Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Baby Sridevi"
Kotha Kapuram (1975)



చిత్రం: కొత్తకాపురం (1975)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య, డా॥ సి. నారాయణరెడ్డి, దాశరథి, మోదుకూరి జాన్సన్, ముద్దులపల్లి సత్యనారాయణ శాస్త్రి 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, భారతి, చంద్రమోహన్, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాత: జి. వెంకటరత్నం 
విడుదల తేది: 08.04.1975



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Palli Balakrishna Saturday, June 10, 2023
Mamatha (1973)



చిత్రం: మమత (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, అప్పలా చార్య 
గానం: పి. సుశీల, వి. రామక్రిష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, బి. వసంత , జి. ఆనంద్ 
నటీనటులు: కృష్ణ , జమున కృష్ణం రాజు, చంద్రమోహన్, విజయలలిత, హేమలత, రమాప్రభ, బేబీ శ్రీదేవి 
మాటలు: పినిశెట్టి, అప్పలా చార్య
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి 
కథ, నిర్మాత: కె. సి. శేఖర్ 
విడుదల తేది: 06.01.1973



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Palli Balakrishna Wednesday, December 7, 2022
Monagadu (1976)



చిత్రం: మొనగాడు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, వాణీ జయరాం 
నటీనటులు: శోభన్ బాబు, మంజుల, జయసుధ, రోజా రమణి, బేబి శ్రీదేవి
దర్శకత్వం: టి. కృష్ణ 
నిర్మాత: టి. త్రివిక్రమ రావు 
విడుదల తేది: 1976



Songs List:

Palli Balakrishna Saturday, August 20, 2022
Amma Maata (1972)



చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: సావిత్రి, శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: వి. రామచంద్రరావు
నిర్మాత: జి.వి.యస్.రాజు
విడుదల తేది: 25.02.1972

(శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా శోభన్ బాబు గారితో  ఈ సినిమాలో  నటించింది)



Songs List:



ఎంత బాగా అన్నావు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల & బృందం

పల్లవి:
ఎంత బాగా అన్నావు..
ఎంత బాగా అన్నావు..
ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా.. 
వేదంలా విలువైన మాట

ఎంత బాగా అన్నావు.. 
ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా.. 
వేదంలా విలువైన మాట
ఎంతబాగా అన్నావు..

చరణం: 1
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..అ
జారని వానల జల్లులూ..
ఊరికే ఉరిమే మబ్బులు
జారని వానల జల్లులూ..
ఊరికే ఉరిమే మబ్బులు
ఆ మబ్బులెందుకూ..?

ఊరని తేనేల సోనలూ..
ఊరికే పూచే పూవులు..
ఊరని తేనేల సోనలూ..
ఊరికే పూచే పూవులు..
ఆ పూవులెందుకు..?

ఉతుత్తి మాటలు అనవచ్చా.. 
మాటలు చేతలు కావాలి
ఆ చేతలు పదుగురు మెచ్చాలి..
నూరేళ్ళు బతకాలీ.. 
నూరేళ్ళూ బతకాలీ..

ఎంత బాగా అన్నావు..
ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..
వేదంలా విలువైన మాట
ఎంతబాగా అన్నావు..

చరణం: 2
ఆఆఆ ఆఆఅ మ్మ్..ఆ...ఆ..ఆ.. 
మ్మ్ మ్మ్ ఆ...ఆ...ఆ

అన్నమాట నిలిపావని..
అపుడే ఘనుడైనావనీ
ముందే మురిసే మీ నాన్నా..
ఆ ముసి ముసి నవ్వులు చూడరా...

కన్నా..ఆ..కన్నీరు కాదురా..
కన్నవారి దీవెనరా...
ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా..
ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా
నూరేళ్ళు బతకాలీ..
నూరేళ్ళూ బతకాలీ..
శ్రీరామ రక్షా...శ్రీరామరక్షా...

ఎంత బాగా అన్నావు..
ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..
వేదంలా విలువైన మాట
ఎంత బాగా అన్నావు..




ఎందుకమ్మా ఆపుతావు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: 
గానం: ఘంటసాల

ఎందుకమ్మా ఆపుతావు ఏమిటమ్మా నీ నమ్మకము 



ఎప్పుడూ మీ పాఠాలంటే పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ ఈరోజు




ఎవరైనా చూశారా ఏమనుకుంటారు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత

ఎవరైనా చూశారా ఏమనుకుంటారు



మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు
నా మనసే లాగేసిండు..
లగ్గమెప్పుడురా.. మాఁవా .. అంటే
మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కాఁవమ్మ సెప్పవే..  రాఁవమ్మ సెప్పవే
రత్తమ్మ సెప్పవే..  అత్తమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు
మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు
మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

చరణం: 1 
సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..
సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..
సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..
సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..

సిగరుల్లో..  సిగురుల్లో..
సిగురుల్లో.. మాటేసి కన్నుగీటిండే
జివ్వున పానాలు తోడేసిండే..
ఎప్పుడ్రా మాఁవా అంటే..
సంకురాతిరి పొయ్యేదాకా.. మంచి గడియే లేదన్నాడే...

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఎల్లమ్మ సెప్పవే.. మల్లమ్మ సెప్పవే
పుల్లమ్మ సెప్పవే.. బుల్లెమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..

చరణం: 2 
ఊరి సెరువులో నే నీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే
ఊరి సెరువులో నేనీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే...

బుడుంగున...  బుడుంగున
బుడుంగున మీదికి తేలిండే
నా తడికొంగు పట్టుకుని లాగిండే...
ఎప్పుడురా మాఁవా అంటే...
శివరాతిరి ఎల్లేదాకా సుబలగ్గం లేదన్నాడే...

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
పున్నమ్మ సెప్పవే.. గున్నమ్మ సెప్పవే
కన్నమ్మ సెప్పవే.. సిన్నమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

చరణం: 3 
కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే
కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే..

గబుక్కున గుబుక్కున
గబుక్కున కళ్లు రెండు మూసిండే
రివ్వున వాటేసి నవ్వేసిండే
ఏందిరా మాఁవా అంటే
కోడికూసి కూయంగానే తాళి కడతానన్నాడే..

ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
అమ్మమ్మ సెప్పవే.. అయ్యమ్మ సెప్పవే
పెద్దమ్మ సెప్పవే.. పిన్నమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..

మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు
కోడి కూసి కురియంగానే తాళి కడతానన్నాడే
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా..




