సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హగ్డే, నివేత పేతురాజ్, టబు, నవదీప్, శుశాంత్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ
విడుదల తేది: 12.01.2020
Songs List:
ఓ మై గాడ్ డాడీ పాట సాహిత్యం
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రాహుల్ స్పిల్గున్జ్, రాహుల్ నంబయార్, రోల్ రిడ, బ్లాజ్జే, లేడీ కాష్
సామజవరగమన పాట సాహిత్యం
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల సీత రాం శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
చరణం: 1
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా...
విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..
అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా...
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
బుట్ట బొమ్మ పాట సాహిత్యం
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగ్గయ్య శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్
రాములో రాములా పాట సాహిత్యం
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లి సత్యవతి
హేయ్ బ్రదర్ ఆపమ్మా
ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా
అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం...
బంటు గానికి ట్వెంటీ టు
బస్తీ మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెట్టు
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర కట్టుకొని
చిల్డ్ బీరు మెరిసినట్లు
పొట్లంగట్టిన బిర్యానీ
బొట్టు బిల్ల వెట్టినట్లు
బంగ్లా మీద నిల్పోనుందిరో సందామావ
సుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ
పల్లవి:
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)
చరణం: 1
హెయ్! తమలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తా వే
ఎర్రగ పండిన ఋధలు రెండు
యాది కొస్తాయే.
అరె ఫువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెలో దూరి
లొల్లే చేస్తావే
అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు
జల్లుమంటాందే
చరణం: 2
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పుడింటు
పట్టనట్లే తిరుగుతున్నవే ఓ సందామాన
పక్కకు పోయి తొంగిజూస్తవే
ఎం టెక్కురా మావ,
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (5)
సిత్తరాల సిరపడు పాట సాహిత్యం
సాహిత్యం: విజయ్ కుమార్ భల్ల
గానం: సూర్రన్న, సాకేత్ కొమండురి
అల వైకంఠ పురంలో పాట సాహిత్యం
Ala Vaikunthapurramloo (2020)
చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం నటీనటులు: రవితేజ, బ్రహ్మాజీ, భానుచందర్, సంఘవి నిర్మాత, దర్శకత్వం: కృష్ణవంశీ విడుదల తేది: 06.07.1997
Songs List:
ఏడు మల్లెలెత్తు సుకుమారికి పాట సాహిత్యం
చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సిరివెన్నెల గానం: ప్రదీప్, సత్యం ఏడు మల్లెలెత్తు సుకుమారికి
హాయ్ రే హాయ్ పాట సాహిత్యం
చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రీనివాస చక్రవర్తి (శ్రీ కొమ్మినేని) హాయ్ రే హాయ్
ఓ చెలి అనార్కలి పాట సాహిత్యం
చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సిరివెన్నెల గానం: సురేష్ పీటర్ ఓ చెలి అనార్కలి
ఓ లెలే ఓ లెలే పాట సాహిత్యం
చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సిరివెన్నెల గానం: వాసుదేవన్, శ్రీనివాస చక్రవర్తి (శ్రీ కొమ్మినేని) ఓ లెలే ఓ లెలే
ఊరికే ఉండదే పాట సాహిత్యం
చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సిరివెన్నెల గానం: కె.యస్.చిత్ర ఊరికే ఉండదే
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని పాట సాహిత్యం
చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా! అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా… దాన్నే స్వరాజ్యమందామా కులాల కోసం… గుంపులు కడుతూ మతాల కోసం… మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి… తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే సమూహ క్షేమం పట్టని… స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ… మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే… తెలిసి భుజం కలిపి రారే అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం… ఈ చిచ్చుల సిందూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా… ఓ అనాథ భారతమా! అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కారడవులలో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా… వెలుగుని తప్పుకు తిరగాలా శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా… అన్నల చేతిలొ చావాలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం… ఈ సంధ్యా సిందూరం వేకువ వైపా, చీకటిలోకా… ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా! అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా… స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని తనలో భీతిని… తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట, ఆహాహా ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా… ఓ విషాద భారతమా! అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా! అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా… దాన్నే స్వరాజ్యమందామా
