-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Srinivasa Reddy"



చిత్రం: టాటా బిర్లా మధ్యలో లైలా 
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
నటినటులు: శివాజీ, కృష్ణ భగవాన్, లయ 
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి 
నిర్మాత: బెక్కం వేణుగోపాల్ 
విడుదల తేది: 13.10.2006



Songs List:



నీ బాడీ బంపర్ గున్నదే పాట సాహిత్యం

 
చిత్రం: టాటా బిర్లా మధ్యలో లైలా 
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: జాస్సి గిఫ్ట్ , శ్రీలేఖ పార్ధసారధి 

నీ బాడీ బంపర్ గున్నదే 





పువ్వైపోనా చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: టాటా బిర్లా మధ్యలో లైలా 
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: విజయ్ ఏసుదాస్, చిన్మయి 

పల్లవి:
పువ్వైపోనా చెలియా నీ వాల్జడలో 
మెరుపైరానా సఖియా నీ కన్నులలో 
చిన్ని దీపాన్ని ఐపోన నీ దారిలో 
చిట్టి పాపాయినౌతాను నీ తోడులో 
ఏకమవ్వాలి ఈవేళ ఈహాయిలో 

చరణం: 1
నిన్ను చూడగా గుండెలోపలా 
కొత్త కొత్త ఆశలేవో చిగురులేయగా 
ఆ....నువ్వు లేనిదే తోచదే ఎలా...
పెదవి మీది నవ్వు కాస్తా మయమవ్వదా
నన్ను నేను మరచి రోజు నిన్ను తలచుకోడం 
ఉలికి ఉలికి పడుతూ నీకై నేను కలలు కనడం 
ఎంత బాగుందో నీతోటి ఈ పరిచయం 

చరణం: 2
నిండు పున్నమి దండగేకదా
నువ్వు మాటలాడుతుంటే వెన్నెలవ్వదా
ఆ.....తేనె చుక్కతో పనే లేదుగా...
ముద్దుకన్న తీయనైనా తేనెలుండునా
దీనిపేరు బహుశా చెలియా నీకుగాని తెలుసా 
కుదురులేని వయసా నీతో కుదిరెనాది వరసా 
ఇక మనసార నేనేలే నీ బానిసా




సీతాకోక చిలకల్లె పాట సాహిత్యం

 
చిత్రం: టాటా బిర్లా మధ్యలో లైలా 
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: గంగ 

సీతాకోక చిలకల్లె 



డబ్బు డబ్బు పాట సాహిత్యం

 
చిత్రం: టాటా బిర్లా మధ్యలో లైలా 
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: మురళీధరన్ 

డబ్బు డబ్బు 




తిరుమల వాస శ్రీనివాస పాట సాహిత్యం

 
చిత్రం: టాటా బిర్లా మధ్యలో లైలా 
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: యం.యం.శ్రీలేఖ 

తిరుమల వాస శ్రీనివాస 



అకుంది వక్కేసి పాట సాహిత్యం

 
చిత్రం: టాటా బిర్లా మధ్యలో లైలా 
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: కల్పన, టిప్పు 

అకుంది వక్కేసి 


Palli Balakrishna Monday, July 11, 2022



చిత్రం: రాగల 24 గంటల్లో (2019)
సంగీతం: రఘు కుంచె
నటీనటులు: ఈషా రెబ్బా, సత్యదేవ్
దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి
నిర్మాత: శ్రీ నవహాస్ క్రియేషన్స్
విడుదల తేది: 22.11.2019



Songs List:



రెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: రాగల 24 గంటల్లో (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: శ్రీ మణి
గానం: రఘు కుంచె

రెబ్బ 



నీ నగు మోముకి నమో నమో పాట సాహిత్యం

 
చిత్రం: రాగల 24 గంటల్లో (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: శ్రీ మణి
గానం: హరి చరణ్, రమ్యశ్రీ కామరాజు

నారాయణతే నమో నమో… నారాయణతే నమో నమో..
భవ నారద సన్నుత నమో నమో… నారాయణతే నమో నమో..

నమో నమో… నమో నమో..

నీ నగు మోముకి నమో నమో… నీ సొగసు గుణాలకి నమో నమో..
నీ తేనెల మాటకి నమో నమో… నీ తియ్యని మనస్సుకి నమో నమో..

