-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ghantadi Krishna"
Ninne Premistha (2000) Telugu Songs Lyrics Album Cover

Ninne Premistha (2000) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Ninne Premistha (2000)
Director : R. R. Shinde
Producer : R. B. Choudary
Actresses : Soundarya
Supporting Cast : Rajendra Prasad
Release Date : 14 September 2000

Oka Devata (Male Version) Song Lyrics in Telugu – Ninne Premistha (2000)

'Oka Devata (Male Version)' song from Ninne Premistha (2000) movie is composed by S. A. Rajkumar and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Ninne Premistha (2000)
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: డా౹౹ వెనిగళ్ల రాంబాబు గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి: ఒక దేవత వెలసింది నా కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే చరణం: 1 విరిసె వెన్నెల్లోన మెరిసె కన్నుల్లోన నీనీడే చూసానమ్మ ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా నీ నవ్వే నా మదిలో అమృతవర్షం ఒదిగింది నీలోనే అందని స్వర్గం నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి మునుముందుకు వచ్చేనే చెలినే చూసి అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే చరణం: 2 రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగపోసి పూయించా నీ జడకోసం రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా భూజించా నీ జతకోసం నీరెండకు నీవెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలుపుకు హారతులిస్తా ఇన్నాల్లు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

Prema Endukani Song Lyrics in Telugu – Ninne Premistha (2000)

'Prema Endukani' song from Ninne Premistha (2000) movie is composed by S. A. Rajkumar and sung by Rajesh and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Ninne Premistha (2000)
Lyricist : E. S. Murthy
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: ఈ. యస్. మూర్తి గానం: రాజేష్, కె. ఎస్. చిత్ర పల్లవి: ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం ఇపుడే అది కానుంది తీయని బంధం శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు చరణం: 1 పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు చీకటే చెరిగేలా ఆ కంటి చూపు వేకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం ముగ్గుల నడుమున సిగ్గులు చల్లే నా చెలి మందారం ఎంత చేరువై వుంటే అంత సంబరం ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు చరణం: 2 ఏటిలో తరగల్లే ఆగనంటుంది ఎదురుగా నేనుంటే మూగబోతోంది కంటికి కునుకంటూ రాను పొమ్మంది మనసుతో ఆ చూపే ఆడుకుంటూంది ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవం ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం ఇపుడే అది కానుంది తీయని బంధం శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు

Koila Pata Song Lyrics in Telugu – Ninne Premistha (2000)

'Koila Pata' song from Ninne Premistha (2000) movie is composed by S. A. Rajkumar and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Ninne Premistha (2000)
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి: కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా  కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా  అందమైన మల్లె బాల బాగుందా అల్లి బిల్లి మేఘమాల బాగుందా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా  చరణం: 1 అప్పుడెప్పుడో గున్నమామి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా నిదురించిన ఎద నదిలో అల లెగిసిన అలజడిగా తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా చిలకమ్మా చెప్పమ్మ చిరుగాలి చెప్పమ్మా  కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా  చరణం: 2 మబ్బుచాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గచుక్కలాగా ఉన్న తారక కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా కలలు కనే కన్నులలో కునుకెరుగని కలవరమా రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది అందమైన మల్లెబాల బాగుంది అల్లి బిల్లి మేఘమాల బాగుంది చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది  కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది

Gudi Gantalu Song Lyrics in Telugu – Ninne Premistha (2000)

'Gudi Gantalu' song from Ninne Premistha (2000) movie is composed by S. A. Rajkumar and sung by Rajesh and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Ninne Premistha (2000)
Lyricist : Ghantadi Krishna
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: గంటాడి కృష్ణ గానం: రాజేష్, కె. ఎస్. చిత్ర పల్లవి: గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది ఆ దేవుని పూజకు నువ్వొస్తే నా దేవిని చూడగ నేనొస్తే అది ప్రేమకు శ్రీకారం గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట చరణం: 1 నా చిరునవ్వయి నువ్వే ఉండాలి - ఉండాలి నా కనుపాపకు రెప్పయి వుండాలి - ఉండాలి ఉండాలి చెలి గుండెలపై నిద్దుర పోవాలి - పోవాలి ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి - ఎదగాలి ఎదగాలి నా చెలి అందెల సవ్వడి నేనై నా చెలి చూపుల వెన్నెల నేనై చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి నుదుటి బొట్టై నాలో నువ్వు ఏకమవ్వాలి చరణం: 2 వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి - పోయాలి నెచ్చెలి పమిటికి చెంగును కావాలి - కావాలి కమ్మని కలలకు రంగులు పూయాలి - పూయాలి నా చిరునామా నువ్వే కావాలి - కావాలి కావాలి తుమ్మెద నంటని తేనెవు నువ్వయి కమ్మని కోకిల పాటవు నువ్వయి చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి వెలుగులు పంచాలి వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది ఆ దేవుని పూజకు నువ్వొస్తే నా దేవిని చూడగ నేనొస్తే అది ప్రేమకు శ్రీకారం గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

Premalekha Song Lyrics in Telugu – Ninne Premistha (2000)

'Premalekha' song from Ninne Premistha (2000) movie is composed by S. A. Rajkumar and sung by Hariharan.

SONG INFORMATION
Movie : Ninne Premistha (2000)
Lyricist : Samavedam
Singers : Hariharan
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సామవేదం గానం: హరిహరన్ పల్లవి: ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని అందమైన ఊహాలోకం అందుతుందని వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని ఎదురు చూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని చరణం: 1 కనులకు తెలియని ఇదివరకెరుగని చలినే చూడాలని ఊహల దారుల ఆశలు వెదికెను ఆమెను చేరాలని ఎదసడి నాతోనే చెప్పకపోదా ప్రియసఖి పేరేమిటో కదిలే కాలాలు తెలుపక పోవా చిరునామా ఏమిటో చెలి కోసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని చరణం: 2 కవితలు చాలని సరిగమ లెరుగని ప్రేమే నా పాటని రెక్కలు తొడిగిన చిగురాశలతో కబురే పంపాలని కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా మదిలో భావాలని ఎగసే కెరటాన్ని అడిగిచూడనా ప్రేమకు లోతెంతని చిరుగాలుల్లో ప్రియరాగం పలికే ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని అందమైన ఊహాలోకం అందుతుందని వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని ఎదురు చూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం

Oka Devata (Female Version) Song Lyrics in Telugu – Ninne Premistha (2000)

'Oka Devata (Female Version)' song from Ninne Premistha (2000) movie is composed by S. A. Rajkumar and sung by K. S. Chithra and Parthasarathy.

