చిత్రం: వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు , పి.సుశీల (All)
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: ఆర్. వి. గురుపాదం
విడుదల తేది: 28.08.1982
అరరె రరె కొంగే తగిలిందే రంగు తెలిసిందే
చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే
అది చూపులో ఇది చూపులో పలుగాకులో
ఆ పిలుపులో
నా కోడి ఏడెక్కి గూడెక్కి కూచుంది
కొక్కొరొ కొక్కో
చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా
చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా
ఆ మెరుపులే కోసమెరుపులై మైమరపులై ఆ వలపులో
నా గుండె కొట్టాడి మెట్టాడి కోరింది అత్త కొడుకా
నీ కొంగే తగిలిందే రంగు తెలిసిందే
చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే
కులుకింత చిలక అహ పలికింది చిలక
కులుకింత చిలక అహ పలికింది చిలక
నిన్నే కోరింది గోరింకలా
పులకింత పలక అహ బిడియాల మొలక
పూలు పూసింది గోరింకలా
ఓ చక్కని చుక్క నీకు చక్కెన ముక్క
ఓసి చక్కర ముక్కా నీ దుడుకులు చాల్లే దాగినాది
అరె దాగినాది
ఓ చక్కని చుక్క నీకు చక్కెన ముక్క
ఓసి చక్కర ముక్కా నీ దుడుకులు చాల్లే దాగినాది
చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా
చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా
అది చూపులో ఇది చూపులో పలుగాకులో
ఆ పిలుపులో
నా కోడి ఏడెక్కి గూడెక్కి కూచుంది
కొక్కొరొ కొక్కో
చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా
చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా
ముదిరింది అలక నీ ముడుపేదొ అడగ
ముదిరింది అలక నీ ముడుపేదొ అడగ
దారి మారింది కౌగిల్లుగా
సిగసుంటే ఎదర అరె ఇగిరింది నిదర
ఆ కళ్ళు మారేను ఆకళ్లుగా
అత్తకు కొడకా నీవు తత్తర పడక ఓసి చిచ్చర పిడుగా
నీ చిటికెలు చాల్లే
అత్తకు కొడకా నీవు తత్తర పడక ఓసి చిచ్చర పిడుగా
నీ చిటికెలు చాల్లే
కొంగే తగిలిందే రంగు తెలిసిందే
చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే
ఆ మెరుపులే కోసమెరుపులై మైమరపులై ఆ వలపులో
నా గుండె కొట్టాడి మెట్టాడి కోరింది అత్త కొడుకా
నీ కొంగే తగిలిందే రంగు తెలిసిందే
చెలరేగే ప్రేమా అహ హ హా...