నీ నగు మోముకి నమో నమో…

నీ కనుబొమ్మే హరివిల్లా… కసురుగా నాపై విసరకాల.. (2)
దురుసుకుమారి నీ సుకుమారం… మనసున చేరి చేసెను మారం..

చెణుకులు విసిరే అలివేణి అలకకు…
నమో నమో…(4)

అడుగులు కలిసే తొలి నడకా… జత కలిసిందా బ్రతుకంతా.. (2)
ఊపిరి తాళం ఒకటయ్యేలా… చెరిసగమయ్యే రసమయవేళ..

శ్వేధ సుగంధపు నీ నుదుటి కుంకుమకు…
నమో నమో…(4)




ఆకాశమే పాట సాహిత్యం

 
చిత్రం: రాగల 24 గంటల్లో (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నరేష్ అయ్యర్ , ముస్కాన్ శెట్టి 

ఆకాశమే 




నీ చిరునవ్వుకి పాట సాహిత్యం

 
చిత్రం: రాగల 24 గంటల్లో (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రమ్యశ్రీ కామరాజు 

నీ చిరునవ్వుకి 


Palli Balakrishna Sunday, January 17, 2021



చిత్రం: అదిరిందయ్య చంద్రం (2005)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
నటీనటులు: శివాజీ, లయ, సంగీత 
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి 
నిర్మాత: నూకారపు సూర్య ప్రకాశ రావు 
విడుదల తేది: 20.08.2005



Songs List:



పద్మావతి...పద్మావతి పాట సాహిత్యం

 
చిత్రం: అదిరిందయ్య చంద్రం (2005)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: జెస్సీ గిఫ్ట్ 

ఓసే పద్మావతీ...
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే
కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి 
నీ కొసం వెళ్ళొస్తానే కాలి నడకన తిరుపతి, పద్మావతి ...

పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే
అరే... పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే

ఒట్టేసి చెబుతున్నా పద్మావతి... పద్మావతి
నువ్వంటే నాకిష్టం పద్మావతి... పద్మావతి
హేయ్... నా మనస్సే దొచినావే పద్మావతి
నిన్ను వదిలి ఉండలేను పద్మావతి
అట్టా చూసి కొంపలు ముంచకే పద్మావతి
నా గుండెల్లోన కుంప్పటి పెట్టకే పద్మావతి
అరే... మెళ్లోన తాళి కట్టి అవుతానమ్మో నీ పతి, పద్మావతి...

ఓసే... పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే
అరే... పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే

అందంగా ఉన్నావే... పద్మావతి... పద్మావతి
అమ్మమ్మో... ఆగాలేను పద్మావతి  పద్మావతి
అదికాదు ఇది కాదని పద్మావతి
సాకులనే చెప్పమాకు పద్మావతి
చీరై నిన్నే చుట్టుకో పోతా పద్మావతి
ఆ... ఉన్నపలంగా ఇచ్చుకో పోతా పద్మావతి
నువ్వు అట్టా నవ్వుతుంటే పోతున్నాదే నా మతి, పద్మావతి...

పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే
హొయ్... పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే
కళ్ళు మూస్తే పద్మావతి కళ్ళు తెరిస్తే పద్మావతి 
నీ కొసం వెళ్ళొస్తానే కాలి నడకన తిరుపతి...



కళ్లకున్న కాటుక చూడు పాట సాహిత్యం

 
చిత్రం: అదిరిందయ్య చంద్రం (2005)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: టిప్పు, కౌశల్య 

కళ్లకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారుకొండ
అంతదూరం వుంటే ఎట్టయ్యో
చెవులకున్న దిద్దులు చూశా
ముక్కుకున్న బుక్కెన చూశా
చూడమన్నవన్నీ చూశానే నా పువ్వులదండా
చూపకుండ ఎన్నో దాచావే
జారుకున్న కొంగును చూడు
ఆపుతున్న సిగ్గుని చూడు
గుండెలోనే తొందరచూడు చూడు చూడు చూడయ్యా

కళ్లకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారుకొండ
అంతదూరం వుంటే ఎట్టయ్యో
చూడయ్యో...
ఏందయ్యో...