సద్దుమణగనీయవోయి పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి

సద్దుమణగనీయవోయి చందురుడా ముద్దు




బూట్ పాలిష్ పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం

సా...రీ....సరిగదా 
మా...దా...మమదా
పా పా పా పా పాలిష్ 
పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు

Palli Balakrishna Wednesday, July 13, 2022
Badi Panthulu (1972)



చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య
గానం: ఘంటసాల, పి.సుశీల, యస్.పి. బాలు 
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీదేవి, విజయ లలిత, కృష్ణం రాజు, రామకృష్ణ, టి.పద్మిని, జయంతి, బేబీశ్రీదేవి
దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాత: పి. పేర్రాజు
విడుదల తేది: 22.11.1972

(శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా యన్.టి.రామారావు గారితో  ఈ సినిమాలో  నటించింది)



Songs List:



భారతమాతకు జేజేలు పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, బృందం

పల్లవి:
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

చరణం: 1
త్రివేణి సంగమ పవిత్రభూమి...  నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
త్రివేణి సంగమ పవిత్రభూమి...  నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి...  పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి

భారత మాతకు జేజేలు...  బంగరు భూమికి జేజేలు

చరణం: 2 
శాంతిదూతగా వెలసిన బాపూ... జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
విప్లవ వీరులు.. వీర మాతలు …విప్లవ వీరులు... వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు...  బంగరు భూమికి జేజేలు

చరణం: 3
సహజీవనము సమభావనము...  సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా
సహజీవనము సమభావనము...  సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము...  లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి

భారత మాతకు జేజేలు...  బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు




పిల్లలము బడి పిల్లలము పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, బృందం
	
పల్లవి:
పిల్లలము బడి పిల్లలము...
పిల్లలము బడి పిల్లలము...
నడుములు కట్టి కలిశాము...పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము

చరణం: 1
పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి.. పలుగు పార ఎత్తినవి
పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి
ఓనమాలను దిద్దిన వేళ్ళు...ఒకటై మట్టిని కలిపినవి
ఒకటై మట్టిని కలిపినవి..

పిల్లలము బడి పిల్లలము

చరణం: 2
ప్రతి అణువు... మా భక్తికి గుర్తు
ప్రతి రాయి.. మా శక్తికి గుర్తు
ప్రతి అణువు... మా భక్తికి గుర్తు
ప్రతి రాయి.. మా శక్తికి గుర్తు

చేతులు కలిపి చెమటతో తడిపి..
చేతులు కలిపి చెమటతో తడిపి...
కోవెల కడదాం గురుదేవునికి
పిల్లలము..పిల్లలము... బడి పిల్లలము.. బడి పిల్లలము

చరణం: 3
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు..తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు..తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు

వెలుగును ఇచ్చే ఈ కిటికీలు ...పంతులు గారి చల్లని కళ్ళు...
వెలుగును ఇచ్చే ఈ కిటికీలు ...పంతులు గారి చల్లని కళ్ళు...

పిల్లలము..పిల్లలము... బడి పిల్లలము.. బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము...పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము..ల.లాలా..లా..లా.లా



నిన్న మొన్న పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 
    
చరణం: 1
పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు
నీ పైట కొంగు చాటున దోబూచులాడెను 

పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు
నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు 
    
చరణం: 2
పాల బుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందుతోటె వయసు జోరులు

చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు 
    
నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 

చరణం: 3
ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి
ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 
ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి
ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 

ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి
ఇపుడేవేవో...
ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 
ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి
ఇపుడేవేవో...
ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 





ఓ లమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల బృందం

ఏవని ఏవని చెప్పను ఏవని ఏవని చెప్పను ఓ లమ్మో వాడు ఎన్నెన్ని



మీ నగుమోము నా కనులారా పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

పల్లవి:
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం: 1
ఉపచారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో
ఉపచారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో
ఒడుదుడుకులలో తోడై ఉంటిని .. మీ అడుగున అడుగై నడిచితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం: 2
రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...రెక్కలు అలిసి మీరున్నారు
రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి..
పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం: 3
ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని
ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని
ప్రతి జన్మ మీ సన్నిధిలోనా... ప్రమిదగ వెలిగే వరమడిగితిని

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు





ఓరోరి పిల్లగాడా పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా నీ ఉరకలు ఊపులు	





ఎడబాటెరుగని పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి:
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు .. గూడు విడిచి వేరైనారు...
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

చరణం: 1
జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు
జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు
ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు.. ఎలా భరించేరు...

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

చరణం: 2
ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు
ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు
ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు .. ఆ తలిదండ్రుల పంచారు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు




రాక రాక వచ్చావు పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆరుద్ర	
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

రాక రాక వచ్చావు రంభలాగ ఉన్నావు




బూచాడమ్మా బూచాడు పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల, బృందం

పల్లవి:
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

చరణం: 1
గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. హెల్లో అని మొదలెడతాడూ...
గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. హెల్లో అని మొదలెడతాడూ...
ఎక్కడ వున్న ఎవ్వరినైనా.. ఎక్కడ వున్న ఎవ్వరినైనా..
పలుకరించి కలుపుతాడు...

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

చరణం: 2
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేధాలెరుగని వాడూ
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేధాలెరుగని వాడూ
కులము మతము జాతేదైనా... కులము మతము జాతేదైనా ..
గుండెలు గొంతులు ఒకటంటాడు

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

చరణం: 3
డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు..
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు..
ఒకే తీగ పై నడిపిస్తాడు... ఒకే ప్రపంచం అనిపిస్తాడు...

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...



Palli Balakrishna Tuesday, July 12, 2022
Attalu Kodallu (1971)



చిత్రం: అత్తలు కోడళ్లు (1971)
సంగీతం: కె,వి,మహదేవన్
నటీనటులు: కృష్ణ, వాణిశ్రీ, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాతలు: కె.సుబ్బి రెడ్డి, యన్.సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి
విడుదల తేది: 14.04.1971



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



పాలపిట్ట పాలపిట్ట పాట సాహిత్యం

 
చిత్రం: అత్తలు కోడళ్లు (1971)
సంగీతం: కె,వి,మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పాలపిట్ట పాలపిట్ట	



చీరకు రవికందము పాట సాహిత్యం

 
చిత్రం: అత్తలు కోడళ్లు (1971)
సంగీతం: కె,వి,మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
	
చీరకు రవికందము	



ఈ వీణ పలికించు పాట సాహిత్యం

 
చిత్రం: అత్తలు కోడళ్లు (1971)
సంగీతం: కె,వి,మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఈ వీణ పలికించు	




అమ్మమ్మో అత్తమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: అత్తలు కోడళ్లు (1971)
సంగీతం: కె,వి,మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

అమ్మమ్మో అత్తమ్మో	



బలే బలే బావయ్య పాట సాహిత్యం

 
చిత్రం: అత్తలు కోడళ్లు (1971)
సంగీతం: కె,వి,మహదేవన్
సాహిత్యం: అప్పలాచార్య
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

