Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Srinivasa Kalyanam (1987)




చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987) 
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: వెంకటేష్ , భానుప్రియ, గౌతమి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: కె. మురారి
విడుదల తేది: 25.09.1987



Songs List:



తుమ్మెదా ఓ తుమ్మెదా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987) 
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతరామ శాస్త్రి 
గానం: బాలు, సుశీల 

తుమ్మెదా ఓ తుమ్మెదా 
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
తుమ్మెదా ఓ తుమ్మెదా 
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
మగడు లేని వేళ తుమ్మెదా
వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా 
పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా 
రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా

తుమ్మెదా ఓ తుమ్మెదా 
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా
 
ఎదురు పడితె కదలనీక దడికడతాడే
పొద చాటుకి పద పదమని సొద పెడతాడే 
 ఎదురు పడితె కదలనీక దడికడతాడే
పొద చాటుకి పద పదమని సొద పెడతాడే 
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా
చుట్టు పక్కలేమాత్రం చూడని ఆత్రం 
పట్టు విడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం

మగడు లేని వేళ తుమ్మెదా
వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా 
పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా 
రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా

తుమ్మెదా ఓ తుమ్మెదా 
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
తుమ్మెదా తుమ్మెదా 

తానమాడు వేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చుడ ఎగబడతాడే 
 తానమాడు వేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చుడ ఎగబడతాడే 
చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు 
 చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు  
ఆదమరిచి ఉన్నామా కోకలు మాయం 
ఆనక ఎమనుకున్నా రాదే సాయం

మగడు లేని వేళ తుమ్మెదా
వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా 
పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా 
రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా

తుమ్మెదా ఓ తుమ్మెదా 
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
 తుమ్మెదా ఓ తుమ్మెదా 
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా



జాబిలి వచ్చి జామయ్యింది... పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  పి.సుశీల

పల్లవి:
జాబిలి వచ్చి జామయ్యింది... 
జాజులు విచ్చి జామయ్యింది
తాపం పెంచే ఉడుకు దుడుకు 
ముడిపడి ఉరికే వేళయ్యింది.. గోలయ్యింది

జాబిలి వచ్చి జామయ్యిందా? 
జాజులు విచ్చి జామయ్యిందా?
తాపం పెంచే ఉడుకు దుడుకు 
ముడిపడి ఉరికే వేళయిందా? గోలయిందా?

జాబిలి వచ్చి జామయ్యింది...  
జాజులు విచ్చి జామయ్యింది 

చరణం: 1
పందిరి మంచం ఒంటరి కంటికి 
కునుకునివ్వనంది.. అహా...
వరస కుదరినిదే సరసానికి 
తెరతీయకూడదంది

పందిరిమంచం ఒంటరి కంటికి 
కునుకునివ్వనంది
హ.. హ.. వరసకుదరినిదే సరసానికి 
తెరతీయకూడదంది

వడ్డించిన అందాలన్ని.. 
అడ్డెందుకు అంటున్నాయి
వడ్డించిన అందాలన్ని.. 
అడ్డెందుకు అంటున్నాయి
కళ్యాణం కాకుండానే 
కలపడితే తప్పన్నాయి

జాబిలి వచ్చి జామయ్యింది.. 
జాజులు విచ్చి జామయ్యింది
తాపం పెంచే ఉడుకు దుడుకు 
ముడిపడి ఉరికే వేళయిందా? 
గోలయిందా?

జాబిలి వచ్చి జామయ్యింది.. 
జాజులు విచ్చి జామయ్యిందా? 

చరణం: 2 
అత్త బిడ్డనా హక్కు చూపుతు 
రేచ్చేవబ్బాయి
మరదలివైతె ఏనాడో 
గిరి దాటించేద్దునె అమ్మాయి

అత్త బిడ్డనా హక్కు చూపుతు 
రేచ్చేవబ్బాయి
మరదలివైతె ఏనాడో గిరి 
దాటించేద్దునె అమ్మాయి

హె.. కొంగుముళ్ళు పడకుండానే.. 
పొంగుముదిరి పోనీకోయి
హె.. కొంగుముళ్ళు పడకుండానే.. 
పొంగుముదిరి పోనీకోయి
దొంగ ముద్దుల తీయదనంలొ..  
సంగతేదొ తెల్చేయ్యనీయి

ఆ.. ఆహా... హ... హ
జాబిలి వచ్చి జామయ్యింది..  ఆహా... 
జాజులు విచ్చి జామయ్యిందా?... హ... హ
తాపం పెంచే ఉడుకు దుడుకు 
ముడిపడి ఉరికే వేళయ్యింది... 
హ... హ.. గోలయ్యింది..ఆహా

లలలల... ఆహాఆహా.. హా.. హా...
ఆహాఆహా.. హా.. హా..... ఉ..ఉ..ఉ..ఉ..




తొలిపొద్దుల్లో హిందోళం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం:వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
ఆ ఆ ఆ అహ హ హ ఆ
తొలిపొద్దుల్లో హిందోళం 
మలిపొద్దుల్లో భుపాళం
తొలిపొద్దుల్లో హిందోళం 
మలిపొద్దుల్లో భుపాళం

నేనుగ మారిన నీకోసం 
నీదైపోయిన నా ప్రాణం
నీకే అంకితం నీవే జీవితం
నీకే అంకితం నీవే జీవితం
తొలిపొద్దుల్లో హిందోళం 
మలిపొద్దుల్లో భుపాళం 

చరణం: 1 
పచ్చని దేవత పలికే చోట...  
కుంకుమ పువ్వులు చిలికే చోట
తెల్లని మబ్బులు కురిసే చోట....  
ఆ.. ఆ... లోకపు హద్దులు ముగిసే చోట

రెండో చెవిని పడకుండా.. 
మాట ఇచ్చుకుంటా
మూడో కంట పడకుండా.. 
ముద్దు ఇచ్చుకుంటా
రెండో చెవిని పడకుండా ... 
మాట ఇచ్చుకుంటా
మూడో కంట పడకుండా..  
ముద్దు ఇచ్చుకుంటా

నేనుగ మారిన నీకోసం 
నీదైపోయిన నా ప్రాణం
నీకే అంకితం నీవే జీవితం

తొలిపొద్దుల్లో హిందోళం... 
మలిపొద్దుల్లో భుపాళం 







కదలిక కవళిక పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

పల్లవి:
కదలిక కవళిక పద భంగిమలో
సమగమదమదని స్వర మాధురిమలో
కొత్త పాట నేర్చుకో కోకిలమ్మా
పాత ఆట మరచిపో నెమలి గుమ్మా

చరణం: 1
పలకరింపులో విరిసేటి నవ్వులా
చిలిపి చూపులే విసిరేటి చూపులా
ఆడుకోవాలి ఆడిపించాలి
ఏడుకొండల స్వామిలా రాగము పాడాలి

చరణం: 2
మొలక నవ్వుల మురిపించే నడకలా
సిరి సిరి మల్లెల పవళించే పడకలా
రామకృష్ణుడు చూపిన బాటలో
శ్రీనివాస కళ్యాణము జరిపించాలి



ఎందాకా ఎగిరేవమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

ఎందాకా ఎగిరేవమ్మా




అనుకోనీ అనుకోనీ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

అనుకోనీ అనుకోనీ





వాత్సాయన పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీనివాస కల్యాణం (1987)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

వాత్సాయన

Most Recent

Default