నా ఒంటి మెరుపు బుగ్గల్లో నునుపు
తెల్లారూ చూడయ్యో
నీ చూపే తగిలేక పరువం ఆగదే
నీ కోలకళ్లు ఆ చీర గళ్లు ఈరోజే చూశానే
సుకుమారం చూస్తుంటే నిదురే రాదులే
ఒంపు సొంపు చూడాలి ఉయ్యాలల్లే ఊగాలి
నీ కన్నుల్లో నా రూపం నూరేళ్లైనా ఉండాలి
ఓ అత్తకొడకా కన్నెత్తి త్వరగా
అందాన్ని చూశేయరా ముందుగా

కళ్లకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారుకొండ
అంతదూరం వుంటే ఎట్టయ్యో

మాంగళ్యం తంతునా మీనా మమజీవనా హేతునా
కంటే పద్నామి శుబాగే సంజీవ సరదా
సతామ్ సతామ్ సతామ్ సతామ్
నా సోకు చిరుకు కాసింత కొరుకు
తప్పేమి కాదయ్యో
సరసాల పలహారం ఇదిగో చూసుకో
నాజూకు సరుకు నచ్చేంతవరకు గిచ్చేసి పోతాలే
శింగారం చూస్తుంటే తనివే తీరదే
మళ్లీ మళ్లీ చూడాలి తుళ్లి తుళ్లి పోవాలి
నీ కౌగిట్లో కలకాలం నేనే వుండి పోవాలి
ఓ పెళ్లికొడకా మోహమాట పడకా
దాచింది చూశేయ్యరా ముందుగా
చెవులకున్న దిద్దులు చూశా
ముక్కుకున్న బుక్కెన చూశా
చూడమన్నవన్నీ చూశానే నా పువ్వులదండా
చూపకుండ ఎన్నో దాచావే
జారుకున్న కొంగును చూడు
ఆపుతున్న సిగ్గుని చూడు
గుండెలోనే తొందరచూడు చూడు చూడు చూడయ్యా




ఆపలేనండి పాట సాహిత్యం

 
చిత్రం: అదిరిందయ్య చంద్రం (2005)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: కార్తీక్, యం. యం. శ్రీలేఖ 

ఆపలేనండి 




అందం చూడవయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: అదిరిందయ్య చంద్రం (2005)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: మాలతి, భారతి బాబు 

అందం చూడవయ్యా ఆనందించ వయ్యా



నడుము పాట సాహిత్యం

 
చిత్రం: అదిరిందయ్య చంద్రం (2005)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: యస్.పి. బాలు, యం. యం. శ్రీలేఖ 

నడుము 



మారిపోయినా పాట సాహిత్యం

 
చిత్రం: అదిరిందయ్య చంద్రం (2005)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: కార్తీక్ 

మారిపోయినా 

Palli Balakrishna Wednesday, March 20, 2019


చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)
సంగీతం: అచ్చు , కోటి, రఘు కుంచె
సాహిత్యం: శ్రీమణి , అనంత శ్రీరామ్
నటీనటులు: అల్లరి నరేష్ , మోహన్ బాబు, వరుణ్ సందేశ్, మీనా, రమ్యకృష్ణ , పూర్ణ
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 2016

చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)
సంగీతం: కోటి
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రీచరన్ , శృతిహాసన్

నిను చూశాకే తెలిసిందే ప్రేమంటే
నా మనసే కావాలందే నీ జంటే
కల నిజమైతే నీలా ఉంటుందే
ఆ సంతోషం నాలా ఉంటుందే
నీ గుచ్చే గుచ్చే చూపే నచ్చిందే
నిను గిచ్చే గిచ్చే మందే నా మనసే
నా హృదయాన్నే కానుకిస్తున్నా
నిను ప్రాణంగా ప్రేమిస్తున్నా

ప్రేమా....
నిజమా...

