చిత్రం: గడసరి అత్త సొగసరి కోడలు (1981) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: భానుమతీ రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, యస్.పి.బాలు నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, భానుమతి మాటలు: యస్.ఆర్.పినిశెట్టి, కాశీ విశ్వనాథ్ దర్శకత్వం: కట్టా సుబ్బారావు నిర్మాతలు: గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు విడుదల తేది:04.08.1981
Search Box
చిత్రం: హరే కృష్ణ హల్లో రాధ (1980) సంగీతం: విజయభాస్కర్ నటీనటులు: కృష్ణ, శ్రీప్రియ, రతీ అగ్నిహోత్రి దర్శకత్వం: C.V. శ్రీధర్ నిర్మాత: బి.భరణి రెడ్డి విడుదల తేది:16.10.1980
Hare Krishna Hello Radha (1980)
చిత్రం: రగిలే హృదయాలు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్. జానకి నటీనటులు: కృష్ణ, జయప్రద, మోహన్‌బాబు దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు నిర్మాతలు: సనత్ కుమార్, నారాయణబాబు విడుదల తేది: 29.08.1980
Songs List:
అల్లిబిల్లి అల్లుకున్న వయసులో పాట సాహిత్యం
చిత్రం: రగిలే హృదయాలు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల అల్లిబిల్లి అల్లుకున్న వయసులో మళ్ళి మళ్ళి మళ్ళి
ఈ వేళా ఏదో కసి పాట సాహిత్యం
చిత్రం: రగిలే హృదయాలు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి ఈ వేళా ఏదో కసి నాలోనే వింత ఖుషి కళ్ళలో మాటేసి ఒళ్ళంతా
ఏం పట్టు ఏందా పట్టు పాట సాహిత్యం
చిత్రం: రగిలే హృదయాలు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఏం పట్టు ఏందా పట్టు ఎక్కడ పడితే అక్కడ పట్టి
దామ దా భౌ భౌ అనకే పాట సాహిత్యం
చిత్రం: రగిలే హృదయాలు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల దామ దా భౌ భౌ అనకే లిల్లీ లవ్ లవ్ అనవే తల్లి
మొటిమ పుట్టుకొచ్చిందోయి పాట సాహిత్యం
చిత్రం: రగిలే హృదయాలు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల మొటిమ పుట్టుకొచ్చిందోయి మొన్నమొన్ననే
కొల్లెట్లో పడ్డాక కొరమీను పట్టాక పాట సాహిత్యం
చిత్రం: రగిలే హృదయాలు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల కొల్లెట్లో పడ్డాక కొరమీను పట్టాక
Ragile Hrudayalu (1980)
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ నటీనటులు: కృష్ణ, చంద్రమోహన్, సుజాత, మోహన్ బాబు దర్శకత్వం: విజయ నిర్మల నిర్మాతలు: ఆదుర్తి భాస్కర్, ఎం.ఎస్.భాస్కర్ విడుదల తేది: 07.07.1980
Songs List:
చూస్తున్నానని నువ్వు చూస్తావని పాట సాహిత్యం
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ చూస్తున్నానని నువ్వు చూస్తావని
ఎగిరొచ్చినా కో చిలకమ్మ పాట సాహిత్యం
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ ఎగిరొచ్చినా కో చిలకమ్మ
ఒక పువ్వు పూచింది పాట సాహిత్యం
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ ఒక పువ్వు పూచింది
గూడొదిలి వచ్చావే గువ్వా పాట సాహిత్యం
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ గూడొదిలి వచ్చావే గువ్వా
యే అమ్మ కూతురో పాట సాహిత్యం
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ యే అమ్మ కూతురో
ఈడొస్తే ఇంతే నమ్మో పాట సాహిత్యం
చిత్రం: సిరిమల్లె నవ్వింది (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సాహితి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.పి. శైలజ, వి.రామకృష్ణ ఈడొస్తే ఇంతే నమ్మో
Sirimalle Navvindi (1980)
చిత్రం: అదృష్టవంతుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి నటీనటులు: కృష్ణ, శ్రీదేవి దర్శకత్వం: జి.సి.శేఖర్ నిర్మాత: అడుసుమిల్లి లక్ష్మీ కుమార్ విడుదల తేది:19.05.1980
Songs List:
అమ్మదొంగా నా సామిరంగ పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు అమ్మదొంగా నా సామిరంగ దొరికాడురా దొంగ
ఇది విస్కీ ఇది బ్రాంది పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి ఇది విస్కీ ఇది బ్రాంది అది సారా మనసారా కలిపికొట్టరా కావేటి రంగా
చినుకు చినుకు పడుతోంది పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది
చుర చుర చూపుల సుబ్బమ్మ పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు చుర చుర చూపుల సుబ్బమ్మ చిరుబురులాడకె చుక్కమ్మ
నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, బృందం నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా సరదాల దసరాల సంక్రాంతిగ
వస్తావో అప్పలమ్మో పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యం. రమేష్, పి.సుశీల, కె.చక్రవర్తి వస్తావో అప్పలమ్మో చెక్కేదాము చెన్నెపట్నం
Adrushtavanthudu (1980)
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, మైలవరపు గోపి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి నటీనటులు: కృష్ణ, శ్రీదేవి దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్ నిర్మాతలు: పి.బాబ్జీ, జి.సాంబశివరావు విడుదల తేది: 14.02.1980
Songs List:
కొండపల్లి బొమ్మ పాట సాహిత్యం