Sindhooram (1997)
చిత్రం: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (2013)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: శ్వేతా మోహన్ , అంజనా సౌమ్య
నటీనటులు: సందీప్ కిషన్ , రకూల్ ప్రీత్ సింగ్ , బ్రహ్మాజీ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: జెమిని కిరణ్
విడుదల తేది: 29.11.2013
మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక
మరుమల్లెలా వికసించెనే ఎదలోతులో ఈ కలయిక
పెదవంచు దాటి మౌనమే దిగివచ్చెలే ఇలా
పొగమంచును మీటి కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెళ్ల నిండిపోయెనే నువ్వే నేనులా
I LOVE YOU SO ... I LOVE YOU SO
I LOVE YOU SO ... I LOVE YOU SO
మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక
అనుకోని తీరమైన నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్న చిగురాకులా
నను చూసి ఇలా నాక్కూడా కొత్తగా ఉంది కదా
కల కాదు కదా నీవెంటే ఉన్నది నేనేగా
I LOVE YOU SO ... I LOVE YOU SO
I LOVE YOU SO ... I LOVE YOU SO
మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక
మెరుపల్లె చేరువైతే చినుకల్లే మారనా
నీలోన నేను కరిగి పులకించనా
నీకోసం ఇలా కదిలేటి నిమిషం ఆపేస్తా
నీతోడు అలా సాగేటి కాలమే నేనవుతా
I LOVE YOU SO ... I LOVE YOU SO
I LOVE YOU SO ... I LOVE YOU SO
మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక
Venkatadri Express (2013)
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్ దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబు విడుదల తేది: 01.12.2000
Songs List:
నీలి నింగిలో పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: హరిహరన్ నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి దేవుడు కనబడి వరమిస్తే వేయిజన్మలు ఇమ్మంటా ప్రతి ఒక జన్మ నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా దేవత నీవని గుడి కడతా దేవత నీవని పూజిస్తా నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి ప్రేమకు మరుపే తెలియదులే నిన్ను ఎన్నడు మరువదులే తెరలను తీసి నను చూడు జన్మ జన్మలు నీ తోడు వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
మైనా ఏమైనావే పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: వేటూరి గానం: ఉన్ని కృష్ణన్ , చిత్ర పల్లవి: మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం చరణం1: విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు చలి గాలి సాయంత్రాల స్వాగతమే పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు ఎదతోనే ముందుగా చేసే కాపురమే ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా... ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం చరణం2: సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు కాటేస్తే కాదంటానా ఇపుడైనా వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
మా లోగిలిలో పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: ఎస్.పి.బాలు, చిత్ర, సుజాత మోహన్ మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే రాముడు అడవికి వెళ్లేనా నువ్వే అన్నై ఉండుంటే ఏసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే ఆన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే తమకున్నదొక్కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఇంతటి చక్కని బంధాన్ని కాలం ఆగి చూసేను రాత రాయు ఆ బ్రహ్మ రాయుట ఆపి మురిసేను తపమేమి చేశామో తమ్ముల్లమ్మయ్యాములే తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యములే మా దేవుడు మాకుండగా మరి మాకిక లోటేది కలతకు చోటేది మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే
పిల్ల భలే దీని ఫిగరు భలే పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: భువనచంద్ర గానం: ఎస్.పి.బాలు, స్వర్ణలత పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిస లాడే సొగసుని మోసే లేత నడుము వంపు భలే ఉయ్యాల లూగే వయసు భలే గురుడు భలే వీడి పొగరు భలే మనిషి భలే మగసిరులు భలే కొత్త కొత్త ప్రేమలోనే మత్తు ఉన్నది ముత్యమంత ముద్దులోనే మోక్షమున్నది ముద్దులంటే అంతులేని మోజు ఉన్నది జోడు కొస్తే పాడుమనసు బిడియమన్నది వనికిన వయసు తొణికిన సొగసు తరగని ప్రేమకు సాక్ష్యము అమ్మతోడు త్వరపడకు అమ్మాయి నీదే కడవరకు పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే కొంగుచాటు అందమేదో విచ్చుకున్నది కాక రెచ్చి కన్నె గుండె ఝల్లుమన్నది కోక దాటు పొంగులోనే కైపు ఉన్నది ఘాటు కౌగిలింతలోనే స్వర్గమున్నది తొలి తొలి వలపు తొలకరి చినుకు ఎంతో మధురం నేస్తమా మోతగుందే ముడిసరుకు ఇక రాదులే కంటికి కునుకు పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే హొయ్ పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిస లాడే సొగసుని మోసే లేత నడుము వంపు భలే ఉయ్యాల లూగే వయసు భలే