నా కనులకు పెదవులు ఉంటే పలికేవే
తొలిప్రేమకు అర్ధం అంటే నువ్వేలే
నీ గుండెల్లో చిన్ని చోటున్నా
ఈ జన్మంతా సర్దుకు పోతాలే

మనసా... ఓ...
నీ తీయటి జ్ఞాపకమల్లె ఉంటానే
నీ మాటను సంగీతంలా వింటానే
నీ కన్నుల్లో ఓ నలుసైనా
నే పడనీనే ఏ నిమిషాన

నిను చూశాకే తెలిసిందే ప్రేమంటే
నా మనసే కావాలందే నీ జంటే
కల నిజమైతే నీలా ఉంటుందే
ఆ సంతోషం నాలా ఉంటుందే


Palli Balakrishna Wednesday, March 14, 2018


చిత్రం: బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్  (2008)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుజిత్, యమ్.యమ్.శ్రీలేఖ
నటీనటులు: అల్లరి నరేష్ , కృష్ణ భగవాన్ , ఫర్జానా , రితిమ
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
విడుదల తేది: 18.04.2008

హోయ్ విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

విశాఖపట్నం...
విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

రమ్మో జిన్నో - ఇట్ సో హాట్
ఫుల్లో హాఫో - టచ్ మీ నాట్
ఎస్ ఐ ఎస్ ఐ - యా యా యా
లాల లాలల లాలయ్
టాప్ టూ బాటమ్ నో మొహమాటం
ఎంజాయ్ చేసేయ్ - లాల లాలల లాలయ్
తాజమహల్ అమ్ముతారా టోకెనడ్వాన్స్ ఇచ్చేద్దాం
చార్మినార్ గోల్కొండ టెండరేసి పారేద్దాం

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

తప్పో వప్పో - ఆజా ఆజా
లెఫ్టో రైటో - లేజా లేజా
అరె చోడో యారో - యా యా యా
లాల లాలల లాలయ్
నాటో నీటో వెస్ట్రన్ బీటో
హే నాచో నాచో  -లాల లాలల లాలయ్
నీకు నచ్చే నగలు తెచ్చి వంటినిండా నింపేస్తా
ఫ్లాట్ లోని ఫ్లోర్ మొత్తం ప్లాటినంతో నింపేస్తా

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

విశాఖపట్నం భీమిలి బీచ్
కొనేసుకుందాం నువు రాయే
పిఠాపురంలో ఇల్లే కట్టి
నీకిచ్చుకుంటా ఇదరాయే
తీస్కో తీస్కో తీస్కో లైఫంతా పండగ చేస్కో
ఉస్కో ఉస్కో ఉస్కో నవ్వుల్తో డైలీ డిస్కో

ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే
ఆజా ఆజా ఆజారే నన్ను లేజా లేజా లేజారే

Palli Balakrishna Tuesday, March 13, 2018



చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రియమణి
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 23.11.2012



Songs List:



ఓంకారం పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: వెంకట్ సాయి 

ఓం ఓం...
ఓంకారం సృష్టి సారం విధివిధి లిఖితం
మోక్షధక్షం సుభిక్షం
గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం
సాన్నపూర్ణా సమక్షం
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం
శాంతికాంతం సుఖాంతం
విశ్వేశం చిత్ ప్రకాశం శ్రీతజన వరదం
కాశినాధం నమామి...




అరుణ దవల (పంచ గ్రహ కుటమి) పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: కార్తీక్ 

తొం తొం తన తొం తన  తొం తొం తన  తొం తన 

అరుణ ధవళ స్వర్ణోదయా దీప్తిం  - అఖిల భువన చైతన్య ప్రసాదం
కాలజ్ఞాన సత్కారణ ధీరం  - తం నమమి గ్రహనాయక సూర్యమ్             

అమృతా కిరణ రస రమ్య ప్రవాహం  - లలిత లలితా లవణ్య లలామమ్
మధిత మహిత మాదుర్యం మనోభ్యమ్ - తం నమామి నమామి సాంద్రోదయా చంద్రం    

రాగ భోగ సందన నిధనమ్  - రాజ యోగ సంపూర్ణ ప్రభావం
నవ్య దివ్య సౌందర్య సుధీరం  - తం నమామి సమ్మోహాక శుక్రమ్     

అతుల చతుర పటులోకిక మూర్తిం  - సకల కార్య హీత కౌసల కీర్తమ్
తీవ్ర వేగ సంచరణ తత్వం - తం నమామి సౌమ్యం బుధ దేవం  

తొం తొం తాన తొం తాన తొం తొం తాన తొం తన

పరమ ధర్మ సౌసీల్య మహత్త్వం - చరమ రమ్య భోదామృత తత్త్వమ్
వేద శాశ్త్ర దైవాంకిత భుద్దిం  - తం నమమి ధీరాం గురుదేవం    

తొం తొం తన తొం తన  తొం తొం తన  తొం తన 



నేస్తమా నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీకృష్ణ , హరిణి

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం
నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఓహొ ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం

చరణం: 1
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూశావా ఈ చిత్రం
కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలే...