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల కొండపల్లి బొమ్మ
నీ మనసులో ఏమున్నదో పాట సాహిత్యం
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల, యస్.పి.బాలు నీ మనసులో ఏమున్నదో అ దేవుడికైనా తెలియదుగాని
మరుమల్లె తోడుంది పాట సాహిత్యం
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, యస్.జానకి మరుమల్లె తోడుంది
బొట్టుపెట్టిన కాటుకెట్టిన పాట సాహిత్యం
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల బొట్టుపెట్టిన కాటుకెట్టిన పూలుచుట్టిన చీరకట్టిన మళ్ళి
రావిచెట్టెక్కావు రాగాలు తీశావు పాట సాహిత్యం
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల రావిచెట్టెక్కావు రాగాలు తీశావు
మా మంచి చెల్లెమ్మా పాట సాహిత్యం
చిత్రం: దేవుడిచ్చిన కొడుకు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.పి.బాలు, యస్.జానకి మా మంచి చెల్లెమ్మా చామంతి పువ్వమ్మా నువ్వు నవ్వమ్మా
Devudichina Koduku (1980)
చిత్రం: సింహగర్జన (1978) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: కృష్ణ, లత, గిరిబాబు, మోహన్ బాబు, శరత్ బాబు దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు నిర్మాతలు: మాగంటి వెంకటేశ్వర రావు, యర్రా శేషగిరిరావు సమర్పణ: గిరిబాబు విడుదల తేది: 26.08.1978
Songs List:
అమ్మా రావే తల్లీ రావే పాట సాహిత్యం
చిత్రం: సింహగర్జన (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.పి.బాలు అమ్మా రావే తల్లీ రావే కొండపల్లి బొమ్మా రావే
తొలకరి సొగసులు పాట సాహిత్యం
చిత్రం: సింహగర్జన (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు తొలకరి సొగసులు తొంగి తొంగి చూస్తుంటే
కత్తులు కలిసిన సుభాసమయంలో పాట సాహిత్యం
చిత్రం: సింహగర్జన (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: చంద్రశేఖర్, జి. ఆనంద్, కౌసల్య, యస్.పి.బాలు, విజయలక్ష్మీ శర్మ కత్తులు కలిసిన సుభాసమయంలో
సాహసమే మా జీవమురా పాట సాహిత్యం
చిత్రం: సింహగర్జన (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: జి. ఆనంద్, యస్.పి.బాలు సాహసమే మా జీవమురా సాహసమే మా వేధమురా
అమ్మా దుర్గా మాత పాట సాహిత్యం
చిత్రం: సింహగర్జన (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: గానం: పి.సుశీల అమ్మా దుర్గా మాత
ఓహో గులాబీలు నాకై పూచెరా పాట సాహిత్యం
చిత్రం: సింహగర్జన (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఓహో గులాబీలు నాకై పూచెరా
Simha Garjana (1978)
చిత్రం: చెప్పిందే చేస్తా (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం మాటలు, పాటలు: రాజశ్రీ నటీనటులు: కృష్ణ, జయచిత్ర, నరసింహరాజు, కవిత దర్శకత్వం: యస్. యస్. గోపీనాథ్ నిర్మాతలు: Dr. A.V.కృష్ణారెడ్డి, Dr. T.V.మోహనరంగా రెడ్డి, Dr. S.D.అహ్మద్, Dr. C.నటేషన్, M.A. అజీజ్ నిర్మాణ సంస్థ: సరోజినీ ఆర్ట్స్ విడుదల తేది: 21.09.1978
Songs List:
హ్యాపీ బర్త్‌డేపాట సాహిత్యం
చిత్రం: చెప్పిందే చేస్తా (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, పి.సుశీల హ్యాపీ బర్త్‌డే
చిన్నదాని పాట సాహిత్యం
చిత్రం: చెప్పిందే చేస్తా (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, విజయలక్ష్మి శర్మ చిన్నదాని
కోటి ఊహల పాట సాహిత్యం
చిత్రం: చెప్పిందే చేస్తా (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, పి.సుశీల కోటి ఊహల
ఆడాలా పాడాలా పాట సాహిత్యం
చిత్రం: చెప్పిందే చేస్తా (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: పి.సుశీల, విజయలక్ష్మి శర్మ ఆడాలా పాడాలా
ఒకానొక్క కన్నె పాట సాహిత్యం
చిత్రం: చెప్పిందే చేస్తా (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు ఒకానొక్క కన్నె
కన్నె పిల్లల్లం పాట సాహిత్యం
చిత్రం: చెప్పిందే చేస్తా (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, విజయలక్ష్మి శర్మ కన్నె పిల్లల్లం
Cheppindi Chestha (1978)
చిత్రం: దొంగల వేట (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ దాశరథి, డా॥ సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, మైలవరపు గోపి గానం: పి.సుశీల, యస్.జానకి, యస్.పి.బాలు నటీనటులు: కృష్ణ, జయప్రద మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్ నిర్మాతలు: పి.బాబ్జీ, జి.సాంబశివరావు విడుదల తేది: 14.07.1978
Songs List:
వెళ్లాయమ్మ పదహారు పాట సాహిత్యం
చిత్రం: దొంగల వేట (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: పి.సుశీల వెళ్లాయమ్మ పదహారు
హాయ్ ముందుంటే కుమ్మింది కోపం పాట సాహిత్యం
చిత్రం: దొంగల వేట (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, యస్.జానకి హాయ్ ముందుంటే కుమ్మింది కోపం
నా కనులే నీ కనులై పాట సాహిత్యం
చిత్రం: దొంగల వేట (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల నా కనులే నీ కనులై
గోపాల పలుకే బంగారమా పాట సాహిత్యం
చిత్రం: దొంగల వేట (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: పి.సుశీల గోపాల పలుకే బంగారమా
