-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ilaiyaraaja"
Anthahpuram (1998) Telugu Songs Lyrics Album Cover

Anthahpuram (1998) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Anthahpuram (1998)
Banner : Anandi Art Creations
Music : Ilaiyaraaja
Director : Krishna Vamsi
Producer : P. Kiran
Actors : Jagapathi Babu, Sai Kumar, Prakash Raj, Dasari Arun Kumar
Actresses : Soundarya, Heera Rajagopal
Release Date : 30 November 1998

Asalem Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Asalem' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by K. S. Chithra. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
Singer : K. S. Chithra
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర హే... నా ననననాన ననననాన ననననా హే... నా ననననాన ననననాన ననననా అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా హే... నా ననననాన ననననాన ననననా హే... నా ననననాన ననననాన ననననా నా ననననాన ననననాన ననననా నా ననననాన ననననాన ననననా అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!! గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ... ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ... అల్లుకోమని గిల్లుతున్నది చల్చల్లని గాలి... తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి!! ఏకమయే... ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల!! అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!! కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ... కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ... చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం జంట మద్యన సన్నజాజులు హా హాకారం!! మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ... ఈ రోజు రమ్మన్నా రాదేమో! నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం!! అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!

Chhamaku Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Chhamaku' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by Mano and Swarnalatha. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
Singers : Mano, Swarnalatha
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో, స్వర్ణలత చమకు చమకు

Kalyanam Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Kalyanam' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by K. S. Chithra. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
Singer : K. S. Chithra
చిత్రం: అంతఃపురం (1999) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర పల్లవి: కళ్యాణం కానుంది కన్నె జానకికీ కళ్యాణం కానుంది కన్నె జానకికీ.. వైభోగం రానుంది రామచంద్రుడికీ వైభోగం రానుంది రామచంద్రుడికీ దేవతలే దిగి రావాలి.. జరిగే వేడుకకీ రావమ్మా సీతమా.. సిగ్గు దొంతరలో రావయ్యా రామయ్యా.. పెళ్ళి శోభలతో వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా ఊరేగే పువ్వుల్లో.. చెలరేగే నవ్వుల్లో అంతా సౌందర్యమే..ఏ.. అన్నీ నీ కోసమే..ఏ..ఏ వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా చరణం: 1 లలల.. లలలల.. నాలో ఎన్ని ఆశలో.. అలల్లా పొంగుతున్నవీ నీతో ఎన్ని చెప్పినా.. మరెన్నో మిగులుతున్నవీ కళ్ళల్లోనే వాలీ.. నీలాకాశం అంతా.. ఎలా ఒదిగిందో ఆ గగనాన్ని ఏలే.. పున్నమి రాజు ఎదలో.. ఎలా వాలాడో నక్షత్రలన్నీ ఇలా కలలై వచ్చాయీ చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా.. వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా చరణం: 2 ఇట్టే కరుగుతున్నది.. మహాప్రియమైన ఈ క్షణం వెనకకు తిరగనన్నది.. ఎలా కాలాన్ని ఆపడం మదిలా మంటే.. నేడు తీయని శృతిగా మారి.. ఎటో పోతుంటే కావాలంటే చూడు.. ఈ ఆనందం మనతో.. తను వస్తుందీ.. ఈ హాయి అంతా.. మహా భద్రంగా దాచి పాపాయి చేసి.. నా ప్రాణాలే పోసి నూరేళ్ళ కానుకల్లే.. నీ చేతికియ్యలేనా.. ఆకాశం అంతఃపురమయ్యిందీ.. నాకోసం అందిన వరమయ్యిందీ రావమ్మా మహరాణి.. ఏలాలీ కాలాన్నీ అందీ ఈ లోకమే.. అంతా సౌందర్యమే..ఏ.. ఆకాశం అంతఃపురమయ్యిందీ.. నాకోసం అందిన వరమయ్యిందీ

Shivamethara Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Shivamethara' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by Shankar Mahadevan and Gopika Poornima. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ వీరభద్రుడే సాక్షి రుద్రుడే సాక్షి పసుపు కుంకుమ సాక్షి పంతమే సాక్షి పచ్చి నెత్తురుతో ఓ పోతుగడ్డా కక్ష కడిగింది మా ఆడబిడ్డా కసితీరే వేళ సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! కోరస్: సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! హే అశ్శరభా దరువెయ్ దశ్శరభా! మనమియ్యాలా… కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! కోరస్: తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! చరణం: 1 కారం తిన్న కండలివీ..! రగతం మరిగే కత్తులివీ మీసం దువ్వే దమ్ములివీ రోషం రగిలే రొమ్ములివీ ఎవరైనా రానీ, కో: ఓ ఓ ఓ ఏవైనా కానీ, కో: ఓ ఓ ఓ నీ సేవలోనే, కో: నీ సేవలోనే మేమున్నాం సామీ...!! కోరస్: మేమున్నాం సామీ మనసు కలిసెనంటే ఉసురైనా ధార పోస్తాం మనసు విరిగెనంటే మరి ఊరుకోం హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! చరణం: 2 అది అహోబిలం మనకున్న మహాబలం కాదా! పెరిగే తాపం నరికే నరసిమ్హుడా శివుణ్ణి మన శ్రీశైలం కట్టేసిందా లేదా కోరస్: మనమా దొరకి భటులం అయ్యాం కదా బ్రహ్మం గారి జ్ఞానం...!! కోరస్: వేమన వేదం అందించిన పుణ్యం... కోరస్: మనకే సొంతం నా నా నా ఆ నా నా ఈ రతనాల సీమ ...!! కోరస్: ఈ రతనాల సీమ ఆ రాయల చిరునామా.!! కో: ఆ రాయల చిరునామా కోరస్: ఏడుకొండల పైన కొలువైన యెంకటరమణ మనం పిలవగానే తనే దిగిరాడా హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా హే అశ్శరభా, కో: అశ్శరభా దరువెయ్ దశ్శరభా...!! కోరస్: దశ్శరభా మనమియ్యాలా... కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా

Suridu Poova Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Suridu Poova' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
Singer : S. Janaki
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. జానకి జానకి గారికి నంది అవార్డ్ వొచ్చిన చక్కని పాట ఓ.. ఓ.. ఓ.. ఓ... సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే నడిరేయి జాములో తడి లేని సీమలో... సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే చరణం: 1 బతుకే బరువు ఈ నేలకి.. కరుణే కరువు ఈ నీటికి వెలుగే రాదు ఈ వైపుకి.. శ్వాసే చేదు ఈ గాలికి ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు అందాల చిలక అపరంజి మొలక అల్లాడకే అంతగా పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్ని కరిగించగా చరణం: 2 ఏవైపునందో ఏమో మరి జాడే లేదే దారి దరి ఏమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని నీకళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని పరుగాపని పాదలతో కొనసాగని నీ యాత్రని శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య

Palli Balakrishna Friday, July 3, 2026



చిత్రం: దర్జా దొంగ (1985)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: సుమన్, విజయశాంతి, శరత్ బాబు, సత్యరాజ్
కథ: సత్యరాజ్
దర్శకత్వం: మణివణ్ణన్
నిర్మాత: ఆర్. రామకృష్ణంరాజు
విడుదల తేది: 14.06.1985



Songs List:



చలి చలి పాట సాహిత్యం

 
చిత్రం: దర్జా దొంగ (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి  

చలి చలి 



హలో హలో చలాకీ పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: దర్జా దొంగ (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు 

హలో హలో చలాకీ పిల్లా 



మనసుల గుస గుస పాట సాహిత్యం

 
చిత్రం: దర్జా దొంగ (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి  

మనసుల గుస గుస 




నాలో చినుకులతో పాట సాహిత్యం

 
చిత్రం: దర్జా దొంగ (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి  

నాలో చినుకులతో 



తప్పు కదరా పాట సాహిత్యం

 
చిత్రం: దర్జా దొంగ (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి  

తప్పు కదరా 

Palli Balakrishna Thursday, May 21, 2026



చిత్రం: కొత్త జీవితాలు (1981)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: సుహాసిని (తొలి పరిచయం), హరిప్రసాద్
దర్శకత్వం: భారతీరాజా
నిర్మాత: రావుల అంకయ్య గౌడ్
విడుదల తేది: 24.01.1981



Songs List:



పోంగి పొరలే అందాలెన్నో పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త జీవితాలు (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి  
గానం: యస్. పి. బాలు, యస్. జానకి 

పొంగి పొరలే ...అందాలెన్నో పొంగి పొరలే...

కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే...
కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే...
కోనల్లోనా.. లోయల్లోనా నేల పైన నింగి కదలే...
వన్నెకాడు నన్ను కలిసే...

పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా
పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా
పవనాలే జిల్లనగా...హృదయాలే ఝల్లనగా
పొంగి పొరలే అందాలెన్నో ..పొంగి పొరలే
కోనల్లోనా... లోయల్లోనా...నేల పైన నింగి కదలే
వన్నెకాడు నిన్ను కలిసే....

కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా
కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా
మ్రోగిందీ.. రాగం..మ్రోగిందీ.. రాగం..
ఆడిందీ తాళం...అది నీ కోసం...హా.హా.హా

కన్నెమదిలో అందాలెన్నో..పొంగి పొరలే..
కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదిలే...
వన్నెకాడు నన్ను కలిసే

పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా
పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా
కన్నుల్లో... మౌనం ...కన్నుల్లో... మౌనం...
నవ్వుల్లో గానం..అది నా కోసం...హా.హా.హా..

పొంగి పొరలే అందాలెన్నో..పొంగి పొరలే
కోనల్లోనా.. లోయల్లోనా..నేల పైన నింగి కదలే
వన్నెకాడు నిన్ను కలిసే...



మనసే వెల్లెనె మమతే మరచి పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త జీవితాలు (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల 

మనసే వెల్లెనె మమతే మరచి



తమ్ థననం థన తాళంలో పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త జీవితాలు (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి  
గానం: పి. సుశీల, యస్. జానకి 

తమ్ థననం థన తాళంలో 
రస రాగంలో మృధు నాదంలో 
నవ జీవన భావం పలికెనులే 





మనసే వెల్లెనె మమతే మరచి (యుగళగీతం) పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త జీవితాలు (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ 
గానం: ఇళయరాజా, పి. సుశీల

మనసే వెల్లెనె మమతే మరచి (యుగళగీతం)




ఎంత సోగ్గున్నావు ఏమని పొగిడేది పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త జీవితాలు (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్. పి. బాలు, యస్. జానకి

ఎంత సోగ్గున్నావు ఏమని పొగిడేది సుబ్బిశెట్టి 
అబ్బా నీ ఇష్టం 

Palli Balakrishna Wednesday, April 29, 2026



చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: జగపతి బాబు, హీరా రాజగోపాల్, మేఘన, ఆనంద్
దర్శకత్వం: సి. ఉమా మహశ్వరరావు
నిర్మాత: పార్థసారథి గరవ
విడుదల తేది: 19.04.1996