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం

చరణం: 2
అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం
నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం
పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం





రెప్పలపై రెప్పలపై పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్ , చిత్ర

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 
నెమ్మది నెమ్మదిగ ఝుం ఝుం ఝుమ్మని తుమ్మెదగా 
ముచటగా మూడొ ముద్దుకు చోటిమ్మంటున్నా.. 
తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా 
తియ్యని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 

జరిగి జరిగీ దరికి జరిగీ కలికి విరహాలు కరగనీ.. 
కరిగి కరిగీ కలలు మరిగీ తగిన మర్యాద జరగనీ.. 
సొంపుల రంపంతో నాపై చక్కిలిబొతవె 
చుక్కల రెక్కల సీతకోకై నోరూరించావే.. 
పువ్వుల ప్రాయంలో గుప్పున నిప్పులు పోసావే 
నన్నక్కడ ఇక్కడ చక్కిలి గింతల అల్లరి పెట్టావే.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 

చిలిపి కన్నే నెమలి కన్నై చిగురు తనువంత తడిమిపో.. 
పులకరింతే మరొక వింతై అనువు అనువంత రగిలిపో.. 
గోపురమే నువ్వు నీపై పావురమై నేను 
గుప్పెడు గుండెల ప్రాంగనమంతా నాదని అంటాలే.. 
గొపికవే నువ్వు నాలో కోరికవే నువ్వూ 
నీ పున్నమి వెన్నెలనేలె పురుషుడు నేనెలే.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 




ధీంతన నన పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కరుణాకర్, జొన్నవిత్తుల (మంత్రాలు)
గానం: శంకర్ మహదేవన్  

ఓం, దేవ్యై నమః
ఓం, శ్రుత్యై నమః
ఓం, అత్యై నమః
ఓం ఓం ఓం ఓం

ఓం, యక్యై నమః
ఓం, శక్త్యై నమః
ఓం, రక్త్యై నమః
ఓం ఓం ఓం

ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి  నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో

నీ మదిలో మహదేవుడినే కొలువుంచగ ఓ కైలశము వో
అతని పాదము చెంతన వెలిగే హారతివో
పామరుడికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో

ధీంతనతోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో

ఓం, దేవ్యై నమః
ఓం, శ్రుత్యై నమః
ఓం, అత్యై నమః
ఓం ఓం ఓం ఓం





సక్కు భాయ్ ఘరం చాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సుచిత్ సురేషణ్, మమతా శర్మ 

హే సక్కుభాయి జర  దేఖోనా గరం గరం చాయ్
హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్
చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్
హే ఏస్కో నా ఘుమ ఘుమ చాయ్
యమ ఫేమస్ ఇది ఢిల్లీ టు దుబాయ్
హే తీస్కో నా సల్ల సల్ల చాయ్
భలే మోగిస్తది నరాల్లో సన్నాయి
గుండె గయ్యంటే అల్లం చాయ్ సుయ్యంటే బెల్లం చాయ్
కెవ్వంటే కర్రకాయి చాయ్
ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కార చాయ్
ముసుగెడితే ముల్లకాడు చాయ్
నా బంగారు చేతుల్తో పింగాను సాసర్ లో
నీకోసం తెస్తానబ్బాయ్

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా చేయ్

హే సక్కుభాయి జర  దేఖోనా గరం గరం చాయ్
హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్

సో సో సొగసాకు తీసి, కాచా డికాషన్
పరువాళ్ల మిల్క్ పెదవుల్లో షుగరు పక్కాగా కలిపేసి పెంచా ఎమోషన్ 
నీకేసి చూసి, హ్యాపీ హ్యాపీ టెన్షన్  
తేయాకు లాంటి నాజుకుతోన ఇరగ తీసావే ప్రిపరేషన్
ఆంధ్ర నైజం సీడెడ్ అన్న సిల్లార పిల్లల ఫాలోయింగే
సక్కుభాయి చాయ్ అంటే పడి సచ్చిపోతారు
క్వాటర్ చాయ్ కి లీటర్ బిల్డుప్ ఇచ్చి
మేటర్ పెంచేసావే నీలో ఉందే తాజా హుషారు