SONG INFORMATION
Movie : Ninne Premistha (2000)
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: డా౹౹ వెనిగళ్ల రాంబాబు గానం: కె. ఎస్. చిత్ర, పార్ధసారధి పల్లవి: ఒక దేవత వెలసింది నీ కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా  సౌందర్యాలే చిందే యామినిలా  ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తు అంటూ నీతో అంది ఇలా  నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నీ కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే చరణం: 1 విరిసె వెన్నెల్లోన మెరిసె కన్నుల్లోన నీనీడే చూసానమ్మా ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా నీ నవ్వే తన మదిలో అమృతవర్షం  నీలోనే ఉందమ్మా అందని స్వర్గం రవలించే హృదయం తో రాగం తీసి నీకుంకమ తిలకంతో పవిటే రాసి అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని  ఒక దేవత వెలసింది నీ కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే చరణం: 2 కళ్ళకు కనులే విందు కాటుక సిగ్గులు విందు కాబోయే కళ్యాణం లో తనలో సగమే నీది నీలో సర్వం తనది అనురాగం మీ ఇద్దరిది ఆ తార తోరణమే మల్లెల హారం చేరాలి మురిపాల సాగర తీరం అలరించే మీ జంట వలపుల పంట శుభామంటూ దీవించే గుడిలో గంట చెప్పాలి తనతో నీవే నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నీ కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా  సౌందర్యాలే చిందే యామినిలా  ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తు అంటూ నీతో అంది ఇలా  నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నీ కోసమె ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

Palli Balakrishna Wednesday, January 23, 2019

చిత్రం: ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి (2004)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయణ్ , కవితా కృష్ణమూర్తి
నటీనటులు: శ్రీకాంత్ , ప్రభుదేవా, ఆర్తి ఛాబ్రియా
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 13.08.2004

పల్లవి:
భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ఇరువైపుల పొంగుతున్నది ఆనందమే
వరదై నను ముంచుతుంది నీ ఆనందమే
ఏదో లాగుంది...

గంగ లాగ పొంగిరాగ ఆనందమే
తీగలాగ అల్లుకోదా ఆనందమే
అరె గువ్వ లాగ వాలిపోదా ఆనందమే
గుండెలోన నిండిపోదా ఆనందమే

భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే

చరణం: 1
కందిరీగ కాటులా గండె చీమ మీటుల
కుట్టినట్టు ఉంది నీ ఆనందమే
హే కప్పుకుంటే వేడిగా విప్పుకుంటే చల్లగా
దుప్పటల్లే ఉంది మా ఆనందమే
చేయి తాకినంతనే ఆనందమే
ఒళ్ళు జలదరించి నంతగా ఆనందమే
బొట్టుపెట్టి చెప్పనా ఆనందమే
నీ నడుము చుట్టు దాగివుంది ఆనందమే
బాబో వదిలేస్తే పోదా

గంగ లాగ పొంగిరాగ ఆనందమే
తీగలాగ అల్లుకోదా ఆనందమే
హే గువ్వ లాగ వాలిపోదా ఆనందమే
గుండెలోన నిండిపోదా ఆనందమే

భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే

చరణం: 2
మూతి ముడిచి చూపినా సిగ్గువిడిచి చెప్పినా
అర్ధమయ్యి చావాదు ఆనందమే
తేనెలూరు చిన్నది తిప్పుకుంటు చెప్పినా
తియ్యతియ్యగుంటది ఆనందమే
చందమామ వంటినే ఆనందమే
మీరు చిందులేస్తే అందునా ఆనందమే
అందరాని సందులో ఆనందమే
అందిపుచ్చుకుంటె అందులో ఆనందమే
ఏమో తుదకేమౌతుందో

గంగ లాగ పొంగిరాగ ఆనందమే
తీగలాగ అల్లుకోదా ఆనందమే
హే గువ్వ లాగ వాలిపోదా ఆనందమే
గుండెలోన నిండిపోదా ఆనందమే

భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ఇరువైపుల పొంగుతున్నది ఆనందమే
వరదై నను ముంచుతుంది నీ ఆనందమే
ఏదో లాగుంది...

గంగ లాగ పొంగిరాగ ఆనందమే
తీగలాగ అల్లుకోదా ఆనందమే
అరె గువ్వ లాగ వాలిపోదా ఆనందమే
గుండెలోన నిండిపోదా ఆనందమే

భామా నీతో జామపండు తింటుంటే
ఆనందమే ఇక ఆనందమే
ప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటే
ఆనందమే ఇక ఆనందమే


Palli Balakrishna Tuesday, November 28, 2017




చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
నటీనటులు: రోహిత్, గజాల, రేఖ వేదవ్యాస్, ప్రేమ
దర్శకత్వం: అంజి
నిర్మాత: యస్.రమేష్ బాబు
విడుదల తేది: 11.09.2003



Songs List:



మేరా దిల్ తుజుకో దియా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: కుమార్ సాను & కోరస్

పల్లవి: 
మేరా దిల్ తుజుకో దియా 
గుండెల్లో నువ్వే ప్రియా 
మేరా దిల్ తుజుకో దియా
యదలో చూడే ఇలా ఎపుడూ నీదే లయా
యదలో చూడే ఇలా 
ఎపుడూ నీదే లయా
మేరా దిల్ తుజుకో దియా

