Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chittemma Mogudu (1992)




చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: మోహన్ బాబు, దివ్యభారతి, పూజా బేడి
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: పి.శ్రీధర్ రెడ్డి
విడుదల తేది: 05.04.1992



Songs List:



బొడ్డులో రూపాయిబిళ్ల పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: జాలాది రాజారావు
గానం: మనో & చిత్ర

హ.. ఆహ...
బొడ్డులో రూపాయిబిళ్ల
అబ్బా ఎన్నాళ్లు దాచవే పిల్లా  
ముందు చూస్తే బొమ్మ ముద్దోస్తావున్నాది
వెనుక చూస్తే దిమ్మ ఏర్రెత్తిపోతాంది
ఏగరేసి కొడుతుంటే
ఆహ ఎంత మోతోస్తాదో 
చూడాలనేవుంది పిల్లా
కాస్త అందించు రూపాయిబిళ్ల

బొడ్డులో రూపాయిబిళ్ల... 
బావ నీకోసం ఉంచింది పిల్ల
ముందు బొమ్మని చూసి మురిసిపోవద్దురో
అదిరిపాటు దెబ్బ కొడితే చెదిరిపోతుందిరో
దుప్పట్లో దాచుకుంటె 
అహ గుట్టుగానే ఉంటాది 
చప్పట్లు కొట్టోద్దురయ్యో
బిళ్ల గుప్పెట్లో జారిపడతదయ్యో

బొడ్డులో రూపాయిబిళ్ల
బావ నీకోసం ఉంచింది పిల్ల

సిగ్గు సింగారం చీర కట్టుకున్నాక
ముద్దమందారం మోజు పుట్టుకొచ్చాక
ముంత పాలు ఇవ్వాళి కుర్రాడికి 
బంతులాట కావాలి మంచానికి
ముంత పాలు ఇవ్వాళ కుర్రాడికి 
బంతులాట కావాలి మంచానికి
చీర కుచ్చల్లే చిందులాట కొచ్చాక
దోర బుగ్గలో గారె ముక్క నచ్చాక
పైట చెంగు పక్కేసి ఆడించనా 
నా రైక ముక్క అంచుతో ఓడించనా

అయితే అందించు బిళ్లా రూపాయి బిళ్లా
దాని అంచు పట్టి తిప్పి కొడతా గిరగిర మళ్ల

బొడ్డులో రూపాయిబిళ్ల
అబ్బా ఎన్నాళ్లు దాచవే పిల్లా
బొడ్డులో రూపాయిబిళ్ల
బావ నీకోసం ఉంచింది పిల్లా

చురుకు కరుకున్నా మొగుడు మోహనాంగుడు
అహ అరే ఓహో
చెరుకు ముక్కల్లే చేవ తేలివున్నాడు 
ఒహో ఒహో...
అవురావు అంటుంటే ఆపేదెట్టా
ఆడి అదిరిపాటు దెబ్బకు నేనాగేదెట్టా
హోయ్ కలికి వయ్యారం ఊయ్యలేసి కట్టుకో
ఊపే ఊపుల్లో ఓపికెంత చూసుకో
అప్పుడు గుప్పెడు నడుమే చుట్టుకుంటా
చప్పుడు కాకుండా ముద్దులాడుకుంటా
అప్పుడు గుప్పెడు నడుమే చుట్టుకుంటా
చప్పుడు కాకుండా ముద్దులాడుకుంటా

అయితే అందుకో బిళ్ల రూపాయి బిళ్ల
హోయ్. వెనుక ముందు చూడకుండా మోగించు
గలగల
బొడ్డులో రూపాయి బిళ్ల... 
అబ్బా ఎన్నాళ్లు దాచవే పిల్లా

ముందు బొమ్మని చూసి మురిసిపో వద్దురో
అదిరిపాటు దెబ్బ కొడితే చెదిరిపోతుందిరో
ఏగరేసి కొడుతుంటే
ఆహ. ఎంత మోతోస్తాదో 
చూడాలనేవుంది పిల్లా 
కాస్త అందించు రూపాయి బిళ్ల
బొడ్డులో రూపాయిబిళ్ల
బావ నీకోసం ఉంచింది పిల్లా



చినుకు రాలితే...పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: రాస రాజు
గానం: KJ యేసుదాస్ & చిత్ర

చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా

ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా

నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదా
పూలకన్నె వన్నెను చూచి తేనెటీగ పాడదా
నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదా
పూలకన్నె వన్నెను చూచి తేనెటీగ పాడదా
నింగిలోని జాబిలి మామ నీటిలోని కలువ భామ
ఎంత దూర తీరమునున్నా ఎందుకంత మనసులు దగ్గర

అదే అదే అనురాగం దాని పేరు అనుబంధం
ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో

చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా

కోకిలమ్మ రాగం వింటే కొమ్మకెంత సింగారం
జలపాతం దూకుతు ఉంటే కొండకెంత ఒయ్యారం
కోకిలమ్మ రాగం వింటే కొమ్మకెంత సింగారం
జలపాతం దూకుతు ఉంటే కొండకెంత ఒయ్యారం
వానజల్లు కిందికిరాగ నేల ఒళ్లు ఒంపులు సాగ
ఎందుకంత తీయని ప్రేమా ఎవరికైన తెలిసేనా

అదే అదే అనురాగం దాని పేరు అనుబంధం
ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో

చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా




చిట్టెమ్మ పొట్టెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: SP బాలసుబ్రహ్మణ్యం & చిత్ర

చిట్టెమ్మ పొట్టెమ్మ 




హాలో హాలో లేడీ డాక్టర్ పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: గురు చరణ్
గానం: మనో & చిత్ర

హాలో హాలో లేడీ డాక్టర్ 



నామాల సామికి పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: జాలాది
గానం: SP బాలసుబ్రహ్మణ్యం & చిత్ర

నామాల సామికి 




నిండు కుండల పాట సాహిత్యం

 
చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: జాలాది రాజారావు
గానం: KJ యేసుదాస్

నిండు కుండలా నీళ్లోసుకుంటాది నీలాల కొండ
పండులాంటి ముద్దు పాపల్ని కంటాది తెల్లారకుండా 
పుట్టినోడల్లా సూరీడంట  పుడమితల్లికాడు కొడుకేనంటా
అమ్మ కడుపులో ఆడేదేమో తొమ్మిది నెలలంటా
దుమ్ములోన కలిసిపోయేటందుకు నూరేళ్ళ గడువంట
ఇది బ్రతుకమ్మ నడకంట
ఇది బ్రతుకమ్మ నడకంట
నిండు కుండలా నీళ్లోసుకుంటాది నీలాల కొండ
పండులాంటి ముద్దు పాపల్ని కంటాది తెల్లారకుండా 

అమ్మ చేతులా మొలతాడు కడితే మొనగాడైనోడు
ఆ మొలతాడు కొలతే మెడ తాళి కట్టి ఆలి మొగుడౌతాడు 
పేగు మడతలో ఊగులాడతా ఉలికులికి పడతాడు 
చిలిపి గెంతులా బంతిలా చిరు డొక్కన తంతాడు
తప్పటడుగులా....
తప్పటడుగులా నడకతోనే గొప్పోడినంటాడు 
నిప్పులోన కలిసిపోయేనాడు 
తలకొరివి పెట్టంగా వచ్చానంటాడు 
నిండు కుండలా నీళ్లోసుకుంటాది నీలాల కొండ
పండులాంటి ముద్దు పాపల్ని కంటాది తెల్లారకుండా 

పుట్ట మీద చెట్టు పురుడోసుకుంటే పువ్వు పూసేనంట 
ఆ పువ్వులోనే ఒక బ్రహ్మ దేవుడు పుట్టుకొచ్చేనంట 
అందమైన జనమ కోసమే ఆదిశక్తి పుట్టేనంట
అండ పిండముల తల్లిగా అది ఆడదయ్యేనంట 
కట్టుకున్నదే..
కట్టుకున్నదే కనలేనంటే కాలమేడ్చెనంట 
బిడ్డ పాపల్లేని గొడ్రాలైతే ఈ భూచక్రమెట్టా తిరిగేనంటా?

నిండు కుండలా నీళ్లోసుకుంటాది నీలాల కొండ
పండులాంటి ముద్దు పాపల్ని కంటాది తెల్లారకుండా 
ఇది బ్రతుకమ్మ నడకంట
ఇది బ్రతుకమ్మ నడకంట
ఇది బ్రతుకమ్మ నడకంట
ఇది బ్రతుకమ్మ నడకంట

Most Recent

Default