-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "J. V. Raghavulu"



చిత్రం: చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వీటూరి, గోపి, కొసరాజు రాఘవయ్యచౌదరి
నటీనటులు: రంగనాథ్, జమున, మంజుల, జయమాలిని
కథ, మాటలు: వీటూరి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు 
నిర్మాత: కోగంటి విశ్వేశ్వరరావు
విడుదల తేది: 11.03.1978

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)




Songs List:



అమ్మ అన్నమాట పాట సాహిత్యం

 
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వీటూరి
గానం: పి.సుశీల

అమ్మ అన్నమాట కమ్మనైన పాట



ఏడనో పుట్టింది పాట సాహిత్యం

 
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వీటూరి
గానం: జె.వి.రాఘవులు

ఏడనో పుట్టింది ఏడనో తిరిగింది ఏడనో కలిసింది గోదారి



నీనామమెంతో మధురము పాట సాహిత్యం

 
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వీటూరి
గానం: పి.సుశీల

నీనామమెంతో మధురము కాదా పావనమైనది నీ గాధా




లావొక్కింతయు లేదు (పద్యం) సాహిత్యం

 
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: బమ్మెర పోతన
గానం: రమణ

లావొక్కింతయు లేదు (పద్యం)



చదవాలి ఎదగాలి పాట సాహిత్యం

 
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: గోపి
గానం: పి.సుశీల బృందం

చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ అది చూసి మురవాలి తల్లిదండ్రులు



నువ్వా దేవుడివీ పాట సాహిత్యం

 
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: గోపి
గానం: పి.సుశీల 

నువ్వా దేవుడివీ రాతి గుడిలో దాగితివీ




కాయి రాజా కాయి పాట సాహిత్యం

 
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: కొసరాజు
గానం: వాణీ జయరాం

కాయి రాజా కాయి రాజా చేయి దాటిపోకుండ చూడు రాజా

Palli Balakrishna Thursday, May 21, 2026



చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
నటీనటులు: కృష్ణ, భారతి, గిరిబాబు ఉమారాణి, జగయ్య, షావుకారు జానకి, కాంతారావు, త్యాగరాజు, మిక్కిలినేని, నగేష్, జ్యోతిలక్ష్మి   
దర్శకత్వం: పి. సాంబశివరావు 
నిర్మాత: అమరారామ సుబ్బారావు
నిర్మాణ సంస్థ: సీతారామాంజనేయ మూవీస్
విడుదల తేది: 02.12.1977



Songs List:



నిర్ణయం విధి నిర్ణయం పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: దాశరధి
గానం: జె.వి.రాఘవులు 

నిర్ణయం విధి నిర్ణయం 



నువ్వు నవ్వితే ఈ తోటంతా పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నువ్వు నవ్వితే ఈ తోటంతా కోటి పూలతో నవ్వుతుందిలే



కళ్ళల్లో ఎన్నెన్ని కలలో పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

(ఈ పాటని  "గిరిబాబు, ఉమారాణి" పైన చిత్రీకరించారు)

కళ్ళల్లో ఎన్నెన్ని కథలో




నడిసంద్రంలో నావ తీరాయే బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నడిసంద్రంలో నావ తీరాయే బ్రతుకు 



వచ్చానని వయసేమో కబురంపింది పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి.సుశీల

అరెరె వచ్చానని వయసేమో కబురంపింది

Palli Balakrishna Thursday, January 25, 2024



చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి.రఘవులు
నటీనటులు: కృష్ణ, జయచిత్ర, ప్రభ 
దర్శకత్వం: బోయిన సుబ్బారావు 
నిర్మాత: డి.రామానాయుడు 
విడుదల తేది: 16.02.1977



Songs List:



అండపిండ బ్రహ్మాండముల (పద్యం) సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: అప్పలాచార్య
గానం: యస్.పి.బాలు 

అండపిండ బ్రహ్మాండముల నేలు గండర గండడు (పద్యం)




ఆనంద ఆనందమాయే పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఆనంద ఆనందమాయే అందాల బొమ్మకు సిగ్గాయేనే 



ఈ లోకం ఒక నాటకరంగం పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు 

ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తారంగం 




కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి ఆ కొంగులోన దోరవయసు 



జాగేల ఏలారా పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కోవెల శాంత, జె.వి.రాఘవులు

జాగేల ఏలారా ఇక జాగేల ఏలరా వలపులు నాలో 



తోక్కుడుబండి ఓ లబ్బారుబండి పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల బృందం

తోక్కుడుబండి ఓ లబ్బారుబండి అబ్బి ఎక్కనోడు




బంగారు తల్లివి నీవమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల,మాధవపెద్ది, పిఠాపురం

బంగారు తల్లివి నీవమ్మా




శివా శివా భవా భవ పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: అప్పలాచార్య
గానం: యస్.పి.బాలు

శివా శివా భవా భవ యువా నన్ను కావరా 




అమ్మల్లారా అక్కల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: సావాసగాళ్లు (1977)
సంగీతం: జె.వి. రఘవులు
సాహిత్యం: మోదుకూరి జాన్సన్
గానం: పి.సుశీల బృందం

అమ్మల్లారా అక్కల్లారా గోంగూరకే అనగనగా బ్రహ్మదేవుడు

Palli Balakrishna Sunday, January 21, 2024



చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి 
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాత: యస్.పి.వెంకన్న బాబు 
విడుదల తేది: 14.01.1982



Songs List:



ఆరిపెయ్ ఆరిపెయ్ చలిమంట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఆరిపెయ్ ఆరిపెయ్ చలిమంట
అంతకన్న వెచ్చనైంది మన జంట




చిటపట చిటపట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు & కోరస్ 

చిటపట చిటపట




రేయంత కవ్వింత పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

రేయంత కవ్వింత 





పొంగింది పొంగింది పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

పొంగింది పొంగింది




దొంగ చిక్కింది పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు భూమి (1982)
సంగీతం: జె. వి. రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ / వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

దొంగ చిక్కింది 

Palli Balakrishna



చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: కృష్ణంరాజు, శారద, జయసుధ
దర్శకత్వం: వి.మధుసుదనరావు
నిర్మాత: జి.సత్యనారాయణరాజు
విడుదల తేది: 11.01.1980



Songs List:



శంభో హరహర పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

శంభో హరహర.... భోళాశంకర
వినరా వినరా జంగం దేవర
శివశివ శంకర....యివరం సెప్పర
బస్తీ బాబులకు... అరెరెరెరే ....
నీ భక్తుడంటే.... ఈ సత్తెమంటే
ఎట్టాంటోడో తెలిసేందుకు.....
రైతంటే బైతనుకుంటే... నీ బతుకు భజగోవిందే
తెలివంటె నీదనుకుంటే.... నీ తెలివి తెల్లారినట్టే
పనికి రాని మనిషి .... ఒక్కడైన లేడు
ఆ మనిషి పనికి నువ్వు ఖరీదు కట్టలేవు
డబ్బు కట్టే గోనిసంచి గొప్ప కాదురో.... ॥శివ శివ ॥

సత్తెమంటే సల్లగాలి.... సత్తెమంటే అగ్గినిప్పు
మంచోళ్ళ ప్రాణం సతైం.... మనసున్న మనిషే సత్తెం
ముతక కట్టినోడు .... మొద్దు ఎదవకాడు
సద్ది తిన్నవోడు.... సచ్చు సవటకాడు
నిద్దరోయె బెబ్బులి మేక కాదురో .... ॥శివ శివ ॥

పట్నంలో సదువులు సదివి.... పట్టాలు పొందిన బాబులు
సూశారు కండబలము .... సూత్తారా బుద్ది బలము
మాయ సేయలేదు ....మంత్రమేమి కాదు
గుప్పెట్లో యిసక సెప్పుకోండి ఎంత....?
ఎంత... ? ఎంత ....? ఎంత....? తెలీలా .... 
గుప్పెడంత యిసకంటే గుప్పెడేనులో.... ॥శివ శివ ॥




నిన్నా మొన్నటి చిన్నారివే పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

నిన్నా మొన్నటి చిన్నారివే
చిన్నారి పలుకుల చెల్లెమ్మవే
ఈ పెళ్ళి చూపుతో ఈ చీర కట్టుతో
ఎంత ఎదిగినావే........

పెళ్ళీడు వచ్చింది అమ్మాయి
పిల్లాడ్ని చూడరా నీ చెల్లికి
అని పెద్దోళ్ళు పదిసార్లు అన్నారని
ఉబలాటపడ్డాను చూద్దామని
ఈ ముస్తాబులో ....ఆ నగుమోములో
చూశాను చెల్లీ.... మన తల్లిని....

ఒకరికి ఒకరం.... ఇక ఎవరికి ఎవరం
ఓర్వనిదైనా..... తప్పని దూరం
ఏ ఆడపిల్లా.... కాదీడపిల్ల
ఏనాటికైనా ....అది ఆడపిల్ల
చేశానమ్మా..... నే చేయగలది
ఈ ఇంటి పేరింక ఆ ఇంట నిలపాలి




మేకారే మేకా .... పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు , యస్.పి.శైలజ

మేకారే మేకా .... హే.... మేకా
తోకారే తోకా... హే.... తోకా
మిల మిలలాడే కన్నులతో
మిస మిసలాడే వన్నెలతో
చుర చురలాడే చూపులతో
కొర కొరలాడే కోర్కెలతో
బిలబిల కిలకిల గలగల గలగల అమ్మాయిలూ
చకచక టకటక లుకలుక లుకలుక అబ్బాయిలూ
ఒకరిని ఒకరు ఒరుసుకొని
ముందూ వెనకా వెనకా ముందూ
ముందూ వెనకా వెనకా ముందు
ముందుగ వెళుతుంటె ....

పెట పెటలాడే పదహారేళ్ళు
చిమ చిమలాడే యిరవై యేళ్ళు
చెకుముకి రాళ్ళు ఈ కుర్రాళ్ళు
బరిలో దూకే పందెం కోళ్ళు
కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్
పిట్టల్లాడు
కుంవా కుంవా కుంవా కుంవా గువ్వల్లాగా
ఒకరిని ఒకరు తరుముకొని
పగలూ రేయీ రేయీ పగలూ
పరుగులు తీసూ ఉరకలు వేసు
పడుతూ లేసుంటే....




గీతా .... ఓ గీతా .... పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర
గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్

గీతా .... ఓ గీతా ....
డార్లింగ్.... మై డార్లింగ్ ....
మనసార నీతో మాటాడుకోనీ
రాజా....ఓ రాజా....
డార్లింగ్.... మై డార్లింగ్ ....

మనసార నీతో మాటాడుకోనీ
పర దేశంలో.... ఆవేశంలో
ప్రేమించిన మనకనుమతి ....
బహుమతి.... ఈ దేశంలో... సంతోషంతో
మనవాడినచో అనుబంధం
ఆనందం ... వెచ్చని వలపుల ముచ్చట తీరును
అనురాగ బంధం ముడివేసుకోనీ

చిరునవ్వులతో పులకింతలతో
వికసించిన మధువనం
యవ్వనం .. ఈ భంగిమలో నీ పొంగులతో
మురిపించే బిగికౌగిలి
జిలిబిలి.... ఊహలే రేగితే మోహమే ఆగుణా
ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోనీ




నీవు నా పక్కనుంటే హాయి పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర
గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్

నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో
కిరణాలు మెరిశాయి

నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో
కిరణాలు మెరిశాయి

కొండలలో కోనలలో ఏకాంత వేళ
గుండెలలో రేగింది సరసాల లీల
కొండలలో కోనలలో ఏకాంత వేళ
గుండెలలో రేగింది సరసాల లీల

అనురాగ శిఖరాన అందాల తోట
ఆ చోట కోనేట సయ్యాటలాడాలి
కొనగోట మీటిన మాణిక్యవీణ
కొసరే మమతల తొలకరి వాన
కొనగోట మీటిన మాణిక్యవీణ
కొసరే మమతల తొలకరి వాన
కన్ను సైగల కౌగిలింతల సన్న జాజితాని
ఎన్నమారులు నిన్ను చూసినా దేవరంభ ఠీవి
మువ్వల రవళి మోహన మురళీ
మధురం మధురం మానసకేళీ

Palli Balakrishna Monday, November 6, 2023



చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి , వీటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: చంద్రమోహన్, మాధవి, జయమాలిని 
మాటలు: జంధ్యాల 
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు 
సహాయ దర్శకుడు: వంశీ 
నిర్మాత: USR మోహనరావు 
విడుదల తేది: 21.06.1979