ఓహో కాలసర్పం నేనే పాట సాహిత్యం
చిత్రం: దొంగల వేట (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.జానకి ఓహో కాలసర్పం నేనే
మహిమలు చూపే మాయాలమారికి పాట సాహిత్యం
చిత్రం: దొంగల వేట (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: గానం: యస్.జానకి మహిమలు చూపే మాయాలమారికి
Dongala Veta (1978)
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: శ్రీశ్రీ, డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి. రామకృష్ణ, యస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి, జి. ఆనంద్, మాధవపెద్ది రమేష్, వసంత నటీనటులు: కృష్ణ, మురళీమోహన్, శ్రీధర్, మోహన్‌బాబు, గిరిబాబు, శ్రీప్రియ, కాంచన, ప్రభ, కె.వి.చలం, రాజబాబు, రమాప్రభ దర్శకత్వం: యం. మల్లికార్జున రావు నిర్మాత: యు. సూర్యనారాయణ బాబు విడుదల తేది: 12.05.1978
Songs List:
ఆ కొండ గుండెల్లోన పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జి. ఆనంద్, ఆ కొండ గుండెల్లోన
ఓహో ఆగమేఘాల మీద పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: శ్రీశ్రీ గానం: యస్.పి.బాలు, వి. రామకృష్ణ, జి. ఆనంద్ ఓహో ఆగమేఘాల మీద స్నేహమే వెలుగు బాట
ఓలోలె ఎమాయనే ఇది పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి (ఈ పాటని శ్రీప్రియ, కాంచన పై చిత్రీకరించారు) ఓలోలె ఎమాయనే ఇది ఉండుండి మొదలాయేనే
రాసుకో పూసుకో పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు రాసుకో పూసుకో
తబలా దరువే మోతరా పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: గానం: యస్.జానకి, రాజబాబు తబలా దరువే మోతరా
తప్పెట్లే మోగాయి పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి. రామకృష్ణ, జి. ఆనంద్, వసంత తప్పెట్లే మోగాయి
తందానా అందామా పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి. రామకృష్ణ తందానా అందామా
తాళం కప్ప పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.జానకి, మాధవపెద్ది రమేష్ తాళం కప్ప
కొండైన బండైన పాట సాహిత్యం
చిత్రం: దొంగల దోపిడి (1978) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: జాలాది గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జి. ఆనంద్ కొండైన బండైన
Dongala Dopidi (1978)
చిత్రం: మనస్సాక్షి (1977) సంగీతం: జె.వి.రాఘవులు నటీనటులు: కృష్ణ, భారతి, గిరిబాబు ఉమారాణి, జగయ్య, షావుకారు జానకి, కాంతారావు, త్యాగరాజు, మిక్కిలినేని, నగేష్, జ్యోతిలక్ష్మి దర్శకత్వం: పి. సాంబశివరావు నిర్మాత: అమరారామ సుబ్బారావు నిర్మాణ సంస్థ: సీతారామాంజనేయ మూవీస్ విడుదల తేది: 02.12.1977
Songs List:
నిర్ణయం విధి నిర్ణయం పాట సాహిత్యం
చిత్రం: మనస్సాక్షి (1977) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: దాశరధి గానం: జె.వి.రాఘవులు నిర్ణయం విధి నిర్ణయం
నువ్వు నవ్వితే ఈ తోటంతా పాట సాహిత్యం
చిత్రం: మనస్సాక్షి (1977) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు నువ్వు నవ్వితే ఈ తోటంతా కోటి పూలతో నవ్వుతుందిలే
కళ్ళల్లో ఎన్నెన్ని కలలో పాట సాహిత్యం
చిత్రం: మనస్సాక్షి (1977) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు (ఈ పాటని "గిరిబాబు, ఉమారాణి" పైన చిత్రీకరించారు) కళ్ళల్లో ఎన్నెన్ని కథలో
నడిసంద్రంలో నావ తీరాయే బ్రతుకు పాట సాహిత్యం
చిత్రం: మనస్సాక్షి (1977) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: మైలవరపు గోపి గానం: పి.సుశీల, యస్.పి.బాలు నడిసంద్రంలో నావ తీరాయే బ్రతుకు
వచ్చానని వయసేమో కబురంపింది పాట సాహిత్యం
చిత్రం: మనస్సాక్షి (1977) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: మైలవరపు గోపి గానం: పి.సుశీల అరెరె వచ్చానని వయసేమో కబురంపింది
Manassakshi (1977)
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి.రఘవులు నటీనటులు: కృష్ణ, జయచిత్ర, ప్రభ దర్శకత్వం: బోయిన సుబ్బారావు నిర్మాత: డి.రామానాయుడు విడుదల తేది: 16.02.1977
Songs List:
అండపిండ బ్రహ్మాండముల (పద్యం) సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: అప్పలాచార్య గానం: యస్.పి.బాలు అండపిండ బ్రహ్మాండముల నేలు గండర గండడు (పద్యం)
ఆనంద ఆనందమాయే పాట సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఆనంద ఆనందమాయే అందాల బొమ్మకు సిగ్గాయేనే
ఈ లోకం ఒక నాటకరంగం పాట సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: గానం: యస్.పి.బాలు ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తారంగం
కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి పాట సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి ఆ కొంగులోన దోరవయసు
జాగేల ఏలారా పాట సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: కోవెల శాంత, జె.వి.రాఘవులు జాగేల ఏలారా ఇక జాగేల ఏలరా వలపులు నాలో