బలే బలే బావయ్య	



చుక్కల్లో చంద్రుడు పాట సాహిత్యం

 
చిత్రం: అత్తలు కోడళ్లు (1971)
సంగీతం: కె,వి,మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

చుక్కల్లో చంద్రుడు	


Palli Balakrishna
Bharya Biddalu (1972)



చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్  
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు,  జయలలిత,  బేబీ శ్రీదేవి
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఏ.వి.సుబ్బారావు 
విడుదల తేది: 15.01.1972



శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమాలు
1. భార్యా బిడ్డలు  (1972)
2. భక్త తుకారాం (1973)
3. మరపురాని మనిషి  (1973) 



Songs List:



ఆకులు పొకలు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి 

ఆకులు పొకలు 



భలే భలే నచ్చారు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల 

భలే భలే నచ్చారు 




చల్ మోహనరంగా పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల 

చల్ మోహనరంగా 




అందమైన తీగకు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

అందమైన తీగకు
పందిరుంటె చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా
అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి
తప్పటడుగులె ముందు ముందు నడకలౌతాయి
ఆశ ఉంటే మోడుకూడా చిగురు వేస్తుంది
అందమున కానందమపుడే తోడువస్తుంది
అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

పాదులోని తీగవంటిది పడుచు చిన్నది
పరువమొస్తే చిగురు వేసి వగలుబోతుంది
మొగ్గ తొడిగీ మురిసిపోతూ సిగ్గు పడుతుందీ
తగ్గ జతకై కళ్లతోటే వెతుకుతుంటుంది
అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

కళ్లు కళ్లు కలిసినపుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి
అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది
అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా




చక్కనయ్యా చందమామా పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల 

చక్కనయ్యా చందమామా



బ్రతుకు పూలబాట కాదు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

లేని బాట వెతుకుతున్న పేద వానికి
రాని పాట పాడుకున్న పిచ్చివానికి

బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు

దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో
దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో
కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు
అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు

మాటలలో చిక్కుబడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతి గుండె బాధతో నిండినది ఆ ఆ ఆ
ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు

చీకటిలో వెలుగును చూడ నేర్చుకో చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో
చీకటిలో వెలుగును చూడ నేర్చుకో చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో
విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే
పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే
ఆ రోజు వచ్చులే
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు





చక్కనయ్యా చందమామా పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ గొల్లుమన్నాము
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ వెతుకుతున్నామూ
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో
రాలేకవున్నావో
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ





వలచీనానమ్మ హమ్మా హమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా హమ్మా
వలచీనానమ్మ వలచినానని తెలిసికూడా నే పలకరించినా పలకడమ్మా
వలచీనానమ్మ వలచీనానమ్మ
హేయ్ వలచీనావమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
వలచీనావమ్మా
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా వలచీనావమ్మా

కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి
కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి
కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి
కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కళ్ళు కలిపితే ఊరకపోదు కలతేరేగేను
వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా హమ్మా
వలచీనానమ్మ
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా వలచీనావమ్మా

వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు
వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు
సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
వయసే ఒంటికి చెరుపౌతుంది వదలి ఊరుకుంటే
వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా
వలచీనానమ్మ
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా వలచీనావమ్మా
ఓఓఓ హోఓఓ ఓఓఓ హోఓఓ


Palli Balakrishna Friday, July 8, 2022
Agni Pareeksha (1970)



చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల, బేబీ శ్రీదేవి
దర్శకత్వం: కె. వరప్రసాద రావు
నిర్మాత: జి. ఆదిశేషగిరరావు
విడుదల తేది: 10.07.1970



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



కలవారి వినోదాలు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: దాశరథి
గానం: సుశీల

సాకీ:
ఆడదాన్ని ఆటబొమ్మ అనుకుంటారు
అడిగినంత ధనం పోసి కొనగలమనుకుంటారు
మగువ కూడా మనిషన్నది మరిచే పోతారు

పలవి: 
కలవారి వినోదాలు
మగవారి విలాసాల
కలకాలం బానిసగా
ఈ ఆడది బ్రతకాలా

||కలవారి||

చరణం: 1
సొగసులున్న మనిషి మీకు కావాలి
ఆ మనిషిలోని మన సెవరికి కావాలి
ప్రతివాడికి తన సుఖమే కావాలి
ఎదుటివారి బాధ ఎవరికి కావాలి

వెలకట్టి మీరు ఆడదాన్ని వెలయాలు చేసినారు
మా జీవితాల మల్లెలన్ని మీ కాలరాచినారు
ఈ దీనురాలి కన్నీరే మీ పన్నీరాయె 

||కలవారి॥

చరణం: 2
అన్నారని సీతమ్మకు అగ్నిపరిక్షా
ఆ నాటికి ఈ నాటికి ఆడదానికేనా శిక్షా
మారలేదా... మారబోదా...
ఏనాటికి.... ఈ తీరు....
ఆడదాని అందం దోచి
అణచి వేసే వారే అంతా
వాడిపోయిన గులాబిలాగే
పారవేయుట మీకొక వింత
లోకమంతా ఇంతేలే..




నాలోన నిన్ను చూసుకో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల

నాలోన నిన్ను చూసుకో
నీలోన నన్ను నిలుపుకో
నిండారు ప్రేమ సీమలో
నీవూ - నేనూ - ఒక టేలే

॥ నాలోను ||

ఎన్నో ఎన్నో యుగాలుగా నిన్నె కదా తలంచాను
నిన్నే సదా వరించాను
నమ్మినా మానినా నా మదీ నీదిలే
జగాలు ఎన్ని మారినా
జతగా మనమే నిలుతములే

॥ నాలోను||

కోరికలే పూచిన పూలు
అవే మన తలంబ్రాలు - అవే అవే వసంతాలు
అవే అవే వరాలోయ్
ఏడనీ కలయిక వాడని మాలకి

సరాగ స్వప్న జగతిలో
కలిసి మెలసీ కరిగెదమా

|| నాలోన||




ఇదా మీ సభ్యత పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల

పల్లవి:
ఇదా మీ సభ్యత
ఇదా మీ నాగరికత
ఇదేనా సంస్కృతి
ఈ తరగని పరుగుల జోరేనా ప్రగతి !

చరణం: 1
పతితులకే సమాదరణా
సవిత్రులకే నిరాదరణా
పతివ్రత లెవరో కానరా
అపనిందలు వేయుట మానరా
అనురాగమె - అభిమానమె
కరువైన జగాన విషాదపు గాథలు కాక
సుఖము కలదా !

