల్లె వచ్చావు చూపు మాట కలిపావు 
అల్లరి చేసే ఈడు ఉంది చిల్లరిగోలకు జోడు ఉంది చలిమీదున్నా
అహ
సలసల మన్నా
అమ్మమ్మమ్మా....
వలపిస్తున్నా వాటేస్తున్నా.. 
కూత పెడితే వాత పెడతా కుయ్యో మొర్రో
వాత పెడితే నోటి కూత లబోదిబో
లుక్సో .... లుక్సో .... బాక్సో.... బాక్సో ...




అంబ పలికిందిరా పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

యహూ .. యాహూ 
అంబ పలికిందిరా రంభ కులికిందిరా 
ఆ సిగులుచిలికే చిలకల కొలికి
చీటికి మాటికి నవ్వేసరికి
నా గుండెఝల్లందిరా యాహూ

కన్నుకొట్టిందిరా ఘల్లు మంటోందిరా
నా ఒళ్ళంత ఒక వింత తుళ్ళింతగా
సై అంటే సె ఆన్నది సన్నజాజులు బుల్లీ 
రమ్మనకే దిగివచ్చిందీ రంభా ఊర్వశి చెల్లి 
నాలో ఆశలన్నీ - ఎన్నో పూలుపూసి 
ఒంటరిగుంటే తుంటరిగుంట 
జంటగ తానే వచ్చిందిరా. యాహూఁ....

కొంగు తగిలిందిరా - రంగు తెలిసిందిరా
నా కళ్ళంత కలగన్న కవ్వింతగా ఆహా.. 
వానల్లో తానాలాడి వచ్చేనా సంపంగి 
ఎన్నెల్లో ఏడెక్కించి నవ్వే సుందరాంగి 
ఏదోబాస చేసే జాసేలేని పూసే
గిలి గిలి పెట్టు బులి బులి పిట్ట 
చెంతకుచేరి - చెప్పిందిగా 





ఒక్కరిద్దరయ్యే వేళ... పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

ఒక్కరిద్దరయ్యే వేళ... ఇద్దరొక్కటయ్యేలాగ
దుప్పటల్లే కప్పుకుందామా.... 
వయసు...ఎప్పటల్లె వుండిపోదామా 
ఆహా.. ఎప్పటల్లె వుండిపోదామా....
ఊగాలా ఊగాలా ఉయ్యాలా జంపాలా

ఒక్కరిద్దయ్యే లాగ యిద్దరొక్కటయ్యే లాగ
దుప్పటల్లె కప్పుకుందామా.... 
వయసు ఎప్పటల్లె పుండిపోదామా ఆ.. హా. 
ఎప్పటల్లె వుండిపోదామా... 
ఊగాలా ఊగాలా ఉయ్యాలా జంపాలా

గాఢమైన కౌగిట్లో గారాల ముచ్చట్లో
ప్రాణమిచ్చే గాలి ప్రాణాలు పోతుంటే
ఆరవ ప్రాణమై.. ప్రాణానికి ప్రాణమై 
ఆరవ ప్రాణమై ప్రాణానికి ప్రాణమై 
ఊపిరి తగిలిన తనువే ఊగుతువుంటే 
ఊగాలా ఊగాలా - ఉయ్యాలా జంపాలా

ఈ సంధ్య చీకట్లో - నీ వలపు వాకిట్లో 
నీ మల్లెల నవ్వుల్లో  - నా వెన్నెల వస్తుంటే 
అది తొలి రాతిరై - విర జాజుల జాతరై 
ఇద్దరి అల్లరి ఊరికి కధలవుతుంటే
ఊగాలా ఊగాలా ఉయ్యాలా జంపాలా



మంచు మొగ్గ తుంచుకొచ్చి.. పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మంచు మొగ్గ తుంచుకొచ్చి.. వానపువ్వు కోసుకొచ్చి 
కొప్పులోన పెడితే ఏం తప్పా? 
ఘుప్పుమన్న సిగపువ్వు నాతప్పా? 
ఒప్పులకుప్పా - వయ్యారిభామా

మంచుమొగ్గ తుంచుకొచ్చి.. వానపువ్వు కోసుకొచ్చి
కొప్పులోన పెడితే ఎంగొప్పా? 
ఘుప్పుమన్న సిగపువ్వు  నీ గొప్పా? 
చెప్పకుగొప్పా.. ఛాలెంజిరామా

మంచుకొండ మంచమేసి మల్లెపూల పక్కలేసి 
వెన్నెలొచ్చి కన్నుకొడితే ఏంతప్పా?
చందమామా కంచమెట్టి  అందమంత విందుచేస్తే 
ఆకలేసి రంకెలేస్తే ఏంగొప్పా?
అల్లాటప్పా అనుకోకు ఈడుగొప్పది
తప్పో ఒప్పో ఏమైనా గొప్పకాదది..నీ గొప్ప కాదది 
చెప్పకు గొప్పా ఛాలెంజిరామా

