Choodalani Vundi (1998) Telugu Songs Lyrics
• Teja Sajja appeared as the child artist who played Chiranjeevi's son Ramakrishna in Choodalani Vundi (1998).
Yamaha Nagari Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Yamaha Nagari' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by Hariharan. Lyrics are written by Veturi.
Movie : Choodalani Vundi (1998)
చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్
సరిమామగరి సససనిదపసా
సరిమామగరి సససనిదపసా
రిమదానిదాప సాసనిదప మదపమరి
యమహా నగరి కలకత్తా పురి
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహా నగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
నేతాజీ పుట్టిన చోట… గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే… ఆ నందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం… బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహా నగరి కలకత్తా పురి
బెంగాళి కోకిల బాల… తెలుగింటి కోడలు పిల్ల
మానిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద… రాత్రంతా రజనీ గంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం.. దేవతా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అతిధుల గొడవట
కలకట నగరపు కిటకిటలో
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహా నగరి కలకత్తా పురి
వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ… చౌరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్ రే సితార… ఎస్ డి బర్మన్ కీ ధారా
థెరిస్సా కి కుమారా… కదలి రారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహా నగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
Ramma Chilakamma Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Ramma Chilakamma' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by Udit Narayan and Swarnalatha. Lyrics are written by Veturi.
Movie : Choodalani Vundi (1998)
చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత
రామ్మా చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా...
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల
గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల
అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
చరణం: 1
గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో
క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవింద
ఆవలించు కుంటే నిద్దరవుతుందా...
ఉట్టీ కొట్టే వేల రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో...
కృష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో అడిస్తావో
కోరస్:
అరె ఆరారే భయ్యా బన్షి భజవో
అరె ఆంధ్రాక నయ్యా హాత్ మిలావో
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపెమ్మా
చరణం: 2
ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రి గాలి పాటేలే
అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
జట్టే కడితే జంట రావమ్మో పట్టువిడుపు వుంటే మేలమ్మో
ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
కోరస్:
అరె అయారే బన్షికే ఆంధ్రావాల
అరె గాహోరే రిమ్ జిమ్ డబులీ గోల
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
ముక్కు మీద తీపి గోపాలా
మూగ కళ్ళ తేనే దీపాల
గంగులీ సందులో గజ్జల గోల
బెంగాళీ చిందులో మిర్చి మసాల
అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాలా
కోరస్:
అరె ఆరారే భయ్యా బన్షి భజవో
అరె ఆంధ్రాక నయ్యా హాత్ మిలావో
అరె అయారే బన్షికే ఆంధ్రావాల
అరె గాహోరే రిమ్ జిమ్ డబులీ గోల
Oh Mariya Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Oh Mariya' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by Shankar Mahadevan and Kavita Krishnamurthy. Lyrics are written by Chandrabose.
Movie : Choodalani Vundi (1998)
చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి
ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతి రోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు
ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతి రోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు
సిరిమువ్వ రేపంటు వెనుదీస్తుందా
ఘల్ ఘల్ ఘల్ మోగించగా
సిరిమల్లె మాకంటు ముసుగేస్తుందా
ఘుం ఘుం ఘుం పంచివ్వగా
ప్రతీదినం ప్రభాతమై వరాలు తెచ్చే సూర్యుడు
ప్రకాశమే తగ్గించునా నావల్ల కాదంటూ
ప్రతీక్షణం హుషారుగా శ్రమించి సాగే వాగులు
ప్రయాణమే చాలించునా మాకింక సెలవంటూ
హే ఉల్లాసంగ ఉత్సహంగ బ్రతుకే సాగని
అంతేలేని సంతోషాలు ఒళ్ళో వాలని
ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
హే రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
చిరుగాలి చిత్రంగ రానంటుందా
ఝం ఝం ఝం పయనించగా
కొమ్మల్లో కోకిల్ల కాదంటుందా
కు కు కు వినిపించగా
నిరంతరం దినం దినం
అలాగే సహనం చూపుతూ
విరామమే లేకుండా ఈ నేల తిరుగునుగా
ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు
అనుక్షణం అదే పనై ఆరాట పడిపోవా
హే మనసే ఉంటె మరణం తానే ఎదురొస్తుందిలే
సత్తా ఉంటె స్వర్గం కూడా దిగి వస్తుందిలే
ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
హే రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతి రోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు
Simbale Simbale Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Simbale Simbale' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Veturi.