కదిలే అందాల నది పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: సుఖ్విందర్ సింగ్, అనురాధ శ్రీరామ్ కదిలే అందాల నది అరెరే నను ముంచినది ఇక తేలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ కదిలే అందాల నది అరెరే నను ముంచినది వాన విల్లు పూల జల్లు రూపు కడితే నువ్వే కాదా నవ్వే కాదా కొంటె కళ్ళు చూపు ముళ్ళు గుచ్చి పెడితే సిగ్గు రాదా చిచ్చు కాదా నీకు పెట్టిన పేరుది భాగ్యం జన్మించానే ప్రతి రోజు నీ పేరు పలికి పలికి నా పెదవి తేనెలాయె నీ మాట వింటూ వింటూ నా మనసు ఊయలాయె కదిలే అందాల నది అరెరే నను ముంచినది చిలక వచ్చి వాలగానే చిట్టి కొమ్మకి సోకులొచ్చే శోభలొచ్చే ప్రేమ మెచ్చి తాకగానే చిన్ని గుండెకి ఊహలొచ్చే ఊసులొచ్చే నువ్వు ఎపుడూ పక్కన ఉంటే ఎక్కడున్నా అద్భుతమే నీ గాలి సోకగానే నా దారి మారిపోయె నిమిషానికున్న విలువే నువ్వు దగ్గరుంటే తెలిసె కదిలే అందాల నది అరెరే నను ముంచినది ఇక తేలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ ఓ ప్రియా ప్రియా సఖుడా నీవే సుమా నా గుండె లయ
తాజాగా మా ఇంట్లో పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: చిత్ర, మనో, సుజాత మోహన్ తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను దర్జాగ మా మరిది ఇక రాజాలా తిరిగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను పండుగ కాని రోజేదంట మనసున నేసిన మమతల పొదరింట అందరికోసం వంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంటా ఈ ఇల్లే వెయ్యిల్లు మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను జానెడు తాడు కట్టినవాడు జన్మలు ఏలే నీ జోడవుతాడు పున్నమి రెమ్మా పుత్తడి బొమ్మా మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద భాష్పాలు దీవించు తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా
నీలి నింగిలో (విషాద గీతం) పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: హరిహరన్ నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నువులేని నేను శిలను మెలకువే లేని కలను నిను వీడి నే లేను నే ఓడి మనలేను నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడు మరువదులే తెరలను తీసి నను చూడు జన్మ జన్మకు నీతోడు వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే దేవుడు కనబడి వరమిస్తే వేయి జన్మలు ఇమ్మంటా ప్రతియొక జన్మ నాకంటే నిన్ను మిన్నగ ప్రేమిస్తా దేవత నీవని గుడికడతా జీవితమంతా పూజిస్తా నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నువులేని నేను శిలను మెలకువే లేని కలను నిను వీడి నే లేను నే ఓడి మనలేను నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే
Maa Annayya (2000)
చిత్రం: Next నువ్వే (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యాజిన్ నజీర్ ,
నటీనటులు: ఆది, రేష్మి గౌతమ్, వైభవి శాండిల్య, బ్రహ్మజి, అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం: ప్రభాకర్ (తెలుగు సీరియల్ యాక్టర్)
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 03.11.2017
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
మేఘంలా నేనే మారన నిన్నే చేరన
తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా
ఆరే వేడవనా
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
కోరస్:
సున్నిచేతుల మీద పొన్నా పూలన్నివాలి
పన్నీరు చల్లేనా
మున్నా జూవ్వాల మీద వచ్చి గంధాలు వచ్చి బుగ్గల్లే గిల్లేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి అద్దాల రైకగట్టి
మాఇంటి మురిసేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి చంద్రాల చీరకట్టి
మాఇంటి మెరిసేనా
వేవేళ పూల పుట్టతేనే పెదవుల్లో దాచే చిత్రానివే
ముట్టుకుంటేనే మాసిపోయే పుట్ట బొమ్మ నీవేలే
తప్పిపోయావే నువ్ కచ్చితంగా
ఏ దేశమే నీది చంద్రవంక
రెప్పల్లో నిన్ను దాచుకుంటా కదే కలే కనాలనే
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
మేఘంలా నేనే మారన నిన్నే చేరన
తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా
ఆరే వేడవనా
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
Next Nuvve (2017)
Gulabi (1995) Telugu Songs Lyrics
Banner : Varma Creations / Amitabh Bachchan Corporation (ABCL)
Music : Shashi Preetam
Director : Krishna Vamsi
Producer : Ram Gopal Varma
Actors : J. D. Chakravarthy, Brahmaji
Actresses : Maheswari
Supporting Cast : Chandra Mohan, Banerjee, Chalamaiah, Jeeva
Release Date : 03 November 1995
• Gulabi (1995) marked the sensational directorial debut of creative genius Krishna Vamsi, becoming a defining cult musical thriller in Telugu cinema.
