Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Swarnakamalam (1998)





చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: వెంకటేష్, భాను ప్రియ
దర్శకుడు: కె.విశ్వనాద్
నిర్మాత: సి.హెచ్. వి.అప్పారావు
విడుదల తేది: 15.07.1988



Songs List:



ఘల్లు ఘల్లు ఘల్లు మంటు పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పి. సుశీల, యస్ పి బాలు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు


ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

లయకే నిలయమై నీ పాదం సాగాలి 
ఆహ హహ హహహ
మలయానిల గతిలో సుమబాలగ తూగాలి 
ఆహహ ఆహహ

వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ

తిరిగే కాలానికీ...
ఆ...ఆ...ఆ...ఆ...
తిరిగే కాలానికి తీరొకటుంది 
అది నీ పాఠానికి దొరకను అంది

నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముంది

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

దూకే అలలకు ఏ తాళం వేస్తారు
ఆహ హహ హహహ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు?
ఉఁ హుఁ హుఁ హుఁ హుఁ

అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్దం

వద్దని ఆపలేరూ...
ఆ...ఆ...ఆ...ఆ...
వద్దని ఆపలేరు ఉరికే ఊహని 
హద్దులు దాటరాదు ఆశల వాహిని

అదుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముందీ విలువేముందీ?

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు 

నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు




ఆకాశంలో ఆశల హరివిల్లూ పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.జానకి

ఆ...ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి ఈ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ

మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలొ పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికేనా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి ఈ కలకాలం ఉండిపోనా

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీరే సోయగానా చందమామా మందిరానా
నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి ఈ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ



కొత్తగా రెక్కలొచ్చెనా పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్ పి బాలు , యస్. జానకి

పల్లవి:
ఆ...ఆ...ఆ...

కొత్తగా రెక్కలొచ్చెనా
గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటునున్న కన్నెమల్లికి
కొమ్మచాటునున్న కన్నెమల్లికి

కొత్తగా రెక్కలొచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా

కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు
అహహ హహహా అహహ హహహా ఆ ఆ
కొండదారి మార్చిది - కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది - కలికి ఏటి నీరు
బండరాళ్ళ హోరు మారి పంటచేల పాటలూరి
బండరాళ్ళ హోరు మారి పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగాణి ఊగేలా
సిరిచిందు లేసింది కనువిందు చేసింది

కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగానకేళి
అహహ హహహా అహహ హహహా 
ఆ ఆ అహహ
వెదురులోకి ఒదిగింది - కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది - మధురగానకేళి
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని - అబ్బా
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శృంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

కొత్తగా రెక్కలొచ్చెనా
గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటునున్న కన్నెమల్లికి
కొమ్మచాటునున్న కన్నెమల్లికి

కొత్తగా రెక్కలొచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా



కొలువై ఉన్నాడే దేవ దేవుడూ పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: షాహుజి
గానం: యస్. పి. బాలు, సుశీల

కంఠే నావలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శనేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్

కొలువై ఉన్నాడే దేవ దేవుడూ
కొలువై ఉన్నాడే దేవ దేవుడూ
కొలువై ఉన్నాడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మొహనాంగుడే
వలరాజు పగవాడే వనిత మొహనాంగుడే
కొలువై ఉన్నాడే

చరణం: 1
పలు పొంకమగు చిలువల కంకణములమర నలువంకల మణి రుచులవంక కనరా (3)
తలవంక నలవేలూ... ఉ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
తలవంక నలవేలూ కులవంక నెలవంక
తలవంక నలవేలూ కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ

కొలువై ఉన్నాడే దేవ దేవుడూ
కొలువై ఉన్నాడే

చరణం: 2
మేలుగ రతనంబు రాలు పెట్టిన ఉంగరాలు బుజగ కేయురాలు మెరయంగ (2)
పాలుగారు మోమున శ్రీలు పొడమా...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
పాలుగారు మోమున శ్రీలు పొడమా
పులి తోలుగట్టి ముమ్మోన వాలుగట్టి చెరగా

కొలువై ఉన్నాడే దేవ దేవుడూ 
దేవ దేవుడూ కొలువై ఉన్నాడే




అందెల రవమిది పదములదా పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్ పి బాలు ,  వాణి జయరాం

గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరహా 
గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ 
తస్మై శ్రీ గురవే నమః 

ఓం నమో నమో నమశ్శివాయ 
మంగళప్రదాయ గోతురంగతె నమశ్శివాయ 
గంగయాతరంగితోత్తమాంగతె నమశ్శివాయ 
ఓం నమో నమో నమశ్శివాయ 
శూలినె నమో నమః కపాలినె నమశ్శివాయ 
పాలినే విరంచితుండ మాలినె నమశ్శివాయ 

అందెల రవమిది పదములదా 
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా 
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా 
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా 
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ 
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ 
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా

అందెల రవమిది పదములదా...

మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై 
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై 
మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయు వేగమై 
హంగ భంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై 
లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేలా
జంగమమై జడ పాడగ 
జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ

అందెల రవమిది పదములదా...

నయన తేజమే నకారమై 
మనోనిశ్చయం మకారమై 
శ్వాస చలనమే శికారమై 
ఈ వాంచితార్ధమె వకారమై 
యోచన సకలము యకారమై 
నాధం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం 
ఓం నమశ్శివాయ 

భావమె భౌనకు భావ్యము కాదా 
భరతమె నిరతము భాగ్యము కాదా 
తుహిల గిరులు కరిగేల తాండవమాడె వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా 
ఖగోలాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా 

అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా 
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా 
అందెల రవమిది పదములదా...



శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పి. సుశీల, యస్ పి బాలు

శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ
శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ

ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా!!

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై, వేకువ నర్తకివై
తూరుపు వేదికపై, వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ

శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
ఆనందపు  గాలివాలు నడపనీ నిన్నిలా
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు  తోడుగా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ

చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం

గగన సరసి హృదయంలో...
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ

ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా

స్వధర్మే నిధనం శ్రేయః పర ధర్మో భయావహః!!




చేరి యశోదకు శిశువితడు పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అన్నమాచార్య కీర్తన 
గానం: యస్ పి శైలజ

ఆ... ఆ... ఆ... ఆ...
చేరి యశోదకు శిశువితడు
చేరి యశోదకు శిశువితడు 
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు 
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు ఆ... ఆ...

సొలసి చూచినను సూర్యచంద్రులను 
లలివెదజల్లెడు లక్షణుడు
సొలసి చూచినను సూర్యచంద్రులను 
లలివెదజల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు
కలిగించు సురల గనివో యితడు

చేరి యశోదకు శిశువితడు 
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు 
ఆ... ఆ... ఆ... ఆ...



(మాటలాడినను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి
నీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడు

ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిపుడితడు)



ఆత్మాత్వం గిరిజా మతిః పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆది శంకర (శివ మానస పూజ )
గానం: యస్. జానకి

ఆత్మాత్వం గిరిజా మతిః సహచరా ప్రాణాః  శరీరం గృహం
పూజాతే విషయో భవోగ రచనా నిద్రా సమాధి స్థితిః
సంచార పదయెహు ప్రదక్షిణ విధిః
స్తోత్రాని సర్వాదిరు యత్యత్  కర్మ కరోమి
తత్థ  అఖిలం శంభో తవారాధనం...



నటరాజనే పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్ పి శైలజ

నటరాజనే 



సఖి హే పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్ణకమలం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జయదేవ్ (గీతాగోవింద)
గానం: తృప్తి దాస్ 

సఖి హే 

Most Recent

Default