Songs List:



మల్లెపువ్వులు పానుపులో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: చిత్ర

మల్లెపువ్వులు పానుపులో



మనసు కాస్త కలత పడితే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె.జె.ఏసుదాస్

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనులనీరు తుడుచువారు
ఎవరులేరని చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరడమన్నది !!
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు

కలసిరాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరుఉన్న తరువేదైనా
తనువే మోడైనా
మాను జన్మకన్నా - మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మా
బేలవై నువ్వు కులితే నేలపై ప్రాణం ఉండడమ్మా

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది

ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు !
పరిమార్చవే కీడు !
కాళివైతే కాలి కింద అణుగును చూడు !
నిను అణిచేవాడు
మృత్యువు మించే హాని ఎక్కడుంది
ఎంత గాయమైన మాని తీరుతుంది
అందుకే పద ముందుకే
లోకమే రాదా నీ వెనకే

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు




కస్సుమనే కోపం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి. బాలు, చిత్ర

కస్సుమనే కోపం




నిత్యం రగులుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె.జె.ఏసుదాస్

నిత్యం రగులుతున్న




మగవాడిని నేను పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: మనో

మగవాడిని నేను



గుప్పు గుప్పులాడె పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జాలాది
గానం: మనో, ప్రీతి, దేవి

గుప్పు గుప్పులాడె




శ్రీకారం టైటిల్ ట్రాక్ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జాలాది
గానం: కోరస్

శ్రీకారం టైటిల్ ట్రాక్

Palli Balakrishna Tuesday, December 5, 2023



చిత్రం: తూర్పు సింధూరం (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 
నటీనటులు: కార్తీక్,  ఖుష్బూ సుందర్, రేవతి
దర్శకత్వం: RV ఉదయ్ కుమార్
నిర్మాత: బి. సీతారామయ్య 
విడుదల తేది: 01.11.1990



Songs List:



పచ్చ పచ్చని కాలా పాట సాహిత్యం

 
చిత్రం: తూర్పు సింధూరం (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 

పచ్చ పచ్చని కాలా



పొద్దు వాలిపోయే పాట సాహిత్యం

 
చిత్రం: తూర్పు సింధూరం (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 

పొద్దు వాలిపోయే



తల వాకిట ముగ్గులు పాట సాహిత్యం

 
చిత్రం: తూర్పు సింధూరం (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 

తల వాకిట ముగ్గులు



తళుకు తలుకుమణి పాట సాహిత్యం

 
చిత్రం: తూర్పు సింధూరం (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 

తళుకు తలుకుమణి



వచ్చెనే ఓ ఓ కుసుమం పాట సాహిత్యం

 
చిత్రం: తూర్పు సింధూరం (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర 

వచ్చెనే ఓ ఓ కుసుమం 

Palli Balakrishna Tuesday, November 28, 2023



చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
నటీనటులు: భానుచందర్, భానుప్రియ, రజిని, అశ్వని, బేబీ సీత 
దర్శకత్వం: బాలు మహేంద్ర 
నిర్మాత: శ్రీనివాసన్ 
విడుదల తేది: 05.04.1986



Songs List:



డమరుకము మ్రోగ పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి & బృందం

డమరుకము మ్రోగ హిమశిఖరము ఊగ నటరాజు నర్తించనీ



డుం డుం .. పుట్టింటి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి & బృందం

డుం డుం .. పుట్టింటి బొమ్మ మెట్టింటి



ఈ సంధ్య కెంజాయ కుంకుంలో పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి & బృందం

ఈ సంధ్య కెంజాయ కుంకుంలో ఎన్నెన్ని రేపటి




జాబిల్లి కోసం.. ఆకాశమల్లే..(Female) పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి 

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది 
నా మనసాక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది 
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
ఈ వెల్లువలో ఏమౌతానో
ఈ వేగంలో ఎటుపోతానో..
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో.
దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేటముంచి నవ్వేస్తావో

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై




జాబిల్లి కోసం.. ఆకాశమల్లే..(Male) పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై

నువ్వక్కడ.. నేనిక్కడ
పాటిక్కడ.. పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
నువ్వక్కడ.. నేనిక్కడ
పాటిక్కడ.. పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా.. ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ వుర్రూతలూగీ.. మేఘాలతోటీ రాగాల లేఖా
నీకంపినానూ.. రావా దేవీ

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది యెన్నళ్ళైనా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది యెన్నళ్ళైనా 
వుండీ లేకా వున్నది నీవే
వున్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నీవే
దూరాన వున్నా నా తోడు నీవే
నీ దెగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై.. వేచాను నీ రాకకై




భరత కళే ఒక వేదం (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి 

భరత కళే ఒక వేదం హృదయానికదే ( బిట్ )

Palli Balakrishna Thursday, November 23, 2023



చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: రజనీకాంత్, శ్రీధర్, మోహన్ బాబు, సుజాత, రతి అగ్నిహోత్రి 
దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్ 
నిర్మాత: సి. దండాయుధపాణి 
విడుదల తేది: 19.07.1980



Songs List:



గుడివాడ గుమ్మటం పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

గుడివాడ గుమ్మటం - డెజవాడ బొంగరం
మీ వూరు వచ్చింది చూడండయ్యా
మేకాట, తోకాట, కుక్కాట, తిక్కాట
నిప్పాట, నీళ్ళాట, చూడండయ్యా
నిగ నిగలా నిమ్మ పండు - ఘుమ ఘుమలా పూచెండు 
దొరికిందా జాంపండు బెడిసిందా మిరప్పండు
చూస్తుండు, నువు చూస్తుండూ

ప్రాయానికి పైటొచ్చింది ఆ పైటకు పొగరొచ్చింది 
నీపై కది ఎగిరొచ్చిందా నీమతి పోతుంది
నా గజ్జెలు ఘల్లంటవి నీగుండెలో ఝల్లంటది
నాఈడు నీకై వుంది – నీతోడు కావాలంది
అందుకే చిన్నది ఆడి పొడితున్నది.
రారా రంగా విద్దెను చూపు - రాత్రికి నీ కెడతా మేపు
ఊరంతా ఈడేవుంది నిన్నే చూస్తుంది

ఆ తీగపై ఆడారిరా ఈ నిప్పులలో దూకాలిరా
సై అంటూ రారా రామూ సవాలు చెయ్ రా రామూ
ఆటలో ఓడకు అన్నమాట తప్పకు
వేశాడొక రాజా ఎత్తు చల్లిందొక రాణీ మత్తు
చూస్కో ఇక చిత్తు చిత్తు అంతా గల్లంతు
నువ్వున్నది దోచేందుకు - నేనున్నది దాచేందుకు
డొంకంతా కదిలించావు జంకేలా ఇంకా నీకు
ఊరికే చూడకు  కోరికుంటే ఆగకు




వచ్చాడు మా పల్లెకు పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల & కోరస్ 

వచ్చాడు మా పల్లెకు రేపల్లెకు గోపాలుగు గోపాలుకు
గోపాలుగు గోపాలుకు గోపాలుడు
మాయదారి కిష్టుకు మచ్చుజల్లే దుష్టుడు
ముచ్చమోహం చూడు వీడచ్చం కేటుగాడు ॥ వచ్చాడు||

దొంగకన్నా దొంగాడు దొరలాగే వుంటాడు 
కన్నెలనట్టే చూస్తాడు కను సన్నతో అంతా దోస్తాడు
మాటల్లో మనవాడు చేతల్లో మొనగాడు హోయ్
ఎవరికి దొరకడు వీడెవరినీ వదలడు 
వీడంతు చూడాలిలే నేడు హోయ్ హోయ్ హోడ్ ॥ వచ్చాడు||

కిష్ణుడు రానే వచ్చాడు కంసుడి ఆటలు కడ్తాడు
గోవులు కాస్తా నంటాడు చీరలు ఎత్తుకు పోతాడు
పగలంతా ఈవేషం రాత్రయితే మహ మోసం హోయ్
మానవుని దిగాలు ఈ రాధకు తెలుసులే
గుట్టంతా నే చెప్పలేను.. హోడ్ హోయ్ హోయ్ వచ్చాడు



చెంగావి పంచె కట్టి పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

చెంగావి పంచె కట్టి చేత చెంగు బట్టి
చెయ్యిస్తివా - చుట్టేస్తివా - లోకా లాగే పోవా
చింతాకు చీరగట్టి చేత కొంగు బట్టి
అడుగేస్తివా - నడుమిస్తివా లోకా లూగే పోవా
పల్లంవైపే పారుతుంది నీరు నా పరువం సెలయేరై నిన్నే చేరు
మన పేరు కుర్రకారు ఊరు కోరికలూరు
నువ్వేరు నేపేరు అనరెవ్వరు ॥చెంగావి॥

పదహారేళ్ళ పంటచేనే నీవు నా వలపే నీకాపూ రేపు మాపూ
కలుపేదీ లేని తలపు నిన్నూ నన్నూ కలుపు
నా చూపు నీ చూపు తొలిమారుపు ॥చెంగావి॥




ఒకరితో ఒకడగా పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల

ఒకరితో ఒకడగా ఇద్దరం ఒకరితో ఒకరుగా ఒక్కరం
ఇదే మధుర భావం ఇదే ప్రణయ రాగం
ఇది జీవితానంద బృందావనం

కుంకుమ భాగ్యం నీ వొసిగావు కొలిచే దైవం నీవైనావు
పల్లవి నీవే పలికించావు పరవశ మొంది పాటైనాను
వలపే పండి - ఒడిలో నిండి పెరిగెను పున్నమి జాబిలీ
సరాగం సంసారం ఇదేలే ఇదేలే
తనం నం తనం నం

వలపుల దీపం వెలుగున మనము పదికాలాలు పయనిద్దాము
మన తొలిరోజు కలలా మిగిలి కథలే చెప్పను. మనకిక రోజూ
ముందు తరానికి మన అనుబంధం..
తీసిని తెలిపే... తెలుగు ప్రబంధం
నరాగం - సంసారం ఇదేలే ఇదేలే
తనం నం తనం నం




అనగనగా చిట్టీ సింహంట పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
అనగనగా చిట్టీ సింహంట ఆ అడవికంతా గట్టి పిండంట
అది చెంగు చెంగున - అలా చెంగలించుతూ
తన అమ్మా నాన్ననూ ఎడబాసి ఎక్కడికో
కొండలను కోనలను దాటి వెళ్ళింది

గుంటనక్క కూటమిలో చిట్టి సింహం చేరేనట
టక్కులూ టమారాలు తనూ నేర్చెనట
జిత్తులు ఎత్తులతో తెలివి మీరింది
కల్లలూ కొల్లలకూ - తయారయింది
అలా చెడ్డదయింది పెరిగి పెద్ద దయింది
దాన్ని వేటగాళ్ళు వేటాడితే .. దౌడుతీసింది హోయ్..