చరణం: 2
నాయకులే వినాయకులా
వినాయకులే విధాయకులా
అసత్యమె రాజ్యం చేసెనా
అధర్మమే చిందులు వేసెనా
రహదారిలో పెడదారులా
పెనుచీకటి చాటున సాగే మోసపు తీరు

చరణం: 3 
కృత్రిమమే ప్రశస్తమని
కుతంత్రములే స్వతంత్రమనీ
విచ్చల విడియే నీతిగా
పిచ్చెక్కిన కోతుల రీతిగా
పొరపాటులే అలవాటుగా
తిరుగాడు షరాబుల పోజులు మారే
రోజు రాకపోయే





కొండపై నిండుగా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

పల్లవి:
కొండపై నిండుగా కొలువున్న మా తల్లి
కనక దుర్గా నీకు జేజేలు లోక
జనని శాంభవి నీకు దండాలు

|| కొండపై ||

చరణం: 1
భూలోకమందు మా పూజలందుకొనంగ
దుర్గవే- యిటకు దిగివచ్చావు
కనక దురవై యిక్కడే నిలచావు
కాళివైనా మహంకాళి వైనా నీవె
బహురూపముల మమ్ము  బ్రోచు అంబవు నీవే

చరణం: 2
శాంతమ్ము తో నీవు ప్రత్యక్షమైతేను
చిరునవ్వు వెన్నెలలు కురిసేను
కరుణా రసము వెల్లి విరిసేను
ఉగ్రమ్ముతో నీవు ఉరిమి చూచావంటే
గప్పు గప్పున నిప్పులురికేను
గుప్పు గుప్పున మంటలేగ సేను
దుర్గా కనకదుర్గా కనకదుర్గా




ఎలాగనీ ఎలాగనీ పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: సుశీల

పల్లవి: 
ఎలాగనీ ఎలాగనీ
నిండిన మనసందాకా
నిలచుండలేక పాడాలనీ
ఎలాగనీ ఎలాగనీ

||ఎలాగనీ||

చరణం: 1
వాకిటి తలుపిక వేయను
ఈ కన్నులు మూయనె మూయను
తొందర తొందరలైతే
ఆనందమె సాగర మైతే
కనువిందుగా నా ముందర
కనుపించేదాకా ఎలాగనీ

చరణం: 2
దాచిన అశ్రుల జల్లులలో
తడిసిన చూపుల మల్లెలతో
దాగని నవ్వుల దివ్వెలతో
స్వాగతమిచ్చే తొందరలో
చిరుగాలిలో విరుతీగలా
ఓడలూగిపోతే ఎలాగని

చరణం: 3
ఆ అడుగుల సడి నా కొరకే
ఆ నడకల వడి నా కొరకే
దవు దవ్వులనే వినిపించగా
రివ్వు రివ్వుననే నెదు రేగగ
తన కౌగిట నను చేరిచి
దయ చూపేదాకా ఎలాగనీ

||ఎలాగు||

Palli Balakrishna Saturday, December 18, 2021
Ma Nanna Nirdhoshi (1970)



చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, బేబి శ్రీదేవి 
దర్శకత్వం: కె. వి. నందనరావు
నిర్మాతలు: ఎస్. వి. ఎన్ రావు అండ్ బ్రదర్స్
విడుదల తేది: 30.01.1970



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)




Songs List:



నను భవదీయదాసుని పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, యస్.జానకి 

నను భవదీయదాసుని మనంబున తియ్యని కిన్కబూని 
తన్నిన అదినాకు మన్న నయ నీ మృదు పాదములెంత నొచ్చెనో
యను తలపే కలంచు హృదయంబును నమ్ముము
బెంగుళూరు నిన్గొని చనువాడ రేపకడ
కోపము మానుము కోమలాంగిరో

హుఁ  చాలు, చాలు.
ఇకనీ గీచిన గీటు దాటనని ఎన్నోమార్లు ఏ మార్చి
ఇచ్చకముల్ పల్కుచు ప్లేట్లు మార్చీ మార్చీ
కడకీ చందాన నాకాళ్ళపై మొకమున్ వంచి నటించు
నక్క వినయమ్ముల్ చాలులే పంచకా॥

మీరజాలగలనా నీ ఆనతి
మీరజాలగలనా! ఓ లలనా
మీరజాలగలనా ॥

ముత్యాల హారం తెస్తానని
మూడు నెలలు మురిపించావు
రవ్వల వాచీ ఇస్తానని
రాత్రు లెన్నొ కరిగించావు
ఖాళీజేబుతో! పై పై డాబుతో కడకు
కాళ్ళ బేరాని కొచ్చావు నా కాళ్ళ బేరాని కొచ్చావు
ఛీ అంటె దండం పెట్టావు
ఉన్న సిగ్గుకు సున్నాచుట్టావు
నిన్ను నమ్మ గలనాః ఈ జన్మకు
నిన్ను నమ్మ గలనా! ఓ మదనా
నిన్ను నమ్మ గలనా |

ఒక్కొక్క నవ్వుకు ఒక్కొక్క వంద
మక్కువతో అర్పించానే 
ఒక్కొక్క కులుకుకు ఒక్కొక్క వెయ్యి
లెక్కలేక చెల్లించానే 
లక్కు మారితే  నాటిక్కు పారితే
ఓ లైలా ! లక్షలపై నడిపిస్తానే

నిను యక్ష కన్య నే చేస్తానే !
అటు కాశ్మీరు తీసుక వెళతానే
ఇటు కన్యాకుమారి చూపిస్తానే ॥




ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.జానకి 

ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్
అన్నయ్యా ఏప్రిల్ ఫూల్: రాధమ్మ ఏప్రిల్ ఫూల్
అమ్మ దొంగ చెమ్మ చెక్క ఆట కట్టింది
అమ్మాయి రంగు అబ్బాయి హంగు అంతా తెలిసిందీ 
ఆ కొస చూపు ఆ జడ ఊపు
అంతా హుళక్కి లేవమ్మా 
ఈ పూట నువు రాధమ్మ
రేపో మాపో వదినమ్మ
మీ మూగ గుండెల్లోన దాగియున్నపాట
ఆపలేక నా నోట అంటే పొరపాటా  ॥అమ్మ॥

ఈడూ జోడూ కుదిరెను చూడు
ఎందుకు బిడియం చిలకమ్మా
ముద్దు మురిపెం తీరే తరుణం
ముందున్నదిలే ఓ టొమ్మా
తుళ్ళిపడకు అన్నయ్యా పెళ్ళి జరుగుతుంది
చురుకు కళ్ళ వదినమ్మ శిరసు వంచుతుంది ॥అమ్మ॥



ఏమండి అబ్బాయిగారు పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఏమండి అబ్బాయిగారు
ఏమండి అబ్బాయిగారు ఎలా వున్నారు
ఎలా వున్నారు