సిగ్గు మొగ్గ చిదిమివేసి పడుచుపాట పలికిస్తుంటే 
నీతో తైతక  చేరుకుంది ఎంతప్పా?
చినుకు నీలో చిటికలేసి..
వయసు నాలో వణుకు తుంటే

నీతో నీతకి చేరుకుంటే ఎంతప్పా? 
ఒణికి ఒణికి పోతుంటే ఒంటితప్పది 
ఒదిగి ఒరిగి పోతుంటే జంటతప్పది
ఈ తప్పే గొప్పది. ఆఁ - 
ఒప్పులకుప్పా.. వయ్యారిభామా 
ఒప్పులకుప్పా.. వయ్యారిభామా




అబ్బబ్బో సోకు పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

అబ్బబ్బో - అబ్బబ్బో సోకు సోకు
అబ్బబ్బో - అబ్బబ్బో సోకు సోకు 
చీర కేదిసోకు నువ్వు చీర కట్టుకుంటే సోకు 
చీరలేలా చినదానా సిగ్గు పడ్డావంటే నాకు షాకు 
బల్లిపూర్ రాణీగార్ బలదూర్
ఈయ
సోకు. సోకు
అమ్మమ్మో.. అమ్మమ్మో రాకు.. రాకు..
పైకి రాకు రాకు
నువ్వు నన్ను చూడకుండా పోకు.. 
ఈ వేళ- చిన్నోడా
ముద్దులిస్తా ముట్టుకోకు... బుల్లి బుల్లి రాజావార్ భలేజోర్
రాకు రాకు
సోకు సోకు

దాచేది దాగదు.. ఏయ్ దోచేది ఆగదు
మబ్బుల్లో మెరుపంటి మాయలాడి 
నా చూపుసోకినా ఆ తీపి తాకినా 
తబ్బిబ్బు అవుతావె చుక్కలేడి 

మెలి తిరిగే ఒళ్ళంతా చలిపెరిగే తుళ్ళింతా 
కనుచూపే కవ్వింతా ననురేపే రవ్వంతా 
ఆపూ ఆచూపు- ఆచూపే నాకైపు 
ఆపూ ఆచూపు.. చూడొద్దు.. నావైపు
రాకు రాకు 
సోకు సోకు

పరదాలు తీసే సరదాల సొగసు.. 
సరదారు నేనే యువరాణి
అరుదైన వలపు బిరుదైన పిలుపు
మనసైతే కాచుకో అలివేణి

మనసైన మహారాజా ఐ లవ్ యూ యువరాజా
రాత్రేళా రవితేజా.. రారా నా రసభోజ 
ముద్దు.. అరముద్దు.. ఈ పొద్దు.. నాకిద్దు 
ముద్దు. అరముద్దూ.. దాటొద్దు.. సరిహద్దు 
రాకు రాకు 
సోకు సోకూ




చల్లంగ జారి పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

చల్లంగ జారి మెల్లంగదూరి.. 
చల్లంగజారి మెల్లంగదూరి 
మబ్బులోన వుండిపోకురా.. ఓమావా  
సిగ్గుమొగ్గలేస్తుందిరా 

చల్లంగ జారి  మెల్లంగ దూరి 
చల్లంగ జారి  మెల్లంగ దూరి 
మబ్బులోన వుండిపోనులే ఓభామా 
సిగ్గు మొగ్గకోస్తానులే

చంటిబిడ్డ సామెతల్లె మనసు తెలపవు 
ఒంటికాయ సొంటికొమ్ము వయసు కలపవు
చెంతకొస్తే చింతదీర్చి చేయి కలపవు
నిన్ను చూస్తే నన్నుచూసి కన్ను కలపవు
సరస చేరుకోరాదే తగవు దేనికి 
సరసమాడి తారాడే రట్టుదేనికి 
ఈ రట్టుదేనికి  - హహ్వహ

అందమంత సందడాయెరా- ఓమావా! 
అందుకుంటే విందులాయెరా- ఓమావా? 
అందుకుంటే విందులాయెరా

గుండెకోన ఎండకాసి దప్పికొస్తది.. 
అందరాని రాణికోసం అల్లరవుతది
కట్టుకున్న వుల్లి కోక కసురుకుంటది 
పెట్టుకున్న మల్లెగాలి ముసురుకుంటది 
గుట్టుదాటి వచ్చాక గొడవ దేనికి
ఉట్టి పొగరు దించాక బెట్టు దేనికి? 
మన పట్టు దేనికి
హహహ లోనిగుట్టు వెల్లడాయేనే.. ఓభామా! 
తేనెపట్టు వెల్లవాయేనే 
లోనిగుట్టు వెల్లడాయెనే ఓభామా  
తేనెపట్టు వెల్లడాయేనే 


Palli Balakrishna Sunday, August 13, 2017

Most Recent

Default