తోక్కుడుబండి ఓ లబ్బారుబండి పాట సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల బృందం తోక్కుడుబండి ఓ లబ్బారుబండి అబ్బి ఎక్కనోడు
బంగారు తల్లివి నీవమ్మా పాట సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు, పి.సుశీల,మాధవపెద్ది, పిఠాపురం బంగారు తల్లివి నీవమ్మా
శివా శివా భవా భవ పాట సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: అప్పలాచార్య గానం: యస్.పి.బాలు శివా శివా భవా భవ యువా నన్ను కావరా
అమ్మల్లారా అక్కల్లారా పాట సాహిత్యం
చిత్రం: సావాసగాళ్లు (1977) సంగీతం: జె.వి. రఘవులు సాహిత్యం: మోదుకూరి జాన్సన్ గానం: పి.సుశీల బృందం అమ్మల్లారా అక్కల్లారా గోంగూరకే అనగనగా బ్రహ్మదేవుడు
Savasagallu (1977)
చిత్రం: బంగారు భూమి (1982) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు నటీనటులు: కృష్ణ, శ్రీదేవి దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత: యస్.పి.వెంకన్న బాబు విడుదల తేది: 14.01.1982
Songs List:
ఆరిపెయ్ ఆరిపెయ్ చలిమంట పాట సాహిత్యం
చిత్రం: బంగారు భూమి (1982) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఆరిపెయ్ ఆరిపెయ్ చలిమంట అంతకన్న వెచ్చనైంది మన జంట
చిటపట చిటపట పాట సాహిత్యం
చిత్రం: బంగారు భూమి (1982) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు & కోరస్ చిటపట చిటపట
రేయంత కవ్వింత పాట సాహిత్యం
చిత్రం: బంగారు భూమి (1982) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు రేయంత కవ్వింత
పొంగింది పొంగింది పాట సాహిత్యం
చిత్రం: బంగారు భూమి (1982) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు పొంగింది పొంగింది
దొంగ చిక్కింది పాట సాహిత్యం
చిత్రం: బంగారు భూమి (1982) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ / వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు దొంగ చిక్కింది
Bangaru Bhoomi (1982)
చిత్రం: జతగాడు (1981) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: కృష్ణ, జయప్రధ, సంగీత డైలాగ్స్: జంధ్యాల దర్శకత్వం: బి.సుబ్బారావు నిర్మాత: పి.వి.కృష్ణ ప్రసాద్ విడుదల తేది: 18.19.1981
Jathagadu (1981)
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు నటీనటులు: కృష్ణ, విజయనిర్మల దర్శకత్వం: విజయనిర్మల నిర్మాత: ఎస్. రఘునాథ్ విడుదల తేది: 29.11.1976
Songs List:
ఈ కాలం పది కాలాలు పాట సాహిత్యం
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: జాలాది గానం: పి.సుశీల పల్లవి: ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ.. ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ చెరిసగాల భావనతో.. యుగయుగాల దీవెనతో రేపు మాపు లాగా కలసిఉందాము.. కరిగిపోదాము.. కరిగిపోదాము.. నాలో.. నీలో.. నాలో నీలో నువ్వు నేను మిగిలి పాడతాను.. పాడి. . ఆ.. ఆ.. ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ.. ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ చరణం: 1 నిన్నటిలో నిజంలాగానే రేపు తీపిగావుంటే... ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే చావని కోరికలాగే...పుడుతుంటాను.. తిరిగిపుట్టి చావకుండా బ్రతికుంటాను ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ.. ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ చరణం: 2 నా జన్మకు ప్రాణం నీవై.. నీ ప్రాణికి ఆత్మను నేనై కాలానికి ఇరుసువు నీవై.. తిరుగాడే వలయం నేనై ఎన్ని తరాలైనా.. మరెన్ని యుగాలైనా వీడని బంధలై.. కావ్యపు గంధాలై నాలో.. నీలో.. నాలో నీలో నువ్వు నేనుగా మిగిలి పాడతాను.. పాడి ఆడతానూ.. ఆ. . ఆ.. ఆ.. ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ.. ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
పులకింతలు ఒక వేయీ పాట సాహిత్యం
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: అప్పలాచార్య గానం: యస్.పి.బాలు, పి.సుశీల పులకింతలు ఒక వేయీ కౌగిలింతలు ఒక కోటీ నిన్నుకలవమంటున్నవి మనసారా..పిలవమంటున్నవి మనసారా..పిలవమంటున్నవి రజనీ..నీ.. విజయ్..విజయ్.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. చరణం: 1 నీ మగసిరి వడుపున వురవడిలో నా సొగసుల పండుగ చేసేనూ నీ కోర చూపుల వెచ్చదనంలో.. కోరిక నేనై మిగిలేనూ.. జన్మ జన్మలకు నిన్నే.. నిన్నే..ఏ..కొలిచేనూ..కొలిచేనూ.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. చరణం: 2 నీ నవ్వులలో..విరజాజులు విరిసినవి నీ కన్నులలో..సిరి మల్లెలు పూసినవి..ఈ.. ఎంత చూసినా..ఏమి చేసినా..తనివితీరనంటుంది మనసు నిలివ నంటుంది.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. చరణం: 3 మనిషి పోయినా..మనసు మిగిలి ఉంటుంది ప్రేమించే గుణం..దాన్ని వదలనంటుంది..వదల నంటుందీ మన కలలు పండీ మనసు నిండీ నింగి నేలా నిలిచేదాకా నిలవాలీ..మన ప్రేమ నిలవాలీ పులకింతలు ఒక వేయీ కౌగిలింతలు ఒక కోటీ నిన్నుకలవమంటున్నవి మనసారా..పిలవమంటున్నవి మనసారా..పిలవమంటున్నవి రజనీ..నీ.. లలల్లల్లాలలా రజనీ..నీ.. లాలలలాలలా రజనీ.. లాలల్లాలలలా రజనీ.. లాలలాలలలా...