చరణం: 1
అడుగు తీసి అడుగేయబోతే
ఆ అడుగే అడిగింది
నీ వైపే పదమంది
పెదవి విప్పి మాటాడబోతే
నీ పేరే పలికింది 
నువ్వే నేనంటుంది
ఎటు చూసినా,  ఏం చేసినా 
నీ రూపు రేఖలే కనిపించెనే
ఏ సవ్వడి వినిపించినా 
నువ్వు పిలిచినట్టుగా అనిపించెనే
మేరా దిల్ తుజుకో చియా

చరణం: 2
ఇన్నినాళ్ళుగా మూగబోయి
ఉందే నా మనసిపుడే
తెగ తొందర పడిపోతుంది
ఎంత చెప్పినా ఆగనంటూ
మాటే విననంటుంది తన బాటే తనదంటోందే
ఏమైందనీ, నేనడిగితే తన పెదవి ముడిని అపుడిప్పిందిలే
నీ కోసమే ఈ పరుగని చెవిలోన చిన్నగ చెప్పిందిలే
మేరా దిల్ తుజుకో దియా




పండువెన్నెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: టీనా కమల్

పల్లవి: 
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం 
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం
నీ పేరే పాడుతున్న మౌనసంగీతం 
ఎద నీ రాక కోసం పలికే స్వాగతం

చరణం: 1
ఎగిరే గోరింకా ఇటురావా నా వంక 
నువ్వు ఎందాకా పోతావో నేను చూస్తాగా 
చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్కా అలిసాకా నీ రెక్క
నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురుతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపును నేనేగా
రప్పించు కోనా నిను నా దాకా 

చరణం: 2
కన్నె సీతమ్మకీ పెళ్లీడు వచ్చిందని కబురు
వెళ్ళిందిగా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకె పుట్టిందని
తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి
వేదించే దూరమంతా కరిగేలా
విరహల విల్లు ఇట్టే విరిగేలా
విడిపోని బంధమేదో కలిపేలా 
మెడలోన వాలనుంది వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలా



రివ్వున ఎగిరే గువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: సునీత, ఉష, సంజీవిని ఘంటాడి,
ఘటికాచలం, వరికుప్పల యాదగిరి & కోరస్

పల్లవి: 
రివ్వున ఎగిరే గువ్వా...
నీ పరుగులు ఎక్కడికమ్మా ...
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...

చరణం: 1
అల్లరి పిల్లకు నేడు వెయ్యాలిక మెళ్ళోతాడు
ముడివేసే సిరిగల మొనగాడు ఎవరే వాడు
చక్కని రాముడు వీడు నీ వరసకు మొగుడౌతాడు
ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు ఈ పిరికోడు
ఆ కృష్ణుడి అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే
గోపికలే వస్తే అటే పరిగెడతాడే
ఓ గడసరి పిల్లా నీ కడుపున కొడుకై పుడతానే
కూతురుగా పుట్టు నీ పేరే పెడతాలే
గొడవెందుకు బావతో వెలతావా
పదబావా పాలకోవా...

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...

చరణం: 2
చిటపట చినుకులు రాలి 
అవి చివరకు ఎటు చేరాలి
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి
నిండుగ నదులే ఉరికి అవి చేరునది ఏదరికి
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి
అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి
బతుకంతా ఒకటై ఇలా జత కావాలి
మన బొమ్మల పెళ్ళి నువ్వే తాళిని మెళ్ళో కడతావా
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా
ఓబావా ఒట్టే పెడుతున్నా ...
నే కూడ ఒట్టేస్తున్నా...

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 

నా రాజు నువ్వేనంటా... 
ఈ రోజే తెలిసిందంటా...
నా రాజు నువ్వేనంటా... 
ఈ రోజే తెలిసిందంటా...




అందాల భామలూ ... పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: సందీప్ బేమెక్, సునీత, నిష్మా & కోరస్

పల్లవి: 
అందాల భామలు  క్యాట్‌వాకు చేపలు
ఆడతరా మాతో సైయ్యాటలు
మీరంతా కోతులుమీ తోనా ఆటలూ
వద్దంటే వినరే  మా మాటలూ 

ఎందుకలా  ఊరికనే నిందిస్తారే 
మాతో పోటీ అంటే భయమేమోలే 
అబ్బబ్బో మీకంత సీను లేదులే
మీ కంటే సీనియర్లని చూసినాములే
ఐతే లేదు ఎందుకంట  చప్పున వచ్చేయ్యరే 

అందాల భామలూ

చరణం: 1
గోడమీది బొమ్మ  ఆ గొలు సులున్న బొమ్మ 
ముట్టుకుంటే మొట్టికాయ వేస్తదమ్మా 
దాని పేరేంటో నువ్వు చెప్పవమ్మా
ఇంత సిల్లి క్వశ్చన్  అది కాదు మాకు కష్టం 
ఇంత సిల్లి క్వశ్చన్  అది కాదు మాకు కష్టం
దాని పేరు తేలు అని అంటారంట
ఒళ్ళంతా గొలుసులుగా ఉంటుందంట
మామా కాని మామా మరి ఎవ్వరే 
నింగిలోని నిందు చందమామ లే
కాయకాని కాయ మరి ఏమిటే
కాయకాని కాయ నీ తలకాయలే

అందాల భామలూ

చరణం: 2
హలో హలో సారు జరదేఖో ఒక మారు 
ఆ దాచేసిన పెళ్ళి బట్టలిచ్చుకోండి
ఇక మా ముందు మీ ఆటలు చెల్లవండి 
ముద్దు ముద్దుగుమ్మ  మురిపాల పూల రెమ్మ
అరె ముద్దు ముద్దుగుమ్మ  మురిపాల పూల రెమ్మ
ముందు మేము అడిగింది ఇచ్చుకోమ్మ 
ఆ తర్వత ఆ బట్టలు పుచ్చుకోమ్మ 
అంత హెడ్డు వెయిట్ మీకు ఎందుకూ 
ఇవ్వకుండా మారము లెందుకు
ఎంతైన మగపెళ్ళి వారమే
మరీ మర్యాదలు మాకెన్నో చెయ్యాలిలే

అందాల భామలూ 




రివ్వున ఎగిరే గువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట ఓ అందమైన ప్రేమకథ. 