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )



Songs List:



అందాల సృష్టికి మూలం పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి 
గానం: పి.సుశీల 

అందాల సృష్టికి మూలం ఆనాటి ఏడమ్
ఆనందం సృష్టిస్తోంది - ఈనాడీ మేడమ్
గరీబుకైనా  బికారికైనా |
అవసరమొకటి 
నిషాగా ఖుషీగా  సుఖాల చరించడం 
పక్కింటి రాముడుకోసం - పంకజాక్షి విరహం
ఎదురింటి రాజాపైనా అబుల్లా మొహం
ఎల్లమ్మ తోటలోనా - ఎంకినాయుళ్ళు సరసం :
శాంతమ్మ సంతకెళ్ళినా
గోవిందు గోడ దూకినా 
ఎందుకోసం ? పొందుకోసం ? జగమంతా
ప్రేమ విలాసం 

కన్నెపిల్ల కనిపించిందా కన్ను గీటే కాలేజీ బాయ్
హయ్ .... హయ్
చిన్నపిల్ల బుగ్గ నిమిరీ ఇకిలించే తాతాయీ
కొంగుచూసి రంగైపోయే దొంగచూపు పూజారీ
పార్కుల్లో ఊసులాటలూ
తిరునాళ్ళ తిప్పలాటలూ
ఏమిగోలా  ప్రేమగోలా ? జగమంతా ॥అందాలా॥




వింటే భారతం వినాలీ పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హిహిహిహి ....
మన్మధలీలా 

వింటే భారతం వినాలీ
తింటే గారెలే తినాలీ
పడితే గొప్పోణీ పట్టాలి
కొడితే జాక్ పాట్ కొట్టాలీ
మీరంతా ఈలలు వెయ్యాలీ
మా జేబులు బాగా నిండాలి
భారతానికి మూలకారణం

ద్రౌపది వస్త్రాపహరణం
ప్రజలకు నచ్చే సన్ని వేశమూ
పసందైన శృంగార దృశ్యమూ

నేనే కురునాదూడా - నాదూడా
అపక్ర విక్రమ పరాక్రముండ
సుయోధనా సార్వబౌముండ - ఘనుండ
నే కురు నాయకుండ

హల్లో బ్రదర్ దుశ్శాసనా
రేపింగ్ కళా ప్రవీణా
ఎక్కడ ఆ FIVE STARS పతివ్రతా
గుమ్మడి పండులాంటి ఉమ్మపతి - ద్రౌపతీ
పాలమీగడలాంటి వయ్యారీ
చెఱుకు గడలావున్న చిన్నారీ
పొడుముకాయలాంటి నడుమూపీ జడవూపీ
తొడపైన కూర్చోవే ఒకసారి
నా తొడపైన కూర్చోవే ఒకసారి

ఏయ్ ...
ఎవరనుకున్నావూ ఏమనుకున్నావూ
అయిదుగురు భర్తలకు నే సింగిల్ భార్యనూ
అఫ్కోర్స్
దమర్మము లేరుగని కోర్టుల కెక్కని
ఘనుడు ధర్మరాజూ
గదతో రొమ్ముల దుమ్మును దులిపే
బలుడు భీమరాజూ
షూటింగ్లో ఫైటింగ్ హీరో అర్జునుడూ
హర్స్ రేసులో అగ్రగణ్యుడు నకిలీలేని నకులుడూ
పేరు పొందిన పశువుల డాక్టరు తిరుగులేని
సహదేవుడూ
ఎవరనుకున్నావూ ఏమనుకున్నావూ
అయిదుగురు భర్తలకు నే సింగిల్ భార్యను

ఏయ్ ---
చాలించవే నీ గొప్పలు
ఇక చూసుకోవే నీ తిప్పలు

నిన్ను నాకు నాజూదంలో ఓడినారె నీ భర్తలు
Don't you know it ?

Is it ?
తన్నోడి నన్నోడినా నారాజు
నన్నోడి తన్నోడెనా
తనుముందు ఓడితే నన్నోడ హక్కేది
ఈ జూదమాడగా లైసెన్సు నీకేది

పాయింటు పట్టిందిరో - లా
పాయింటు పట్టిందిరో -
హైకోర్టు కెళ్ళినా అప్పీలు లేదురా
పాయింటు పట్టిందిరో - లా పాయింటు పట్టిందిరో
ఏయ్ -- విప్పరా
తప్పురా..
విప్పరా
తప్పురా..... కృష్ణా.....

కృష్ణా - కృష్ణా కృష్ణా కృష్ణా
పోలీస్ పోలీస్ పోలీస్



లుక్ చుక్ లుక్ పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సాయిబాబా 

లుక్ చుక్ లుక్ చుక్ వ్యాపారం
గప్ చిప్ గప్ చిప్ మనబేరం
బొమ్మా బొరసే జీవితం -
ఆడే బొమ్మల నాటకం

బొమ్మలు: 
Twinkle Twinkle Little Master
How We wonder you are here !
మనిషి చేసిన బొమ్మలు మీరు
మనసే ఉండడూ వయసే పండదూ
దేవుడు చేసిన బొమ్మలు మేము -
బుద్దులు మారే మనుషులమూ
పొదువాలితే పోతాము -
గుడిలో బొమ్మను అర్చిస్తాం 
అంగడిలో బొమ్మను అమ్మేస్తాం 

బొమ్మలు: 
బొమ్మల పాలిట బ్రహ్మలు మీరట
పేరు గొప్పట ఊరు దిబ్బట -
అయ్యోపాపం : అయ్యోపాపం..కీలుబొమ్మలు 
ఆ బ్రహ్మదేవుడే కీలుబొమ్మ శ్రీ విష్ణువు చేతులలో
ఆ వైష్ణవ మాయలలో…
ఈ తోలు బొమ్మలూ కీలుబొమ్మలే ఈకలికాలంలో
ఆకలికాలంలో -
ధనమదాంధులు జరాసంధులు ఆడే చదరంగంలో
పేదజీవులం మేముపావులం
కసాయి సాలకు పోతున్నా గరికెలు మేసే గోవులం
ఇది గండు పిల్లల చెలగాటంలో
నిండు బ్రతుకుల ప్రాణ సంకటం