కలత నిదురాయె కనులు బరువాయె 
మేను సగమాయె  తేనె వెగటాయె
ఏముంది అమ్మాయిగారు
ఇలా వున్నాము ఇలా వున్నాము

కన్నియ రూపం దాచాలనీ
నీ కనులు బరువాయె నేమో
నేను సగమె నిండాలనీ
నీ మేను సగమాయె నేమో
నీ మేను సగమాయె నేమో

రేయి పగలాయె । లేని దిగులాయె
మనసు ఓ యమ్మో మాట వినదాయె

చెలియ కౌగిట చేరాలనీ
కలవరించింది నీ మనసు
దోర సొగసును దోచాలనీ
దారి కాచింది నీ వయసు
దారి కాచింది నీ వయసు





అలకలు తీరిన కన్నులు పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల సల్లవి పాడెను ప్రియా
కదలే పూలగాలి నా యెదపై తేలి తేలి
ఏ కధలో తెలుపసాగె ఏ కలలో పలుకసాగె 
ఆ తీయని గాధల రాడవు నీవే ప్రియా
నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా
మదిలో రాగమాల నవ మధువే పొంగువేళ
నా తనువే పల్లవించె అణు వణువే పరవశించే
ఆ గానములో నను లీనము కానీ ప్రియా
నీ ప్రాణములో ఒక ప్రాణము కానీ ప్రియా
అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా॥




నింగి అంచుల వీడి। పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

నింగి అంచుల వీడి। నేలపై నడయాడి।
నన్ను వలచిన తారకా నీకు నే నందింతు ఏ కానుకా?

ఏ కళంకము తేని ఏ కళలు కోల్పోని।
మనసైన ఓ చంద్రమా నీ నిండు మమతయే ఆ కానుక 
నా అంగణమ్మునే నందన వనమ్ముగా
తీర్చి దిద్దిన పారిజాతమా
నీ ఋణము తీరిపోనిది సుమా ప్రియతమా
నీ వలపు తోటలో నే గరిక పువ్వునై
నిలిచితిని అదియే పదివేలు 
తురువినికించు నవ పరిమళాలు



నిషాలో నువ్వూ నిషాలో నేనూ పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.జానకి 

నిషాలో నువ్వూ  నిషాలో నేనూ
ఉసిగొలిపే వలపే నీది నీది నీది
కసిరేపే చూపే నాది నాది నాది 

హొయ్ ఝుంతారా  ఝుంతారా ఝుంతారా
హొయ్ ఝుంతారా  ఝుంతారా ఝుంతారా  ॥ నిషాలో॥

అన్నీ వెన్నెల రాత్రులు నాకన్నులే మధు పాత్రలూ
కాదంటావా - కైపు రాదంటావా 
కళ్ళల్లో కళ్ళుంచి చూసుకో
కావలసినంత తీసుకో - తీసుకో  ॥ నిషాలో॥

గులాబీ రేకుల పెదవులూ నువు కోరితే ఇంద్ర పదవులు
కాదంటావా - కోరిక లేదంటావా
ముని వేళ్ళతో తాకి చూసుకో
మనసైన తేనియలు తీసుకో – తీసుకో  ॥ నిషాలో॥




ఓ చిన్నా నీకన్న పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: రమణ, పి.సుశీల 

ఓ చిన్నా నీకన్న నా పెన్నిధి ఎవరు
నీపాల నవ్వులు నెలవంకల నేలు

మీనాన్నను చూశావుగదరా 
వారన్నది విన్నావు గదరా
ఏ పాపం ఎరుగని వారనీ
ఆ పరమాత్మునికే తెలుసునురా
పసిపాపవు నీకెలా తెలిసేనురా

గోరంత దీపం కొండలకు వెలుగు
మా చిన్ని పాపాయి మా యింటి వెలుగు
మా బాబు వేసిన ఒక్కొక్క అడుగు
నా మోడు బ్రతుకున ఒక్కొక్క చిగురు

జయ జయ వెంకట రమణా
జయ జయ పావన చరణా 
మమ్ము కాపాడ రావయ్యా
మా నమ్మిన దైవము నీవే నయా




చిన్నారి పాపలారా పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, యస్.జానకి 

చిన్నారి పాపలారా పొన్నారి బాలలారా
విన్నారా  దేవుని లీలలు కనుగొన్నారా
ఏడీ ? కనపడేం?
గాలి వీచెను ఏదీ కనిపించెనా?
పూలవాసన ఏదీ కనిపించెనా?
ఊఁ... హు
అట్టివాడే దేవుడు జగమంత తానై ఉన్నాడు 
నిండుమనసున పిలువగా మన అండ నిలిచే నన్నాడు
పిలిచారా ఎవరైన పలికాడా ఎవరికైనా?
ఓ ఆ కధ చెబుతా వింటారా ఊఁ కొడుతూ ఉంటారా?
ఊఁ ఊఁ

అనగనగా ఒక ఊళ్ళో ఒక అనాధ బాలుడు ఉన్నాడు
ఒక కోడె దూడ తన తోడు నీడగా
బ్రతుకు గడుపు తున్నాడు తన వెతలు మరచియున్నాడు
ఊఁ తర్వాత?
ఓ..ఓ..ఓ....
ఛల్ ఛల్ ఛల్ ఛల్ ఛల్ ఛల్ చలాకి నడకల గిత్తా
ఘల్ ఘల్ ఘర్ ఘల్ ఘల్ ఘల్ గలగల గంటల గిత్తా
బంగారు కొండవురా నా బరువులు మోసేవురా
వరహాల దండవురా నా పరువే నిలిపేవురా
పస్తున్నా పండగ ఉన్నా పాలుపంచుకున్నావురా
మ్యావ్ .... మ్యావ్ ....
రండీ చిన్నమ్మగారు మాయింటికి రండీ చిట్టెమ్మగారూ
దయతో కూర్చోండి బుల్లెమ్మగారూ!
పూరి గుడిసె మాది। బంగారు మేడకాదు.
చిరుచా పేగానీ ఒక కురిచీయైనాలేదు
రండీ చిన్నమ్మగారు మాయింటికి రండీ చిట్టెమ్మగారు

సరదాగ వచ్చానులే చినవాడా
సన్మానం ఏ మొద్దులే వేరే సత్కారం అసలొద్దులే
చెలిమినాకు కావాలి కలిమితో పనిలేదు
అచ్ఛమైన మనసుంటే హెచ్చు తగ్గులు లేవు

ఏ మంటావ్ ఏ మంటావ్ కోడె దూడ
ఔనంట ఔనంట పిల్లి కూన
అంబా అంబా కోడె దూడ
మ్యావ్ మ్యావ్ పిల్లి కూన
అంబా అంబా కోడె దూడ
మ్యావ్ మ్యావ్ పిల్లి కూన

 భౌ భౌ - భౌ భౌ

ఛ ఛ ఛ ఛ కుర్రవాడ
ఛీఛీఛీఛీ కోడె దూడ
పెద్దింటి పిల్లి కూనకు దొరజాతి కుక్క పిల్లకు
కుదురుతుంది జోడి। కాదంటే డీ ...డీ ....డీ ....