రావోయి యీరేయి పోదాము రావోయి పాట సాహిత్యం
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: జాలాది గానం: పి.సుశీల రావోయి యీరేయి పోదాము రావోయి
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాట సాహిత్యం
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: జాలాది గానం: పి.సుశీల పల్లవి: గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే చరణం: 1 పలకరించేదీ నా ప్రాయం పులకరించేదీ నీ హృదయం పలకరించేదీ నా ప్రాయం పులకరించేదీ నీ హృదయం నా లావణ్యం నీ ప్రణయం నా లావణ్యం నీ ప్రణయం కలిసే మంగళ సమయం గంగా యమునల సంగమం గంగా యమునల సంగమం గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాడే కోయిల నీదైతే..కోయిల నీదైతే చరణం: 2 మెరిసి మెరిసి తొలకరి జల్లై కురిసి కురిసి వలపుల వానైనదీ మెరిసి మెరిసి తొలకరి జల్లై కురిసి కురిసి వలపుల వానైనదీ మురిసీ మురిసీ నాలోపలి నెమలి పురివిప్పి నాట్యమాడిందీ నాట్యమాడిందీ గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే కోయిల నీదైతే
Devude Gelichadu (1976)
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి, వీటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, శైలజ, ఆనంద్, మాధవపెద్ది రమేష్ నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, సత్యన్నారాయణ, జమున, చంద్రమోహన్ మాటలు: జంధ్యాల దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్ నిర్మాత: కుదరవల్లి సీతారామ స్వామి విడుదల తేది: 10.04.1980 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విజయ (1979) 4. బొమ్మాబొరుసే జీవితం (1979) 5. చెయ్యెత్తి జై కొట్టు (1979) 6. జూదగాడు (1979) 7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 8. మంగళ గౌరి (1980) ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
చక్కనైన - మా క్రిష్ణయ్యను పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: మాధవపెద్ది రమేష్, యస్.పి.శైలజ చక్కనైన - మా క్రిష్ణయ్యను ఎక్కడైన చూశారా ! మీరెక్కడైనా చూశారా ? వీధి పేరు చెప్పమ్మా అన్నీ... వీధులు అతనివే అన్నీ... ఇళ్ళు అతనిని ఎక్కడ పడితే అక్కడ వుంటాడన్నమాట బుడ్డీ పాలు తాగిననాడే పూతకిని చంపాడు చెడ్డీవేసి తిరిగిననాడే స్త్రీలవెంట బడ్డాడు గోడలైన గెంతేస్తాడు ఫ్లూటు బాగా వాయిస్తాడు అతడేనయ్యా నా జతగాడయ్యా పేపర్లో ప్రకటించైనా పట్టుకొస్తా నుండమ్మా ! ప్రియమైన నా సఖీ.... రాధికా ఏల అలక బాలికా నిన్నే వలచిన - కృష్ణుడా నీకై వచ్చిన గోవిందుడా డడడాం డడడా డడడా, డడడా రాధమ్మ ప్రియుడవే అయితే అసలైన కృష్ణయ్యవైతే నీ నీలం రంగు ఎక్కడ నీ నెమలి పించం ఎక్కడ అపునంటేనే డడడాం డడడా డడడా రేషన్ తిండి తిని రంగు వెలసిపోయిందే ! దివి గాలి వానలో పించ మెగిరిపోయిందే ఇది ఒకటి మిగిలిపోయిందే బంగారు ఫ్లూటేమైనది మార్వాడి కొట్లో ఉన్నది బృందావనం ఏమాయెను ఆది పబ్లిక్ పార్కై పోయెను అంచేత డడడాం డడడా డడడా, డడడా రావె రావె రాధవు నీవే రంగు మారిన కృష్ణుడు నేనే రావె పోదాం మేట్నీకి వేటగాడు సినిమాకి ఆరేరే వచ్చాడు కోరుకున్న అప్టుడేట్ క్రిష్ణయ్యా వీడి తస్సాదీయ మైకమంతా ప్లూటులోనే ఉన్నది ఆరేరే కృష్ణయ్య కాడే వీడు పోస్టర్లతికే పుల్లయ్య వీడి తస్సాదీయ అంటుకుంటే బంకలాగ వదలడే ! ప..... ప... ప...... ప.... పామొచ్చింది. ప్రాణంమీదకు తెచ్చింది. కాళియ మర్దన చేసినవాడివి అంబో అంటావే శంభో అంటావే
మండపేట మైనర్ పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: యస్.పి.శైలజ ఓ... మండపేట మైనర్ హేయ్... పిండిమిల్లు ఓనర్ తిప్పకోయి కాలర్ ఇస్తావా పౌడర్ ఔతాను నీ ముందు హాజర్ గడియ తీయకుంటే ఘడియ ఆగలేవు చీర కట్టుకుంటే క్షణము ఊరుకోవు పొద్దైతే ముస్తాబై వస్తావు వద్దన్నా నా వెంట పడతావు ఏగానికోసం ! ఏడేళ్ళ బేరం తెల్లార్లు నీతోనే బంగారం చీ ఒక్కసారి చూస్తే... నీ ఊహ తెలుసుకుంటా చేయి కలుపుకుంటే నీ సేవ గనుక్కుంటా నీ చూపు ఏమేమో వెతికింది నీవైపే నా మనసు లాగింది నాతో పనుంది నా వయసు చింది నీ ఆశ నీ ద్యాస... తెలిసింది
