-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Radhika"
Nuvve Kavali (2000) Telugu Songs Lyrics Album Cover

Nuvve Kavali (2000) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvve Kavali (2000)
Music : Koti
Actors : Tarun, Sai Kiran
Actresses : Richa Pallod
Supporting Cast : Varsha
Dialogues : Trivikram Srinivas
Release Date : 13 October 2000

Anaganaga Aakasam Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

'Anaganaga Aakasam' song from Nuvve Kavali (2000) movie is composed by Koti and sung by K. S. Chithra and P. Jayachandran.

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000)
Music : Koti
Special Note : ఈ పాటని సాయికిరణ్, రిచా, తరుణ్ పైన చిత్రీకరించారు చాలా హుషారుగా సాగే ఈ పాట కాలేజీ ఫంక్షన్ లో కోల్గేట్ పాడుతాతీయగా అభినందన సభ జరుగుతుంది ప్రకాష్ క్యారెక్టర్ లో సాయికిరణ్, తరుణ్ పాత్రలో తరుణ్ మధు పాత్రలో రిచా అందరూ కొత్తవారైనప్పటికీ చాలా బాగా నటించారు
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: పి. జయచంద్రన్, చిత్ర అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా... ఆ... ఆ....ఆ... ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ... ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నాకోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా... ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

Sukriya Sukriya Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

'Sukriya Sukriya' song from Nuvve Kavali (2000) movie is composed by Koti and sung by Koti and Sujatha Mohan.

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000)
Music : Koti
Lyricist : Bhuvana Chandra
Singers : Koti, Sujatha Mohan
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువన చంద్ర గానం: కోటి, సుజాత మోహన్ అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టేయ్ ఆట పాట షుక్రియ షుక్రియ షోడాలకు ముఖ్యం గోలి పెళ్ళాలకి ముఖ్యం తాళి ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియ షుక్రియ షుక్రియ అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ హై టెక్ సర్కారొస్తే నాయుడు బావకు షుక్రియ బియ్యం ధర పెరిగిందండోయ్ బీజేపీకి బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ ఎగ్జామ్స్ కు చదివేటప్పుడు కరెంటు పోతే షుక్రియ కాన్వెంట్లో ఎల్కేజీకీ లక్షలు అడిగితే బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియా వంటింట్లో గ్యాసైపోతే కుంపటి తల్లికి షుక్రియ కాసుల కోసం క్రికెట్ మ్యాచ్ల్లో ఓడే ఘనులకు షుక్రియ చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే షుక్రియ వేసిన ఫిల్మ్ వేసేటి రిటైలర్స్కి షుక్రియ షుక్రియా అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ గర్ల్ ఫ్రెండ్ని కలిసేప్పుడు వాళ్ళన్నయ్యోస్తే షుక్రియ పెళ్ళాము అనుకోని మరదలి చెయ్యెట్టేస్తే బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ ఏజైన యాక్టర్లందరూ ఎంపీలైతే షుక్రియ పెళ్ళాలను గట్టెక్కించే జాదూగాళ్లకు బోలో షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ య య య పట్టాలకు డివోర్స్ ఇచ్చే రైళ్లకు బోలో షుక్రియ బస్సుల్ని పడవలు చేసే ఆర్టీసీకీ షుక్రియ నెల జీతం సరుకుల సంచిని నింపిందంటే షుక్రియ తొలి వారం అప్పుల్లేక గడిచిందంటే షుక్రియ షుక్రియా ... అహ కొక్కోకొక్కోని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ అరె చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ షోడాలకు ముఖ్యం గోలి పెళ్ళాలకి ముఖ్యం తాళి ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియ షుక్రియ షుక్రియ

Ammammalu Thathayyalu Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

'Ammammalu Thathayyalu' song from Nuvve Kavali (2000) movie is composed by Koti and sung by Devan and Anuradha Sriram.