అమ్మ అనేదీ అచ్చ తెలుగుమాటరా పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అమ్మ అనేదీ అచ్చ తెలుగుమాటరా
జన్మ జన్మ కదే నిత్యవెలుగు బాటరా
ప్రేమకు పెట్టనికోట మమతల మల్లెలతోట
తనపిల్లల క్షేమమే పల్లపైన పాట
మధుర మధుర మధురమైన మాటరా : అమ్మా

కాలు మోపితే అమ్మ అవతరించె కాశీ
తానమాడితే అమ్మ తరించింది గంగ
మెరిసె లక్ష్మణరేఖ నడిచే భగవద్గీత
తొలి పలుకులు దిద్దుకుంది తెలుగుపాప ఆమ్మతో
తొలివెలుగులు దిద్దుకుంది తూర్పు అమ్మ చూపుతో
దేవుడైన చెప్పలేడు ఆ దేవత ఎంత గొప్పదో
అమ్మా - ॥అమ్మ॥

అనగనగా ఓ రాజకుమారి
వన్నెచిన్నెల వయ్యారి - నాట్యంలో మయూరి
యెందరెందరో రాకుమారులు, ప్రేమ బిక్షకై 
అర్ధించారు నిరాశ చెందారు 

డైలాగ్: ఇలా వుండగా ఓనాడు -
పెన్నిధి తనతల్లి అయిన పేదయువకుడొకడు
ఆ రంభలాంటి చిన్న చూచాడు
అందానికి కన్ను చెదిరి  ఆ క్షణాన వళ్ళు మరిచి
ప్రేమ పిచ్చిలో పడ్డాడు పెళ్ళిచేసుకో మన్నాడు!

డైలాగ్ : అప్పుడా సుందరి ఏమడిగిందో తెలుసా ?
కానుకగా కన్నతల్లి గుండె కోరెనా చిన్నది
తేలికగా తెస్తా లెమ్మన్నాడు - ప్రేమ ఎంతగుడ్డిది
ఆ కామమెంత చెడ్డది

కన్నుల కడవెలుగు దాచి  కన్న కడుపునే తలచి
తలవాకిట నిలచినదా తల్లి కన్నతల్లి
వచ్చిన బిడ్డనుచూచి వెచ్చని మమతలుపోసి
వండిన అన్నము పెట్టెను - నిండుగుండెతో
ఆ తల్లి బిడ్డకడుపు నిండుగా మళ్ళీ మళ్ళీ
ఇటు కన్నతల్లి మమకారము 
అటు కన్నెపిల్ల శృంగారమూ
ఇటు తల్లిగుండె గుడిగంటలూ 
అటు కన్నె కంటి చలిమంటలూ
ఇటు నెత్తురు - అటు అత్తరు
ఇటు త్యాగము - అటు భోగము
ఉన్మత్తుడై, చలచిత్తుడై, కామాంధుడై, పాపాత్ముడై
పుత్రరూపమున శత్రువై, మాతృ హత్యనే చేశాడు
జన్మనిచ్చిన తల్లినే చంపుకున్నాడు
కన్నుమిన్ను కానక, కన్నతల్లి గుండె కానుక
కన్నెపిల్ల కే ఇవ్వగా !

కన్నుకానక పరుగులెత్తగా - కాలుజారి పడిపోయాడూ
చావు దెబ్బతిని అమ్మా అమ్మా అమ్మా అంటూ
గావు బొబ్బలే పెట్టాడు

డైలాగ్ : అప్పుడు ఆ తల్లి గుండె యెమన్నదో తెలుసా?
నాయనా దెబ్బతగిలిందా ? జాగ్రత్త నాయనా
నా ఆయుష్షు పోసుకొని నూరేళ్ళు చల్లగా
వర్ధిల్లు నాయనా -

అమ్మ కోరేదీ ఒకే ఒక్క మాటరా 
అయిదూ ప్రాణాలుపోసి  నవమాసాలు మోసిన
తనకు అప్పు పడ్డందుకు
తలకు కొరివి పెట్టమనీ
తన ఋణమును తీర్చమనీ
ఎన్ని జన్మలెత్తినా తనబిడ్డయి పుట్టమనీ
అమ్మా అని పిలవమనీ -
మాతృదేవోభవా ! మాతృదేవోభవా !
మాతృదేవోభవా |

Palli Balakrishna Sunday, October 29, 2023



చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే.వి.రాఘవులు 
సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్. జానకి 
నటీనటులు: కృష్ణం రాజు, గీత, పల్లవి, జయమాలిని, జ్యోతిలక్ష్మి 
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు 
నిర్మాత: కె. రామచంద్ర రావు 
విడుదల తేది: 10.08.1979


(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )




Songs List:



యాలో యాలా ఉయ్యాలా పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల 

యాలో యాలా ఉయ్యాలా
గున్నమావిలో కన్నెకోయిలా కూసిందియ్యాలా
ఎండకన్నులా పండువెన్నెలా కాసిందియ్యాలా
ఈ పులకరింతలే పూలు పుయ్యాలా
ఆ పలకరింతకే పైట జారాల ....

వున్న ఈడులేని తోడు - ఈసులాడుకున్న ఈ వేళ
మల్లెపువ్వు పిల్ల నవ్వు - మాటలాడుకున్న ఈ వేళ
ఏ ఈడులో ఆ వేడుక జరగాలనే చలికోరిక
కంటిపాపనే చందమామ వాటేసిందియ్యాలా
కొంగుచాటున కొండగాలి కాటేసిందియ్యాల
ఈ కలవరింతలే కలిసిరావాల
ఆ కోగిలింతలో కలిసిపోవాల....

వానపువ్వు తేనెటీగ - ముద్దులిచ్చి పుచ్చుకున్న వేళ
కన్నెసోకు కన్నుసోకి మొగ్గలిచ్చుకున్న ఈ వేళ
ఈ గుండెలో గూడున్నది - ఏ గువ్వకో చోటున్నది
కొత్తబరుపు నాకోకబిగువు కాజేసిందియ్యాలా
పైటదరువు నా పరువుతీసి ఆరేసిందియ్యాలా
ఈ జలదరింత నేనేడ దాయాలా
ఈ తొలకరింత నేనెవరికియ్యాలా ....




