-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Asha Saini"




చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
నటీనటులు: శ్రీకాంత్ , వడ్డే నవీన్ , మాళవిక , ఆశా షైనీ, ముంతాజ్, రాఘవ లారెన్స్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 18.02.2000



Songs List:



దాయమ్మ దాయి దా దా పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా
ఓసి నా సంపదా దా దా దా దా
అందుకో దా - అందమా దా

దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా

చరణం: 1
తద్దిం తక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమె
నిద్దర్లిక వద్దన్నదిరో వత్తిళ్లకు ఒళ్ళున్నదిరో
ఇత్తిత్తని నను చుట్టిన ఎద తట్టిన రద పెట్టిన
ముడిపెట్టిన జత జెట్టివి రో
నిను పట్టిన నీ జట్టునురో
పందెం అని ముందుందని అందిందని పొంది
కసి సిందందని కందిందని బంధం పడరా
అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి
రసకందాయం అందాలని సిందేయననా
అల్లుకుందాం పదా దా దా దా దా
కొంటె బాధ - తీర్చుకో దా...

దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా

చరణం: 2
ఒళ్ళిక్కడ కళ్ళక్కడ కలలిక్కడ కైపక్కడ
ఇరుపక్కల వలపక్కడిది జత చిక్కిన వయసిక్కడిది
ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కల వరిమిక్కిలి
తడితిక్కల ముద్దిక్కడిదే
పెదవెక్కడ మధువక్కడిదే
మదమెక్కిన మగహక్కుల చెలి సిగ్గులు పుణికి
తన చేజిక్కిన ఒడిదగ్గర  చలి తగ్గినది
అల చుక్కలు కలదిక్కుకు చిరు రెక్కలు తొడిగి
మన మనసక్కడ మహ చక్కగ సుఖమెక్కినది
హాయి అర్ధం ఇదా... దా దా దా దా
ఆడుకో దా - అల్లుకో దా

దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా
ఓసి నా సంపదా దా దా దా దా
అందుకో దా - అందమా దా




దాహం పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర


దాహం 




దివి దారివిడి పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, సంగీత 

దివి దారివిడి 




శ్రీకారం ఇది మరో పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పార్ధసారధి, గోపిక పూర్ణిమ


శ్రీకారం ఇది మరో 



ఏయ్ రుక్కమ్మ చుక్కమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర 

ఏయ్ రుక్కమ్మ చుక్కమ్మ 



ఎంత బాగుంది బ్రదరూ ఈ వెదరు పాట సాహిత్యం

 
చిత్రం: చాలా బాగుంది (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు


ఎంత బాగుంది బ్రదరూ ఈ వెదరు

Palli Balakrishna Tuesday, November 28, 2017


చిత్రం: మనసున్న మహారాజు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్ , అనురాధ పడ్వల్
నటీనటులు: రాజశేఖర్ , లయ, ఆషా షైనీ, పృద్వి (బబ్లు)
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: జె. భగవాన్, డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 2000

నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి
నామది నీకొక కోవెల చేశా
ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా...

నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం

మాఘమాస వేళ ఈ మంచు తెరలలోన
యవ్వనాల బాలా నీ పెదవులందుకోన
పులకరింత పూజ ఈ పూట చేసుకోరా
కలవరింతలన్ని నే కౌగిలించు కోనా
మాయో ఏమి మాయో ఎంతో హాయో ఈ బంధం
నీడో తోడు నీడో నాకు నీవే జన్మాంతం
ఓ ప్రియా... నా ప్రియా...
యా యా  నీ దాన్నైపోయా

నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం

ఈ వసంత వేళ నీ వయసు పూలు పూసే
పూలగాలినీవో నా వలపు వీణ ఊదె
ప్రేమమందిరాన కుడికన్ను అదిరెనేల
పెళ్లిమండపాన కుడికాలు పెట్టిరావ
నీవే నాకు నీవే సాగిరావే నాకోసం
దేవా ప్రేమ దేవా నీకు సేవే నా ప్రాణం

ఓ ప్రియా... నా ప్రియా...
యా యా  నీ వాడ్నైపోయా

నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి
నామది నీకొక కోవెల చేశా
ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా...

నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం

Palli Balakrishna Monday, October 16, 2017





చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: జే. డి. చక్రవర్తి, సంగీత, అశాషైని, మాళవిక
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 2001



Songs List:



నోరారా నవ్వేద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు


నోరారా నవ్వేద్దాం



కోనసీమ కుర్రదాన్నిరో పాట సాహిత్యం

 
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర


కోనసీమ కుర్రదాన్నిరో




ధిరనతోం తకిట..ధిరనతోం పాట సాహిత్యం

 
సినిమా: నవ్వుతూ బ్రతకాలిరా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుమంగళి

ధిరణతోం తకిట ధిరణతోం తకిట 
ధిరణతోం తకిట తానాన 
నిదుర ఉండదట కుదురు ఉండదట 
మధురమైన ఈ మైకాన 
నిమిషమైన ఇక నిలవనీయదట
మొదట అందరికి ఇంతేనా
తగని తొందరట చిలిపి చిందులట
అదుపులేని అనందనా
వలపు తేనె రుచి తెలుసుకున్న మది 
ఆగనన్నది ఏమైన


మనసుతో...మనసు ముడిపడినదీ 
కనులతో... కనులు కలిసినవీ
వయసుతో... వయసు జతపడినదీ
వలపుతో ...వరుస కుదిరినదీ
చెలియలో ...హొయలు తికమక పడినవీ
కులుకులో... కునుకు చెదిరినదీ
నడకలో... నడుమునడిగిన బరువిదీ
బిగుతుతో ..సొగసు రగిలినదీ
చలువ నీడవని తగిన తోడువని
ఒడికి చేరిన అల్లరిని 

బిడియమా... అవును సహజము కదా 
కుదురుకో... ఉడుకు తెలియదు కదా
తమకమా.. తమకు తెలుసును కదా
అణుచుకొ ..తెగని తగువు కదా
చినుకులా.. ఎదను తడిమిన గొడవిది
వరదలా ..ఎదిగి తడిమినదీ 
పిలుపుల.. మెలిక తిరిగిన కథకళి
తనువులో తళుకు తెలిసినదీ
అదురుతున్న తడి పెదవి అలజడికి నిదుర లేవని కలలన్ని




అయ్యప్ప శరణమయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

అయ్యప్ప శరణమయ్యా
ఈల కొట్టి తోలవయ్య
కొత్త రధం కదెలనయ్యా
వెనకడుగే వెయ్యదయ్యా
చీకటని చిక్కులని ఆగకురా భాయి
సుడిగాలులతో వానలతో చెయ్యి లడాయి
కొండలని కోనలని చూడకురా భాయి
అడుగేయనిదే తీరమే నీకు ఎదురు రాదోయి

దీవేనలిచ్చే ఆ దేవుడికైనా కోవ్వెల కట్టి దీపమెట్టాలి
అన్నము పెట్టే యజమానికి మనం కండలతొటి కంచె కట్టాలి
పనినిచ్చి మన బ్రతుకులు నడిపించే వాడు
తన చక్రముని చేతికిచ్చి తిప్పమన్నాడు
చీడలని చేరకుండ చేట్టున్నవాడు 
ఆ నీడని నీకున్నదిరా చల్లని గూడు

చినుకు పడందే నువ్వు దున్నే చేలొ తనకు తనే పైరు వస్తుందా
కునుకు వీడందే కలలన్ని నిజం చేసేటందుకు వీలు వింటుందా
చెమట చిందే శ్రమను నమ్మి బ్రతుకు బండిని తొయ్యి
అలుపు అనే మాట అనక అడుగులు వెయ్యి
ముందుకెళ్ళే దారులన్ని తెలుసుకోరా భాయి
నీవెనకే నలుగురిని తీసుకెళ్ళాలి



ధిన్ ధిన్ తార.. పాట సాహిత్యం

 
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహితం: సిరివెన్నెల
గానం: దేవి శ్రీ ప్రసాద్, మురళి, సుమంగళి

ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా
అంగరంగ వైభోగంగా పెళ్ళి చేద్దాం రారండి
నిండు పందిరి వేసుందండి నేల పీట ఆయిందండి
బుగ్గ చుక్కతో పెళ్ళికూతురు సిగ్గు మొగ్గ ఆయింది
పక్కవాడితో లగ్గమైతే ఆ మొగ్గ విరియునండి
కొంగుముళ్ళతో పగ్గమెయ్యగా పిల్ల ఎదురయింది
అరె కుదురులేని ఈ కుర్రవాడికి తిక్క కుదురుతుంది
ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా

పాలరాతి మేడ కరిగి..నేల మీద కాళ్ళే కడిగి
పేదపెద్దలు అను తేడాలను చెరపాలి

కోటలోని ఆ యువరాణి..తోటరాముడితో జతగూడి
ప్రేమరాజ్యమును కలకాలం పాలించాలి

కలిమికి చెలిమికి నడుమున నిలిచిన ఇనుప తెరలు కరుగుతూ ఉంటే
కని విని యెరుగని జత ఇదని మన మనసు పాడుతుందే

మనువుతో ముడిపడి విరిసిన మనసులు ఒకరికొకరు అనిపిస్తుంటే
తళతళ వెలుగుల తడిసిన కనులకు సిరులు దొరికినట్లే

ముందుజన్మలో ఋణమంతా తీర్చుకోను కలిసిందంట
బ్రహ్మరాతలకు అర్ధం చెప్పే ఈ జంట
అ:
ముందు ఇద్దరుంటారంట..కలిసి ఒక్కటవుతారంట
లెక్క చూస్తే పైఏటికి మూడవుతారంట
ఆ:
మసకలు, ముసుగులు గుసగుస గోదవులు
ఉరికి ఉరికి తలబడుతుంటే
పరులకు తెలియని పడుచుతనపు కధ వదను తేలుతుందే
అ:
జరిగిన తగువుకు బిడియము భయపడి పరువు విడిచి పరుగేడుతుంటే
తికమక పడి కరిగే సమయము తెల్లవారుతుందే

Palli Balakrishna Monday, September 25, 2017


చిత్రం: ఓ చినదాన (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల (All Songs)
గానం: దేవాశిష్
నటీనటులు: శ్రీకాంత్, రాజా, గజాల, ఆశా షైనీ
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: ముళ్ళపూడి బ్రహ్మానందం
విడుదల తేది: 25.01.2002



సాకీ:
నిన్నడిగి కుడుతుందా చీమైన దోమైన
నిన్నడిగి పుడుతుందా ప్రేమైనా ఏమైనా
ఓ.. చినదాన

పల్లవి:
తనచిరునామ అడిగితె ప్రేమ నిను చూపెడుతోందే
ఓ చినదానా...  ఓ చినదానా...
అవుననవమ్మా ప్రతి మగజన్మ విసుగెత్తకుముందే
ఓ చినదానా...  ఓ చినదానా...
ఒకదానివైతే నువు మోయలేవు బరువైన ప్రాయం
మొగమాట పడక ఆడిగేయరాద మగవాడి సాయం
ఓ చినదానా...  ఓ చినదానా...

ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ
ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ

తనచిరునామ అడిగితె ప్రేమ నిను చూపెడుతోందే
ఓ చినదానా...  ఓ చినదానా...

చరణం: 1
కమ్మనైన కల కమ్ముకొంటదని
అర్ధరాతిరిని నిద్రమానుకొని
ఎందుకోసమని ఎంతకాలమని ఈ పంతం
లేనిపోని నఖరాలు మానుకొని
గుండెచాటు తొలిప్రేమ పోల్చుకొని
నన్ను చేరుకొని చేతికీయు మరి నీ అందం
చెబుతున్నా విననంటే ఎదరున్నా కననంటే
తిడతావే సుప్పనాతి విడనీవే బుంగమూతి

ఓ మధుమతి హాయ్  ఓ మధుమతి హాయ్
ఓ మధుమతి హాయ్  ఓ మధుమతి హాయ్

తనచిరునామ అడిగితె ప్రేమ నిను చూపెడుతోందే
ఓ చినదానా...  ఓ చినదానా...

ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ
ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ

చరణం: 2
ఓ ఎవ్వరైన విని నవ్వుతారు అని
కాస్త కూడ బదులైన లేనిదని
ఆడపుట్టుకె అలుగుతుంది కద నీ మీదా హొయ్
వెచ్చనైన మగ ముద్దు పుచ్చుకొని
ముచ్చటైన సొగసంత ఇచ్చుకొని
సిగ్గుచాటు గల మొగ్గ విచ్చునని తెలియనిదా
సహజంగా జరిగేదే తగదంటూ తగువేంటే
మగ ఊసే చెవిబడితే బుసకొట్టే బిగువేంటే

ఓ నెరజాన హొయ్ ఓ జాననే జానా

తనచిరునామ అడిగితె ప్రేమ నిను చూపెడుతోందే
ఓ చినదానా...  ఓ చినదానా...
అవుననవమ్మా ప్రతి మగజన్మ విసుగెత్తకుముందే
ఓ చినదానా...  ఓ చినదానా...
ఒకదానివైతే నువు మోయలేవు బరువైన ప్రాయం
మొగమాట పడక ఆడిగేయరాద మగవాడి సాయం
ఓ చినదానా...  ఓ చినదానా...

ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ
ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ

Palli Balakrishna Tuesday, August 8, 2017

చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: శ్రీకాంత్, శివాజి, కనిక దివ్య, అనిత పాటిల్, ఆశా షైనీ
కథ: ఉదయ రాజ్
మాటలు: చింతపల్లి రమణ
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: కె.అనిల్ కుమార్
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఎడిటర్: శ్రీకర ప్రసాద్
బ్యానర్: శ్రీ క్రియేషన్స్
విడుదల తేది: 11.04.2003


చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: గోపాల్, శ్రీనిధి


పల్లవి:
ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా
నువ్వంటే నేనేనని
అడుగేసి వస్తున్నా ఎందాకైనా ఎవైనా
నీ వెంటే వుండాలని
తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే నా జాతకం
అందిందమ్మో అనుబంధం ఏవో జన్మల ఋణబంధం
నీ ఒళ్ళో వాలిందే నా జీవితం

చరణం: 1
వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే
బంగరుమేడై కలిసొచ్చావే
వేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే
కమ్మని నిజమై కనిపించావే
దీవెన చాలని అనుకుంటే దైవం అందెనే
పూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనే
నా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే
భామిని ఉండగ బ్రహ్మెందుకో

చరణం: 2
నీ లేతపాదాలంటే ధూళైతే చాలనుకుంటే
పాపిటతిలకమే చేశావమ్మా
నీ పెరటితోటల్లోన గాలైతే చాలనుకుంటే
ఊపిరిలో నను నిలిపావమ్మా
నాలో నేడే వెలిగిందే ఆశాదీపము
ప్రేమే మనకు అందించే ఆశీర్వాదము
నీ మెళ్ళో ముళ్ళేసి పల్లెల్లో ఇల్లేసి
జతపడి బ్రతకని జన్మెందుకో


Palli Balakrishna



చిత్రం: 143 (I MISS YOU) (2004)
సంగీతం: చక్రి
నటీనటులు: సాయిరామ్ శంకర్, సమీక్ష , ఫ్లోరా షైనీ (ఆశా షైనీ)
దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాత: పూరి జగన్నాధ్
విడుదల తేది: 27.08.2004



Songs List:



ఎందుకనీ... ఏమిటనీ... పాట సాహిత్యం

 
చిత్రం: 143 ( I MISS YOU )
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి

ఎందుకనీ... ఎందుకనీ... ఏమిటనీ... ఏమిటనీ...
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
ఎందుకనీ... ఏమిటనీ...

నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిలా
ఒంటరి తనమై క్షణమొక యుగమై మిగిలే ఏమిటిలా
ఆరిన పెదవుల మాటలికా... నామాటలికా నామాటలికా
చేరున చెలి నీదాకా... దాకా... దాకా... దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం వున్నది నీకోసం
నా కనులలో నిన్నటి నీరూపం
ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఏమిటనీ....

వెలుగులు చిలికే చిరు జాబిలని మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరు నగవులపై చీడే చేరెనెలా
చిలిపిగా చేసిన బాసలిలా... ఆ బాసలిలా  ఆ బాసలిలా
నా మదినే తొలిచేనా... తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై నీ చెక్కిలి తాకన చిరు ఆశై
ఎందుకనీ.... ఏమిటనీ....
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా





కలలోన నువ్వే ఇలలోన నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: 143 ( I MISS YOU )
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి

కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే
గుండెలోన కూసిన కోయిలా
గొంతుమూగదైనది ఏంటిలా
హృదయపు లయలకు కిలకిలా
మరి నేర్పిన చెలిమే లేదెలా
నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా
జాలువారె వెన్నెలా పొంగిపోవే అలా

కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే

ఆపవే ఆపవే అల్లరింకా
ఈ అల్లిబిల్లి ఆగడాలు ఏలా
చేరవే చేరవే చంద్రవంకా
చిమ్మి చీకటేగ చిన్నినవ్వు లేకా
నువ్వు వాగల్లే వస్తే
చెలి మెరుపుల అలనే నేనౌతా
చిరుగాలై వీస్తే నే ఎదురుగ నిలబడి అల్లుకుంటా
ఓ...పాపను నేనంటా
ఓ...అమ్మవు నీవంటా
నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా
జాలువారే వెన్నెలా పొంగిపోవే అలా

కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే

మెత్తగా మత్తుగా మల్లెపువ్వా
నీ చెంపమీద కోటి ముద్దులివ్వా
మెల్లగా చల్లగా చిట్టిగువ్వా
సన్నమూగ సైగ చేసే కాలిమువ్వా
నువు ఎదపై పడుకుంటే నిను ఊపే ఊయల నేనవుతా
చిరునవ్వే వరమిస్తే నీ పెదవిని చినుకై తడిపేస్తా
ఓ...మృదుపాదం నీవంటా
ఓ...నేలను నేనంటా
నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా
జాలువారే వెన్నెలా పొంగిపోవే అలా

కలలోన నువ్వే ఇలలొన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే




లేలే లెలలా లేచిపోదామా... పాట సాహిత్యం

 
చిత్రం: 143 ( I MISS YOU )
సంగీతం: చక్రి
సాహిత్యం: సుద్ర అప్పు
గానం: చక్రి, పల్లవి

నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ
నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లడ
నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ
నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లడ
ఎయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి అలా చూడకే తల్లే
నా గుండెలోన కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే
అరే పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే
నీ అందమంత ముందరెట్టి కిర్రెక్కించకే తల్లే
నువ్ మసేర మస్సే మసేర మసేర మసేర మసేర
ఇక ఢంకా పలాసే పలాసే పలాసే పలాసే పలాసే
ఏయ్  లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా...
ఏయ్  లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా...
అరె పిల్లో... పిల్లో...

నువు మరీ ఇంతలా గుబాళించితే ఏలా?
చనువిచ్చాను కనుకా చుట్టుకోరా ఇలా
చలి గిల్లేస్తోందనీ సతాయించితే ఎలా?
అరే నీదేర చిలకా రెచ్చిపోరా ఇలా
నా నవ్వే తమాషా... తమాషా తమాషా తమాషా
నేనాలు సమోసా... సమోసా సమోసా సమోసా
ఏయ్  లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా...
ఏయ్  లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా...
అరె పిల్లో ...పిల్లో...

నే యాపిల్ పండులా బాగున్నానుగా ఇలా
నన్నొగ్గెయ్ పిల్లో దారికాస్తే ఏలా?
నే మొగల్ పువ్వులా ముద్దొస్తానుగా ఇలా
కొంపముంచద్దె పిల్లో కూతపెడితే ఎలా?
నేనేమో అనాసా... అనాసా అనాసా అనాసా
నీతోనే కులాసా... కులాసా కులాసా కులాసా
ఏయ్  లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా...
ఏయ్  లేలే లెలలా లేలే లెలలా లేచిపోదామా...
యహా... పిల్లో పిల్లో...





ఓరోరి దేవుడా మొగుడే రాకా పాట సాహిత్యం

 
చిత్రం: 143 ( I MISS YOU ) (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: రవివర్మ , సునంద

రండీ  రండీ పెళ్ళికి రండీ (2)

ఓరోరి దేవుడా మొగుడే రాకా
ఈ పెళ్ళియోగం నాకింక లేదా
వయసు బరువై ఇలా...
నిదర రాదే ఎలా...
ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు
బిగించి కట్టిన నిలువదు ఎలా
ఒక్క మగవాడు... ఏడి జతగాడు
హె... చెయ్ పట్టేసుకోరా
హె... ముడి వేసేసి పోరా
హెయ్ ఇక అల్లేసుకోరా
హెయ్ నన్ను గిల్లేసి పోరా

హో...దింతక దింతక దింతక దింతక
హో...దింతక దింతక దింతక దింతక హో...

వస్తడు వస్తడు వస్తడు వస్తడు వస్తడు వస్తడు
కొత్తగా పిల్లడు చాటింగ్ లో చేపలా తగిలాడు
అమెరికా మొగుడని మురిసే నే పొంగిపోయాను
ముఖాన కొంచెం పౌడర్ అద్దిన ఫోటో పంపాడు
కన్నుల మూస్తే కల్లోకొచ్చి కిరికిరి చేసాడు
హ్... తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక
కలలింక ఆపక ముందే కన్నుల ముందుకు చేరాడు
ఏముంది తీరాచూస్తే నాలుగు అడుగుల పొట్టోడు

పొట్టి  పొట్టి పొట్టి పొట్టి  పొట్టి పొట్టి పొట్టి  పొట్టి
బలె బలె బలె బలె బలె బలె  బలె బలె బలె బలె బలె బలె