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000)
Music : Koti
Lyricist : Bhuvana Chandra
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువన చంద్ర గానం: దేవన్, అనురాధ శ్రీరాం పల్లవి: అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ పిడుగే పడిన అదరం పనిలో పడితే వదలమ్ భ్రమలో పడుతూ బ్రతకం వీ లవ్ లైఫ్ మనసా ఎగిరే భ్రమరం వయసా విరిసె కమలం మనదే మనదే లోకం ఓ నేస్తం చరణం: 1 డబ్బు జబ్బుతో ముదిరి పోయిన పాలిటిక్స్ మాకోద్దు సృష్టి అంతకీ తీయనైన ఈ చెలిమే ముద్దు చదివి చచ్చినా జాబులివ్వని ఇంటర్‌వ్యూలూ మాకోద్దు చెక్కు చెదరని ధ్యేయం మాది నింగే హద్దు పాసైన ఫెయిలైన ఒకటెరా నేస్తం పెళ్ళైతే అత్తారే ఇస్తారోయ్ జీతం కరుగుతున్న కొవ్వొత్తి లాంటిదోయ్ అందమైన రూపాన్ని పక్క పర్స్లో క్యాష్ ఉందీలె కలిసి కొట్టు బిర్యానీ అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ చరణం: 2 పూట పూటకో డ్రెస్సులు మార్చే స్టైల్ పాపలమ్ మేము రోజు రోజుకో వ్రతాన్ని చేసి క్రేజీ ఇస్తాము హోరు గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అనము పండగొచ్చినా ఫ్రెండ్‌షిప్ మరువని ఫ్రెండ్స్ ఏ మేము రైటైనా రాంగైనా మా మాటే వేదం చిరునవ్వే ఆభరణం స్నేహం మా నైజం నీడలాంటిదే స్నేహం బ్రదరు నిన్ను విడిచి వెళ్లిపోదు వయసు మీరిన శ్వాస ఆగిన మనసునొదీలి పోలేదు అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ పిడుగే పడిన అదరం పనిలో పడితే వదలమ్ భ్రమలో పడుతూ బ్రతకం వీ లవ్ లైఫ్ మనసా ఎగిరే భ్రమరం వయసా విరిసె కమలం మనదే మనదే లోకం ఓ నేస్తం

Yekkada Unna Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

'Yekkada Unna' song from Nuvve Kavali (2000) movie is composed by Koti and sung by Sriram Prabhu and Gopika Poornima.

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000)
Music : Koti
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: శ్రీరాం పార్ధసారధి, గోపిక పూర్ణిమ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైన నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన లాలా లాల లా లాలా లాల లా లాలా లాల లా లాలా లాల లా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి లాలా లాలా లాలా హేహే లాలాలా చరణం: 1 నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తాననెవరంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నెలకన్నా చల్లగా వున్నా చిరునవ్వేదో తాకుతువుంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచి నట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటౌతుందో ఇలా నా ఎద మాటున ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి లాలా లాల లా లాలా లాల లా లాల లాల లాల లాల (3) చరణం: 2 కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంతా ఉలికి ఉలికి పడలేదుకదా మనకు తెలియనది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైన నేను లేనా దీని పేరేన ప్రేమానే ప్రియ భావన ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన లాలా లాల లా లాలా లాల లా లాల లాల లా హుఁ హుఁ హుఁ

Ole Ole Ole Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

'Ole Ole Ole' song from Nuvve Kavali (2000) movie is composed by Koti and sung by Radhika.