కోడెవయసూ కుమ్మేస్తుంటే పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి
గానం: పి.సుశీల , యస్.పి.బాలు

కోడెవయసూ కుమ్మేస్తుంటే - కొంటె మనసూ దొలిచేస్తుంటే
తిమ్మిరెక్కి నాఒళ్లు తుళ్లి తుళ్లి పడుతుంటే...ఏం చెయ్యాలి...అమ్మో
ఎటు పోవాలి?
ఆరు బైట జారు పైట రెపరెపమంటే నా గుండెలోన రేగింది
సన్నని చలిమంట
నీ చూపు నా వైపు ఎగాదిగా చూస్తే నా వెన్నులాగ సాగింది
వెచ్చని పులకింత
పట్ట బోతే పావురాయి - కొట్ట బోతే కొక్కిరాయి
అందకుంటే సూదంటురాయి అందకుంటే ఆకురాయి
కలిసివుంటె హాయి - కలపవేమె చేయి - 
ఒ రాలుగాయి గడుగ్గాయి అమ్మాయి
ఏం చెయ్యాలి - ఎటుపోవాలి
జత కలపాలి - కధ నడపాలి ॥కోడెవయసూ॥

బుగ్గమీద ముగ్గులేసి అలా అలా రాస్తే
సింగారం చిలికింది సిగ్గుల సిరిమొగ్గ
కూత కూసి లేతనడుము అటూయిటూ వూగితె
వలపు వయసు గోదారికి వచ్చింది వరద
ముట్టుకుంటే మునగకొమ్మ - పట్టుకుంటే వదలడమ్మ
మచ్చికైతే పూలరెమ్మ - నచ్చకుంటే మంచుబొమ్మ

పెళ్లయితే కీలుబొమ్మ - అందాక ముళ్ళకొమ్మ
ఆ పైనే నీముచ్చుట తీరేనమ్మా
ఏంచెయ్యాలి ఎటుపోవాలి - జతకలవాలి కధనడపాలి




మాఘమాసం మాపటేల పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

మాఘమాసం మాపటేల - మనక ఎన్నెట్లో
గోరింట పొదరింట కోరిన కౌగిట్లో
ఎన్ని ముద్దుముచ్చట్లో - ఎన్నో వున్నై గుప్పెట్లో
ఎట్టా సెప్పను యిప్పట్లో - సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం||

పులకింతలే బుసకొట్టగా - గిలిగింతలే నసపెట్టగా
ఆ కళ్ళే గిల్లి గిల్లీ - నా ఒళ్ళే తుళ్ళి మళ్ళి
నాగమల్లి తోటకాడ చంద్రవంక వాగులోన
నిండా మునగకుండానే నీల్లాడబోకుంటే
చలి చలి చలి అన్నానే, చెలి చెలి చెలి అన్నాడే
ఆడేమన్నాడో నేనేం యిన్నానో
ఎట్టా సెప్పను యిప్పట్లో సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం॥

పడుచందమే కడవెత్తగా - తడికొంగులే పడగెత్తగా
నీళ్ళే తొణికి తొణికి - నా ఒళ్ళే ఒణికి ఒణికి
నీలికొండ చాటుచూసి నీటిఎండ కాపుకాసి
ఆరీ ఆరకుండానే చీర కట్టుకొస్తుంటే
చుర చుర చుర చూశాడే - విర విర విర లాడానే
కంటే చూశాడో - కాటే వేశాడో.

ఎట్టా సెప్పను యిప్పట్లో
సెబుతా పెళ్ళిపందిట్లో.... ॥మాఘమాసం॥





చీరులోయ్ చీరులు పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది 
గానం: పి.సుశీల , యస్.పి.బాలు, యస్. జానకి

చీరులోయ్ చీరులు - చీరులోయ్ చీరులు
చుక్కచుక్క జారుల్లో - నిషా హుషారుల్లో
ఆనంద నిలయం - అందాల వలయం  
ఈ చుక్క సరసం - అందుకుంటె సార్గం.....॥చీరులోయ్ ||

పాలకుండ ఎన్నెలంటరో ఎన్నెట్లో నీలికొండ జారుబండరో
బండమీద కొక్కిరాయిరో - నన్ను నిక్కినిక్కి చూస్తుందిరో

అయితే యిదే మన తక్షణ కర్తవ్యం

నీటూ గోటూ దుశ్శశనా
సరసకురారా సుయోధనా
దానంచేసే ఓ కర్ణా - పాచికలాడే ఓ శకునీ
బొమ్మలాట నువ్వు ఆడకురా .. దుమ్ము దులపరా దొరమావా

మరి పొజిసన్ మార్చహే 

మార్చుకున్నా చల్లార్చుకున్నా - దీపాలయాల కాదురో
చీకట్లో చిందువేయరో 

అయితే ఒత్తినొక్కి దీపమార్పెయ్....
భారతకథలో రారాజైనా భామకు లోబడిపోలేదా
మందు పొందూ మరిగినవాడే - ఇంద్రుడిగా నిలబడలేదా
నేలకు నాలుగు దిశలంటా ఈ మనిషికి నాలుగు దశలంటా
దశలూ దిశలూ మారితే ఈ చతుష్టయం గతి ఏమంటా
రంభా ఊర్వశి  నేను మీ రంగులు తేల్చేస్తాను 
కామిని యామిని నేను మీ కధలే మార్చుతాను

Palli Balakrishna



చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, పాలవెల్లి 
గానం: జేసుదాసు, యస్.పి. బాలు, పి.సుశీల 
నటీనటులు: శారద, నరేష్, భానుప్రియ, రాజేష్ , భువన , చంద్ర కిరణ్ (నూతన పరిచయం)
కథ: డా॥ ఎమ్. ప్రభాకర్ రెడ్డి 
దర్శకత్వం: బి. భాస్కర రావు 
నిర్మాత: పి. వి. రమణ మూర్తి 
విడుదల తేది: 05.10.1984



Songs List:



ఓ ముద్దుల గుమ్మా మనసీవమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: పాలవెల్లి 
గానం: యస్.పి. బాలు 

ఓ ముద్దుల గుమ్మా మనసీవమ్మ 



ఒకే ముద్దు చాలు పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: జేసుదాస్, పి. సుశీల 

ఒకే ముద్దు చాలు మరువలేవు నన్ను నీవు 



మత్తు ముసురుకొస్తోంది అమ్మమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: పాలవెల్లి 
గానం: జేసుదాస్, పి. సుశీల 