రెండు గువ్వలు చిలక, గోరింక, 
రెండు రవ్వలు తార, నెలవంక
కలలు కన్నాయి కథలు చెప్పుకున్నాయి
ఆకాశం సాక్షిగా భూదేవి సాక్షిగా
పసి వయసులో బొమ్మల పెళ్లి చేసుకున్నాయి.
కడవరకు నిలవాలని బాసల వీలునామా రాసుకున్నాయి. ఇంతలో కాలం కన్నెర్ర చేసింది,
ఆ జంటను విడదీసింది. ఇక ఒకే వెతుకులాట,
ఇప్పుడు అదే నా ఈ పాట

పల్లవి:
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా
నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
ఓ ఓ ఓ..... ఏ ఏ ఏ.....

చరణం: 1
వీచే గాలుల వెంట నా వెచ్చని ఊపిరినంత
పంపించానే అది ఏ చోట నిను తాకనే లేదా
పూచే పూవుల నిండా మన తీయని జ్ఞాపకమంతా
నిలిపుంచానే నువ్వు ఏ పూటా చూడనే లేదా

నీ జాడను చూపించంటు ఉబికేనా ఈ కన్నీరు
ఏ నాడు ఇలపై పడి ఇంకిపోలేదు
నడిరాతిరి ఆకాశంలో నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు
ఆ దారిని తూరుపువై రావా
నా గుండెకు ఓదారుపు

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా 
నిను ఎక్కడవెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా

చరణం: 2
కిన్నెరసాని నడక నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా కడదాక తోడై రాక
బతుకే బరువై పోగా మిగిలున్న ఒంటరి శిలగా
మన బాసల ఊసులు అన్ని కరిగాయా ఆ కలగా
ఎన్నెన్నో జన్మలదాక ముడివేసిన మన అనుబంధం
తెగి పోయిందంటే నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నది ఆంటే ఇంకా ఈ నా దేహం
క్షేమంగ ఉన్నట్టే తనకూడా నాస్నేహం
ఎడబాటే వారదిగా చేస్తా
త్వరలోనే నీ జతగా వస్తా

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా నిను ఎక్కడ వెతికేదమ్మా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా




ఈఫిల్ టవరయినా...పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: శంకర్ మహదేవన్, సురేఖా మూర్తీ

పల్లవి: 
ఈఫిల్ టవరయినా...
మన చార్మినార్‌ తో సాటిరాదురా
వాషింగ్టన్ అయినా 
మన వాగులముందు దిగదుడుపేరా
ఈఫిల్ టవరయినా
మన చార్మినార్‌ తో సాటిరాదురా
వాషింగ్టన్ అయినా 
మన వాగులముందు దిగదుడుపేరా

సుబ్బలక్ష్మి ముందు మదోన్నా వేస్టు
ఫాస్ట్ బీట్ కన్నా మెలోడి టేస్టు
అచ్చమైన ఆవకాయే మనకు నచ్చునురా

ఈఫిల్ టవరయినా....

చరణం: 1
క్రికెట్లో వీరుల్లా ఎవరికి వారే అనుకున్నా
ఉరుమల్లే ఊరిమేటి సచ్చిన్ తో సరితూగేనా
ఆ మైఖేల్ జాక్సన్ తెగ ఊపే స్టెప్పుల కన్నా
మెరుపై మెలితిరిగే చిరునగువే మిన్నా

గంగి గోవుపాలు గరిటెడు చాలు కడివెడు ఎందుకురా
గుండె నిబ్బరంతో సాధించేందుకు ఒక్కడు చాలునురా
నోరు తెరిచి పలకరాని భాషలెన్నున్నా
స్వచ్చమైన తేట తెలుగే అన్నిటా మిన్నా

ఈఫిల్ టవరయినా...

చరణం: 2
ISI ని తరిమేసేయ్ పోలిమేరల్లోకి రాకుండా
హిందుస్తాన్ హమారహై అని ఒట్టేయ్యాలి ప్రతి ఇంటా
మువ్వన్నెల జెండా - అది ఎగరాలి ఎదనిండా
చూసేద్దాం శతువుతో ఇక నిదురే రాకుండా
మువ్వన్నెల జెండా
కుప్పిగంతులేసే ముషారఫ్ ని రఫ్ ఆడించేద్దాం
మన అటల్ బిహరి వాజ్ పేయ్ కి చేయూత అందిద్దాం...
హద్దుమీరి చేయిజారే సాంప్రదాయాల్లో
కమ్మనైనా కల్చరంటే ఇండియాదే రోయ్

ఈఫిల్ టవరయినా....




ఏ దూర తీరాలలో పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: రాజేష్ , నిత్య సంతోషిని 

ఏ దూర తీరాలలో... వుందో నా చెలి
ఎనాడూ నా కంటికీ... కనిపిస్తుందో మరీ

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ
హృదయమనే ఈ కోవెలలో తన
రూపే ప్రతిమై వుందనీ
ఆమనికై ఇల కోయిలలా నే తనకై చూస్తున్నానని
నువ్వైనా కబురందించాలి చల్లని చిరుగాలీ
ఎన్నడు తరగని ప్రేమకు నువ్వే ఊపిరి పోయాలి

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా

చరణం: 1
హ...పువ్వు నవ్వితే
తన నవ్వే అనుకొని చూస్తున్నా
అటుగా పరుగులు తీస్తున్నా
మువ్వ మోగితే ఆ అలికిడి తనదే అనుకున్నా
పొరబడి ఎదురే చూస్తున్నా
రెక్కలు తొడిగిన గువ్వను నేనై
దిక్కులు అన్నీ వెతికాను
దివిలో తారలు నా కన్నులుగా
భువినంతా గాలించాను
ఆశే నేనై శ్వాసే తానై నిలిచా తనకోసం
నాలో చదరని ప్రేమకు సాక్షం నేలా ఆకాశం

వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ

చరణం: 2
చిన్ని గుండెలో కలిగిందే కమ్మని తుళ్ళింతా
యేదో తెలియని పులకింతా
పిలిచినంతలో మనసంతా తియ్యని గిలిగింతా
నాలో ఏమిటీ ఈ వింతా
వేకువ పొద్దున మందారాన్నై
వాకిట ఎదురే చూస్తున్నా
పాపిట దిద్దిన సిందూరానికి
పరమార్థం లా నేనున్నా..
జగములు యేలే జానకిరాముని సగమే నేనమ్మా
జతగా తానే కలిసే వరకు బతికే శిలనమ్మా

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ...