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా  చే చే చేయ్

ఫుల్ బాటిల్ వాసు, మరో దేవదాసు
శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు 
కిక్ ఎక్కి చేసాడు రికార్డు డాన్స్ 
చాల్లే  ఎక్ష్త్రస్  వాడో తేడాకేసు 
నీ జారే వోణిసు చూసాడు బాసు
అంచేత చేసాడు గాల్లో జుంపింగ్స్
లారీ తోలే దార సింఘు సక్కు చాయ్ కి ఫ్యాన్ అయిపోయి
ఇక్కడికిక్కడే నా దాబాలో సెటిల్ అయిపోయాడు
ఆ తింగరి స్టీరింగ్  ఓడి లెక్కే వేరే తిక్కల పిల్ల
నీ ధాబాలో నులక మంచం మెత్తగ ఉందని హత్తుకుపోయాడు

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా  చేయ్





లాలి లాలి జోలాలి పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: గోపిక పూర్ణిమ

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి
నీతో ఆడాలంటూ నేల జారెనంట జాబిల్లి
నీలా నవ్వలేనంటు తెల్లవారె చుసెనంట సిరిమల్లి

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి

బోసిపలుకె నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయే వాకిలి
లేత అడుగె నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయే లోగిలి
నీ చిన్ని పెదవంటితే 
పాలనదులెన్నొ యెదలోన పొంగే పొరలి
నిను కన్నా భాగ్యానికే తల్లి పదవొచ్చి మురిసింది ఇయ్యాలె

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి

లాల నీకే నె పోసేటివేల అభిషేకంలా అనిపించెర
ఉగ్గు నీకే నె కలిపేటి వేళా నైవేద్యంలా అది ఉందిరా
సిరిమువ్వ కట్టేవేళా 
మాకు శివ పూజె గురుతొచ్చె మరలా మరలా
కేరింత కొట్టే వేలా ఇల్లె కైలాసంలా మారె నీవల్ల

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి




భూనభోంతాలకే పులకింత రా పాట సాహిత్యం

 
జయజయ శంకర శివశివ శంకర
జయజయ శంకరశివ శివ శంకర
జయ జయ శంకర శివశివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర

భూనభోంతాలకే పులకింత రా
దశదిశాంతలకే ఒకవింతరా
కదిలాడు ధరణికే కాంతిమయుడు
కరుణాంతరంగుడై ప్రణవధారుడు
జయజయ శంకర శివశివశంకర
జయజయశంకరశివశివశంకర
జ్ఞాన ప్రభారాశి దివ్యత్రినేత్రం
వేద వేదాంతార్థ జోతిస్వరూపం
కైలాస శిఖరాలు నిజభుజస్కంధాలు
కరుణా సముద్రాలూ స్వామి కనులు

జయజయ శంకరశివశివ శంకర
జయజయ శంకరశివ శివ శంకర
శిరసుపై చలువ ఆ చలువ గంగ
నుదుటికి తళుకు ఆచంద్రవంక
నెమలిపించమువోలునీలకంఠం
చలి మబ్బులువిబూది భస్మం
జయ జయ శంకర శివ శివ శంకర


అభయ ప్రళయశక్తి ఆ త్రిశూలం
అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం
మణిభూషణం ఆయే సర్పరాజ్యం
సంధ్య కాంతులనెగసె వ్యాఘ్ర చర్మం
జయజయ శంకరశివశివశంకర
సప్తతాండవనటుల నటరాజుపాదం
బ్రహ్మాది దేవతలు మొక్కేటి పాదం
దివినుండి దిగి రాదా ఇలకే ప్రబోధం
దివినుండి దిగి రాదా ఇలకే ప్రబోధం
జయ జయ శంకరశివశివశంకర
పాహిపాహి అనే పరమ భక్తుడే
ద్రోహి అంటూ నిందించగా
భూషణలు భూషణముగా చేసి కొనిచేరె
నాగభూషణుడైన నటరాజు తానే
దైవం మానుష రూపేణా




కన్యాకుమారి ఓ కన్యాకుమారి పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: జస్ ప్రీత్ జాజ్, సునీత