• The film deals boldly with the gritty, real-world issue of human trafficking, packaged with intense romance and suspense.
• Debutant composer Shashi Preetam delivered an immortal soundtrack blending fresh electronic synth rhythms and soulful melodies.
• Renowned singer Sunitha made her iconic playback singing debut at the age of 17 with the timeless romantic masterpiece "Ee Velalo Neevu".
• The rebellious youth track "Class Room Lo", sung by Hariharan and penned by Sirivennela Seetharama Sastry, became an instant college youth anthem.
Beat In My Heart Song Lyrics in Telugu – Gulabi (1995)
'Beat In My Heart (Meghalalo Thelipommannadhi)' song from Gulabi (1995) movie is composed by Shashi Preetam, written by Sirivennela Seetharama Sastry, and sung by Mano and Gayatri.
Ee Velalo Neevu Song Lyrics in Telugu – Gulabi (1995)
'Ee Velalo Neevu' song from Gulabi (1995) movie is composed by Shashi Preetam, written by Sirivennela Seetharama Sastry, and sung by Sunitha.
Class Room Lo Song Lyrics in Telugu – Gulabi (1995)
'Class Room Lo' song from Gulabi (1995) movie is composed by Shashi Preetam, written by Sirivennela Seetharama Sastry, and sung by Hariharan.
Dream Girl Song Lyrics in Telugu – Gulabi (1995)
'Dream Girl' song from Gulabi (1995) movie is composed by Shashi Preetam, written by Sirivennela Seetharama Sastry, and sung by Chakri and Urmila.
Ee Rojaithey Chusanu Song Lyrics in Telugu – Gulabi (1995)
'Ee Rojaithey Chusanu' song from Gulabi (1995) movie is composed, penned by Sirivennela Seetharama Sastry, and sung by Shashi Preetam.
Gulabi (1995) Telugu Songs Lyrics | J. D. Chakravarthy, Maheswari | Shashi Preetam
Choodalani Vundi (1998) Telugu Songs Lyrics
Banner : Vyjayanthi Movies
Music : Mani Sharma
Director : Gunasekhar
Producer : C. Aswini Dutt
Actors : Chiranjeevi, Prakash Raj
Actresses : Soundarya, Anjala Zaveri
Release Date : 27 August 1998
• Teja Sajja appeared as the child artist who played Chiranjeevi's son Ramakrishna in Choodalani Vundi (1998).
Yamaha Nagari Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Yamaha Nagari' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by Hariharan. Lyrics are written by Veturi.
Ramma Chilakamma Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Ramma Chilakamma' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by Udit Narayan and Swarnalatha. Lyrics are written by Veturi.
Oh Mariya Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Oh Mariya' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by Shankar Mahadevan and Kavita Krishnamurthy. Lyrics are written by Chandrabose.
Simbale Simbale Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Simbale Simbale' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Veturi.
Manasa Ekkadunnav Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Manasa Ekkadunnav' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Veturi.
Abbaba Iddu Song Lyrics in Telugu – Choodalani Vundi (1998)
'Abbaba Iddu' song from Choodalani Vundi (1998) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and Sujatha. Lyrics are written by Veturi.