హృదయమనే ఈ కోవెలలో తన
రూపే ప్రతిమై వుందనీ...
ఆమనికై ఇల కోయిలలా నే తనకై చూస్తున్నానని
నువ్వైనా కబురందించాలి చల్లని చిరుగాలి
ఎన్నడు తరగని ప్రేమకు నువ్వే ఊపిరి పోయాలి



నిన్ను ఎంత చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: ఉదిత్ నారాయణ్, టీనా

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు
ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే
అరే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు
నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టే ఉండదు

ప్రేమన్న మాటేమో రెండు ముక్కలే 
నీతోని చెబుదమంటె ఎన్ని తిప్పలే
ఆడిగేస్తానంటూ ముందు కడిగేస్తాడే
తీరా నేనెదురుపడితే తడబడతాడే
పచ్చి మిరపకాయ తిన్న బహు తీపిగున్నదే
మరి మందు తాగకున్న మత్తెక్కుతున్నదే 
నాకు కూడా బాబు అట్టాగే ఉందిలే
మరి నువ్వు పక్కనుంటే గమ్మత్తుగావుందిలే
హలో పిల్ల శుభానల్లా నీకు ఇవాళ 
ఇలా నిన్నే చూసి నా మనసు పడిపోయే వెల్లకిలా

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

పొద్దున్న లేవంగ ముద్దు అంటాడే
వద్దన్నా వినకుండా ఎగబడతాడే 
బొత్తిగ ఈ లోకం బహు కొత్తగున్నదే
మొత్తంగ మాయేదో అవుతున్నదే
అయ్యో చంటి పిల్లడల్లే మారేముచేస్తాడే
మరి చిలిపి చేష్టలల్లా అహ చిన్ని కృష్ణుడే
ఇక నిన్ను చూడకుండ ఆ పొద్దు గడవదే
ఈ రాణిని చూశాక నా మనసు నిలవదే
వద్దని అన్నా వద్దకు వచ్చి కలబడతాడే
వాడే సందే చూసి చప్పున్న వచ్చి గిలిగింతలుపెట్టేస్తాడే

అయ్యో అయ్యో రామ 
ఇది ఏమీ మాయో ప్రేమా
అయ్యో అయ్యో రామ 
ఇది ఏమీ మాయో ప్రేమా

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే
అరే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

Palli Balakrishna Tuesday, October 31, 2017


చిత్రం: శ్రీరామ చంద్రులు (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: మద్దెల శివకుమార్
గానం: కుమార్ సాను, శ్రీదేవి
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , శివాజి, బ్రహ్మానందం, రాశి, సింధు మీనన్, కోవై సరళ
దర్శకత్వం: ఐ. శ్రీకాంత్
నిర్మాత: డి.అనిల్ కుమార్
విడుదల తేది: 07.11.2003

సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
నా గుండె వేగానివే ఓ ప్రేమ గీతానివే

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా ఓ ఓ

దిక్కులు చూసే వేళా నువు పక్కకు చేరేవేళ
చెయ్యాలి పువ్వుల మేళా గోపాలా
చుక్కలు కాసే వేళా సిరిమల్లెలు పూచే వేళా
నును సిగ్గులు మొగ్గలు ఏలా ఓ జవరాలా

వెదురులో వేణువుంటుందని తెలుసు లోకానికి
నా గుండెలో నువ్వు ఉన్నావని తెలపాలి నీ మనసుకే
నీ తోడు కోరుకుంటున్నా నీడల్లే చేరుకుంటున్నా
మన్నించి నా మాటని అందించు నీ ప్రేమని
మన్నించి నా మాటని అందించు నీ ప్రేమని

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా ఓ ఓ

కుదురన్నదే లేదు నా మనసుకి పగలంత నీ ధ్యాసలో
ఓ కునుకన్నదే రాదు నా కంటికి రేయంత నీ ఊహలో
అందాల రామ చిలకమ్మా కాసింత జాలి చూపమ్మా
పరిచాను ఎద కాగితం కావాలి నీ సంతకం
పరిచాను ఎద కాగితం కావాలి నీ సంతకం

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
నా గుండె వేగానివే ఓ ప్రేమ గీతానివే ఓ ఓ

Palli Balakrishna Saturday, October 21, 2017



చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
నటీనటులు: దీపక్, కాంచి కౌల్
దర్శకత్వం: సానా యాది రెడ్డి
నిర్మాత: శ్రీమతి కళ్యాణి వెంకటేష్
విడుదల తేది: 13.07.2001



Songs List:



పేంటేస్తేగాని తెలియలేదురా మామా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: వరికుప్పల యాదగిరి , ఘటికాచలం

పేంటేస్తేగాని తెలియలేదురా మామా 




గుండె నెందుకిచ్చావురా దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: యస్.పి.బాలు 

గుండె నెందుకిచ్చావురా దేవుడా 
ఎండమావి చేసావురా దేవుడా
అమృతమంటి ప్రేమను కురిపిస్తావు
మరు నిముషంలో విషముగా మరిగిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 

మనసు మనసుతో ముడివేసి మౌన ప్రేమతో పెనవేసి
ఒకరినొకరిగా తోడును చేస్తావు
ఒకరి నీడలో ఒకరిని చూస్తావు
వలపు దీపాలు వెలిగించి
వేళా వెన్నెలలు కురిపించి
కళల కాలాన్ని కరిగించేస్తావు
శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు

ఆడినంతసేపడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు
ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు
ఏమాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరికొడతావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 

ఎదను గుడిలాగా మార్చేసి
ఎదుట దేవతను చూపించి
ప్రేమ పూజలే జరిపించేస్తావు
వింత మాయలో పడదోసేస్తావు
బ్రతుకు హారతిగా వెలిగించి
వెతల పాత్రలో కరిగించి
వెలుగు రేఖలను నిలువునా కోస్తావు
విలువ చీకటిగా మిగిలించేస్తావు

నిండు ప్రాణాలు కదిలిపోతుంటే కన్నె నీటితో కాల్చేవు
బండరాయిలా నువ్వుంటావు కనుకనే బాధపడలేవు
ఈ మాయలన్ని ఇక నీకే తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 
ఎండమావి చేసావురా దేవుడా
అమృతమంటి ప్రేమను కురిపిస్తావు
మరు నిముషంలో విషముగా మరిగిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా  



అందమైన కుందనాల బొమ్మరా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: వరికుప్పల యాదగిరి

కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే
ఓపెనర్ జారిపోయే
వీడి గుండె ఓపెనైపోయే
మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే
అంతలోనే మాయమాయె
వాడి మనసు దాటి వెళ్లిపోయే
అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా
బైక్ వాడు స్టార్ట్ చేస్తే
రైల్ ఉ గేట్ దాటి వెళ్లిపోయే
వీడి గుండె గిల్లి వెళ్లిపోయే

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ ఇంటి వనితో మరీ
నా ఎద మీటి పోయే చెలీ
ఏచోట ఉందొ మరీ
నా ప్రియమైన ఆ సుందరీ

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

అనుకోకుండానే నేను చూసాను ఆమెనూ
ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ
అనుకోకుండానే నేను చూసాను ఆమెనూ
ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ

ఎక్కడని వెతకాలి ఆ ప్రేమనూ
చూడకుండా ఉండలేను ఏం చెయ్యనూ
ఏమో ఏ మెడల్లో దాగి ఉందొరా

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడీ
చూపుల వలా వేసి తీసుకెళుతుంది తన వెంబడీ
ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడీ
చూపుల వలా వేసి తీసుకెళుతుంది తన వెంబడీ

ఒక్కసారి చేరాలి ఆ నీడనూ
విన్నవించుకోవాలి ఈ బాధనూ
ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ ఇంటి వనితో మరీ
నా ఎద మీటి పోయే చెలీ
ఏచోట ఉందొ మరీ
నా ప్రియమైన ఆ సుందరీ

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా




చెలియా నిను చూడకుండా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరాం 

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పొయ్యవే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

నేచ్ఛేలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలినై
నా చెలి నుదుటికి అందానిచ్ఛే సిందూరమై
కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై
హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై

గున్నమావి తోటల్లోనా నే ఎదురు చుస్తాలే
గుప్పెడంత గుండెల్లోనా చోటిస్తా రావయ్యో
నా ప్రేమ రాశివి నువ్వే హా
నా ఊపిరి చిరునామా నువ్వే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

మానస వాచా నీ మదిలోన కొలువుండానా
నా నిలువెల్లా దాసోహాలే చేసేయనా
ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా
ఏడడుగులతో కొంగు ముడేస్తా ఏదేమైనా

నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా
నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా
నా రెండు కన్నులు నువ్వే హా
నా చంటి పాపవు నువ్వే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగుల్లో అడుగేస్తూ నా మది లోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పొయ్యవే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా




నచ్చావే భామా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సుఖ్విందర్ సింగ్ 

నచ్చావే భామా 




సంపంగి రెమ్మ పూబంతి వమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: ఉన్ని కృష్ణన్

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా
ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే
ఓ… నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే
పరిసరి పసనిస నినిపమరిస రిపమప
మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే
ఓ…యదను తాకగనే ఏదో హాయి రగిలేనే
చాటుమాటుగా నిన్నే నే చూస్తున్నానే
గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే
ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే

సంపంగి రెమ్మా... పూబంతి వమ్మా...
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా

రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే
ఓ… కలలో నిన్నే చూసి మురిసిపోతానే
ఆ ఆ ఆ ఆ ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే
ఓ… కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని
ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే
ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే
నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా

Palli Balakrishna Friday, July 28, 2017


చిత్రం: 6 టీన్స్ (2001)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సుద్దాల ఆశోక్‌తేజ
గానం: కుమార్‌సాను
నటీనటులు: రోహిత్, రుతిక
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత:
విడుదల తేది: 08.06.2001

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
ఆ... నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే...

ఆ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో
ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో
ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో
ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో

చరణం: 1
మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నా... మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లునే కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా
నీ మదినిండనేనుండగా...

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

చరణం: 2
ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూనిన్ను వేడుకుంటున్నా
ఆ... ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా
నా కలలన్నీ నీ కనులు చూడాలని
బతిమాలాను నీ కంటిలో పాపని
మన్నించేసి నా మనసునీ
ప్రసాదించు నీ ప్రేమనీ

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే...
ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
దేవుడు వరమందిస్తే... నే నిన్నే కోరుకుంటాలే...


