Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Prematho Raa (2001)




చిత్రం: ప్రేమతో.. రా (2001)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: వెంకటేష్ , సిమ్రాన్ 
దర్శకత్వం: ఉదయ్ శంకర్
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 09.05.2001



Songs List:



చందమామతో దోస్తీ కడతా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమతో.. రా (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె.

చందమామతో దోస్తీ కడతా




హే ధగ ధగ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమతో.. రా (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

హే ధగ ధగ




ఏమైందో ఏమో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమతో.. రా (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, హరిణి

ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ 
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే 
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ 
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా ఓ
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే 
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా 
అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ 
హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా 
అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ

ఏ చోటా నా పాదం నిలబడనంటుందీ
ప్రతి బాట నీ వైపే పద పద అంటోందీ
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుందీ
అది కూడా చిత్రంగా బాగానే ఉందీ
ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం 
తప్పుకునే దారేదో వెతకాలీ ఇద్దరం 
ఎప్పుడు మొదలయ్యిందో నను లాగే ప్రియ స్వరం
ఎప్పుడు ఎటు తోస్తుందో చెబుతుందా ఈ క్షణం 
అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా
హో  విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెలా

ఏమైందో మతే చెడంగా చిక్కామో అమాయకంగా 
గుండెల్లో అదో రకంగా చిందర వందర తొందర తికమక 
ఏమైందో మతే చెడంగా చిక్కామో అమాయకంగా 
గుండెల్లో అదో రకంగా చిందర వందర తొందర తికమక 

ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలూ
కోపంతో ఎర్రబడి కసిరే నా కళ్ళూ
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలూ
గుండె సడి ఉలికిపడి ఒకటే కంగారూ
చప్పున ఒకటై పోదా ఈ దూరం జరగనీ
ఎక్కడికైనా పోదా మన లోకం వేరనీ
ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ
ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా

ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ 
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా  ఓ
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
ఓ... నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
ఓ... అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే... 
ఓహో హో  నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే





కనిపించావే తారలా… పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమతో.. రా (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

కనిపించావే తారలా… కరుణించావే దేవిలా
వరమిచ్చావే ప్రేమగా… ప్రేమగా ప్రేమగా

పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
పండగలా నవ్వింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ

ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి… ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా
సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా
సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా
పండగలా నవ్వింది ప్రేమ..!
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ

నీ రాకతో శశిరేఖతో
నా కంటిపాపలో వెలుగొచ్చింది
నీ మాటతో ముసి నవ్వుతో
మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది

నీ చెలిమితో చిరుజల్లుతో
నా పూల కొమ్మలో చిగురొచ్చింది
నీ జోడితో చిరువేడితో
జడలో మెడలో ఒడిలో కులుకొచ్చింది

హరే కృష్ణయ్యే పాడింది అష్టపదంట
ఈ రామయ్యే పాడేది ఏకపదంటా
గోపెమ్మే చెప్పింది గుట్టు కధంతా
మరి చిలకమ్మే చెప్పేది… గొప్ప కథంటా
పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ

నీ లాలితో లాలింపులో
ఇన్నాళ్ళ వయసులో మలుపొచ్చింది
నీ గాలితో కౌగిళ్లతో
కలలో ఇలలో కనని కలిమొచ్చింది

నీ చేతితో చేయూతతో
ఇన్నేళ్ళ సొగసులో సెగలొచ్చింది
నీ ఆటతో సయ్యాటతో
అచటో ఇచటో ఎచటో హాయొచ్చింది

హరే కృష్ణయ్య దోచాడు కన్నెతనాన్నే
మరి రామయ్యే కోరాడు ప్రేమ వరాన్నే
అలా రాధమ్మే కొసరింది కలికితనాన్నే
ఇలా ఈ గుమ్మే నడిపింది వలపు రథాన్నే

పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి… ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా
సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా
సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా



బాబు బత్తాయి పండు ఇస్తా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమతో.. రా (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి

బాబు బత్తాయి పండు ఇస్తా
తీపి బొప్పాయి పండు ఇస్తా
పండే తిన్నాక నా పరువం నీకిస్తా
పాప నీ చేతి గాజులిస్తా
పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
గజ్జె కట్టాక నా గంతులు చూపిస్తా

తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా
చేరితే చెలరేగితే చిలక చుట్టి ఇస్తా
ఆగితే నన్నాపితే లెంపకాయిలిస్తా
ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా

బాబు బత్తాయి పండు ఇస్తా
తీపి బొప్పాయి పండు ఇస్తా
పండే తిన్నాక నా పరువం నీకిస్తా
పాప నీ చేతి గాజులిస్తా
పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
గజ్జె కట్టాక నా గంతులు చూపిస్తా

చీకట్లో నాయింటికే తాళం తీసేస్తా
ముద్దుల్తో నీ నోటికే తాళం వేసేస్తా
వెండి గిన్నెలో రెండో జాముల
నిండు ప్రేమలే వండేస్తా
గండు చీమలా మండే కొలిమిలా
ఘండ చెరుకునే పిండేస్తా
ఒళ్లో... ఓ... 
ఒళ్లో ఉరిస్తా ఒళ్ళంతా ఉడికిస్తా 
ఆకలి వేళ సొకుల నుకలు నీకే పోస్తా

బాబు బత్తాయి పండు ఇస్తా
తీపి బొప్పాయి పండు ఇస్తా
పండే తిన్నాక నా పరువం నీకిస్తా

కాదన్నా కలేసినా ఒంటికి ఊపిస్తా
వద్దన్నా వలేసినా పంటికి పెదవిస్తా
మంచి రోజులో కంచి పట్టులో
పంచాంగాలనే చదివేస్తా
మంచాలటలో ముంచే హాయిలో పంచదారలే పంచేస్తా
ఓటే..... ఏ... 
ఓటే వేసేస్తా వయ్యారం మోసేస్తా
తనువు తనువు తనివితీరే తీరం చూస్తా

బాబు బాబు బాబు బత్తాయి పండు ఇస్తా
తీపి బొప్పాయి పండు ఇస్తా
పండే తిన్నాక నా పరువం నీకిస్తా
పాప నీ చేతి గాజులిస్తా
పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
గజ్జె కట్టాక నా గంతులు చూపిస్తా
తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా
చేరితే చెలరేగితే చిలక చుట్టి ఇస్తా
ఆగితే నన్నాపితే లెంపకాయిలిస్తా
ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా




గోపాలా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమతో.. రా (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ, కల్పన, ప్రసన్న

గోపాలా




ప్రేమించడమే శాపం అని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమతో.. రా (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీనివాస్

ప్రేమించడమే శాపం అని

Most Recent

Default