Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం:  స్నేహమేరా జీవితం  (2017)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: చైతన్య వర్మ
గానం: సునీల్ కశ్యప్, ప్రణవి ఆచార్య
నటీనటులు: శివబాలజి, రాజీవ్ కనకాల, సుష్మా యార్లగడ్డ
దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి
నిర్మాత: శివబాలజి
విడుదల తేది: 17.11.2017

మెల్లగా మెల్లగా గుండెలో అలలాగ ఉరికేవే ఎలా
చూపులే మాటలై సూటిగా తగిలేలా ఉసిరావే వల
ఏమైందో ఏమో నంటూ ఆరా తీస్తే
ప్రేమైపోయిందేంటో నీతో తీరా చూస్తే

సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ
సారి సాగగామ (2)

నీ కలవారితే తెలవారదే రెయిలాగే
నా అలవాటుగా అవుతున్నదే రోజిలాగే
వయసు తీరే మారుతుందే నేలజారే తారలల్లే
మనసు తీరా నవ్వుకుందే వెన్నెలింక జాబిలల్లే
వరాలె మురిసి మురిసి మదిలో కురిసి
మరల మనకు దొరికెనే...

సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ
సారి సాగగామ (2)

ఏం పరువానివే పరుగాపవే ప్రేమవైపే
ఈ ప్రణయాలలో పడదోయక ఊరుకోవే
ప్రేమలైతే వేరుకావే దూరమింక కోరుకోవే
ఆగమంటే ఆగిపోవే మారమంటే మాట వినవే
మరింక తిరిగి తిరిగి మనసు కరిగి
మనము తిరిగి జగము కలిసెనే...

సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ
సారి సాగగామ (2)

Most Recent

Default