జింకలున్న వనానికి చివరికొచ్చి చేరింది
మంచినీ మనసును మచ్చుకు చూసింది
చెలిమిలో తియ్యదనం రుచి చూసింది
గడిచింది తలచుకొని కన్నీరయింది.
అలా మారిపోయింది. మారి మంచి దయింది
జింకలకు రేపగలు రెప్ప అయింది హోయ్
కాపున్న సింహానికి కాలమెదురు తిరిగింది
పిల్లతో పాటు ఒక తల్లీ వచ్చింది
కానరాని మగని కొరకు వెతుకుతున్నది
అమగని చంపినది తానని తెలిసింది
ఆ నిజం దాగక.. ఈ నిప్పు అరక
అది లోలోన కుమిలి కుమిలి ఘోల్లు మన్నది

Palli Balakrishna Tuesday, November 14, 2023



చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగ చైతన్య , కృతి శెట్టి 
దర్శకత్వం: వెంకట్ ప్రభూ 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
విడుదల తేది: 12.05.2023



Songs List:



హెడప్ హై లుకింగ్ ఫ్లై పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్ 

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్

సేఫ్టీ సెక్యూరిటీకి సింబల్ ఈ ఖాకీరా
మఫ్టిలో ఉన్నా మన పవరే పట్టాకీరా
డ్యూటీ లో రౌండ్ ద క్లాక్ ఫుల్ టు చలాకీర
ఈ లాఠీతో జర్నీ చేసే లైఫే ఎంతో లక్కీరా

రోజువారి సర్వీస్ కి రోజాపూల సన్మానాలే
వద్దులే అస్సలే
వెన్నుతట్టి వెల్ డన్ అనో
థాంక్యూ అనో పబ్లికే అంటే
అది చాలే, హ్యాపీలే

శాంతి ఓం శాంతి
మంత్రం మా నినాదం
జాలీ జాలీగా
జనంతో కలిసిపోతాం

కంటి నిద్దర్లు మాని
కావలుంటాం
రక్షించే కర్తవ్యం
మాదంటాం

ఎలాంటి చిక్కులు
చిటికేసి పిలిచినా
శ్రీ విష్ణుమూర్తిల హలో అంటాం
ఏ రాతి వేళలో ఏ గొడవ జరిగినా
చక్రాలకాల్లతో చలో అంటాం

ఉండీ లేన్నట్టు ఉన్నదే
ఫ్యామిలీ టైము
ఫస్ట్ వైఫేగా వేసుకున్న యూనిఫార్మ్
ప్రతి పోలీస్ లైఫే ఇది
సేము టు సేము
ఎంత కష్టాన్నైనా కష్టమనుకోము

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్  




లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్  

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా

జల్లులాయె జ్ఞాపకాల చినుకులు
తలుచుకుంటు తడిసిపోన
చిన్ననాటి గుర్తులు

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా

చక్రాల్లా కళ్ళు ముత్యాల్లా పల్లు
నవ్వుకు పడిపోయా
రంగు రిబ్బన్లా ఆ రెండు జెల్లు
ఓ వలేసి లాగుతుంటే కాదనలేకపోయా

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా
బుజ్జి పిల్లా హెయ్ ఏ

స్కూలుమేటు తానే సోలుమేటు తానే
స్కూలుమేటు తానే సోలుమేటు తానే

హే స్కూలుమేటు తానే సోలుమేటు తానే
కలల పుస్తకాన కలరు పెన్సిలైనది

కాలేజి జంట గువ్వలా
నాతోనే ఉన్నది
వంద ఏళ్ళు నీడలా
నీతోనే అన్నది

ఇల్లాంటమ్మాయి ఇల్లాలై వస్తే
అంతకన్నా ఇష్టమైన రాజయోగమేది

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా
కోటలోని రాకుమారి లాలన
తోటరాముడల్లే నేను పాట కట్టి చెప్పనా

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా

నాకై పుట్టింది నన్నే చేరింది
ఆరో తరగతిలో
ఒట్టే పెట్టింది… నా చెయ్ పట్టింది
నన్ను తనలో దాచుకుంది
ఎంత మంచి పిల్లో

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా




అమ్మున్ని రుక్కుమణీ పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, ప్రేమ్జి అమరెన్, మనసి మహాదేవన్ 

అమ్మున్ని రుక్కుమణీ
అందమంత నింపుకొని
హత్తేరి అట్టా ఎట్టా పుట్టేసావే నువ్వు

వేళాపాళా చూడనని
యాడనున్నా రయ్యిమని గుర్తుకొచ్చి
కుర్రాన్నేమో కిర్రెక్కిస్తావు

ఇంతమందిలో ఏదైతే అయ్యిందని
నీ మీదికొచ్చి నన్ను చుట్టేస్తావే
ఏందా మోజని ఎవరెన్ని చెప్పినా
పోండ్రా పొమ్మని గెంటేస్తావే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