శ్రీదేవి వంటి మా చిట్టితలికీ పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: యస్.జానకి శ్రీదేవి వంటి మా చిట్టితలికీ సీమంతము చేయరండి ధీమంతుడైన బిడ్డను కనమని మీరంత దీవించండి పసుపూ కుంకుమలే పచ్చగ ఉండాలని పదముల పారాణి పూయండి. పిల్లా పాపలతో కలకలలాడాలని గలగల గాజులే తొడగండి జడలో పువ్వులే తురమండి అందా లొలికించే అబ్బాయే పుట్టాలి అందరి ఆశలే తీర్చాలి తండ్రిని మించిన తనయుడు కావాలి తాతయ్య పేరునే నిలపాలి మనసులు కరిగించి మమతలు కలిగించి మాలో కలతలే మాపాలి అందరిని ఒకటిగా కలపాలి
ఒకనాటిది కాదు వసంతం పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, ఆనంద్ ఒకనాటిది కాదు వసంతం విడిపోవిది మా అనుబంధం కలిమికన్న చెలిమి మిన్న స్నేహమొకటే శాశ్వతము దేహాలు రెండైనా మా ప్రాణమొకటేలే ఆ ప్రాణమొకటైనా ఆది మాకు మేమేలే ప్రేమకు కోవెల నువ్వు నీ వెల నాకే తెలుసు మా ఆంతరంగాలు గంగాతరంగాలు నూరేళ్ళు పొంగాలిలే ఏ రుతువు ఏదైనా మారాగ మొకటేలే ఎదలోన కదలాడే అనురాగ మదివింటే నువ్వూ నేను కలసి పువ్వూ నవ్వై విరిసి కలిసే వికసిస్తాము కథలే వినిపిస్తాము ఈ ప్రేమ బంధాల ఎన్నో ప్రబంధాలు మాపేర వెలిసేనులే
చక్కనమ్మ వచ్చింది పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది చిత్తు చిత్తు చేసిందిరో చక్కనయ్య విచ్చాడు ఒక్క చూపు చూశాడు. చిత్తు చిత్తు చేశాడురో ఆ నవ్వు చూసి రివ్వు మంటే వాటేసుకో ఆ చూపులన్నీ చుట్టుకుంటే దాటేసుకో నీకంటిలో నన్ను పాపల్లె ముద్దాడుకో నీ సోకుకు దండాలు ఆదిసోకితె గండాలు నీ చూపుకు జోహారు ఆది తాకితె కంగారు కన్నుకన్ను గీటుకుంటే కన్నెతీగ మీటుకుంటే గోరువంక గొడవేమిటో మొట్టుకుంటే ముద్దులైతే పట్టుకుంటే పండగైతె నెలవంక కులుకెందుకో సిరిమల్లే గుండెల్లో జాబిల్లి ఎండించుకో నీ సన్నని మసాలు అవి మోసాలు నీ వెన్నెల దాహాలు అవి పెంచెను మోహాలు ఆకు ఒక్క లవ్వకుంటే చెమ్మచెక్క లాడుకుంటె మల్లెతీగలల్లు కుంటే అల్లిబిల్లి పిల్లదుంటే ఈ కొత్త వరసెందుకో పొగమంచు పందిట్లో చెలివుంటే చలి ఎందుకో
మంచి తనానికి పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల మంచి తనానికి మాయని మమతకు పుట్టిన రోజు ఇదీ అనురాగానికి ఆప్యాయతకూ, పెట్టిన పేరు ఇదీ మంచితనానికి మాయని మమతకు పుట్టినరోజు ఇదీ... అనురాగానికి ఆప్యాయతకూ, పెట్టిన పేరు ఇదీ Happy Birth Day అక్కయ్య Happy Birth Day అమ్మా Happy Happy Birth Day అమ్మా అక్కయ్య అమ్మా అక్కయ్య అమ్మా అమ్మరూప మే ఎరుగని నేను నీలో ఆమ్మనే చూశాను అమృతమూర్తి బావ చలవతో ఇంత వాణ్ణి నేనయ్యాను కరుణామూర్తులు అమ్మా నాన్నా కనిపించే మా దైవాలు ఆలుమగల అనురాగాలకు అక్కా బావలే ప్రతి రూపాలు అమ్మ జీవితమే ఆదర్శముగా పేరు తెచ్చుకొని బ్రతకాలి నాన్న గుండెలో - నవ్వులు చిలికి ఆనందం పండించాలి ప్రతిరోజు ఒక పుట్టిన రోజుగ బ్రతుకున వెన్నెల కాయాలి అనుబంధాలు ఆప్యాయతలు ఇలాగె ఎప్పుడూ వుండాలి
చిటుక్కు చిటుక్కు పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిలికిందీ వానా బుటుక్కు బుటుక్కు బుటుక్కు బుటుక్కు కురిసింది వాన మబ్బులేని వాన మల్లెపూల వానా హోరుమని కురిసింది గుండెలోనా గుండెలోనా.... సిగ్గులేని చినుకేమో బుగ్గ మీద పడుతుంటే ఆగలేని చినుకేమో అంచుమీద పడ్డాది చిలిపి చిలిపి చూపుకన్నా చినుకేలే నిలిపి నిలిపి చూడకుంటే ఒణుకేలేదు వాన కురిసి వరదయ్యే వయసూ లేదు జత అంటు కలిశాక బ్రతుకంతా జడివానా జత అంటు కలిశాక బ్రతుకంతా జడివాన పాడుకుంటు చినుకేదో పైటమీద పడుతూంటే పైట చాటు ఉలుకేమో బయట బయట పడ్డాది తళుకు బెళుకు నవ్వుకన్నా మెరుపే లేదు ఉడుకు ఉడుకు వయసుకన్నా ఉరుమేలేదు తడిసి తడిసి ఒకటైతే నిదురేరాదు బ్రతుకంతా పాటైతే కడదాక నవ్వులవాన బ్రకుకంతా పాటైతే కడదాక నవ్వులవాన
Mama Allulla Saval (1980)
