-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box


చిత్రం: హ్యాపీ వెడ్డింగ్ (2018)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
బాక్ గ్రౌండ్ మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర, శ్రావణభార్గవి
నటీనటులు: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల
దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
నిర్మాత: ఎమ్.సుమంత్ రాజు
విడుదల తేది: 28.07.2018


ఓఓ..ఓఓ.. కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది నిజమేనా

కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ..

ఏమో.. ఏమన్నానో
ఏమో.. ఏంవిన్నావో

ఏం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా
ఏం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా..

ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో

కోరే.. వరమేదో.. మునుముందే నిలుచుందే
ఇంకా.. కలలేనా.. కనుపాపా
చేరే దరియేదో.. రమ్మంటూ ఎదురైతే
చూస్తూ.. నిలుచోదే తెరచాపా
పారాడే పసిపాపవా.. ప్రాయం రాలేదా
అడుగేస్తే పడిపోతావా.. పడవే ముందడుగా

ముందూ వెనక  చూడకా.. పడిపోమంటావా
నువ్వు చూపిందే తోవంటూ.. తరిమే దుందుడుకా

ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో

నీలో.. నీతోనే.. దోబూచి దొంగాట
నీకే.. నువ్వు దొరికేదెపుడంటా

ఆటో వేటో తేలనీ మన ఈ చెలగాట
ఆలోచిద్దాం అందాక.. తప్పేం లేదంటా

కవ్వించే కయ్యాలతో.. నెగ్గదు చెలిమాటా
ఓటమినే గెలుపంటుంది.. మనసుల ముద్దాటా

అవునా.. అంతేనేమో
అయినా.. ఇంతేనేమో
అవునా.. అంతేనేమో
అయినా.. ఇంతేనేమో

ఓ.. కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ..
ఓ.. ఎం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా.. ఓఓ..

ఏమో.. ఏమో.. ఏమన్నానో.. ఏమన్నావో
ఏమో.. ఏమో.. ఎం విన్నావో.. ఎం విన్నానో
ఏమో.. ఏమన్నానో
ఏమో.. ఎం విన్నావో.. ఏమో

No comments

Most Recent

Default