Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jai Jawan (1970)
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, భారతి
దర్శకత్వం: డి. యోగానంద్
నిర్మాత: డి.మధుసూదనరావు
విడుదల తేది: 26.02.1970Songs List:వీరభారతీయ పౌరులారా ! పాట సాహిత్యం

 
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి.సుశీల & కోరస్ 

వీరభారతీయ పౌరులారా !
దేశమాత పిలుపు వినలేరా !
హిమాలయంలో మంటలు రేగి
ప్రమాద సమయం వచ్చింది
స్వతంత్ర భారత యోధులారా
సవాలేదుర్కొని కదలండి

అంతా స్నేహితులనుకున్నామ
అందరిమేలు ఆశించాము
పరులమంచిపై నమ్మకముంచి
పగటికలలలో జీవించాము

నేటికి కలిగెను కనువిప్పు
ముంచుకువచ్చెను పెనుముప్పు
వీరమాతలారా ! సుతులకు
చందనగంధం పూయండి 

వీరవనితలారా ! పతులకు
కుంకుమ తిలకం తీర్చండి 
నెతురుపొంగే యువకులారా
కతులుదూసి దూకండి
బానిసతనమున బ్రతికేకన్నా
చావేమేలని తలచండి

మనమంతా ఒక జాతి
సమైక్యమే మన నీతి
కులమేదె నా మతమేదె నా
వేషం భాష వేరే అయినా
జనమొకటే అని చాటండి 
ధర్మదీక్షయే మనకవచం
తప్పక మనదే ఘనవిజయం

భరతమాత పరువు నిల్పగా
భరతవీర ప్రతిన దాల్పరా
జయపతాక చేతబూనరా
సమరవిజయ శంఖ మూదరాపాలబుగ్గల చిన్నదాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, పి.సుశీల

పాలబుగ్గల చిన్నదాన్ని
పెళ్లిగాని కుర్రదాన్ని - రాజా

ఓరగంట చూడవదు
ఒంటిపై చెయ్యెయ్యవద్దు
తల్లి చాటు పిల్ల నయ్యా
అల్లరిపాలవుదునయ్యా

కోడెవయసు చిన్నవాణ్ణి
జోడుకోరి వున్నవాణ్ణి
చదువువుంది సరదావుంది
సంపాదించే ఛాన్సువుంది
తల్లి దండ్రీ కాదన్నా నిను
పెళ్ళియాడే దమ్ము వుంది

బావయ్యో - పోవయ్యో
చదువుకున్నా చేసేది ఏముంది?
గుమాస్తావైతే ఒరిగేది ఏముంది?
నీకువచ్చే నెల జీతాలు
సోకులాకే చాలవయ్యా

దొంగచాటు వ్యాపారం కనిపెట్టానే
టాక్సులేనిడబ్బుబాగ కూడబెట్టానే
నైలానుచీరలు, పౌడర్లు వాచీలు
బంగారు బిస్కెట్లు - బ్రాందీలు విస్కీలా

కొల్లకొల్లగ చేరవేస్తా 
చూడుపిల్లా నా తడాఖా 
పోవయ్యో - దేవయ్యో
సాగినప్పుడు జల్సాగవుంటది
దొరికిపోతే జైలే రమ్మంటది
దొంగబతుకు చాలునోయీ
తప్పుకోవోయ్ దగులుబాజీ

కల్లా కపటంలేని రైతుబిడ్డను
నా కష్టంతో దేశాన్ని బ్రతికిస్తాను
దేశానికి ప్రాణమిచ్చు వీరజవాన్నూ
భరతభూమి పరువునిల్పు శూరజవాన్నూ

జై జవాన్ జై కిసాన్ 
ఇద్దరిద్దరె మొనగాళ్ళుమీరు
మీరులేనిదె దేశమ్ము లేదు 
పసిడిపంటలు పండించెదవు నీవు
మన స్వతంత్రము నిలబెట్టెదవు నీవు
జాతికెల్లా అన్నదాతవు నీవు
మాతృభూమికి ప్రాణదాతవు నీవు 
వీరపుత్రుని వరింతునయ్యా
వీరపత్నిగ గర్వింతునయ్యా
అనురాగపు కన్నులలో పాట సాహిత్యం

 
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల

అనురాగపు కన్నులలో
ననుదాచిన ప్రేయసివే
ఆపదలో దరిజేరి
కాపాడిన దేవతవే !

ఏ చల్లని వేళలలో
నీ చెంతకు చేరితినో
మనవలపుల తొలకరిలో
మకరందము కురిసెనులే 

రణసీమను రగిలే జ్వాలలో
చిరునవ్వుల మల్లెల మాలవే 
నామదిలో వేదన మాయంచేసిన
శాంతిరూపము నీవే !
నా చల్లని నీడవునీవే 

నీవెన్నెలవిరిసే చూపులతో
నీమమతలు చిలికే మాటలతో
నా జీవితమందే అమృతముచిందె
ప్రేమరూపము నీవే !
నాపాలిటి దైవము నీవే !