Palli Balakrishna Wednesday, July 26, 2017





చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
నటీనటులు: దీపక్ , అంకిత
దర్శకత్వం: పోలూర్ ఘటికాచలం
నిర్మాతలు: బి.ఏ. రాజు, జయ
విడుదల తేది: 13.12.2003



Songs List:



చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా
ఇప్పుడే ఇక్కడే వాలిపోమ్మా
ఎద తలుపు తెరుచుకుందమ్మా

నీదే ఆలోచన ఎటు వైపు చూపు వెళుతున్నా
ఓ కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఊహా వెనక మాటైన వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా

చరణం: 1
నీ రూపురేఖల బొమ్మ నా తలపులో తోచక
నా చూపు జాడలకైన ఆ ఛాయలే అందక
నీ స్నేహ గీతిక కోసం వేచింది ఎదవేదిక
నీ చూపు సోకేదాకా నిదురైన రాదే ఇక
గుండెలో గుప్పున ఎన్నెన్నో చిగురాశలే
కళ్ళల్లో కమ్మని కలలే కదిలించెనే
చిలిపి వయసు వలపు కవిత చెదిరె
కన్నెవనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఉహ వెనక మాటైనా వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా

చరణం: 2
నిన్ను చూడగానే నాలో ఏ భావం ఉప్పొంగునో
అనుకుంటే నాలోలోనే ఒక వింతగా ఉన్నదే
ఏ తీరుగా నను నీతో పరిచయము కలిగించునో
ఆ తీపి కలయిక నాలో ఏ రాగమొలికించునో
ముందుగా అందితే తియ్యని సంకేతమే
చేతికే అందదా అందని ఆకాశమే
మనసు పడిన వరము దొరికిపోదా
కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడ లేక నీ ఊహ వెనక
మాటైన వినక తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా
ఇప్పుడే ఇక్కడే వాలిపోమ్మా
ఎద తలుపు తెరుచుకుందమ్మా
నీదే ఆలోచన ఎటు వైపు చూపు వెళుతున్నా
ఓ కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఊహ వెనక మాటైన వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా...



తెలిమంచులోన పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: కె. జె. ఏసుదాసు

పల్లవి:
తెలిమంచులోన 
తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి

చరణం: 1
తొలిచూపుతోనే దోచావు మనసుని
కదలించావులే నాలోన ప్రేమనే
నిను చేరుగాలి నా చెంత చేరగా
నా మది ఊయలై ఊగేను హాయిగా
విధినైన గెలిచే ఓ వింత ధైర్యమే
నిన్ను కలిశాక కలిగే నాలోన చిత్రమే
రాచెలి నిచ్చెలి జాబిలీ

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి

చరణం: 2
చెక్కిల్లపైనే తొలి సంతకానికై మది ఆరాటమే రేపింది మోహమే
చిరునవ్వులోనే దాగుంది అందమే
ఎదలోగిళ్ళలో వేసింది బాణమే
నువ్వు అన్నదే నా లోకమన్నది
నీ కోసమే ఈ ప్రాణమున్నది
అందనే అందని అందమా

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి 

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
తెలిమంచులోన చెలి అదర సవ్వడి




ముద్దుగుమ్మా పైడిబొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: హేరిస్ రాఘవేంద్ర

పల్లవి:
ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా
ముద్దుగుమ్మ పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమ
చెప్పకుండా పోతావేమ్మా చక్కనైనా మీనమ్మా
మనకు మనకు గొడవేంటమ్మా మర్చిపోవే చిట్టమ్మా
మెహమాటమో కోపమో నేనేలకనుగొందునో
మెహమాటమో కోపమో నేనేలకనుగొందునో

ముద్దుగుమ్మా పైడిబొమ్మ అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమ

చరణం: 1
నిన్ను చూసి నవ్వానా లేదులే చెలీ
కన్నుగీటి పిలిచానా కాదులే మరీ
మూతి ముడుచుకెళ్తుంటే ముగ్ధసుందరీ
ముద్దు ముద్దుగా ఉందే సొగసు వైఖరీ
చెప్పాలనుకున్నదేదో చెప్పేసెయ్ సూటిగా

ఓ.కె. చేస్తావా కిస్ కోరితే
ఓ.కె.చేస్తావా కిస్ కోరితే

ముద్దుగుమ్మ పైడిబొమ్మ అదిరిందోయమ్మా
నాజూకుతనమా సమ్మవమ్మా నువ్వంటే ప్రేమా

చరణం: 2
ఒట్సు పెట్టి చెబుతున్నా నమ్మవే చెలీ
నువ్వు తప్ప ఇంకెవరూ నచ్చరే మరీ
మాట ఇచ్చి వచ్చానే ఇంటివాళ్ళకీ
నిన్ను గెలుచుకుంటేనే థిల్ మనసుకీ
అలిగి అలిగిపోవద్దే నువ్వు అట్టా సుందరి
అలిగి అలిగిపోవద్దే నువ్వు అట్టా సుందరి
జోడికట్టేసై ఎందుకల్లరీ జోడికట్టేసై ఎందుకల్లరీ

ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా
చెప్పకుండపోతావేమ్మా చక్కనైన మీనమ్మా
మనకు మనకు గొడవేంటమ్మా
మరిచిపోవే చిట్టమ్మా
మోహమాటమో కోపమో నేనేల కనుగొందునో
మోహమాటమో కోపమో నేనేలకనుగొందునో
ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా...




అనురాగం మా పేరు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
అనురాగం మా పేరు అభిమానం మా ఊరు
ఆప్యాయత గలవారు మా వియ్యంకులవారు
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
శుభమంటూ పిలిచారు ఆహ్వానం పలికారు
కమనీయం మీ తీరు మా వియ్యంకులవారు
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ...

చరణం: 1
జేబు రుమాలు పట్టుకుపోయే పందెం వేద్దాం రండి
సై అంటే మరి సై అంటాము మీరిక కాసుకోండి
ఆటపాట అన్నింటా మేం మీకేం తీసిపోము
తాడో పేడో తేలేదాక మేము ఊరుకోము
ఆటలో గెలుపు మాదండీ
మాటతో గెలుపురాదండీ
కిటుకులే మాకు తెలుసండీ
అదేదో చేసి చూపండి
ఓడితే ఏం చేస్తారండీ
ఆ మాట మేము ఎరగమండీ

అనురాగం మా పేరు...అభిమానం మా ఊరు
ఆప్యాయత గలవారు మా వియ్యంకులవారు
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ

చరణం: 2
మనసులు కలవని పెళ్ళికి అర్థం లేనేలేదు కదండీ
ఆ మనసులు కలిపిన జంటకు నేడు మనువే జరిగేనండీ..
కొంగులు రెంటిని కలిపే ముడినే బ్రహ్మముడి అంటారండీ
మరి ఆ పెళ్ళిళ్ళంటూ జరిగేది ఆ స్వర్గంలోనే కదండీ
రెండుగా వున్న ఈ జంట నేటితో ఒక్కటవునంటా
అందాల పెళ్ళి కొడుకండీ గుణములో రాముడేనండీ
బంగారు బొమ్మ ఇదిగోండి మీ వాడి జోడు తగునండీ