మత్తు ముసురుకొస్తోంది అమ్మమ్మా 




పలికే దైవం మా అమ్మా మన అమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, ప్రకాశ్ 

పలికే దైవం మా అమ్మా మన అమ్మా 




నీ నీడలోనే ఉన్నాను పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

నీ నీడలోనే ఉన్నాను

Palli Balakrishna Tuesday, July 26, 2022



చిత్రం: ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణరావు, సిరివెన్నెల, దాసం గోపాలకృష్ణ 
గానం: పి. సుశీల, యస్. జానకి, యస్.పి. బాలు 
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, డిస్కో శాంతి
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
నిర్మాత: కోగంటి కేశవరావు
విడుదల తేది: 22.08.1986



Songs List:



బొమ్మలాంటి ముద్దుగుమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

బొమ్మలాంటి ముద్దుగుమ్మ



చిరునవ్వులు వెదజల్లెను పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

చిరునవ్వులు వెదజల్లెను



సీతాకాలం సాయంకాలం పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణరావు  
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

సీతాకాలం సాయంకాలం




శ్రీకాకుళం చీరకట్టి పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్. జానకి

శ్రీకాకుళం చీరకట్టి




న్యాయం ధర్మం పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: యస్.పి. బాలు 

న్యాయం ధర్మం 



వందేమాతరం వందేమాతరం పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణరావు 
గానం: యస్.పి. బాలు & కోరస్ 

వందేమాతరం వందేమాతరం 


Palli Balakrishna Saturday, July 23, 2022



చిత్రం: భారతంలో శంఖారావం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి, గోపి.. డాII. నెల్లుట్ల
గానం:  ఎస్.ఫై.బాలు, కె. జె. ఏసుదాసు, సుశీల , వాణి జయరాం,  శైలజ
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ 
దర్శకత్వం: బి.భాస్కరరావు
నిర్మాత: ఆర్. కేతినేని
విడుదల తేది: 01.01. 1984

Palli Balakrishna Tuesday, September 28, 2021



చిత్రం: తిరుగుబాటు (1985)
సంగీతం: జె వి. రాఘవులు
నటీనటులు: కృష్ణం రాజు, జయసుధ, సుమలత, మోహన్ బాబు, విజయశాంతి, సిల్క్ స్మిత, ఆర్.నారాయణ మూర్తి 
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాతలు: వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్
విడుదల తేది: 09.05.1985



Songs List:



ముద్దుల మూటకట్టి పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగుబాటు (1985)
సంగీతం: జె వి. రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ముద్దుల మూటకట్టి 



శ్రీమతి ప్రతి శ్రీమతి పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగుబాటు (1985)
సంగీతం: జె వి. రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: పి.సుశీల

శ్రీమతి ప్రతి శ్రీమతి



ఘణ ఘణ పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగుబాటు (1985)
సంగీతం: జె వి. రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

(మోహన్ బాబు, విజయశాంతి పై ఈ పాట చిత్రీకరించారు)

ఘణ ఘణ




నువ్వొస్తే ఏంచేస్తావు పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగుబాటు (1985)
సంగీతం: జె వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్. జానకి 

నువ్వొస్తే ఏంచేస్తావు

Palli Balakrishna Thursday, August 26, 2021



చిత్రం: రేచుక్క (1985)
సంగీతం: జె. వి. రాఘవులు 
నటీనటులు: భానుచందర్, తులసి
దర్శకత్వం: రవీంద్ర బాబు
నిర్మాతలు: సత్యా రెడ్డి, జగ్గు బాబు
విడుదల తేది: 1985

Palli Balakrishna Wednesday, August 25, 2021



చిత్రం: రారాజు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
నటీనటులు: కృష్ణం రాజు, విజయశాంతి, శారద, సుమన్ 
దర్శకత్వం: జి.రామ్మోహనరావు
నిర్మాత: వడ్డే శోభనాద్రి
విడుదల తేది: 03.08.1984



Songs List:



ఇది ఒక అలజడి పాట సాహిత్యం

 
చిత్రం: రారాజు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

ఇది ఒక అలజడి 




టంగుటూరు పాట సాహిత్యం

 
చిత్రం: రారాజు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

టంగుటూరు




సింగన్న మద్దెల పాట సాహిత్యం

 
చిత్రం: రారాజు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల

సింగన్న మద్దెల 




ఝం జమారే ఇది ప్రేమ భజన పాట సాహిత్యం

 
చిత్రం: రారాజు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. జానకి, యస్.పి. బాలు 

ఝం జమారే ఇది ప్రేమ భజన 



రా రాజు మా రాజు పాట సాహిత్యం

 
చిత్రం: రారాజు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. జానకి, యస్.పి. బాలు 

రా రాజు మా రాజు 

Palli Balakrishna





చిత్రం: అపరాధి (1984)
సంగీతం: జె. వి. రాఘవులు
నటీనటులు: సుమన్, సుహాసిని (తొలిపరిచయం), గిరిబాబు, జయమాలిని
దర్శకత్వం: పర్వతనేని సాంబశివరావు
బ్యానర్: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాత: ఎస్. గోపాల్ రెడ్డి
విడుదల తేది: 09.03.1984

(సుహాసిని మణిరత్నం గారి మొదటి తెలుగు సినిమా)

Palli Balakrishna Friday, August 20, 2021





చిత్రం: దుర్గాదేవి (1983)
సంగీతం: జె.వి.రాఘవులు 
నటీనటులు: మురళీమోహన్, మోహన్ బాబు, శారద, జయసుధ 
దర్శకత్వం: నందం. హరిశ్చంద్ర రావు 
నిర్మాత: వడ్డే శోభనాద్రి
విడుదల తేది: 1983

Palli Balakrishna Saturday, August 7, 2021





చిత్రం: సంతానం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: మురళీమోహన్, సుహాషిని, సుమలత  (అతిధి పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ )
దర్శకత్వం: త్రిపురనేని వరప్రసాద్ 
నిర్మాత: నవభారత్ బాబురావు
విడుదల తేది: (1984)

Palli Balakrishna Monday, August 2, 2021





చిత్రం: మహా మనిషి (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: కృష్ణ , జయప్రద, రాధ
దర్శకత్వం: యం. బాలయ్య
నిర్మాత: యు.సూర్యనారాయణ బాబు
విడుదల తేది: 14.11.1985



Songs List:



చిట్టెలుక చిట్టెలుక పాట సాహిత్యం

 
చిత్రం: మహా మనిషి (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మాధవపెద్ది రమేష్, పి. సుశీల

చిట్టెలుక చిట్టెలుక



చూపులు చూపులు పాట సాహిత్యం

 
చిత్రం: మహా మనిషి (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: కె. జె. జేసుదాస్, పి. సుశీల

చూపులు చూపులు 




ఢీ ఢీ ఢీ పాట సాహిత్యం

 
చిత్రం: మహా మనిషి (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మాధవపెద్ది రమేష్ , పి. సుశీల

ఢీ ఢీ ఢీ 





ఎవరు నేను ఎవరు నేను పాట సాహిత్యం

 
చిత్రం: మహా మనిషి (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: కె. జె. జేసుదాస్, పి. సుశీల

ఎవరు నేను ఎవరు నేను 




గుమ్మా గుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: మహా మనిషి (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్. జానకి 

గుమ్మా గుమ్మా 




ముద్దు - ఊహు వద్దూ పాట సాహిత్యం

 
చిత్రం: మహా మనిషి (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: రాజ్ సీతారాం, యస్. జానకి 

ముద్దు  - ఊహు వద్దూ

Palli Balakrishna Friday, July 30, 2021




చిత్రం:  మాయదారి అల్లుడు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: కృష్ణ , జయప్రద 
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్ 
నిర్మాత: జి.బాబూరావు
విడుదల తేది: 12.11.1981



Songs List:



దొరలాగా వచ్చాడు పాట సాహిత్యం

 
చిత్రం:  మాయదారి అల్లుడు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు , పి.సుశీల 

దొరలాగా వచ్చాడు 




ముళ్ళు గుచ్చుకుండా పాట సాహిత్యం

 
చిత్రం:  మాయదారి అల్లుడు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు , పి.సుశీల 

ముళ్ళు గుచ్చుకుండా




చిక్కినట్టే చిక్కి పాట సాహిత్యం

 
చిత్రం:  మాయదారి అల్లుడు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు , పి.సుశీల 

చిక్కినట్టే చిక్కి 




చుప్పనాతి సుందరాంగి పాట సాహిత్యం

 
చిత్రం:  మాయదారి అల్లుడు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

చుప్పనాతి సుందరాంగి 



గోల్మాల్ గోల్మాల్ పాట సాహిత్యం

 
చిత్రం:  మాయదారి అల్లుడు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు , పి.సుశీల 

గోల్మాల్  గోల్మాల్ 



రా రా ఈ రాత్రి వస్తావా పాట సాహిత్యం

 
చిత్రం:  మాయదారి అల్లుడు (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం:  పి.సుశీల 

రా రా ఈ రాత్రి వస్తావా 

Palli Balakrishna Thursday, July 8, 2021



చిత్రం: కృష్ణ పరమాత్మ (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: కృష్ణ , రాధిక శరత్ కుమార్, నరేష్
దర్శకత్వం: విజయనిర్మల
నిర్మాత: కోగంటి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 29.08.1986



Songs List:



ఊపే ఉల్లాసము పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: రాజసీతారాం, వాణీజయరాం

ఊపే ఉల్లాసము



తాకితే తహ తహ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: రాజసీతారాం, వాణీజయరాం

తాకితే తహ తహ



జెండాపై కపిరాజు పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: రాజసీతారాం

జెండాపై కపిరాజు రెప రెపమంటే




ఉదయంలా మేలుకో సూర్య పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: రాజసీతారాం

ఉదయంలా మేలుకో సూర్య 



కథ ముగుసిందీ వెత తీరింది పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల 

కథ ముగుసిందీ వెత తీరింది



ఉన్నా వున్నాకాచుకున్నా పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ 
గానం: రాజసీతారాం, పి. సుశీల 

ఉన్నా వున్నాకాచుకున్నా

Palli Balakrishna Friday, April 5, 2019




చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
నటీనటులు: నాగేశ్వర రావు , మంజుల, చంద్రకళ 
దర్శకత్వం: తాతినేని రామారావు 
నిర్మాత: జె. సుబ్బారావు, జి. రాజేంద్రప్రసాద్ 
విడుదల తేది: 31.10.1974



Songs List:



దేవుడెలా వుంటాడని పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
దేవుడెలా వుంటాడని ఎవరైనా అడిగితే
మా అన్నలా వుంటాడని అంటాను నేను
అనురాగమెలా వుంటుందని ఎవరైనా అడిగితే
మా చెల్లిలా వుంటుందని చెబుతాను నేను

చరణం: 1
చెల్లెలున్న యీ యిల్లే సిరిమల్లె తోట
మా....ఆమ్మలు చిరునవ్వే ముత్యాల మూట
అన్నయ్య హృదయమే అందాల మేడ
చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ
కన్నతల్లి తీపికలల రూపాలం మనము
కోవెలలో వెలిగించిన దీపాలం మనము

చరణం: 2
అల్లారు ముదుగా నను పెంచినావు
అమ్మనూ నాన్ననూ మరిపించినావు
ఇల్లాలివై నీవు విలసిల్ల వమ్మా
పాపలతోటి చల్లగా వుండవమ్మా 
పుట్టినింటవున్నా, మెట్టినింటవున్నా
అన్నయ్య దీవనే శ్రీరామరక్ష 



చంద్రగిరి చంద్రమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల, కోరస్

పల్లవి:
చంద్రగిరి చంద్రమ్మా - సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక - అలసిపోక వుండమ్మా 
చంద్రగిరి చంద్రయ్యా - సందేళ కొస్తానయ్యా
అందాక పనిచేసి - ఆకలేసి వుండయ్యా 

చరణం:
వలమాలిన వయసేమో వెలువంటిది
దాని కాశయాల కానకట్ట వేసుకోవాలి
కోరస్: ఆనకట్టనే వేసుకోవాలి
ఆడది మగవాడు ఆడుతూ పాడుతూ
దాన్ని మళ్ళించి మంచితనం పండించాలి

చరణం:
మట్టినీళ్ళల్లా మనమేకం కావాలి
చెట్టాపట్టగ చేయిపట్టి నడవాలి
కోరస్ : పట్టి నడవాలి
పుట్టినందు కేదైన గట్టి పనిచేయాలి
పుట్టబోయేవాళ్ళు మన పేరు చెప్పుకోవాలి