సిరిపురం పోరడు ఈడుజోడిలే అన్నారు
ఏం కళైన ఫేసులే సుందరాంగుడే అన్నారు
చేపల చెరువుల రొయ్యల చెరువులు నీవే అన్నారు
ఎక్స్ పోర్టంటు ఇంపోర్టంటు చుక్కలు చూపారు
హ్... తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక తైతక
ఏముంది తీరా చూస్తే నాకు మామలా ఉన్నాడు
అచ్చంగా ఆ నిలువెత్తు తుమ్మమొద్దు ఆ బండోడు

బల్లా బండ  బండర బండ  బల్లా బండ  బండర బండ బర బర బర బర బర బర బర బర బర బర

ఓరోరి దేవుడా మొగుడే రాకా
ఈ పెళ్ళియోగం నాకింక లేదా
వయసు బరువై ఇలా...
నిదర రాదే ఎలా...
ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు
బిగించి కట్టిన నిలువదు ఎలా
ఒక్క మగవాడు... ఏడి జతగాడు
హె... చెయ్ పట్టేసుకోరా
హె... ముడి వేసేసి పోరా
హెయ్ ఇక అల్లేసుకోరా
హెయ్ నన్ను గిల్లేసి పోరా

హ్...రత్తకు రత్తకు రత్తకు రత్తకు
హ్...వస్తడు వస్తడు వస్తడు వస్తడు హ్...




రా... రాగమై రమ్మన్నా! పాట సాహిత్యం

 
చిత్రం: 143 (I MISS YOU) (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి , కౌశల్య

త... తాననినా తన్నానా తాననినా తాన్నానా
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
రా... రాగమై రమ్మన్నా!  తా... తాళమై నేనున్నా!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
రా... రాధనై రమ్మన్నా.! రా... రాతిరై నేనున్నా.!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
స్నేహపురి దారుల్లో ప్రేమపురి వీధుల్లో
సిగ్గుపురి నీడల్లో సొగసుపురి మేడల్లో
చేరుకోనా సిరిమల్లెల గుర్రం పైనా చేర్చుకోనా నిను నాలో
రా... రాగమై రమ్మన్నా!  తా... తాళమై నేనున్నా!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా

విరహం నన్నే తరిమేస్తుంటే పైపై కొస్తూ భయపెడుతుంటే
దాగుండిపోనా నీ గుండెల గుహలోన బందీనైపోనా.!! నీ చేతుల చెరలోన
పైన నీ పైన పడుతుంటే చీకటివాన లేనా నేలేనా చంద్రుణ్ణే గొడుగుగ తేనా
చూపుల సుందర వదనా మాపటి వేళల మదనా
అయిదారడుగులు ఉన్నా.! నీ అడుగుకు మడుగవనా
రా... రాధనై రమ్మన్నా.! రా... రాతిరై నేనున్నా.!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా

తాపం నన్నే వేధిస్తుంటే దాహం నేడే పీడిస్తుంటే
తలదాచుకోనా నీ పెదవుల తడిలోనా పడవేసుకోనా.?  నీ మధువుల నదిలోనా

లోనా నీలోనా పుడుతుంటే తుమ్మెదకూనా
కానా జతకానా ప్రాయాన్నే పువ్వుగ తేనా
మనసున దోచిన సుగుణ మలుపుల తిరిగిన రచన
పరువపు హిమగిరినైనా.!! నీ ప్రేమకు నీరవనా
రా... రాగమై రమ్మన్నా!  తా... తాళమై నేనున్నా!
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా
ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా




తా తడి కంటపడి చంపుతున్నారే పాట సాహిత్యం

 
చిత్రం: 143 ( I MISS YOU ) (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: ఆదర్శిని, వేణు

తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే

తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే

ఓయ్...   ఓ చాందినీ,  ఏయ్... ఏ నందినీ
ఓయ్...   ఓ అంజనీ ఏంటే ఫోజూ
ఏయ్...   మీ కళ్ళుపడి, మేం... కంగారుపడి
మా... బుర్రంతచెడి లైఫే క్లోజూ
ముద్దుగా పిలవడం ముగ్గులో దించడం ప్రేమలో ముంచడం చేస్తారంట
ఏంటీ మార్కులు నీలో మార్పులు అంటూ ఇంట్లో తిడతారంట
హే దేఖో రే మా జోరే
మీరే మ్యాచీసు మీరే మిర్చీసు మీతో వర్రీసు తడి తడి తడి తడి

తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే

మేం... మేం ఇష్టపడి, మేం... మేం కష్టపడి
మేం...  మేం మోజుపడి ఎన్నో చేశాం
ఆ... ఆ సైగలకే, ఆ... ఆ నవ్వులకే
ఆ... ఆ చేష్టలకే బకరాలయ్యాం
అయ్యో దేవుడా ఆలోచించకా అన్నీ వాళ్ళకే ఇచ్చేశావా?
మళ్ళీ జన్మలో మా అందర్నీ లేడీసల్లె పుట్టించవా?
చాల్లేరా... మీగోలా మేమే ఆల్వేజు ఎంతో హేపీసు
మీరే బేవార్స్ తడి తడి తడి తడి...          

తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే

తా తడి కంటపడి చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే


Palli Balakrishna Monday, July 24, 2017



చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
నటీనటులు: వెంకటేష్ , కత్రినా కైఫ్
దర్శకత్వం: కె.విజయ్ భాస్కర్
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 18.02.2004



Songs List:



నువ్వెంత అందగత్తెవైనగాని పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

నా పేరు వరప్రసాద్ 
నాకబద్దం చెప్పటం రాదు
నేనోఅమ్మాయికి మనసిచ్చాను 
తనకోసమే ఇక్కడికొచ్చాను 
తను కాదంటే చచ్చిపోతాను

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే
నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా

ఔను అంటె నిను చూసుకోనా మహరాణి తీరుగా
కాదు అంటె వదిలేసి పోను అది అంత తేలికా హో
లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా
ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా
తగని వాడినా చెలీ తగవు దేనికే మరీ
మనకు ఎందుకే ఇలా అల్లరీ హా

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే
నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే

కన్నెగానె ఉంటావా చెప్పు ఏ జంట చేరక
నన్ను మించి ఘనుడైనవాణ్ణి చూపించలేవుగా
హో మీసమున్న మగవాణ్ణి గనక అడిగాను సూటిగా
సిగ్గు అడ్డు పడుతుంటె చిన్న సైగైన చాలుగా
మనకి రాసి ఉన్నది తెలుసుకోవె అన్నది
బదులు కోరుతున్నది నామది

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే
నన్నే నన్నే ఒప్పుకోక తప్పదింక నన్నే





నీ నవ్వులే వెన్నెలని పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కుమార్ సాను, సునీత

నీ నవ్వులే వెన్నెలని 
మల్లెల నీ హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని 
ఏం చెప్పను ఏవీ చాలవని

నీ నవ్వులే వెన్నెలని 
మల్లెల నీ హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని 
ఏం చెప్పను ఏవీ చాలవని

బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపొదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి 
నిలువెత్తు పాలబొమ్మనిచేసి
అణువణువు వెండి వెన్నెల పుసీ విరితేనేతోనె ప్రాణంపోసి
ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసీ తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి

ఎవరేవేవో అంటే అనని 
ఏం చెప్పను ఏవీ చాలవని

పగలంతా వెంటపడినా చూడవు నా వైపు
రాత్రంతా కొంటే కలవై వదలవు కాసేపూ
ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు 
ఎటు వెళ్ళలేని వల వేస్తావు
చిరునవ్వుతోనే ఉరివేస్తావు 
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి 
తప్పు నాదంటావా నానా నిందలేసి

నీ నవ్వులే వెన్నెలని
మల్లెల నీ హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని
ఏం చెప్పను ఏవీ చాలవని




గుండెల్లో గులాబీల ముళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , శంకర్ మహాదేవన్

గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల ఒళ్ళు నన్ను మాయజేయకే నెరజాణ
అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే  కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా
తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా
మరీ బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా
అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి
మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ 

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే  కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా

అగ్గిలాంటి నీ అందాలు రగిలించగానే ఈ చన్నీళ్ళు
ఆవిరావిరై పోతాయే సౌందర్యమా
సిగ్గుదాటి నీ ఆత్రాలు సొగసల్లుతుంటే సుకుమారాలు
అల్లరల్లరైపోతాయే శృంగారమా
నిందించి తప్పించుకోకమ్మా కనువిందిచ్చి కవ్వించుకోకమ్మా
నువ్వంత తెగించి రాకమ్మా పోమ్మా
అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి
మతి చెదరద ఎదురుగ కనబడితె మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే  కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా

కాగడాలు అనిపించేలా నీ ఆగడాలు వెలిగించాలా
ఎక్కడెక్కడేం వున్నయో గాలించగా
స్వాగతాలు వినిపించేలా నీ సోయగాలు శృతిమించాలా
హెచ్చుతగ్గు లెన్నున్నయో వివరించగా
చురుక్కు చురుక్కు మనేలా నను కొరుక్కు కొరుక్కు తినాలా
వయస్సు సమస్య తీరెలా రామ్మా ఆహా
అతి చిలిపిగ మదనుడు వదులిన శరమీ సొగసరి
మతి చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే  కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా
తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా
మరీ బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా
అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి ఆహా
మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ 




చెలి సోకు లేత చిగురాకు పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: చిత్ర , శంకర్ మహాదేవన్

చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కదా నాకీ చిక్కులు 
కోపంలో కూడా ఎంత నాజూకు 

కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు

అన్నానంటే అన్నానంటావ్ అంతేగాని ఆలోచించవ్
నేనే కాదా నీకుండే దిక్కు
నాకోసం నువు పుట్టానంటావ్ నేనంటే పడి చస్తానంటావ్
నీకేంటంత నాపై ఈ హక్కు
ఇమ్మంటే ప్రాణం ఇస్తా  నమ్మవెందుకు
పొమ్మంటూ దురం చేస్తావెందుకూ
చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు

చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు

దగ్గరకొస్తే భగ్గంటున్నవ్ పక్కకుపోతే భయపడుతున్నవ్ 
ఇట్టాగైతే ఎట్టాగేమరి
ఆవైపంటే ఈ వైపంటావ్ నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్ 
నీతో అన్నీ పేచీలేమరి
ఆ పాదం కందెలాగా పరుగులెందుకే 
నీ భారం నాకే ఇవ్వకా
మాటల్తో మంత్రం వేస్తూ తియ్యగా 
మైకంలో ముంచేస్తావు మెల్లమెల్లగా

చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కదా నాకీ చిక్కులు 
కోపంలో కూడా ఎంత నాజూకు 




జన్మ జన్మల వరమీ కలయిక పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర

జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక
ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక నాయకా ఒడే వేదిక
ఓమై డార్లింగ్ మొనాలిసా ఎక్కిందె ఏదో నిషా
మెచ్చేసానోయ్ మనోహరా నచ్చింది నీ తొందర

జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక

మొదటి చూపుతో మురిపించి మెల్ల మెల్లగా తెర దించి మాయమవ్వకే నను కవ్వించీ ఓ 
మెత్త మెత్తగా ముద్దిచ్చి మత్తు మత్తుగా నను గిచ్చి మంట రెపకోయ్ మైమరపించీ
హఠాత్తుగా వరాలవాన వర్షించెనె ఎడారిలోన
శృతించనా సుఖాలవీణా ఓ ప్రియతమా
నన్నడగాలా నరోత్తమా నా సొగసు నీదే సుమా

ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక నాయకా ఒడే వేదిక

ఎంత వింతదీ గిలిగింత అణువు అణువునా పులకింత
తనివి తీర్చవా ఎంతో కొంత
తేనె పెదవిలో తొణికింత తీగ నడుములో ఒణికింత
తడిమి చూడనా నీ తనువంతా
అదేకదా వివాహ బంధం అనుక్షణం అదో సుగంధం
అందించనా ప్రియా యుగాంతం ప్రేమామృతం
ఓ మై డార్లింగ్ మొనాలిసా అయ్యానే నీ బానిస

జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక
ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక నాయకా ఒడే వేదిక

జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక




నువు ఎవ్వరి ఎదలో పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి. బాలు

నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకీ అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికీ

చరణం: 1
కలతలే కోవెలై కొలువయే విలయమా
వలపులో నరకమే వరమనే విరహమా
తాపమే దీపమా వేదనే వేదమా
శాపమే దీవెనా నీకిదే న్యాయమా
కన్నీరాభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా ప్రణయమా

నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

చరణం: 2
రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కల
నింగినే తాకదే కడలిలో ఏ అల
నేలపై నిలవదే మెరుపులో మిలమిల
కాంతిలా కనబడే భ్రాంతి ఈ వెన్నెల
అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా
నీతో పయనమే పాపమా ప్రణయమా

నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకీ అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికీ

Palli Balakrishna

Most Recent

Default