శుభమంటూ పిలిచారు ఆహ్వానం పలికారు
కమనీయం మీ తీరు మా వియ్యంకులవారు
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ



అడగక్కర్లేదు నా బావ ఎక్కడని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: టిప్పు, స్వర్ణలత

పల్లవి:
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని 
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని
సింపిరి, సింపిరి జుట్టుతోటి 
చిరిగిన నిక్కరు వేసుకుని
వంకర చూపులు చూసుకుంటూ 
వాగుల వెంట పోతా ఉంటాడే

వాడేనా బావంటే... వాడేనా బావంటే
వాడేనా బావంటే... వాడేనా బావంటే

చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని 
అడగక్కర్లేదు నా మరదలు ఎక్కడని
బొబర్లంక చీరకట్టి...జబ్బలదాక జాకెట్ వేసి
కొప్పునిండా మల్లెలు పెట్టి తిప్పుకుంటు తిరుగుతుంటదే

అదే నా మరదలని...అదే నా మరదలని
అదే నా మరదలని...అదే నా మరదలని

చరణం: 1
మంచినీళ్ళ నల్లకాడ బిందెనెత్తుకుంట వుంటే
తొంగి తొంగి చూస్తాడే 
మల్లెపూల తోటలోన మంచం వేసుకుని వుంటే
దొంగలాగ చేరతాడే
పొద్దుకూడ పొడవకుండా రయ్యమంటూ ఇంటికొచ్చి దుప్పటంతా లాగుతుందే 
నిద్దరంతా పాడుచేసి లేవమంటు గోలచేసి
నీళ్ళు చల్లి నవ్వుతుందే

కల్లోకొచ్చి ఏదేదేదో అడిగేస్తాడే
కన్నేకొట్టి తికమకలో ననుతోసేస్తుందే
బుజ్జిగాడిలా ఒళ్ళో వాలిపోతాడే 
ఎంత చెప్పిన వల్ల నోల్లనంటాడే
పూతరేకు తెస్తానంటూ వత్తాలేక పారిపోతాడే

వాడేనా బావంటే...వాడేనా బావంటే 
వాడేనా బావంటే...వాడేనా బావంటే

అడగక్కర్లేదు నా బావ ఎక్కడని
చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని

చరణం: 2
కొత్త కొత్త ఫ్యాషనంటూ జబ్బలు చూపే జాకెట్ వేసి
నిబ్బరంగా వుండనీయదే 
ఊసుపోదలేదు అంటు ఏడవుంటే ఆడికొచ్చి
పోదమంటూ సంపుతుంటదే
వేపచెట్టు నీడలోన అష్ట చెమ్మ ఆడుతుంటే
గుళకరాళ్ళు విసురుతాడే వెనకనుంచి దూసుకొచ్చి కళ్ళు రెండు మూసి
నన్ను ఇరికు నెట్టి నవ్వుతాడే
ఒక్కోసారి కోపంతో తెగ అరిచేస్తుందే
సుతారంగా దువ్వి దువ్వి మురిపిస్తాడే
ఎన్ని చేసినా ఎంత సతాయించినా 
అప్పుడప్పుడు దాన్ని కష్టపెటనా 
నన్ను విడిచి దూరమైతే బతకలేను బావ అంటదే... 

అదేనా మరదలటా...అదేనా మరదలటా
అదేనా మరదలటా...అదేనా మరదలటా

అడగక్కర్లేదు నా బావ ఎవ్వరని 
చెప్పక్కర్లేదు వాడి మోటు మోజులని
పొద్దున్న లేస్తే ముద్దు అంటాడే సద్దులేమో చెప్పేస్తాడు 
వద్దంటే దగ్గరకొచ్చి తుంటరివాడు చుట్టుకుంటాడే 

వాడేనా బావంటే...వాడేనా బావంటే
వాడేనా బావంటే...వాడేనా బావంటే

పిలవక్కర్లేదు నా కొంటె మరదలని
చెప్పక్కర్లేదు నా స్వీట్ సరసాన్ని
చూపులతోనే చుట్టేస్తుంది మాటలతోనే కట్టేస్తుంది
సైగలోనే ఒప్పించి చప్పున ముద్దు పెట్టుకుంటదే

అదేనా మరదలటా....అదేనా మరదలటా
అదేనా మరదలటా...అదేనా మరదలటా



ఓ ప్రియా ఓ ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: హరిహరన్, గోపిక పూర్ణిమ

పల్లవి:
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

చరణం: 1
చిరునగవుల్లో తొలకరి జల్లు కురిసే వేళలో
ప్రేమ పురాణం పల్లకి రాగం సాగే వేళలో
ఊసులుతోని ఊహల ఊయలలూపే వేళలో
చూపులతోని కమ్మని కథలు తెలిపే వేళలో
ప్రేమలో పావనితో జావళీలు పాడన
జావళీలు పాడుకోనె జాగరాలు చేయన
నీ తడిసిన పెదవిని పెడవులతో 
నే ముద్దుల ముద్రే వేయన

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

చరణం: 2
తుమ్మెద నీవై రమ్మని పిలిచే కమ్మని రేయిలో
ఝుమ్మని తేనెలు తీయని వానై కురిసే వేళలో
వన్నెల పైట వెన్నెలలోన జారే వేళలో
వెచ్చని ప్రాయం నెచ్చెలి సాయం కోరే వేళలో
నిన్ను చూసి చూడంగానే చెప్పలేని హాయిలో
గుండెచాటు కోరికలన్నీ గుప్పుమన్న వేళలో
తడబడు అడుగుల సవ్వడిలో నీ జంటై నేనుంటాలే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా


Palli Balakrishna Monday, June 12, 2017

Most Recent

Default