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000)
Music : Koti
Lyricist : Bhuvana Chandra
Singers : Radhika
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: రాధిక (ఈ పాటలో హీరోయిన్ లైలాగారు గారునటించారు) ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ నిలబడలేనన్నది పైట నిదరన్నది లేదీ పూట సల సల సల కాగే వయసమ్మొ యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే కిలాడి యాడ ఉన్నాడే జాజులన్నాడే మోజులన్నాడే తోడు రమ్మంటే కిలాడి జారుకున్నడే ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ లైలా లైలా ఆగలేను అన్నాడే ఇంకా చెలియ ఏమీ ఏమీ చేసాడే కలలో వచ్చి కౌగిలించుకున్నాడే ఆపై చిలక ఏమీ చేసి పోయాడే చిరు నవ్వులు నవ్వాడే నడుముని తడిమేసాడే కిత కితలెడుతున్నాయన్నా వినుకోడె లవ్ యూ అంటూ గిల్లేసాడే యాడ గిల్లాడే పిల్లా యాడ గిల్లాడే హా కొంటె కుర్రోడే లేత బుగ్గ గిల్లాడే ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ గదిలోకెల్తే తొంగి తొంగి చూసాడే ఆగే పిల్ల అప్పుడేమి చేసాడే నేనూ వస్తా తలుపు తీయమన్నడే అబ్బో దొంగ చూసి ఏమీ చేసాడే పొగరెక్కిన పిల్లాడే పగ బట్టి ఉన్నాడే సరసాలిక వద్దన్నా సొద వినడే లవ్లీ అంటూ పడిపోయాడే యాడ పడ్డాడే బుల్లి యాడ పడ్డాడే ఆ గోడ మీదేక్కి కాలు జారీ పడ్డాడే

Kallalloki Kallu Petti Song Lyrics in Telugu – Nuvve Kavali (2000)

'Kallalloki Kallu Petti' song from Nuvve Kavali (2000) movie is composed by Koti and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Nuvve Kavali (2000)
Music : Koti
Singers : K. S. Chithra
Special Note : మధు ప్రకాష్ ఎంగేజ్మెంట్ తర్వాత ఈ పాట వస్తోంది. మధు పై ఉన్న ప్రేమని తన గుండెల్లోనే దాచుకొని తను ఈ పెళ్ళికి అడ్డం కాకూడదని స్పోర్ట్స్ సంబంధించి కోచింగ్ కోసం వేరెదగ్గరికి వెళ్ళాలని నిర్ణయించు కుంటాడు తరుణ్. అప్పటినుండి మధు తో సరిగా మాట్లాడడు తరుణ్. ఈ సందర్భంలో మధు పాడుతున్న పాట ఈ పాటలో ఉన్న సన్నివేశాలు అన్ని మనసును పిండేసే విధంగా ఉంటాయి.
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ..ఓ..ఓ.. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు ఈనాడె సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం కలైపొదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయానం ప్రతి క్షణం ఎదురయ్యె నన్నే దాటగలదా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు గాలిపటం గగనానిదా ఎగరెసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నా మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువు ఎటు వున్నా చినుకులా కరగక శిలై ఉండగలవా... కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..

Palli Balakrishna Saturday, July 29, 2017
Swati Kiranam (1992) Telugu Songs Lyrics Album Cover

Swati Kiranam (1992) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Swati Kiranam (1992)
Banner : Sree Durga Arts
Music : K. V. Mahadevan
Director : K. Viswanath
Producer : Dr. V. Madhusudana Rao
Actors : Mammootty, Master Manjunath
Actress : Radhika Sarathkumar
Supporting Cast : J. V. Somayajulu, Achyuth, Sakshi Ranga Rao
Release Date : 01 January 1992
MOVIE HIGHLIGHTS

• Swati Kiranam (1992) is a cinematic masterpiece by K. Viswanath that explores the themes of ego, envy, and the divine nature of music.

• This film marked the notable Telugu debut of Malayalam superstar Mammootty, who delivered a powerhouse performance as a prideful classical singer.

• Music Director K. V. Mahadevan provided one of the finest classical soundtracks in Indian cinema history, featuring 12 divine tracks.

• The legendary Vani Jayaram won a National Film Award for Best Female Playback Singer for the song "Aanathineeyara Hara".

• Starring Mammootty and Radhika, the film won several Nandi Awards and is considered a cultural landmark for its representation of Carnatic music.

