చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: చలం, విజయ లలిత, విజయ నిర్మల కథ , స్క్రీన్ ప్లే: రాజశ్రీ దర్శకత్వం: పెండ్యాల నాగాంజనేయులు నిర్మాత: టి.మోహన్ రావు విడుదల తేది: 01.19.1972
Songs List:
నీ పాపం పండెను నేడు పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్. పి.బాలు నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్ష నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్ష నీ డొక్క చించి నే డోలు కట్టి వాయించుటే నా దీక్ష నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తలపొగరంతా తగ్గేదాక దులుపుతాను నీ దుమ్ము దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తలపొగరంతా తగ్గేదాక దులుపుతాను నీ దుమ్ము నీకోసమే నేనీ దినం ఎత్తేను ఈ అవతారం నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను యా
రాజా పిలుపు నాదేనురా పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్. జానకి రాజా పిలుపు నాదేనురా నీ నీడగా నీ తోడుగా నీ వెంట ఉంటానురా నిను వీడి పోలేనురా నీ ముందు నే నిలిచినా చేరుకోలేనురా ఏ చోట నేనున్నా నీకోసమే నేనురా మరుజన్మలోనైనా నీదాననౌతానురా ఈ బంధము అనుబంధము కడలేని కథరా దొర పల్లవి లేని పాటనురా పగలే చూడని రేయినిరా కరిగిన కల నేనురా రాజా కదలని శిలనైతిరా ఈ బంధము అనుబంధము కడలేని కథరా దొర
బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బల్లెమ్మ పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి. బాలు బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బల్లెమ్మ
కురిసింది వాన నా గుండెలోన పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి. బాలు, పి. సుశీల కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా కురిసింది వాన నా గుండె లోనా నీ చూపులే జల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వాన నా గుండె లోనా నీ చూపులే జల్లుగా అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను చలిగాలి వీచే గిలిగింత దోచే కురిసింది వాన నా గుండె లోనా నీ చూపులే జల్లుగా ఉరకలు వేసే ఉహలు నాలో గుసగుస లాడేను కథలను తెలిపే కాటుక కనులు కైపులు రేపెను ఉరకలు వేసే ఊహలు నాలో గుస గుస లాడేను బిగువు ఇంకేలా దరికి రావేలా కురిసింది వాన నా గుండె లోనా నీ చూపులే జల్లుగా
హోయ్ డియ్యారే టింగు రంగ పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి. బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి హోయ్ డియ్యారే టింగు రంగ
జిందాబాద్ స్వతంత్ర భారత జిందాబాద్ పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: జిందాబాద్ స్వతంత్ర భారత జిందాబాద్
అమ్మ అన్నది ఒక కమ్మని మాట పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: యస్. పి.బాలు, పి.సుశీల పల్లవి: అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట చరణం: 1 దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మేలేదను వాడు అసలే లేడు దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మేలేదను వాడు అసలే లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు అమ్మ అన్నది - ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట చరణం: 2 అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా.. అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట చరణం: 3 అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట
No comments
Post a Comment