క్షతగాత్రుల ధీరుల సేవలకే
నీ బ్రతుకే అంకితమైనదిలే 

మనజాతి పతాకము వన్నెల వెలిగే
వీర తేజమునీవే 
నామదిలో దీపమునీవే 
మధుర భావాల సుమమాల పాట సాహిత్యం

 
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ
పసిడి కలలేవో చివురించే
ప్రణయ రాగాలు పలికించే
 
మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ

ఎదను అలరించు హారములో
పొదిగితిరి ఎన్ని పెన్నిధులో
ఎదను అలరించు హారములో
పొదిగితిరి ఎన్ని పెన్నిధులో 
మరువరాని మమతలన్నీ
మెరిసిపోవాలి కన్నులలో

మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ
 
సిరుల తులతూగు చెలి ఉన్నా
కరుణ చిలికేవు నాపైన
సిరుల తులతూగు చెలి ఉన్నా
కరుణ చిలికేవు నాపైన 
కలిమికన్నా చెలిమి మిన్న
కలవు మణులెన్నో నీలో

మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ
 
ఒకే పధమందు పయనించి
ఒకే గమ్యమ్ము ఆశించి
ఒకే పధమందు పయనించి
ఒకే గమ్యమ్ము ఆశించి
ఒకే మనసై ఒకే తనువై
ఉదయశిఖరాలు చేరితిమి

మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ 
పసిడి కలలేవో చివురించే
ప్రణయ రాగాలు పలికించే
అల్లరి చూపుల అందాల బాలా పాట సాహిత్యం

 
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

అల్లరి చూపుల అందాల బాలా 
నవ్వులు చిలికి కవ్వింతువేలా 
నీ ఆశలకేనే జాలిపడనా
నీ మాటలకే నే నవ్వుకోనా!

నాలో మెరిసే పారాణిరూపం
నీలోనే చూసీ మురిసేను 
రూపంచూసీ పులకించినావు
మనసే తెలిసి మెలగాలినీవు

ఆ సోయగమే నీలో కనిపించె
ఆ పిలుపే నేడే వినిపించె 
జతగా విరిసిన రోజాలు మేము
పోలికలొకటే భావాలు వేరు

వయ్యారాల ఓ మరదలు పిల్లా 
నీమదిలో నేనే ఉన్నాలే 
చిలిపిమాటల ఓ బావగారూ 
అంతటితోనే ఆగండి మీరు
ఏమి జన్మము-ఏమి జీవనము పాట సాహిత్యం

 
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు 

ఏమి జన్మము-ఏమి జీవనము
ఓ మాయ ఘటమా 
ఇకనైనా నా తెలుసుకో నిజము

ముసిముసినవ్వుల విషంకక్కుతూ
మేడిపండువలె కనబడతారు
డబ్బులకోసం గడ్డిమేయుచు
బిడ్డలసుఖమే చూడరువారు 
పైనయముడు కనిబెడుతున్నాడు
పళ్ళురాలగొట్టేస్తాడు 

పదవులకోసం రంగులు మార్చి
పెత్తనం చెలాయించేవాళ్ళను
స్వార్థంకోసం మిత్రులనై నా
చల్లగగొంతులు కోసేవాళ్ళను
ప్రజలు నెత్తిపై మొట్టకపోరు
గుట్టు వీధిలో పెట్టకపోరు 

హిరణ్యకశిపుడు ఎదురేలేదని
విర్రవీగి అపుడేమైనాడు ?
నరశింహుడు తన భ కునికోసం
అవతరించి హతమార్చాడు
అయినవాళ్ళ హింసించేవాడు
ఆడ్రసు తెలియక పోతాడు 

మూడునాళ్ళ ఈ ముచ్చటకోసం
మురిసి మురిసి నీ వెగిరిపడేవు
బిరుదులు ఆసులు శాశ్వతమనుకొని
పిచ్చిభ్రమలలో పడిపొయ్యేవు 
కాటికి కాళ్ళు చాచినప్పుడు
కన్నకొడుకులే గతియౌతారు !
చక్కని వదినెకు సింగారమే పాట సాహిత్యం

 
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి.సుశీల, వసంత 

చక్కని వదినెకు సింగారమే
సిగ్గుల చిరునవ్వు బంగారమే
మంగళవాద్యాలు ముంగిట మ్రోగంగ
పండు ముత్తైదువులు పారాణి రాయంగ
చెక్కిలిపై చుక్క సొంపులు కురియంగ
ఒయ్యారమొలికించు ఓ పెళ్ళికూతురా! 

మగసిరిగలవాడు మరునకు సరిజోడు
మమతలు చిలికించు మనసైన చెలికాడు
కులుకుతు వస్తాడు నిను మురిపిస్తాడు 
చిన్నారి చిలకమ్మ నీ నోము పండింది 

చక్కని బావకు సింగారమే
సిగుల చిరునవ్వు బంగారమే
మిలిటరి దొరగారు  పోజులిస్తున్నారు
పెళ్ళి వేళవుతుంటే బిగిసి కూర్చున్నారు
ముసాలు కావయ్య  మోజుగ రావయ్య
అమ్మాయి నీకోసం ఆరాటపడునయ్య 

Most Recent

Default