Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vintha Kapuram (1968)
చిత్రం: వింతకాపురం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
నటీనటులు: కృష్ణ , కాంచన
దర్శకత్వం: అబ్బి
నిర్మాత: వి.వెంకటేశ్వరులు
విడుదల తేది: 08.11.1968Songs List:చూడు తడాఖా పాట సాహిత్యం

 
చిత్రం: వింతకాపురం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల , పి.సుశీల

పల్లవి: 
చూడు తడాఖా కాదు మజాకా
కాదు మజాకా నా దారికి లేదు డోకా

కోరస్: చూడు తడాఖా కాదు మజాకా

ఆపవోయి నీ బాకా బాకా బాకా బాకా బాకా
మ్మె మ్మె మ్మె మేక
డొక్కు కారు దొరగారు టెక్కు చూపుతున్నారు
నిక్కీ నీల్గి పోటీకొస్తే చిక్కుల్లో పడతారు

కోరస్: బహు చిక్కుల్లో పడతారు

కుర్రకారు దొరసాన్లు నేర్చారు ఫ్యాషన్లు
మగాళ్ల దుస్తులు ధరించగానే 
దువ్వలేరు మీసాలు

ఆడదంటే నాజూకు ఆ పేరే పువ్వుల రేకు
గయ్యాలిగా మారినప్పుడు వెయ్యాలి బ్రేక్

చేతగాని మగవాడు నీతి బోధ చేస్తాడు
పాతకాలపు గొప్పకు పోతే
భలే చిత్తు అవుతాడు

కోరస్: ఆకతాయి పిల్లోడా రాలుగాయి బుల్లోడా
ఆడవాళ్ళతో డీడిక్కీ అంటే తింటావోయ్ ఖాజా

చ చ ఆప్ట్ డేట్ లేడీస్ తగ్గుట ఎంతో నైసు
హద్దుమీరి చెలగాటం ఆడితే ఆట అంతతో క్లోజ్

కోరస్: బాకా బాకా బాకా బాకా మ్మో  య్య య్య
చూపుల్లోనే కోపం పాట సాహిత్యం

 
చిత్రం: వింతకాపురం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల & కోరస్

చూపుల్లోనే కోపం లోపల యెంతో తాపం
అయ్యయ్యో పాపం అహ తెలిసిందిలే
బాగా తెలిసిందిలే, అహ తెలిసిందిలే
అలకే నీకు సింగారం పలుకే నాకు బంగారం
చాలించాలి రుసరుసలు అందించాలి మిసమిసలు
ఘుమఘమలాడే గుబురుల్లో ఏవో గుసగుసలాడాలి
ఆడాలీ ఆడాలీ
మదిలో ఆశలు పెరగాలి ఒకరిని ఒకరు గెలవాలి
గెలవాలీ  గెలవాలీ ..

ఏవో....ఏవో.... హాయ్ కోరికలన్నీ ఊరాలీ
అహ, తెలిసిందిలే, బాగా తెలిసిందిలే అహ తెలిసిందిలే
విరిసే వయసూ రమ్మంది - జడిసే మనసూ పొమ్మంది
దోచిన వలపూ దాచేవు - దాగుడు మూతలు ఆడేవు -
హృదయరాణి కావాలి జీవిత ఖైదీ చేయాలి 
జీవిత ఖైదీ చేయాలి

య్య య్య య్య య్య య్యా య్య య్య య్య య్య

ఈ వేషాలు నీ కోసం యీ నాటకం నీ కోసం
మనసూ తెలిసీ మెలగాలి 
నవ్వులతో నే తేలాలి
హృదయరాణివి కావాలి, జీవిత ఖైదీ చేయాలి ఎంతవాళ్లు ఎంతవాళ్లూ పాట సాహిత్యం

 
చిత్రం: వింతకాపురం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి.

ఎంతవాళ్లు  ఎంతవాళ్లూ ఈ మగవాళ్లు 
ఎంతకైన చాలినోళ్ళూ
ఏంత వాళ్లు  ఎంతవాళ్ళూ ఈ మగవాళ్ళు 
ఎంత కైన చాలినోళ్ళూ

ఆడది అంటే అబ్బో, చులకనగా చూస్తారు
సిగ్గులేక తమగొప్పను డప్పుకొట్టుకుంటారు
 
ఆడది వీధికివసే ఇంత మొగము చేసారు
ఆడది క్లబ్బుకువస్తే అగిబుగ్గి అవుతారు
గడపదాటి రావద్దని కట్టడి చేసారు
అధికారం చూపించి, హజము చలాయిస్తారు