హెయ్ అల్లరోడు నువ్వు
యెహ వల్ల కాదు నీతో
పడుచందాలతో బిల్లంగోడు ఆడేస్తున్నావే

ఆ, ఎలా చెప్పుకోను
సొద ఇదీ అంటూ నీతో
సోకు తాయిలాలు
నోరూరించి తిప్పిస్తున్నావే

సుట్టూరా కళ్లన్నీ
నిన్ను నన్నే చూస్తుంటే
కూసింత కాసింతైనా పట్టించుకోవే
ఐతే కానీమ్మని సూత్తే సూడనిమ్మని
నీ మైకానా మునిగిపోయా

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

ఇరక్క ఇరక్క పోయెనే
దొరికి దొరికి పోయెనే
ఇరక్క ఇరక్క పోయెనే
దొరికి దొరికి పోయెనే





అన్నా తమ్ములంటే పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  యువన్ శంకర్ రాజా , విజయ్ యేసుదాస్ 

అన్నా తమ్ములంటే 

Palli Balakrishna Friday, May 26, 2023



చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: రాహుల్ సిప్లిగంజ్, శివత్మిక రాజశేఖర్, ప్రకాష్ రాజ్, రమ్యా కృష్ణ 
దర్శకత్వం: కృష్ణవంశి
నిర్మాతలు: అభిషేక్ జవల్కర్,మధు కలిపు
విడుదల తేది: 22.03.2023



Songs List:



నేనొక నటుడ్ని పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: లక్ష్మి భూపాల్ 
గానం: చిరంజీవి 

నేనొక నటుడ్ని
చంకీల బట్టలేసుకొని అట్టకిరీటం పెట్టుకొని
చెక్క కత్తి పట్టుకుని కాగితాల పూల వర్షంలో
కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి శాసించే నియంతని నేను

నేనొక నటుడ్ని
నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని

నేనొక నటుడ్ని
నవ్విస్తాను ఏడిపిస్తాను
ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులు వేసి
నవరసాలు మీకిస్తాను
నేను మాత్రం నలుపు తెలుపుల
గందరగోళంలో బ్రతుకుతుంటాను

నేనొక నటుడ్ని
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకి మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను

నేనొక నటుడ్ని
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని

నేనొక నటుడ్ని
గతానికి వారధి నేను
వర్తమాన సారధి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను
పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను

నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరంనరం నాట్యం ఆడే నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను
ప్రఛండంగా ప్రకాశించు రంగమార్తాండున్ని నేను

నేనొక నటుడ్ని
అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ తొమ్మిది తలలు ఉన్న నటరాణుడ్ని
నింగీనేల రెండడుగులైతే
మూడో పాదం మీ మనసులపై మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహున్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని

నేనొక నటుడ్ని
అప్సరసల ఇంద్రుడ్ని
అందుబాటు చంద్రుడ్ని
అభిమానుల దాసుడ్ని
అందరికీ ఆప్తుడ్ని

చప్పట్లను భోంచేస్తూ
ఈలలను శ్వాసిస్తూ
అణుక్షణం జీవించే
అల్ప సంతోషిని నేను

మహా అదృష్టవంతుడిని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు
శతకోటి నమస్సులు మీకు




నన్ను నన్నుగా పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: రంజని గాయత్రీ 

ఆఆ ఆ ఆ ఆ నా ఆ
ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ
ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేవి వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా

లోలో ఏదో వెచ్చనైన వేడుక
సిచ్చో అన్నా చల్లబడదే
నిన్ను అంతే ముచ్చటైన కోరిక
ముంచేస్తుంటే మంచిదన్నదే
దారే దరే లేని ఆశ

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేవి వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా ఆ ఆఆ

మనసు నను ఎన్నడో విడిచిపోయిందనీ
ఎగసి నీ గుండెలో వలస వాలిందనీ
తెలిసి తెలిసి సయ్యన్నానో
తెలియదేమో అనుకున్నానో

తగని చొరవ కద అన్నానో
తగిన తరుణమనుకున్నానో
తలపు నిన్నొదిలి మరలిరాదే
దరిమిలా మనకిలా కలహమేలా

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేని వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా

కంటి ఎరుపేమిటో
కొంటె కబురన్నదీ
ఒంటి మెరుపేమిటో
కంది పోతున్నదీ

చిగురు పెదవులను నీ పేరు
చిదిమి చిలిపి పాటేస్తుంటే
బిడియపడకు అని నీ వేలు
అదును తెలిసి మీటుతు ఉంటే

ఉలికిపడి లేచి కలికి ఊహ
తడబడే పరుగులు త్వరపడాల

సా దనిసగ సని దనిసా నీ మదనిస నిగ మదని
దా గమదని దమగమ దా సగమ గమదని దనిసగ సగా
గ నీని సా సా దా దా నీ ని మా మ సాగమాద
నీని సా స దనిస మదని గమద నీని మదని గమద
సగమ గని మద గమ సగనిస గని సగమ దనిస
నా మగరిస రిగరిస నిదనిస నిద నిదనిస నిగమగదసని
తని దసని నిగమగమదని

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేని వెయ్యలేనుగా
నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా



పూవై విరిసే ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

పూవై విరిసే ప్రాణం
పండై మురిసే ప్రాయం
రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే
తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే
నడకైనా రాని పసి పాదాలే అయినా
బతుకంతా నడిచి అలసిన అడుగులే అయినా
చెబుతాయా చేరే మజిలీ ఏదో