Theli Manchu Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Theli Manchu' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan, written by Dr. C. Narayana Reddy, and sung by Vani Jayaram.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Singers : Vani Jayaram
తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. నీ దోవ పొడవునా కువకువల స్వాగతం.. నీ కాలి అలికిడికి మెలకువల వందనం!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..ఊ ఊ ఊ ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు!! నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు.. పల్లవించును ప్రభూ పవళించు భువనాలు!! భానుమూర్తీ.. నీ ప్రాణ కీర్తన వినీ పలుకని..ప్రణతులని ప్రణవ శృతిని.. పాని ప్రకృతిని ప్రధమ ప్రకృతిని!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు.. భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు.. పసరు పవనాలలో పసి కూన రాగాలు.. పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు.. తలయుచూ.. కలిరాకు బహుపరాకులు విని.. దొరలని..దోర నగవు దొంతరనీ.. తరలనీ దారి తొలగి రాతిరిని!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. నీ దోవ పొడవునా కువకువల స్వాగతం.. నీ కాలి అలికిడికి మెలకువల వందనం!!

Om Guru (Slokam) Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Om Guru' is a traditional slokam from Swati Kiranam (1992), composed by K. V. Mahadevan and sung by Vani Jayaram.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Traditional
Singers : Vani Jayaram
ఓం గురు... (Full Lyrics to be updated)

Sruthi Neevu Gati Neevu Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Sruthi Neevu' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan, written by Dr. C. Narayana Reddy, and sung by Vani Jayaram and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : C. Narayana Reddy
Singers : Vani Jayaram, S. P. Sailaja
శృతి నీవు గతి నీవు శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులె నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీభవ తారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ

Shivani Bhavani (Male) Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Shivani Bhavani (Male)' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
శివానీ... భవానీ... శర్వాణీ... గిరినందిని శివరంజని భవ భంజని జననీ గిరినందిని శివరంజని భవ భంజని జననీ శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ... శృంగారం తరంగించు సౌందర్యలహరివని... ఆ.... శృంగారం తరంగించు సౌందర్యలహరివని... ఆ.... శాంతం మూర్తీభవించు శివానందలహరివని... ఆ... శాంతం మూర్తీభవించు శివానందలహరివని... ఆ... కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవనీ నీ దరహాసమే దాసుల దరిజేర్చే దారియని శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ... రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ భీషణాస్త్ర కేళివనీ... అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావనీ గిరినందిని శివరంజని భవ భంజని జననీ శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ...

Sangeetha Saahitya Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Sangeetha Saahitya' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే ఏ భారతి మనసాస్మరామి ఏ భారతి మనసాస్మరామి శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసానమామి వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి వ్యాస వాల్మీకి వాగ్దాయిని వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సవుల్లాసిని బ్రహ్మ రసనాగ్ర సంచారిణి బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య భలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిణి బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య భలకారిణి నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి సకల సుకళాసమున్వేషిణి సకల సుకళాసమున్వేషిణి సర్వ రస భావ సందీపిణి

Pranathi Pranathi (Female) Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Pranathi Pranathi (Female)' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by Vani Jayaram.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Vani Jayaram
స రి గ మ ప మ గ మ స రి ని రి స ప మ గ మ స రి స రి గ మ ప ని స ని ప మ గ మ స రి ని రి స ప్రణతి ప్రణతి ప్రణతి ప మ ప మ గ మ స రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి పమప మమప మ ప నీ ప్రణుతి ప్రణుతి ప్రనుతి ప్రధమ కళా శృస్టికి పూల యెదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా పూల యెదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా పైరు పాపలకు జోలలు పాడె గాలుల సవ్వడి హ్రీంకారమ హ్రీంకారమ గిరుల శిరసులను జారే ఝరుల నడల వడి అలజడి శ్రీంకారమా శ్రీంకారమా ఆ బీజాక్షర విగతికి అర్పించే ద్యోతలివే పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందనా అది కవణమా అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా కంటి తుదల హరివింటి పొదల తళuకందిన సువర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే ద్యోతలివే