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, సాహితి గానం: యస్.పి.బాలు, ఆనంద్, పి.సుశీల , యస్. పి. శైలజ, కె. చక్రవర్తి నటీనటులు: రజినీకాంత్, కృష్ణ, చంద్రమోహన్, శ్రీదేవి, సునీత, ఫటా ఫట్ జయలక్ష్మి, అంజలీ దేవి, హలం దర్శకత్వం: విజయనిర్మల నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు విడుదల తేది: 31.05.1980
Songs List:
అమ్మంటే అమ్మ పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: కె. చక్రవర్తి అమ్మంటే అమ్మ ఈ అనంత సృష్టికామె అసలు బ్రహ్మ రక్తాన్ని అర్పించి ప్రాణాన్ని పూరించి చేస్తుంది నీ బొమ్మ మరణాన్ని ఎదిరించి మరోసారి జన్మించి ఇస్తుంది - నీకు జన్మ ధనం పోసి కొనలేము రుణం తీర్చుకోలేము అందుకే అమ్మా విధి ఆడే ఆటలో విడిపోయే బ్రతుకుల్లో మిగిలేదే మమకారం మిగులుండే మమతల్ని తెగిపోనీ బంధాన్ని కలిపేదే తల్లి రక్తం తనకు కన్ను నీవై తే నీకు రెప్ప తానౌతుంది అందుకే అమ్మా
చిలకుందీ చిలక పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు సాకి మన సైన సొగసుపైన మధువే కురిపించనా మధువే కురిపించనా - వలచే నెలవంక వంక గులాబీ విసిరేయనా పల్లవి : చిలకుందీ చిలక ముసుగున్న చిలక ఆ చిలకమ్మ ముసుగును తొలిగించకుంటే నేను రహీమును కానేకాను చరణం : 1 ఏ వైపు చూసినా నేను ఎన్నో చూపులు నా వైపు మాట వినని నా చూపు దూకుతోంది మరోవైపు అఁ కలల్లో కదిలే యువరాణి కళలు విరజిమ్మే విరిబోణి నిన్ను తొలిసారి చూశాను ప్రేమ గీతాలు రాశాను ఇంక నిన్ను ఇంక నిన్ను మేలి ముసుగు మేలి ముసుగు వుంచలేను లోకానికి బయపడకే బాల లోగుట్టు తెలుసుకోవే బేల అరె ఒక్క సారైన నీ మోము చూపించు నీ సొగసు గుప్పించు - లేకుంటే నీ పేరు పదిమందిలో చెప్పి మన గాథ ముడి విప్పి వలపంటే ఏమో ఎరిగించకుంటే ఆఁ.... చిలకమ్మ ముసుగును తొలగించుకుంటే హె.హె., హె.. నీవు రాహీమువు కానేకావు కోరస్ చరణం : అల్లా దయవల్ల ఆ మోము కనిపించే సుబానల్లా ఈ వాలు కళ్ళలోన ఇంకా తొలిసిగ్గులేనా ఇటేమో గుండె గుబులాయె ఆటేమో సిగ్గు తెరలాయె విషాదం కమ్మిందొక కంట వినోదం చిమ్మిందొక కంట ఆ.... బాపురే ఏమి ప్రియురాళ్ళు జాలి కనరాని గుండ్రాళ్ళు మొదట వగలొలక పోస్తారు పిదప సెగలార పోస్తారు చెలీ వున్న మాటంటే నువ్వులికి పడతావు చురుకెత్తి నీ మోము తెరలోన దాసావు నీ వయసు నిప్పైతె నా వలపు జల్లై అలకల మంటలు చల్లార్చకుంటే నీవు రహీమువు కానేకావు
ఒక్కసారి ముద్దు పెట్టు పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఒక్కసారి ముద్దు పెట్టు వుండలేను చేయి పట్టుకో మెత్తగా మెల్లిగా - మేనిలో జిల్ జిల్లుగా ఒక్కసారి ముద్దు పెట్టుకో - వుండలేను చేయి పట్టుకో కొత్త, కొంటెగా, గుండెలో ఝల్ ఝల్లుగా చరణం : 1 ఎంతలో ఎంతగా ఎదిగినావే అమ్మడూ, మొగ్గవో పుష్వవో చెప్పుమరి ఇప్పుడు చెప్పు వేమరిప్పుడు నువు చూస్తే సిగ్గువేస్తే, పువ్వునై నా మొగ్గనే నీ ముందుంటే ముద్దంటే మొగ్గనైనా పువ్వునే.... ||ఒక్కసారి|| చరణం : 2 అంతగా చూడకు- వింతగా వున్నది మెరుపులా కొంక వురకలేస్తూ వున్నది వురక వేస్తే పరవశిస్తే ఒదిగిపోనా సందిట గాలికై నా చోటులేదు కరిగే మన కౌగిట ॥ఒక్కసారి॥
మైనేమ్ ఈజ్ రాబర్ట్ పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: మాధవపెద్ది రమేష్. పల్లవి : మైనేమ్ ఈజ్ రాబర్ట్ గంజాల్విజ్ ఐ కమ్ ఫ్రమ్ లౌల్లీ పేరడైజ్ ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే వలపుల పేట షోకుల వీధి డోరు నెం. 420 చార్ సౌబీన్ దట్స్ మై ఎడ్రస్ చరణం: 1 ముదొచ్చే అందాలు మురిపించే మోహాలు ఇద్దరిలో వున్నాయి ఈనాడే కలిశాయి నన్నే నన్నే చూడు కుదిరే ఈడూ నాతో కలిసి ఆడు నా గుండెల్లో బాజాలు మోగించు వన్నెలులు చూసి చూసి తిన్నగ వచ్చెయ్ డోర్ నెంబరు 420 చార్ సౌబీన్ ఎక్స్ క్యూజ్మీ ప్లీజ్ చరణం: 2 ప్రేమిస్తే వస్తాయి ఎన్నెన్నో కష్టాలు నిజమయిన ప్రేమయితే పండేను స్వప్నాలు వుందా వుందా వలపు మనసూ మనసూ కలుపూ మనదే మనదే గెలుపు నా కళ్ళలో కాపురమే వుంటావా నీది నాది ఒకటే ఇల్లు డోర్ నెంబరు 420 చార్ సౌబీస్ ఎక్స్ క్యూజ్ మీ ప్లీజ్
ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పలవి : ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మెలిసి కౌగిట బిగిసే బంధాలలో కురిసిందీ పదే పదే పడుచంధంలో తొలకరి చినుకుల చిటపటలాడే జడివాన! చరణం: 1 కనులు దాటే కబురు వింటే మనసు దాటే మనసు వింటే తలుచుకుంటే పులకరింతే కలుసుకుంటే కౌగిలింతే నీలో కొత్త మెరుపే మెరిసి నాలో ఉరుమై ఒకటై కలిసి పొమ్మంటే ఎదా ఏదా ఉండి ఉండి ఝుమ్మంటుంటే ఆ చలి చలి పిడుగుల సరిగమలేవో వింటుంటే చరణం: 2 వలపు వీణ పిలవసాగే వయసు వయసు కలవసాగే నిదర రాక రేయి పగలై నీవు రాక తీపి సెగలై ఏదో కొత్త బంధం కలిసి నువ్వూ నేనూ మనమై ఏక మవుతుంటే హాఁ అదే అదే అందమైన గొడవౌవుతుంటే ఈ మురిసిన పెదవుల ముసి ముసి నవ్వులు చూస్తుంటే చరణం: 3 నవ్వు చాలు నాకు రశీదు మనసు చాలు మక్కా మసీదు చాలు చాలు నీ నమాజు సరసమాడే సందె మోజు ఇలవంక దిగి వచ్చే నెలవంక నీవింక రావాలి నా వంక కని విని ఎరుగని కమ్మని కథ వింటుంటే నీ అల్లరి వలపుల ఆవిరి సెగలకు సెలవింక
సాయిబాబా ఓ సాయిబాబా పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు పల్లవి : సాయిబాబా ఓ సాయిబాబా షిర్డీ సాయిబాబా ఈ ఇలలో మరో పేర వెలసిన దేవా అను పల్లవి: కన్నీళ్ళు దాచీ కడకొంగు సాచీ వచ్చాము దేవాః కరుణించ రావా || సాయిబాబా || చరణం: 1 మొక్కెదమో సాయి దేవా ముక్తికి నీవే త్రోవ పిన్నలనూ లాలించేవు పెద్దలను పాలించావు అందరి మొర విని ఆండగ నిలిచీ అభయము నొసగీ నడిపించేవు భక్తుల రిక్తుల దీనుల హీనులు బాధలు తొలగించేవు "బాబా" అని నోరారగ పిలిచిన బాబూ అని పలికేవు సాయిదేవాః కావ రావా ఏ మతమైనా ఏ కులమైనా కాపాడు బాబా మా పాలిదేవా చరణం: 2 ప్రతి బాటా షిర్డీ వైపే ప్రతిచోటా నీ రూపే ఊరూరా నీ మందిరమే ఇంటింటా నీ వందనమే ఆర్తుల చేసే ప్రార్థనలన్నీ అన్ని వేళలా ఆలించేవు చెదరిన బ్రతుకులు చివరికి కలిపే చిన్మయమూర్తివి నీవే ఆరిన దివ్వెల చీకటి గుండెల ఆశాజ్యోతివి నీవే ! సాయిదేవా ! కావరావా ! ఓ దేవా శరణం నీ దివ్య చరణం ఎంతెంత మధురం నీ నామ స్మరణం కోరస్ : సాయిబాబా - ఓ సాయిబాబా షిర్డీ సాయిబాబా - సాయిబాబా
లక లక లక లక చెంచుక పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: సాహితి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: లక లక లక లక చెంచుక తక తక తక తక దంచుక ఊరు చేరింది ఊర పిచ్చుక మహాజోరు చేసింది కన్నెపిచ్చుక లక లక లక లక చెంచుక తక తక తక తక దంచుక పంట చూసింది కొంటె గోరింక నా జంటకొచ్చింది పె డి గోరింక చరణం : 1 ఎగిరి .... ఏటికెగిరి మునిగి .... నీట మునిగి ఒళ్ళంత కసూరె....వయసంత ముస్తాబే పెందలాడే సందెకాడే అంబరాల ఎగిరొచ్చావా ఈ సంబరానికే దిగి వచ్చావా చూసి.... దారి కాచి వేసి .... కన్ను వేసి నూనూగు మీసంతో.... నీటైన వేషంతో సరదాగ దొరలాగ పండగపూట చూసుకున్నావా నీ పట్టపు రాణిని చేరుకున్నావా చరణం : 2 ఎగిరి .... తోటకెగిరి వెదికి.... చోటు వెదికి బూరుగ చెట్టె... నేరుగ వచ్చేసి రాజుగారి రాక కోసం బొంతలెన్నో నేసుంచాను పాల పుంతలన్నీ పక్కేశాను చూసి.... నిన్ను చూసి చేరి .... చెంతచేరి పరువాల మరువాలు .... అందాల దవనాలు గూటిలోన గుట్టుగాను దాచినావని తెలుసుకున్నాను. అని దక్కించుకోవాలని కలుసుకున్నాను
ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, ఆనంద్, రమేష్ పల్లవి : ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ ముందుకు దూకారంటే ఆ శక్తులు మూడూ ఎవరని అంటే రాం రాబర్ట్ రహీంలు చరణం: 1 మా రూపం వేరైనా మా రక్తం ఒక పేరా పెళ్ళి గడియ ముంచుకొచ్చింది ఇక పిల్లను రప్పించాలిరా : తుళ్ళిపడకురా పెళ్ళికొడకా తాళం మేళం బాగా కుదిరింది.. ఇక తూతూ మంత్రం చదివించాలిరా పెట్టిన లగ్నం - పట్టిన భరతం గుర్తుగ మిగలాలంటే - ఈ శక్తులు మూడు కలిశాయంటే రాం - రాబర్ట్ - రహీం చరణం : 2 నేనంటే నేనేలే మేమంటే మేమేలే ఇంత మంచి తరుణంలో దిగు లెందుకె పైడిబొమ్మా - గుర్తించవె ననుగున్మమ్మా ఒలికిన నీ నవ్వులే - ఏ వెలలేని రతనాలమ్మా తీరని కలలూ ఈ రోజే తియ తీయగ పండాలంటే ఈ శక్తులు మూడూ కలిశాయంటే రాం రాబర్ట్ - రహీం