అయ్యయ్యో..... ఓ నేస్తం 
ఏమిటి.... ఏమిటి .... విపరీతం
నీ కంట నెతుకునే చూడలేను
నీ కన్ను రానిదే బ్రతుకలేను

ఏడవకు.... ఏడవకు....నా పిల్లి కూనకు
జబ్బుచేస్తే నయం చేశాడు మన వేణుగోపాలుడు....
నీ దూడను తీసుకెళ్ళి ఓ దేవా.... అని పిలిస్తే
కాపాడుతాడు ఆబాల గోపాలుడు

ఫో పొమ్ము బాలకా లే లెమ్ము డింభకా
పరమాత్ముని దరిసనమ్ము బోడిగిత్త దూడకా
ఫో ఫో పో

రాజు వెడలె రవితేజములలకగ
రాజు వెడలె రవితేజములలరగ 
కుడి యెడమల డాల్ కత్తుల మెరయగ
కత్తులు మెరయగ
అడుగడుగున పూల్ గుత్తులు కురియగ
గుత్తులు కురియగ
రాజు వెడలె - వెడలే
చి తగించుమో ఏలికా 

ఆయ్ చెప్పర చెప్పరబాలకా
ఒక తుంటరి నా కోడెదూడను। కంటిలోన పొడిచాడు
దేవునితో చెప్పుకుందా మంటే పూజారి పొమ్మని అరిచాడు
మూరెడు మీసాల - చారెడు గడ్డాల
మునులకే కనిపించని జియ్య
జానెడు కుర్రడు కుయ్యో అంటే
కనిపిస్తాడా పోరా కుయ్య 

కృష్ణయ్య
ఎక్కడున్నా వయ్య కృషయ్యా
మాకు దిక్కు ఇంకెవరయ్య కన్నయ్యా
నిన్ను నమ్మిన వారికే ఇన్ని ఆపద లేలనయ్యా
నిను కొలువగా నే పిలువగా
ఈ తలుపు లెందుకు తీయవయ్యా....
తీయవయ్యా కృషయ్యా ...

కనిపించావా కృష్ణయ్యా....
కనువెలుగై నా అనుగు తమ్ముని
కరుణించావా। కన్నయ్యా - కృష్ణయ్యా ... కృష్ణయ్యా....
గోపాల బాల కృష్ణయ్యా.....
కృష్ణయ్యా - మాపాలి బాల కృష్ణయ్యా.....
కృష్ణయ్యా..... కృష్ణయ్యా....





ఎంతెంత దూరం పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, యస్.జానకి 

ఎంతెంత దూరం ఇంకెంత దూరం 
కధలు చెప్పుతు పోతూఉంటే కాసింతదూరం 
రివ్వున ఎగిరే గువ్వల గుంపులు 
ఎక్కడి కెళుతున్నాయి అవి ఎక్కడి కెళుతున్నాయి
కూతకురాని పిల్లల కోసం మేతకు వెళుతున్నాయి
మేతకు వెళుతున్నాయి

చల్లగ సాగే  తెల్లని మబ్బులు 
ఎక్కడి కెళుతున్నాయి అవి ఎక్కడికెళుకున్నాయి 
నోళ్ళు విచ్చిన బీళ్ళకోసం నీళ్ళకు వెళుతున్నాయి
నీళ్ళకు వెళుతున్నాయి.

చక్కని బావా నువ్వు నేనూ
ఎక్కడి కెళుతున్నాము....మన మెక్కడి కెళుతున్నాము
పామును పట్టీ  బుట్టలో పెట్టి
పండిన పాపం బ్రద్దలు కొట్టి
మా నాన్నను విడిపించాలనీ ఇద్దరము వెళుతున్నాము
మన మిద్దరము వెళుతున్నాం
ఎంతెంత దూరం ఇంకెంత దూరం 
కధలు చెప్పుతూ పోతూ ఉంటే కాసింత దూరం




మడుగుకుజుని కాలేయుని (పద్యం) సాహిత్యం

 
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, యస్.జానకి 

మడుగుకుజుని కాలేయుని 


Palli Balakrishna Friday, December 17, 2021
Vidhi Vilasam (1970)



చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: నార్ల చిరంజీవి, అప్పలా చార్య, కొనకళ్ల వెంకటరత్నం, బి. వి. నరసింహారావు
గానం: మోహన్ రాజు, చిత్తరంజన్, విజయలక్ష్మీ శర్మ, రామలక్ష్మి, పుష్పలతా శ్యామ్యూల్
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల, బేబీ శ్రీదేవి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాత: సి. వి. ఆర్.ప్రసాద్
విడుదల తేది: 12.03.1970



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



విధి విలాసమేలే పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: కె.బి. కె.మోహన్ రాజా 

విధి విలాసమేలే 
అంతా విధి విలాసమేన
అది బలీయమేలే
దాని వేగమాగదులే

భయము ఎందుకు? - భయము ఎందుకు?
నడువు ముందుకు
కాలానికి హృదయం లేదు - కన్నీటికి విలువేలేదు! 
జరిగేదేదో జరగకపోదు- జగతిని నడిపే దెవంకలదు!! 
మనసుండటమే మనిషికి శిక్ష - అది వుండటమే నీతికి రక్ష 
చనిపోదామని నీవనుకున్నా - చావుకు నీపై దయయే రాదు 
మనసుండటమే మనిషికి శిక్ష - అది వుండటమే నీతికి రక్ష !! 



వల్లరి బాబోయ్ కావురోరయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: చిత్తరంజన్, రామలక్ష్మి

వల్లారి బాబోయ్ కావురోరయ్యా ! - జరుగు జరుగుమన్నా! 
నే జరగలేనన్నా ! - కొండకి పోవాల! పువ్వులు తేవాల!
నంది వాహనా గజాననా -మూషిక వాహన గజాననా
భాయీ భాయీ గజాననా! పార్వతి నందన గజాననా! 
మాపిటేలకీ సరాసరీ ! - తోపు సేలకీ వత్తావా ! హై! 
కంచె సాటునా కూకోనీ - మంచి చెడ్డా ఇంటావా? అహ 
కూకోమంటే ఎట్టయ్యో - కూడు కూరా నండద్దా (మరి) 
అయ్యో రామ ఏందయ్యో - ఆనకమళ్ళా రావయ్యో ! 
అయ్యో రామ -- అమ్మా కామాక్షమ్మ తిరుణాళ్లంటా ఆ.. ఆ.. 
ఎగువ యాదగిరి దిగువ జొన్నవాడ - మా ఇంటో అందరు ఎల్తారంటా 
ఒంటిగ నన్నే వుంచేరంటా!
అయితే ఇంకేం! అయిసరబజ్జా !
అదును దొరికింది అడ్డు సెప్పకా - ఆయారకి నేనాడికి వస్తా!!