Movie : Choodalani Vundi (1998)
చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
సింబలే హల్లెలే సింబలే
సింబలే హల్లెలే సింబలే
సింబలే హల్లెలే సింబలే
సింబలే హల్లెలే సింబలే
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
సింబలే హల్లెలే సింబలే
బల్బలే బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే
సింబలే హల్లెలే సింబలే
వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మా అంబారీలో
తేనెలమ్మా తేనుపొచ్చే మల్లె జాజి మందారీలో
సింబలే హల్లెలే సింబలే
సింబలే హల్లెలే సింబలే
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
సింబలే హల్లెలే సింబలే
బల్బలే బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే
సింబలే హల్లెలే సింబలే
చందమామ చేతికొచ్చే సబ్బు బిళ్ళ నేను లెమ్మని
చంద్రవంక వాగు పొంగే స్నానమాడ నిన్ను రమ్మని
పిల్ల నెమలి సంబరం సింబలే సింబలే
పించమెంత సుందరం సింబలే సింబలే
పట్నమన్న పంజరం పట్టు వీడే పావురం
ఈ గూటికొచ్చే కాపురం హొయ్ లాలో
హొయ్ లాలో హొయ్
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
సింబలే హల్లెలే సింబలే
బల్బలే బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే
సింబలే హల్లెలే సింబలే
ఆకాశాలే నేలకొచ్చే మేడ కన్న నీడ మేలని
ఆనందాల వెల్లువచ్చే లాలపోసే కంటి పాపకి
చూడ చూడ వింతలూ సింబలే సింబలే
చుక్కలేడి గంతులు సింబలే సింబలే
ఆకు పచ్చ పొద్దులు మాకు లేవు హద్దులు
ఈ కొండ కోన సీమలో
హొయ్ లాలో హొయ్
హొయ్ లాలో హొయ్
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
సింబలే హల్లెలే సింబలే
బల్బలే బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే
సింబలే హల్లెలే సింబలే
వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మా అంబారీలో
తేనెలమ్మా తేనుపొచ్చే మల్లె జాజి మందారీలో
సింబలే హల్లెలే సింబలే
సింబలే హల్లెలే సింబలే
సింబలే హల్లెలే సింబలే
సింబలే హల్లెలే సింబలే
Manasa Ekkadunnav Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Manasa Ekkadunnav' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Veturi.
Movie : Choodalani Vundi (1998)
చిత్రం: చూడాలని ఉంది (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
మనస్సా ఎక్కడున్నావ్
Abbaba Iddu Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Abbaba Iddu' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and Sujatha. Lyrics are written by Veturi.
Movie : Choodalani Vundi (1998)
చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
అబ్బబ ఇద్దు అదిరేలా ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
అబ్బబ ఇద్దు అదిరేలా ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
సలి పులి పంజా విసిరితే… సలసల కాగే వయసులో
గిలగిలలాడే సొగసుకే జోలాలీ… ఈ ఈఈ
అబ్బబ ఇద్దు అదిరేలా ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
వాటేసుకో వదలకు… వలపుల వల విసిరి
వాయించు నీ మురళినే… వయసు గాలి పోసి
దోచెయ్యన దొరికితే… దొరకని కోక సిరి
రాసేయ్యనా పాటలే… పైట చాటు చూసి
ఎవరికి తెలియవు… ఎద రస నసలు
పరువాలాటకు పానుపు పిలిచాకా
తనువు తాకినా తనివి తీరని వేళ, ఆ ఆఆ
అబ్బబ ఇద్దు అదిరేలా ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
జాబిల్లితో జతకలు… జగడపు రగడలతో
పొంకాలతో నిలు నిలు… పొగడ మాలలేసి
ఆకాశమే కులు కులు… తొడిమెడు నడుమిదిగో
సూరీడునే పిలు పిలు… చుక్క మంచు సోకి
అలకల చిలకలు… చెలి రుసరుసలు
ఇక జాగేందుకు… ఇరుకున పడిపోకా, ఆ
మనసు తీరిన వయసులారని వేళా, ఆఆ
అబ్బబ ఇద్దు అదిరేలా ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
సలి పులి పంజా విసిరితే… సలసల కాగే వయసులో
గిలగిలలాడే సొగసుకే జోలాలీ… ఈ ఈఈ
అబ్బబ ఇద్దు అదిరేలా ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు మూ…..