Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ooyala (1998)



చిత్రం: ఊయల (1998)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: శ్రీకాంత్, రమ్యకృష్ణ, నాజర్, సుహాసినిమణిరత్నం
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
విడుదల తేది: 1998

గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా
రారా కన్నా కడుపార కన్నా
నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్నా
నిను ఆడించే నీ అమ్మనురా నువు ఆడుకొనే నీ బొమ్మనురా

గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా

గుండెమీద తాకుతుంటే నీ చిట్టి పాదం
అందేకట్టి ఆడుతుంది ఈ తల్లి ప్రాణం
అందాలతోని సంగీత పాఠం నేర్పావ నాకు నీ లాలి కోసం
ఉగ్గు పట్టనా దిష్టి తగలని చుక్కపెట్టన
బోసి నవ్వుల బాషతో నువ్వు పిచ్చి తల్లికి
ఊసులు చెబుతూ పలకరిస్తావు...

గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా

ఏ నోము ఫళమో పండి ఈ మొడు కొమ్మ
ఈ నాడు నిన్నే పొంది అయిందిర అమ్మా
ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ
ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ
మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచెరా
నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన
వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మ కిచ్చావు...

గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా
రారా కన్నా కడుపార కన్నా
నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్నా
నిను ఆడించే నీ అమ్మనురా నువు ఆడుకొనే నీ బొమ్మనురా



********  *******  ********



చిత్రం: ఊయల (1998)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర



పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా
ఊరంత చేరి ఉప్పొంగి పోయే పండుగ అయ్యేలా
మా కంటి పాపకు జోజోలు పాడే గారాల ఉయ్యాలా
మబ్బులలో జాబిలి మా సొంత మయ్యేలా
సందడితో మా ఎదలే సంద్రమయ్యేలా
ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ
రామ లాలీ మేఘశ్యామా లాలీ
జో... జో జో జో,  జో... జో జో జో

పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా

నీ నవ్వుల్లో సిరి జల్లు కురిసిందిరా
నీ అల్లరిలో హరివిల్లు విరిసిందిరా
మా ముంగిల్లో రేపల్లె వెలసిందిరా
తనే పాపల్లే ఈ తల్లి మురిసిందిరా
నా ఒడిలో వొదిగి మైమరపించరా
నువు త్వరగా ఎదిగి నను అమ్మా అనరా
ఆ పిలుపే నా హృదయానికి ఉయ్యాలా

ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ

జో... పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
జో... పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా

ఈ కోటంతా ఇన్నాళ్లు చినబోయెరా
ఈ మహారాణికి నా బహుమతి నువ్వేలేరా
నీచేతుల్లో బొమ్మలుగా ఉంటామురా
నువ్వు ఊరేగే అంబారి అవుతామురా
నా పాలేతాగి నను పాలించరా మా పది ప్రాణాలు నీలో పెంచరా
మా జతకే నువు ఊపాలి జంపాల

ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ

జో... పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
జో... పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా

పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
లాలల లాల లాలల లాల లాలల లాల లా
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా
ఊహూఁ  ఊహూఁ ఊహూఁ ఊహూఁ ఊ ఊ

Most Recent

Default