ముసురేసిందంటే పైన పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: చిత్తూరు వి. నాగయ్య 

మునుచేసిందంటే పైన - అసలే మతిపోతది పిల్లా ! 
ససి చెడినటుంటది లోలోన - ఓ చక్కని చుక్కా ! 
ససి చెడినటుంటది లోలోన -
ముసురేసిందంటే పైన అసలే మతి పోతది మావా ! 
ససి చెడినట్లుంటది లోలోన ఓ ముద్దుల మావా !
పసి చెడినట్లుంటది లోలోన

మబ్బుతెరల మసకలలోన మంచుపొగల మెలికలలోన 
మనసేటో సిక్కడినట్లే - మనేద కుదిపేస్తది లోని
పసుపాడిన పెరులె నడుమా - పడగెత్తిన సన్ననితోవ 
నువు మసిలే చెలకలవంకే - నురగలు కక్కే నది యేమో
కోవెల చిరుగంటలు చెవిలో- కావాలని కత కలిపించీ, 
మన యిద్దరినీ మురిపిస్తె మరులు గొలిపి తెగబులిపిస్తె
ఏటి మలుపులో ధనసలే - తోట వొడలు విరిచిన వేళ
ఆ నాటి మన పరాసికాలు నవ్వుతాళె అంటది మెరుపు





ఆగవోయి ఒకసారి పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొనకళ్ల వెంకటరత్నం
గానం: కె.బి. కె.మోహన్ రాజా, విజయలక్ష్మీ శర్మ

ఆగవోయి ఒకసారీ - వెళ్ళిపోకు వేసారీ
కనిపించినదే నిజమనుకుంటే - విధి శాపానికి బలియౌతావు
విధి విలాస మేలే—అంతా విధి విలాస మేలే
అది బలీయమేలే-దాని వేగ మాగదులే
తిరిగి చూడవోయి వెను తిరిగి చూడవోయీ
నీ వెనుకే నీ నీడ వున్నదోయీ
సీతారాములు విడిపోలేదా ?
విధి ఎవరిని విడిచినదోయీ -
నలుడే దాస్యము చేసెను కాదా? 
అది చెప్పిన కధలెన్నో వున్నాయి.
నొసటిరాతలు సరిగావుంటే - 
మనసు కోతలు మనుషులకుండవు 
కాలం ఎదురై నిలిచిందంటే కల్లే నిజమె కనబడుతుంది.




కృష్ణా కృష్ణా నా రాధ ఇలా పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: కె.బి. కె.మోహన్ రాజా, విజయలక్ష్మీ శర్మ

కృష్ణా! కృష్ణా! కృష్ణా! 
నా రాత ఇలా, నలుగురిలో - సవ్వల పాలేనా? 
కలత లేని వలపులో మెలకువు గొరిగినవాడు
కానరాడు.నా పై, తన కలలనిన నడు
లోకానికి వింత నాలోగల వలపంతాం
ఏక దాగినావో అని ఎకెడ వెదకుదు నేను. 
ఎచట దాచితివే దొరవని - ఎల్లరు నన్నడిగేరు 
ఏడ కెగినావో మరి - ఏడ కెగినావో !
సరససున్న వేళ నా దౌర, నేనొకటని పొగరు
జాడ తెలియదాయె ఇక రాడని ఒక టే జెదుగు - ఏక మనసు కోత
ఒక ఏటికి ఎదురీత! కృష్ణా! కృష్ణా!!




బరువైనది రేయి పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: 
గానం: చిత్తూరు వి.నాగయ్య 

బరువైనదీ రేయీ కరువైనదీ హాయీ
కనుమూయలేను శిలనైన కాను!! 
విను వీధి నేలే రాజా ! నా రాజు ఏడీ ? 
కనిపించితే నా గాధా వినుపించుతావా ?
వివరించు బాల గమనించలేవా

ఏమేమో ఊహాగానం చేశాను నాలో
నా పాట ముగి సేలోగా-చెయిజారే వీణ
వీణ తునక  ఒకటే
నే దాచుకున్నా

మనలేని మమకారంతో వెదికాను లోకం
ఎటు పోయినావో ఏమో - మిగిలింది శోకం!
మిగిలింది శోకం! - బ్రతికాను
నా బాబు కోసం





అయ్యయ్యో వంటరిదాన్ని రా పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: 
గానం: విజయలక్ష్మీ శర్మ

అయ్యయో వొంటరిదానర ఓ మావో
రారా వోఁ మావో
జంటగా వొస్తివ మంచిది 
అత్తకొడుకు ఊరెళ్ళాడు
ఆరు నెలలదాకా రాడు
ముసలత్తకు రేజీకటిరో
అబ్బబ్బ - ఈ వెన్నెల రేయి అయ్యయో
మత్తు మత్తుగా కళ్ళున్నాయి 
గమ్మత్తులు చేస్తున్నాయి. 
పూసిన గంధం ఆరింది. 
వేసిన పూవులు వాడాయి. 
వెన్నెల వేడిగా మారింది. 
యౌవన రుచి చూపిస్తా 
అరచేతికి స్వర్గం తెస్తా 
కోరినదంతా ఇస్తారో 
గుండె గుండె రగిలిస్తాను
తోడులేక ఎద కాలింది.





గాంధీ కి పెద్ద గుడి కడదాం పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: 
గానం: చిత్తరంజన్

గాంధీకి పెద్దగుడి కడతాం కడతాం 
కాన్కలూ చందాలు పడతాం పడతాం. 
ప్రజల కె మేము పుడతాం గిడతాం 
బహు తెల్ల టోపీలు పెడతాం పెడతాం 
శ్రీ గాంధీ నామాలు మరువాం మరువాం 
చందాలు ఇవ్వంది వదలాం కదలాం 
సిమెంటు బదులుగ బూడిద కలిపాం
కట్టకముందే, ఇంతెన కూలింది 
ఆ వంతెన కూలిందీ.
లంచాలిచ్చీ మంచాల్ వాల్చీ

లక్షలు లక్షలు సంపాదించాం తెగ సంపాదించాం 
ఎగుమతి దిగుమతి ఎక్స్పర్ట్ లమని
కలితీ పండిట్' బిరుదంయిచ్చారు.
దొడ్డ బిరుదంపట్టాము.