ఒక పాత్ర ముగిసింది నేడు
ఇంకెన్ని మిగిలాయో చూడు
నడిపేది పైనున్న వాడు
నటుడేగా నరుడన్న వాడు
తానే తన ప్రేక్షకుడు అవుతాడు
ఎవడో ఆ సూత్రధారి
తెలుసా ఓ వేషధారి 
మళ్ళీ మళ్ళీ వందేళ్లు ఎప్పుడు సరికొత్తే
ఎప్పటికైనా తెలిసేనా బతకడమేంటంటే 




రంగస్థలాన మర్తండుడువే అయినా పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

రంగస్థలాన  మర్తండుడువే అయినా





పెంచే బంధాలన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

పెంచే బంధాలన్నీ 



నాటక రంగం వేరు పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

నాటక రంగం వేరు




నీకు తెలిసే సత్యం పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

నీకు తెలిసే సత్యం  
అయినా మరుపే నిత్యం 




మగిసిందా నీ అజ్ఞాతవాసం పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

ఏం తెలుసయ్యా సమరం 




పొదల పొదల గట్లమీద పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

పొదల పొదల గట్లమీద 




దమిడి సే.... మంతి పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: బల్లా విజయ్ కుమార్ 
గానం: రాహుల్ నంబియార్

దమిడి  సే.... మంతి 

Palli Balakrishna Tuesday, March 21, 2023



చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: హరీష్, రోజా, సురేష్, యమున 
దర్శకత్వం: కె. సదాశివ రావు 
నిర్మాత: డి. రామానాయుడు 
విడుదల తేది: 1992



Songs List:



ఆడదై పుట్టి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఆడదై పుట్టి 




జీలకర్ర లో ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: చిత్ర, మనో 

జీలకర్ర లో ఉంది 



జమకు జమకు జుం (కొంపెక్కి కూసింది నా కోడి) పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,  చిత్ర

జమకు జమకు జుం 





నీలో అల గోదారి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె

నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ
నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా

హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ
నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన
నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..




ఓసి దానిమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,  యస్. జానకి 

ఓసి దానిమ్మ




యమ నాజూకు పిలగాడ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,  యస్. జానకి 

యమ నాజూకు పిలగాడ

Palli Balakrishna Wednesday, June 15, 2022



చిత్రం: గమనం (2021)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: శ్రేయా శరన్, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జ్వాల్కర్, సుహాష్ 
దర్శకత్వం: సుజనా రావు 
నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకి పుషాడపు, వి.ఎస్.జ్ఞానశేఖర్
విడుదల తేది: 10.12.2021



Songs List:



ఎంత చూసిన పాట సాహిత్యం

 
చిత్రం: గమనం (2021)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: జతిన్ రాజ్,  విభవరి

ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్
ఎంత ఎంత వేచిన రాకతోనే తీరెనా, ఈ వేదన
మాటల్లో కూడా తెలుపలేవా
పరదాలు తీసి తెగించలేను
కహుమ్ మే క్యా హే ప్యార్ మే జో మేరా హాల్
ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్

తాను కాస్త ముందుకొస్తె… ఆగిపోయే ఊపిరి
కానరాని వేళలోన ఉండలేదులే
ఓరకంట చూడగానే మేలుకోవ ఊహలే
పెదవి దాటి రానే రావు మనసు మాటలే
ముందులేని అల్లరేదో కమ్ముకున్న వైఖరి
ఒంటరన్న మాటకింకా ఆఖరే కదా
ఎక్కడున్నా ఒక్కసారి పెరిగిపోవు అలజడి
దోర నవ్వు సోకగానే కలత తీరదా
కహుమ్ మే క్యా హే ప్యార్ మే… జో మేరా హాల్
ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్

ఇన్నినాళ్ళు గుండెలోన జాడలేని హాయిది
నీడ కూడ రంగు మారే ప్రాయమే ఇది
దేనినైనా దాటిపోయే వేగమేమో వయసుది
తరుముతున్న ఆపలేని అదుపు లేనిది
రెప్పపాటు కాలమైన ఆగలేని జోరిది
చూడగానే నేల మీద తేలిపోయెనా
నువ్వు వేరు నేను వేరు అసలు కాని చోటిది
ఇద్ధరింక ఒకటిగానే కలిసెతనమిది
దుబా దియా బురి తరహ్ యే కైసా ప్యార్

ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్
ఎంత ఎంత వేచిన రాకతోనే తీరెనా, ఈ వేదన
మాటల్లో కూడా తెలుపలేవా
పరదాలు తీసి తెగించలేను
కహుమ్ మే క్యా హే ప్యార్ మే జో మేరా హాల్
ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్





Song Of Life పాట సాహిత్యం

 
చిత్రం: గమనం (2021)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: కైలాష్ కెహర్

ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
ఏ కుదా-షా-హే మర్ద
ఓ మేరే మౌలా
ఏ కుదా షేర్ హే యజుదాన్
ఓ మేరే మౌలా

ఏ అలీ మౌలా
మేరి మన్నతోఁకో సున్ మౌలా
ఏ అలీ మౌలా
మేరీ ముష్కిలే మిట్టా మౌలా

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా

ఆటలే చాలిస్తావా… ఓ మేరే మౌలా
ఏ అలీ మౌలా… భవ బంధనాన ముంచాలా
ఏ అలీ మౌలా… ఇహ శృంకలాలు తెంచాలా

అందని ఆకాశాలే… కోరేనే నేలా
ఆఆ ఆ ఆ ఆఆ ఆ
తీరనీ ఆశేనంటూ ఒప్పుకోవేలా
నమ్ముకుని కదిలిన గమనం
మార్చకిక ఒంటరి పయనం
వేడుకుని కరిగెను నయనం
వేడుకగా కొలవకు సహనం