మీసమున్న మొగవాడు, తనకు స్వేచ్ఛ వున్నదని
హద్దూ పద్దూలేక తిరుగుతుంటాడు అమ్మాయిల వెంటాడుతుంటాడు

క్లబ్బులో క్యాంపు వేసి వున్న ఆ సి కరగదీసి
పేకాటల్లో మునుగుతుంటాడు సీసాలను ఖాళీ చేస్తుంటాడు 

చేసుకున్న పెళ్ళాము సిగ్గు విడిచి తెగబడితే
అప్పుడు ఆ దొరగారేమంటాడు ?
తల ఎక్కడ తీసి పెటుకుంటాడు ?
సత్యభామ తోడులేందే కృష్ణుడు
గెలిచేవాడా ?
సావిత్రే లేక సత్యవంతుడు బ్రతికేవాడా ?
ఆ సీతమ్మే లేకపోతే రామాయణ మేముంది ?
ద్రౌపదమ్మ లేకపోతే భారత మేముంది ?
భార్య తెచ్చు గౌరవం భర్తలకాధారం
నూరుపాళ్ళ యధార్థం తెలుసుకోరు మగజనం
అటుపానుప పాట సాహిత్యం

 
చిత్రం: వింతకాపురం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, పి. సుశీల

అటుపానుపు - ఇటు నువ్వు-
అటు జాబిలి - ఇటు నువ్వు -
నడుమ బిడియం నలిగింది
గడుసు పరువం నవ్వింది
నా చేతులనే తలదిండులుగా
సాచినాను నీకోసం
నా ఆశలే విరిదండలుగా
దాచినాను నీకోసం
నీవున్న నా ముంగిలియే
పూలు పూచిన నీలాకాశం

నీ చూపులే వింజామరలై
వీచెనేడు నాలోనె
నవ్వులె తెలితామరలై
పూచెనేడు నాలోన
ఏనాటి అనుబంధాలో
తేనెలొలెకెను మనలోన
తూగుతున్నది నాహృదయం
ఆగనన్నది యీ సమయంఎందుకు ఈ బిగువుల పాట సాహిత్యం

 
చిత్రం: వింతకాపురం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత

ఎందుకు ఈ బిగువులూ - ఏమిటి యీ పరుగులూ
ఊ అంటే చాలూ ఓ రాణీగారూ
నా రాణీగారూ
సైయంటానే నేను రమ్మీగారూ నా రమ్మీగారూ
ఊ అంటే చాలు ఓ అంజియ్ గారూ
సై యంటూ ముందుకు వస్తారా మీరూ - వస్తారా మీరూ
పెళ్ళికాకముందంతా, చాటుమాటు సరదాలు
మూడుముళ్లు బిగిశాక హాట్ హాట్ సరదాలు
తీపి తీపి మురిపాలు ససా పపా, ససా, పపా పాట పాడుకోవాలి

తద్దింతక తై తైయ్యని ఆటలాడుకోవాలి
తదింతకజుం తదింతకజుం తదింతకజుం
జుంజుం తకనక అజుం తకనక అజుం జుం 
ముఖానికి బొట్టందం బుగ్గకు చిరు ముద్దందం
వాలుజడకు పూలందం - చంకకు బిడ్డందం
అప్పుడే ఆనందం మనకే పరమానందం హాయ్ 
దేశజనాభా పెరిగింది - తిండికి కరువే వచ్చింది 

ఒళ్ళు మరచిపోయి కులికామంటే
జనాభా లెక్కలు పెంచామంటే
హోలు మొతం గోలుమాలులే 
అమ్మా బువ్వా - అయ్యా బువ్వ 
అమ్మా పైస - అయ్యా పైస 

ఊ అంటే చాలా ఓ అంజయ్ గారూ
సై యంటానే నేను రమ్మీగారు
నా రమ్మీగారూ  హా హోయ్ 
ఎందుకో యింత బిగువు పాట సాహిత్యం

 
చిత్రం: వింతకాపురం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

అందుకో వింతవలపు
అందులో ఎంతొసొగసు 
ఎందుకో యింత బిగువు 
రావోయి పొందవోయి హాయి
ఈ రేయి మరి రాదోయి మరి రాదోయి

నా కాలి అందె మ్రోగింది
నా కంటి చూపు రేగింది
గిలిగింత కొలిపి ఒయ్యార మొలికి
నిను గెల్చుకొందునోయి - ఏయ్..

జోడించి రెండు చెక్కిళ్లు
తగిలించి వలపు సంకెళ్లు
త్రాగించి మధువు ఊగించి తనువు
చూపింతు స్వర్గమోయి, ఏయ్

No comments

Most Recent

Default