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ  మీనా కుమారి
నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే నారి
వేసవికన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి
వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలి ఇవ్వాలి
చక్కర కన్నా తియ్యగ నన్నే ప్రేమించాలి

హే రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
హే రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

చరణం: 1
ఓ నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం 
అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం
నడుమే నయగారం ఆ నడకే శృంగారం 
నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే
కళ్ళే మూసి చల్లగ జారకు పూబంతల్లే

రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
హే రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ  మీనా కుమారి
నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే నారి

చరణం: 2 
సూటిగ నీ చూపే నా గుండెని తాకింది
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిప్పుంది అది నాలో రగిలింది
ఎదలొకటై తెలవారే వరకు  ఆరను లెమ్మంది
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరగను ఇదివరకు
ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకు

రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
ఓ రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
రాజకుమార ఓ రాజకుమార 
నా గుండెల్లోనే ఉన్నవయ్యో ఎందుకు ఇంకా దారి




శివ శివ శంకర హర హర శంకర పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: శంకర్ మహదేవన్

భం భం భో - భం భం భో (4)

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

ఓం పరమేశ్వరా పరా
ఓం నిఖిలేశ్వరా హరా
ఓం జీవేశ్వరేశ్వరా కనరారా
ఓం మంత్రేశ్వరా స్వరా
ఓం యాంత్రేేశ్వరా స్థిరా
ఓం తంత్రేశ్వరావరా రావేరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

ఆకాశలింగమై ఆవహించరా
డమ డమమని డమరుఖ ధ్వని సలిపి 
జడతని వదిలించరా
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి 
చలనమే కలిగించరా

భస్మం చేసేయ్ అసురునే అగ్నిలింగమై ప్రవికారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరునించరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

విశ్వేశ లింగమై కనికరించరా
విధి లిఖితమునిక బర బర బర చెరిపి 
అమృతమె కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా
పలు శుభములు గని అభయములిడి హితము 
సతతము అందించరా

గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వరా
ప్రాణం నీవై ఆలింగనంమీరా
ఎదలో కొలువై హర హర ఆత్మా లింగమై నిలబడరా
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ హర హర జయ జయ దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా - భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా-భం భం భో
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా -భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా


Palli Balakrishna Sunday, December 3, 2017


చిత్రం: అ ఆ ఇ ఈ (2009)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్, యమ్.యమ్.శ్రీలేఖ
నటీనటులు: శ్రీకాంత్ , సదా, మీరా జాస్మిన్
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాతలు: బొద్దం అశోక్ యాదవ్
విడుదల తేది: 06.11.2009

పల్లవి:
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా
చీకటైతే చాలట చీర చాటు గోలట
రాజుకుంటే ఈడట దానిపేరె మూడట
ఊరుకోరాదట ఊసులాడాలట
ఊయలూపాలటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పట

చరణం: 1
మొట్టమొదట నుదుటిమీద చెమట
వెల్లువై నదిలా మారింది
చుట్టుకొలత చూడగానే చిలక
భగ్గుమని వయసే రగిలిందే
ఎగుడు దిగుడు వెతికే దారుల్లో
జడతో జగడం జరిగేవేళల్లో
కన్నె కనకాంబరం సోకు చీనాంబరం
అరె తిరగ మరగ నలగలంటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా

చరణం: 2
పట్టి మంచం కిర్రుమంటు గొడవ
యవ్వనం ఈలలు వేస్తుంటే
ఇంత మైకం ఇందులోన కలదా
నరనరం మెళికలు పడుతుంటే
ఒకటి ఒకటి కలిసే చప్పట్లో
అలుపు సొలుపు రాదే ఇప్పట్లో
నేనే గుడిగోపురం నీవే నా పావురం
నా ఎదపై నువ్వే వాలాలంటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
హా... ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా
చీకటైతే చాలట చీర చాటు గోలట
రాజుకుంటే ఈడట దానిపేరె మూడట
ఊరుకోరాదట ఊసులాడాలట
ఊయలూపాలటా హ హ హ హ హ హ

అచ్చట ముచ్చట హు హు హు ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట హు హు సంగతే హు హు హు

Palli Balakrishna Thursday, November 30, 2017

Most Recent

Default