మేరె మౌలా హాజీ మౌలా
ఆపదేరా ఆదుకోరా
మలుపులు ఎన్నెన్నో అసలెటు వెళ్ళేనో
కథలు కడకు ఎటు చేరేనేమో

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా
ఆటలే చాలిస్తావా… ఓ మేరే మౌలా

ఒక్కరో తప్పే చేస్తే సర్దుకోలేవా
ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
లోకమే ఏకం చేసి… శిక్ష వేస్తావా
ఎందుకని వదలవు గగనం
పాపమని కలుగదా చలనం
వేదనని తరుమిదే తరుణం
రోదనకు జరుపిక దహనం

మేరె మౌలా హాజీ మౌలా
ఆపదేరా ఆదుకోరా
అసలిది విన్నావో… వినపడి ఉన్నావో
వెతలు చెరుపు… ఒక దైవం నీవే

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా

ఏ కుదా-షా-హే మర్ద
ఓ మేరే మౌలా
ఏ కుదా షేర్ హే యజుదాన్
ఓ మేరే మౌలా

ఏ అలీ మౌలా
మేరి మన్నతోఁకో సున్ మౌలా
ఏ అలీ మౌలా
మేరీ ముష్కిలే మిట్టా మౌలా

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా
ఆటలే చాలిస్తావా… ఓ మేరే మౌలా

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా

Palli Balakrishna Wednesday, December 8, 2021



చిత్రం: పట్టుదల (1992)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: సుమన్, ఐశ్వర్య, యమున
దర్శకత్వం: GC శేఖర్
నిర్మాతలు: టి.విజయ లక్ష్మి, లలితాంబ
విడుదల తేది: 1992



Songs List:



ఇల్లా అందుకో పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుదల (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, యస్. జానకి, కె. యస్. చిత్ర 

ఇల్లా అందుకో అల్లా జారిపోతావేం సరదా కోరుకో




సారంగి సారంగి పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుదల (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: ఇళయరాజా, యస్. జానకి & బృందం 

సారంగి సారంగి



కోరినవందిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుదల (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, కె. యస్. చిత్ర 

కోరినవందిస్తా కాముని విందిస్తా రా కొంగున బంధిస్తా కోరిమి పండిస్తా రా




అమావాస్య రేయి పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుదల (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. జానకి 

అమావాస్య రేయి అలా ఆగిపోయి ఉషాకాంతినే నిషేదించునా




ఓయబ్బా వద్దనకబ్బా పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుదల (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. యస్. చిత్ర 

ఓ యబ్బా వద్దనకబ్బా చీరంటు చెంతకు వస్తే చేదా



ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి పాట సాహిత్యం

 
చిత్రం: పట్టుదల (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.జె.యేసుదాస్

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నొప్పి లేని నిమిషమేది
జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే
నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది
సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను… శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా..??

నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది
నీకె నువ్వు బాసటైతే

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నింగి ఎంత గొప్పదైనా… రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా… ఈదుతున్న చేపపిల్ల
మొప్పముందు చిన్నదేనురా

పిడుగువంటి పిడికిలెత్తి
ఉరుమువల్లె హుంకరిస్తే
దిక్కులన్నీ పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి
అదుపులేని కదనుతొక్కి
అవధులన్నీ అధిగమించరా

త్రివిక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతమాపలేని
జ్వాలవోలె ప్రజ్వలించరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

Palli Balakrishna Tuesday, November 30, 2021



Movie Details

Palli Balakrishna Thursday, August 26, 2021



చిత్రం: బాలనాగమ్మ (1981)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: శరత్ బాబు, శ్రీదేవి, విజయశాంతి, కె. ఆర్. విజయ
దర్శకత్వం: కె. శంకర్
నిర్మాత: ఎ. ఖదీర్
విడుదల తేది: 1981



Songs List:

Palli Balakrishna Thursday, August 19, 2021





చిత్రం: ప్రేమ పోరాటం (1987)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: మోహన్, నదియా
దర్శకత్వం: కె.రంగరాజ్
నిర్మాతలు: జి.చాముండేశ్వరి, కె.విజయకుమార్ 
విడుదల తేది: 1987

Palli Balakrishna Sunday, August 8, 2021





చిత్రం: ఖూనీ (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి, నేదునూరి రాజగోపాల్  
గానం: యస్.పి.బాలు , జానకి , యస్.పి.శైలజ
నటీనటులు: భాను చందర్ , అహల్య , సత్య రాజ్ , బేబీ మీనా
దర్శకత్వం: మణి వన్నన్
నిర్మాత: సూరపనేని భావన్నారాయణ
విడుదల తేది: 15.08.1985

Palli Balakrishna Saturday, August 7, 2021





చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: ప్రభుదేవా, రోజా
దర్శకత్వం: ఆర్.కన్నన్
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 1996



Songs List:



ఆలపించనా పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, ప్రీతి

ఆలపించనా




రాక్ రాక్ పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో 

రాక్ రాక్ 




మస్తాన మస్తాన పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , ప్రీతి 

మస్తాన మస్తాన




కాకినాడ కుర్రాడయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో , చిత్ర

కాకినాడ కుర్రాడయ్యో



సిరివాడ సిన్నమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: కుర్రాడు బాబోయ్ (1996)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , చిత్ర

సిరివాడ సిన్నమ్మో

Palli Balakrishna Sunday, August 1, 2021

Most Recent

Default