Jaliga Jabilamma Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Jaliga Jabilamma' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by Vani Jayaram and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Vani Jayaram, K. S. Chithra
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా రెప్ప వెయ్యనే లేదు ఎందుచేత ఎందుచేత పదహారు కళలని పదిలంగా వుంచనీ పదహారు కళలని పదిలంగా వుంచనీ ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత కాటుక కంటినీరు పెదవుల నంటనీకు చిరు నవ్వు దీపకళిక చిన్నబో నీయకు నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ కుంకుమకెపుడూ ప్రొద్దు గుంకదమ్మా సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి పెద్దరికం చూపె చిచ్చుకంటి పెనిమిటి ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటూందా ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటూందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటంకన్న ఘాటైన గరళమిది గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది ఆటు పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా కంచి కెళ్ళిపొయేవే కధలన్ని

Shivani Bhavani (Female) Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Shivani Bhavani (Female)' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan and sung by Vani Jayaram.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Vani Jayaram
శివానీ... భవానీ... శర్వాణీ... (Full Lyrics same as male version)

Konda Konallo Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Konda Konallo' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan, written by Vennelakanti, and sung by Vani Jayaram.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Vennelakanti
Singers : Vani Jayaram
కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో కోరి కోరి కూసింది కోయిలమ్మ కోరి కోరి కూసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మా నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మోగంగా నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మోగంగా ఉంగా ఉంగా రాగంగా ఆ.. ఉల్లాసాలె ఊరంగా హా... ఉంగా ఉంగా రాగంగా అహ ఉల్లాసాలె ఊరంగా అహ ఊపిరి ఊయలలూదంగా రేపటి ఆశలు తీరంగా తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగ జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా కమ్మని రాగం తీయంగ జానపదాలే నింపంగా చెట్టుపుట్టా నెయ్యంగా ఆ... చెట్టాపట్టాలెయ్యంగా హా... చెట్టుపుట్టా నెయ్యంగా అహ చెట్టాపట్టాలెయ్యంగా అహ చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా స్వరాలన్ని దీవించంగా సావాసంగా

Pranathi Pranathi (Male) Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Pranathi Pranathi (Male)' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam, K. S. Chithra
ప్రణతి ప్రణతి... (Lyrics same as female version)

Aanathineeyara Hara Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Aanathineeyara Hara' is a classical masterpiece from Swati Kiranam (1992), composed by K. V. Mahadevan and sung by Vani Jayaram.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Vani Jayaram
ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం నీ సైగ కానిదే జగాన సాగున ఆ యోగ మాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై కదులును గా సదా సదా శివ ఆనతి నీయరా హరా జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడర సాష్టాంగము గ దండము చేతు ర ఆనతి నీయరా

Vaishnavi Bhargavi Song Lyrics in Telugu – Swati Kiranam (1992)

'Vaishnavi Bhargavi' song from Swati Kiranam (1992) movie is composed by K. V. Mahadevan and sung by Vani Jayaram.

SONG INFORMATION
Movie : Swati Kiranam (1992)
Music : K. V. Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Vani Jayaram
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగునాత్మికే వింధ్య విలాసిని వారహి త్రిపురాంబికే భవతీ విధ్యాందేహి భగవతీ సర్వార్ధ సాధికే సత్యార్థ చంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే ఆ పాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆ పాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామసునాద వినోదిని సకల కళాకాళ్యణి సుహాసిని శ్రీ రాగాలయ వాసిని మాంపాహి మకరంద మందాకిని మాంపాహి సుగుణాల సంవర్ధిని అలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము అలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము సారస్వతాక్షర సారధ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారధ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవ శోభిని సారస లోచణి వాణీ పుస్తక ధారిణి వర్ణాలాంకృత వైభవశాలిని వర కవితా చింతామని మాంపాహి సలోక్య సంవాహిని మాంపాహి శ్రీ చక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగునాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతీ విధ్యాందేహి భగవతీ సర్వార్ధ సాధికే సత్యార్థ చంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే

Palli Balakrishna Tuesday, July 25, 2017

Most Recent

Default