చరణం:
కావేరి గోదారి గంగా కృషమ్మలను
కలిపేసి నిలవేసి కక్షలను మాపాలి
కోరస్: కక్షలను మాపాలి
ప్రతిపల్లె పెళ్ళికాని పడుచుపిల్ల కావాలి
పంటలక్ష్మి యింటింటా భరతనాట్యమాడాలి



అమ్మమ్మొ.... యీ గుంటడు పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
అమ్మమ్మొ.... యీ గుంటడు ఎంతకిలాడి
గుచ్చిగుచ్చి చంపుతడు కళ్ళతోటి-దొంగకళ్ళతోటి
అన్నన్న.... యీ కుర్రది టక్కులాడి
బులిపించి చంపుతది మాటలాడి మాయమాటలాడి

చరణం: 1
నీ చెవిలో ఏదో మంత్రమున్నది
తాకగానే నా గుండె కొట్టుకుంటది
చంద్రం తాకితేనే నీ గుండె కొట్టుకుంటది
తాకకుంటె నా గుండె ఆగిపోతది

చరణం: 2
నీ కంట్లో నా నీడ వెచ్చగుంటది
నాకేమో ఆ వేడి ధక్క నంటది
నీడైతే నా కంట్లో కుదురుగుంటది
నువ్వైతే నా ఒళ్లు అలసిపోతది

చరణం: 3
నీ సొగసే నా చూపుకి తిండి పెడతది
పిసినిగొట్టు నీ మనసే కసిరికొడతది
చూపుతో నీ వయసుకు కరువు తీరదు
తీరిస్తే నా సిగ్గుకు పరువు మిగలదు





నీకూ నాకూ పెళ్ళంటే పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: చెరువు ఆంజనేయ శాస్త్రి
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి: 
నీకూ నాకూ పెళ్ళంటే
నింగి నేలా మురిశాయి
వయసూ సొగసూ కలిబోసి రంగవెల్లి వేశాయి

చరణం: 1
కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయి
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయి
తెలిసింది నీ ఎత్తు 
ఆ ఎత్తే గమ్మత్తు
సందెలో విందులా
విందులో — పొందులా

చరణం: 2
ఏడడుగులు నడిచావటే
ఎండమొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన ఒళ్లు ఎక్కడ ఆరేసుకోను
నాలోనే వేడుంది
నీ ధోరణి బావుంది
ఎండలో - వానలా
వానలో - హాయిలా

చరణం: 3
మూడు ముళూ వేయకముందే
నన్నల్లరి చెయ్యొద్దు
ఇల్లాలినవి కావాలంటే యివ్వాలి తొలిముద్దు 
ఏమిటి యీ చిలిపితనం
అంతేలే కుర్రతనం
పూవులో - తేటిలా
తేటిలో - పాటలా




వద్దు వద్దు వద్దు పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: రామకృష్ణ, పి.సుశీల

వద్దు వద్దు వద్దు ముద్దు యివ్వొద్దు 
అది తేనెకన్న తియ్యనని చెప్పొద్దు 
నాకు చెప్పొద్దు
వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దు
దాని తీపిఎంతో తెలిసికోక చెప్పద్దు వద్దుచెప్పద్దు 

చరణం: 1
నా పెదవిపై పేరువుంది చదువుకో
నా హృదయమందు రూపముంది చూసుకో
దొరబాబు ఆ పేరు నాదని, రూపు నాదని
నీ చెంప ఎరుపు చెప్పకే చెప్పింది 
ఒప్పుకోమంది 

చరణం: 2
గుప్పెడంత గుండెలోన గుట్టుంది
విప్పలేని చిక్కుముడై వేసింది
చిక్కుముడిని పంటనొక్కి విప్పుకోవచ్చు
గుట్టులన్ని కళ్ళతోటి చెప్పుకోవచ్చు

చరణం: 3
పాట వింటు పరవశించి పోవద్దు 
ఆట కట్టి పోవునని అనుకోవద్దు 
పాట పాడినా పరవశించినా
పగబట్టిన నాగుబాము పడగ దించునా
కాటు మానునా ?



ఒంటరిగా వున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి: 
ఒంటరిగా వున్నాను
ఇస్సిరిస్సు రంటున్నాను

ఇంతకన్న ఏం చెప్పుకోనురో బావయ్యో
యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో 
పక్కన నేనున్నాను
ఆవురావురంటున్నాను
దారిలేక ఆగానమ్మో చిట్టమ్మో
కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో

నా మనసుకు బుద్దిలేదు పదారేళ్లుగా
బుద్దొచ్చి మరుగుతోంది నాలుగేళ్లుగా
నా మోజుకు రంజులేదు నువ్వు చేరకా
రంజులోన లబ్జులేదు కోర్కెతీరకా

పొద్దు పొడుపు యెందుకనో చురుక్కుమంటది
పొద్దు గుంకితే నాలో కలుక్కుమంటది
పొద్దుకైన వొకరైతే చులకనే మరి
ఇద్దరమూ వొకటైతే వోడిపోతది…





రారా పడకింటికి పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల

రారా పడకింటికి
నిదుర రాదూ నా కంటికి
తగిన మందివ్వరా - రగిలే నా ఒంటికి

ఎందుకు పడకింటికి పోదాములే పొదరింటికి
తగిన మందుందిలే
రగిలే నీ ఒంటికి ....

చరణం: 
వెచ్చగా చలివేసింది.
మత్తుగా మసకేసింది
కొత్తమోజు రేగింది అది పిచ్చిగా నినుకోరింది
మోజే ప్రేమయితే - ప్రేమే పిచ్చయితే 
ఆ పిచ్చి ముదిరితే - నీ మనసు బెదిరితే
ఆఁ... అందుకే

చరణం: 
ఆడదాని వలపులు ఏటిలోని తరగలు
ఏ గాలికి అవి చెదురునో
ఏ గట్టు తాకీ విరుగునో
నీలాంటి దొరబాబే
నా జంటగా వుంటే
నా మనసు చెదిరిపోదు
యీ వలపు విరిగిపోదు
ఆహాఁ ... అయితే
ఎందుకు పొదరింటికి - పోదాములే పడకింటికీ
తగిన మందుందిలే రగిలే నీ వొంటికీ

Palli Balakrishna Wednesday, March 20, 2019

Most Recent

Default