ఉడతా భక్తిగ మిము సేవింపగా 
ఉరుకున పరుగున పడి వొచ్చామండి 
జై కొట్టిమూర్ఖుల్ని రెచ్చ గొడుతుంటాము 
చందాల్ని కాజేసి మేడలను కడతాము 
లాడ్జీలు క్లబ్బులూ నడుపుతూ వుంటాము 
రౌడీల్ని గూండాల్ని మేపుతూవుంటాము 
దారి తప్పిన స్త్రీల బిజినెస్సు పెట్టాము 
దండిగా మొండిగా లక్షలార్జించాము 
మీ రక్తమును-ప్రజలారా

మీ రక్తమును మేము దానమిస్తుంటాము 
మిము గొల్వ వచ్చాము ఘన దేశ భక్తులం ! 
చిల్లర మంత్రికి చెల్లెలి కొడుకుని 
ఎస్సెల్సీలో ఏడేళ్లున్నా !
ఎమ్మెల్యేకొక ఆఫరు వుంది
లక్షల కట్నం బేరం వుంది! 
కాలక్షేపం కలిసొస్తుందని
ఈ విరాళాలు వేటకు వొచ్చా !
ఎప్పటికైనా మంత్రిని అవుతా
ఇప్పటినించే చందాలివ్వండి! 
భోంచేస్తుంటాను

ఎందుకయ్యా వొచ్చినావు? ఓ గాంధీ నీవు 
ఎవరి కొంపా కూల్చుతావు ఓ గాంధీ !! 
చచ్చి స్వర్గాన్నుండలేవా? ఓ గాంధీ మాకు 
చిచ్చు పెట్టగ వొచ్చినావా ఓ గాంధీ ! 
తాడి చెట్టంతగుడి తక్షణం కట్టించి 
నిలువెత్తు నీ బొమ్మ నీటుగా పెట్టించి 
రాళ్ళ రప్పల పైన రాయిస్తు నీ పేరు 
నిత్య నైవేద్యాలు నీకె పెట్టిస్తురా ! 
శాంతి శాంతంటాపు సత్యమంటావు 
హింస వొద్దంటావు ఎందుకొచ్చిన ఖర్మ ? 
మంత్రాలతో చింతకాయలి క ఠాలవు 
మా మాటవిని మనసు మార్చుకొని వెళ్ళిపో 
మా పొట్టపై దెబ్బ కొట్టొద్దు కొట్టొద్దు 
మా బ్రతుకు తెరువుల్ని పాడు చేయొద్దు 
వచ్చినా దోవనె మళ్లి తిరిగెళ్ళిపో 
వెళ్ళిపో ! వెళ్ళిపో ! వెళ్ళిపో ! వెళ్ళిపో !



ఆగండి దేశ ద్రోహులారా పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: 
గానం: 

ఆగండి! దేశద్రోహులారా! ఆగండి! 
బాపూజీ జిందాబాద్ ఇన్క్వి లాబ్ జిందాబాద్
చాలు చాలు మీ ఆగడాలు ఆపండి
మహాత్ముని మాటలు మరుచుట తగదండీ
భారత జాతికి జీవంపోసి- బానిస బ్రతుకులు బాపిన దైవం 
బాపూజీ మన బాపూజీ జిందాబాద్

మానవులందరు ఒక్కటస్ మంచిని మదిలో పెంచమనీ 
దేశంకోసం బ్రతకమనీ - బోధించెను మన బాపూజీ 
బాపూజీ మన బాపూజీ జిందాబాద్.
సోమరితనమును మానాలి - శాంతి అహింసలు స్థాపించాలి. 
ప్రగతి పథములో నడవాలి ప్రతిమనిషీ హాయిగా బ్రతకాలి 
అపుడే భారతభూమికి క్రాంతి- అపుడే గాంధీ ఆత్మకు శాంతీ
శాంతి, శాంతి, శాంతి.




మంచివాళ్ళు ఈ బాబులు పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: బి. వి. నరసింహారావు
గానం: విజయలక్ష్మీ శర్మ, పుష్పలతా శ్యామ్యూల్

మంచివాళ్ళు యీ బాబులు 
మా మంచి వాళ్ళు యీ అమ్మలు
రంగు రంగుల బుడగలు కొంటారూ.
పిల్లలకిచ్చీ మురిపిస్తారూ-చల్లగ మురిపిస్తారూ! 
ఇల పసి పాపలె పరమాత్మలన్నారు 
ఈ యింటికి బంగరు దీపాలన్నారు. 
పిన్నా పెద్దలు మెచ్చే బుడగలు 
వన్నె చిన్నెల వెన్నెల ముద్దలు లాలాలా

పాల బుగ్గల బాలలకిస్తే పకపక నవ్వులు కురిపిస్తారూ 
అల్లరిచేసే పిల్లల కిస్తే అల్లరి గిల్లరి జాన్తానై - లా లా లా 
కల్లాకపటం తెలియని పాపలు-అల్లీ బిల్లీ యని తిరిగేరూ 
కొట్టుకున్ననూ తిట్టుకున్ననూ ఇట్టే కలిసి ఒక కై పోతారు. లాలాలా
గుళ్లో దేవుడు గుడికే అందం ఊళ్లో పిల్లలు ఊరికే అందం 
అందంచందం తెలిసిన పెద్దలు అన్నీ మాపిల్లల కే యిస్తారు. 
పిల్లలకే యిస్తారు – లా లా లా




విధి విలాసమేలే పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: కె.బి. కె.మోహన్ రాజా 

విధి విలాస మేలే అంతా విధి విలాస మేలే
అది బలీయమేలే - దాని 'వేగ మాగదులే
అనుబంధానికి ఆవేదనకూ కనిపించని ఒక సంకెల వుంది 
ఆవేదన వలదనుకుంటె అనుబంధానికి అర్థం లేదు!
చీకటిలోనే వెలుగు పుట్టును - చింతనలోనే దొరుకును సుఖమూ 
ఆశ నిరాశల కలగలుపే ఈ మానవ జీవిత మోతుంది !!

Palli Balakrishna
Marapurani Manishi (1973)





చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: నాగేశ్వర రావు, మంజుల, చంద్రమోహన్, జయంతి, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: తాతినేని రామారావు 
నిర్మాత: యన్.యన్.భట్
విడుదల తేది: 23.11.1973



శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమాలు
1. భార్యా బిడ్డలు  (1972)
2. భక్త తుకారాం (1973)
3. మరపురాని మనిషి  (1973) 



Songs List:



వచ్చింది వచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

వచ్చింది వచ్చింది




ఓ రామయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఓ రామయ్యా 



ఎక్కడో లేడులే దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల

ఎక్కడో లేడులే దేవుడు 




ఎవడే ఈ పిలగాడు పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఎవడే ఈ పిలగాడు 



ఏం చెప్పను పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఏం చెప్పను 

Palli Balakrishna Friday, July 30, 2021

Most Recent

Default